Gottipati Ravikumar
-
పింఛనర్లపై పగ
సాక్షి ప్రతినిధి, బాపట్ల: నెలనెలా పింఛన్ కావాలంటే మా దగ్గరికి రండి.. మా పార్టీలో చేరండి. లేదంటే అంతే సంగతులు.. ఆశలు వదులుకోండి. ఎవరికి చెప్పుకున్నా ప్రయోజనంలేదు.. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పరిస్థితి ఇది. మంత్రి ఆదేశాలతో ఇక్కడి పచ్చనేతలు బరితెగించి పండుటాకులను కాల్చుకు తింటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో ఇదే గ్రామంలో ఉన్న సుమారు ఎనిమిది మందికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలతో అధికారులు పింఛన్ ఇవ్వలేదు. రెండో నెలలో సచివాలయానికి వెళ్లి గొడవపడి అంజయ్య, శ్రీనివాసరావులతోపాటు కొందరు పింఛన్ మొత్తాన్ని తెచ్చుకున్నారు. లీలావతితోపాటు మరికొందరికి మాత్రం డబ్బులివ్వలేదు. దీంతో కొందరు పింఛనర్లు మంత్రి గొట్టిపాటి ప్రధాన అనుచరుడిని కలిసి మాట్లాడుకున్నారు. మూడోనెలలో అంజయ్య, దివ్యాంగుడు శ్రీనివాసరావు, వృద్ధ మహిళ లీలావతి పింఛన్ కోసం సచివాలయానికి వెళ్తే.. మీ పింఛన్లు లేవన్నారు. ఆరాతీస్తే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ సచివాలయ పరిధిలో ఉన్నాయని తెలిసింది. మూడు, నాలుగు, ఐదు నెలలు శ్రమకోర్చి అక్కడికే వెళ్లి పింఛన్ తెచ్చుకున్నారు. సొంత ఊరిలో ఉంటే ఎలాగూ పింఛన్ ఇవ్వరని కేతనకొండ నుంచి ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురానికి బదిలీ పెట్టుకున్నారు. ఆరోనెల శంకరాపురానికి వెళ్లి పింఛన్ తెచ్చుకున్నారు. విషయం తెలిసి మంత్రి గొట్టిపాటి ముండ్లమూరు అధికారులకు చీవాట్లు పెట్టడంతోపాటు తక్షణం ముగ్గురి పింఛన్లను వేర్వేరు ఊర్లకు బదిలీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఇంకేముంది.. వికలాంగుడు శ్రీనివాసరావు పింఛన్ శ్రీకాకుళానికి.. బత్తుల చిన్న అంజయ్య పింఛన్ అనంతపురానికి, లీలావతి పింఛన్ చిత్తూరు జిల్లాలకు బదిలీ చేసినట్లు సమాచారం. వారు అంతదూరం వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే అంతకుమించిన ఖర్చవుతుంది. లేదంటే మంత్రిని కలిసి జీ హుజూర్ అనాల్సిందే అంటున్నారు.వైఎస్సార్సీపీకి మద్దతు పలికారని..గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతు పలికారంటూ వృద్ధులని కూడా చూడకుండా ఇలాంటి వారి పింఛన్లను తొలగించారు. కొందరి పేర్లున్నా వారికి పింఛన్లు ఇవ్వడంలేదు. మరికొందరి పింఛన్లను సుదూరంలోని జిల్లాలకు పంచాయతీ సెక్రటరీ, వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ నుంచి బదిలీచేశారు. పింఛన్‌దారులను బెదిరించి తమవైపు తిప్పుకునేందుకు పచ్చనేతలు ఈ తరహా అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. వారు మాట వినకపోతే తొలగించేందుకూ సిద్ధమైనట్లు సమాచారం. తామున్న సచివాలయ పరిధి నుంచి ఇతర జిల్లాలకు బదిలీ చేస్తుండడంతో పింఛన్లు తెచ్చుకునేందుకు వీలుకాక కొందరు ఇబ్బందులు పడుతుండగా.. అసలు తమ పింఛన్ ఏ జిల్లాలో ఉందో తెలీక చాలామంది సతమతమవుతున్నారు. ఒకవేళ ఫలానా జిల్లాలో ఉందని తెలిసినా ప్రతినెలా అంత దూరం ఖర్చులు పెట్టుకుని వెళ్లి తెచ్చుకోవడం చాలా కష్టం. వృద్ధులను ఇలా ఇబ్బందులకు గురిచేసి తమవైపుకు తిప్పుకునే ఎత్తుగడలో భాగంగా మంత్రి గొట్టిపాటి ఇదంతా చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పట్టు నిలుపుకునేందుకే ఇలా..ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఇసుక, గ్రానైట్, రేషన్ బియ్యం దందాలతో పాటు విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై కూటమి సర్కారు పెనుభారం మోపడంతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ప్రతిష్ట నియోజకవర్గంలో పూర్తిగా మసకబారింది. పైగా.. నేతలు, కార్యకర్తలకు ఆయన అందుబాటులో లేకపోవడం, కొందరికే ప్రాధాన్యత ఇస్తుండడంతో ఆయనపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీనిని పసిగట్టిన గొట్టిపాటి నిర్బంధాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి నియోజకవర్గంలో పట్టునిలుపుకునేందుకు ఇలా అడ్డదారులు తొక్కుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే పింఛన్లను సైతం నిలిపేసి వారి కుటుంబాలను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి
సాక్షి ప్రతినిధి, బాపట్ల: మార్టూరు గ్రానైట్ అక్రమ రవాణా వ్యవహారం అధికారపార్టీలో అగ్గి రాజేస్తోంది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మంత్రి గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య ఇది మరింత విభేదాలు సృష్టించింది. గ్రానైట్ అక్రమ రవాణాకు సంబంధించి ప్రతి లారీకి కప్పం కట్టాల్సిందేనంటూ పర్చూరు ఎమ్మెల్యే అనుచరులు పట్టుబడుతుండగా, తాము చెల్లించేది లేదంటూ మంత్రి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి అనుచరులు తెగేసి చెబుతున్నారు. వీరి మధ్య ముదిరిన ఈ వివాదం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జీరో బిల్లులతో అక్రమ రవాణాప్రభుత్వానికి రాయల్టీ, జీఎస్టీతో పాటు ఎటువంటి పన్నులు చెల్లించకుండా జీరో బిల్లులతో మార్టూరు నుంచి గ్రానైట్ నిత్యం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు, పలు దేశాలకు తరలిపోతోంది. రోజుకు కనీసం 80 లారీల్లో 30 నుంచి 45 టన్నుల పాలిషింగ్ బండలు ఇలా జీరో బిల్లులతో తరలిస్తున్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీలు పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరులో ఉన్నాయి. జీరో బిల్లులతో తరలిస్తున్నందున ఇక్కడి అధికారపార్టీ ఎమ్మెల్యే అనుచరులు వసూళ్లకు పాల్పడుతున్నారు. మార్టూరు నుంచి తెలంగాణకు లారీ వెళ్లాలంటే బాపట్ల జిల్లాలోని పర్చూరు, అద్దంకి, పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట, పిడుగురాళ్ల లేదా మాచర్ల నియోజకవర్గాలు దాటాల్సి ఉంది. పర్చూరు నియోజకవర్గం నేతకు లారీకి రూ. 8 వేలు చెల్లిస్తుండగా చిలకలూరిపేట నేతకు రూ. 2 వేలు, నరసరావుపేట నేతకు రూ. 4 వేలు, సరిహద్దు కావడంతో మాచర్ల రూటున వెళితే అక్కడి నేతకు రూ. 10 వేలు, లేదా పిడుగురాళ్ల రూటున వెళితే అక్కడి నేతకు రూ. 10 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. రూ. 8 వేలు దందా నిర్వహకులు తమ వాటాగా తీసుకుంటున్నారు. మొత్తంగా లారీకి రూ. 32 వేలు వసూలు చేస్తున్నారు. పర్చూరు నేత కనుసన్నల్లోనే వసూళ్ల పర్వం..డబ్బు చెల్లించిన లారీలను మాత్రమే పిడుగురాళ్ల లేదా మాచర్ల నుంచి తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. లారీకి చెల్లించాల్సిన రూ. 32 వేలు వసూలయ్యాకే వాటిని పంపుతున్నారు. ఇలా వసూలైన మొత్తాన్ని పర్చూరు నేత అనుచరులు అందరికీ పంపకాలు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఆ పర్చూరు నేత మార్టూరు మండలానికి చెందిన ఓ బీసీ నేతకు అప్పగించారు. ఆవ్యక్తి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతకు రూ. 2 కోట్లు ఎన్నికల ఫండ్ ముట్టజెప్పాడని సమాచారం. దీంతో కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి వారం నుంచే గ్రానైట్ అక్రమ రవాణా వ్యవహారం అతనికి కట్టబెట్టారని తెలుస్తోంది.కప్పం కట్టేందుకు ససేమిరా.. మంత్రి గొట్టిపాటి సొంత గ్రామం పర్చూరు నియోజకవర్గంలోని యద్దనపూడి మండలంలో ఉంది. మార్టూరు గ్రానైట్ పరిశ్రమ నిర్వాహకుల్లో మంత్రి అనుచరులు కూడా ఉన్నారు. మంత్రికి అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ, సంతమాగులూరు ప్రాంతాల్లో గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఇక్కడి నుంచి మార్టూరులోని 250 పాలిషింగ్ పరిశ్రమలకు గ్రానైట్ రాయి (ముడిరాయి)ని తరలిస్తారు. గొట్టిపాటి క్వారీల నుంచి రాయిని తెచ్చుకోవడం, పైగా సొంత నియోజకవర్గానికి చెందినవారు కావడంతో గ్రానైట్ వ్యాపారులకు మంత్రితో సత్సంబంధాలున్నాయి. కొందరు బంధువులు కూడా ఉన్నారు. వీరంతా పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే అనుచరులకు కప్పం కట్టేది లేదంటూ తేల్చి చెబుతున్నారు. తమ నియోజకవర్గంలో ఉన్న ఫ్యాక్టరీల నుంచి ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్నందున తమ నేతకు కప్పం కట్టాల్సిందేనంటూ పర్చూరు ఎమ్మెల్యే అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. అయితే మంత్రి సొంత గ్రామం ఇదే నియోజకవర్గంలో ఉంది కాబట్టి కట్టించుకుంటున్న కప్పంలో వాటా ఇవ్వాలని గొట్టిపాటి అనుచరులు మెలిక పెట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య అగ్గిరాజుకుంది. ఈ వ్యవహారం అద్దంకి, పర్చూరు ప్రాంతాల్లోనే కాక జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కూటమి అధిష్టానానికి సైతం ఈ రచ్చ చేరినట్లు అధికారపార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.ప్రభుత్వాదాయానికి భారీగా గండి..అధికార పార్టీకి చెందిన వారే ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అక్రమంగా గ్రానైట్ తరలిస్తుండటంతో ఖజానాకు భారీగా గండి పడుతోంది. ప్రతి టన్ను పాలిషింగ్ రాయికి సేల్స్‌టాక్స్ రూ. 1,300, మైనింగ్ ట్యాక్స్ రూ. 700 చొప్పున మొత్తం రూ. 2 వేలు ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ లెక్కన 35 టన్నుల లారీకి రూ. 70 వేలు ట్యాక్స్ చెల్లించాలి. రోజుకు 80 లారీలు అనుకుంటే రూ. 56 లక్షలు ట్యాక్స్ రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించకుండా అక్రమ మార్గంలో గ్రానైట్‌ను తరలిస్తున్నారు. అయినా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. -
కోట్లు కొల్లగొట్టి అక్రమాల్లో ఘనా'పాటి'
అక్రమాల్లో ఆయన ఘనాపాటి. అవినీతి పనులకు పెట్టింది పేరు. ప్రభుత్వ ఖజానాకు కొల్లగొట్టడంలో దిట్ట. ఆయనే బాపట్ల జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. బల్లికురవ, సంతమాగులూరు ప్రాంతాల్లోని క్వారీల నుంచి అక్రమంగా గ్రానైట్ తరలించి కోట్లు కొల్లగొట్టారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని ఎగ్గొట్టి దానినుంచి బయటపడేందుకు కోట్లు చుట్టూ తిరుగుతున్నారు. ఈ తవ్వకాలపై మైనింగ్, విజిలెన్స్ అధికారులు చేసిన తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగు చూశాయి. వందలకోట్ల మేర అక్రమ రవాణా జరిగినట్టు నిర్ధారణ అయింది. రూ. 275కోట్ల అపరాథ రుసుం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. దానిని ఎలా ఎగ్గొట్టాలా అని ఇప్పుడు చూస్తున్నారు. ఆది నుంచి అవినీతిలో ఆరితేరి ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా గ్రానైట్ అక్రమ రవాణా చేస్తున్నారంటూ గొట్టిపాటిపై కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఆరోపణలు వచ్చాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఈ వ్యవహారం రచ్చకెక్కడంతో ఆయన తమ్ముడు కిశోర్‌రెడ్డితో మంతనాలు చేసి పన్ను చెల్లించకుండా తప్పించుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రాగానే లోకేశ్‌ను కలిసి అక్రమ రవాణా వ్యవహారంపై ఆయనతో డీల్ కుదుర్చుకున్నట్లు ప్రచారం సాగింది. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. గొట్టిపాటి అక్రమాల చిట్టా... ♦ ఎమ్మెల్యే గొట్టిపాటికి సంతమాగులూరు, బల్లికురవ మండలాల్లో 20 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఆరు క్వారీలు ఉన్నాయి. ఇవికాక బినామీలతో మరికొన్నింటిని నడుపుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తనకు కేటాయించిన ప్రాంతంలోనే కాక ఎక్కువ విస్తీర్ణంలో మైనింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ♦ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయల పన్నులు ఎగ్గొట్టిన గొట్టిపాటి టీడీపీలో చేరాక పెద్దఎత్తున అక్రమ మైనింగ్ చేసినట్లు ఆధారాలతో సహా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మైనింగ్ విభాగం నిర్థారించింది. ♦ బల్లికురవ మండలం కొణిదెలలో కిశోర్ స్లాబ్ అండ్ టైల్స్ పేరుతో 6.4 హెక్టార్లలో గ్రానైట్ క్వారీ ఉండగా 2019 నవంబర్ 23న తనిఖీలు నిర్వహించి 42,676 క్యూబిక్ మీటర్ల మేర రా యిని అనుమతి లేకుండా విక్రయించినట్లు ని ర్థారించి రూ.87.45 కోట్ల జరిమానా వేసింది. ♦అదే గ్రామంలో అంకమచౌదరి పేరుతో సర్వేనంబర్ 103లో 4 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న క్వారీలో 43,865 క్యూబిక్ మీటర్ల రాయిని కూడా అక్రమంగా తరలించినట్టు గుర్తించిన విజిలెన్స్ బృందం తనిఖీలు చేసి రూ .54. 23 కోట్లు జరిమానా వేసింది. ♦ఇదే గ్రామ పరిధిలో కిశోర్ గ్రానైట్స్ పేరుతో 3.093 హెక్టార్లలో ఉన్న క్వారీలో కూడా 42,056 క్యూబిక్ మీటర్ల అక్రమ తవ్వకాలు చేయడంతో రూ.87.30 కోట్లు జరిమానా వేశారు. ♦ సంతమాగులూరు మండలం గురిజేపల్లి వద్ద కిశోర్‡ గ్రానైట్స్ పేరుతో గొట్టిపాటికి 4.10 హెక్టార్లలో క్వారీ ఉండగా 19,752 క్యూబిక్ మీటర్ల మేర తరలించినట్లు గుర్తించిన విజిలెన్స్ రూ.45.68 కోట్లు అపరాధ రుసుం వి ధించింది. మొత్తంగా రూ.274.66 కోట్ల ప న్నులు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. ♦ఆయన ఎటువంటి పన్నులు, జరిమానాలను చెల్లించకపోవడంతో చాలా క్వారీల లీజులను రద్దు చేసింది. దీంతో గొట్టిపాటి ఈ అంశంపై హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించి, స్టే తెచ్చుకున్నారు. -
Fact Check: కొల్ల‘గొట్టి పాటి’!
సాక్షి, అమరావతి /బాపట్ల: సహజ వనరులను కొల్లగొట్టిన ఓ ఘనాపాఠికి పేదల భూములు అప్పనంగా మింగేసిన ఓ పెద్దమనిషి వత్తాసు పలుకుతున్నారు! గురివింద సామెతను విస్మరించి రాబందుల రాజ్యహింస అంటూ శివాలెత్తిపోయారు! ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యథేచ్చగా గనుల విధ్వంసానికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఉత్తముడంటూ ఈనాడు రామోజీ కీర్తిస్తున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన గొట్టిపాటి గత చరిత్రను దాచేందుకు రామోజీ తంటాలు పడ్డా ప్రజలు మరచిపోరు కదా!! ప్రలోభాలతో ఫిరాయించి అక్రమాలు.. 2014లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన గొట్టిపాటి రవికుమార్ ఆ తరువాత టీడీపీలో ఎందుకు చేరారనే వాస్తవాన్ని రామోజీ కావాలనే కప్పిపుచ్చారు. నాటి సీఎం చంద్రబాబు ప్రలోభాలకు గురి చేయడంతో పార్టీ ఫిరాయించిన గొట్టిపాటి అనంతరం టీడీపీ సర్కారు అండతో యథేచ్ఛగా గనులను కొల్లగొట్టారు. క్వారీల అనుమతులు రద్దు కాకుండా లోకేశ్‌కు భారీ మొత్తంలో కప్పం చెల్లించారు. విఫలయత్నాలు.. 2019 ఎన్నికల్లో గొట్టిపాటి రవి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈదఫా వైఎస్సార్ సీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో మళ్లీ పార్టీ ఫిరాయించేందుకు ప్రయత్నించి భంగపడ్డారు. తిరిగి వైఎస్సార్సీపీలో చేరతానంటూ పలువురి ద్వారా రాయబారాలు పంపిన గొట్టిపాటి కొంతకాలం టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆయన కప్పదాటు వైఖరి తేటతెల్లం కావడంతో అధికార పార్టీ అందుకు అంగీకరించలేదు. దాదాపు రెండేళ్లపాటు ఎడతెగని ప్రయత్నాలు చేసిన గొట్టిపాటి ఇక లాభం లేదని మిన్నకుండిపోయారు. ఈనాడు రామోజీ దీన్ని వక్రీకరిస్తూ గొట్టిపాటి వైఎస్సార్సీపీలో చేరేందుకు ఒప్పుకోకపోవడంతోనే కేసులు నమోదు చేశారంటూ కట్టుకథలు అల్లేశారు. గనుల అక్రమ తవ్వకాలపై విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించింది. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, నెల్లూరు తదితర జిల్లాల్లో కూడా తనిఖీలు జరిపి అక్రమాలపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసింది. తనిఖీల తరువాతే కేసులు ♦ బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొనిదిన గ్రామం వద్ద కిషోర్స్లాబ్ అండ్ టైల్స్ పేరుతో గొట్టిపాటికి 6.4 హెక్టార్లలో గ్రానైట్ క్వారీ ఉంది. 2019 నవంబరు 23న తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం 42,676 క్యూబిక్ మీటర్ల గ్రానైట్‌ను పర్మిట్లు లేకుండా అక్రమంగా అమ్మేసినట్లు నిర్ధారించింది. దీంతో నిబంధనల ప్రకారం రూ.87.45 కోట్లు జరిమానా విధించింది. ♦ బల్లికురవ మండలం కొనిదిన పరిధిలో అంకమచౌదరి పేరుతో సర్వే నంబర్ 103లో నాలుగు హెక్టార్ల విస్తీర్ణంలో క్వారీ ఉంది. అందులో 43,865 క్యూబిక్ మీటర్ల రాయిని అక్రమంగా తరలించినట్లు తేలడంతో రూ. 54. 23 కోట్లు జరిమానా విధించారు. ♦ బల్లికురవ మండలం కొనిదిన పరిధిలోనే కిషోర్ గ్రానైట్స్ పేరిట 0.093 హెక్టార్లలో ఉన్న క్వారీలో 42,056 క్యూబిక్ మీటర్ల మేర అక్రమంగా తవ్వేసి తరలించడంతో రూ.87.30 కోట్లు జరిమానా విధించారు. ♦ సంతమాగులూరు మండలం గురిజేపల్లివద్ద కిషోర్ గ్రానైట్స్ పేరిట గొట్టిపాటికి 4.10 హెక్టార్లలో క్వారీ ఉంది. అందులో 19,752 క్యూబిక్ మీటర్ల మేర గ్రానైట్‌ను అక్రమంగా తవ్వి తరలించడంతో రూ.45.68 కోట్లు జరిమానా విధించారు. గొట్టిపాటి జరిమానా చెల్లించకపోవడంతో నిబంధనలను అనుసరించి క్వారీ అనుమతి రద్దు చేశారు. పన్నులు చెల్లించకపోవడంతో మరో 30 క్వారీల యజమానులకు కూడా గనుల శాఖ నోటీసులు జారీ చేసింది. వీటిని కప్పిపుచ్చుతూ కేవలం గొట్టిపాటినే వేధిస్తున్నారంటూ ఈనాడు దుష్ప్రచారానికి దిగింది. చట్ట ప్రకారమే జరిమానాలు మైనింగ్ నిబంధనలు ఉల్లంఘించిన గొట్టిపాటి రవికుమార్‌కు చట్ట ప్రకారమే జరిమానా విధించామని, దాన్ని వక్రీకరిస్తూ రాబందుల రాజ్యహింస అంటూ ఈనాడు పచ్చి అబద్ధాలతో కథనం ప్రచురించిందని మైనింగ్ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి పేర్కొన్నారు. గనుల శాఖకు, ప్రభుత్వానికి రాజకీయ దురుద్దేశాలను ఆపాదించటాన్ని ఖండించారు. క్వారీలను తనిఖీ చేయడం, ఉల్లంఘనలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం గనుల శాఖ విధుల్లో భాగమన్నారు. లీజుదారుల రాజకీయ ప్రాధాన్యతలతో తమకు సంబంధం ఉండదన్నారు. 2019లో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని గ్రానైట్ క్వారీలపై తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన పలు క్వారీలకు జరిమానాలు విధిస్తూ నోటీసులు జారీ చేశామన్నారు. గొట్టిపాటి రవికుమార్‌కు చెందిన 11 క్వారీల్లో మేనేజర్లు, సిబ్బంది సమక్షంలోనే తనిఖీలు జరిగినట్లు తెలిపారు. రూ.45 కోట్ల మేర ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించి చట్ట ప్రకారం ఐదు రెట్లు అధికంగా రూ.270 కోట్లు జరిమానా విధించినట్లు తెలిపారు. ఇందులో కక్ష సాధింపులకు ఆస్కారం లేదన్నారు. గొట్టిపాటి రివిజన్‌కు అప్పీలు చేసుకోలేదన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలు గనుల శాఖ పరిశీలనలో ఉన్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లాలోని 240 క్వారీల నుంచి గనుల శాఖకు ఏటా రూ.400 కోట్ల మేర రెవెన్యూ వస్తోందన్నారు. ఒక్క గొట్టిపాటి క్వారీలపై చర్యలు తీసుకోవడం వల్ల ఏటా రూ.100 కోట్ల రెవెన్యూను ప్రభుత్వం నష్టపోయినట్లు ఈనాడు ఏ లెక్కల ఆధారంగా రాసిందో చెప్పాలన్నారు. తప్పుడు కథనాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. –మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి -
‘విరాటపర్వం’ చిత్రం ప్రారంభం
-
విరాటపర్వం ఆరంభం
అజ్ఞాతవాసం కోసం పూర్వం విరాటరాజు కొలువులో పాండవులు కొలువు దీరి కార్యసిద్ధులయ్యారు. ఇప్పుడు వెండితెరపై రానా ‘విరాటపర్వం’ మొదలైంది. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా హీరోగా నటించనున్న ‘విరాటపర్వం’ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ పతాకాలపై డి. సురేష్‌బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి నటుడు వెంకటేశ్ క్లాప్ ఇవ్వగా, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాతలు డి. సురేష్‌బాబు, సుధాకర్ చెరుకూరిలు దర్శకుడు వేణు ఉడుగులకు స్క్రిప్ట్ అందించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే వారంలో స్టార్ట్ కానుంది. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో నిర్మాతలు నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, వై. రవిశంకర్, సాహు గారపాటి, అభిషేక్ అగర్వాల్, రామ్ ఆచంట, దర్శకులు చందు మొండేటి, అజయ్ భూపతి, వెంకటేశ్ మహా, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించనున్న ఈ సినిమాకు దివాకర్ మణి కెమెరామేన్. -
ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన టీడీపీ ఎమ్మెల్యే
పాక్షి, బల్లికురవ (ప్రకాశం): ఓటమి భయంతోనే ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేనని, తనకు అధికార అండదండలు ఉన్నాయని మంగళవారం రాత్రి మండలంలోని వెలమవారిపాలెం, కొత్త జమ్మలమడక, అద్దంకి మండలంలోని ఏలేశ్వరవారి పాలెంలో ప్రచారం చేపట్టారు. అంతటితో ఆగకుండా బుధవారం రాత్రి బల్లికురవ మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో తన క్వారీలకు సమీపంలో ఉన్న కొత్తమల్లాయపాలెం, యానాదిసంఘం, పాతమల్లాయపాలెం గ్రామాల్లో కూడా ఓటర్లను కలుసుకుని తనకు ఓట్లువేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఎస్సీ కాలనీలు, చర్చిల్లో సమావేశాలు అయి మీ అభివృద్ధికి పాటుపడతానని మీలో ఒకడిగా నన్ను ఆశీర్వదించాలని వేడుకుంటున్నారు. వైఎస్సార్ సీపీకి ఓట్లు వేస్తారని వారిని గుర్తించి బెదింపులకు కూడా పాల్పడుతున్నారని గ్రామానికి చెందిన నేతలు వాపోతున్నారు. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికల అధికారులు, పోలీస్‌లు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని వైఎస్సార్ మండల అధ్యక్షుడు చింతలపేరయ్య, స్థానిక నేతలు గుర్రం రంగావు, పొందూరి వీరాంజనేయులు, సారెద్దు శివరామరాజు, జూపల్లి లింగయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యుడు బిరుదు వెంకటేశ్వర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఓటమి భయంతోనే నాయకులకు ప్యాకేజీతో పాటు ఎన్నికల నిబంధనలను ఉల్లఘింస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానిక నేతలు వివరించారు. ఈ విషయమై ఎమ్మెల్యే, ఎన్నికల కోడ్ అధికారులపై జిల్లా స్థాయి అధికారులకు, ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. -
గరటయ్యది ప్రజాసేవ.. గొట్టిపాటిది డబ్బుయావ
సాక్షి, అద్దంకి (ప్రకాశం): నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బాచిన చెంచు గరటయ్య, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ పోటీలో తలపడతున్నారు. ప్రజా ప్రతినిధులుగా ఓటర్ల తీర్పును కోరబోతున్న నేపథ్యంలో ఇద్దరి వ్యక్తిగతంతో పాటు రాజకీయ జీవితంపై విశ్లేషకులు, ప్రజలు తెలిపిన అభిప్రాయాలు. గరటయ్య అందరి బంధువయ్యా.. ♦ వైద్యునిగా జీవితాన్ని ప్రారంభించారు. ♦ ఎంతో మందికి ఉచిత సేవలందించి ప్రాణదాతగా నిలిచారు. ♦ నాలుగు సార్లు ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవం. ♦ మృధు స్వభావి, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే మనస్తత్వం. ♦ ముక్కు సూటి మనిషి, నిగర్వి, రాజకీయ దురంధరుడు. ♦ పల్లెలో ప్రతి ఒక్కరిని పేరుపెట్టి పిలిచేంత చనువు ఉంది. ♦ వర్గ రాజకీయాలను ఏ మాత్రం ప్రోత్సహించడనే మంచి పేరుంది. ♦ ప్రత్యర్థి వర్గం వారైనా సాయం కోరితే ఆదుకుంటాడు. ♦ పేదల, రైతుల పక్షపాతి వారి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేశారు. ♦ ఆయన ఎమ్మెల్యేగా పని చేసిన కాలంలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇప్పించారు. ♦ గరటయ్య కాలనీ ఏర్పాటు చేసి పేదల మనస్సులో చిరస్థాయిగా నిలిచారు. ♦ నియోజకవర్గ అభివృద్ధి కోసం అనునిత్యం తపించే తత్వం గరటయ్య సొంతం ♦ అవినీతి రహితుడిగా నియోజకవర్గ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ♦ ముక్కు సూటిగా శత్రువుపై పోరాడే మనస్తత్వం ఉన్న నాయకునిగా అందరూ కొనియాడుతుంటారు. గొట్టిపాటి అవినీతిలో ఘనాపాఠి.. ♦ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పెట్టిన భిక్షతో రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ♦ మొదటి నుంచి వ్యాపారమే పరమావధిగా భావించే వ్యక్తి. ♦ అభివృద్ధి పనులు చేశారని పేరున్నప్పటికీ తనసొంత ప్రయోజనం లేకుండా ఎటువంటి అభివృద్ధి పనుల చేయరు. ♦ పైకి మృధు స్వభావిగా కనిపించినా ప్రత్యర్థులపై దయాదాక్షిణ్యాలు చూపించరు. ♦ ధన బలంతో ఏదైనా సాధించవచ్చనే స్వభావం కలిగిన వ్యక్తి ♦ గెలుపు కోసం అధికారులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు. ♦ పేదల భూములను గ్రానైట్ కోసం లాక్కున్నాడనే ఆరోపణలు. ♦ తన వ్యాపారం కోసమే పార్టీ మారాడనే విమర్శలు ప్రజల నుంచి వినవస్తున్నాయి. ♦ కరణం బలరాంతో దశాబ్దాల పాటు ఫ్యాక్షన్ గొడవలు. ♦ ప్రజలు, రైతు సమస్యలపై అవగాహన తక్కువ. ♦ సాగు నీటి విషయంలో రైతులకు ఏ మాత్రం మేలు జరగలేదు. ♦ వర్గ రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచి, టీడీపీలో ఉన్న మరో సీనియర్ నాయకునితో ఉన్న వర్గ విభేధాలు ♦ ఇరు వర్గీయులు మధ్య చోటు చేసుకున్న గొడవల్లో కార్యకర్తల ప్రాణాలు బలితీసుకున్నారు. -
పార్టీ పరువు తీస్తున్నారు: చంద్రబాబు
సాక్షి, అమరావతి : ప్రకాశం జిల్లా టీడీపీ నేతల ఘర్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై ఆయన టీడీఎల్పీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పరువు తీస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. తాను ఎవరికీ అన్యాయం చేయలేదని, కొత్త, పాత కలిసి పని చేయాలని ఎన్నోసార్లు చెప్పానని ఆయన అన్నారు. చేరికల వల్ల ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తున్నా అని, పదవులు ఇచ్చి గౌరవిస్తున్నానని, ఇంకా ఏం కావాలని అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఇంఛార్జ్‌లుగా బాధ్యతలు ఇచ్చాక జోక్యం వద్దని స్పష్టం చేశానని చంద్రబాబు పేర్కొన్నారు. చేరికల వల్ల పార్టీలో ఉన్నవారికి అన్యాయం జరగకుండా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి గౌరవించానని అన్నారు. ఇంతకంటే ఏం చేయాలని, అయినా గొడవలు పడుతూ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాంల మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్న విషయం తెలిసిందే. ఇరువురు నేతలు కుర్చీలు తీసుకొని పరస్పరం దాడికి తెగబడ్డారు. సై అంటే సై అంటూ సవాళ్లు విసురుకున్నారు. నువ్వెంతంటే.. నువ్వెంత అంటూ బాహాబాహీకి సిద్ధపడ్డారు. రాయలేని పదజాలంతో బండబూతులు తిట్టుకున్నారు. నిన్న (గురువారం) సాయంత్రం జరిగిన ఈ గొడవకు సాక్షాత్తూ రాజధాని అమరావతిలోని సచివాలయం వేదికైంది. మంత్రులు పరిటాల సునీత, పి.నారాయణ, శిద్దా రాఘవరావుతో పాటు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు సాక్షీభూతులుగా నిలిచారు. జిల్లాలో అధికార పార్టీ గొడవలు పతాక స్థాయికి చేరాయి. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు పై విధంగా స్పందించారు. -
ఎమ్మెల్యే గొట్టిపాటి నన్ను బతకనివ్వడు
సాక్షి, గుంటూరు: ‘మద్యం షాపు విషయమై అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఆయన పీఏ సారథి నన్ను బెదిరిస్తున్నారు. చంపుతామని హెచ్చరించారు. ఇక ఆయన నన్ను బతకనివ్వడు. నేనే ఆత్మహత్య చేసుకొని చనిపోతా’ అంటూ చిలకలూరిపేటకు చెందిన మద్యం వ్యాపారి ఊటుకూరి శ్రీనివాసరావు సూసైడ్ నోట్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శ్రీనివాసరావు సోదరుడు వెంకట సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం ముక్తేశ్వరానికి చెందిన ఊటుకూరి శ్రీనివాసరావు మొదట్నుంచి మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం వర్గీయుడిగా ఉన్నాడు. ఈ ఏడాది బల్లికురవ మండలం కొమ్మాలపాడులో శ్రీనివాసరావు మద్యం దుకాణం ఏర్పాటు చేశాడు. గొట్టిపాటి తన వర్గానికి చెందిన నాగేశ్వరరావుతో ఆ పక్కనే మద్యం దుకాణం ఏర్పాటు చేయించారు. తన వర్గంలో చేరాలని.. లేదంటే మద్యం దుకాణం మూసేసి వెళ్లిపోవాలంటూ గొట్టిపాటి, ఆయన పీఏ సారథి, మరికొందరు నిత్యం బెదిరింపులకు దిగుతూ శ్రీనివాసరావును మానసికంగా వేధించారు. మాట వినకపోవడంతో.. ఎమ్మెల్యే చివరకు తన అధికార బలం ఉపయోగించి మద్యం దుకాణాన్ని మూసివేయించారు. దీంతో శ్రీనివాసరావు వారం కిందట తొమ్మిది పేజీల సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.. తన సోదరుడు శ్రీనివాసరావు అదృశ్యంపై ఈ నెల 16న చిలకలూరిపేట టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెంకట సుబ్బారావు ‘సాక్షి’తో చెప్పారు. గొట్టిపాటి, పీఏ సారథి, మద్యం వ్యాపారి నాగేశ్వరరావు బెదిరింపుల వాయిస్ రికార్డులను అందించినప్పటికీ వారిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మిస్సింగ్ కేసుగా నమోదు చేశారన్నారు. గొట్టిపాటి వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ శ్రీనివాసరావు రాసిన సూసైడ్ నోట్ -
కరణం బలరాంపై చంద్రబాబు ఆగ్రహం
అమరావతి: ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల మధ్య వర్గ పోరుపై పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఇక్కడ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అద్దంకి నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలపై చర్చ జరిగింది. ఎమ్మెల్సీ కరణం బలరాం తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అద్దంకి నియోజక వర్గంలో కరణం బలరాం మాట చెల్లదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ నియోజకవర్గంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చెప్పిందే ఫైనల్ అని తేల్చేశారు. కరణం బలరాంకు ఎమ్మెల్సీ ఇచ్చిన సమయంలోనే ఈ విషయం చెప్పినట్లు చంద్రబాబు గుర్తుచేశారు. అయితే అప్పుడు అంగీకరించిన బలరాం ఇప్పుడు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మరోవైపు గత కొన్ని రోజులుగా గొట్టిపాటి, కరణం వర్గీయులు పరస్పరం దాడులకు పాల్పుడుతున్న విషయం తెలిసిందే. విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన చంద్రబాబు.. అద్దంకి నియోజక వర్గంలో మాత్రం రవికుమార్ నిర్ణయాలు చెల్లుబాటు అవుతాయని చెప్పడం కరణం బలరాం వర్గీయులలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం. -
మళ్లీ పడగ విప్పిన తమ్ముళ్ల వర్గపోరు
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల మధ్య వర్గ పోరు కొనసాగుతోంది. బల్లికురవ మండలం వేమవరంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గీయుడిపై అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. గత నెలలో జరిగిన దాడిలో గాయాలపాలైన వెంకటేశ్వర్లుపై గొట్టిపాటి వర్గీయులు మరోసారి దాడి చేశారు. తన ఇంటి ముందు బైక్‌పై వెంకటేశ్వర్లు కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో గొట్టిపాటి శ్రీను అనే వ్యక్తి మరికొందరితో కలిసి బైక్ పై అక్కడికి వచ్చి దాడి చేశాడని స్థానికులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లును వెంటనే గ్రామస్తులు చికిత్స నిమిత్తం చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నిందితులంతా ఎమ్మెల్యే అనుచరులే
► 14 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ►మరో ఇద్దరి కోసం ప్రత్యేక బృందాల గాలింపు ►కత్తులు, కర్రలు, కారం డబ్బా, కారు, మూడు మోటారు సైకిళ్లు స్వాధీనం ►వారంతా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అనుచరులే ►వివరాలు వెల్లడించిన గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ ఒంగోలు క్రైం : జిల్లాలోని బల్లికురవ మండలం వేమవరం గ్రామంలో ఈ నెల 19వ తేదీ జరిగిన జంట హత్యల కేసులో 14 మంది నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. శుక్రవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఐటీ కోర్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 19వ తేదీ రాత్రి వేమవరం గ్రామంలో జరిగిన దాడిలో గోరంట్ల అంజయ్య, వేగినేని రామకోటేశ్వరరావు హత్యకు గురవగా, వేగినేని ముత్యాలరావు, గోరంట్ల వెంకటేశ్వర్లు, వేగినేని వీరరాఘవులు గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, వారంతా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అనుచరులే. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు మాలెంపాటి వెంకటేశ్వర్లు గతంలో 1989లో సాంబయ్య హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. ఆయనతో పాటు గొట్టిపాటి మారుతీబాబు అలియాస్ మారుతీ, మాలెంపాటి లక్ష్మీనారాయణ అలియాస్ చిన్నోడు, గొట్టిపాటి వెంకటేశ్వర్లు అలియాస్ సొసైటీ, గొట్టిపాటి వీరాంజనేయులు, గొట్టిపాటి శివన్నారాయణ, గొట్టిపాటి బ్రహ్మయ్య, శాఖమూరి సీతయ్య, శాఖమూరి రంగారావు, శాఖమూరి కాంతారావు, గొట్టిపాటి శ్రీనివాసరావు, గొట్టిపాటి రమేష్, గురజాల రాంబాబు, గురజాల రామాంజనేయులును పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 8 మంది నిందితులను అద్దంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలో, మిగతా ఆరుగురిని చినకొత్తపల్లి వద్ద అరెస్టు చేశారు. దాడిలో నిందితులు ఉపయోగించిన కత్తులు, కర్రలు, కారంపొడి డబ్బా, దాడి అనంతరం నిందితులను తరలించేందుకు ఉపయోగించిన కారు, మూడు మోటారు సైకిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడులు, ప్రతిదాడులు వద్దు గ్రామాల్లో కక్షల పేరుతో దాడులు, ప్రతిదాడులు వద్దని, కత్తులు, కటార్లను ఎవరూ ఆశ్రయించవద్దని ఐజీ సంజయ్ హితవు పలికారు. ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు, మైన్స్ ఇలా ఏదో ఒక సాకుతో గ్రామాల్లో వైరాలు పెంచుకుని దాడులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. బల్లికురవ మండలం వేమవరం జంట హత్యల కేసుకు సంబంధించి గతంలో శివాలయం, రామాలయం, గనుల విషయాల్లో చోటుచేసుకున్న ఘర్షణలే కారణంగా తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. స్పీడ్‌బ్రేకర్ల సమస్య కూడా ఇందుకు కారణంగా అభివర్ణించారు. ఎవరినైనా అంతమొందించాలని పథకం వేసుకుంటే చివరకు కటకటాల వెనక్కి వెళ్లాల్సిందేనని ఐజీ హెచ్చరించారు. రాజకీయ నాయకుల అండదండలున్నాయని బరితెగిస్తే పోలీసులు చూస్తూ ఊరుకోరని స్పష్టం చేశారు. ఇప్పటికీ అద్దంకి నియోజకవర్గం పోలీసుల నిఘానేత్రంలోనే ఉందని ఆయన పేర్కొన్నారు. శాంతిభద్రతలు కాపాడటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పోలీస్ సమాచార వ్యవస్థ ఫెయిల్ వేమవరం ఘటన సమాచారం పోలీస్ ఉన్నతాధికారులకు చేరడంలో పోలీస్ సమాచార వ్యవస్థ, నిఘా వ్యవస్థ ఫెయిల్ అయినట్లు ఐజీ చెప్పారు. బల్లికురవ ఎస్సై ప్రొబేషనరీ ఎస్సై కావడం వలన సమాచార సేకరణలో కొంత లోపం ఏర్పడిందన్నారు. కొత్తగా వచ్చిన ఎస్సైలు పోలీస్స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తేనే భవిష్యత్తులో బాగా రాణించగలరని పేర్కొన్నారు. అయితే ప్రొబేషనరీ ఎస్సై కావడంతో అతనిని మందలించటం జరిగిందని, అతడికి అనుభవజ్ఞులైన ఎస్సైలు, సీఐల వద్ద ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని ఐజీ తెలిపారు. అదే విధంగా స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) నిఘా వ్యవస్థ కూడా ఈ విషయంలో సక్రమంగా పనిచేయలేదన్నారు. జిల్లావ్యాప్తంగా నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని పేర్కొన్నారు. పికెట్లు కొనసాగింపు : ఎస్పీ త్రివిక్రమవర్మ బల్లికురవ మండలంతో పాటు అద్దంకి నియోజకవర్గంలో పోలీస్ పికెట్లను కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మ పేర్కొన్నారు. విజయవాడ నుంచి వచ్చిన ఏపీఎస్పీ మూడు ప్లటూన్లతో ప్రత్యేక పోలీస్ బృందాలు నిత్యం పహారా కాస్తున్నాయని వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు సంసిద్ధులై ఉన్నామని వివరించారు. అదే విధంగా ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ నుంచి ప్రత్యేక పోలీసులను రప్పించి 8 పోలీస్ పికెట్లను వేమవరంతో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నారు. డీఎస్పీలు, సీఐలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిరంతరం శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నారని పేర్కొన్నారు. దర్శి డీఎస్పీ వి.శ్రీరాంబాబు, ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, చీరాల డీఎస్పీ ప్రేమ్‌కాజల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందాలు పర్యవేక్షిస్తున్నాయని వివరించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు వేమవరంలో దాడి జరిగిన అనంతరం హుటాహుటిన జిల్లా ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మ సంఘటన స్థలానికి చేరుకున్నారని ఐజీ సంజయ్ వివరించారు. ప్రాథమిక సమాచారం మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులుగా 15 మందితో పాటు మరికొందరిని పేర్కొన్నట్లు చెప్పారు. ఎస్పీ స్వయంగా దర్యాప్తు చేపట్టడం వల్ల బాధితుల నుంచి కూడా సక్రమమైన సమాచారం వచ్చిందన్నారు. కేసు దర్యాప్తులో నిష్పక్షపాతంగా వ్యవహరించినట్లు చెప్పారు. అయితే, తొలుత ఎఫ్ఐఆర్లో ఉన్న ముగ్గురికి ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని దర్యాప్తులో గుర్తించి వారి పేర్లను తొలిగించినట్లు ఐజీ తెలిపారు. పేర్లు తొలిగించిన వారిలో మాలెంపాటి అనిల్, మాలెంపాటి నరేష్, గొట్టిపాటి శ్రీను ఉన్నారన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఎఫ్ఐఆర్లో లేని మరో నలుగురికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించి ప్రస్తుతం వారిని కూడా అరెస్టు చేశామన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారిలో ఒకరు నిందితులను తరలించేందుకు సహకరించిన తేళ్ల రాజేష్ కాగా, మరొకరు దాడిలో పాల్గొన్న గొట్టిపాటి నాగయ్య అని, వారిద్దరినీ అరెస్టు చేయాల్సి ఉందని ఐజీ వివరించారు. -
గొడవ వెనుక గొట్టిపాటి కుట్ర ఉంది
-
గొట్టిపాటి టీడీపీకి చెందిన వాడు కాదు : కరణం బలరాం
♦ కరణం, గొట్టిపాటి బాహాబాహీ ♦ ఇరువర్గాల సవాళ్లు, ప్రతి సవాళ్లు ♦ గొట్టిపాటిపై కరణం వర్గం దాడి ♦ తోపులాటలో కిందపడిపోయిన ఎమ్మెల్యే రవి ♦ రసాభాసగా టీడీపీ సమావేశం సవాళ్లు.. ప్రతి సవాళ్లు, పరస్పర దాడులతో టీడీపీ జిల్లా సమావేశం దద్ధరిల్లింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక కోసం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరణం బలరాం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గం బాహాబాహీకి సిద్ధమైంది. వేమవరం జంట హత్యల నేపథ్యంలో గొట్టిపాటిపై ఆగ్రహంతో ఉన్న కరణం వర్గం ఆయనపై దాడికి దిగింది. దీనిని అడ్డుకునేందుకు గొట్టిపాటి వర్గం ఎదురుదాడికి ప్రయత్నించింది. మొత్తంగా మంగళవారం జరిగిన టీడీపీ జిల్లా సమావేశం రణరంగాన్ని తలపించింది. ఒంగోలు నగరంలోనిఏ1 కన్వెన్షన్ హాలు ఇందుకు వేదికైంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక కోసం ఆ పార్టీ మంగళవారం ఒంగోలులోని ఏ1 కన్వెన్షన్ హాలులో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కరణం బలరాం, ఆయన తయుడు వెంకటేష్‌లు తమ వర్గీయులతో హాజరయ్యారు. ఇదే సమావేశానికి ఎమ్మెల్యే గొట్టిపాటితో పాటు ఆయన వర్గీయులు హాజరయ్యారు. ఈ నెల 29న జరిగిన వేమవరం జంట హత్యలకు ఎమ్మెల్యే గొట్టిపాటి కారణమని, తమ వర్గీయులను గొట్టిపాటి హత్య చేయించాడని కరణం వర్గీయులు ఆగ్రహంతో ఉంది. గొట్టిపాటిని చూడగానే ఎమ్మెల్సీ కరణం ఒక్కసారిగా రేయ్.. అంటూ గొట్టిపాటిపై చేయి చేసుకున్నారు. ముందుగా ఇరువురు ఎదురుపడిన సందర్భంలో గొట్టిపాటి గన్‌మేన్ కరణం గన్‌మేన్‌ను పక్కకు నెట్టే ప్రయత్నం చేయబోగా కరణం ఆగ్రహించినట్టు తెలుస్తోంది. చేయి చేసుకోబోయిన కరణంను గొట్టిపాటి గన్‌మేన్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కరణం, ఆయన అనుచరులు గన్‌మేన్‌తో పాటు గొట్టిపాటి అనుచరులను చితకబాదారు. ఇంతలో అక్కడకు చేరుకున్న మరింత మంది కరణం వర్గీయులు గొట్టిపాటి వర్గంపై దాడికి దిగింది. గొట్టిపాటిని రక్షించుకునే ప్రయత్నంలో ఆయన అనుచరులు గొట్టిపాటికి వలయంగా ఉండిపోయారు. ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. గొట్టిపాటి కింద పడిపోయారు. గొట్టిపాటి టీడీపీ కాదన్న కరణం.. పరిస్థితి అదుపు తప్పడం, గొట్టిపాటి కిందపడిపోవడం చూసిన జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణ, మంత్రులు పరిటాల సునీత, శిద్దా రాఘవరావులు పరుగులు పెట్టి ఇరువర్గాలను నిలువరించే ప్రయత్నం చేశారు. గొట్టిపాటి టీడీపీకి చెందిన వాడు కాదని.. టీడీపీ కార్యకర్తలను హత్య చేయించాడని అలాంటి వ్యక్తిని సమావేశానికి ఎలా రానిస్తారంటూ కరణం బలరాం, ఆయన తనయుడు వెంకటేష్‌లు పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మంత్రిని నిలదీశారు. వెంటనే గొట్టిపాటిని సమావేశం నుంచి బయటకు పంపాల్సిందేనంటూ సీరియస్‌గా చెప్పారు. లేకపోతే ఊరుకునేది లేదని అమీతుమీకి సిద్ధమని తేల్చి చెప్పారు. దీంతో బెంబేలెత్తిన మంత్రులు గొట్టిపాటిని అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ కోరారు. తామేందుకు వెళ్లాలంటూ గొట్టిపాటి వర్గం మంత్రులతో వాదనకు దిగింది. కరణం వర్గం కేకలు, ఈలలతో అంతు తేలుస్తామంటూ రెచ్చిపోయింది. గొట్టిపాటి అనుచరులపై మరోమారు దాడికి సిద్ధమైంది. పరిస్థితి విషమించటంతో మంత్రులు గొట్టిపాటికి నచ్చజెప్పి జిల్లా అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన అభిప్రాయం తీసుకొని ఆయన్ను సమావేశం నుంచి పంపించి వేశారు. టీడీపీ అధ్యక్ష ఎన్నిక వాయిదా.. గొట్టిపాటి, కరణం వర్గాల గొడవతో టీడీపీ జిల్లా సమావేశం రచ్చరచ్చగా మారింది. ఈ సమావేశంలోనే అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉండగా కరణం, గొట్టిపాటి గొడవ నేపథ్యంలో మంత్రులు ఎన్నికను వాయిదా వేశారు. పాత నేతలతో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవడంతో సరిపెట్టారు. అందరి అభిప్రాయాలను ముఖ్యమంత్రికి పంపుతామని అధ్యక్ష ఎన్నిక విషయంలో సీఎం తుది నిర్ణయం తీసుకుంటారని మంత్రులు విలేకర్లకు చెప్పి చేతులు దులుపుకున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పరార్.. ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య గొడవ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు జిల్లా సమావేశం నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు. తొలుత సమావేశానికి వచ్చిన కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లు సమావేశంలో పది నిమిషాలు మాత్రమే ఉండి గొట్టిపాటి రవికుమార్ వెళ్లిన మరుక్షణమే వారు వెళ్లిపోయారు. హత్య చేసిన వారిని వదిలిపెట్టం.. గొట్టిపాటి రవికుమార్‌ది అసలు టీడీపీనే కాదు. పార్టీ కార్యకర్తలను హత్య చేసిన వాడిని సమావేశానికి ఎలా రానిస్తారు? నిర్దాక్షిణంగా కార్యకర్తలను హత్య చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టం. కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటాం. ఎవరిపైనా నిష్కారణంగా దాడి చేయాల్సిన పని మాకు లేదు. – విలేకరులతో కరణం రెచ్చగొడుతున్నా..సహిస్తున్నా.. : కరణం బలరాం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. అయినా సహిస్తున్నా. వేమవరం జంట హత్యలకు గ్రామంలోనే పరిస్థితులే కారణం. – విలేకరులతో గొట్టిపాటి -
గొట్టిపాటికి చంద్రబాబు షాక్!
-
గొట్టిపాటికి చంద్రబాబు షాక్!
ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు షాకిచ్చారు. మంగళవారం ఉదయం ఒంగోలులో తనకు కరణం బలరాంతో జరిగిన ఘర్షణ విషయమై ఫిర్యాదు చేసేందుకు ఆయన ముఖ్యమంత్రిని నేరుగా కలుస్తానని ఉదయమే చెప్పిన విషయం తెలిసిందే. అందుకోసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి ఇప్పుడు బిజీగా ఉన్నారని, కలవడం కుదరదని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఆయనకు చెప్పారు. దాంతో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుందా అని గొట్టిపాటి రవికుమార్ ఎదురు చూస్తున్నారు. ఈరోజు కాకపోయినా రేపయినా చంద్రబాబును కలవాలని ఆయన భావిస్తున్నారు. బుధవారం నాడు తెలంగాణలో జరిగే టీడీపీ మహానాడుకు చంద్రబాబు హాజరు కానున్నారు. దాంతో అక్కడికైనా వెళ్లి కలవాలని గొట్టిపాటి అనుకుంటున్నారు. మంగళవారం ఉదయం జరిగిన ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక కార్యక్రమంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాంల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఒకరినొకరు తోసుకోవడంతో పాటు చొక్కాలు కూడా చించుకున్నారు. ఈ గొడవలో గొట్టిపాటి రవికుమార్ కింద పడిపోయారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిద్దరినీ విడదీశారు. బందోబస్తు మధ్య ఆయనను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. -
రక్తచరిత్ర
♦ కరణం, గొట్టిపాటి వర్గీయుల మధ్య హత్యారాజకీయాలు ♦ అద్దంకిలో దశాబ్ద కాలం తరువాత పురివిప్పిన పాతకక్షలు ♦ ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా విబేధాలు ♦ గొట్టిపాటి అధికార పార్టీలో చేరగానే పెచ్చరిల్లిన పాత కక్షలు ♦ వేమవరం ఘటనలో ఉలిక్కిపడిన అద్దంకి ♦ ప్రతీకార దాడులకు దారితీసే అవకాశం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, సీనియర్ నేత ఎమ్మెల్సీ కరణం బలరాంలను ఒకటి చేసి లబ్ది పొందాలనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నం వికటించింది. దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉన్న అద్దంకిలో హత్యారాజకీయాలకు తెరలేపింది. తాజాగా రెండు ప్రాణాలను బలితీసుకుంది. చంద్రాబాబు వైఖరివల్లే ప్రశాంతంగా ఉన్న అద్దంకిలో హత్యారాజకీయాలు మళ్లీ మొదలయ్యాయని, టీడీపీ కార్యకర్తలను హత్య చేసేందుకే ఎమ్మెల్యే గొట్టిపాటికి లైసెన్స్ ఇచ్చినట్లుగా ఉందని సాక్షాత్తు ఆ పార్టీ ఎమ్మెల్సీ కరణం బలరాం తీవ్ర ఆరోపణలు చేశారు. తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ హత్యలు మరిన్ని ప్రతీకార దాడులకు దారితీసే అవకాశం ఉందని పరిశీలకుల అంచనా వేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అద్దంకి నియోజకవర్గంలో హత్యారాజకీయాలు మళ్లీ మొదలయ్యాయి. దశాబ్దకాలం క్రితం కరణం బలరాం, గొట్టిపాటి కుటుంబాల మధ్య వర్గ విబేధాల నేపథ్యంలో పలు హత్యలు చోటు చేసుకున్నాయి. ఆ తరువాత చిన్నచిన్న ఘర్షణలు మినహా హత్యలు జరిగిన సందర్భాలు లేవు. ప్రస్తుత ఎమ్మెల్యే గొట్టిపాటి ఏడాది క్రితం అధికార పార్టీలో చేరడంతో మళ్లీ ఇప్పుడు అద్దంకి నియోజకవర్గంలో హత్యా రాజకీయాలకు తెరలేచింది. శుక్రవారం రాత్రి బల్లికురవ మండలం వేమవరంలో గొట్టిపాటి వర్గీయులు కరణం వర్గీయులపై కత్తులు, గొడ్డళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో కరణం వర్గీయులు గోరంట్ల అంజయ్య, ఎగినాటి రామకోటేశ్వరరావు మృత్యువాత పడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పథకం ప్రకారమే ఈ హత్యాకాండ జరిగినట్లు స్పష్టమౌతోంది. పాత కక్షల నేపధ్యంలోనే ఈ దారుణ హత్యాకాండ చోటు చేసుకుంది. కరణం బలరాంకు అత్యంత సన్నిహితుడైన గోరంట్ల అంజయ్యను హతమార్చడమే లక్ష్యంగా దాడి జరిగినట్లు తెలుస్తోంది. 1989లో ఇదే గ్రామంలో సాంబయ్య అనే వ్యక్తిని గొట్టిపాటి వర్గీయులు హత్య చేసినట్లు సమాచారం. ఆ నాటి దాడిలో అంజయ్య కత్తిపొట్లకు గురయ్యాడు. 20 రోజుల పాటు గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అప్పట్లో తప్పించుకున్న అంజయ్యను హతమార్చాలన్న లక్ష్యంతోనే మరోమారు దాడికి కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. కరణం వర్గీయులు పెళ్ళికి వెళ్ళి వస్తారన్న విషయం తెలుసుకొని గ్రామ పొలిమేరలోని స్పీడ్‌బ్రేకర్ వద్ద హతమార్చేందుకు రెక్కి సైతం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఓ యువకుడు కరణం వర్గీయులను పెళ్లి వరకు వెంబడించి వారు తిరుగు ప్రయాణమయ్యే సమయాన్ని ఎప్పటికప్పుడు గొట్టిపాటి వర్గీయులకు చేరవేసినట్లు తెలుస్తోంది. గొట్టిపాటి అధికార పార్టీలో చేరడంతో ... ఏడాది క్రితం ఎమ్మెల్యే గొట్టిపాటి అధికార టీడీపీలో చేరడంతో అద్దంకిలో మల్లీ హత్యారాజకీయాలు మొదలయ్యాయి. కరణం వ్యతిరేకించినా పట్టించుకోక ముఖ్యమంత్రి చంద్రబాబు గొట్టిపాటిని పార్టీలో చేర్చుకున్నారు. దీంతో గొట్టిపాటి వర్గీయులు కరణం వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. అధికారం కోసం ఇరువర్గాలు పోటీ పడడంతో విబేధాలు చిలికి చిలికి గాలి వానలా మారాయి. తామూ అధికార పార్టీలో ఉన్నామన్న భరోసాతో గొట్టిపాటి వర్గీయులు కరణం వర్గంతో ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యారు. నివురు గప్పిన నిప్పులా ఉన్న దశాబ్దాల వైరం ఒక్కసారిగా బయటకు వచ్చింది. ఇందులో బాగంగానే శుక్రవారం రాత్రి బల్లికురవ మండలం వేమవరంలో గొట్టిపాటి వర్గీయులు కరణం వర్గీయులపై దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. ఆ దాడిలో ఆరుగురికి తీవ్రగాయాలు కాగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. దళితుల భూములను కబ్జాచేసి గ్రానైట్ క్వారీ ఆక్రమించాడని దీనిని అడ్డుకోవడంతోనే గొట్టిపాటి తనవర్గీయులతో దాడి చేయించి తన వర్గీయుల హత్యకు కారణమయ్యాడని కరణం బలరాం విమర్శించారు. చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను హత్య చేసేందుకు గొట్టిపాటికి లైసన్స్ ఇచ్చినట్లే ఉందని కరణం తీవ్రస్థాయిలో ముఖ్యమంత్రి పైనే విమర్శనాస్త్రాలు సంధించారు. గొట్టిపాటి డబ్బు సంపాదించుకోవడానికి వచ్చాడని అదిచేసుకోని వెళ్లాలే తప్ప టీడీపీ కార్యకర్తలను హత్య చేయడమేమిటని కరణం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి గ్రామంలో జరిగిన గొడవల నేపథ్యంలో జరిగిన హత్యలేతప్ప వాటితో తనకు సంబంధం లేదని గొట్టిపాటి పేర్కొంటున్నారు. ఏదేమైనా కరణం వర్గీయులను గొట్టిపాటి వర్గీయులు హత్య చేశారన్నది యదార్ధం. దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉన్న అద్దంకిలో జరిగిన ఈఘటన మళ్లీ హత్యారాజకీయాలకు బీజం వేశాయి.ఇవి ఇంతటితో ఆగక ప్రతీకార హత్యలకు దారితీసే అవకాశం ఉందన్నది పరిశీలకుల అంచనా. శుక్రవారం నుంచే నియోజకవర్గం మొత్తంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గం అంతటా పెద్ద ఎత్తున పోలీసు పికెట్స్ ఏర్పాటు చేశారు. రెండు కుటుంబాల మధ్య వర్గ విబేదాలు.. గొట్టిపాటి పెదనాన్న, మాజీమంత్రి హనుమంతరావు కాలం నుంచే కరణం కుటుంబంతో విబేధాలు మొదలయ్యాయు. తొలుత ఇరు కుటుంబాల మధ్య సఖ్యత ఉన్నా ఆ తరువాత విబేధాలు పొడచూపాయి. 1985 ప్రాంతంలో కరణం మార్టూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా విభేదించిన హనుమంతరావు కాంగ్రెస్ అభ్యర్థిగా కరణం పై పోటీచేశారు. అక్కడి నుంచి విబేధాలు మొదలయ్యాయి. ఇవి పతాకస్థాయికి చేరడంతో 1993 ప్రాంతంలో హనుమంతరావు కుమారుడు కిషోర్ మరికొందరు హత్యకు గురయ్యారు. ఇందుకు కరణమే కారణమని గొట్టిపాటి కుటుంబం చెబుతోంది. ఇరు వర్గాల మధ్య గొడవలు పెరిగాయి. ఆ తరువాత 1994లో ఇరువురూ మరోమారు పోటీ చేశారు. కరణంపై గెలిచిన హనుమంతరావు మంత్రి అయ్యారు. 1999లో కరణం ఒంగోలు పార్లమెంట్ కు పోటీచేసి విజయం సాధించారు. 2004 లో అద్దంకి నుంచి కరణం ఎమ్మెల్యేగా గెలవగా 2009 లో కరణం బలరాం, గొట్టిపాటిలు, 2014లో గొట్టిపాటి, కరణం వెంకటేశ్‌లు పోటీపడ్డారు. దీంతో మరోమారు గొట్టిపాటి, కరణం కుటుంబాలు ప్రత్యక్ష పోరుకు దిగాయి. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. రాజకీయ విబేధాలు కటుంబ కక్షలకు దారితీశాయి. అయితే ఇరు వర్గాలమధ్య ఎంత వైరమున్నా దశాబ్దకాలంగా స్వల్ప ఘర్షణలు తప్ప అద్దంకి రాజకీయాల్లో హత్యలు లేవు. కరణం టీడీపీలో కొనసాగగా గొట్టిపాటి కాంగ్రెస్ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తీవ్ర పరిణామాలు తప్పవు.. అక్రమ సంపాదన కోసం టీడీపీలో చేరిన వాడివి ఆ పని మాత్రమే చూసుకోవాలి. ఎంత తింటావో అంత తిను. దానికి పార్టీయే లైసెన్స్ ఇచ్చినప్పుడు ఎవరూ కాదనరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేళ్లు ఇబ్బంది పెట్టావ్. ఇప్పుడు ఏకంగా కార్యకర్తలనే చంపిస్తున్నావు. తీరు మారకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు. ముఖ్యమంత్రి ప్రత్యక్ష జోక్యం చేసుకుని రవి అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే పార్టీ మనుగడ అసాధ్యం. హత్యోదంతంపై ఉదాశీనంగా వ్యవహరిస్తే కార్యకర్తలను పార్టీ అ«ధిష్టానమే చంపుతున్నట్లుగా భావించాల్సి వస్తుంది. – ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి ఏనాడూ హత్యలను ప్రోత్సహించలేదు నా రాజకీయ జీవితంలో హత్యలను ఏనాడూ ప్రాత్సహించలేదు. గ్రామాల్లో ఏవో చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయని తెలుసు గానీ.. ఇలా హత్యలకు దారితీసేంత కక్షలున్నాయని మాత్రం తెలియదు. నిజాలు తెలుసుకోకుండా తనపై బలరాం నిందలు మోపడం సరికాదు. సీఎంను కలిసి నిజాలు వెల్లడిస్తా. – ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ -
హత్యా రాజకీయాలకు నేను వ్యతిరేకం
-
హత్యా రాజకీయాలకు నేను వ్యతిరేకం
ఒంగోలు: హత్యా రాజకీయాలకు తాను వ్యతిరేకమని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. కరణం బలరాం తనపై ఆరోపణలు చేయడం సరికాదని ఆయన శనివారమిక్కడ అన్నారు. అందరినీ కలుపుకొని వెళ్లాలనే తాను ప్రయత్నిస్తున్నానని, కిందస్థాయిలో ఇన్ని గొడవులు ఉంటాయని తనకు తెలియదన్నారు. పార్టీపరంగా... వ్యక్తిగతంగా నష్టపోయినా, తాను హత్యా రాజకీయాలకు వ్యతిరేకమన్నారు. జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టితికి తీసుకు వెళతానని ఆయన తెలిపారు. -
రవికుమార్‌కు దమ్ముంటే మాతో తలపడాలి
గుంటూరు : టీడీపీలోకి కొత్తగా వచ్చినవారి వల్లే గొడవలు జరుగుతున్నాయని కరణం బలరాం కుమారుడు వెంకటేష్ అన్నారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గీయుల దాడిలో గాయపడి, చిలకలూరిపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా కరణం వెంకటేష్ మాట్లాడుతూ.. గొట్టిపాటి రవికుమార్ ఆగడాలు పెరిగిపోయాయని అన్నారు. విచక్షణారహితంగా అమాయకులను వెంటాడి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే గొట్టిపాటి రవికుమార్ తమతో తలపడాలని, అంతేకానీ టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. తన స్వలాభం కోసమే రవికుమార్ అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అందుకు అడ్డొచ్చినవారిని చంపేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రికి మాట రాకూడదనే తాము ఓపిక పట్టామని అన్నారు. ఇప్పటికైనా గొట్టిపాటి రవికుమార్ అందర్ని కలుపుకుపోవాలని సూచించారు. స్వలాభం కోసమే గొట్టిపాటి టీడీపీలో చేరారన్నారు. చనిపోయినవారంతా 30 ఏళ్లుగా పార్టీ జెండాలు మోసారని కరణం వెంకటేశ్ తెలిపారు. కేవలం రవి వల్లే అద్దంకిలో అల్లర్లు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఆలోచన చేయాలని అన్నారు. టీడీపీ కార్యకర్తలకు న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యమన్నారు. కాగా ఎమ్మెల్సీ కరణం బలరాం, ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య వ్యక్తిగత కక్షలు భగ్గుమన్న విషయం తెలిసిందే. బల్లికురవ మండలం వేమవరంలో ఓ వివాహానికి వెళ్లి వస్తున్న బలరాం వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులు శుక్రవారం రాత్రి కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారిలో కరణం వర్గీయులు ఇద్దరు చనిపోయారు. -
ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో గొట్టిపాటి చిచ్చుపెట్టాడు
- వేమవరం జంట హత్యలపై ఎమ్మెల్సీ కరణం బలరాం తీవ్ర వ్యాఖ్యలు - డబ్బు సంపాదనకే రవికుమార్ టీడీపీలోకి వచ్చాడు - ఆ దొంగసొమ్ము సంగతి సీఎం చంద్రబాబే చెప్పాలి - వేరేపార్టీ నుంచి వచ్చి మాపై పెత్తనం చేస్తే సహించాలా? హైదరాబాద్: అధికార తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నేతలకు, ఫిరాయింపుదారులకు మధ్య తలెత్తిన వర్గపోరులో రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వేమవరంలో వివాహ వేడుకకు హాజరై వస్తోన్న వారిపై ప్రత్యర్థులు దాడిచేసి, ఇద్దరిని కిరాతకంగా చంపేశారు. మృతులు గోరంట్ల అంజయ్య, యోగినాటి రామకోటేశ్వరరావులు ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గీయులుకాగా, దాడి చేసింది అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గీయులని సమాచారం. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకున్న ఈ ఘటనతో రాష్ట్రం యావత్తూ ఒక్కసారిగా ఒలిక్కిపడింది. తీవ్ర ఉద్రికత్తల నేపథ్యంలో వేమవరం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ త్రివిక్రమ్ వర్మ ప్రకటించారు. (టీడీపీ వర్గపోరు: ఇద్దరి దారుణ హత్య) కాగా, ఈ హత్యాకాండపై టీడీపీ ఎమ్మెల్సీ కరణం బలరాం 'సాక్షి'తో మాట్లాడుతూ పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్.. డబ్బు సంపాదన కోసమే టీడీపీలోకి చేరారని కరణం ఆరోపించారు. "ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో గొట్టిపాటి చిచ్చుపెట్టాడు. మేం సంయమనం పాటిస్తున్నా రెచ్చగొడుతూనేఉన్నాడు. అసలు అతను(గొట్టిపాటి) టీడీపీలో చేరిందే సంపాదించుకోవడానికి. గ్రానైట్ క్వారీలకు సంబంధించి ప్రభుత్వానికి కట్టాల్సిన రూ.230 కోట్లు ఎగ్గొట్టాడు. ఆ దొంగసొమ్ము సంగతేంటో సీఎం చంద్రబాబు నాయుడే చెప్పాలి. సరే, పార్టీలోకి వచ్చాడు, ఆయన సంపాదన సంగతేదో చూసుకోకుండా మాలాంటి సీనియర్లపట్ల అడ్డగోలుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకుంటామా? నేనే కాదు, ఏ కార్యకర్తా ఇలాంటి వ్యవహారాన్ని జీర్ణించుకునే పరిస్థితుల్లో లేరు' అని కరణం తీవ్రస్వరంతో చెప్పారు. వైరివర్గం దాడిలో మృతి చెందిన గోరంట్ల అంజయ్య, యోగినాటి రామకోటేశ్వరరావుల మృతదేహాలను శనివారం ఉదయం కరణం బలరాం సందర్శించారు. గాయాలతో చికిత్స పొందుతున్న నలుగురిని పరామర్శించారు. ఈ హత్యాకాండపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో గొట్టిపాటి చిచ్చుపెట్టాడు
-
తమ్ముళ్ల తగువు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ పాతనేతలు, ఫిరాయింపు ఎమ్మెల్యేల మధ్య తగువు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ముఖ్యంగా అద్దంకి వ్యవహారం ఆ పార్టీ అధిష్టానానికి కొరకరాని కొయ్యగా మారింది. పాత నేత కరణం బలరాం ఇటు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాలను సర్దుబాటు చేయలేక మంత్రులు చేతులెత్తగా ముఖ్యమంత్రి సైతం ఎటూ తేల్చుకోలేకపోవడంతో అద్దంకిలో అధికారపార్టీ ఆధిపత్యపోరు రోజురోజుకూ ముదురుతోంది. వారి గొడవలు తాజాగా జన్మభూమి–మా ఊరు కార్యక్రమానికి తలనొప్పిగా పరిణమించాయి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జనచైతన్య యాత్రలు నిర్వహించిన టీడీపీ ఆ కార్యక్రమ బాధ్యతలను శాసనసభ్యులకు అప్పగించింది. ప్రకాశం జిల్లాలో నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉండటంతో ఆ పార్టీలో వర్గవిభేదాలు తలెత్తాయి. పాత, కొత్త నేతల మధ్య ఏ మాత్రం పొసగకపోవడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతనివ్వడాన్ని అద్దంకికి చెందిన సీనియర్ నేత కరణం బలరాం, కరణం వెంకటేశ్, గిద్దలూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివిశివరాం, చీరాల టీడీపీ నేత పోతుల సునీత వ్యతిరేకించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బహిరంగ విమర్శలకు దిగారు. నచ్చచెప్పినా వినకపోవడంతో ఆ తరువాత అధిష్టానం బెదిరింపు ధోరణికి దిగింది. దీంతో మెత్తబడిన దివి శివరాం ఎమ్మెల్యే పోతుల రామారావుతో సర్దుబాటు చేసుకున్నారు. పోతుల సునీత ఎమ్మెల్యే ఆమంచితో రాజీపడలేక మిన్నకుండిపోయారు. = గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నారాంబాబు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డితో సయోధ్యకు ససేమిరా అన్నారు. పార్టీ అధిష్టానం గట్టిగా చెప్పినా ఆయన వినలేదు. అలాగని పార్టీని వీడక ఎమ్మెల్యే వ్యతిరేక వైఖరినే కొనసాగిస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో ఇరువర్గాల మధ్య తరచూ గొడవలు చెలరేగుతున్నాయి. భౌతికదాడులకు దిగిన సంఘటనలూ ఉన్నాయి. = ఇక అద్దంకిలో ఎమ్మెల్యే జనచైతన్య యాత్రలు నిర్వహించేందుకు కరణం బలరాం, కరణం వెంకటేష్‌లు ససేమిరా అన్నారు. ఎమ్మెల్యే యాత్ర నిర్వహిస్తే తానూ యాత్రకు సిద్ధమని అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. దీంతో ఎటూ తేల్చుకోలేని అధిష్టానం అద్దంకి నియోజకవర్గంలో జనచైతన్యయాత్రలు నిలిపివేసింది. ఆ తరువాత అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గొట్టిపాటికి అధికారుల బదిలీల్లో కొంత ప్రాధాన్యతనిచ్చి సర్దుబాటు చేసింది. తాజాగా ప్రభుత్వం జన్మభూమి – మా ఊరు పేరుతో జనంలోకి వెళ్లే కార్యక్రమానికి సిద్ధమైంది. స్థానిక శాసనసభ్యుల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఆ బాధ్యతను ఎమ్మెల్యే ముత్తుములకు అప్పగించిన అధిష్టానం అద్దంకి విషయంలో ఆదివారం రాత్రి వరకూ స్పష్టత ఇవ్వలేదు. ఎమ్మెల్యే గొట్టిపాటితో కలిసి జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో పాల్గొనేది లేదని, తాను ప్రత్యేకంగా జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తానని కరణం ఇప్పటికే అధిష్టానానికి తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో అధిష్టానం కరణంను సర్దుబాటు చేసే బాధ్యతను జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా ఇన్చార్జి మంత్రి రావెల కిశోర్‌బాబులతో పాటు మరికొందరు నేతలకు అప్పగించినట్లు సమాచారం. దీంతో మంత్రి శిద్దా రాఘవరావు తదితరులు ఆదివారం రాత్రి వరకు కరణంతో చర్చలు జరిపారు. ఇప్పటికే తాను ఎంతో సహనంతో ఉన్నానని, దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కరణం వాదించినట్లు తెలుస్తోంది. కొందరు అధికారులను సైతం నిర్దాక్షిణ్యంగా బదిలీలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం వాస్తవాలు గ్రహించాలని లేకపోతే అవసరమైతే అమీతుమీకి సిద్ధమని కరణం హెచ్చరించినట్లు తెలుస్తోంది. కరణం వాదనను మంత్రితో పాటు మిగిలిన నేతలు పార్టీ అధిష్టానానికి చేరవేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధిష్టానం ఏం చెబుతుందన్న దానిపై కరణం వైఖరి ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో కరణం సోమవారం అద్దంకిలో ప్రత్యేకంగా జన్మభూమి – మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తారా... లేకపోతే ఎమ్మెల్యే గొట్టిపాటితో కార్యక్రమంలో పాల్గొంటారా.. అన్నది వేచి చూడాల్సిందే...! -
గొట్టిపాటి, కరణం వర్గాల మధ్య 'పింఛన్' గొడవ
ఒంగోలు : టీడీపీకి చెందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాం మధ్య వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. బుధవారం ఉదయం బల్లికురవలోని ఎండీవో కార్యాలయం వద్ద కొత్తగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం అక్కడే ఉన్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి అక్కడికి చేరుకున్నారు. తమ వారికి పింఛన్లు ఇవ్వటం లేదంటూ గొట్టిపాటి వర్గీయులు ఆందోళనకు దిగారు. ఆ క్రమంలో కరణం బలరాం వర్గీయులతో వారు వాగ్వివాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అధికారుల తీరును సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని రవికుమార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
పోలీస్ శాఖతో బంతాట!
సీఐల బదిలీల్లో ఆధిపత్యం చాటుతున్న టీడీపీ నేతలు కరణం ఒత్తిడితో మళ్లీ ఆగిన అద్దంకి సీఐ బదిలీ మిగిలిన బదిలీలకు అడ్డుకట్ట.. మరోసారి భంగపడ్డ గొట్టిపాటి పోలీస్‌శాఖతో అధికార పార్టీ బంతాట ఆడుతోంది. బదిలీల్లో తలదూరుస్తూ పట్టు చూపుతోంది. ప్రతిభ, సమర్థతను పక్కకు నెట్టి ఆధిపత్యాన్ని నిరూపించుకుంటోంది. తాజాగా మంగళవారం జరిగిన సర్కిల్ ఇన్స్పెక్టర్ల (సీఐ) బదిలీలకు చెక్ పెట్టింది. బదిలీలు జరిగిన ప్రతిసారీ అధికార పార్టీ ఇదే దందాను అవలంబిస్తూ పోలీస్‌శాఖ ప్రతిష్టను దిగజారుస్తోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టీడీపీ సీనియర్ నేత కరణం బలరామకృష్ణమూర్తి, కొత్తగా పార్టీలో చేరిన కొత్త నేత గొట్టిపాటి రవికుమార్‌ల అధిపత్యపోరులో కరణం మరోసారి పైచేయి సాధించారు. 15 రోజుల్లో అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్‌ను ఎమ్మెల్యే గొట్టిపాటి రెండోసారి బదిలీ చేయించగా రాత్రికి రాత్రే బదిలీలు నిలిపివేయించి కరణం తన సత్తా చాటారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు లోకేష్ ద్వారా జిల్లాలోని ఆరుగురు సీఐలను మంగళవారం బదిలీ చేయించుకోగా, పాత నేత కరణం ఏకంగా ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీలపైనే ఒత్తిడి తెచ్చి బుధవారం ఉదయానికి బదిలీలను నిలిపివేయించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న కరణం వ్యతిరేక వర్గీయులను కూడగట్టుకొని పోరాడినా గొట్టిపాటికి భంగపాటు తప్పలేదు. కొత్త ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి, చినబాబు లోకేష్‌లు ప్రాధాన్యతనిస్తున్నారని జోరుగా ప్రచారం సాగినా కరణం విషయంలో అది వర్కవుట్ కాలేదు. కొత్త ఎమ్మెల్యేలు సీఐలను బదిలీ చేయించి పట్టుమని 12 గంటలు కూడా గడవకముందే బదిలీలు నిలిపివేయించి కరణం చక్రం తిప్పటం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జరుగుతున్న పరిణామాలు చూసి ఫిరాయింపు ఎమ్మెల్యేలు జుట్టు పీక్కుంటున్నారు. సీఎం చైనా పర్యటనలో ఉన్నా.. వదలక.. ఈ నెల 13వ తేదీన కరణం అనుకూలుడిగా ఉన్న అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్‌ను ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పట్టుపట్టి బదిలీ చేయించారు. ఆయన స్థానంలో గుంటూరు వీఆర్‌లో ఉన్న హైమారావును బదిలీ చేయించాడు. ఉత్తర్వులు వెలువడిన కొద్ది సేపటికే చక్రం తిప్పిన సీఐ ప్రసాద్ బదిలీని నిలిపివేయించారు. రవికుమార్ చినబాబు లోకేష్ వద్ద మొర పెట్టుకున్న ప్రయోజనం లేకపోయింది. మంగళవారం ఫిరాయింపు ఎమ్మెల్యేలు లోకేష్‌పై ఒత్తిడి తెచ్చి అటాచ్మెంట్ మాటున జిల్లాలోని ఆరుగురు సీఐలను బదిలీ చేయించుకున్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రికి ఉత్తర్వులందాయి. విషయం తెలుసుకున్న కరణం అంతే వేగంగా పావులు కదిపారు. ఏకంగా చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రితో పాటు డీజీపీపై ఒత్తిడి తెచ్చారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో సీఐని బదిలీ చేస్తారా... అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గుంటూరు రేంజ్ డీఐజీ ఇచ్చిన సీఐల అటాచ్మెంట్ బదిలీల ఉత్తర్వులను రాష్ట్ర డీజీపీ రద్దు చేసినట్లు సమాచారం. అనంతరం అటాచ్మెంట్ ఉత్తర్వులను రద్దు చేశామని, ఎక్కడి సీఐలను అక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు రేంజ్ డీఐజీకి డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు పంపినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అన్ని బదిలీలను నిలపడం సరికాదంటూ పాత ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, కదిరి బాబూరావు, ఆమంచి కృష్ణమోహన్‌లు లోకేష్‌కు విన్నవించినట్లు సమాచారం. స్పందించిన లోకేష్ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిధిలోని అద్దంకి, గిద్దలూరు, కందుకూరు సీఐ బదిలీలను నిలిపి వేయాలని, మిగిలిన బదిలీలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం. -
కరణం బలరాంకు భంగపాటు !
ఎట్టకేలకు అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్ బదిలీ అద్దంకి కొత్త సీఐగా హైమారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ ఒంగోలు: టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం ఇటీవల పార్టీలో చేరిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ల అధిపత్య పోరులో మంగళవారం గొట్టిపాటి రవికుమార్ పైచేయి సాధించారు. మొదట అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్ వ్యవహారంలో, ఆ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టు ఎస్ఈ రమణమూర్తి బదిలీ వ్యవహారంలోనూ మాట నెగ్గించుకొని పైచేయి సాధించినా కరణం బలరాంను పట్టుమని 10 రోజులు తిరగకుండానే ఎట్టకేలకు గొట్టిపాటి దెబ్బ కొట్టి కరణంపై పైచేయి సాధించారు. అద్దంకి సీఐ వ్యవహారంలో కరణంకు భంగపాటు తప్పలేదు. ఈ నెల 13వ తేదీన కరణం అనుకూలుడిగా ముద్ర వేసుకున్న అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్‌ను కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పట్టుపట్టి బదిలీ చేయించారు. ఆయన స్థానంలో గుంటూరు వీఆర్‌లో ఉన్న హైమారావును తెచుకున్నారు. ఈ మేరకు డీఐజీ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అయితే విషయం తెలుసుకున్న కరణం హుటాహుటిన పావులు కదిపి ఐజీతో పాటు ఏకంగా డీజీపీ పైనే ఒత్తిడి తెచ్చారు. అదే రోజు సాయంత్రానికి సీఐ బేతపూడి ప్రసాద్ బదిలీని నిలిపేయించారు. దీంతో ఇరువర్గాల మధ్య వర్గ విభేదాలు పతాక స్థాయికి చేరాయి. తాను పార్టీలో చేరేటప్పుడే సీఐ బదిలీ ప్రధాన డిమాండ్‌గా చెప్పానని, ఇప్పుడు అది కూడా చేయకపోతే తాను పార్టీలో ఉండటం ఎందుకంటూ గొట్టిపాటి రవికుమార్ చినబాబు లోకేష్ వద్ద వాపోయినట్లు ప్రచారం జరిగింది. మరో వైపు తన మాట నెగ్గకపోతే అమీతుమీకి సిద్ధమని కరణం సైతం అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా మంగళవారం జరిగిన సీఐల బదిలీల్లో అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో గతంలో గొట్టిపాటి ప్రతిపాదించిన హైమారావునే నియమిస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. దీంతో ముఖ్యమంత్రి కరణంకు కాకుండా గొట్టిపాటి రవికుమార్‌కే ప్రాధాన్యతనిచ్చినట్లు తెలుస్తోంది. సీఐ బదిలీ వ్యవహారంలో ఎట్టకేలకు కరణంకు భంగపాటు తప్పలేదు. కరణంతో వర్గపోరులో ఆదిలో గొట్టిపాటికి భంగపాటు ఎదురైనా చివరకు కరణంను దెబ్బతీసి ఎట్టకేలకు పైచేయి సాధించారు. -
లోకేష్‌కు గొట్టిపాటి, ఆమంచి ఫిర్యాదు
► టీడీపీలో ముదిరిన వర్గపోరు ► కొత్త నేతలను అడ్డుకుంటున్న పాత నేతలు ► చీరాల ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోతుల సునీత, ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి వర్గాలు ► చీరాలలో రెండు మహానాడులు ► గొట్టిపాటిదీ అదే పరిస్థితి ఒంగోలు: అధికార పార్టీలో కొత్తగా చేరిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లకు ఆ పార్టీ పాత నేతల నుంచి అడుగడుగునా అడ్డంకులు తప్పడం లేదు. వారి రాకను పాత నేతలు జీర్ణించుకోలేకున్నారు. అడుగడుగునా అవమానకర రీతిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాత నేతల వ్యవహారం ఎప్పటికప్పుడు పత్రికలకు ఎక్కుతుండటంతో కొత్త నేతలకు ఇది తల కొట్టేసినట్లవుతోంది. వారితో పాటు వారి అనుచర గణం, దిగువ శ్రేణి కార్యకర్తలు ఇది జీర్ణించుకోలేకున్నారు. వారిలో అంతర్మథనం మొదలైంది. ఆదివారం ఒంగోలు మినీమహానాడులో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పాత నేత కరణం బలరాం వర్గాల గొడవ కొత్త నేతలకు తలకొట్టేసినట్లయింది. పార్టీలోకి తెచ్చుకొని అవమానిస్తారా.. అంటూ గొట్టిపాటి, ఆమంచిలు చినబాబు లోకేష్‌కు మహానాడు అనంతరం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సమావేశంలో కరణం తీరును వారు లోకేష్‌కు వివరించినట్లు తెలుస్తోంది. కొంత సహనం వహించాలని, అన్నీ సర్దుబాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్‌లు ఎన్ని హామీలిచ్చినా క్షేత్రస్థాయిలో పాత నేతలకు, కొత్త నేతలకు మధ్య పొంతన కుదిరే పరిస్థితి లేదు. చీరాల టీడీపీలో మూడు ముక్కలాట కొత్తగా అధికార పార్టీలో చేరిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆమంచిపై పోటీ చేసిన అధికార పార్టీ అభ్యర్థి సునీత, మాజీ మంత్రి పాలేటి రామారావులు కలిసి ఆమంచిని వ్యతిరేకిస్తున్నారు. బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి వర్గం సైతం ఇదే బాటలో నడుస్తోంది. ఆమంచిపై అడుగడుగునా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన పార్టీలో చేరతారనగానే సునీత వర్గం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. జిల్లాలో ఆమంచి చేరికను పదే పదే అడ్డుకున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఏకంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లోనే నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటి నుంచి వారికి పొసగటం లేదు. తాజాగా ఈ నెల 20న ఆమంచి చీరాలలో మినీమహానాడు నిర్వహించగా పోతుల సునీత వర్గం హాజరుకాలేదు. ఆదివారం సాయంత్రం సునీత వర్గం చీరాలలో మరో మినీమహానాడు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆమంచి వర్గం హాజరుకాలేదు. మొత్తంగా చీరాల అధికార పార్టీ మూడు వర్గాలుగా చీలిపోయి అడుగడుగునా ఘర్షణలకు దిగుతున్నారు. పతాక స్థాయికి గొట్టిపాటి, కరణం గొడవలు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ రాకను సీనియర్‌నేత కరణం బలరాం మొదట్లోనే వ్యతిరేకించారు. ఈ విషయం ముఖ్యమంత్రి ఎదుటే స్పష్టం చేశారు. అయినా ముఖ్యమంత్రి గొట్టిపాటిని పార్టీలో చేర్చుకున్నారు. కరణం మాత్రం గొట్టిపాటిపై బహిరంగ విమర్శలకు దిగారు. సాక్షాత్తు మంత్రులు, రాష్ట్ర పరిశీలకులు, జిల్లా నేతలందరి ముందే ప్యాకేజీల కోసమే వచ్చినోళ్లు... అదే చూసుకోవాలని.. మాపై స్వారీ చేస్తే బంగాళాఖాతంలో వేస్తామంటూ గొట్టిపాటికి తీవ్ర హెచ్చరికలు చేశారు. అమితుమీకి సిద్ధమైన కరణం గొట్టిపాటి విషయంలో కరణం వర్గం అమితుమీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అవసరమైతే ముఖ్యమంత్రితోనే తేల్చుకోవాలని వారు ఉన్నట్లు సమాచారం. తెగే దాకా లాగితే కరణంతో తలబొప్పి కట్టడం ఖాయమని ఇదే జరిగితే గొట్టిపాటిని తెచ్చుకొని కూడా లాభం ఉండదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. దీంతోనే ముఖ్యమంత్రి, లోకేష్ అచితూచీ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత వరకు ఇరువర్గాలను సర్దుబాటు చేసేందుకు బాబు ప్రయత్నాలను సాగిస్తున్నట్లు సమాచారం. పార్టీలో చేరినా కలుపుకొని పోయేవారు లేకపోవడం మంత్రులు, జిల్లా నేతలు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో పాత నేతలు మరింత రెచ్చిపోతూ అడుగగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. పైగా బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా పార్టీలో చేరిన గొట్టిపాటి రవికుమార్, ఆమంచి కృష్ణమోహన్ తదితర నేతల్లో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది. బుద్ధి లేక వచ్చామంటూ... ఇద్దరు ఎమ్మెల్యేలు మదనపడుతున్నట్లు సమాచారం. -
మినీ మహానాడులో ఘర్షణ
ఒంగోలు: ప్రకాశం జిల్లా తెలుగుదేశం నేతలు తలపెట్టిన మినీ మహానాడులో శనివారం ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం వర్గీయులు, ఇటీవల వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరిన గొట్టిపాటి రవికుమార్ వర్గం బాహాబాహీకి దిగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. రవి వర్గాన్ని తెలుగుదేశంలో చేర్చుకోవడాన్ని ముందు నుంచే వ్యతిరేకిస్తున్న బలరాం వర్గీయులు ఒకవైపు, ఎమ్మెల్యే హోదాలో ఉన్న రవి వర్గం మరోవైపు తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నించడంతో గొడవ ప్రారంభమైనట్టు సమాచారం. -
వైఎస్ జగన్ ఉదయించే సూర్యుడు: ఉప్పులేటి
విజయవాడ : తాను టీడీపీలో చేరతానంటు వస్తున్న వార్తలు అవాస్తవమని ఉప్పులేటి కల్పన స్పష్టం చేశారు. ఆమె గురువారమిక్కడ మాట్లాడుతూ తన చివరి శ్వాస వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ఆమె తెలిపారు. 'చంద్రబాబు అస్తమించే సూర్యుడు.. జగన్ ఉదయించే సూర్యుడు. భవిష్యత్ కావాలనుకునేవారు వైఎస్ఆర్ సీపీని వీడరు' అని ఉప్పులేటి కల్పన అన్నారు. చివరి వరకూ జగన్‌తోనే: ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రకాశం జిల్లాలో తాము ఎవరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడటం లేదని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమన్నారు. వైఎస్ జగన్ వల్లే తాము గెలిచామని, చివర వరకూ జగన్‌తోనే ఉంటామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ ఖాళీ అయిన విషయాన్ని దృష్టి మల్లించడానికే టీడీపీ నేతలు మాపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. నాపై దుష్ప్రచారం: ఎమ్మెల్యే ముత్యాలనాయుడు తెలుగుదేశం పార్టీలో చేరతానంటు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విశాఖ జిల్లా మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ పార్టీ మారేంత నీతిమాలిన రాజకీయాలు చేయనని ఆయన తెలిపారు. చివరివరకూ వైఎస్ జగన్‌తోనే ఉంటానని ముత్యాల నాయుడు స్పష్టం చేశారు. -
పదే పదే మామీదే దాడులు
-
పదే పదే మామీదే దాడులు
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు దృష్టికి ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు.ఈ దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని డీజీపీని కోరారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని డీజీపీకి వివరించారు. అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. అన్ని విషయాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. తన కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేకనే కరణం బలరాం, కరణం వెంకటేష్‌లు తన పై దాడిచేశారని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. టీడీపీ అధికారంలోకొచ్చినప్పటి నుంచి తనపై మూడు సార్లు దాడి జరిగిందని, తన అన్న గొట్టిపాటి కిషోర్‌ను కూడా రాజకీయ హత్య చేశారని, తనకు భద్రత పెంచాలని డీజీపీని కోరానని రవికుమార్ తెలిపారు. మరోవైపు.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు లోటస్ పాండ్‌లో కలిశారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్ వద్ద టీడీపీ వర్గీయులు చేసిన దాడి వివరాలను ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ .. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి వివరించారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గొట్టిపాటిపై దాడి
రాళ్ల దాడిలో రవికుమార్ కారు పూర్తిగా ధ్వంసం రవి అనుచరుడికి తీవ్రగాయాలు కలెక్టరేట్ ఎదుట బైఠాయింపు పరామర్శించిన వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా కలెక్టరేట్ సాక్షిగా అద్దంకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై తెలుగుదేశం పార్టీకి చెందిన కరణం బలరామ్, ఆయన కుమారుడు కరణం వెంకటేష్, వారి అనుచరులు దాడికి దిగారు. ఈ దాడిలో రవి అనుచరుడు ఒకరు తీవ్రంగా గాయపడగా, డ్రైవర్, గన్‌మెన్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. ఎమ్మెల్యే కారును టీడీపీ వర్గీయులు పూర్తిగా ధ్వంసం చేశారు. వారి దౌర్జన్యాలను, దాడులను నిరసిస్తూ గొట్టిపాటి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. వివరాల్లోకి వెళ్తే.. గుండ్లకమ్మ రిజర్వాయర్ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు సంబంధిత సమస్యపై ఇటీవలి జిల్లా పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ నిలదీశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ విజయకుమార్ నిర్వాసితుల అంశంపై చర్చించేందుకు కలెక్టరేట్లో సోమవారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేశారు. రవాణా శాఖా మంత్రి శిద్ధా రాఘవరావు అధ్యక్షత వహించారు. మాజీ ఎంపీ కరణం బలరామ్, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ కూడా తమ అనుచరులతో సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం పూర్తయి బయటకు వచ్చే సమయంలో ఎమ్మెల్యే గొట్టిపాటిని వెళ్లనీయకుండా కరణం వర్గీయులు అడ్డుగా నిలబడ్డారు. గన్‌మెన్ వారిని తప్పుకోమని కోరగా అతనిపై దాడికి ప్రయత్నించారు. ఈలోగా అక్కడికి వచ్చిన కరణం బలరామ్, ఆయన కుమారుడు వెంకటేష్‌లు అనుచరులను రెచ్చగొట్టడంతో వారు రాళ్లతో దాడికి దిగారు. ఎమ్మెల్యే కారుకు తమ వాహనాలను అడ్డంపెట్టి దాన్ని ధ్వంసం చేశారు. డ్రైవర్, గన్‌మెన్, పీఏలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఎమ్మెల్యేపై దాడిని అక్కడున్న రైతులు అడ్డుకున్నారు. దాడి తర్వాత కరణం వర్గీయులు అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ దాడిని నిరసిస్తూ ఎమ్మెల్యే గొట్టిపాటి కలెక్టరేట్ ముందు నిరసనకు దిగారు. రవిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించి, దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోన్లో రవిని పరామర్శించారు. నన్ను చంపడమే లక్ష్యంగా దాడి... తనను అడ్డు తొలగించుకోవడమే లక్ష్యంగా తనపై దాడికి దిగారని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. రెండు నెలల కాలంలోనే తనపై మూడుసార్లు దాడికి ప్రయత్నించినట్లు తెలిపారు.గతంలో తన అన్న గొట్టిపాటి కిశోర్‌ను హత్య చేశారని, ఇప్పుడు వరుసగా మూడుసార్లు తాను గెలవడంతో తనను అంతం చేసేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని విర్రవీగుతున్నారని అన్నారు. ఏఎస్పీ రామానాయక్, డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, ఆర్డీవో కె.శ్రీనివాసరావు ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. ‘మీరే దగ్గరుండి చంపిస్తారా..?’ అంటూ ఈ సందర్భంగా రవికుమార్ పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు మద్దతుగా వైఎస్సార్సీపీ పర్చూరు ఇన్చార్జి గొట్టిపాటి భరత్ సహా పలువురు నేతలు బైఠాయింపులో పాల్గొన్నారు. కరణం బలరామ్, వెంకటేష్‌లపై కేసు నమోదు గొట్టిపాటి రవికుమార్‌పై దాడికి పాల్పడిన మాజీ ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన తనయుడు కరణం వెంకటేష్‌లతో పాటు మరో 23 మందిపై ఒంగోలు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడిలో గాయపడిన మార్టూరు మండలం కోనంకి గ్రామానికి చెందిన మందపాటి సురేష్ ఫిర్యాదు మేరకు సెక్షన్ 147, 324, 427, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
ఎమ్మెల్యే గొట్టిపాటితో మాట్లాడిన వైఎస్ జగన్
ఒంగోలు: టీడీపీ నేత కరణం బలరాం వర్గీయుల దాడికి గురైన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం రాత్రి ఫోన్ లో మాట్లాడారు. దాడి జరిగిన తీరును ఎమ్మెల్యేను అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కూడా ఢిల్లీ నుంచి రవికుమార్ తో ఫోన్ లో మాట్లాడారు. టీడీపీ వర్గీయుల దాడిని ఖండించారు. ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఆవరణలోనే ఎమ్మెల్యే రవికుమార్ పై కరణం వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా ఎమ్మెల్యే కారు అద్దాలను కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. తనపై దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలంటూ రవికుమార్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. -
ఎమ్మెల్యేపై కరణం బలరాం వర్గీయుల దాడి
ప్రకాశం జిల్లా ఒంగోలులో అద్దంకి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నాయకుడు గొట్టిపాటి రవికుమార్‌పై టీడీపీ నేత కరణం బలరాం వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే రవికుమార్‌కు చెందిన కారు అద్దాలను ధ్వంసం చేశారు. కలెక్టరేట్ ఆవరణలోనే బలరాం వర్గీయులు ఈ దాడికి పాల్పడ్డారు. దాంతో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గురించిన సమీక్ష సమావేశంలో ఇరు వర్గాలు పాల్గొన్నాయి. సమీక్ష ముగిసిన అనంతరం బయటకు వస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌పై కరణం వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. -
సమస్యలపై గళం
ముందు నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నాం: అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ గుండ్లకమ్మ ముంపు గ్రామాలకు సంబంధించి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోశయ్య హయాంలో దేవుడి మాన్యం భూముల్లో పట్టాలు ఇచ్చేందుకు అంగీకరించకపోయినా జీవో ఇప్పించాం. పట్టాలను అర్హులైన వారికి త్వరగా ఇవ్వాలని సూచించాం. కానీ అధికారులు జాప్యం చేస్తున్నారు. మొత్తం 48 మంది వద్దనుంచి 24 లక్షలు వసూలు చేసినట్లు పేర్లతో సైతం మా వద్దకు బాధితులు వచ్చారు. తక్షణమే ధేనువుకొండ ప్రాంత నిర్వాసితులకు పట్టాలు పంపిణీ చేయాలి. అక్రమంగా డబ్బులు దండుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సామాజిక కార్యకర్తలు నియంతల్లా వ్యవహరిస్తున్నారు: వై.పాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాలను లబ్ధిదారులకు అందించేందుకు అన్ని జిల్లాలకంటే మన జిల్లాలోనే పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రూపొందించిన ప్రణాళిక బాగుంది. కానీ గ్రామ కమిటీల పేరుతో సామాజిక కార్యకర్తలు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అధికారులను సైతం శాసిస్తున్నారు. దీనివల్ల సామాన్యమైన పేదవారికి లబ్ధి చేకూరకుండా పోతోంది. చెంచులు, సుగాలీలు నివాసం ఉండే ప్రాంతాలలోని వారికి వైద్య సహాయక చర్యలు అందించేందుకు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ద్వారా ఎంపీ నిధులను ఇప్పించాం. తక్షణమే అంబులెన్స్‌ను కొనుగోలుచేసి వారికి వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలి. మత్తు వైద్యుడు లేకపోతే ఎలా : కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కందుకూరు ఏరియా వైద్యశాలలో పిల్లల వార్డును పూర్తిగా మూసేశారు. మరో వార్డుది ఇదే పరిస్థితి. ఉలవపాడులో అయితే ఏకంగా స్టోర్రూములో అడుగు మేర నీరు నిలిచిపోతోంది. దానికితోడు మత్తు ఇంజక్షన్ ఇచ్చే వైద్యుడు లేకపోతే ఎలా?ఇక వైద్యుల కొరత సరేసరి. నీటి పారుదలపై అంత నిర్లక్ష్యమా: సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సీఈ, ఎస్ఈలందరూ ఇదే సమావేశంలో ఉన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి వారివద్ద సరైన సమాచారం లేదు. సర్వసభ్య సమావేశం నిర్వహించే ముందే యాక్షన్ టేకెన్ రిపోర్టుపై అరగంట చర్చ నిర్వహించాలి. మంత్రి ఉన్నా మాకు ఉపయోగమేంటి: మారం వెంకటరెడ్డి, తాళ్ళూరు జెడ్పీటీసీ మా నియోజకవర్గానికి మంత్రి శిద్దా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఓబీసీలో నీటి పరిమాణం తగ్గిపోయింది. చివరి భూములకు నీరందే పరిస్థితులు లేవు. మంత్రి నియోజకవర్గమైనా ఒరిగిందేముంది. పరిహారం ఇవ్వకుండా ఎన్నాళ్ళు : దుగ్గెంపూడి వెంకటరెడ్డి, పెద్దారవీడు జెడ్పీటీసీ ప్రాజెక్టుకు అవసరమని రైతుల నుంచి భూములు తీసేసుకున్నారు. కానీ రైతులకు మాత్రం డబ్బులు పంపిణీ చేయలేదు. ఇప్పటికైనా రైతుల సమస్యపై స్పందించాలి. ఆస్పత్రికి వెళ్లాలంటేనే బాధగా ఉంది: కంచర్ల శ్రీకాంత్ చౌదరి, జెడ్పీటీసీ సభ్యుడు కందుకూరు కందుకూరు ఏరియా వైద్యశాలలో వైద్య పరీక్షలకు అవసరమైన సామగ్రి ఉండడంలేదు. ఎక్స్‌రేలకు బయటకు పంపించి రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నిధుల కొరత ఉంటే అధికారులెలా పనిచేస్తారు: పట్టభద్రుల శాసనమండలి సభ్యుడు యండపల్లి శ్రీనివాసరెడ్డి వెలుగొండ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు అవసరమంటే రూ.75 కోట్లు ఇస్తే అధికారులు మాత్రం ఎలా పనిచేయగలరు. సమష్టిగా ముందుకు వెళితేనే నిర్మాణం పూర్తి చేసుకోగలం. ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథక సమాచారమేదీ: పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు ఎన్టీర్ ఆరోగ్య సేవా పథక సమాచారమేదీ. దీనిపై విస్తృత ప్రచారం నిర్వహించాలి. పర్చూరు ఆసుపత్రిలో కనీసం నీరు కూడా లేదు. ఇక వైద్యులు ఆపరేషన్లు ఎలా నిర్వహిస్తారు. తక్షణమే అవసరమైన నిధులకోసం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ప్రైవేటు భవనంలోకి ఆసుపత్రి మార్చుతారా?: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం, కంభం, వై.పాలెం, దోర్నాల తదితర ప్రాంతాల్లో ఏ చిన్న ప్రమాదం జరిగినా రక్తం కోసం ఒంగోలు వరకు రావాల్సి వస్తోంది. అందుకే కంభంలో రక్త నిల్వల కేంద్రం, గిద్దలూరులో బ్లడ్ బ్యాంకు ఏర్పాటుపై ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తెచ్చాను. గిద్దలూరు ఏరియా వైద్యశాలను 50 పడకల ఆసుపత్రి నుంచి 100 పడకల ఆసుపత్రికి మార్చారు. కూలిపోయే భవనంలో ఆస్పత్రిని నిర్మించడం ప్రమాదకరం. దీనికి ప్రత్యామ్నాయంగా సీమాంక్ సెంటర్ నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు దృష్టి సారించాలి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీకి తెలియకుండా నిధులు డ్రా చేస్తే తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. పేద ప్రజల అభ్యున్నతికే ప్రభుత్వం కట్టుబడి ఉంది: కనిగిరి శాసనసభ్యుడు కదిరి బాబూరావు మా ప్రభుత్వం పేదల పక్షానే ఉంది. అట్టడుగు వర్గాలకు సైతం న్యాయం చేసేందుకే సామాజిక కార్యకర్తలను నియమించామే తప్ప అడ్డుకోవడానికి కాదు. గతంలో ఇందిరమ్మ కమిటీలు వేసినపుడు ఈ ప్రశ్నలు ఏమయ్యాయి. గురవాజీపేట ఆస్పత్రిలో పేకాట ఆడుకుంటున్నారు. అధికారులు గమనించాలి. వెలిగొండను పూర్తిచేసేది మా ప్రభుత్వమే: ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌రావు వెలిగొండ ప్రాజెక్టు కోసం బడ్జెట్లో రూ.75 కోట్లు చూపినా వాస్తవానికి రూ.130 కోట్లు ఖర్చు చేశాం. ఎట్టి పరిస్థితుల్లో ఏడాదిలోగా తొలిదశ పూర్తిచేసి నీళ్లిస్తాం. ఇందులో ఎటువంటి సందేహంలేదు. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది మా ప్రభుత్వమే. తిరిగి పూర్తిచేసి ప్రారంభించేది కూడా మా ప్రభుత్వమే. రాజకీయంగా మాట్లాడడం సరికాదు. సీఎం ప్రకటన అలా ఉంటే మీ ప్రకటన ఇలానా: మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను పూర్తిచేసి ఏడాదిలోగా పంటలకు నీరందిస్తామని సీఎం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. సీఈ మాత్రం 2016 డిసెంబర్ నాటికి లేదా 2017 నాటికి అంటున్నారు. ఏది వాస్తవం. ఖచ్చితంగా ఎప్పటిలోగా తొలిదశను పూర్తిచేస్తారో చెప్పండి. ఇది జిల్లా అభివృద్ధిలో కీలకమైన అంశం. రాజకీయాలకు అతీతంగా అవసరమైన నిధులు సాధించుకునేందుకు జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన సీఎంను కలుద్దాం. ప్రజాప్రతినిధులందరూ కలిసిరావాలని విజ్ఞప్తి చేస్తున్నా. సేవలు లేకుండా వైద్యులెందుకు: కొండపి శాసనసభ్యుడు డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి చాలా ఆసుపత్రుల్లో వైద్యులుంటున్నారు కానీ వైద్య సేవలందడం లేదు. ప్రధానంగా దంత వైద్యానికి సంబంధించిన పరికరాలు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. -
తెలుగు తమ్ముళ్ల దాష్టీకం..
బొల్లాపల్లి(మార్టూరు): తెలుగు తమ్ముళ్లు మరోమారు తమ దాష్టీకాన్ని ప్రదర్శించారు. సాగునీటి కోసం జిల్లా రైతులు పడుతున్న ఇబ్బందులపై అసెంబ్లీలో పదేపదే వివరించడంతో పాటు, పంటలు ఎండిపోకుండా నీరివ్వాలని రైతుల తరఫున పోరాటం చేసిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్‌లతో దురుసుగా ప్రవర్తించారు. మార్టూరు మండలం బొల్లాపల్లి వద్ద ఎన్ఎస్పీ కాల్వను పరిశీలించేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వస్తున్నారని తెలిసి ఎమ్మెల్యేలు కాల్వ వద్దకు చేరుకున్నారు. మంత్రికి దగ్గరుండి కాల్వల లైనింగ్ పనులు జరుగుతున్న తీరు, రైతులు పడుతున్న బాధలు, సాగునీటి విషయంలో జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలనుకున్నారు. మంత్రి రావడం ఆలస్యం కావడంతో అక్కడే రెండు గంటలకుపైగా వేచి ఉన్నారు. మంత్రి ఉమామహేశ్వరరావు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కార్యాలయం నుంచి బయలుదేరి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కాల్వ వద్దకు వచ్చారు. రోడ్డు వెంట వేచి ఉన్న ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్లను చూసిన మంత్రి కారుదిగి వారు ఇచ్చిన మెమొరాండం తీసుకుంటున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో అక్కడే ఉన్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు, వారికి మధ్య వాగ్వాదం, స్వల్ప తోపులాట జరిగింది. ఉద్రిక్త వాతావరణం నెలకొని, పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఇంత జరుగుతున్నా మంత్రి వారించకుండా, ఎమ్మెల్యేలను పట్టించుకోకుండా కరణం బలరాం, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో కలిసి కారులో ఎక్కి సాగర్ కాల్వపై పర్యటనకు వెళ్లారు. ప్రభుత్వానికి ప్రజల సమస్యలు వినిపించుకునే తీరిక కూడా లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు అక్కడి నుంచి జొన్నతాళి చేరుకున్నారు. వారితో పాటు వైఎస్సార్ సీపీ రైతు సంఘ నాయకులు వణుకూరి సుబ్బారెడ్డి, నార్నె సింగారావు, గొట్టిపాటి నరసింహారావు, జిల్లా మాజీ డెయిరీ చైర్మన్ ఉప్పలపాటి చెంగలయ్య, దొడ్డా బ్రహ్మానందం, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తాటి వెంకట్రావు, మార్టూరు, బల్లికురవ, పంగులూరు, కొరిశపాడు, యద్దనపూడి మండలాలకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు. చీరాల డీఎస్పీ జయరామరాజు, ఇంకొల్లు సీఐ శ్రీనివాసరావు, మార్టూరు ఎస్సై అజయ్‌కుమార్ తమ సిబ్బందితో బందోబస్తు విధులు నిర్వహించారు. సాగర్‌కు నీరు రావడం లేదని గోడు వెళ్లబోసుకున్న రైతులు: బొల్లాపల్లి సాగర్ కాల్వ వద్దకు చేరుకున్న రైతులు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బొల్లాపల్లి కాల్వ వద్దకు 792 క్యూసెక్కులు రావాలని, అయితే ఇప్పటి వరకు 100, 120 క్యూసెక్కులు మాత్రమే నీళ్లు వస్తున్నాయన్నారు. అధికారులు కూడా పంటలు ఎండుతున్నాయని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. మంత్రి వస్తున్నారని ఇవాళ 305 క్యూసెక్కులు వదిలారన్నారు. మంత్రి పోయిన తర్వాత నీరు రాదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఒంగోలు కల నెరవేర్చండి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరానికి సిటీ బస్సుల వ్యవస్థను పరిపుష్టం చేయాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్టీసీ జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద తీసుకువస్తున్న బస్సులపై మాట్లాడుతూ ఈ పథకం కింద 162 కోట్లతో బస్సులు తీసుకువస్తే జిల్లాకు ఒక్క బస్సు కూడా కేటాయించకపోవడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ఈ పథకం ఇప్పటికే పూర్తయిందని, ఈ దశలో జిల్లాకు తీసుకువస్తామని చెబుతున్న 40 బస్సులు ఎలా వస్తాయని మంత్రిని నిలదీశారు. ఒంగోలు నగరానికి చిరకాల వాంఛయిన సిటీ బస్సు సర్వీసులను ప్రారంభించినా మొక్కుబడిగా ఐదు బస్సులను మాత్రమే కేటాయించడంతో అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్తాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలోనే మద్దిపాడు, నాగులుప్పలపాడు, చీమకుర్తి, సంతనూతలపాడు, టంగుటూరు, కొత్తపట్నం, కొండపి, సింగరాయకొండ వంటి 12 మండల కేంద్రాలున్నాయన్నారు. వీటికి సిటీ బస్సులను ఏర్పాటు చేయాలని సురేష్ డిమాండ్ చేశారు. పల్లెవెలుగులో ఐదు కిలోమీటర్లకు మినిమం ఛార్జి ఉంటే సిటీ సర్వీసుల్లో రెండు కిలోమీటర్లకే మినిమం ఛార్జి వసూలు చేస్తున్నారని, అందువల్ల ఆక్యుపెన్సీ రేషియో కూడా తగ్గుతోందని వివరించారు. ఒంగోలులో మూడు వేల ఆటోలుంటే, బయట నుంచి మరో మూడు వేలు వస్తున్నాయని, ఇందులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాపై సవతి ప్రేమ చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. భద్రతపై దృష్టి పెట్టండి : గొట్టిపాటి రవికుమార్ ఆర్టీసీలో భద్రతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ డిమాండ్ చేశారు. 400 కిలోమీటర్ల ప్రయాణం చేసే బస్సుల్లో కూడా డబుల్ డ్రైవర్‌ను ఏర్పాటు చేయని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. డ్రైవర్లకే టిమ్స్ ఇవ్వడం వల్ల వారిపై ఒత్తిడి పెరిగిపోతోందన్నారు. ఒంగోలు డిపోకు చెందిన శ్రీను అనే డ్రైవర్‌కు విశ్రాంతి ఇవ్వకుండా బలవంతంగా మరో డ్యూటీకి పంపించడం వల్ల ఒత్తిడితో హార్ట్ ఎటాక్‌కు గురై అతను చనిపోయాడని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆర్టీసీ ప్రయాణం శుభప్రదం అని చెబుతున్నా కనీసం ఎగ్జిట్ డోర్స్ కూడా పెట్టకుండా అక్కడ సీట్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. మా జిల్లా నుంచి వచ్చిన మంత్రిగారు మాకు జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం బస్సులు తీసుకువస్తారని ఆశిస్తున్నామన్నారు. ఇప్పటికే విజయవాడ, గుంటూరు, అనంతపురంకు జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం బస్సులు వచ్చాయని, ప్రకాశం జిల్లాకు మాత్రం రాలేదన్నారు. దీనిపై మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ సిటీ బస్సులను పెంచుతామని, త్వరలో మినీ బస్సులను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు రావాల్సిన అన్ని బస్సులను త్వరలోనే వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామని సభ ద్వారా హామీ ఇచ్చారు. -
టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యం
ఒంగోలు అర్బన్: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో జిల్లా అభివృద్ధి తిరోగమనంలో ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్ విమర్శించారు. జిల్లా పరిషత్ సమావేశం శుక్రవారం జరగనున్న నేపథ్యంలో అద్దంకి, కందుకూరు, సంతనూతలపాడు, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు, ఆదిమూలపు సురేష్, జంకె వెంకటరెడ్డి, డేవిడ్‌రాజు, ముత్తుముల అశోక్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ సమావేశమై జిల్లా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమం టీడీపీ ప్రచార కార్యక్రమంగా ఉందే తప్ప..ప్రభుత్వ కార్యక్రమంగా లేదన్నారు. గత ముఖ్యమంత్రుల హయాంలో ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమం జరిగినా..జిల్లాలోని ప్రజాప్రతినిధులందరితో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఎటువంటి సమీక్షలు నిర్వహించకుండా ఒంటెత్తు పోకడలకు పోతోందని దుయ్యబట్టారు. జన్మభూమి కార్యక్రమానికి జిల్లాకు కోటి రూపాయల నిధులు కేవలం అధికార యంత్రాంగానికి కేటాయించారు తప్పితే, ప్రజాసమస్యల పరిష్కారానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు పర్యటన పార్టీ ప్రచారమే... మొన్న జిల్లాలో చేపట్టిన చంద్రబాబు పర్యటన కూడా పార్టీ ప్రచార కార్యక్రమంలా ఉందని వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు విమర్శించారు. జిల్లాకు వచ్చిన చంద్రబాబు ఇక్కడి ప్రజల సమస్యల గురించి గానీ, వెలిగొండ ప్రాజెక్టు గురించి గానీ, జిల్లా అభివృద్ధి గురించి గానీ మాట్లాడకుండా హాస్యాస్పదంగా ఒంగోలు మైసూర్‌పాక్ బాగుంటుందని, వేటపాలెం జీడిపప్పు బాగుంటుందని వాటికి సంబంధించిన పరిశ్రమలు పెట్టాలని మాట్లాడాడని ఎద్దేవా చేశారు. కనీసం ప్రజాప్రతినిధులను ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయకుండా దుర్మార్గపు పాలనను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయం దండగ అన్నాడని, ఇప్పుడు శనగ రైతులను పిచ్చోళ్లుఅని సంబోధించటం ఆయన వైఖరికి దర్పణం పడుతోందన్నారు. జిల్లాలో ఉన్న తెలుగుదేశం ప్రజాప్రతినిధులు గానీ, మంత్రి గానీ ఇక్కడి సమస్యలపై ఏ ఒక్క రోజైనా ముఖ్యమంత్రితో మాట్లాడరా... అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం 14 విద్యాసంస్థలను మన రాష్ట్రానికి కేటాయిస్తే కనీసం ఒక్క విద్యాసంస్థను కూడా జిల్లాకు తీసుకురాలేకపోయారని ధ్వజమెత్తారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతి ప్రజాప్రతినిధిని భాగస్వామ్యం చేయాలని అధికార పార్టీకి తొత్తులుగా మారవద్దని హితవు పలికారు. వెలిగొండ ప్రాజెక్టు సంవత్సరంలో పూర్తి చేస్తామన్న చంద్రబాబు 75 కోట్లు నిధులిచ్చి ఏ విధంగా పూర్తి చేయగలరని ప్రశ్నించారు. మొదటి టన్నెల్ పూర్తి చేయటానికి 250 కోట్లు అవసరమవుతుందని అయితే ఇంత తక్కువ నిధులు కేటాయించిన చంద్రబాబు ఏ విధంగా సంవత్సరంలో పూర్తి చేయగలరన్నారు. పింఛన్ల విషయంలో కూడా 1000 పెంచటం ఆహ్వానించదగ్గ విషయమే కానీ వయోపరిమితి 60 నుంచి 65 సంవత్సరాలకు పెంచి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారన్నారు. అదేవిధంగా ఎటువంటి భూమి గానీ, పొలం గానీ లేని వ్యక్తులను పొలాలున్నాయంటూ పింఛన్ల విషయంలో అనర్హులుగా ప్రకటించారన్నారు. పొలాలు లేని వారికి పొలం ఉన్నట్లుగా చూపించి పింఛన్లు ఎత్తివేశారు, వారికి ఉన్నట్లు చెబుతున్న పొలమైనా వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికార పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రి మొద్దునిద్ర వీడి ప్రజాసమస్యలపై నిస్వార్థంగా, నిజాయితీగా పార్టీకతీతంగా పని చేయాలని సూచించారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకే పేర్లు మార్చి అమలు చేస్తున్నారన్నారు. జిల్లా పరిషత్ సమావేశంలో జిల్లా అభివృద్ధి పథంలో నడిపేందుకు తమ పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. -
రాజధానికి దొనకొండ సరైన ప్రదేశం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రదేశ ఎంపికపై పరస్పర విరుద్ధ ప్రకటనలు ఎందుకు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యుడు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. ఇది ఎవరి కోసమని ఆయన శనివారం అసెంబ్లీలో నిలదీశారు. దీనిపై ఇప్పటికే శివరామకృష్ణన్ కమిటీ పని చేస్తుందని గొట్టిపాటి రవికుమార్ గుర్తు చేశారు. భూముల ధరలు ఆకాశన్నంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజధానికి దొనకొండే సరైన ప్రదేశమని గొట్టిపాటి సూచించారు. దీనిపై మంత్రి నారాయణ సమాధానం ఇస్తూ త్వరలోనే శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇస్తుందని.. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. -
నకిలీ విత్తనాలపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ
అసెంబ్లీ సమావేశాల రెండో రోజున నకిలీ విత్తనాల విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వ్యవసాయ శాఖ మంత్రిని గట్టిగా నిలదీశారు. ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా అడిగిన తొలిప్రశ్నకు మంత్రి ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసి, మరిన్ని అనుబంధ ప్రశ్నలు వేశారు. రవికుమార్ ఏమన్నారంటే.. ''నకిలీ విత్తనాల గురించి మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు తయారుచేసి 400-500 రూపాయల వంతున అమాయకులైన రైతులకు అంటగడుతున్నారు. పర్యవేక్షణ బాగా చేస్తున్నామన్నారు. కానీ, ఇది సరిగా లేకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం వాస్తవం కాదా? విత్తనాలు సరఫరా చేసేటప్పుడు పర్యవేక్షణ ఏమాత్రం లేని మాట సంగతేంటి? భారీస్థాయిలో నకిలీ విత్తనాలు సరఫరా అయ్యే అవకాశం ఉందా.. లేదా? కోల్డ్ స్టోరేజిలో నిల్వ ఉంచిన విత్తనాలను అధికారులు రైతులకు సరఫరా చేస్తున్నారు. వాస్తవానికి మంచి రైతుల వద్దకు వెళ్లి వారి నుంచి విత్తనాలు సేకరించి సరఫరా చేయాలి. కానీ నెలల తరబడి నిల్వ ఉంచిన విత్తనాలను సరఫరా చేయడం వల్ల దిగుబడులు ఘోరంగా దెబ్బతింటున్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ తరహా సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. విత్తనాల సరఫరా విషయంలో ముందు జాగ్రత్తగా తీసుకున్న చర్యలేంటి? అలాగే ఎన్ని వేల టన్నుల విత్తనాలను జిల్లాలకు సరఫరా చేశారు, నాణ్యత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈ సంవత్సరం వ్యవసాయ పరంగా రాష్ట్ర రైతాంగానికి ఏ భరోసా ఇవ్వబోతున్నారు'' అని శరపరంపరగా ప్రశ్నలు సంధించారు. -
దర్శిలో బూచేపల్లి, అద్దంకిలో గొట్టిపాటి
ఒంగోలు : ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, సంతనూతలపాడులోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతోంది. -
రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర విభజన: గొట్టిపాటి రవికుమార్
బల్లికురవ, న్యూస్‌లైన్ : రాజకీయ లబ్ధి కోసమే టీడీపీతో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుని సీమాంధ్ర ప్రజల గొంతు కోసిందని వైఎస్ఆర్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గురువారం బల్లికురవ వచ్చిన అయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైందన్నారు. విభజనకు మద్దతు ఇచ్చిన టీడీపీని కూడా ప్రజలు అసహ్యించుకొని రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతారన్నారు. మహానేత వైఎస్ఆర్ జీవించి ఉన్నప్పుడు విభజన అంశాన్ని లేవనెత్తని తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన హఠాన్మరణంతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశారని ధ్వజమెత్తారు. తాజా మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసమర్థత వల్లే విభజన బిల్లును పార్లమెంట్లో ఆమోదించారని విమర్శించారు. కుట్రలు.. కుతంత్రాలతో రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. ఆయన్ను సీఎం చేసేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారని గొట్టిపాటి పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ మలినేని గోవిందరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు జండ్రాజుపల్లి మాతయ్య పాల్గొన్నారు. అభివృద్ధికి బాటలు వేశా.. ఆదరించండి నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు వేశానని, త్వరలో జరిగే ఎన్నికల్లో మీ అందరివాడిగా తిరిగి ఆదరించాలని గొట్టిపాటి రవికుమార్ కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కార్యకర్తల సమావేశం గురువారం స్థానిక కిషోర్ గ్రానైట్స్‌లో జరిగింది. సమావేశానికి మండల కన్వీనర్ మలినేని గోవిందరావు అధ్యక్షత వహించారు. రవికుమార్ మాట్లాడుతూ 1983 నుంచి 2004 వరకు నియోజకవర్గంలో 30 మంది మరణాలకు కారణమైన ఓ దుష్టశక్తి ఈ ఏడాది జనవరి 1న అద్దంకిలో రౌడీయిజంతో హంగామా సృష్టించిందని మండిపడ్డారు. ఓటర్ల మనసులో సుస్థిర స్థానం ఉంటే తప్ప గూండాగిరీ, రౌడీయిజంతో ప్రజాప్రతినిధిగా గెలవలేరని తన ప్రత్యర్థులకు హితవు పలికారు. ఇలాంటి దుష్టశక్తిని సాగనంపేందుకు కార్యకర్తలంతా పార్టీ విజయానికి కృషి చేస్తూ 2009లో ఇచ్చిన మెజార్టీని రెట్టింపు చేయాలని కోరారు. అనంతరం గ్రామాల వారీగా నెలకొన్న సమస్యలపై 21 గ్రామ పంచాయతీల్లోని కార్యకర్తలు, సర్పంచ్‌లతో గొట్టిపాటి సమీక్షించారు. సమావేశంలో మల్లాయపాలెం, కొణిదెన, నక్కబొక్కలపాడు, ముక్తేశ్వరం, వల్లాపల్లి సర్పంచ్‌లు అబ్బారెడ్డి బాలకృష్ణ, సీహెచ్ ఆంజనేయులు, ధూళిపాళ్ల వెంకటేశ్వర్లు, ఇస్రాయిల్, షేక్ అల్లాఉద్దీన్, వల్లాపల్లి సొసైటీ అధ్యక్షుడు మంచాల శ్రీనివాసరెడ్డి, ఉప్పుమాగులూరు, కేరాజుపాలెం, రాజుపాలెం, కూకట్లపల్లి, కొప్పరపాడు, ముక్తేశ్వరం, కొప్పరపాలెం, చెన్నుపల్లి మాజీ సర్పంచ్‌లు కల్లి వెంకటేశ్వరరెడ్డి, జాష్టి శ్రీరంగనాయకులు, గోపాలకృష్ణ, ఇప్పల నాసరరెడ్డి, షేక్ అబ్దుల్ సాహెబ్, కె.శంకరరెడ్డి, ఎం.ఆంజనేయులు, పి.అక్కయ్య, జి.శంకర్, పార్టీ నేతలు డి.శివయ్య, కె.సత్యనారాయణ, ఈ.పెద్దన్న, డి.అంజయ్య, గాలి వెంకటేశ్వర్లు, ఇప్పల నర్సిరెడ్డి పాల్గొన్నారు. -
గొట్టిపాటి దీక్ష భగ్నం
అద్దంకి, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర కోసం అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు ఆదివారం ఉదయం భగ్నం చేశారు. భారీ బందోబస్తు నడుమ ఆయన్ను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. సమైక్య శంఖారావంలో భాగంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గొట్టిపాటి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఆదివారానికి ఐదో రోజుకు చేరుకుంది. శనివారం మధ్యాహ్నమే ఆయన ఆరోగ్యం క్షీణించిందని వైద్యాధికారులు చెప్పారు. తక్షణమే దీక్ష విరమించాలని సూచించినా రవికుమార్ అంగీకరించలేదు. ఆరోగ్యం మరింత క్షీణిస్తుండటంతో ఉన్నతాధికారల ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి వైద్యాశాలకు తరలించాలని శనివారం మధ్యాహ్నమే విఫలయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో దీక్ష శిబిరం వద్దకు వచ్చి గొట్టిపాటికి వలయంగా ఏర్పడ్డారు. పోలీసులు రెండు సార్లు వచ్చి వెనుదిరిగి వెళ్లారు. ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో వైద్యాధికారి టి.వెంకటేశ్వర్లు శిబిరం వద్దకు వచ్చి పరీక్షలు నిర్వహించారు. అనంతరం గొట్టిపాటి ఆరోగ్య స్థితిపై పోలీసులకు నివేదిక ఇచ్చారు. అప్పటికే పెద్ద సంఖ్యలో పోలీసులు అంబులెన్స్‌తో దీక్ష శిబిరం వద్దకు చేరుకున్నారు. దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించగా వందలాది మంది కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు వారిని నెట్టివేసుకుంటూ రవికుమార్‌ను అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు భారీగా ఒంగోలు తరలి వెళ్లారు. -
బాబూ..నీ నిర్ణయం చెప్పు
అద్దంకి, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన నిర్ణయం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ డిమాండ్ చేశారు. దొంగదీక్షలు చేపట్టడం మానుకుని నిజాయితీగా రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని హితవు పలికారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో అద్దంకిలో రవికుమార్ చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షలు శనివారానికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ర్ట విభజనపై తన నిర్ణయం ఏమిటో చెప్పకుండానే సీమాంధ్రలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలను రోడ్లపైకి పంపి సమైక్యాంధ్ర నినాదాలు చేయించడం సిగ్గుచేటన్నారు. వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తిగా సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నారని, ఆ మేరకు రెండోసారి ఆమరణ దీక్ష చేపట్టారని తెలిపారు. చంద్రబాబు కూడా తన నిర్ణయాన్ని బహిరంగంగా వెల్లడించిన తర్వాతే దీక్ష చేపట్టాలని, అప్పుడు మాత్రమే టీడీపీ నాయకులు, కార్యకర్తలను రోడ్లపైకి పంపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాజీనామాలు చేస్తున్న ఎంపీలు, మంత్రులు.. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించిన వెంటనే రాజీనామాలు చేసిఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చి ఉండేది కాదన్నారు. కాంగ్రెస్, టీడీపీల స్వార్థం వల్లే రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ప్రజలకు అన్ని విషయాలూ తెలుసని, అందుకే రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుల ఇళ్లపై వారే స్వచ్ఛందంగా దాడులు చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఏకాభిప్రాయం లేదని, అందువల్లే మంత్రులు, ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయి నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మహానేత వైఎస్ఆర్ బతికుంటే విభజన మాటెత్తే ధైర్యం ఎవరికీ ఉండేదికాదని గొట్టిపాటి పేర్కొన్నారు. ఆయన మరణానంతరం కుక్కలు చింపిన విస్తరిలా రాష్ట్రంలో పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఏమీ మించిపోలేదని, అన్ని పార్టీలూ వైఎస్ఆర్ సీపీని ఆదర్శంగా తీసుకుని విభజన నిర్ణయాన్ని కేంద్రం వెనక్కుతీసుకునేంత వరకూ పోరాడాలని పిలుపునిచ్చారు. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజాసంక్షేమం కోసమే జగన్ దీక్ష : నూకసాని బాలాజీ కందుకూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలోని రెండుప్రాంతాలైన తెలంగాణ, సీమాంధ్ర ప్రజల సంక్షేమం కోసమే వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త నూకసాని బాలాజీ పేర్కొన్నారు. జగన్ ఆమరణ దీక్షకు మద్దతుగా కందుకూరు అంబేద్కర్ బొమ్మ వద్ద వైఎస్ఆర్ సీపీ నాయకులు శనివారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆ దీక్షలను ప్రారంభించిన నూకసాని బాలాజీ మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్రెడ్డిని 16 నెలల పాటు అన్యాయంగా జైలులో నిర్బంధించిందని, అంతటి బాధలోనూ సమైక్య రాష్ట్రం కోసం జైలులో కూడా జగన్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. జైలు నుంచి ఆయన బయటకు వచ్చిన కొద్దిరోజులకే తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో చలించి పోయి సమైక్య రాష్ట్రం కోసం రెండోసారి ఆమరణ నిరాహార దీక్షను శనివారం నుంచి ప్రారంభించారన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినప్పటికీ లెక్కచేయకుండా ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమై జగన్మోహన్రెడ్డి ముందుకు సాగుతున్నారని తెలిపారు. గతంలో కూడా విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ దీక్ష, రైతుల కోసం రైతు దీక్ష, మహిళల సమస్యల పరిష్కారానికి మహిళలతో దీక్ష నిర్వహించి రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలని చూస్తున్న కేసీఆర్.. తెలంగాణలోని ప్రజల కోసం గతంలో ఏం పోరాటాలు చేశారో చెప్పాలని బాలాజీ ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండుకళ్ల సిద్ధాంతంతో ఇరుప్రాంతాల ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. ఆయన ఢిల్లీలో దీక్ష ఎందుకు చేయాలనుకుంటున్నాడో ప్రజలకు అర్థంకావడం లేదన్నారు. తన దీక్ష ఉద్దేశాన్ని చంద్రబాబునాయుడు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. పీసీసీ చీఫ్ బొత్స, టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌లు ఢిల్లీలో ఎందుకు కలిశారో కూడా చెప్పాలన్నారు. లేకుంటే ప్రజలు క్షమించరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్తలు తూమాటి మాధవరావు, ఉన్నం వీరాస్వామి, మండల కన్వీనర్ పీవీ రమణయ్య, యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గణేషం గంగిరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సుదర్శిశ్యామ్, యువజన విభాగం పట్టణ, మండలాల అధ్యక్షులు షేక్ రఫి, కూనం రామకృష్ణారెడ్డి, కొండారెడ్డిపాలెం సర్పంచ్ సురేష్, పార్టీ నాయకులు గొడ్డటి బాలరాఘవ్‌యాదవ్, కొల్లి మాధవరావు పాల్గొన్నారు. -
బాబు మళ్లీ వస్తే తరిమికొట్టండి: మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి
ఒంగోలు: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్ర పేరిట మళ్లీ వస్తే తరిమి తరిమి కొట్టండని అద్దంకి మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పిలుపు ఇచ్చారు. చంద్రబాబు తెలంగాణలో ఒక మాట సీమాంధ్రలో మరో మాట మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఓట్లు, సీట్లు కోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించాలని చూస్తోందని రవికుమార్ అన్నారు.