karanam balaram
-
ఎమ్మెల్యేలతో పాటు సీనియర్లు కూడా..
సాక్షి, ప్రకాశం : టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు త్వరలోనే పార్టీ మారే అవకాశం ఉందని ఆ పార్టీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారేందుకు ఎవరికి వారు వ్యక్తిగతంగా సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిని కరుణం బలరాం.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తనను ఎంతో మానసిక వేదనకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు నారా లోకేష్‌ది తన గురించి మాట్లాడే స్థాయి కాదని, తండ్రీకొడుకులు ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిందని హితవుపలికారు. పార్టీలో సీనియర్లకు కనీసం గౌరవందక్కడంలేదని, చంద్రబాబుది అవసరం ఉన్నప్పుడు వాడుకుని వదిలేసే తత్వమని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. (చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యేలకు నమ్మకం లేదు) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా ఆత్మసంతృప్తి పొందుతున్నారని సొంతపార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న నవరత్నాల పథకాలు భేష్ అని కితాబిచ్చారు. ఎంతో మంది నిపుణులు అమలు కష్టమన్న అనేక పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని అభినందించారు. ముఖ్యంగా తాగునీటి ప్రాజెక్టులు వేగంగా నిర్మిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం కారణంగానే వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని, రెండేళ్ల క్రితమే నీళ్లు ఇవ్వాల్సిందని గుర్తుచేశారు. -
చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యేలకు నమ్మకం లేదు..
-
కరణం బలరాం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ప్రకాశం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కరణం బలరాం ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది పాలనలో సీఎం వైఎస్ జగన్ ఎన్నో గొప్ప సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారన్నారు. ఆయన పనితీరుకు మరింత మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. ఈ కారణంగా ఎంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వస్తారో ఇప్పుడే చెప్పలేమన్నారు. అధికారంలో ఉన్నప్పడు చంద్రబాబు నాయుడు ప్రజలను నిర్లక్ష్యం చేశారని, ఆయనపై టీడీపీ ఎమ్మెల్యేలకు ఎవరికీ నమ్మకం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. (అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారు) చంద్రబాబు పోకడకు, సీఎం జగన్ వ్యవహారశైలికి చాలా తేడా ఉందన్నారు. వెలిగొండ విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని, ప్రజల కోసం చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేయలేదని విమర్శించారు. ఏడాది పాలనలో ప్రజల్లో సీఎం జగన్ నమ్మకం కలిగించుకున్నారని తెలిపారు. ప్రకాశం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సీఎం జగన్‌కు బలరాం అభినందనలు తెలిపారు. -
ప్రకాశం జిల్లా టీడీపీ పై బీజేపీ కన్ను!
-
కరణం బలరామ్‌కు హైకోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చీరాల నుంచి కరణం బలరామ్ ఎన్నికను సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ (ఈపీ)పై హైకోర్టు స్పందించింది. కరణం బలరామ్‌తోపాటు రిటర్నింగ్ అధికారికి కూడా నోటీసులిచ్చి తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరణం బలరామ్ తన ఎన్నికల అఫిడవిట్లో అనేక వాస్తవాలను దాచిపెట్టారని, దీనిపై ఫిర్యాదు చేసినా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని, అందువల్ల బలరామ్ ఎన్నికను రద్దు చేసి తనను ఎన్నిౖకైనట్లు ప్రకటించాలని ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టులో ఇటీవల ఈపీ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆమంచి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..తన నామినేషన్లో భార్య పేరును కరణం సరస్వతిగా పేర్కొన్నారని, అయితే ఆయనకున్న మరో భార్య ప్రసూన, కుమార్తె గురించి నామినేషన్లో ప్రస్తావించలేదని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. -
చీరాల ఎమ్మెల్యే పై కేసు నమోదు
-
చీరాల ఎమ్మెల్యే బలరాంపై కేసు నమోదు
సాక్షి, చీరాల(ప్రకాశం) : చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిపై బుధవారం చీరాల ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ యడం రవిశంకర్‌ను దుర్భాషలాడి, బెదిరించడంతో ఆయన వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు సూచనల మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. చదవండి : నా జోలికొస్తే.. నీ అంతు చూస్తా..! ఈనెల 15న ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరుగుతున్న జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రోటోకాల్ విషయమై ఎమ్మెల్యేను యడం రవిశంకర్ ప్రశ్నించగా నన్నే ప్రశ్నిస్తావా... నేనేంటో చూపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో యడం రవిశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కోర్టు ఆదేశాలతో కరణం బలరామకృష్ణమూర్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. -
నా జోలికొస్తే.. నీ అంతు చూస్తా..!
సాక్షి, చీరాల : స్థానిక మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాల్లో గురువారం నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. స్వాతంత్య్ర దినోత్సవానికి రాజకీయ రంగు పులమడంతో కార్యక్రమం రసాభాసగా ముగిసింది. టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం తన మందీమార్బలంతో మరోసారి తన నైజాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు బలరాంను స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద అంతే రీతిగా అడ్డుకున్నారు. బలరాం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఉదయం 8 గంటలకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. బలరాం జిందాబాద్.. అంటూ టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గీయులు జై ఆమంచి.. అంటూ నినాదాలు చేయడంతో ఇరువర్గాలు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు. చీరాల డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి, సబ్ డివిజన్లోని సీఐలు నాగమల్లేశ్వరరావు, ఫిరోజ్, రాంబాబుతో పాటు పలువురు ఎస్ఐలు, ఏఆర్, సివిల్ పోలీసులు భారీగా మోహరించి బారికేడ్లతో ఇరువర్గాలను కట్టడి చేశారు. తహసీల్దార్ కార్యాలయంలోకి ఎవరినీ వెళ్లకుండా అడ్డుకున్నారు. ఒక వైపు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మరోవైపు భారీగా మోహరించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలతో ఆంధ్రరత్న రోడ్డు నిండిపోయింది. నన్నే ప్రశ్నిస్తావా..? ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే బలరాం జాతీయ జెండా ఆవిష్కరణకు వెళ్లగా అక్కడే ఉన్న వైఎస్సార్ సీపీ సీనియర్ నేత యడం రవిశంకర్ ‘మీరేనా వచ్చేది.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌తో పాటు వైఎస్సార్ సీపీ నేతలను ఎందుకు కార్యక్రమానికి హాజరు కానివ్వడం లేదని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. తీవ్ర ఆగ్రహానికి గురైన బలరాం ‘నువ్వెవడవి రా..వెధవ.. నన్ను ప్రశ్నిస్తావా.. నీ అంతు చూస్తా..అంటూ హెచ్చరించారు. ఎందుకు పిలువలేదో వెళ్లి వాడిని (ఎంపీడీవోని ఉద్దేశించి) అడుగు..అంటూ హెచ్చరించాడు. దీంతో యడం రవిశంకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఉన్న నీవు ప్రజలను బూతులు తిట్టడం సరికాదని, మాట్లాడే తీరు మార్చుకోవాలని హితవు పలికారు. టూటౌన్ సీఐ ఫిరోజ్ యడం రవిశంకర్‌ను అక్కడి నుంచి పంపించేశారు. కారులో వెళ్తున్న బలరాం రవిశంకర్‌ను పిలిచి ‘మరోసారి నా జోలికి వస్తే.. నా క్యారెక్టర్ చూపిస్తా..ఒళ్లు దగ్గర పెట్టుకో.. లేకుంటే నీ అంతు చూస్తా’ అంటూ కారులో నుంచే బెదిరించాడు. అనంతరం బలరాం తహసీల్దార్‌తో గంటసేపు మాట్లాడి గొడవను పెద్దది చేసేందుకు వ్యూహ రచన చేసి పోలీసులు వద్దని చెబుతున్నా వినకుండా నేరుగా ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని తన అనుచరులతో మంతనాలు చేశారు. వైఎస్సార్ సీపీ నేతలను ఎలాగైనా కొట్టాలంటూ భారీగా టీడీపీ నాయకులతో కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. బలరాం తీరుపై మండిపడ్డ వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఆర్అండ్బీ బంగ్లాకు వెళ్లేందుకు యత్నించగా చీరాల డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి, పోలీసులు అడ్డుకునే యత్నం చేయడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అద్దంకి తరహా రాజకీయం మసీదు సెంటర్లో ఉన్న వైఎస్సార్ సీపీ నేతలను పంపించేందుకు పోలీసులు యత్నించారేగానీ టీడీపీ నేతలను పంపే చర్యలు చేపట్టలేదు. వైఎస్సార్ సీపీ నేతలు గడియార స్తంభం సెంటర్‌కు చేరుకుని బలరాంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రశాంతంగా ఉన్న చీరాల్లో అద్దంకి తరహా రాజకీయాలు చేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, బలరాం డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. డీఎస్పీ వచ్చి వైఎస్సార్ సీపీ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ తమ్ముడు స్వాములుతో చర్చించి మీరు.. మీ అనుచరులు ఇక్కడి నుంచి వెళ్లండి.. టీడీపీ నాయకులను నేను పంపిస్తా.. అంటూ డీఎస్పీ చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు, నాయకులు గడియారం స్తంభం సెంటర్లోని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులతర్పించి డ్రైనేజీ అతిథి గృహానికి చేరుకున్నారు. అంతటితో ఉద్రిక్తత వాతావరణం కాస్త సద్దుమణిగింది. -
వలంటీర్ల ఎంపికపై టీడీపీ పెత్తనం
సాక్షి, చీరాల: తాము చెప్పిందే జరగాలని టీడీపీ ఎమ్మెల్యే బలరాం, ఆపార్టీ నేతలు ప్రభుత్వ కార్యాలయాల్లో హల్చల్ చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికార దర్పం చూపించాలని ఉవ్విళ్లు ఊరుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రభత్వ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది గత ప్రభుత్వ హయాంలో నియమించిన వారంతా టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ వలంటీర్ల నియామకం, శిక్షణ తరగతుల్లో టీడీపీ నేతలు, నాయకుల ప్రోద్బలంతో మంగళవారం జరగాల్సిన శిక్షణ బుధవారానికి వాయిదా వేశారు. మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇన్చార్జి అధికారి టీడీపీ నేతల ఒత్తిళ్లు, సిఫార్సులకు దాసోహం అన్నట్లు వ్యవహరించడంతోనే చీరాల మండలంలో గ్రామ వలంటీర్ల వ్యవహారం గందరగోళంగా మారింది. ప్రభుత్వం చీరాల మండలానికి కేటాయించిన 446 వలంటీర్లు పోస్టులకు గాను మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో 1789 మంది దరఖాస్తులు అందించారు. మండలంలో వలంటీర్ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గతనెల 11 నుంచి 25 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వలంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారిని ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హత ఉన్నవారిని ఎంపిక చేసి ఈపాటికే ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి నివేదించారు. వలంటీర్ల ప్రక్రియ పూర్తయి మంగళవారం నుంచి శిక్షణ అందించాల్సి ఉండగా టీడీపీ నాయకులు రాద్ధాంతంతో శిక్షణను మండల పరిషత్ అధికారులు బుధవారానికి వాయిదా వేశారు. శిక్షణను ప్రారంభించకపోవడానికి ముఖ్య కారణం మండల« స్థాయి అధికారే అని అంతా ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి వరకు.. గ్రామ వలంటీర్ల పోస్టుల్లో తమవారిని నియమించాలని మండల అధికారిపై టీడీపీ ఎమ్మెల్యే, అతని అనుచరులు కొందరు మండల కార్యాలయంలో తిష్టవేసుకుని హల్చల్ చేస్తున్నారు. మండలానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఆ అధికారి కూడా టీడీపీ నాయకులతో ములాఖత్ అయి వారు చెప్పిన వారినే వలంటీర్లుగా నియామకం చేయాలని వత్తాసు పలుకుతున్నారంటే ఆ అధికారులు టీడీపీ నేతల సేవలో నిమగ్నమవుతున్నారనే విమర్శలు గుప్పిస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి అనకశరాత్రి వరకు ఎంపీడీవో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లను మె ఆ అధికారి సాయంతో వలంటీర్ల తుదిజాబితాలో మార్పులు చేసి.. టీడీపీ నాయకులు చెప్పిన వారిని చేర్చి ఆ జాబితా ఆమోదం కోసం అధికారి జిల్లా కేంద్రానికి వెళ్లాడనే ప్రచారం జరుగుతోంది. జాబితాలను మార్చాలని మంతనాలు చేయడంతో ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కనీసం వలంటీర్లుగా ఉద్యోగం చేసుకోబోతున్న తరుణంలో టీడీపీ నాయకులు చేస్తున్న రాజకీయంతో తాము ఇబ్బందులు పడుతావేమోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య వారధులే వలంటీర్లు చీరాల: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వలంటీర్లు వారధులుగా పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని 33 వార్డులకు సంబంధించిన వలంటీర్లుకు శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం పేరాలలోని ఆంధ్రరత్న మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డుల్లో పేదలకు ప్రభుత్వ పథకాలను అందించేందుకు వలంటీర్లు కృషి చేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వారికి ఏమి కావాలో తెలుసుకుని వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను అందేలా చూడాలన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకునే విధంగా వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత వలంటీర్లపై ఉందన్నారు. వలంటీర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వలంటీర్ ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకోవాలన్నారు. తొలి నుంచి టీడీపీకి నమ్మినబంటే..? చీరాల మండల పరిషత్ కార్యాలయంలో ఇన్చార్జి అధికారిగా విధులు నిర్వహిస్తున్న అధికారి టీడీపీ నాయకులంటే ఆది నుంచి వల్లమాలిన అభిమానం. మండల స్థాయి టీడీపీ నేతలు వచ్చి ఏ పని అడిగినా తక్షణమే చేసి తన భక్తిని చాటుకుంటుండాడు ఆ అధికారి. గత మండల పరిషత్ పాలకవర్గంలో పనిచేసిన సభ్యుల్లో టీడీపీకి చెందిన వారికే అధికంగా నిధుల కేటాయింపులు, పనులు చేస్తుండేవాడనే పేరుంది. కానీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ నాయకుల సేవలో ఆ అధికారి తలమునకలవ్వడం పట్ల కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది కూడా విస్మయం చెందుతున్నారు. టీడీపీ నాయకులను దగ్గర కూర్చోబెట్టుకుని మరీ గతంలో రుణాలు, పథకాలు అందించిన ఆ అధికారి ప్రస్తుతం వలంటీర్ల జాబితాను కూడా టీడీపీ నాయకులన దగ్గర ఉంచుకుని వారు సూచించిన వారినే వలంటీర్లుగా జాబితాలో నిక్షిప్తం చేశాడంటే ఆయన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ అధికారిని చీరాల నుంచి పంపించి వివక్షత లేకుండా పథకాలు అందించే అధికారిని నియమించాలని గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
పోస్టు ఇవ్వకపోతే ప్రాణం దక్కదు.. జాగ్రత్త!
సాక్షి, చీరాల: చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి తన సహజ సిద్ధ లక్షణాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా చీరాలలో రెచ్చిపోయారు. ప్రభుత్వం ఇంటర్వ్యూల ద్వారా నియమించిన గ్రామ వలంటీర్లను కాదని, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేసి తనను గెలిపించిన టీడీపీ కార్యకర్తలకు పోస్టులు ఇవ్వాలంటూ అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. పైగా తాను వెంట తెచ్చిన లిస్టులోని పేర్లున్న వారికి పోస్టులు ఇవ్వకుంటే అంతు చూస్తానంటూ ఇన్చార్జి ఎంపీడీఓను బెదిరించినట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎంపీడీఓ కార్యాలయంలోనే బలరాం తిష్ట వేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు. అంతా ఎమ్మెల్యే హోదాలో అధికారులతో చర్చించేందుకు మండల పరిషథ్ కార్యాలయానికి వచ్చారని భావించారు. కానీ ఆయన తన మందీ మార్బలం వెంట తెచ్చుకుని నిబంధనలకు విరుద్ధంగా గ్రామ వలంటీర్ల పోస్టులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలని హంగామా సృష్టించారు. ఒకదశలో భయపడిన అధికారులు, సిబ్బంది బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆ అవకాశం ఇవ్వలేదు. ఎంపీడీఓను నిర్బంధించి తాము చెప్పిన వారికి ఇస్తావా.. చస్తావా..అంటూ బెదిరించడంతో పాటు దుర్బాషలాషలాడినట్లు తెలిసింది. చీరాలకు తాను ఎమ్మెల్యేనని, తాను చెప్పింది వినాలంటూ... లేకుంటే ఏ మవుతారో తేలుస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. తనపై ఓడిన వ్యక్తి చెప్పిన వారికి ఎలా పోస్టులు ఇస్తారంటూ, అతని మాట ఎందుకు వింటున్నారంటూ ఆమంచిని ఉద్దేశించి పరుష పదజాలం వాడినట్లు సమాచారం. అభ్యర్థులను ఎంపిక చేసిన వారి పేర్లు చెప్పాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఒక దశలో ఎంపికలో తమ వారి పేర్లు లేకపోతే చీరాలలో ఏం చేస్తామో చూడాల్సి వస్తుందంటూ బెదిరించడంతో అధికారులు దిక్కు తోచక తాము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామన్నారు. మీరు ఇచ్చిన లిస్టు కూడా ఉన్నతాధికారులకు పంపిస్తామని బలరాంతో చెప్పారు. ఆయన వెంట వచ్చిన టీడీపీ నాయకులు..అధికారులు చెప్పింది వినకపోగా అంతు చూస్తామంటూ హెచ్చరించారు. ఇదీ..జరిగింది ప్రభుత్వం చీరాల మండలానికి కేటాయించిన 449 వలంటీర్ పోస్టులకు మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో 1789 మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు ఈ నెల 11 నుంచి 25 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వలంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంటర్వ్యూ చేసి అర్హత ఉన్న వారిని ఎంపిక చేసి ఈ పాటికే ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి నివేదించారు. దాదాపు ప్రక్రియ పూర్తయింది. మంగళవారం నుంచి వలంటీర్లుగా ఎంపికైన వారికి శిక్షణ అందించనున్నారు. ఈ దశలో టీడీపీ నాయకులు మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి హల్చల్ చేశారు. కేవలం ఉనికి కోసమే ఈ హంగామా..అని చీరాలలో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు అధికారులు వలంటీర్లను నియమించగా చివరి నిమిషంలో వచ్చిన ఎమ్మెల్యే బలరాం కనీసం వంద గ్రామ వలంటీర్ల పోస్టులనైనా టీడీపీ కార్యకర్తలకు ఇవ్వాలని పట్టుబట్టారు. తమ చేతుల్లో లేని వ్యవహారం.. అని అధికారులు చెబుతున్నా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా బలరాం పక్కన ఉన్న టీడీపీ నాయకులు అధికారులపై ఇష్టానుసారంగా వ్యవహరించారు. వలంటీర్లుగా ఎంపికైన వారు తమ అనుకూలమైన గ్రామాల్లో ఎలా పనిచేస్తారో చూస్తామని హెచ్చరికలు చేసినట్లు సమాచారం. తమ వారు కాకుండా మరొకరు వలంటీర్‌గా వస్తే చూస్తూ ఊరుకోమని బహిరంగంగానే బెదిరింపులు పాల్పడటం గమనార్హం. రాత్రి 8 గంటల ప్రాంతంలో కూడా ఎంపీడీఓ కార్యాలయంలోనే బలరాంతో పాటు టీడీపీ నాయకులు తిష్ట వేసినట్లు సమాచారం. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను సైతం టీడీపీ కార్యకర్తలు లోపలకు అనుమతించకపోవడం గమనార్హం. -
కొత్త చిక్కుల్లో కరణం!
-
కరణం బండారాన్ని బయట పెట్టిన ఆమంచి
కరణం బలరాం.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. ఆయన ఏ పని చేసినా వివాదాస్పదమే.. తాజాగా బలరాం కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నారు.. అందులోంచి ఎలా బయటపడాలో తెలియక విలవిల్లాడుతున్నారు.. ఇన్నాళ్లూ గుట్టుగా ఉంచిన వ్యవహారాన్ని ఆమంచి రట్టు చేసేశారు.. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యేగా బలరాం ఎన్నిక చెల్లదంటూ ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పుడీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎన్నికల అఫిడవిట్లో కరణం తన కుమార్తె అంబిక పేరును చూపకుండా దాచి పెట్టారంటూ ఆమంచి వేసిన పిటిషన్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందోనని చీరాల టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.. ఆమంచి ఆధారాలను బయటపెట్టడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మూడు రోజుల క్రితం ఆమంచి హైకోర్టులో పిటీషన్ వేసినా.. మంగళవారం విలేకర్ల సమావేశం పెట్టి మరీ బలరాం బండారాన్ని బయట పెట్టారు. ఇంత జరుగుతున్నా ఆ పెద్దాయన మాత్రం నోరు మెదపక పోవడంతో తప్పు చేయడం వల్లే మౌనంగా ఉన్నారనే ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సమర్పించిన నామినేషన్ ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా లేదని, చట్టప్రకారం బహిర్గతం చేయాల్సిన వాస్తవాలను వెల్లడించలేదంటూ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అంబిక కృష్ణ అనే కుమార్తె ఉన్నప్పటికీ బలరాం తన నామినేషన్లో ఆమె వివరాలు పొందుపరచలేదని పిటిషన్లో పేర్కొనడంతో ఇప్పుడు ఈ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కరణం బలరాం ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 7వ తేదీన ఆమంచి హైకోర్టులో ఎన్నికల పిటీషన్ (ఈపీ) దాఖలు చేయడంతో చీరాల టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తల్లో గత మూడు రోజులుగా ఇదే చర్చ కొనసాగుతోంది. అంబిక కృష్ణ ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాల్లో తండ్రి పేరు కరణం బలరామకృష్ణమూర్తిగా నమోదైన దృశ్యాలు (సర్కిల్లో) హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడమే కాకుండా ఆమంచి విజయవాడలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆధారాలు బయటపెట్టడంతో కరణం వర్గీయులు అంతర్మథనం చెందుతున్నారు. అంబిక తన కుమార్తె కాదని బలరాం అంటే ఏ పరీక్షకైనా అంబిక సిద్ధంగా ఉందని ఆమంచి సవాలు చేసినా కరణం బలరాం మాత్రం ఈ వ్యవహారంపై ఇంత వరకూ నోరు మెదప లేదు. చిన్న ఆరోపణ వస్తేనే అంతెత్తు ఎగిరిపడే తమ నాయకుడు మూడు రోజులుగా తీవ్ర ఆరోపణలు వ్యక్తమౌతున్నా మౌనంగా ఉండిపోవడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోన చెందుతున్నారు. మౌనం అర్ధాంగీకారమే కదా అనే చర్చా జిల్లాలో కొనసాగుతోంది. ఏదైనా రాజకీయపరమైన వివాదం అయితే పార్టీ తరఫున ఖండించే అవకాశమైనా పార్టీ నేతలకు ఉండేది. వ్యక్తిగతమైన వివాదం కావడంతో ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని జిల్లా టీడీపీ నేతలు సైతం మిన్నకుండిపోతున్నారు. ఆమంచి ఆరోపణలు ఇవీ... ► కరణం బలరాంకు 1985లో ప్రసూన అనే మహిళతో శ్రీశైలంలో వివాహం జరిగింది. ► వీరిరువురికీ అంబిక కృష్ణ 1989లో హైదరాబాద్‌లోని సెయింట్ థెరిస్సా హాస్పిటల్లో జన్మించింది. ► అంబిక ఎస్ఎస్సీ సర్టిఫికెట్, ఆధార్‌కార్డులో తండ్రి పేరు కరణం బలరామకృష్ణ మూర్తి అని ఉంది. ► అంబిక అన్నప్రాసన, మొదటి పుట్టిన రోజు వేడుకలు, అక్షరాభ్యాస వేడుకలకు సంబంధించిన ఫొటోల్లోనూ బలరాం ఉన్నారు. ► బలరాం తన నామినేషన్లో ప్రసూన, అంబిక కృష్ణల వివరాలను పొందుపర్చకుండా దాచిపెట్టారు. ► ఎన్నికల చట్ట నింబంధన ప్రకారం కరణం నామినేషన్ చట్ట ఆమోదయోగ్యమైన నామినేషన్‌గా పరిగణించడానికి వీల్లేదు. ► బలరాం ఎన్నికను రద్దు చేయాలి.. అంతేకాకుండా చీరాల నియోజకవర్గం నుంచి తాను(ఆమంచి) ఎన్నికైనట్లు ప్రకటించాలి. ► తన తండ్రి ఎవరనేది ప్రపంచానికి చెప్పాలని అంబిక కోరిక.. ఆమెకు న్యాయం చెయ్యాలని నేను ప్రయత్నిస్తున్నా.. పదవుల కోసం కాదు. ► అంబిక తన కూతురు కాదని బలరాం అంటే కనుక ఫోరెన్సిక్, డీఎన్ఏ వంటి ఏ పరీక్షకైనా అంబిక సిద్ధంగా ఉన్నారు. ► కన్న కూతురు పేరు ఎన్నికల అఫిడవిట్లో పెట్టని కఠినమైన వ్యక్తి కరణం బలరాం. -
సంతానంపై ఈసీకి బలరాం తప్పుడు అఫిడవిట్
విజయవాడ సిటీ: పిల్లలు ఎంతమంది అనే విషయంలో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిని అనర్హుడిగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల కమిషన్(ఈసీ)ను డిమాండ్ చేశారు. బలరాంకు నాలుగో సంతానంగా అంబికకృష్ణ ఉండగా, తనకు ముగ్గురు బిడ్డలేనంటూ ఈసీకిచ్చిన అఫిడవిట్లో తప్పుడు సమాచారమిచ్చారన్నారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలంటూ తాను ఈనెల 4న హైకోర్టులో ఎన్నికల పిటిషన్ వేసినట్టు తెలిపారు. ఆమంచి మంగళవారం విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బలరాం నాల్గవ సంతానానికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. అన్నప్రాసన నుంచి ప్రతి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలు, సెయింట్ థెరిసా హాస్పటల్లో అంబిక తండ్రిగా బలరాం పేరుతో ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు, ఎంసెట్ హాల్‌టిక్కెట్, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్, బ్యాంకు అకౌంట్, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ చేయడానికిచ్చిన వినతిపత్రం, ఆధార్కార్డుసహా పలు పత్రాలను మీడియాకు చూపారు. బలరాం తన తండ్రి అని ఒక కుమార్తెగా తెలియజేసేందుకు ఇవి సరిపోతాయని, వీటిని కాదంటే.. డీఎన్ఏ పరీక్షలకు సైతం సిద్ధంగా ఉన్నానని అంబిక చెప్పిందన్నారు. అతి పిన్నవయసులో ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం టీడీపీ ఆంధ్ర, తెలంగాణకు అధికార ప్రతినిధిగా ఉన్న కాట్రగడ్డ ప్రసూనకు, బలరాంకు కుమార్తెగానేగాక ప్రఖ్యాత రాజకీయవేత్త ఎన్జీ రంగాకు దగ్గర బంధువుగా ఆమె అందరికీ తెలుసన్నారు. సామాన్య మహిళగా తన తల్లి, తండ్రి ఎవరనేది ఈ సమాజానికి తెలియజేయడానికి డాక్టర్ శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా తన మద్దతు కోరిందన్నారు. తాను బలరాంపై పోటీ చేసి ఓటమి చెందాను కాబట్టి ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించిన విధానంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఆమంచి చెప్పారు. హైకోర్టులో తాను దాఖలు చేసిన పత్రాలన్నింటిపై తనతోపాటు అంబిక సైతం సంతకాలు చేశారన్నారు. ఈ విషయమై బలరాం స్పందించడమేగాక చట్టానికి లోబడి రాజీనామా చేయాలని లేదా నైతికంగా సమాధానం చెప్పాలని ఆమంచి డిమాండ్ చేశారు. విలువల గురించి ఊదరగొట్టే ప్రతిపక్ష నేత చంద్రబాబు.. తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన విషయంపై స్పందించి బలరాంపై ఏం చర్యలు తీసుకుంటారో జవాబు చెప్పాలన్నారు. చంద్రబాబుకు అంబిక బాగా తెలుసన్నారు. ఆమె రాసిన పుస్తకాన్ని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు స్వయంగా ఆవిష్కరించారన్నారు. జన్మనిచ్చిన కుమార్తెను తన కూతురు కాదనే క్రూరమైన మనస్తత్వమున్న వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుంటే చంద్రబాబు సైతం తప్పు చేసిన వారవుతారన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఎన్నికల్లో తప్పుడు ఆఫిడవిట్ సమర్పించారని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. ఈ మేరకు బలరాంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై మంగళవారం విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బలరాం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారు. బలరాంకు నలుగురు పిల్లలైతే ఆఫిడవిట్లో ముగ్గురని పేర్కొన్నారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశామ’ని తెలిపారు. బలరాం నాలుగో సంతానంకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోలను, కొన్ని పత్రాలను ఆయన మీడియాకు చూపించారు. తనను చెల్లిగా భావించి న్యాయం చేయాలని ఆ అమ్మాయి(బలరాం కూతురు) తనను ఆడిగినట్టు ఆమంచి పేర్కొన్నారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కాబట్టే కోర్టులో పిటిషన్ వేసినట్టు స్పష్టం చేశారు. -
ఆఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారు
-
కరణం బలరాం భార్య, కుమార్తె వివరాలు దాచిపెట్టారు..
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తి ఎన్నికను సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించారు. కరణం బలరాం ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఆయన ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేశారు. ఇందులో కరణంతోపాటు ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులను, రిటర్నింగ్ అధికారిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. వాస్తవాలు చెప్పకపోతే ఎన్నికను రద్దు చేయొచ్చు ‘కరణం బలరాం సమర్పించిన నామినేషన్ ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా లేదు. చట్టప్రకారం బహిర్గతం చేయాల్సిన వాస్తవాలను వెల్లడించకపోయినప్పటికీ ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. కరణం బలరాం తన నామినేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చారు. వాస్తవాలను దాచిపెట్టారు. భార్య, తనపై ఆధారపడి జీవిస్తున్న వారి వివరాలను బహిర్గతం చేయకుండా తొక్కిపెట్టారు. నామినేషన్లో భార్య పేరును కరణం సరస్వతిగా పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆయనకున్న మరో భార్య ప్రసూన గురించి ప్రస్తావించలేదు. తనపై ఆధారపడి జీవిస్తున్నవారు ఎవరూ లేరని తెలిపారు. ప్రసూన గురించి, ఆమె ఆదాయం, ఆస్తి, అప్పుల గురించి వివరించలేదు. పలువురు ప్రముఖులు, కుటుంబసభ్యుల సమక్షంలో 1985లో ప్రసూనతో బలరామకృష్ణ మూర్తి వివాహం శ్రీశైలంలో జరిగింది. కరణం బలరాం, ప్రసూనలకు అంబిక కృష్ణ 1989లో హైదరాబాద్‌లోని సెయింట్ థెరిస్సా ఆస్పత్రిలో జన్మించింది. అంబిక ఎస్ఎస్సీ సర్టిఫికెట్లో, ఆధార్ కార్డులో తండ్రి పేరు కరణం బలరామకృష్ణ మూర్తి అని ఉంది. అంబిక అన్నప్రాసన, మొదటి పుట్టినరోజు వేడుకలు, అక్షరాభ్యాస వేడుకలకు సంబంధించిన ఫొటోల్లోనూ బలరాం ఉన్నారు. అంబిక కృష్ణ ప్రస్తుతం ఎల్ఎల్బీ చదువుతోంది. బలరాం తన నామినేషన్లో ప్రసూన, అంబిక కృష్ణల వివరాలను పొందుపరచకుండా దాచిపెట్టారు. ఎన్నికల చట్ట నిబంధనల ప్రకారం.. కరణం నామినేషన్‌ను చట్ట ఆమోదయోగ్యమైన నామినేషన్‌గా పరిగణించడానికి వీల్లేదు. అందువల్ల ఆయన నామినేషన్‌ను చెల్లనిదిగా ప్రకటించాలి. బలరాం ఎన్నికను రద్దు చేయండి. అంతేకాకుండా చీరాల నియోజకవర్గం నుంచి నేను ఎన్నికైనట్లు ప్రకటించండి’ అని కృష్ణమోహన్ తన పిటిషన్లో వివరించారు. -
చీరాలలో ‘క’రణమే!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చీరాల టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి పేరు దాదాపు ఖాయమైంది. ఇటీవల అధికార పార్టీని వీడిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌పై కరణంను నిలపాలని ముందే నిర్ణయించిన ముఖ్యమంత్రి ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. తన నిర్ణయాన్ని వ్యక్తపరిచేందుకు సీఎం శనివారం చీరాల టీడీపీ నేతలతో అమరావతిలో మొక్కుబడి సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. చీరాల నుంచి కరణం బలరాంను అభ్యర్థిగా నిలిపితే అక్కడి బీసీలకు టీడీపీ మొండిచేయి చూపినట్లే. తమకే ఈ సారి టికెట్ కేటాయించాలని అక్కడి బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మాజీమంత్రి పాలేటి రామారావు తనకే టికెట్ ఇవ్వాలని సీఎంపై ఒత్తిడి పెంచారు. మరోవైపు ఎమెల్సీ పోతుల సునీత సైతం తనకు అవకాశం కల్పించాలని తొలుత ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం. ఆ తరువాత సీఎం మదిలోని కరణంను నిలపాలన్న ఆలోచనను పసిగట్టిన సునీత చివరకు కరణం అభ్యర్థిత్వానికే మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చీరాల అభ్యర్థిని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి మొక్కుబడి సమావేశం నిర్వహించారు. మాజీమంత్రి పాలేటి, ఎమ్మెల్సీ పోతుల సునీతతో పాటు నియోజకవర్గానికి చెందిన 140 మందికి పైగా నేతలు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. పాలేటి తాను పార్టీ అభివృద్ధి కోసం నిరంతరాయంగా కృషిచేస్తున్నానని, కష్టాన్ని గుర్తించాలని సీఎంను కోరినట్లు తెలుస్తోంది. పలువురు బీసీ నేతలు ఈ సారి చీరాల టికెట్ బీసీలకు కేటాయించాలని సీఎంను కోరారు. బీసీ అభ్యర్థి ప్రతిపాదనన పట్ల సీఎం విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒక దశలో ఆ ప్రతిపాదన చేసిన బీసీ నేతలను ముఖ్యమంత్రి కసరుకున్నట్లు సమాచారం. మంచి అభ్యర్థిని నిలపాలని, విజయం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని ఎమెల్సీ పోతుల సునీత సీఎంకు చెప్పారు. తనకు చీరాల పరిస్థితి మొత్తం తెలుసని, అన్ని సర్వే రిపోర్ట్ లు తనవద్ద ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. తానే అభ్యర్థిని సూచిస్తానని తాను ఎంపిక చేసిన అభ్యర్థిని గెలిపించుకు రావాలని ముఖ్యమంత్రి నేతలనే ఆదేశించినట్లు తెలుస్తోంది. సమావేశంలోకి సెల్ఫోన్లను అనుమతించ లేదు. బాపట్ల పార్లమెంట్ పరిధిలోని అభ్యర్థులు వీరే.. అనంతరం శనివారం బాపట్ల పార్లమెంట్ సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించారు. ప్రధానంగా చీరాలతో పాటు సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాల టికెట్ కేటాయింపులపై చర్చ జరిగింది. అనంతరం బాపట్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని స్థానాలకు టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు సిట్టింగ్ అభ్యర్థులకే అవకాశం ఇచ్చారు. పార్లమెంట్ స్థానానికి సిట్టింగ్ ఎంపీ శ్రీరాం మాల్యాద్రి, రేపల్లె అసెంబ్లీకి సిట్టింగ్ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్, బాపట్లకు అన్నం సతీష్ ప్రభాకర్, వేమూరు నుంచి నక్కా ఆనందబాబు, చీరాల కరణం బలరామకృష్ణమూర్తి, పర్చూరు ఏలూరు సాంబశివరావు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, సంతనూతలపాడు బీఎన్ విజయ్‌కుమార్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. వీరిలో కరణం బలరాం విషయం మాత్రం ఒకటి రెండ్రోజుల్లో స్పష్టత ఇస్తానన్నట్టు తెలిసింది. -
అభ్యర్థి ఎవరో..?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఒంగోలు పార్లమెంటు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అభ్యర్థి కరువయ్యారు. ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చేయలేనని ఎమ్మెల్సీ మాగుంట చేతులెత్తేయడంతో ఇప్పుడు టీడీపీకి అభ్యర్థిని వెతుకు లాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తొలుత ఎమ్మెల్సీ కరణం బలరాంను ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని ఆలోచించినా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కరణంను చీరాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి నిలపాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావును ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని టీడీపీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. బీదా సోదరులు ఇందుకు అంగీకరిస్తారా.. లేదా..? అన్నది తెలియాల్సి ఉంది. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆ పార్టీ అధిష్టానం పలుమార్లు ప్రకటించింది. తానే పోటీలో ఉంటానని మాగుంట సైతం ప్రకటించారు కూడా. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒంగోలు పార్లమెంటు నుంచి తాను పోటీ చేయలేనని ఎమ్మెల్సీ మాగుంట టీడీపీ అధిష్టానానికి, ఇటు జిల్లా నేతలకు తేల్చి చెప్పారు. వారం రోజుల క్రితం ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో మాగుంట ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో పలు నియోజకవర్గాల్లో టీడీపీకి సమర్థులైన అభ్యర్థులు లేరని వీరితో కలిసి పోటీకి దిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతులో ఓటమి ఖామయని మాగుంట భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు జిల్లా నేతలకు ఆయన వివరించినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఒంగోలు నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఉందని, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రతిపక్ష పార్టీని ఎదుర్కోవడం సాధ్యమయ్యేది కాదని మాగుంట భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పోటీకి ఆయన విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ అధిష్టానం, జిల్లా నేతలు బుజ్జగించినా ఆయన ససేమిరా అంటున్నట్లు సమాచారం. మాగుంట పోటీకి దూరమయ్యే పక్షంలో టీడీపీకి ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కనిపించడం లేదు. ఆర్థికబలం, అంగబలం ఉన్న మాగుంటే ఓడిపోతానని చెబితే మిగిలిన వారు పోటీకి ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒంగోలు పార్లమెంటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా మారింది. రోజు రోజుకు ఆపార్టీ పార్లమెంటు నియోజకవర్గంలో బలం పుంజుకుంటోంది. ఈ పరిస్థితుల్లో తెలిసి పోటీ చేసి ఓటమి కొని తెచ్చుకోవడం ఎందుకని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. జిల్లా స్థాయిలో ఒంగోలు పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. బయటి ప్రాంతాల నుంచి కొత్త వారిని తెచ్చి ఇక్కడ పోటీలో నిలపాలని టీడీపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. బలరాంను చీరాలలో నిలిపేందుకు సీఎం పట్టు.. మాగుంట పోటీ నుంచి తప్పుకుంటే టీడీపీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత కరణం బలరాంను ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేయిస్తారన్న ప్రచారం జరిగింది. తాజాగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవడంతో కరణం బలరాంను చీరాల నుంచి బరిలో దింపుతారన్న ప్రచారం జోరందుకుంది. తాము చీరాల నుంచి పోటీ చేయడం లేదని, ఆ నియోజకవర్గానికి చెందిన బీసీ నేతలలో ఒకరిని టీడీపీ అభ్యర్థిగా పోటీలో నిలుపుతామని కరణం చెబుతున్నా.. సీఎం ఒత్తిడి తెస్తే చివరకు కరణం బలరాం పోటీలో ఉండక తప్పని పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కరణం ఒంగోలు పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. తెరపైకి బీదా.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావును ఒంగోలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. బీదా మస్తాన్‌రావు యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం తదితర ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా యాదవ సామాజిక వర్గం బలంగానే ఉంది. బీసీ ఓటు బ్యాంకు ఎక్కువే. మరో వైపు ఇప్పటి వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీడీపీ అభ్యర్థుల వివరాలు పరిశీలిస్తే బీసీ అభ్యర్థి లేరు. ఒకవేళ చీరాలకు బీసీ అభ్యర్థిని కేటాయిస్తే ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చినట్లు అవుతుంది. అలా కాకుండా కరణం బలరాంను చీరాల అభ్యర్థిగా ఎంపిక చేస్తే అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీడీపీ నుంచి బీసీ అభ్యర్థి లేనట్లే అవుతోంది. ఈ క్రమంలో పార్లమెంటు నుంచి బీసీ అభ్యర్థిని నిలిపి ఆ సామాజిక వర్గం ఓట్లను ఆకట్టుకోవాలన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీదా మస్తాన్‌రావును ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేయించేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన సోదరుడు బీదా రవిచంద్రతో బుధవారం రాత్రి అమరావతిలో అధిష్టానం చర్చలు జరిపింది. ఈ పరిస్థితిలో బీదా సోదరులు ఒంగోలు నుంచి బరిలోకి దిగేందుకు సుముఖత వ్యక్తం చేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.. -
తిరుగుబాటు..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా టీడీపీలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుగుబాటు జరగబోతోందా...? బాబు చర్యలను వ్యతిరేకిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు సొంత పార్టీపైనే ధ్వజమెత్తనున్నారా...? పతాక స్థాయికి చేరిన హోదా పోరు చంద్రబాబు సర్కారు ఎన్డీఏతో తెగతెంపులు, బీజేపీతో గొడవల నేపథ్యంలో అధికార పార్టీలో అభద్రత భావం పెరిగిందా...? వైఎస్ జగన్ పాదయాత్రపై సర్వత్రా సానుకూలత ప్రభావం టీడీపీ నేతలపై పడిందా..? కరణం బలరాం స్వరం పెంచడం వెనుక కారణమేమిటి..? జిల్లాలో కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు బలరాంకు మద్దతు పలుకుతుండటం వెనుక అంతర్యమేమిటి...? వారు అధికార పార్టీ నుంచి బయటపడతారా..? లేక ప్రజల్లో అధికార పార్టీపై పెరుగుతున్న వ్యతిరేకతను తప్పించుకునేందుకే ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారా..? అన్న విషయాలు జిల్లాలో ప్రసుత్తం హాట్‌టాపిక్‌గా మారాయి. వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధి విషయం చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దొనకొండకు ఒక్క పరిశ్రమను కూడా రాకుండా అడ్డుకుంటున్నారని సాక్షాత్తు చంద్రబాబు సమకాలికుడు, అధికార పార్టీ ఎమ్మెల్సీ కరణం బలరాం ఏకంగా మండలిలోనే ధ్వజమెత్తడం జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 13 జిల్లాల రాష్ట్ర చిత్రపటంలో అసలు ప్రకాశం జిల్లా లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందా..? అంటూ బలరాం తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం సొంత పార్టీలో అలజడి రేకెత్తించింది. దొనకొండను రాజధానిగా ఊహించుకున్నా... అది జరగలేదని, కనీసం పరిశ్రమలైనా వస్తాయని భావిస్తే అదీ జరగలేదని బలరాం ఆవేదన చెందారు. పైపెచ్చు వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఈ ప్రాంతంలో సాగు, తాగునీరుతో పాటు పరిశ్రమలకు తగినంత నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. అలా కాని పక్షంలో 10 కి.మీ. కాలువ తవ్వితే నాగార్జున సాగర్ కుడికాలువ నీరు పరిశ్రమలకు అందే అవకాశం ఉందని చెప్పారు. బ్రిటీష్ కాలం నాటి విమానాశ్రయం, రైల్వేజంక్షన్ దొనకొండలో అందుబాటులో ఉన్న ప్రభుత్వం ఇక్కడకు పరిశ్రమలు తీసుకురాకుండా అడ్డుకుంటోందని బలరాం విమర్శించారు. చాలా కాలం తర్వాత కరణం బలరాం ముఖ్యమంత్రితో పాటు ఏకంగా ప్రభుత్వంపైనే విమర్శన బాణాలు సంధించటం జిల్లా అధికార పార్టీని కుదుపునకు గురి చేస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చుకోవటాన్ని ఆదిలోనే కరణం వ్యతిరేకించారు. ఇది సరికాదని హితబోధ చేశారు. అయినా బలరాం మాటలను బాబు పెడచెవిన పెట్టారు. ఆ తర్వాత జిల్లా అభివృద్ధిపైన బలరాం తరచూ తనకున్న అవగాహన మేరకు తన వాణిని వినిపిస్తూనే వచ్చారు. కరణంతో పాటు మిగిలిన పాత నేతలు సైతం అంతర్గతంగా అధినేతతో పాటు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల రాకతో కరణంతో సహా పాత నేతలు దివి శివరాం, పోతుల సునీత, అన్నా రాంబాబు తదితరులను చంద్రబాబు పక్కన పెట్టారు. ఏ మాత్రం ప్రాధాన్యమివ్వక పూచికపుల్లలా చూశారు. ఇది భరించలేని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీ కండువాను కిందపడవేసి పార్టీ నుంచి తప్పుకున్నారు. అక్కడ పాత టీడీపీ కార్యకర్తలు, నేతలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్, రేషన్‌కార్డు కూడా తెచ్చుకోలేక అవమానాలకు గురవుతున్నారు. ♦ కందుకూరులోనూ ఇదే పరిస్థితి. ఎమ్మెల్యే పోతుల రామారావు అధికార పార్టీలో చేరడంతో నిన్న మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగిన మాజీ ఎమ్మెల్యే దివి శివరాం నిరాదరణకు గురయ్యారు. ఉంటే.. ఉండూ.. పోతే పో అన్నట్లుగా అధినేత వ్యవహరించటంతో విధి లేని పరిస్థితుల్లో శివరాం సర్దుకుపోవాల్సి వచ్చింది. ఎమ్మెల్యే పోతుల రామారావు ఆయన సోదరుడు, ఆయన అనుచరగణం అంతా తామై వ్యవహరిస్తుండటంతో శివరాం నిస్సహాయుడిగా మారిపోయారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేసిన ఆయన వర్గం నిరాదరణకు గురై రగిలిపోతున్నారు. ♦ యర్రగొండపాలెం నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. వైఎస్సార్ సీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన డేవిడ్‌రాజు అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో అక్కడ పాత నేతలు, కార్యకర్తలు పనికిరాకుండా పోయారు. ♦ చీరాల నియోజకవర్గంలోనూ స్వతంత్య్ర ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ అధికార పార్టీలో చేరడంతో అతనిపై ఎదురొడ్డి పోరాడిన పోతుల సునీత తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే చివరి నిమిషంలో చంద్రబాబు ఆమెకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినా పాత టీడీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం నిరాదరణకు గురయ్యారు. ♦ కొండపిలో అధికార పార్టీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామికి అసమ్మతి సెగ తప్పడం లేదు. టీడీపీ జిల్లా అధ్యక్షుడితో మొదలు అధికార పార్టీలో చేరిన జూపూడి ప్రభాకరరావు సైతం ఎమ్మెల్యే స్వామిని వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ♦ సంతనూతలపాడు నియోజకవర్గంలోని అధికా ర పార్టీలో అసమ్మతి సెగ పతాకస్థాయికి చేరింది. మాజీ ఎమ్మెల్యే విజయకుమార్‌ను అధికార పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సామాజిక వర్గం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విజయకుమార్‌ను మార్చాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తున్నారు. ♦ అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను చంద్రబాబు టీడీపీలో చేర్చుకోవడంతో కరణం బలరాం వర్గం ఎదురొడ్డి పోరాడాల్సి వచ్చింది. ఎమ్మెల్యేలకే అధికారాలు అంటూ చంద్రబాబు కరణంను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి ఆయనను అద్దంకికి దూరం చేసేందుకు ప్రయత్నించారు.చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు ఫిరాయింపు ఎమ్మెల్యేలకే ప్రాధాన్యతనిస్తూ పాత తరం టీడీపీ నేతలను దూరం పెట్టారు. దీంతో వారు అధినేతతో పాటు పార్టీ తీరుపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పెరిగిన అసమ్మతి స్వరం ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్ర రూపం దాల్చటం, తొలుత హోదా అక్కర్లేదు.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలని చంద్రబాబు యూటర్న్ తీసుకోవటం, ఎన్డీఎతో తెగతెంపులు చేసుకోవాల్సి రావడం, బీజేపీతో గొడవల నేపథ్యంతో జిల్లా అధికార పార్టీలోనూ ఆందోళన మొదలైంది. వైఎస్ జగన్ పాదయాత్రకు ప్రకాశం జిల్లాలో అపూర్వ ఆదరణ లభించడం ఆ పార్టీ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. దీంతో పాటు వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధిని చంద్రబాబు సర్కారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. దొనకొండ, కనిగిరి ప్రాంతాల్లో పరిశ్రమలు తెచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలిస్తామన్న మాట నీటి మూటగానే మారింది. విమానాశ్రయం లేదు, పోర్టు లేదు, తీరప్రాంత అభివృద్ధి లేదు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. దీంతో ప్రజల్లో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక పాత నేతలను చంద్రబాబు దూరం పెట్టడంతో వారు మరింత రగిలిపోతున్నారు. ఇదే అదునుగా మరోమారు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. కరణం బలరాం ముందుండి చంద్రబాబు సర్కారుపై విమర్శలు గుప్పించటం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఆయనకు జిల్లాకు చెందిన పాత తరం నేతలు దివి శివరాంతో పాటు కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యేలు విజయకుమార్, అన్నా రాంబాబుతో పాటు కొందరు ముఖ్యనేతలు మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. ఇక అధికార పార్టీలో చేరినా..త్రుటిలో మంత్రి పదవిని కోల్పోయి అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సైతం కరణం బలరాంకు మద్దతు పలికే అవకాశం ఉందన్న ప్రచారమూ సాగుతోంది. మున్ముందు జిల్లా అధికార పార్టీలో అసమ్మతి దాడి మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇది ఏ స్థాయికి వెళ్తుందో వేచి చూడాల్సిందే...! -
బాబు సర్కారుపై కరణం ఫైర్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చంద్రబాబు సర్కారుపై ఆ పార్టీకే చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ కరణం బలరాం ఫైర్ అయ్యారు. వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధి గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొనకొండ ప్రాంతానికి పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నారంటూ పరిశ్రమల శాఖామంత్రి అమర్నాథ్రెడ్డిపై విరుచుకుపడ్డారు. బుధవారం శాసనమండలిలో మంత్రి అమర్నాథ్రెడ్డిని ప్రశ్నలతో కరణం బలరాం ఉక్కిరిబిక్కిరి చేశారు. దొనకొండ ప్రాంతంలో ఎన్ని పరిశ్రమలు రాబోతున్నాయంటూ ప్రశ్నించారు. ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదనలేవీ లేవంటూ మంత్రి సమాధానమివ్వడంతో బలరాం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిన పారిశ్రామికవేత్తలను తిరుపతి, వైజాగ్, గన్నవరం ప్రాంతాలకు తీసుకెళ్తుంటే దొనకొండకు ఎలా పరిశ్రమలొస్తాయంటూ నిలదీశారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తానే దొనకొండను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని ఆశించినా.. అది జరగలేదంటూ బలరాం మండిపడ్డారు. దొనకొండ పరిశ్రమలు ఎందుకు రావడం లేదంటూ అమర్నాథ్రెడ్డిని నిలదీశారు. ‘దొనకొండ ప్రాంతంలోనే తొలుత రాజధాని నిర్మిస్తారనుకున్నాం.. దాన్ని అమరావతికి తరలించినా అంగీకరించాం.. దొనకొండ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పి అభివృద్ధి చేస్తారని భావించాం.. నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్క పరిశ్రమ కూడా రాకపోతే ఎలా..? అంటూ బలరాం ప్రశ్నించారు. ఒక్క పరిశ్రమ కూడా రాకపోతే వెనుకబడిన ప్రకాశం జిల్లా ఎలా అభివృద్ధి సాధిస్తుందని కరణం ప్రశ్నించారు. ఏపీ పటం నుంచి ప్రకాశం జిల్లానుతొలగించారా..? 13 జిల్లాల ఏపీ చిత్రపటంలో ప్రకాశం జిల్లాను తొలగించారా..? అంటూ బలరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. దొనకొండ ప్రాంతంలో బ్రిటీష్ కాలంలోనే విమానాశ్రయం నిర్మించారన్నారు. ఇక్కడ రైల్వే జంక్షన్ కూడా ఉందన్నారు. వెలిగొండ ఫేజ్–1 పనులు పూర్తయితే తగినంత నీరు అందుబాటులో ఉంటుందన్నారు. అదీ కాకపోతే 10 కి.మీ. కెనాల్ తవ్వితే నాగార్జునసాగర్ వాటర్ సైతం అందుబాటులో ఉంటుందని బలరాం తెలిపారు. అయినా, ఇక్కడికి పరిశ్రమలను ఎందుకు రానివ్వడం లేదంటూ మంత్రిని ప్రశ్నించారు. ఇక్కడకు వస్తున్న వారిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలకు తామేం సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. మొత్తంగా వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బలరాం ఆగ్రహం వ్యక్తం చేయడం, మంత్రిని నిలదీయడం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దొనకొండలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని చివరకు మంత్రి హామీ ఇచ్చారు. -
పార్టీ పరువు తీస్తున్నారు: చంద్రబాబు
సాక్షి, అమరావతి : ప్రకాశం జిల్లా టీడీపీ నేతల ఘర్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై ఆయన టీడీఎల్పీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పరువు తీస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. తాను ఎవరికీ అన్యాయం చేయలేదని, కొత్త, పాత కలిసి పని చేయాలని ఎన్నోసార్లు చెప్పానని ఆయన అన్నారు. చేరికల వల్ల ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తున్నా అని, పదవులు ఇచ్చి గౌరవిస్తున్నానని, ఇంకా ఏం కావాలని అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఇంఛార్జ్‌లుగా బాధ్యతలు ఇచ్చాక జోక్యం వద్దని స్పష్టం చేశానని చంద్రబాబు పేర్కొన్నారు. చేరికల వల్ల పార్టీలో ఉన్నవారికి అన్యాయం జరగకుండా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి గౌరవించానని అన్నారు. ఇంతకంటే ఏం చేయాలని, అయినా గొడవలు పడుతూ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాంల మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్న విషయం తెలిసిందే. ఇరువురు నేతలు కుర్చీలు తీసుకొని పరస్పరం దాడికి తెగబడ్డారు. సై అంటే సై అంటూ సవాళ్లు విసురుకున్నారు. నువ్వెంతంటే.. నువ్వెంత అంటూ బాహాబాహీకి సిద్ధపడ్డారు. రాయలేని పదజాలంతో బండబూతులు తిట్టుకున్నారు. నిన్న (గురువారం) సాయంత్రం జరిగిన ఈ గొడవకు సాక్షాత్తూ రాజధాని అమరావతిలోని సచివాలయం వేదికైంది. మంత్రులు పరిటాల సునీత, పి.నారాయణ, శిద్దా రాఘవరావుతో పాటు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు సాక్షీభూతులుగా నిలిచారు. జిల్లాలో అధికార పార్టీ గొడవలు పతాక స్థాయికి చేరాయి. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు పై విధంగా స్పందించారు. -
సై అంటే సై
కొద్దిరోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాంల మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఇరువురు నేతలు కుర్చీలు తీసుకొని పరస్పరం దాడికి తెగబడ్డారు. సై అంటే సై అంటూ సవాళ్లు విసురుకున్నారు. నువ్వెంతంటే.. నువ్వెంత అంటూ బాహాబాహీకి సిద్ధపడ్డారు. రాయలేని పదజాలంతో బండబూతులు తిట్టుకున్నారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ గొడవకు సాక్షాత్తూ రాజధాని అమరావతిలోని సచివాలయం వేదికైంది. మంత్రులు పరిటాల సునీత, పి.నారాయణ, శిద్దా రాఘవరావుతో పాటు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు సాక్షీభూతులుగా నిలిచారు. జిల్లాలో అధికార పార్టీ గొడవలు పతాక స్థాయికి చేరాయనడానికి ఇదే ఉదాహరణ. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అమరావతిలోని సచివాలయంలో గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో మంత్రి శిద్దా రాఘవరావు ఛాంబర్లో ప్రకాశం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మంత్రి శిద్దాతో పాటు ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జి మంత్రులు నారాయణ, పరిటాల సునీతలు ఈ సమావేశానికి హాజరుకాగా టీడీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీలు కరణం బలరాం, పోతుల సునీత, ఎమ్మెల్యేలు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, ముత్తుముల అశోక్‌రెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు, డోలా బాలవీరాంజనేయస్వామి, పోతుల రామారా>వు, కదిరి బాబూరావు, నియోజకవర్గ ఇన్చార్జులు కందుల నారాయణరెడ్డి, దివి శివరాం తదితరులు హాజరయ్యారు. జిల్లాలో అధికార పార్టీకి తలనొప్పిగా పరిణమించిన పీడీసీసీబీ, ఒంగోలు డెయిరీతో పాటు పలు సమస్యలను చర్చించేందుకు నేతలు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో జిల్లాలో మార్కెట్ కమిటీల నియామకాలను పూర్తి చేయటం లేదని మార్టూరు మార్కెట్ కమిటీకి సంబంధించి పేర్లు ఇచ్చి చాలా కాలమైన ఎందుకు భర్తీ చేయలేదంటూ తొలుత పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమావేశంలో లేవనెత్తారు. దీంతో ఒక్కసారిగా స్పందించిన ఎమ్మెల్సీ కరణం బలరాం.. ‘ఏం ఫైనల్ అయితది... పార్టీలోకి కొత్తగా వచ్చినోళ్లు కామ్‌గా కూర్చుంటే కదా..’ అన్ని కెలుకుతున్నారు. ఏ పని కానివ్వటం లేదు. పార్టీని నమ్ముకొని 30 ఏళ్లుగా ఉన్న వాళ్లేమో నష్టపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు ప్రతిగా ఎమ్మెల్యే రవికుమార్ సైతం తానేమీ అడ్డుకోవడం లేదంటూ ఎదురుదాడికి దిగారు. గొట్టిపాటి ఒక్కసారిగా ఆగ్రహంగా లేచి బలరాం మాటలకు అడ్డుతగిలారు. ఎవరు అడ్డుకుంటున్నారంటూ ప్రతి సమాధానమిచ్చారు. శింగరకొండ దేవస్థానం కమిటీని మొదలుకొని అద్దంకి, సంతమాగులూరు మార్కెట్ కమిటీ పదవులు భర్తీ కాకుండా అడ్డుకుంటున్నావంటూ కరణం బలరాం రవికుమార్‌పై మరింత ఆగ్రహంతో ఊగిపోయారు. పింఛన్లు, పక్కా గృహాలు సైతం పాత కార్యకర్తలకు అందకుండా చేస్తున్నావంటూ విరుచుకుపడ్డారు. రవికుమార్ కూడా అంతే స్థాయిలో ఎదురుదాడికి దిగారు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఇరువురు ఆగ్రహంతో ఊగిపోయారు. ఇటు ఎమ్మెల్సీ కరణం.. కుర్చీ తీసుకొని గొట్టిపాటి వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. గొట్టిపాటి కూడా బలరాంపై కుర్చీ ఎత్తారు. నువ్వెంతంటే... నువ్వెంత అంటూ సవాళ్లు.. ప్రతిసవాళ్లు విసురుకున్నారు. పత్రికల్లో రాయలేని పదజాలంతో బూతులు తిట్టుకున్నారు. ఇరువురు కుర్చీలతో కొట్టుకునే ప్రయత్నానికి దిగడంతో బెంబేలెత్తిన మంత్రులు శిద్దా, నారాయణ, పరిటాల సునీతలతో పాటు ఎమ్మెల్యేలు మధ్యన దూరి ఇరువురిని పక్కకు నెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపు దూరంగా తీసుకెళ్లి శాంతింపజేశారు. 15 నిమిషాల తర్వాత తిరిగి సభను ప్రారంభించారు. పీడీసీసీబీ పంచాయితీ సీఎం వద్దకు... పీడీసీసీబీ చైర్మన్ ఎంపిక విషయం చర్చకు వచ్చింది. అందరూ అభిప్రాయాలను ముఖ్యమంత్రికి నివేదించామని, ఇక ముఖ్యమంత్రే చైర్మన్ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉందని మంత్రులు అభ్యర్థులకు చెప్పారు. అనంతరం ఒంగోలు డెయిరీపై వాడివేడిగా చర్చ సాగింది. ఒంగోలు డెయిరీని మూడేళ్లల్లోనే పాలకవర్గం కోట్లాది రూపాయలు అప్పుల్లోకి నెట్టిందని అసలు అంత అప్పు ఎందుకయిందో చెప్పాలంటూ మాజీ ఎమ్మెల్యే దివి శివరాం మంత్రుల ముందు వాదించారు. ఏ గ్రామానికి వెళ్లినా పాల డబ్బులివ్వలేదంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారన్నారు. వాస్తవాలు ముఖ్యమంత్రికి చెప్పకుండా కొందరు నేతలు పాలకవర్గానికి మద్ధతుగా నిలవడం సరికాదని శివరాం విమర్శించారు. ఇప్పటికైనా సీఎంకు వాస్తవాలు చెప్పాలన్నారు. డెయిరీ డబ్బులను అధికార పార్టీ కోసమే ఖర్చు చేశానంటూ పాలకవర్గం బయట ప్రచారం చేస్తుందని, ఈ విషయం బయట పత్రికల్లో సైతం వస్తుందని కరణం మంత్రుల దృష్టికి తెచ్చారు. అసలు పార్టీ కోసం ఎంత ఖర్చు పెట్టారు.. డెయిరీ అప్పెంత అన్న విషయం తేల్చాల్సి ఉందన్నారు. వాస్తవాలను సీఎం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయాలని కోరారు. ఆ తర్వాత 7.30 గంటలకు సమావేశం ముగించుకొని నేతలు వెళ్లిపోయారు. -
కరణం బలరాంపై చంద్రబాబు ఆగ్రహం
అమరావతి: ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల మధ్య వర్గ పోరుపై పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఇక్కడ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అద్దంకి నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలపై చర్చ జరిగింది. ఎమ్మెల్సీ కరణం బలరాం తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అద్దంకి నియోజక వర్గంలో కరణం బలరాం మాట చెల్లదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ నియోజకవర్గంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చెప్పిందే ఫైనల్ అని తేల్చేశారు. కరణం బలరాంకు ఎమ్మెల్సీ ఇచ్చిన సమయంలోనే ఈ విషయం చెప్పినట్లు చంద్రబాబు గుర్తుచేశారు. అయితే అప్పుడు అంగీకరించిన బలరాం ఇప్పుడు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మరోవైపు గత కొన్ని రోజులుగా గొట్టిపాటి, కరణం వర్గీయులు పరస్పరం దాడులకు పాల్పుడుతున్న విషయం తెలిసిందే. విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన చంద్రబాబు.. అద్దంకి నియోజక వర్గంలో మాత్రం రవికుమార్ నిర్ణయాలు చెల్లుబాటు అవుతాయని చెప్పడం కరణం బలరాం వర్గీయులలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం. -
మళ్లీ పడగ విప్పిన తమ్ముళ్ల వర్గపోరు
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతల మధ్య వర్గ పోరు కొనసాగుతోంది. బల్లికురవ మండలం వేమవరంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గీయుడిపై అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. గత నెలలో జరిగిన దాడిలో గాయాలపాలైన వెంకటేశ్వర్లుపై గొట్టిపాటి వర్గీయులు మరోసారి దాడి చేశారు. తన ఇంటి ముందు బైక్‌పై వెంకటేశ్వర్లు కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో గొట్టిపాటి శ్రీను అనే వ్యక్తి మరికొందరితో కలిసి బైక్ పై అక్కడికి వచ్చి దాడి చేశాడని స్థానికులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లును వెంటనే గ్రామస్తులు చికిత్స నిమిత్తం చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మినీ రణమేనా..?
♦ నేడు ఒంగోలులో టీడీపీ మినీ మహానాడు ♦ వేమవరం హత్యలతో రగిలిపోతున్న కరణం బలరాం వర్గం ♦ గొట్టిపాటి వర్గంతో ఢీ అంటే ఢీ ♦ బలప్రదర్శనకు సిద్ధమవుతున్న ఇరువర్గాలు ♦ మహానాడుకు తరలిరావాలని కార్యకర్తలకు పిలుపు ♦ మరోసారి పగలు రగిలే అవకాశం ♦ మంత్రులు, జిల్లా అధ్యక్షుడికి సాధ్యం కాని సర్దుబాటు ♦ నేటి సభకు భారీ బందోబస్తు ♦ ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ ఎన్.సంజయ్ జిల్లా కేంద్రంలో గురువారం జరిగే టీడీపీ మినీ మహానాడు సభ రణరంగంగా మారే అవకాశం కనిపిస్తోంది. కరణం, గొట్టిపాటి వర్గాలు ఈ సమావేశానికి హాజరైతే మరోమారు గొడవలు తప్పవని ఆ పార్టీ వర్గాలే ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఒంగోలు నగరంలోని ఏ1 కన్వెన్షన్ హాలులో గురువారం జరిగే సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గంలోని తన అనుచరులకు ఇప్పటికే పిలుపునిచ్చారు. కరణం వర్గీయులు సైతం సమావేశానికి భారీగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇరువర్గాలు సభకు హాజరైతే గొడవలు ఖాయం. వాటిని ఆపే శక్తి పార్టీ జిల్లా అధ్యక్షుడు, లేదా పార్టీ పరిశీలకులు, మంత్రులకు లేదు. ఇక పోలీసులు ఆది నుంచి చేష్టలుడిగి చూస్తుండటం తప్ప స్పందిస్తున్న దాఖలాల్లేవు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వేమవరం జంట హత్యల నేపథ్యంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గం ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ హత్యలకు కారణం గొట్టిపాటేనని బలరాం వర్గం ఆరోపణ. మంగళవారం ఒంగోలులో జరిగిన పార్టీ జిల్లా అధ్యక్ష ఎన్నిక సమావేశంలో కరణం, గొట్టిపాటి వర్గాలు బాహాబాహీకి సిద్ధపడిన విషయం తెలిసిందే. గన్మేన్లతో వచ్చిన గొడవ ఇటు కరణం, అటు గొట్టిపాటి వర్గాలు పరస్పర దాడులకు దిగే వరకు వచ్చింది. ఏకంగా కరణం, గొట్టిపాటిలు కలియబడ్డారు. పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఘర్షణలో గొట్టిపాటి చొక్కా చినిగి కిందపడిపోయాడు. గొట్టిపాటి గన్‌మేన్ తోయడంతోనే గొడవ మొదలైందని కరణం బలరాం పేర్కొన్నారు. మొత్తంగా మంగళవారం జరిగిన సమావేశం ఇరువర్గాల ఘర్షణతో రసాభాసగా మారింది. గొట్టిపాటి కనపడగానే ఆగ్రహంతో ఉన్న కరణం వర్గం దాడులకు తెగపడుతోంది. గొట్టిపాటి వర్గం సైతం ప్రతిదాడులకు సిద్ధమంటూ సవాల్ విసురుతోంది. ఆధిపత్య పోరుకు వేదిక.. గురువారం జరిగే మినీ మహానాడు మరోమారు రణరంగంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ శ్రేణులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం గొడవ నేపథ్యంలో కరణం వర్గంతో పాటు గొట్టిపాటి వర్గీయులు సైతం పెద్ద ఎత్తున మినీ మహానాడుకు హాజరయ్యేందుకు సిద్ధమవుతోంది. చిన్నపాటి గొడవ జరిగినా అమీతుమీ తేల్చుకోవాలని కరణం వర్గం సైతం సన్నద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆది నుంచి ఇరువర్గాల గొడవలను ఏ మాత్రం పట్టించుకోక జిల్లా పోలీస్ యంత్రాంగం చోద్యం చూస్తోంది. మంగళవారం నాటి ఘర్షణలోనూ ఇదే జరిగింది. గురువారం నాడు పరిస్థితి ఇలాగే ఉంటే మినీ మహానాడు ఇటు కరణం, అటు గొట్టిపాటి వర్గాలు అధిపత్య పోరుకు వేదికగా మారుతుందనడంలో సందేహం లేదు. ఘర్షణ ఏ స్థాయికి దారి తీసిన ఆశ్చర్యపడనక్కర్లేదు. గొడవలు పెంచింది.. చంద్రబాబే కరణం వ్యతిరేకించినా.. గొట్టిపాటిని పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు ఇరువర్గాల గొడవల విషయం పట్టించుకోవడం లేదు. దీంతో కరణం, గొట్టిపాటి వర్గాల అధిపత్యపోరు పతాకస్థాయికి చేరింది. అధికారుల బదిలీలు మొదలుకొని పింఛన్లు, బ్యాంక్ రుణాలు, అభివృద్ధి పనుల విషయంలో ఇరువురు పోటీ పడుతూ వచ్చారు. పంతం నెగ్గించుకునేందుకు అధికారులపై ఒత్తిడులు పెంచారు. వీరి గొడవలతో అద్దంకి నియోజకవర్గంలో జన్మభూమి–మా ఊరు కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. జనచైతన్యయాత్రల ఊసే లేదు. పార్టీ సభ్యత్వ కార్యక్రమం మూలనపడింది. ఇంత జరుగుతున్నా.. చంద్రబాబు జోక్యం చేసుకోలేదు. ఇద్దరిని ఒకే గూటికి చేర్చి తాంబూలాలిచ్చాం.. తన్నుకుచావండి.. అన్న రీతిలో వ్యవహరించారు. ఇరువురు నేతలను కూర్చోబెట్టి మాట్లాడింది లేదు. సర్దుబాటు చేసే ప్రయత్నం చేయలేదు. ఇదే విషయాన్ని ఇటీవల కరణం బలరాం సైతం పేర్కొనడం గమనార్హం. దీంతో అద్దంకి నియోజకవర్గంలో ఇరువురు నేతల గొడవలు మరింత పెరిగాయి. పదేళ్ల తర్వాత ఇక్కడ మళ్లీ హత్యారాజకీయాలు మొదలయ్యాయి. బాబు వైఖరి వేమవరం జంట హత్యలకు కారణమైందన్న విమర్శలున్నాయి. సీఎం ఆదేశాలు అమలయ్యేనా..? మంగళవారం ఒంగోలులో కరణం, గొట్టిపాటి వర్గాలు గొడవకు దిగడం, బుధవారం జరగాల్సిన మినీ మహానాడు వాయిదా పడిన నేపథ్యంలో దీనిపై ముఖ్యమంత్రి సీరియస్ అయినట్లు రొటీన్‌గా పత్రికల్లో వార్తలొచ్చాయి. గొట్టిపాటి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరినా.. ఆయన నిరాకరించినట్లు సమాచారం. గొడవల నేపథ్యంలో ఇరువర్గాలను పిలిచి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి అవేమీ పట్టించుకోవడం లేదు. అయితే బుధవారం ఉదయం పార్టీ అంతర్గత గొడవలపై ముఖ్యమంత్రి పార్టీ ముఖ్యనేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక నుండి పార్టీ సమావేశాల్లో ఏ ఒక్క నేత గొడవకు దిగినా.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా.. అక్కడికక్కడే సస్పెండ్ చేయాలని కమిటీ నేతలను సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఇది ఎంత వరకు అమలు జరుగుతుందో వేచి చూడాలి. మినీ మహానాడుకు భారీ బందోబస్తు ఒంగోలు క్రైం : ఒంగోలులో గురువారం నిర్వహించనున్న టీడీపీ మినీ మహానాడుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. టీడీపీ మినీ మహానాడును పురస్కరించుకొని గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ బందోబస్తు ఏర్పాట్లను ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రస్తుతం జిల్లా టీడీపీలో చోటు చేసుకున్న సంఘటనలను దృష్ట్యా ఐజీ స్వయంగా రంగంలోకి దిగారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం.త్రివిక్రమ వర్మ, ఒంగోలు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తో కలిసి ప్రాంగణాన్ని పరిశీలించారు. అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ మండలం వేమవరం గ్రామంలో జరిగిన జంట హత్యలు, తదనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్సీ కరణం బలరాం, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ల మధ్య, వారి అనుచరుల మధ్య ఏ–1 కన్వెన్షన్ హాలు చోటు చేసుకున్న ఘర్షణలు, తోపులాటలు, దూషణలను పురస్కరించుకొని పూర్తి స్థాయి పోలీస్ నిఘాలో మినీ మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం జిల్లాలోని అందరు డీఎస్పీలను ఇక్కడే మోహరింపచేయనున్నారు. ఎస్పీతోపాటు దాదాపు పది మందికి పైగా డీఎస్పీలు 25 మందికి పైగా సీఐలు వందల సంఖ్యలో ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులు, హోంగార్డులను మోహరింజేస్తున్నారు. నిఘా విభాగాల ముందస్తు సమాచారం మేరకు మినీ మహానాడు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గాల వారీగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మూడు, నాలుగు వేల మంది హాజరయ్యే సభకు కేవలం వెయ్యి మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఇందుకోసం పార్టీ ముఖ్యులకు పోలీస్ అధికారులు పాస్‌లు కూడా జారీచేసినట్టు సమాచారం. పాత గుంటూరు రోడ్డులో రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఏర్పాట్లపై జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తో పోలీసులు సమీక్షించారు. -
ఒంగోలులో తెలుగుదేశం స్ట్రీట్ ఫైట్
-
గొడవ వెనుక గొట్టిపాటి కుట్ర ఉంది
-
గొట్టిపాటి టీడీపీకి చెందిన వాడు కాదు : కరణం బలరాం
♦ కరణం, గొట్టిపాటి బాహాబాహీ ♦ ఇరువర్గాల సవాళ్లు, ప్రతి సవాళ్లు ♦ గొట్టిపాటిపై కరణం వర్గం దాడి ♦ తోపులాటలో కిందపడిపోయిన ఎమ్మెల్యే రవి ♦ రసాభాసగా టీడీపీ సమావేశం సవాళ్లు.. ప్రతి సవాళ్లు, పరస్పర దాడులతో టీడీపీ జిల్లా సమావేశం దద్ధరిల్లింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక కోసం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరణం బలరాం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గం బాహాబాహీకి సిద్ధమైంది. వేమవరం జంట హత్యల నేపథ్యంలో గొట్టిపాటిపై ఆగ్రహంతో ఉన్న కరణం వర్గం ఆయనపై దాడికి దిగింది. దీనిని అడ్డుకునేందుకు గొట్టిపాటి వర్గం ఎదురుదాడికి ప్రయత్నించింది. మొత్తంగా మంగళవారం జరిగిన టీడీపీ జిల్లా సమావేశం రణరంగాన్ని తలపించింది. ఒంగోలు నగరంలోనిఏ1 కన్వెన్షన్ హాలు ఇందుకు వేదికైంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక కోసం ఆ పార్టీ మంగళవారం ఒంగోలులోని ఏ1 కన్వెన్షన్ హాలులో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కరణం బలరాం, ఆయన తయుడు వెంకటేష్‌లు తమ వర్గీయులతో హాజరయ్యారు. ఇదే సమావేశానికి ఎమ్మెల్యే గొట్టిపాటితో పాటు ఆయన వర్గీయులు హాజరయ్యారు. ఈ నెల 29న జరిగిన వేమవరం జంట హత్యలకు ఎమ్మెల్యే గొట్టిపాటి కారణమని, తమ వర్గీయులను గొట్టిపాటి హత్య చేయించాడని కరణం వర్గీయులు ఆగ్రహంతో ఉంది. గొట్టిపాటిని చూడగానే ఎమ్మెల్సీ కరణం ఒక్కసారిగా రేయ్.. అంటూ గొట్టిపాటిపై చేయి చేసుకున్నారు. ముందుగా ఇరువురు ఎదురుపడిన సందర్భంలో గొట్టిపాటి గన్‌మేన్ కరణం గన్‌మేన్‌ను పక్కకు నెట్టే ప్రయత్నం చేయబోగా కరణం ఆగ్రహించినట్టు తెలుస్తోంది. చేయి చేసుకోబోయిన కరణంను గొట్టిపాటి గన్‌మేన్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కరణం, ఆయన అనుచరులు గన్‌మేన్‌తో పాటు గొట్టిపాటి అనుచరులను చితకబాదారు. ఇంతలో అక్కడకు చేరుకున్న మరింత మంది కరణం వర్గీయులు గొట్టిపాటి వర్గంపై దాడికి దిగింది. గొట్టిపాటిని రక్షించుకునే ప్రయత్నంలో ఆయన అనుచరులు గొట్టిపాటికి వలయంగా ఉండిపోయారు. ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. గొట్టిపాటి కింద పడిపోయారు. గొట్టిపాటి టీడీపీ కాదన్న కరణం.. పరిస్థితి అదుపు తప్పడం, గొట్టిపాటి కిందపడిపోవడం చూసిన జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణ, మంత్రులు పరిటాల సునీత, శిద్దా రాఘవరావులు పరుగులు పెట్టి ఇరువర్గాలను నిలువరించే ప్రయత్నం చేశారు. గొట్టిపాటి టీడీపీకి చెందిన వాడు కాదని.. టీడీపీ కార్యకర్తలను హత్య చేయించాడని అలాంటి వ్యక్తిని సమావేశానికి ఎలా రానిస్తారంటూ కరణం బలరాం, ఆయన తనయుడు వెంకటేష్‌లు పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మంత్రిని నిలదీశారు. వెంటనే గొట్టిపాటిని సమావేశం నుంచి బయటకు పంపాల్సిందేనంటూ సీరియస్‌గా చెప్పారు. లేకపోతే ఊరుకునేది లేదని అమీతుమీకి సిద్ధమని తేల్చి చెప్పారు. దీంతో బెంబేలెత్తిన మంత్రులు గొట్టిపాటిని అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ కోరారు. తామేందుకు వెళ్లాలంటూ గొట్టిపాటి వర్గం మంత్రులతో వాదనకు దిగింది. కరణం వర్గం కేకలు, ఈలలతో అంతు తేలుస్తామంటూ రెచ్చిపోయింది. గొట్టిపాటి అనుచరులపై మరోమారు దాడికి సిద్ధమైంది. పరిస్థితి విషమించటంతో మంత్రులు గొట్టిపాటికి నచ్చజెప్పి జిల్లా అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన అభిప్రాయం తీసుకొని ఆయన్ను సమావేశం నుంచి పంపించి వేశారు. టీడీపీ అధ్యక్ష ఎన్నిక వాయిదా.. గొట్టిపాటి, కరణం వర్గాల గొడవతో టీడీపీ జిల్లా సమావేశం రచ్చరచ్చగా మారింది. ఈ సమావేశంలోనే అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉండగా కరణం, గొట్టిపాటి గొడవ నేపథ్యంలో మంత్రులు ఎన్నికను వాయిదా వేశారు. పాత నేతలతో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవడంతో సరిపెట్టారు. అందరి అభిప్రాయాలను ముఖ్యమంత్రికి పంపుతామని అధ్యక్ష ఎన్నిక విషయంలో సీఎం తుది నిర్ణయం తీసుకుంటారని మంత్రులు విలేకర్లకు చెప్పి చేతులు దులుపుకున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పరార్.. ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య గొడవ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు జిల్లా సమావేశం నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు. తొలుత సమావేశానికి వచ్చిన కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లు సమావేశంలో పది నిమిషాలు మాత్రమే ఉండి గొట్టిపాటి రవికుమార్ వెళ్లిన మరుక్షణమే వారు వెళ్లిపోయారు. హత్య చేసిన వారిని వదిలిపెట్టం.. గొట్టిపాటి రవికుమార్‌ది అసలు టీడీపీనే కాదు. పార్టీ కార్యకర్తలను హత్య చేసిన వాడిని సమావేశానికి ఎలా రానిస్తారు? నిర్దాక్షిణంగా కార్యకర్తలను హత్య చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టం. కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటాం. ఎవరిపైనా నిష్కారణంగా దాడి చేయాల్సిన పని మాకు లేదు. – విలేకరులతో కరణం రెచ్చగొడుతున్నా..సహిస్తున్నా.. : కరణం బలరాం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. అయినా సహిస్తున్నా. వేమవరం జంట హత్యలకు గ్రామంలోనే పరిస్థితులే కారణం. – విలేకరులతో గొట్టిపాటి -
తెలుగుదేశం స్ట్రీట్ ఫైట్
ప్రకాశం టీడీపీ అధ్యక్ష ఎన్నిక రణరంగం - కరణం, గొట్టిపాటి వర్గాల బాహాబాహీ - గొట్టిపాటిపై చేయి చేసుకున్న కరణం బలరాం - గొట్టిపాటి గన్‌మెన్‌ను చితకబాదిన కరణం అనుచరులు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్ష ఎన్నిక కోసం నిర్వహించిన సమావేశం రణరంగాన్ని తలపించింది. మంగళవారం ఒంగోలులో జరిగిన ఈ సమావేశం వేదికగా ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాలు బాహాబాహీకి దిగాయి. బల్లికురవ మండలం వేమవరంలో జరిగిన జంట హత్యలకు గొట్టిపాటే కారణమని ఆగ్రహంతో రగిలిపోతున్న కరణం వర్గం ఆయనపై దాడికి దిగింది. దీనిని గొట్టిపాటి వర్గం అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. గొట్టిపాటి చొక్కా చిరిగి కిందపడిపోయారు. టీడీపీ జిల్లా అధ్యక్ష ఎన్నిక కోసం ఒంగోలు నగరంలోని ఏ1 కన్వెన్షన్‌లో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణతో పాటు మంత్రులు పరిటాల సునీత, శిద్దా రాఘవరావు సమావేశానికి హాజరయ్యారు. పాత నేతలతో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు సమావేశానికి వచ్చారు. 11 గంటల ప్రాంతంలో ఎమ్మెల్సీ కరణం బలరాం, ఆయన తనయుడు కరణం వెంకటేష్ తమ వర్గీయులతో సమావేశానికి హాజరయ్యారు. 11.15 గంటలకు అనుచరులతో కలసి ఎమ్మెల్యే గొట్టిపాటి సమావేశానికి వచ్చారు. సమావేశ మందిరం గడపలోనే గొట్టిపాటి, కరణం ఎదురుపడ్డారు. గొట్టిపాటి గన్‌మేన్ కరణం గన్‌మేన్‌ను నెట్టబోగా కరణం ఆగ్రహంతో రగిలిపోయి దాడికి పాల్పడ్డారు. గొట్టిపాటిపై చేయి చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది. కరణం వర్గీయులు ఒక్కసారిగా మూకుమ్మడి దాడికి దిగారు. గొట్టిపాటి వర్గీయులు సైతం ఎదురుదాడికి దిగారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. సర్దుబాటుకు మంత్రుల ప్రయత్నం... ఇరు వర్గాల తోపులాట, కేకలతో సమావేశ మందిరం దద్దరిల్లింది. పరిస్థితి అదుపు తప్పుతున్న విషయం గమనించిన మంత్రులు నారాయణ, పరిటాల సునీత, రాఘవరావు ఇరువర్గాలను సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. వేమవరంలో టీడీపీ నేతలను హత్య చేయించిన గొట్టిపాటిని సమావేశానికి ఎలా అనుమతిస్తారంటూ కరణం మంత్రులను నిలదీశారు. గొట్టిపాటిని వెంటనే సమావేశం నుంచి పంపించాలని సూచించారు. పరిస్థితి సద్దుమణగకపోవడంతో మంత్రులు, జిల్లా అధ్యక్షుడి ఎన్నికల విషయంలో అభిప్రాయం తీసుకొని గొట్టిపాటిని బయటకు పంపించారు. సమావేశంలో రసాభాసగా మారడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్‌రెడ్డి, పోతుల రామారావు, ఆమంచి కృష్ణమోహన్ సైతం పది నిమిషాల్లోనే సమావేశం నుంచి వెళ్లిపోయారు. దేనికైనా సిద్ధం: కరణం బలరాం కింద నుంచి పై స్థాయి వరకు పార్టీ కార్యకర్తలను రక్షించుకునే విషయంలో దేనికైనా సిద్ధపడతా. వెనుకడుగు వేయబోను. కొందరు ఫిరాయింపు నాయకులు దిగజారి ప్రవర్తించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. నాలుగు రోజుల క్రితం హత్యలు చేయించి నాయన ఏం ముఖం పెట్టుకొని సమావేశానికి వస్తారు? ప్రభుత్వ గన్మెన్లను సైతం తన స్వార్థానికి వాడుకునేంతగా గొట్టిపాటి దిగజారారు. ఆర్థికంగా లబ్ధి పొందేందుకే పార్టీ మారారు తప్ప పార్టీకి మేలు చేద్దామని కాదు. నా కార్యకర్తలను రక్షించుకునే విషయంలో ఎంతవరకైనా వెళ్తా. -
గొట్టిపాటికి చంద్రబాబు షాక్!
-
గొట్టిపాటికి చంద్రబాబు షాక్!
ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు షాకిచ్చారు. మంగళవారం ఉదయం ఒంగోలులో తనకు కరణం బలరాంతో జరిగిన ఘర్షణ విషయమై ఫిర్యాదు చేసేందుకు ఆయన ముఖ్యమంత్రిని నేరుగా కలుస్తానని ఉదయమే చెప్పిన విషయం తెలిసిందే. అందుకోసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి ఇప్పుడు బిజీగా ఉన్నారని, కలవడం కుదరదని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఆయనకు చెప్పారు. దాంతో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుందా అని గొట్టిపాటి రవికుమార్ ఎదురు చూస్తున్నారు. ఈరోజు కాకపోయినా రేపయినా చంద్రబాబును కలవాలని ఆయన భావిస్తున్నారు. బుధవారం నాడు తెలంగాణలో జరిగే టీడీపీ మహానాడుకు చంద్రబాబు హాజరు కానున్నారు. దాంతో అక్కడికైనా వెళ్లి కలవాలని గొట్టిపాటి అనుకుంటున్నారు. మంగళవారం ఉదయం జరిగిన ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక కార్యక్రమంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాంల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఒకరినొకరు తోసుకోవడంతో పాటు చొక్కాలు కూడా చించుకున్నారు. ఈ గొడవలో గొట్టిపాటి రవికుమార్ కింద పడిపోయారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిద్దరినీ విడదీశారు. బందోబస్తు మధ్య ఆయనను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. -
చొక్కాలు చిరిగేలా కొట్టుకున్నారు
ఒంగోలు: ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక రణరంగాన్ని తలపించింది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాం బాహాబాహీకి దిగడంతో ఒంగోలులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గొట్టిపాటి, కరణం పరస్పరం తన్నుకోవడంతో ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన మంత్రులు నారాయణ, పరిటాల సునీత, శిద్ధా రాఘవరావు అవాక్కయ్యారు. కరణం వర్గీయులు గొట్టిపాటి చొక్కా పట్టుకుని లాగడంతో గొడవ ప్రారంభమైంది. తన చొక్కా చించడంతో గొట్టిపాటి ఎదురుతిరిగారు. దీంతో కరణం స్వయంగా రంగంలోకి దిగారు. పరస్పరం చొక్కాలు పట్టుకుని తలపడ్డారు. ఈ క్రమంలో గొట్టిపాటి రవికుమార్ కింద పడిపోయారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిద్దరినీ విడదీశారు. బందోబస్తు మధ్య ఆయనను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. ఇరువర్గాల తోపులాటలు, అరుపులతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. బల్లికురవ మండలం వేమవరంలో ఈ నెల 19వ తేదీ రాత్రి జరిగిన జంటహత్యలకు గొట్టిపాటి, కరణం వర్గాల ఆధిపత్యపోరు కారణమన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గొట్టిపాటి, కరణం పరస్పరం బాహాబాహీకి దిగడం అధికార టీడీపీలో తీవ్ర కలకలం రేపింది. గొట్టిపాటి వర్గీయులే తమను రెచ్చగొట్టారని కరణం బలరాం అన్నారు. ఎవరినీ రెచ్చగొట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. గొట్టిపాటి తన పని తాను చూసుకోవాలని హితవు పలికారు. మరోవైపు గొట్టిపాటి రవికుమార్ సాయంత్రం సీఎం చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. కరణం వర్గీయుల దాడిపై ముఖ్యమంత్రికి ఆయన ఫిర్యాదు చేయనున్నారు. -
కలకలం:ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఫైటింగ్
-
పోలీసుల అదుపులో వేమవరం నిందితులు
బల్లికురవ(ప్రకాశం జిల్లా): బల్లికురవ మండలం వేమవరంలో హత్యకు గురైన కరణం వర్గీయుల కేసులో మరో అడుగు ముందుకు పడింది. సోమవారం కొంత మంది నిందితులను సంతమాగులూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో 17 మంది నిందితులు ఉన్నట్లు సమాచారం. ఈ నెల 19న బల్లికురవ మండలం కె.రాజుపాలెంలో ఓ పెళ్లికి హాజరైన కరణం బలరాం వర్గీయులు పెదఅంజయ్య, రామకోటయ్యలను కళ్లలో కారం కొట్టి గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు హత్య చేసిన సంగతి తెల్సిందే. హత్య అనంతరం నిందితులంతా పరారయ్యారు. -
అద్దంకి రక్తచరిత్రలో కొత్త కోణం
♦ వేమవరం జంట హత్యలకు ముందస్తు ప్రణాళిక ♦ అకస్మాత్తుగా స్పీడ్ బ్రేకర్ కూడా ఏర్పాటు ♦ ఆపై కళ్లలో కారం కొట్టిన మహిళ..అనంతరం దాడి ♦ హతులను ముందుగా వెంబడించి సమాచారం అందించిన ఓ వ్యక్తి ♦ హత్యకు వాడిన కత్తులు, కర్రలు, కారం డబ్బాలు స్వాధీనం ♦ కారుల్లో పరారైన 24 కుటుంబాలకు చెందిన నిందితులు బల్లికురవ: ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అద్దంకి నియోజకవర్గంలో మళ్లీ ఫ్యాక్షన్ పంజా విసిరిందా? జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యలు ఈ సందేహానికి బలం చేకూర్చినట్లవుతోంది. ఇదిలా ఉంటే వేమవరంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ హత్యలు ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరు రోజుల ముందుగానే ప్లాన్ వేసి, ప్రత్యర్థులను అడ్డుకొనేందుకు వీలుగా స్పీడ్ బ్రేకరు వేయడంతోపాటు, పెళ్లికి వెళ్లిన వారిని ఒక వ్యక్తి వెంబడిస్తూ వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నిందితులకు చేరవేసినట్లు తెలిసింది. పెళ్లి బృందం స్పీడు బ్రేకరు వద్దకు రాగానే ఒక మహిళ వారి కళ్లలో కారం కొట్టగా, మిగిలిన వారు కర్రలు కత్తులతో దాడి చేసినట్లు తెలిసింది. 1989 నాటి దాడిలోనే పెద్ద అంజయ్యకు కత్తిపోట్లు.. పత్తిపాటి సాంబయ్య అనే వ్యక్తిని గొట్టిపాటి వర్గీయులు (గొట్టిపాటి హనుమంతరావు)1989లో హతమార్చారు. ఇదే దాడిలో పెద అంజయ్య కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడి 20 రోజులు గుంటూరు వైద్యశాలలో చికత్స పొందాడు. నాడు మరణించిన వ్యక్తి కూడా బలరాం వర్గీయుడే కావడం గమనార్హం. 24 కుటుంబాల్లో ఒక్కరూ లేరు.. నిందితులుగా భావిస్తున్న 24 మంది కుటుంబాల్లోని వారు ఒక్కరు కూడా ప్రస్తుతం గృహాల్లో లేరు. వీరంతా రెండు మూడు కార్లలో పరారయ్యారు. వీరిలో 20 కుటుంబాల వారు గొట్టిపాటి ఇంటి పేరిట వారని తెలుస్తోంది. గతంలో వేరే రాష్ట్రాలకు బతకడానికి వెళ్లిన కొంతమంది మళ్లీ గ్రామానికి చేరుకోవడం వల్లే ఇలాంటి సంఘటన జరుగుతున్నాయిన ప్రజలంటున్నారు. మృతుల కుమారులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మృతిచెందిన గోరంట్ల పెద అంజయ్యకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు సురేశ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా మరో కుమారుడు అనీల్ హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నారు. మరో మృతుడు యేగినాటి కోటేశ్వరరావుకు భార్య ఉంది. కుమారుడు వెంకటేశ్వర్లు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. మృతులది వ్యవసాయ నేపథ్యం. గ్రామంలో భయాందోళనలు.. హత్యల నేపథ్యంలో గ్రామంలో ఆందోళన నెలకొంది. మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.మృతుల ఇళ్ల వద్దకు అధిక సంఖ్యలో జనం చేరకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. గ్రామాన్ని కరణం బలరాం సందర్శించారు. కరణం వర్గానికి చెందిన ఐదు మండలాల నాయకులు కూడా క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్లారు. పోలీసు వలయంలో.. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మృతులు, క్షతగాత్రుల ఇళ్ల వద్ద 50 మందితో పది పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు మూడు వ్యానుల్లో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు. శనివారం సంఘటనా స్థలాన్ని చీరాల డీఎస్పీ ప్రేమ కాజల్, బల్లికురవ డీటీ సింగయ్య పరిశీలించారు. హత్యా స్థలిలో దొరికన కర్రలు, కత్తులు, కారం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తుల నుంచి వివరాలను సేకరించారు. ప్రధాన నిందితుల గుర్తింపు.. ఫొటోల విడుదల - గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ వేమవరంలో శుక్రవారం జరిగిన జంట హత్యల అనంతరం నియోజకవర్గంలో భారీబందోబస్తు ఏర్పాటు చేసినట్లు గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ వెల్లడించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఐటీ కోర్ సమావేశమందిరంలో శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. హత్యలు రాజకీయ కోణంలో జరిగాయా.. లేక పాత కక్షల నేపథ్యంలో జరిగాయా అని లోతుగా దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో 17 మందిపై కేసునమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుల ఫొటోలను విడుదల చేశారు. ఒకటో నిందితుడిగా మాలెంపాటి వెంకటేశ్వర్లు, రెండో నిందితుడిగా గొట్టిపాటి మారుతి, మూడో నిందితుడిగా మాలెంపాటి లక్ష్మీనారాయణలతో పాటు మరో 14 మంది నిందితులుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఆరు ప్లటూన్ల ప్రత్యేక పోలీస్ బలగాలతో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఒక్కో మండలానికి ఒక్కో డీఎస్పీ చొప్పున శాంతిభద్రతలకు భంగం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గుంటూరు, చిలకలూరిపేట, నర్సరావుపేట ప్రాంతాల్లో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. నిందితులకు ఆశ్రయం కల్పించినవారిపై ఐపీసీ సెక్షన్ 201 ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. హత్యలకు సంబంధించి పోలీసుల వద్ద సమాచారం ఉన్నా పట్టించుకోలేదని, మైనింగ్‌కు సంబంధించి ఇరువర్గాల మధ్య ఇటీవల ఘర్షణలు జరుగుతున్న పట్టీపట్టన్నట్లు వ్యవహరించారని వెల్లడించారు. ప్రత్యేకంగా మైనింగ్ విషయంలో అధికార ఎమ్మెల్యేకు సంబంధించి.. హతమారుస్తామని బెదిరింపులు వచ్చాయన్నారు. -
అద్దంకిలో పొలిటికల్ వార్
= ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గీయుల ఫ్లెక్సీ చించివేత = కొంగపాడులో శిలాఫలకంపై ముద్రించిన ఎమ్మెల్యే పేరు కొట్టివేత అద్దంకి : అద్దంకి అధికార పార్టీలో ముఖ్య నేతల మధ్య వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జనవరి ఫస్ట్ సమయంలో అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, బలరామ్ వర్గీయుల మధ్య జరిగిన భీకర పోరు ఇప్పటికీ నియోజకవర్గ ప్రజలకు కళ్లముందే కనిపిస్తోంది. ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులు ఇరువర్గాలపై కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఆ కేసును ఇటీవలే ఇరువర్గాలు లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే రవికుమార్‌ను సీఎం చంద్రబాబునాయుడు టీడీపీలోకి చేర్చుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి అద్దంకిలో కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నియోజకవర్గంలోని పలుచోట్ల ఇప్పటి వరకూ ఏదోఒక చోట గొడవ జరుగుతూనే ఉంది. ఇటీవల చిన్న కొత్తపల్లిలో రవికుమార్ వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. అలాగే 40 రోజుల క్రితం కొరిశపాడు మండలం మాలెంపాటివారిపాలెంలో రహదారి కోసం వేసిన శిలాఫకాలన్ని ఎవరో ధ్వంసం చేశారు. ఈ ఘటనలు మరువక ముందే తాజాగా మండలంలోని మణికేశ్వరంలో బీటీ రహదారికి రవికుమార్ శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. అదే విధంగా కొంగపాడులో రహదారి శంకుస్థాపన కోసం ఆర్అండ్బీ శాఖ ఏర్పాటు చేసిన శిలాఫలకంలో గొట్టిపాటి రవికుమార్ పేరులో కొంత భాగాన్ని ధ్వంసం చేశారు. ఆకతాయిలు ఇలా చేస్తున్నారా? లేక గిట్టని వారు చేస్తున్నారా? అనే విషయం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఫ్లెక్సీల విషయంలో పోలీసుల ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నారని స్థానికులు భావిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో ఎక్కడా ఫ్లెక్సీలు పెట్టకుండా కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. గతంలో అద్దంకిలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా, మరోసారి అటువంటి గొడవలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
కరణం బలరాంపై ధ్వజమెత్తిన ‘కత్తి’
గుంటూరు: రాష్ట్ర శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో మాజీ మంత్రి కరణం బలరాంకు టిక్కెట్టు ఇవ్వడం ఎంతవరకు సబబని నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కత్తి పద్మారావు ప్రశ్నించారు. స్థానిక లుంబినీ వనంలోని నవ్యాంధ్ర పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కరణం బలరాం హత్యలకు పాల్పడి జైలు జీవితం అనుభవించి వచ్చాక కూడా సొంత ఊరిలోని దళితవాడపై దాడి చేసి తగులబెట్టిన చరిత్ర ఉందని ఆయన గుర్తు చేశారు. శాసనమండలికి రాజ్యాంగం ప్రకారం మేధావులు, రాజ్యాంగ నిపుణులు, పండితులను ఎన్నుకోవాల్సి ఉందన్నారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని సీఎం కుమారుడు లోకేష్‌కు కూడా ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇవ్వడం ద్వారా వంశపారంపర్య రాజకీయాలకు చంద్రబాబు తెర తీశారని ధ్వజమెత్తారు. ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక సామాజిక వర్గం జులుం అధికమైందని, నూతన శాసనసభ కొలువు తీరిన రోజు అందువల్లే ప్రతిపక్షం స్వేచ్ఛగా వ్యవహరించలేని పరిస్ధితి కనిపించిందని అన్నారు. రాష్ట్రంలో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల నుంచి ప్రజలు వలస వెళుతున్న పరిస్థితులుంటే తొలి అర్ధ సంవత్సరంలో ప్రభుత్వం 12.23 శాతాన్ని వృద్ధి రేటుగా పేర్కొనడం శోచనీయమన్నారు. నూతనంగా నిర్మించిన శాసనసభలో కొలువు కావడం చారిత్రక ఘట్టమని, అయితే నూతన శాసనసభను కులాధిపత్యంతో కాకుండా ప్రజాస్వామిక, సామ్యవాద, లౌకిక భావ జాలంతో నడపాలని పద్మారావు సూచించారు. -
గొట్టిపాటి, కరణం వర్గాల మధ్య 'పింఛన్' గొడవ
ఒంగోలు : టీడీపీకి చెందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాం మధ్య వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. బుధవారం ఉదయం బల్లికురవలోని ఎండీవో కార్యాలయం వద్ద కొత్తగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం అక్కడే ఉన్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి అక్కడికి చేరుకున్నారు. తమ వారికి పింఛన్లు ఇవ్వటం లేదంటూ గొట్టిపాటి వర్గీయులు ఆందోళనకు దిగారు. ఆ క్రమంలో కరణం బలరాం వర్గీయులతో వారు వాగ్వివాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అధికారుల తీరును సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని రవికుమార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
రాజ్యసభ నాలుగో సీటు కోసమే ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం
► ఇంకో ఎనిమిది మంది చేరితే విజయసాయిరెడ్డి గెలిచేవారు కాదు ► టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం స్పష్టీకరణ ► చంద్రబాబు, దగ్గుబాటి మధ్య విభేదాల వల్ల నష్టపోయానని ఆవేదన సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో సీటు వస్తుందన్న నమ్మకంతోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నామని టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం చెప్పారు. ఇంకో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే విజయసాయిరెడ్డి గెలిచే పరిస్థితి ఉండదు, ఇది టీడీపీ సిద్ధాంతమని ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తన దృష్టిలో ఓ కిడ్(పసి బాలుడు) అని వ్యాఖ్యానించారు. ఆయనను పార్టీలోకి చేర్చుకోవడంతో తమ కేడర్‌కు సమాధానాలు చెప్పుకోలేని పరిస్థితి ఉందన్నారు. కరణం బలరాం ఔట్‌డేటెడ్ నాయకుడు.. కరణం వెంకటేష్ ఆవేశపరుడు.. రెండేళ్లు ఇవన్నీ పరిశీలించిన తర్వాతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గొట్టిపాటి రవికుమార్‌ను పార్టీలోకి చేర్చుకున్నారా? అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. డ్యాన్స్ మాస్టర్లను పెట్టుకుంటే లాభం లేదని పరోక్షంగా చంద్రబాబుకు చురకలు అంటించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తానని స్వయంగా చంద్రబాబు నాయుడే చెప్పారని, తన సీనియారిటీ, స్వభావం ఏమిటో ఆయనకు తెలుసన్నారు. చంద్రబాబు తొలుత మంత్రి కావడానికి ఢిల్లీలో తాను ఎంతమేరకు కృషి చేశాననేది ఆయనకే తెలుసని చెప్పారు. ఇప్పుడు ఆ విషయాలన్నీ అప్రస్తుతమని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ అల్లుళ్లయిన చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు మధ్య విభేదాల వల్ల తాను నష్టపోయాయని కరణం బలరాం ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రత్యర్ధి గొట్టిపాటి హనుమంతరావుకు చంద్రబాబు 1999లో మంత్రి పదవి కట్టబెట్టారని అన్నారు.క చెంపపై కొడితే మరో చెంప చూపడానికి తానేమీ గాంధీ మహాత్ముడి తరహా మనుషులం కాదని చెప్పారు. -
బాబుల బంతాట!
