
హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మద్యం, ధన ప్రవాహాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. శనివారం బీసీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని విమర్శించారు.
అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడే కోట్ల రూపాయలు వెదజల్లడం, మద్యం ప్రలోభా లను చూపడం ప్రారంభించా యని ఆరోపించారు. డిసెం బర్ 7 వరకు బీరు షాపులు, బార్లు మూసివేయాలని, ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, డబ్బులు ఇవ్వడానికి యత్నించే నాయకులపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు జి. కృష్ణ, వెంకటేశ్, సత్యనారాయణ, బర్కకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment