![TDP MLA Karanam Balaram Sensational Comments On Chandrababu - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/8/Karanam-Balaram.jpg.webp?itok=uyllCEBg)
సాక్షి, ప్రకాశం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కరణం బలరాం ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది పాలనలో సీఎం వైఎస్ జగన్ ఎన్నో గొప్ప సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారన్నారు. ఆయన పనితీరుకు మరింత మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. ఈ కారణంగా ఎంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వస్తారో ఇప్పుడే చెప్పలేమన్నారు. అధికారంలో ఉన్నప్పడు చంద్రబాబు నాయుడు ప్రజలను నిర్లక్ష్యం చేశారని, ఆయనపై టీడీపీ ఎమ్మెల్యేలకు ఎవరికీ నమ్మకం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. (అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారు)
చంద్రబాబు పోకడకు, సీఎం జగన్ వ్యవహారశైలికి చాలా తేడా ఉందన్నారు. వెలిగొండ విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని, ప్రజల కోసం చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేయలేదని విమర్శించారు. ఏడాది పాలనలో ప్రజల్లో సీఎం జగన్ నమ్మకం కలిగించుకున్నారని తెలిపారు. ప్రకాశం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సీఎం జగన్‌కు బలరాం అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment