
సాక్షి, విజయవాడ: పలు రాష్ట్రాల్లో ఎన్నో ఏళ్ల నుంచి బీసీలుగా ముఖ్యమంత్రిగా పని చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ, ఏ ఒక్కరూ బీసీలకు పూర్తిగా న్యాయం చేయలేకపోయారు. కానీ, సీఎం జగన్ మాత్రం బీసీల పక్షపాతిగా.. వాళ్ల తలరాతలు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు బీసీ సంఘాల నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. గురువారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీల ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
సీఎం వైఎస్ జగన్ సామాజిక విప్లవకారుడు. ప్రతీ ఒక్క బీసీ మంచి చదవులు దిశగా అడుగులు వేయాలని కలలు కంటున్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకి అధికారంలో, బడ్జెట్‌లో కూడా వాటా ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దే. బీసీ కులాల గౌరవాన్ని ఆయన పెంచారు. బీసీల ఆత్మ గౌరవాన్ని గుర్తించిన సీఎం జగన్ గొప్ప విజనరీ. ఈ సంక్షేమ ఫలాలని ఎప్పటికీ గుర్తించుకోవాలి.
మనకి మాయమాటలు చెప్పడానికి చాలా మంది వస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో పట్టుమని పదిమందికి మంత్రి పదవులు రాలేదు. అలాంటిది సీఎం జగన్ కేబినెట్‌లోనూ, ఇతర చోట్లా బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నామినేటెట్ పోస్టులలో బీసీలకి 50 శాతం కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది.రాజ్యసభ సీటు కోసం కోట్ల రూపాయల ఫండ్ తీసుకుంటున్న రోజులివి. అలాంటిది అలాంటిది.. బీసీ ఉద్యమ నేత అయిన నాకు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు.
బీసీ బిల్లు పెట్టాలని 40 ఏళ్లగా పోరాటం చేశా. కొందరు ప్రధానులను, ప్రముఖ పార్టీలను కలిశా. ప్రయోజనం లేకుండా పోయింది. కానీ, ఒకేసారి సీఎం వైఎస్ జగన్‌ని కలిసి అడిగా. వెంటనే ఆయన స్పందించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలను పిలిపించి బీసీ బిల్లు పెట్టడానికి చర్యలు తీసుకోమన్నారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టిన ఏకైకపార్టీగా వైఎస్సార్ సీపీ నిలిచిపోతుంది. ఇంతలా సంక్షేమానికి కృషి చేసిన వైఎస్ జగన్‌కి అండగా నిలబడాల్సిన అవసరం బీసీలకు ఉంది అని ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. ఇక ఈ కార్యక్రమంలో..
ఇక ఈ ఆత్మగౌరవ సభలో బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ మంత్రులు, ఎంపీలకు సన్మానం చేశారు. మంత్రులు జోగి రమేష్ , విడదల రజినీ, సీదిరి అప్పలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్సీ పోతుల సునీత.. ముఖ్య అతిథిగా సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment