athma gouravam
-
మాయ మాటలు చెప్పడానికి చాలామంది వస్తారు
సాక్షి, విజయవాడ: పలు రాష్ట్రాల్లో ఎన్నో ఏళ్ల నుంచి బీసీలుగా ముఖ్యమంత్రిగా పని చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ, ఏ ఒక్కరూ బీసీలకు పూర్తిగా న్యాయం చేయలేకపోయారు. కానీ, సీఎం జగన్ మాత్రం బీసీల పక్షపాతిగా.. వాళ్ల తలరాతలు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు బీసీ సంఘాల నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. గురువారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీల ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీఎం వైఎస్ జగన్ సామాజిక విప్లవకారుడు. ప్రతీ ఒక్క బీసీ మంచి చదవులు దిశగా అడుగులు వేయాలని కలలు కంటున్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకి అధికారంలో, బడ్జెట్లో కూడా వాటా ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దే. బీసీ కులాల గౌరవాన్ని ఆయన పెంచారు. బీసీల ఆత్మ గౌరవాన్ని గుర్తించిన సీఎం జగన్ గొప్ప విజనరీ. ఈ సంక్షేమ ఫలాలని ఎప్పటికీ గుర్తించుకోవాలి. మనకి మాయమాటలు చెప్పడానికి చాలా మంది వస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో పట్టుమని పదిమందికి మంత్రి పదవులు రాలేదు. అలాంటిది సీఎం జగన్ కేబినెట్లోనూ, ఇతర చోట్లా బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నామినేటెట్ పోస్టులలో బీసీలకి 50 శాతం కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది.రాజ్యసభ సీటు కోసం కోట్ల రూపాయల ఫండ్ తీసుకుంటున్న రోజులివి. అలాంటిది అలాంటిది.. బీసీ ఉద్యమ నేత అయిన నాకు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. బీసీ బిల్లు పెట్టాలని 40 ఏళ్లగా పోరాటం చేశా. కొందరు ప్రధానులను, ప్రముఖ పార్టీలను కలిశా. ప్రయోజనం లేకుండా పోయింది. కానీ, ఒకేసారి సీఎం వైఎస్ జగన్‌ని కలిసి అడిగా. వెంటనే ఆయన స్పందించారు. వైఎస్సార్సీపీ ఎంపీలను పిలిపించి బీసీ బిల్లు పెట్టడానికి చర్యలు తీసుకోమన్నారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టిన ఏకైకపార్టీగా వైఎస్సార్ సీపీ నిలిచిపోతుంది. ఇంతలా సంక్షేమానికి కృషి చేసిన వైఎస్ జగన్‌కి అండగా నిలబడాల్సిన అవసరం బీసీలకు ఉంది అని ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. ఇక ఈ కార్యక్రమంలో.. ఇక ఈ ఆత్మగౌరవ సభలో బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ మంత్రులు, ఎంపీలకు సన్మానం చేశారు. మంత్రులు జోగి రమేష్ , విడదల రజినీ, సీదిరి అప్పలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్సీ పోతుల సునీత.. ముఖ్య అతిథిగా సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ఆత్మగౌరవం తలెత్తుకునేలా చేసింది
సంతోషంగా చెబుతున్న బహిరంగ మలవిసర్జన రహిత కాశీపురం గ్రామస్తులు నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జిల్లాలో ఆత్మగౌరవం పేరిట పలు గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి తీసుకున్న చర్యలు ఆయా గ్రామాల ప్రజల తలెత్తుకునేలా చేసింది. మహిళలు, వృద్ధులు తమకు ఇబ్బందులు తొలగిపోయాయని ఆనందంవ్యక్తం చేశారు. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా గుర్తింపు పొందిన వాకాడు మండలం కాశీపురంలో జెడ్పీ సీఈఓ రామిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం మీడియా అవగాహన పర్యటన జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తుల్లో చైతన్యం తెచ్చేందుకు తాము తీసుకున్న చర్యలను ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఆర్వీ కృష్ణారెడ్డి, ఎంపీడీఓ ప్రమీలారాణి, టాస్క్‌ఫోర్స్ అధికారి సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ లావణ్య, సర్పంచ్ కోటమ్మ, ఉపసర్పంచ్ కృష్ణయ్య వివరించారు. బహిరంగ మలవిసర్జనతో ఎదురయ్యే అనర్థాలపై అన్ని శాఖలను సమన్వయంతో పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేశామన్నారు. గ్రామంలో 124 కుటుంబాలు ఉండగా ఇప్పటి వరకు 108 ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం పూరై్త వినియోగంలో ఉన్నాయి. ఈ సందర్భంగా గ్రామస్తులతో పాటు అధికారులు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. మంచి పనిచేశారు గోసంగి రమణమ్మ వయస్సు మీద పడి నడుము ఒంగిపోయిన నాకు మరుగుదొడ్డి కట్టించి అధికారులు మంచి పనిచేశారు. ఈ వయస్సులో బహిర్భూమికి వెళ్లడం చాలా కష్టం. తోడు లేనిదే వీలుకాదు. ఇంట్లోనే మరుగుదొడ్డిని కట్టుకోవడంతో చాలా బాగుంది. ఏటికి వెళ్లే వాళ్లం ఆకుల రమణయ్య బహిర్భూమికి ఏటికి వెళ్లేవాళ్లం.ఏటికి నీళ్లువస్తే రోడ్లపక్కనే కూర్చునేవాళ్లం. అధికారులు అవగాహన కల్పించారు. ఇన్ని రోజులు బహిరంగ విసర్జనతో కలిగే నష్టాలు తెలియలేదు. ఆత్మగౌరవంతో ఇప్పుడు గ్రామంలో ప్రతి ఒక్కరం తలెత్తుకునేలా తిరుగుతున్నాం. మహిళల్లో అవగాహన పెంచాం ప్రమీలారాణి, ఎంపీడీఓ నిర్లిప్తంగా ఉన్న మహిళల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన కల్పించాం. కలెక్టర్ జానకి చొరవతో గ్రామంలో 6/4 బాత్రూమ్ కమ్ టాయిలెట్ నిర్మించేందుకు చర్యలు చేపట్టాం. గ్రామస్తులు ఉత్సాహంగా మరుగుదొడ్లు కట్టించుకున్నారు. ముందుగా తెలియలేదు వై.కోటమ్మ, సర్పంచ్ వ్యక్తిగత మరుగుదొడ్ల వల్ల ఉపయోగాలు ముందుగా తెలియలేదు. ఆడవాళ్లు చీకటి పడితేగానీ స్నానాలు చేసేందుకు వీలుపడేది కాదు. అధికారులు పదేపదే మరుగుదొడ్లు నిర్మించుకోవాలని చెప్పడంతో ప్రయోజనాలు తెలిసొచ్చాయి. ఊళ్లో అందరూ మరుగుదొడ్లు కట్టుకునేందుకు ముందుకొచ్చారు. ప్రజల్లో అవగాహన పెరిగింది డాక్టర్ సుబ్రమణ్యం, టాస్క్‌ఫోర్స్ అధికారి మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజల్లో చాలా వరకు అవగాహన పెరిగింది. వాకాడు మండలాన్ని త్వరలో బహిరంగ మల విసర్జన రహితంగా తీర్చిదిద్దుతా