జిల్లా నేతలతో అధిష్టానం గేమ్ షో ఫిరాయింపు నేతల వైపు చినబాబు లోకేష్ పాత నేతలకు మద్దతుగా సీఎం చంద్రబాబు ఒక రోజు బదిలీ.. మరుసటి రోజుకు రద్దు ఎటూ తేల్చక ఆటాడుకుంటున్న అధిష్టానం సీఐల బదిలీల్లో కొనసాగుతున్న ప్రతిష్ఠంభన పైచేయి ఎవరిదనే అంశంపై పార్టీ కేడర్‌లో ఉత్కంఠ.. ఆధిపత్యం కోసం పోరాడుతున్న టీడీపీ జిల్లా నేతలతో బాబూ కొడుకులు బంతాట ఆడుతున్నారా..? ఒక వర్గానికి చంద్రబాబు, మరో వర్గానికి చినబాబు మద్దతుగా నిలిచి నాటకం రక్తికట్టిస్తున్నారా..? జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇది నిజమేననిపిస్తోంది. రాజకీయ విశ్లేషకులూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇరువురు కర్ర విరగ కూడదు.. పాము చావకూడదు అన్నట్లు వ్యవహరిస్తుండటంతో జిల్లాకు చెందిన ఇరువర్గాల నేతలు లోలోన రగిలిపోతున్నారు. వీరి ఆధిపత్య పోరులో చివరకు ఏ వర్గం పైచేయి సాధిస్తుందో తెలియని పరిస్థితి ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఒంగోలు : జిల్లాలోని అధికార పార్టీ పాత నేతలు, ఇటీవల అధికార పార్టీలో చేరిన కొత్త ఎమ్మెల్యేలతో అధిష్టానం ఆడుకుంటోంది. గొట్టిపాటి నేతృత్వంలోని ఫిరాయింపు నేతలతో కూడిన త్రిసభ్య కమిటీ(గొట్టిపాటి, ముత్తుముల, పోతుల)కి చినబాబు లోకేష్ మద్ధతు పలుకుతుండగా, కరణం నేతృత్వంలోని పాత నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అండదండలు అందిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇరువర్గాల నేతలు పైచేయి సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒక వర్గం అధికారులను బదిలీ చేయిస్తే.. మరొక వర్గం దాన్ని అడ్డుకుంటోంది. ఏ వర్గాన్ని నిరుత్సాహపడనీయకుండా అదే సమయంలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించకుండా ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూ అటు చంద్రబాబు, ఇటు చినబాబు బంతాట ఆడుకుంటున్నారు. ఎవరి ధీమా వారిదే.. అద్దంకి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత కరణం బలరామకృష్ణమూర్తి, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాంతో పాటు ఆయా నియోజకవర్గాల టీడీపీ కేడర్ వ్యతిరేకించినా... చంద్రబాబు, చినబాబు లు ఆయా నియోజకవర్గాలకు చెందిన ప్రస్తుత ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ముత్తుముల అశోక్‌రెడ్డి, పోతుల రామారావులను పార్టీలో చేర్చుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అభ్యర్థిని ఓడించటమే లక్ష్యంగా వారిని పార్టీలో చేర్చుకుంటున్నట్లు ముఖ్యమంత్రి పాత నేతలకు చెప్పారు. పైగా ఎమ్మెల్యేలకు భారీ ప్యాకేజీలిచ్చి పార్టీలో చేర్చుకున్నారన్న ప్రచారంతో వారిని అంత వరకే పరిమితం చేస్తారని పాత నేతలు భావించారు. చంద్రబాబు స్వభావం తెలిసిన వారు కావడంతో ఎమ్మెల్యేలను రెంటికీ చెడ్డ రేవడిలా చేసేందుకేనన్న ధీమాతో ఉన్నారు. కొత్తగా పచ్చ కండువాలు కప్పుకున్న ఎమ్మెల్యేలు అధికారం కోసం తహతహలాడారు. దశాబ్దాలుగా జెండాలు మోసిన పాత నేతలను పక్కకు నెట్టి ఆధిపత్యం చలాయించేందుకు పావులు కదిపారు. ఫిర్యాదుల వెనుక జనార్దన్ వ్యూహం.. గొట్టిపాటి సీఎంకు ఫిర్యాదు చేయడం వెనుక కరణంను వ్యతిరేకిస్తున్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యూహం ఉందన్న ప్రచారం ఉంది. గొట్టిపాటి సీఎంను కలిసిన నేపథ్యంలో రమణమూర్తి బదిలీ ఆగిపోయిందని ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. మరుసటి రోజే రమణమూర్తి స్థానంలో కొత్త ఎస్ఈగా నెల్లూరు నుండి బదిలీ అయిన రెడ్డయ్య బాధ్యతలు స్వీకరించారు. దీంతో గొట్టిపాటి వర్గానికి భంగపాటు తప్పలేదు. దీన్ని బట్టి చూస్తే మరోమారు కరణంకే అధిష్టానం మద్దతు పలికినట్లు అయింది. ఇదిలా ఉండగా గొట్టిపాటి వర్గం అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్‌తో పాటు గిద్దలూరు, కందుకూరు, చీరాల, ఒంగోలు, కనిగిరి సీఐలను అటాచ్మెంట్ ద్వారా బదిలీ చేయించుకున్నారు. లోకేష్ ఆదేశాల మేరకే ఈ బదిలీలు జరిగినట్లు ప్రచారం జరిగింది. మరుసటి రోజుకే ఆరుగురు సీఐల బదిలీలు నిలిచిపోయాయి. సీనియర్ నేత కరణం ఏకంగా ముఖ్యమంత్రి, డీజీపీలతోనే మాట్లాడి బదిలీలు నిలిపివేయించారన్న ప్రచారం జరిగింది. దీంతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 2,500 చొప్పున పింఛన్లు మంజూరు చేయాలంటూ లోకేష్‌కు నెల క్రితమే జాబితా ఇచ్చినట్లు తెలుస్తోంది. కరణం ఆ జాబితాను కూడా నిలిపివేయాలంటూ ముఖ్యమంత్రి ద్వారా లోకేష్‌పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో పింఛన్ల జాబితా సైతం రాత్రికి రాత్రే నిలిచిపోయింది. సత్తా చాటేందుకు ప్రయత్నాలు.. వచ్చి రావడంతోనే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్‌ను బదిలీ చేయించి సత్తా చాటే ప్రయత్నం చేశారు. దీన్ని సహించని మొండిఘటం కరణం సాయంత్రానికే సీఐ బదిలీని నిలిపివేయించి పట్టు నిరూపించుకున్నారు. ఆ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుల ఎస్ఈ రమణమూర్తిని కరణం బదిలీ చేయించారన్న ప్రచారం జరిగింది. దీంతో కరణం ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసేందుకు గొట్టిపాటి రంగంలోకి దిగారు. ఈ సారి తానొక్కడే కాకుండా త్రిసభ్య కమిటీ సభ్యులుగా ముద్ర వేసుకున్న అశోక్‌రెడ్డి, పోతుల రామారావులతో కలిసి ఎస్ఈ బదిలీని నిలపాలంటూ ఏకంగా ముఖ్యమంత్రిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా కరణంపై పలు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. గొట్టిపాటి వాదనకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఆ తర్వాత ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. నొప్పించక తానొవ్వక.. గొట్టిపాటి నేతృత్వంలోని ఫిరాయింపు ఎమ్మెల్యేలు లోకేష్ ద్వారా తమ పనులు చక్కబెట్టుకునే ప్రయత్నానికి దిగుతుంటే... కరణం నేతృత్వంలోని పాత నేతల వర్గం ఏకంగా ముఖ్యమంత్రిపైనే ఒత్తిడి తెస్తూ దాన్ని ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది. కొత్త ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంతో లోకేష్ కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు తానిచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఆయన కొత్త ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నట్లు పైకి కనబడుతుంది. అదే సమయంలో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు పాత నేతలను సైతం నొప్పించక ఎప్పటికప్పుడు కొత్త ఎమ్మెల్యేలకు అడ్డుకట్ట వేస్తున్నారు. మొత్తంగా కొత్త నేతలకు మద్ధతు పలుకుతున్నట్లు లోకేష్ నటిస్తుండగా, పాత నేతలకు మద్ధతు పలుకుతూ బాబు నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. -
కరణం బలరాంకు భంగపాటు !
ఎట్టకేలకు అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్ బదిలీ అద్దంకి కొత్త సీఐగా హైమారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ ఒంగోలు: టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం ఇటీవల పార్టీలో చేరిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ల అధిపత్య పోరులో మంగళవారం గొట్టిపాటి రవికుమార్ పైచేయి సాధించారు. మొదట అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్ వ్యవహారంలో, ఆ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టు ఎస్ఈ రమణమూర్తి బదిలీ వ్యవహారంలోనూ మాట నెగ్గించుకొని పైచేయి సాధించినా కరణం బలరాంను పట్టుమని 10 రోజులు తిరగకుండానే ఎట్టకేలకు గొట్టిపాటి దెబ్బ కొట్టి కరణంపై పైచేయి సాధించారు. అద్దంకి సీఐ వ్యవహారంలో కరణంకు భంగపాటు తప్పలేదు. ఈ నెల 13వ తేదీన కరణం అనుకూలుడిగా ముద్ర వేసుకున్న అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్‌ను కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పట్టుపట్టి బదిలీ చేయించారు. ఆయన స్థానంలో గుంటూరు వీఆర్‌లో ఉన్న హైమారావును తెచుకున్నారు. ఈ మేరకు డీఐజీ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అయితే విషయం తెలుసుకున్న కరణం హుటాహుటిన పావులు కదిపి ఐజీతో పాటు ఏకంగా డీజీపీ పైనే ఒత్తిడి తెచ్చారు. అదే రోజు సాయంత్రానికి సీఐ బేతపూడి ప్రసాద్ బదిలీని నిలిపేయించారు. దీంతో ఇరువర్గాల మధ్య వర్గ విభేదాలు పతాక స్థాయికి చేరాయి. తాను పార్టీలో చేరేటప్పుడే సీఐ బదిలీ ప్రధాన డిమాండ్‌గా చెప్పానని, ఇప్పుడు అది కూడా చేయకపోతే తాను పార్టీలో ఉండటం ఎందుకంటూ గొట్టిపాటి రవికుమార్ చినబాబు లోకేష్ వద్ద వాపోయినట్లు ప్రచారం జరిగింది. మరో వైపు తన మాట నెగ్గకపోతే అమీతుమీకి సిద్ధమని కరణం సైతం అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా మంగళవారం జరిగిన సీఐల బదిలీల్లో అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో గతంలో గొట్టిపాటి ప్రతిపాదించిన హైమారావునే నియమిస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. దీంతో ముఖ్యమంత్రి కరణంకు కాకుండా గొట్టిపాటి రవికుమార్‌కే ప్రాధాన్యతనిచ్చినట్లు తెలుస్తోంది. సీఐ బదిలీ వ్యవహారంలో ఎట్టకేలకు కరణంకు భంగపాటు తప్పలేదు. కరణంతో వర్గపోరులో ఆదిలో గొట్టిపాటికి భంగపాటు ఎదురైనా చివరకు కరణంను దెబ్బతీసి ఎట్టకేలకు పైచేయి సాధించారు. -
పేదల బతుకులపై.. పచ్చ మేడలు
టీడీపీ నేతలు, అధికారులు కుమ్మక్కు బండ్లమిట్టలో దుకాణాల కూల్చివేత 30 ఏళ్లుగా అక్కడే ఉంటున్న పేదలు టీడీపీ కార్యాలయం కోసమా..? బోటు షికారు వ్యాపారం కోసమా..? అప్పట్లో పట్టాలిచ్చిన కరణం బలరాంను దోషిగా చూపేందుకు దామచర్ల వ్యూహం అధికార పార్టీ నేతల దుకాణాలు, ఇళ్ల జోలికి వెళ్లని అధికారులు మైనారిటీల బతుకులు ఛిద్రం చేయడంపై సర్వత్రా విమర్శలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అధికార పార్టీ నేతలు, అధికారులు కుమ్మక్కయ్యారు. స్వలాభాపేక్షతో దారుణానికి ఒడిగట్టారు. 30 ఏళ్లుగా నగరంలోని బండ్లమిట్ట ప్రాంతంలో ఇళ్లు, దుకాణాలు ఏర్పాటు చేసుకొని బతుకుసాగదీస్తున్న పేదల ఇళ్లపై వారి కన్ను పడింది. నగరం నడిబొడ్డున విలువైన స్థలం, దాన్ని చేజిక్కించుకుంటే కోట్లు వచ్చి పడినట్లే. అంతే..! అధికారులను అడ్డుపెట్టి పేద ముస్లింల చిరు దుకాణాలను మంగళవారం కూల్చివేశారు. అక్కడున్న మసీదును కూల్చటానికి కూడా వెనుకాడలేదు. స్థానికులు గొడవకు దిగకుండా పోలీసులను అడ్డుపెట్టారు. వారు కాళ్లా వేళ్లా పడి వేడుకున్నా... అటు కార్పొరేషన్ అధికారులు, ఇటు పోలీసులు చలించలేదు. అన్నీ పీకి వారి బతుకులను రోడ్డున పడవేశారు. బండ్లమిట్ట కూల్చివేత వెనుక పచ్చ నేతల స్వలాభాపేక్ష కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు నగరం నడిబొడ్డున ఉన్న ఊరచెరువును ఆధునీకరించి బోటింగ్, పార్కింగ్ ఏర్పాటు చేయాలని కార్పోరేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. బోటింగ్ పార్కింగ్ మెయింటెనెన్స్ బాధ్యతను దామచర్ల తమ అనుచరులకు ఇప్పించేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం ఉంది. చెరువు ఈశాన్యంలో ప్రధాన గేటు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం అక్కడ గత 30 ఏళ్ల నుంచి ఉన్న దుకాణాలను తొలగించాలని నిర్ణయించారు. అది వివాదం కాకుండా ఉండేందుకు ఆక్రమణలు, నకిలీ పట్టాలు అంటూ అధికారులతో ప్రచారం చేయించారు. చివరకు మంగళవారం పేదల ఇళ్లు, దుకాణాలను కూలగొట్టారు. ఆక్రమిత స్థలంలో టీడీపీ కార్యాలయం నిర్మించి సొంత లాభం వ్యవహారాన్ని కప్పి పుచ్చుకునేందుకు, అధిష్టానం మద్ధతు పొందేందుకు అధికార పార్టీ స్థానిక ముఖ్యనేత వ్యూహరచన చేసినట్లు సమాచారం. ఆక్రమిత స్థలాన్ని టీడీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో కరణం బలరామకృష్ణమూర్తి ఎంపీగా ఉన్నప్పుడు పేద ముస్లింలు, మిగిలిన వర్గాలకు అప్పటి మున్సిపాలిటీ స్థలాన్ని పట్టాలుగా ఇచ్చినట్లు సమాచారం. ఆ స్థలాల్లోనే పేదలు అధిక శాతం దుకాణాలు ఏర్పాటు చేసుకొని బ్రతుకు సాగదీస్తుండగా కొందరు చిన్న చిన్న ఇళ్లు కట్టుకున్నారు. ప్రస్తుతం అటు కరణం... ఇటు ఎమ్మెల్యే దామచర్ల వర్గాల మధ్య విభేదాలున్నట్లు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో కరణం పేదలకిచ్చిన స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకొని తన అధిపత్యాన్ని చాటుకునేందుకు దామచర్ల వర్గం ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే కార్పోరేషన్ అధికారులను అడ్డుపెట్టి స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరో వైపు ప్రస్తుతం కూలగొట్టిన దుకాణాలన్నీ 90 శాతంపైగా ముస్లిం పేదలవే. మిగిలిన వారు కాపులున్నారు. ముస్లింలు వైఎస్సార్ సీపీకి మద్ధతు పలికారన్న అక్కాసుతో పాటు తాజాగా కాపులు ముద్రగడకు మద్ధతు పలుకుతున్నారన్న అక్కసుతోనే అధికార పార్టీ నేతలు దుకాణాలను కూలగొట్టేందుకు సాహసించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ 14/1లో గతంలో పదుల ఎకరాల్లో విలువైన కార్పొరేషన్ స్థలం ఉంది. ఇప్పటికే ఆ స్థలంలో 90 శాతాన్ని ఆక్రమించి ఇళ్ల కట్టుకున్నారు. బండ్లమిట్ట ప్రాంతంలోనూ ఆక్రమిత స్థలాల్లో పెద్ద ఎత్తున దుకాణాలను నిర్మించారు. మంగళవారం అధికారులు అధికార పార్టీ నేతల ఇళ్లు, దుకాణాల జోలికి వెళ్లకుండా పేదలు నిర్మించుకున్న దుకాణాలను మాత్రమే కూల్చివేయటం గమనార్హం. నగరంలో పెద్ద ఎత్తున ఆక్రమణలు, అక్రమ కట్టడాలున్నాయి. అధికార పార్టీ నేతల అండతో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అద్దంకి బస్టాండ్ సమీపంలో ఓ కాంప్లెక్స్ అక్రమంగా నిర్మిస్తున్నా... అధికార పార్టీ ముఖ్య నేత, కార్పోరేషన్ అధికారులు లక్షల్లో ముడుపులు తీసుకొని పట్టించుకోలేదు. గుంటూరు రోడ్డులో భూ బదలాయింపు లేకుండానే అధికార పార్టీ నేత అండతో ఓ భారీ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించినా.. అధికారులు ముడుపులు తీసుకొని మిన్నకుండిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే నగరంలో అక్రమ కట్టడాలు కొకోల్లలు. అయినా అధికారులు వారి జోలికి వెళ్లలేదు. -
గొట్టిపాటి యాక్షన్.. కరణం రియాక్షన్
► అద్దంకి సీఐని బదిలీ చేయించిన రవికుమార్ ► రాత్రికి రాత్రే బదిలీని నిలిపివేయించిన బలరాం ► పతాకస్థాయికి టీడీపీ వర్గ విభేదాలు ఒంగోలు: అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్‌ను ఆదివారం ఉదయానికి బదిలీ చేయించి యాక్షన్‌కు దిగితే.... అదే రోజు సాయంత్రానికే ఆ బదిలీ నిలిపివేయించి కరణం తన రియాక్షన్ చూపించారు. అధికార పార్టీలోని ఇరువర్గాల గొడవ అధిష్టానం తలకు చుట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే... అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఇటీవలే అధికార పార్టీలో చేరారు.గొట్టిపాటి రాకను కరణం బలరామకృష్ణమూర్తి,ఆయన తనయుడు కరణం వెంకటేష్‌లు వ్యతిరేకించారు. అయినా చంద్రబాబు గొట్టిపాటిని పార్టీలో చేర్చుకున్నారు. అప్పటి నుంచి అద్దంకిలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. గొట్టిపాటిని కరణం వర్గీయులు అడుగడుగునే అడ్డుకుంటూనే ఉన్నారు. అయితే గొట్టిపాటి చాప కింద నీరులా తన పని చక్కబెట్టుకునే ప్రయత్నానికి దిగారు. ఇందులో భాగంగా ఏడాదిన్నరగా అద్దంకి సీఐగా పని చేస్తున్న బేతపూడి ప్రసాద్‌ను గొట్టిపాటి పట్టుపట్టి డీఐజీ ద్వారా బదిలీ చేయించారు. ఆదివారం ఉదయానికి బదిలీ ఉత్తర్వులు వెలువడినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన స్థానంలో గుంటూరు వీఆర్‌లో ఉన్న హైమారావును అద్దంకి సిఐగా బదిలీ చేయించారు. బేతపూడి ప్రసాద్ కరణం వర్గీయుడిగా ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న కరణం హుటాహుటిన పావులు కదిపారు.ఐజీతో పాటు ఏకం గా డీజీపీ పైనే ఒత్తిడి తెచ్చారు. అంతే..! ఆదివారం సాయంత్రానికి సీఐ బదిలీ ఆగిపోయింది. ప్రసాద్ బదిలీని నిలిపివేస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇరువర్గాల మధ్య వర్గవిభేదాలు పతాకస్థాయికి చేరాయి. తాను పార్టీలో చేరేటప్పుడే సీఐ బదిలీ ప్రధాన డిమాండ్‌గా చెప్పానని, ఇప్పుడు అది కూడా చేయకపోతే తాను పార్టీలో ఉండటం ఎందుకంటూ రవికుమార్ చినబాబు లోకేష్ వద్ద వాపోయినట్లు సమాచారం. తొలి డిమాండే నెరవేరకపోతే మిగిలిన హామీలు ఏం నెరవేరుస్తారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సీఐని బదిలీ చేస్తే చేతకాని వాళ్లలా కూర్చోలేమని అటు చంద్రబాబుకు ఇటు లోకేష్‌లకు కరణం తేల్చి చెప్పినట్లు సమాచారం. అవసరమైతే అమీతుమీకి సిద్ధమని హెచ్చరించినట్లు తెలుస్తోంది. పదేళ్లు జెండాలు మోసి కార్యకర్తలు అష్టకష్టాలు పడ్డారని విస్మరిస్తే ఫలితం అనుభవించాల్సి ఉంటుందని కరణం తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు సమాచారం. ఈ ఘటనతో ఇరువర్గాల మధ్య పోరు పతాకస్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో అటు పార్టీ అధిష్టానం గొట్టిపాటికిచ్చిన హామీలను నెరవేర్చుకుం టుందా...? లేక పాత తరం సీనియర్ నేత కరణంకే ప్రాధాన్యతనిస్తుందా...? అన్నది వేచి చూడాల్సి ఉంది.....! -
మినీ మహానాడు పద్ధతి ప్రకారం జరగలేదు: కరణం బలరాం
ఒంగోలు: టీడీపీ నిర్వహించిన మినీ మహానాడులో గొడవపై ఆ పార్టీ సీనియర్ నేత కరణం బలరాం వివరణ ఇచ్చారు. మీడియాతో ఆయన బుధవారం మాట్లాడారు. మినీ మహానాడు ఓ పద్ధతి ప్రకారం జరగలేదని వ్యాఖ్యానించారు. తనతో సహా చాలా మంది సీనియర్ నేతలు, పరిశీలకులు సమావేశం జరిగే హాలులో 2 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అంత సమయం ఎదురుచూసినా సమావేశానికి కొంతమంది ఎమ్మెల్యేలు, నేతలు రాకపోవడం అవమానకరమని కరణం బలరాం అభిప్రాయపడ్డారు. అద్దంకి ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోకముందే తాను అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వివరించారు. అందుకే ఆ ఎమ్మెల్యే టీడీపీలో చేరేరోజు తాను వెళ్లలేదని, అధిష్టానానికి తన కమిట్ మెంట్, క్రమశిక్షణ గురించి తెలుసునని మాట్లాడారు. -
మినీ మహానాడులో ఘర్షణ
ఒంగోలు: ప్రకాశం జిల్లా తెలుగుదేశం నేతలు తలపెట్టిన మినీ మహానాడులో శనివారం ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం వర్గీయులు, ఇటీవల వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరిన గొట్టిపాటి రవికుమార్ వర్గం బాహాబాహీకి దిగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. రవి వర్గాన్ని తెలుగుదేశంలో చేర్చుకోవడాన్ని ముందు నుంచే వ్యతిరేకిస్తున్న బలరాం వర్గీయులు ఒకవైపు, ఎమ్మెల్యే హోదాలో ఉన్న రవి వర్గం మరోవైపు తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నించడంతో గొడవ ప్రారంభమైనట్టు సమాచారం. -
గొట్టిపాటి అందుకే పార్టీ మారుతున్నారు: కరణం బలరాం
► అక్రమ సంపాదనను కాపాడుకోవడానికే.. ► పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు ► గొట్టిపాటి రవి చేరికను కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు ► టీడీపీ నేత కరణం బలరామకృష్ణమూర్తి విజయవాడ: అక్రమంగా సంపాదించిన సొమ్మును, ఆస్తులను కాపాడుకునేందుకే కొందరు ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని టీడీపీ నేత కరణం బలరామకృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. అధికార పార్టీలో చేరితే తప్పుడు మార్గంలో సంపాదించిన సొమ్మును కాపాడుకోవచ్చని చూస్తున్నారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై పరోక్షంగా ఆయన ఆరోపణలు చేశారు. టీడీపీలో గొట్టిపాటి చేరికను వ్యతిరేకిస్తున్న బలరాం ఆ విషయాన్ని సీఎం చంద్రబాబుకు వివరించేందుకు మంగళవారం రాత్రి విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎంను కలిసేందుకు వెళ్లేముందు, బయటికొచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీలు, ఎమ్మెల్యేల ఫిరాయింపుల్ని నిరోధించడానికి పదునైన చట్టాలుండాలని వ్యాఖ్యానించారు. కేంద్రప్రభుత్వం అలాంటి చట్టం తీసుకొస్తే ఇలాంటి పిల్లిమొగ్గలు, ఫిరాయింపులు ఉండవన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేల్ని టీడీపీలో చేర్చుకునే విధానంలోనే లోపముందన్నారు. గొట్టిపాటి చేరికను అద్దంకి నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. మిగతా జిల్లాల రాజకీయానికి, ప్రకాశం జిల్లా రాజకీయానికి తేడా ఉందని.. ఆయా జిల్లాల రాజకీయాలను తమ జిల్లాతో పోల్చకూడదని అన్నారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి టీడీపీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి వస్తుందంటే ఆందోళన చెందుతున్నారని కరణం బలరాం చెప్పారు. -
ప్రకాశం జిల్లా టీడీపీలో ముసలం
విజయవాడ: ప్రకాశం జిల్లా టీడీపీలో ముసలం పుట్టింది. వైఎస్సార్ సీపీకి చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను టీడీపీలో చేరతారన్న వార్తలు కరణం బలరాం వర్గంలో కలకలం రేపాయి. గొట్టిపాటి రవికుమార్ ను బలరాం వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కుమారుడు, అనుచరులతో కలిసి కరణం బలరాం మంగళవారం విజయవాడకు చేరుకున్నారు. వీరంతా కాసేపట్లో సీఎం చంద్రబాబును కలవనున్నారు. గొట్టిపాటి రవికుమార్ ను పార్టీలోకి తీసుకోవద్దని ఫిర్యాదు చేయనున్నారు. గొట్టిపాటి కుటుంబంతో తమకున్న రాజకీయ విభేదాల గురించి, రాజకీయంగా వ్యతిరేకిస్తున్న గొట్టిపాటిని పార్టీలో చేర్చుకుంటే జిల్లాలో టీడీపీకి ఎదురయ్యే ఇబ్బందుల గురించి వివరించారు. ఆయన చేరితే పార్టీకి ఏ రకమైన నష్టం జరుగుతుందో అధినేతకు తెలిపాలని కరణం బలరాం భావిస్తున్నారు. అధికార పార్టీలోకి వస్తున్నామని టీడీపీ కార్యకర్తలను గొట్టిపాటి బెదిరిస్తున్నారని, కార్యకర్తలను రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై వుందని కరణం బలరాం అన్నారు. అక్రమ సంపాదన రక్షణ కోసం పార్టీలు మారుతున్నారని, చట్టాలను పటిష్టంగా అమలు చేస్తే పిల్లిమొగ్గలు ఉండవని చెప్పారు. గొట్టిపాటి రాకపై తమ మనోభావాలను సీఎంకు వివరిస్తామన్నారు. -
పార్టీ మారే ప్రసక్తే లేదు
హైదరాబాద్ : తాను వైఎస్ఆర్ సీపీలోకి వెళ్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ప్రకాశం జిల్లా టీడీపీ నేత కరణం బలరామ్ ఖండించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో కరణం బలరామ్ మాట్లాడుతూ... జీవితకాలం టీడీపీలోనే కొనసాగుతానన్నారు. కొంతమంది కావాలనే తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లా టీడీపీలో కరణం బలరామ్ కీలకమైన పాత్ర పోషించారు. ఆ పార్టీ తరఫున ఆయన పలు మార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరంగా ఉన్న ఆయన.. తన కుమారుడిని బరిలో నిలిపారు. ఆయన కూడా ఓటమి పాలవ్వడం తెలిసిందే. దాంతో కరణం బలరామ్ సైలెంట్ అయిపోయారు. కానీ ఇటీవల ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎమ్మెల్సీ స్థానం కోసం కరణం బలరామ్ తీవ్రంగా ప్రయత్నించారు. ఆ స్థానం మాత్రం కాంగ్రెస్‌కి రాజీనామా చేసి సైకిల్ ఎక్కిన మాగుంట శ్రీనివాసులు రెడ్డిని వరించింది. దీంతో కరణం మరింత సైలెంట్ అయిపోయారు. ఎమ్మెల్సీ కూడా దక్కకపోవడంతో కరణం టీడీపీపై ఆగ్రహంతో ఉన్నారని... ఈ నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్ సీపీలో చేరతారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో కరణం బలరామ్ శనివారంపై విధంగా స్పందించారు -
ఎమ్మెల్యేపై కరణం బలరాం వర్గీయుల దాడి
ప్రకాశం జిల్లా ఒంగోలులో అద్దంకి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నాయకుడు గొట్టిపాటి రవికుమార్‌పై టీడీపీ నేత కరణం బలరాం వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే రవికుమార్‌కు చెందిన కారు అద్దాలను ధ్వంసం చేశారు. కలెక్టరేట్ ఆవరణలోనే బలరాం వర్గీయులు ఈ దాడికి పాల్పడ్డారు. దాంతో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గురించిన సమీక్ష సమావేశంలో ఇరు వర్గాలు పాల్గొన్నాయి. సమీక్ష ముగిసిన అనంతరం బయటకు వస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌పై కరణం వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. -
నువ్వా.. నేనా..?
సాక్షి, ఒంగోలు: ప్రజాసమస్యల్ని గాలికొదిలేసిన అధికార టీడీపీ.. సొంత కుంపటిని చల్లార్చుకునే పనిలో పడింది. కొన్నాళ్లుగా నడుస్తోన్న జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు ఎన్నిక వ్యవహారం తాజాగా ఆ పార్టీలో చిచ్చురేపింది. సీనియర్, జూనియర్ల వివాదాన్ని తెరమీదికి తెచ్చింది. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరాం, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెండు వర్గాలుగా చీలి కత్తులు దూసుకుంటున్నారు. పార్టీని నడపటంలో ఇరువురి ఆధిపత్యపోరు ఆది నుంచి కొనసాగుతూనే ఉన్నా.. అధినేత వద్ద తేలాల్సిన పంచాయితీల విషయమై ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఈదర హరిబాబును ఇప్పటికే అధినేత చంద్రబాబు సస్పెండ్ చేశారు. అయితే, ఆయన్ను మరలా పార్టీలోకి చేర్చుకోవాలని కరణం బలరాం ప్రయత్నిస్తోండగా, మరోవైపు దామచర్ల జనార్దన్ తీవ్రంగా అడ్డుకుంటున్నారు. మిగతా నేతలను కలుపుకుని వర్గపోరును పోషిస్తున్న వీరిద్దరూ ‘ఈదర’ పంచాయితీ నేపథ్యంలో నువ్వా..నేనా..? అన్నట్టు తలపడుతున్నారు. అధిష్టానం వద్ద తమ మాటే నెగ్గించుకోవాలనే పట్టుదలతో కసరత్తు చేస్తున్నారు. పార్టీ పగ్గాల కోసమే సిగపట్లు.. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన ఈదర హరిబాబు స్వతంత్రంగా పోటీ చేయడంతో వైఎస్సార్సీపీ సభ్యులు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే.. అదేవిధంగా ఆయన కూడా వైస్‌చైర్‌పర్సన్‌గా స్వతంత్ర అభ్యర్థికే ఓటేశారు. ఈ వ్యవహారంలో హరిబాబు విప్‌ను ధిక్కరించారా..? లేదా..? అనే వ్యవహారం కొద్దిరోజుల్లో అధికారులు తేల్చనున్నారు. ఇదిలా ఉండగా, ఆయనపై అనర్హత వేటు వేయడానికి వీల్లేదంటూ కరణం బలరాం తనవర్గాన్ని తోడుగా తీసుకుని చంద్రబాబుతో మాట్లాడారు. మరోవైపు దామచర్ల జనార్దన్ సైతం బాబు వద్దకెళ్లి ఈదరను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకోరాదంటూ.. నమ్మకద్రోహం కారణంగా పరువు పోగొట్టుకున్నామని చెప్పినట్టు పార్టీవర్గాల సమాచారం. ఇరువురి వాదనలు విన్న చంద్రబాబు మాత్రం బలరాం నిర్ణయం వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రత్యర్థి వర్గం ఈ విషయాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. పార్టీ వ్యవహారాల్లో జనార్దన్ నిర్ణయాలకు అడ్డుతగులుతున్న కరణం బలరాంకు.. తాజాగా ఈ పంచాయితీ మరింత గుర్తింపును తెస్తోందని ప్రత్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తాను జిల్లాలో ఎవరికీ పోటీదారుడ్ని కాదని.. గొట్టిపాటి హనుమంతరావు సన్నిహితుడ్ని అని విలేకరుల సమావేశంలో చెప్పుకున్న ఈదర హరిబాబుకు కరణం బలరాం మద్దతివ్వడాన్ని పార్టీవర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. గొట్టిపాటి కుటుంబంతో బద్ధవైరం నడుపుతున్న బలరాం ఇప్పుడిలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. జెడ్పీచైర్‌పర్సన్‌పై అనర్హత వేటు వేసినప్పటికీ.. ఎటూ ఆ పదవి అధికారపార్టీకి దక్కదనే ఉద్దేశాన్ని అధినేతకు వివరించి.. జిల్లాపార్టీ పగ్గాలు చేజిక్కించుకోవాలనే ఆలోచనతో బలరాం పావులు కదుపుతున్నట్టు చర్చ జరుగుతోంది. సమీపంలో ఉన్న ఒంగోలు నగరపాలకసంస్థ ఎన్నికల్లో జనార్దన్ ప్రాభవాన్ని పూర్తిగా తగ్గించుకునే ఎత్తుగడలో భాగంగానే ఈదర పంచాయితీని బలరాం భుజానికెత్తుకున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇరువర్గాలకు దూరంగా మంత్రి శిద్దా.. పార్టీలో సీనియర్‌గా ఉంటూ జిల్లా రాజకీయాలు కొనసాగిస్తున్న కరణం బలరాం వైఖరిపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సందర్భానుసారం అధినేత చంద్రబాబు కూడా బలరాంను కాదని ఇక్కడ వ్యవహారాలకు సంబంధించి దామచర్ల జనార్దన్‌ను సమర్ధిస్తున్న సంగతి తెలిసిందే.. బలరాం తనకు సంబంధంలేని నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవడాన్ని జనార్దన్ తరచూ అధినేత దృష్టికి తెస్తూనే ఉన్నారు. అయితే, తాజాగా ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిపదవి పొందిన శిద్దా రాఘవరావును అడ్డం పెట్టుకుని జనార్దన్ హవాకు చెక్‌పెడదామనే వ్యూహంతో కరణం బలరాం రాజకీయం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల వరుస ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు, సీట్లపంపకం, బీఫారంల పంపిణీ తదితర పనులన్నింటినీ శిద్దా రాఘవరావుతోనే నడిపించారు. మంత్రి అయిన తర్వాత కూడా శిద్దా రాఘవరావును తన నివాసానికి పిలిపించుకుని మరీ బలరాం మంతనాలు సాగించారు. ఈ నేపథ్యంలో పార్టీ వర్గాలు, కార్యకర్తలతో పాటు సామాన్యజనం సైతం మంత్రిని కలవకుండా.. కరణం బలరాంతో సంప్రదించడం.. ఆమేరకు ఆయన ఆదేశాలతో మంత్రి శిద్దా అధికారులకు ఫోన్లు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆదిలోనే విషయం గుర్తించిన మంత్రి.. కొద్దికాలంగా బలరాంకు దూరంగా ఉంటున్నట్టు పార్టీ నేతల ద్వారా తెలిసింది. ఈదర హరిబాబు వ్యవహారంలో కూడా ఇరువర్గాల అభిప్రాయాలకు భిన్నంగా చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యమంటూ తేల్చేసి ముందుకెళ్తున్నారు. నిన్నటిదాకా జనార్దన్ పక్కనే ఉన్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావులు సైతం పార్టీ అధినేత నిర్ణయానికే కట్టుబడతామన్నారు. కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి మాత్రం జనార్దన్ వర్గంలో ఉంటూ బలరాం ప్రయత్నాల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏది ఏమైనా, అధికార నేతలు జిల్లాలో రైతాంగ, డ్వాక్రాసంఘాల రుణ సమస్యల్ని గాలికొదిలేసి.. స్వపక్ష కుమ్ములాటలకు అధికప్రాధాన్యమిచ్చుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
డాబు
కరణం బలరాం కు రాజ్యసభ ఆశ విజయకుమార్‌కు మండలిలో సభ్యత్వం పదవుల పేర్లు చెప్పి ఊరిస్తున్న టీడీపీ అధినేత నమ్మే పరిస్థితిలో లేమంటూ పార్టీ శ్రేణుల నిర్వేదం సాక్షి ప్రతినిధి, ఒంగోలు : తెలుగుదేశంలో పెరుగుతున్న అసంతృప్తులను బుజ్జగించేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయకులకు పదవుల తాయిలాలు చూపిస్తున్నారు. అసంతృప్తివాదులకు రాజ్యసభ సభ్యత్వం కల్పిస్తామని, ఇంకా శాసనమండలిలో సభ్యత్వం ఇప్పిస్తామని ఊరిస్తున్నారు. అయితే జిల్లాలోని నాయకులు చంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితిలో లేనట్లు తెలుస్తోంది. చంద్రబాబు గతంలో కూడా పదవులు ఇస్తామని చివరి వరకు నమ్మించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తాజాగా జిల్లాలోని సీనియర్ నాయకుడు కరణం బలరాంకు లోక్‌సభ స్థానానికి బదులు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని అన్నట్లు తెలిసింది. అందుకే ఆయన కుమారుడికి అద్దంకి శాసనసభా నియోజకవర్గం అభ్యర్థిత్వాన్ని కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరిన సంతనూతలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్‌కు శాసనమండలిలో అవకాశం ఇస్తామని ఆశ చూపుతున్నారు. సంతనూతల పాడు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ముందుగానే హామీ తీసుకుని, తెలుగు దేశం పార్టీలో చేరిన విజయకుమార్‌కు చంద్రబాబు చెయ్యిచ్చారు. సంతనూతలపాడు నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. నియోజకవర్గాన్ని మార్చాలని టీడీపీ కార్యకర్తలు ఒంగోలులోని సొంత పార్టీ కార్యాలయంపై దాడి చేయగా, వారిని అదుపు చేయడానికి బీజేపీకి కొండపి లేదా గిద్దలూరు కేటాయిస్తామని మభ్యపెడుతున్నారు. చివరకు సంతనూతలపాడు నుంచి పోటీ చేయడానికి బీజేపీ అభ్యర్థి సిద్ధమవుతున్నారు. ఇంకా కొంత మంది నాయకులు తమకు సీట్లు కేటాయించాలని కోరడంతో, వారికి కూడా ఏదో ఒక పదవి ఇస్తానని చెప్పి పంపుతున్నట్లు తెలిసింది. ముందుగా మనం అధికారంలోకి రావాలని, దీనికి కార్యకర్తలు, నాయకులు అన్ని కష్టాలు భరించాలని బాబు వారికి క్లాస్ తీసుకుని పంపుతున్నట్లు తెలిసింది. తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించి తన దగ్గరకు తీసుకురావాలని, తరువాత అందరికి పదవులు ఇస్తానని అంటున్నట్లు తెలిసింది. అయితే చంద్రబాబును సొంత పార్టీ నాయకులే నమ్మడం లేదు. గతంలో తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పార్టీ నాయకులకు ఏమీ చేయలేకపోయారని, మళ్లీ అధికారంలోకి వస్తే తమకు ఏదో చేస్తాడని అనుకోలేమని అంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడే తెలుగుదేశం వారికి కూడా మంచి జరిగిందని గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు ఎన్ని తాయిలాలు ప్రకటించినా కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదని ఆ పార్టీ నాయకులు నిర్వేదంతో అనడం గమనార్హం. -
టీడీపీలో నువ్వా..నేనా..
సాక్షి, ఒంగోలు: తెలుగుదేశం, బీజేపీ పొత్తు జిల్లాలో తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. సీనియర్ నేత కరణం బలరాంతో పాటు జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ కలిసి ఎవ రికి వారు సొంతవర్గాలను ప్రోత్సహిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. పొత్తు ఖరారైన వెంటనే ఒంగోలులోని పార్టీ కార్యాలయ ధ్వంస రచనకు కరణం బలరాం సూత్రధారిగా వ్యవహరించారని దామచర్ల వర్గం ఆరోపిస్తోంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్‌ను టీడీపీలోకి తెచ్చుకోవడంలో కరణం బలరాం విజయవంతమయ్యారు. ప్రాదేశిక సమరంలో టీడీపీ అభ్యర్థుల గెలుపునకు ఆర్థిక సహకారం అందించేందుకు బీఎన్ విజయ్‌కుమార్ కూడా సిద్ధమయ్యారు. అంతలో సంతనూతలపాడును బీజేపీకి కేటాయించడంతో విజయ్ వర్గం నీరుగారింది. అంతేకాక బీజేపీ తీర్థం పుచ్చుకున్న దారా సాంబయ్యను గెలిపించాలని చంద్రబాబు నుంచి వచ్చిన ఆదేశాలు స్థానిక కేడర్‌కు మింగుడు పడలేదు. బలరాం అనుచరులను సైతం షాక్‌కు గురిచేసింది. ఈ క్రమంలో బలరాం తెరవెనుక ఉండి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయించడం, డెయిరీలో సమావేశం ఏర్పాటు చేయించడం, హైదరాబాద్ వెళ్లి హడావుడి చేయించడం జరుగుతోందని దామచర్ల వర్గం వేగుల ద్వారా అధినేతకు నివేదిక పంపింది. కొండపి సీటుకు ఎసరుపెట్టిన బలరాం ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టిన కాంగ్రెస్‌ను కాదని టీడీపీలోకొస్తే ఇటువంటి పరాభవం జరగడమేంటని రాజకీయ భవిష్యత్‌పై లెక్కలేస్తూ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్ డీలా పడినట్టు తెలుస్తోంది. మంగళవారం జరిగిన చర్చల్లో సంతనూతలపాడు బదులు కొండపి స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తున్నట్లు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అక్కడ దారా సాంబయ్యను నిలుపుతున్నట్టు బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ సమాచారంతో బీఎన్ విజయ్‌కుమార్ ఊపిరి పీల్చుకున్నప్పటికీ భవిష్యత్ పరిణామాలపై ఆందోళన చెందుతున్నట్టు అనుచరులు చెబుతున్నారు. తొలుత పొత్తులో భాగంగా బీజేపీ నాయకత్వం కొండపి స్థానాన్ని కోరగా, చంద్రబాబు మాత్రం సంతనూతలపాడు లేదా గిద్దలూరు కేటాయిస్తామని చెప్పినట్లు సమాచారం. ఎటూ టీడీపీ గెలవలేదనే ఆలోచనతోనే కొండపి, గిద్దలూరును త్యాగం చేసేందుకు చంద్రబాబు సిద్ధ పడినట్టు చెపుతున్నారు. దామచర్ల జనార్దన్ అనుంగు శిష్యుడు బాల వీరాంజనేయ స్వామి కిందటి ఎన్నికల్లో కొండపి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారీ అతడినే బరిలో దించేందుకు నిర్ణయించారు. అయితే, బలరాం తెచ్చిన విజయ్‌కుమార్‌ను సంతనూతలపాడులో ఉండనివ్వకుండా చంద్రబాబు వద్ద దామచర్ల చక్రం తిప్పారని ప్రత్యర్థివర్గం ఆరోపిస్తుంది. దీంతో కరణం బలరాం ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని బీజేపీని సంతనూతలపాడు నుంచి కొండపికి మార్చినట్లు పార్టీవర్గాల సమాచారం. ఆది నుంచి టీడీపీలో సీనియర్‌గా ఉండటం అందర్నీ కలుపుకునిపోవడం కరణం బలరాం బలంగా చెబుతుండగా, జిల్లాపార్టీ అధ్యక్షుడిగా కార్యకర్తలతో మమేకం కాలేకపోవడం పార్టీలో జీతాలిచ్చి సొంత వ్యక్తులను పెట్టుకుని కార్యక్రమాలు చేయించడం దామచర్ల బలహీనతగా వైరివర్గాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇద్దరిపై చంద్రబాబుకు ఇప్పటికే ఫిర్యాదులు వెళ్లాయి. మార్కాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరులో పిడతల సాయికల్పనకు సీట్లు గల్లంతు కావడంలో కూడా ఈ ఇద్దరి మధ్య ఆధిపత్యపోరే కారణమని పార్టీనేతలు చెబుతున్నారు. తాజాగా, కొండపిలో తన సన్నిహితుడు బాలవీరాంజనేయ స్వామికి సీటులేకుండా చేయడంలో ప్రత్యర్థి ఎత్తుగడకు దామచర్ల ఎలాంటి పైఎత్తు వేస్తారోనని పార్టీ కేడర్ వేచిచూస్తోంది. -
అద్దంకిలో రక్త చరిత్ర
-
కరణం హవా... దామచర్ల డీలా!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘పార్టీ అధినేత ఎప్పుడెప్పుడొస్తారా... జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పెత్తనం చలాయిద్దామా’అని ఆశించిన దామచర్ల జనార్దన్‌కు చేదు అనుభవం ఎదురైంది. జిల్లా పార్టీ అధ్యక్షుడైనప్పటికీ చంద్రబాబు పర్యటనలో ఆయనకు తగిన ప్రాధాన్యం లభించనే లేదు. రాజకీయ చతురుడైన కరణం బలరాం వ్యూహాత్మకంగా జనార్దన్‌పై పూర్తి ఆధిపత్యం చలాయించారు. చంద్రబాబు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడని కూడా చూడకుండా జనార్దన్ కంటే బలరాం వైపే పూర్తిగా మొగ్గుచూపారు. చంద్రబాబు పర్యటనలో టంగుటూరు మినహాయిస్తే చంద్రబాబు పర్యటన మొత్తం బలరాం ఆధిపత్యం సాధించారు. డెయిరీ ఫాంలో సమావేశం... అనంతరం ఒంగోలులో ర్యాలీ... బహిరంగ సభ... ఇలా అన్నింటా బలరాందే పైచేయి అయింది. కొంతకాలం క్రితం వరకు దామచర్ల జనార్దన్వైపు మొగ్గుచూపుతూ వచ్చిన చంద్రబాబు... జిల్లా పర్యటనకు వచ్చేసరికి పూర్తిగా బలరాంకే ప్రాధాన్యమివ్వడం గమనార్హం. జిల్లా టీడీపీలో ఇటీవల మారిన వర్గ సమీకరణలకు నిదర్శనంగా నిలుస్తున్న ఈ ఉదంతం కథాకమామిషు ఇదీ.. బలరాం ఎత్తు... జనార్దన్ చిత్తు కొంతకాలంగా జిల్లాలో కరణం బలరాంను దామచర్ల జనార్దన్ ఢీకొంటున్న విషయం విదితమే. ప్రధానంగా అధినేత చంద్రబాబు తన మాట వింటున్నారని చెప్పుకుంటూ దామచర్ల జోరు పెంచారు. అనుబంధ సంఘాల నియమకం తదితర విషయాల్లో ఇది బయటపడింది కూడా. కాగా దీనిపై ఆచితూచి వ్యవహరించిన బలరాం చంద్రబాబు పర్యటన సందర్భంగా చాపకింద నీరులా పావులు కదిపారు. జిల్లా పార్టీ నేతలను గుట్టుచప్పుడు కాకుండా తనవైపు తిప్పుకున్నారు. ప్రధానంగా శిద్ధా రాఘవరావు, ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివి శివరాంలను సాధనంగా చేసుకున్నారు. తదనుగుణంగా చంద్రబాబు జిల్లా పర్యటనను ఖరారు చేయించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల తన సొంత మండలం టంగుటూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాగా బలరాం వర్గం ఒంగోలు డెయిరీలో పాడి రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావుతోపాటు శిద్ధా రాఘవరావు, ఏలూరి సాంబశివరావు సహకరించారు. ఇక బహిరంగ సభా వేదికపైన కూడా బలరాం వర్గం దామచర్ల జనార్దన్‌ను పూర్తిగా పక్కన పెట్టేసింది. పార్టీ ప్రోటోకాల్ ప్రకారం పార్టీ అధినేత చంద్రబాబు తరువాత ప్రాధాన్యం జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌కు దక్కాలి. అంటే సభలో వేదికపైన ఉన్నవారంతా మాట్లాడిన తరువాత జనార్దన్ ప్రసంగించాలి... ఆ తరువాత చివరగా పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగించాలి. కానీ సోమవారం సభలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. కొందరు మాట్లాడిన తరువాత జనార్దన్‌తో మాట్లాడించారు. ఆ తరువాత మరికొందరు ప్రసంగించారు. చివరగా కరణం బలరాం ప్రసంగించి చంద్రబాబును ఉపన్యసించాల్సిందిగా ఆహ్వానించారు. ఇక అంతకుముందు మాట్లాడిన నేతలు కూడా బలరాంను పొగుడుతూ జనార్దన్‌ను ఉద్దేశపూర్వకంగా విస్మరించడం గమనార్హం. శిద్ధా రాఘవరావు మాట్లాడుతూ ఁకరణం బలరాం పార్టీ కోసం పనిచేస్తున్నారు*అని ప్రత్యేకంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ సాగర్ జలాల కోసం బలరాం, తాను పోరాడుతున్నామని చెప్పుకొచ్చారు. అంతేగానీ జిల్లా పార్టీ అధ్యక్షుడు జనార్దన్ ఊసుకూడా ఎత్తలేదు. అంటే జిల్లాలో పార్టీ కార్యక్రమాలు, ఉద్యమాల్లో బలరాంతోపాటు తామంతా క్రియాశీలకంగా ఉన్నామని... దామచర్ల ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పకనే చెప్పారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితర సీనియర్ నేతలతో తమకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని పార్టీలో తమ ప్రాబల్యం పెరిగేలా బలరాం వర్గం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కాగా అనుభవరాహిత్యంతో జనార్దన్ వర్గం కరణం ఎత్తుగడను ఊహించలేక చతికిలబడిపోయింది. బహిరంగ సభ అనంతరం జరిగిన జిల్లా పార్టీ విసృ్తతస్థాయి సమావేశంలోనూ బలరాం వర్గం ఆధిపత్యం కొనసాగింది. జిల్లాలో పార్టీ స్థితిగతులు, తీసుకోవాల్సిన చర్యలపై బలరాం వర్గం తమ వాదనను బలంగా వినిపించింది. తద్వారా జనార్దన్ జిల్లాలో పార్టీని గాడిలో పెట్టలేకపోతున్నారని పరోక్షంగా ఫిర్యాదు చేసింది. ఇవన్నీ తన సమక్షంలో జరుగుతున్నా సరే పార్టీ అధినేత చంద్రబాబు జిల్లా పార్టీ అధ్యక్షుడు జనార్దన్ ఆవేదనను కనీసం పట్టించుకోలేదు. ఆయన తీరు కూడా బలరాం వర్గాన్ని బలపరిచేదిగానే ఉంది. ప్రధానంగా ఆర్థికంగా స్థితిమంతులైన శిద్ధా రాఘవరావు, ఏలూరి సాంబశివరావుల ప్రభావం ఆయనపై ఉన్నట్టుగా తెలుస్తోంది. జిల్లాలో పార్టీ కార్యక్రమాలు కొనసాగించాలంటే అలాంటి నేతల అండదండలు ఉన్న బలరాంనే బలపరచాలన్నట్లుగా ఉంది చంద్రబాబు వైఖరి. అటు బలరాం వ్యూహం... ఇటు చంద్రబాబు వ్యూహాత్మక మౌనంతో దామచర్ల జనార్దన్ అడకత్తెరలో పోకచక్కలా నలిగిపోయారు. ప్రతిష్టాత్మకంగా భావించిన అధినేత పర్యటన తనకే ఎదురుతిరగడంతో ఆయన విస్తుపోవాల్సి వచ్చింది. -
చంద్రబాబు తీరుపై బలరాం అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కొండ నాలికకు ముందేస్తే ఉన్న నాలిక ఊడిందన్నట్టుగా తయారైంది జిల్లా టీడీపీ పరిస్థితి. కరణం బలరాం, దామచర్ల జనార్దన్‌ల మధ్య విభేదాల పరిష్కారానికి చంద్రబాబు చేసిన ప్రయత్నం కాస్తా బెడిసికొట్టింది. నిత్యం కలహించుకుంటున్న వారిద్దరికీ చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. కానీ అధినేత తీరుపై బలరాం సీరియస్ అయ్యారు. తనకంటే జూనియర్ అయిన దామచర్లను, తనను ఒకేగాటన కట్టి మందలించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తనను చిన్నచూపు చూసి జిల్లాలో పార్టీని ఎలా గాడిలో పెడతారో చూస్తానంటున్నారు. ఇద్దరికీ క్లాస్ పీకిన చంద్రబాబు తన బస్సు యాత్రకు ముందే జిల్లా టీడీపీలో విభేదాల వ్యవహారాన్ని తేల్చేయాలని చంద్రబాబు భావించారు. కరణం బలరాం, దామచర్ల జనార్దన్లను చివరిసారిగా మందలించాలని నిర్ణయించారు. జిల్లాలో బస్సు యాత్ర ఖరారుపై చర్చించేందుకు హైదరాబాద్ వచ్చిన నేతలతో సమావేశాన్ని దీనికి అవకాశంగా తీసుకున్నారు. జిల్లా ముఖ్య నేతలతో బస్సు యాత్రపై చంద్రబాబు సోమవారం రాత్రి చర్చించాల్సింది. కానీ ముందుగా బలరాం, దామచర్లను ప్రత్యేకంగా పిలిపించారు. వారిద్దరి మధ్య విభేదాల అంశాన్ని సూటిగా ప్రస్తావించారు. ‘మీరిద్దరూ గొడవ పడుతుండటం వల్ల పార్టీ బజారున పడుతోంది. వరుసగా రెండుసార్లు ఓడిపోయాం. అయినా మీరు మారకపోతే ఎలా?...ఇలా అయితే నేను పార్టీని ఎలా నడపాలి? నా స్థానంలో మీరు ఒక రోజు ఉండండి తెలుస్తుంది. పార్టీని నడపడం ఎంత కష్టమో’అని ఇద్దరిపై చిందులు తొక్కినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఆగ్రహాన్ని గుర్తించిన దామచర్ల మౌనంగా ఉండిపోయారు. కానీ చంద్రబాబు మాటలకు బలరాం అడ్డుతగిలి అడ్డంగా దొరికిపోయారు. తాను పార్టీ పటిష్టతకు ప్రయత్నిస్తుంటే జనార్దనే సహకరించడం లేదన్నారు. కాంగ్రెస్ నుంచి ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకుంటే మంచిదని తాను ప్రతిపాదిస్తే జనార్దన్ అడ్డుకోవడమేమిటని అడిగారు. ‘మీరు కూడా ఆయన మాటలకే విలువిచ్చి నా ప్రతిపాదనను తిరస్కరించారు. ఎన్నో ఏళ్లుగా జిల్లా రాజకీయాలు చూస్తున్న నాకంటే జనార్దన్‌కు ఎక్కువ తెలుసా?’అని ప్రశ్నించారు. తననే తప్పుబట్టడంతో చంద్రబాబు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బలరాంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ‘ఏం మాట్లాడుతున్నావ్? అసలే రాష్ట్రంలో పరిస్థితులతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటన్నాం. ఇక సీనియర్వి అయిన నువ్వు కూడా తలనొప్పిగా మారితే ఎలా? నీ ఆధిపత్యం కోసం తపన తప్ప పార్టీ గురించి ఆలోచించవా? మీరు మారకపోతే నేనే ఒకరిని వదులుకోవాల్సి వస్తుంది. ఆ తరువాత మీ ఇష్టం’అని తేల్చిచెప్పేశారు. చంద్రబాబు అంత తీవ్రస్థాయిలో ముఖం మీదే మందలించడంతో బలరాం చిన్నబుచ్చుకున్నారు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. సోమవారం రాత్రి బలరాం, జనార్దన్లతో మాట్లాడేసరికే సమయం మించిపోవడంతో జిల్లా నేతలతో సమావేశాన్ని చంద్రబాబు మంగళవారానికి వాయిదా వేశారు. అధినేతపై బలరాం శివాలు: కాగా చంద్రబాబు తీరుపై కరణం బలరాం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. మంగళవారం ఆయన తన అనుయాయులతో మాట్లాడుతూ అధినేత తీరుపై విరుచుకుపడ్డారు. తనకంటే బాగా జూనియర్ అయిన జనార్దన్ ముందు తనను అంతగా మందలించడాన్ని బలరాం తప్పుబడుతున్నారు. తనకు ఏదైనా చెప్పాలంటే విడిగా పిలిపించి చెబితే సరిపోయేదని... కానీ జనార్దన్ ముందే తనను తూలనాడితే ఇక ఆయన తనకు జిల్లాలో ఏం గౌరవం ఇస్తారని అంటున్నారు. చంద్రబాబు తామిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేసినా జనార్దన్ మౌనంగా ఉండిపోవడాన్ని బలరాం తన సన్నిహితుల వద్ద ప్రస్తావించారు. ‘మాతో చంద్రబాబు ఏం చెప్పనున్నారో జనార్దన్‌కు ముందే తెలిసి ఉండాలి. కాబట్టే ఆయన అందుకు మానసికంగా సిద్ధపడిపోయి మౌనంగా ఉండిపోయారు. ఇదేమీ తెలియని నేను ప్రతిస్పందించి అధ్యక్షుడితో మాటలు పడాల్సి వచ్చింది’అని బలరాం వాపోతున్నారు. ఈ వ్యవహారంలో పార్టీ జిల్లా ఇన్చార్జ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైఖరిపై బలరాం సందేహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తమను మందలించబోతున్న విషయాన్ని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముందుగానే జనార్దన్‌కు చేరవేశారన్నది ఆయన ఉద్దేశం. అందుకే జనార్దన్ మౌనంగా ఉండిపోయాడని... తాను మాత్రం దొరికిపోయానని భావిస్తున్నారు. ఇక తన తడాఖా చూపించాలని కరణం బలరాం భావిస్తున్నారు. జిల్లాలో పార్టీకి పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తేగానీ తానేమిటో చంద్రబాబుకు తెలిసిరాదని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో మునుముందు జిల్లా టీడీపీలో విభేదాలు సరికొత్త మలుపు తిరగనున్నాయని స్పష్టమవుతోంది. 30 తరువాతే యాత్ర బస్సు యాత్ర షెడ్యూల్‌పై చంద్రబాబు జిల్లా నేతలతో మంగళవారం చర్చించారు. డెయిరీ డెరైక్టర్ల ఎన్నికలు ఉన్నందున ఈ నెల 30 తరువాతే జిల్లాలో యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. నెల్లూరు జిల్లాలో యాత్ర నిర్వహించిన అనంతరం జిల్లాలోకి ప్రవేశిస్తామని ప్రకటించారు. సమావేశంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, జిల్లా పార్టీ ఇన్చార్జ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కరణం బలరాం, శిద్దా రాఘవరావు, మన్నం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.