బీసీల సంక్షేం, అభివృద్ధి కోసం చట్టసభలలో పోరాటం చేస్తానని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు.
హైదరాబాద్: బీసీల సంక్షేం, అభివృద్ధి కోసం చట్టసభలలో పోరాటం చేస్తానని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. గౌడ యువజన సంఘర్షణ సమితి నాయకులు దూసరి వెంకటేష్‌గౌడ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు ఆదివారం సాయంత్రం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఆర్.కృష్ణయ్యను కలిసి అభినంధించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సబ్ ప్లాన్ అమలు కోసం చేసే పోరాటంలో బీసీలందరూ సంఘటితంగా ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు ఎస్.లక్ష్మణ్‌గౌడ్, తండు లాలయ్యగౌడ్, దూసరి శ్రీనివాస్‌గౌడ్, సతీష్‌చంద్రగౌడ్, లోడ పరమేష్‌గౌడ్, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.