సాక్షి, బెంగళూరు : మ్యాట్రీమోనిలో పరిచయమైన యువకుడు ఓ యువతిని మోసగించిన ఉదంతం వెలుగు చూసింది. కర్ణాటకలోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్న మహిళకు మ్యాట్రీమోనిలో యువకుడు పరిచయం అయ్యాడు. తన పేరు కబీర్‌ఆనంద్ అని, లండన్‌లో స్థిరపడినట్లు నమ్మించాడు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. తాను ఢిల్లీకి వచ్చానని, విదేశీ కరెన్సీని భారత్ కరెన్సీగా మార్చేందుకు రూ.3 లక్షలు నగదు తన అకౌంట్‌కు జమచేయాలని సూచించాడు. దీంతో ఆ యువతి నగదు జమ చేసింది. అనంతరం ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని సమాధానం వచ్చింది. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. (నా బిడ్డ నాకు కావాలి...)
డ్రగ్స్ విక్రయిస్తున్న టెక్కీ అరెస్ట్
బనశంకరి: విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి నగరంలో విక్రయిస్తున్న సార్ధక్‌ఆర్య అనే టెక్కీని శుక్రవారం సెంట్రల్‌క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి 4.99 గ్రాములు ఎస్‌ఎల్‌డీ, ఎంహెచ్‌సీరిస్ ప్యాకెట్‌స్కేల్, బ్రౌన్ క్‌పేపర్‌ప్యాకెట్, ఓసీబీస్లిమ్‌స్మోక్‌పేపర్‌ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నట్లు జాయింట్‌పోలీస్‌కమిషనర్ సందీప్‌పాటిల్ తెలిపారు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఈయన బెల్జియం నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment