ఎమ్మెల్యేపై కరణం బలరాం వర్గీయుల దాడి | tdp cadre attacks ysrcp mla ravikumar in ongole | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేపై కరణం బలరాం వర్గీయుల దాడి

Published Mon, Jan 12 2015 7:59 PM | Last Updated on Fri, Aug 10 2018 8:46 PM

tdp cadre attacks ysrcp mla ravikumar in ongole

ప్రకాశం జిల్లా ఒంగోలులో అద్దంకి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నాయకుడు గొట్టిపాటి రవికుమార్పై టీడీపీ నేత కరణం బలరాం వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే రవికుమార్కు చెందిన కారు అద్దాలను ధ్వంసం చేశారు. కలెక్టరేట్ ఆవరణలోనే బలరాం వర్గీయులు ఈ దాడికి పాల్పడ్డారు.

దాంతో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గురించిన సమీక్ష సమావేశంలో ఇరు వర్గాలు పాల్గొన్నాయి. సమీక్ష ముగిసిన అనంతరం బయటకు వస్తున్న ఎమ్మెల్యే రవికుమార్పై కరణం వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement