
మినీ మహానాడులో ఘర్షణ
ఒంగోలు: ప్రకాశం జిల్లా తెలుగుదేశం నేతలు తలపెట్టిన మినీ మహానాడులో శనివారం ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం వర్గీయులు, ఇటీవల వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరిన గొట్టిపాటి రవికుమార్ వర్గం బాహాబాహీకి దిగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
రవి వర్గాన్ని తెలుగుదేశంలో చేర్చుకోవడాన్ని ముందు నుంచే వ్యతిరేకిస్తున్న బలరాం వర్గీయులు ఒకవైపు, ఎమ్మెల్యే హోదాలో ఉన్న రవి వర్గం మరోవైపు తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నించడంతో గొడవ ప్రారంభమైనట్టు సమాచారం.