స్నానం చేసేటప్పుడు వీడియో తీసి.. | lady employee molested by her boss | Sakshi
Sakshi News home page

స్నానం చేసేటప్పుడు వీడియో తీసి..

Published Sat, Jul 8 2017 10:18 AM | Last Updated on Tue, Sep 5 2017 3:34 PM

స్నానం చేసేటప్పుడు వీడియో తీసి..

స్నానం చేసేటప్పుడు వీడియో తీసి..

కేకేనగర్‌: తన వద్ద పని చేస్తున్న మహిళా ఉద్యోగిని అశ్లీలంగా వీడియో తీసి ఆమెపై లైంగిక వేధింపులకు గురిచేసిన మాట్రిమోని నిర్వాహకుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. క్రోంపేటకు చెందిన శివబాలన్‌ కదిరేశన్‌. ఇతడు వలసరవాక్కం అష్టలక్ష్మి నగర్‌లో వివాహ సమాచార కేంద్రాన్ని నడుపుతున్నాడు. ఇతని కార్యాలయంలో గత మూడు నెలలుగా క్రోంపేటకు చెందిన ప్రియ అనే యువతి ఉద్యోగానికి చేరింది. ఆమె అక్కడే బస చేసి పని చేసేదని తెలుస్తోంది.

ఈ క్రమంలో యజమాని శివబాలన్‌ కదిరేశన్‌పై ప్రియ వలసరవాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో తాను శివబాలన్‌ కదిరేశన్‌ నడుపుతున్న కార్యాలయంలో బస చేసి ఉన్నానని, తాను స్నానం చేసే సమయంలో రహస్య కెమెరాతో ఫోటోలు తీసి వాటిని చూపించి తనపై లైంగిక బెదిరింపులు చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీనిపై వలసరవాక్కం పోలీసులు కేసు నమోదు చేసుకుని శివబాలన్‌ కదిరేశన్‌ వద్ద విచారణ జరిపి అతడిని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement