mini mahanadu
-
తిరుపతి వెళ్తున్న బస్సుపై టీడీపీ గూండాల దాడి
చంద్రగిరి: తెలుగుదేశం పార్టీ నేతల గూండాయిజానికి ఇది మరో ఉదాహరణ. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన సాకుతో తిరుపతికి వచ్చే వేలాది ప్రయాణికులను నిలిపివేయడమే కాకుండా, ఇదేమని ప్రశ్నించినందుకు ఓ బస్సుపై దాడి చేసి, అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. చంద్రగిరి మండలం ఏ.రంగంపేట గ్రామంలో గురువారం రాత్రి ఈ దాడి జరిగింది. ప్రయాణికుల కథనం ప్రకారం.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మినీ మహానాడు కార్యక్రమానికి మదనపల్లె నుంచి ఏ.రంగంపేట మీదుగా తిరుపతి, నగరికి వెళ్తున్నారు. ఏ.రంగంపేట వద్ద చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు గురువారం రాత్రి ఆ పార్టీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు వస్తున్నారంటూ తిరుపతికి వచ్చే ప్రయాణికుల వాహనాలను అడ్డుకున్నారు. గంటకు పైగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకు ఆపివేశారని తిరుపతికి వస్తున్న ప్రైవేటు బస్సులోని ప్రయాణికులు టీడీపీ నేతలను ప్రశ్నించారు. తాము వెంటనే తిరుపతికి వెళ్లాల్సి ఉందని చెప్పారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు బస్సుపై దాడి చేశారు. ఓ ప్రయాణికుడి పైనా దాడి చేశారు. సుమారు 50 మందికి పైగా ప్రయాణికులు ఉండడంతో వారిని కాపాడేందుకు బస్సు డ్రైవరు రెండు చేతులెత్తి టీడీపీ వారిని వేడుకొన్నారు. అయినా టీడీపీ వర్గీయులు ససేమిరా అన్నారు. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరిపై రౌడీ షీట్ ఉన్నట్లు టీడీపీ నేతలు కొందరు చెబుతున్నారు. సమాచారం అందుకున్న సీఐ ఓబులేసు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన రౌడీ మూకలను చెల్లాచెదురు చేసి బస్సును తిరుపతికి పంపించారు. -
గుడివాడ టీడీపీలో తీవ్రస్థాయికి విభేదాలు.. మినీ మహానాడు సైతం రద్దు
సాక్షి, విజయవాడ: గుడివాడ టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. దీంతో బుధవారం నిర్వహించాల్సిన మినీ మహానాడు సైతం రద్దయింది. నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, పార్టీ నేత శిష్లా లోహిత్ వర్గాలు ఫ్లెక్సీలు చించుకుని పార్టీ పరువును రోడ్డున పడేశారు. దీంతో రెండు వర్గాల మధ్య విభేదాలు ఓ కొలిక్కి రాకపోవడంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మహానాడుకు ఏర్పాట్లు పూర్తయినా టీడీపీ అదిష్టానం కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఇప్పటికే రెండు వర్గాల మధ్య రాజీ చేసినా ఫలితం దక్కకపోవడం గమనార్హం. చదవండి: (చంద్రబాబుకు ప్రకృతి కూడా సహకరించదు: కొడాలి నాని) -
మాట్లాడుతుంటే జనం వెళ్లిపోవడంపై చంద్రబాబు ఆగ్రహం
-
మినీ మహానాడులో చంద్రబాబుకు బిగ్ షాక్
-
టీడీపీ మినీ మహానాడు వేదికగా అసమ్మతి నేతల బహిరంగ సవాల్
సాక్షి, చిత్తూరు: నగరి టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీ మినీ మహానాడు వేదికగా అసమ్మతి నేతలు బహిరంగ సవాల్ విసిరారు. స్మగ్లర్, ఇసుక, లిక్కర్ మాఫియా నాయకుడు వద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు నిజమైన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని, లేదంటే తెలంగాణలో మాదిరిగా ఏపీ టీడీపీ తయారవుతుందని మండిపడ్డారు. నగరి నియోజకవర్గంలో వలస నేతల నాయకత్వం వద్దంటూ తీర్మానం చేశారు. చదవండి: మేకవన్నె పులి బాబూ! -
టీడీపీలో మినీ వార్
చీరాల: నియోజకవర్గ కేంద్రం చీరాలలో తెలుగుదేశం పార్టీ మూడు ముక్కలాటగా మారింది. ఒకప్పుడు పార్టీకి బలమైన పునాదులుండగా ప్రస్తుతం చీలికలు.. పేలికలుగా మారింది. ఎమ్మెల్యే ఆమంచి వైపు ఒకవర్గం ఉండగా మాజీమంత్రి పాలేటి రామారావు మరో వర్గాన్ని నడిపిస్తున్నారు. మూడో వర్గానికి ఎమ్మెల్సీ పోతుల సునీత సారధ్యం వహిస్తోంది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇటీవల చీరాల నియోజకవర్గంలోనే రెండు మినీ మహానాడులు జరిగాయంటే పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీలోకి ఎమ్మెల్యే ఆమంచి చేరిన తర్వాత మున్సిపల్ చైర్మన్‌తో పాటు కొందరు మున్సిపల్ కౌన్సిలర్లు చేరినప్పటికీ పాలేటి రామారావు వర్గీయులు మాత్రం ఆమంచితో కలవలేదు. ఆమంచి కూడా మొదటి నుంచి వస్తున్న తన సొంత క్యాడర్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారే కానీ టీడీపీలో ఉన్న మాజీ నాయకులు, సీనియర్ నేతలను తన వర్గంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేయలేకపోయారు. ఎమ్మెల్సీ పోతుల సునీత, ఆమంచి మధ్య వర్గ పోరును కూడా జిల్లా, రాష్ట్ర పార్టీ నేతలు పరిష్కరించలేకపోయారు. దీంతో చీరాల టీడీపీ మూడు ముక్కలాటగా మారింది. పోరు.. హోరు.. చీరాల నియోజకవర్గలో పోటా పోటీ కార్యక్రమాలు జరగడం ఆనవాయితీగా మారింది. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి, మినీ మహానాడు వంటి అంశాలే దీనికి ఉదాహరణ. ఈనెల 16వ తేదీన ఎమ్మెల్యే ఆమంచి ఆధ్వర్యంలో మినీ మహానాడును ఎన్ఆర్ అండ్ పీఎం హైస్కూల్లోని ఓపెన్ థియేటర్లో మినీ మహానాడు నిర్వహించారు. ఎమ్మెల్యేకు పోటీగా మాజీమంత్రి పాలేటీ వర్గీయుడైన ఎంపీపీ గవిని శ్రీనివాస్ స్థానిక ఐఎంఏ హాలులో మినీ మహానాడు నిర్వహించారు. అలానే ఎమ్మెల్యే ఇంటింటి తెలుగుదేశం, దళితతేజం కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు గ్రామాలు, పోలింగ్ కేంద్రాల బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు. పాలేటి కూడా తమ వర్గీయులతో దళిత తేజం, ఇంటింటి టీడీపీ నిర్వహించి వార్డులు, బూత్ కమిటీలను కూడా పోటీగా ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల కమిటీలను, పట్టణంలోని వార్డుల కమిటీలను కూడా పాలేటి నియమించారంటే టీడీపీలో పోరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశాలను పాలేటి నిర్వహించడం వి«శేషం. తీవ్ర అసంతృప్తిలో టీడీపీ నేతలు పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కౌన్సిలర్లు, సీనియర్ క్యాడర్ నాయకుల్లో అసహనం పెరిగిపోతోంది. మరో 8 నెలల్లో టీడీపీ పాలన పూర్తి కానుంది. దీంతో మళ్లీ అధికారంలోకి వస్తుందో.. రాదో అనే మీమాంసలో నాయకులున్నారు. ఇప్పటి వరకు ఏఎంసీ చైర్మన్, డైరెక్టర్లు ఎంపిక జరగకపోవడం, మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగుస్తున్నా కో ఆప్షన్ సభ్యుల ఎంపిక జరగకపోవం గమనార్హం. చివరకు పార్టీ రాష్ట్ర, జిల్లా పదవులతో పాటుగా ఇతర నామమాత్రపు పోస్టులు చీరాల్లో ఎవ్వరికి దక్కకపోవడంతో పార్టీలో తామెందుకు కొనసాగుతాన్నామనే అంతర్మధనం మొదలైంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 9 ఏళ్లు కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినా ఎలాంటి గుర్తింపు లేకపోవడం, నామినేటెడ్ పోస్టులు కల్పించకపోవడంతో తాము అధికారంలో ఉన్నామా....? లేక ప్రతిపక్షంలో ఉన్నామా...? అని పార్టీ సీనియర్ నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మరికొందరైతే పార్టీని కూడా వీడేందుకు సిద్ధమవుతున్నారు. -
చిత్తం మహాశయా!
‘నగరం పసుపుమయంతోపాటు పచ్చదనంతో కళకళలాడాలి. రంగులతో శోభాయమానంగా తీర్చిదిద్దాలి’ ఇదీ చినబాబు ఆదేశం. అసలే అప్పుల ఊబిలో పీకల్లోతులో కూరుకుపోయిన కార్పొరేషన్ అధికారులు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనిలో మునిగారు. మహా ప్రాపకం కోసం సిబ్బందే దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తూ అప్పుల భారాలను మరింతపెంచుతున్నారు. సాక్షి,అమరావతిబ్యూరో/ పటమట : విజయవాడ నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది..విలువైన ఆస్తులను తాకట్టు పెట్టాం , బ్యాంకు రుణాలకు వడ్డీ కట్టలేని దుస్థితిలో ఉన్నాం.. నిధులు దుర్వినియోగం చేయెద్దు, అందరూ పొదుపు పాటించండి.. ఇదీ నగర మేయర్ కోనేరు శ్రీధర్ నిత్యం ప్రకటన సారాంశం.. మేయర్ ప్రకటనకు క్షేత్ర స్థాయిలో జరిగే పనులకు ఏమాత్రం పొంతన ఉండడం లేదు. అధికార పార్టీ కనుసన్నల్లో నడిచే వీఎంసీ పాలకపక్షం వారి ప్రాపకం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచేలా తీసుకుంటున్న నిర్ణయాలపై నగరవాసులు మండిపడుతున్నారు. టీడీపీ ఈనెల 27న కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించే మహానాడు కార్యక్రమ సేవలో వీఎంసీ పాలక పక్షం నుంచి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తలమునకలయ్యారు. అప్పుల్లో ఉన్న వీఎంసీ నిధులు కూడా మహానాడు కార్యక్రమం కోసం వెచ్చిస్తున్నారు. ఇప్పటికే రూ.400 కోట్లు అప్పుల ఊబిలో ఉంది. నెలవారీ వడ్డీలు కూడా చెల్లించలేని దుస్థితి ఉంది. నగరంలో చూస్తే ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి.. తాగు నీటి కష్టాలు వెంటాడుతున్నాయి..ఇన్ని సమస్యలుంటే వాటిని వదిలేసి మహానాడు కోసం అధికారులు , ఉద్యోగులు , సిబ్బంది, పాలకపక్ష నేతలు పరుగులు తీస్తున్నారు. సుందరీకరణ ముసుగేసి.. మహానాడు వచ్చే నేతలకు నగరాన్ని రంగుల హంగులతో తీర్చిదిద్దాలని చినబాబు ఆదేశాలిచ్చారు. అంతే నగర పాలకసంస్థ ఉన్నతాధికారులు నుంచి కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బంది వరకు సుందరీకరణ పనుల్లో పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. గ్రీనరీ, రోడ్డు అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నగర కమిషనర్ జనరల్ ఫండ్ నుంచి రూ.కోటి నిధులు విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగానికి రూ.50 లక్షలు, ఉద్యానవన విభాగానికి రూ.50 లక్షలు ఖర్చు చేసేలా ప్రతిపాదనలు రాత్రికి రాత్రే పూర్తి చేసి పనులు చేపట్టారు. గ్రీనరీలో కక్కుర్తి .. గ్రీనరీ పనుల్లో అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలున్నాయి.. సెంట్రల్ డివైడర్ మధ్యలో ఏర్పాటుచేస్తున్న పెంటనాస్, లిల్లీ మొక్కలు రూ.12 నుంచి 15 రూపాయల వరకు ఉంటాయి. కానీ వాటిని సంబంధిత కాంట్రాక్టర్ రూ. 25 వంతున కొనుగోళ్లు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ పనులు కూడా రాత్రికిరాత్రే నామినేటెడ్ విధానంలో కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. సీఆర్డీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులకు కూడా డివైడర్ మధ్యలో వేసే కోనాకార్పస్ మొక్కలు రూ. 75 ఉన్నప్పటికీ రూ . 150 వెచ్చించినట్లు తెలుస్తోంది. హడావిడిగా రోడ్డు పనులు పంటకాల్వ రోడ్డును వెడల్పు చేసేందుకు వీఎంసీ అధికారులు రాత్రికి రాత్రే ప్రణాళికలు రూపొందించేశారు. సుమారు 2.5 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ప్రాంతానికి రోడ్డుకు ఇరువైపులా మూడు అడుగులమేర వెడల్పు చేస్తున్నారు. ఇందు కోసం దాదాపు రూ.50 ల„ýక్షలు వెచ్చించినట్లు తెలిసింది. ఆ పనులను భారీ యంత్రాలతో ఆగమేçఘాలపై చేయిస్తున్నారు. కమిషనర్ స్వయంగా పనులను పర్యవేక్షించడం విశేషం. కార్పొరేషన్ సిబ్బందితో పనులు మహానాడు కోసం హడావుడిగా చేస్తున్న నగర గ్రీనరీ పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అయితే పనులు వేగవంతంగా జరగకపోవడంతో కార్పొరేషన్ సిబ్బందినే ఈ పనులకు పురమాయించారు. డివైడర్ మధ్యలో మట్టిని నింపి, మొక్కలు నాటేందుకు హార్టీ కల్చర్ విభాగంలో విధులు నిర్వహించే 50 మంది సిబ్బందిని వాడుకుంటున్నారు. ఇందుకు ఆ విభాగ ముఖ్యఅధికారికి కాంట్రాక్టర్ తాయిలాలు అందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 14 లారీల మొక్కలు పటమట పంటకాలువ రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఆటోనగర్ సనత్‌నగర్ క్రాస్ వరకు డివైడర్ మధ్యలో మొక్కలు నాటేందుకు వీఎంసీ బాధ్యతలు తీసుకుంటే అక్కడి నుంచి కానూరు మహా నాడు ప్రాంతం వరకు సీఆర్డీఏ ఆ పనులు చేపడుతోంది. కార్పొరేషన్ పరిధిలో పెంటనాస్, లిల్లీ మొక్కలను నాటేందుకు 7 లారీల మొక్కలు దిగుమతి చేసుకున్నారు. ఒక్కోలారీకి రూ. 3 వేల మొక్కలు పడతాయి. కానూరు పంచాయతీ పరిధి ప్రారంభం నుంచి మహానాడు జరిగే సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల వరకు రోడ్డు మధ్యలో నాటే కోనా కార్పస్ మొక్కలు మరో ఏడు లారీలు, మిగిలిన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో మొక్కలు నాటేందుకు మరో ఆరు లారీల మొక్కలు దిగుమతి చేసుకుంటామని అధికారులు తెలిపారు. సుందరీకరణకోసం నగరంలోని వివిధ ప్రాంతాలను సుందరీకరణ చేయడానికి చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సెంట్రల్ డివైడర్‌లో, పార్కులు, ఇతర ప్రాంతాల్లో ఆహ్లాదకరవాతావరణం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం. కమిషనర్ ఆదేశాల మేరకు గత 20 రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో రూ. 50 లక్షల వరకు మొక్కల కొనుగోలు, మట్టి కొనుగోలు, పాతమట్టి తొలగింపు, కొత్తమట్టి ఏర్పాటు, మొక్కలు నాటుతున్నాం. పంటకాల్వ రోడ్డుకు ఇప్పటి వరకు రూ. 20 లక్షల వరకు వెచ్చించాం.– ప్రదీప్, ఏడీహెచ్ నగరాభివృద్ధిలో భాగంగానే.. రాజధాని నేపధ్యంలో నగరంలో విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతుంది. దీన్ని నియత్రించేందుకు వీఎంసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రోడ్డు మధ్యల్లో సెంట్రల్ డివైడర్లు ఏర్పాటు చేయడం, పాతవాటికి రంగులు వేయడం, రోడ్డుకు ఇరువైపులా వెడల్పు చేయడానికి చర్యలు చేపడుతున్నాం. అన్ని ప్రాంతాల్లో డివైడర్లకు రంగులు వేస్తున్నాం. పంటకాల్వ రోడ్డుకు వెడల్పుకు, డివైడర్‌కు రంగులకు ఇప్పటి వరకు రూ. 30 లక్షల అంచనాలతో పనులు జరుగుతున్నాయి. తూర్పు నియోజకవర్గ పరిధిలో జరిగే అభివృద్ధి పనులను సర్కిల్–3 పరిధిలోని ఈఈ పర్యవేక్షిస్తున్నారు.– పి.ఆదిశేషు, సీఈ -
తప్పుడు పని.. చేయక తప్పడం లేదు
ఆమదాలవలస: ‘ఇసుక అక్రమ రవాణా తప్పుడు పని.. అయినా చేయక తప్పడం లేదు’ అని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని తన నియోజకవర్గం ఆమదాలవలసలో సుమారు 400 మంది ట్రాక్టర్ యజమానులు, వారి కుటుంబాలు కాళ్ల వేళ్ల పడుతుంటే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుచెప్పలేదన్నారు. శుక్రవారం ఆమదాలవసలోని అశోక పబ్లిక్ స్కూల్ ఆవరణలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడు కార్యక్రమంలో కూన రవికుమార్ మాట్లాడారు. ట్రాక్టర్ యజమానుల కుటుంబాలు ఇసుక రవాణాతోనే బతుకుతున్నాయని.. అందుకే ర్యాంపుల్లోకి ఏ అధికారి వెళ్లి దాడులు నిర్వహించొద్దని హెచ్చరించినట్టు ఆయన అంగీకరించారు. అభివృద్ధిని చూడలేక కొన్ని పత్రికలు, కొంతమంది ప్రతిపక్ష నాయకులు తనపై బురద జల్లుతున్నారని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీలో మహిళలకు న్యాయం జరగదా?
సాక్షి, గుంటూరు: మహిళలకు అన్యాయం జరిగితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నా స్వయంగా టీడీపీ నేతలే తనపై దాడులకు పాల్పడుతున్నారని పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త ఆవేదన వ్యక్తం చేసింది. శుక్రవారం గుంటూరులో మినీ మహానాడు సందర్భంగా వేదికపైకి చేరుకున్న ఆమె తనకు న్యాయం చేయాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీశారు. టీడీపీ మహిళా కార్యకర్తనైన తనపైనే అరాచకాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏమిటని నిలదీయటంతో వారంతా కంగుతిన్నారు. వెళ్లిపోవాలన్న మంత్రి ప్రత్తిపాటి ‘టీడీపీలో మహిళలకు న్యాయం జరగదా? నా భర్త మృతికి కారణమైన వారిని టీడీపీ నేతలే రక్షిస్తున్నారు. నాపై దాడులకు పాల్పడుతున్నారు. రక్షణ కోరినా పట్టించుకున్న నాథుడే లేరు. ముఖ్యమంత్రిని కలిస్తే మంత్రిని కలవమన్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కలిసి న్యాయం చేయమని కోరితే రాజీపడమంటూ సలహా ఇస్తున్నారు’ అని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన నర్రా లలిత వాపోయింది. అయితే తాము ఏమీ చేయలేమని, వెళ్లిపోవాలంటూ మంత్రి పుల్లారావు ఆమెకు సూచించారు. అనంతరం కొందరు టీడీపీ నేతలు ఆమెను బలవంతంగా పక్కకు లాక్కెళ్లారు. ఈ గొడవను చిత్రీకరిస్తున్న విలేకరులు, మీడియాపై దురుసుగా ప్రవర్తించి కెమెరాలు లాక్కునే ప్రయత్నం చేశారు. చంపేస్తామని బెదిరిస్తున్నారు.. అనంతరం నర్రా లలిత విలేకరుల వద్ద తన గోడు వెల్లబోసుకుంది. తన భర్త 2017లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడని, అయితే తన చావుకు కారకులంటూ కొందరి పేర్లు వెల్లడించారని తెలిపింది. దీనిపై పలుసార్లు జిల్లా ఉన్నతాధికారులను కలవగా విచారణకు అధికారిని నియమించినట్లు పేర్కొంది. దీంతో రౌడీషీటర్ మొవ్వా బుల్లయ్యతోపాటు మరికొందరు కేసులు వెనక్కు తీసుకుని రాజీపడకపోతే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోయింది. మాజీ ఎంపీపీ పూనాటి రమేష్, మరికొందరు టీడీపీ నేతలు తనపై దుష్ప్రచారం చేస్తూ విచారణ అడ్డుకోవాలని చూస్తున్నారని పేర్కొంది. మహానాడులోనే ఆత్మహత్య చేసుకుంటా తనకు జరిగిన అన్యాయంపై గతంలోనే సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని, పోలీసు అధికారుల హామీతో కిందకు దిగి వచ్చానని లలిత తెలిపింది. టీడీపీ మహానాడు ముగిసేలోగా తనకు న్యాయం చేయకుంటే అదే ప్రాంగణంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ కన్నీటి పర్యంతమైంది. శుక్రవారం రాత్రి లలితను గుంటూరులోని టీడీపీ కార్యాలయానికి పిలిచి టీడీపీ నాయకులు పంచాయితీ నిర్వహించినట్లు తెలిసింది. -
అమ్మో ఎంపీనా..!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తిరుపతి, నెల్లూరు పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయో రావో ఇంకా సృష్టత రాని పరిస్థితి. ఒక వేళ ఎన్నికలు వస్తే ఎవరు పోటీ చేయాలనే దానిపై అధికార పార్టీలో తర్జనభర్జలకు జిల్లా మహానాడు వేదిక అయింది. మహానాడులో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పరస్పరం ఉప ఎన్నికల విషయమై కౌంటర్లు.. ప్రతి కౌంటర్లు వేసుకోవటం హాట్ టాపిక్‌గా మారింది. తొలుత మాట్లాడిన మాజీ మంత్రి ఆదాల మంత్రి సోమిరెడ్డితో వర్గవిభేదాల నేపథ్యంలో నెల్లూరు పార్లమెంట్ ఉప ఎన్నిక స్థానంలో ఇద్దరు మంత్రుల్లో ఎవరో ఒకరు పోటీచేయాలని వ్యాఖ్యనించటం, చివరగా ప్రసంగించిన మంత్రి సోమిరెడ్డి ఆదాల అన్న వద్ద ఉన్నంత డబ్బు తనవద్ద లేదని ఆయనకే టికెట్ ఇస్తే మేం బాధ్యత తీసుకుని గెలిపించుకుంటామని పేర్కొనడం తీవ్ర చర్చకు దారి తీసింది. పనిలో పనిగా మంత్రి సోమిరెడ్డి మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. యథావిధిగా సీనియర్ నాయకులు తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేయడం.. సభలో మాట్లాడిన నేతలు అందరూ ఇప్పుడే టికెట్ల గురించి చర్చకు తెరతీయటం లాంటి పరిణామాల నడుమ జిల్లా తెలుగుదేశం పార్టీ మహానాడు కొనసాగింది. సృష్టత ఎవరికీ లేదు రాష్ట్రంలో, కేంద్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఇంకా పూర్తి సృష్టత ఎవరికీ లేదు. ఉప ఎన్నికలు వస్తాయా లేక ముందస్తు ఎన్నికలు వస్తాయా లేక సాధారణ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా అనే విషయం తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఫలానా సీటులో నీవు అంటే నీవు పోటీ చేయాలంటూ నేతలే చర్చించుకున్నారు. అది కూడా వర్గ విభేదాల నేపథ్యంలో పార్టీకి కష్టంగా ఉండే స్థానాల్లో ఫలానా నేత పోటీ చేయాలంటూ మాట్లాడి రాజకీయ వేడి పుట్టించడంతో పాటు పరోక్షంగా వైరి నేతలకు గట్టిగా కౌంటర్లు ఇచ్చుకున్నారు. ఇక మహానాడుకు మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్ గైర్హాజరయ్యారు. ఆదాల వర్సెస్ సోమిరెడ్డిమంత్రి సోమిరెడ్డి, మాజీ మంత్రి ఆదాల మధ్య రాజకీయ విభేదాలు మహానాడు సభలో సృష్టంగా సభలో బయపడ్డాయి. దీంతో పాటు ఒకరిపై మరొకరు కౌంటర్లు వేసుకున్నారు. మాజీ మంత్రి ఆదాల పరోక్షంగా సోమిరెడ్డిని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో ధాన్యంకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయినా పట్టించుకోవటం లేదని పేర్కొనడం కలకలం రేగింది. ఒక వేళ ఉప ఎన్నికలు వస్తే నెల్లూరు పార్లమెంట్ నుంచి మంత్రులు ఇద్దరిలో ఒకరు పోటీ చేయాలని ఆదాల వాఖ్యానించారు. చివరగా మంత్రి సోమిరెడ్డి గంటకు పైగా ప్రసంగించి పనిలో పనిగా తన రాజకీయ ప్రత్యర్థులు ఆదాల, ఆనంపై పరోక్ష విమర్శలు చేశారు. ఆదాలను ఉద్దేశించి సోమిరెడ్డి మాట్లాడుతూ ‘నా దగ్గర అన్న వద్ద ఉన్నంత డబ్బు లేదు.. అన్న దగ్గరే బాగా డబ్బు ఉంది.. అన్నే పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే గెలిపించే బాధ్యత మేం తీసుకుంటాం’ అని ఆదాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. పనిలో పనిగా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన ఇసుక, సిలికా, రేషన్, ఎర్రచందనం మాఫియా విమర్శలపై మాట్లాడుతూ ప్రతి దానిలో అన్ని పార్టీల వారు ఉన్నారు. అయితే ఎవరు ఏంటో పూర్తిగా తెలుసుకుని మట్లాడితే బాగుంటుంది. ప్రతి దాన్నీ సోమిరెడ్డి పై బురదజల్లేలా మాట్లాడటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. పొరపాట్లు మళ్లీ చేయం.. ‘2014 ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు మళ్లీ చేయం. గతంలో అసెంబ్లీ సీట్ల అభ్యర్థుల ఎంపిక విషయంలో తీవ్ర జాప్యం జరగటంతో జిల్లాలో మెజార్టీ స్థానాలు కోల్పోయాం.. ఈసారి అలా కాకుండా ఎన్నికలు ఆరు నెలల ముందే అభ్యర్థులు ఖరారు చేయాలని అధిష్టానాన్ని కోరతాం.. గతంలో తనకు నెల్లూరు రూరల్ అని చెప్పి చివరి నిమిషంలో సర్వేపల్లికి మార్చారు. అలాగే నెల్లూరు పార్లమెంట్‌తో పాటు కొన్ని సీట్ల కేటాయింపుల్లో జాప్యం జరిగింది. ఈసారి దానికి అవకాశం లేకుండా ముందే సృష్టత కోరతాం’ అని మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. సీనియర్ల గోడు యథాతథం తమకు ప్రాధాన్యం ఇవ్వటం లేదంటూ సీనియర్లు మహానాడు వేదికపై మరోసారి గళం విప్పారు. నాలుగేళ్లుగా చెబుతున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని వారు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కోవూరుకు చెందిన పార్టీ సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తానే గొప్ప అనే రీతిలో మన ఎమ్మెల్యేలు వ్యవహరించటం పార్టీకి చేటు తెస్తున్నాయని పరోక్షంగా ఎమ్మెల్యే పోలంరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరో సీనియర్ నేత నువ్వుల మంజుల మాట్లాడుతూ సీనియర్లు అంటే గౌరవం లేకుండా పోయిందని వాపోయారు. మొత్తం మీద మహానాడు ఎన్నికల సభలా సాగింది. -
అంతర్యుద్ధం
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోంది. మినీ మహానాడు వేదికలుగా నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ నేతలు జిల్లా మంత్రులను టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అధికార దాహంతో టీడీపీలో చేరిన కొత్త, పాత నేతల మధ్య గ్రూప్ విబేధాలు, వర్గ పోరు నిత్యకృత్యంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే నియోజక వర్గాల్లో నిర్వహించిన మినీ మహానాడుల్లో అనేక చోట్ల నేతల మధ్య విభేదాలు, అసంతృప్తి తీవ్రస్థాయిలో భగ్గుమనగా, మరికొన్ని చోట్ల అయితే ప్రత్యక్ష విమర్శలతో జిల్లా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. కొన్ని నియోజకవర్గాలకు మంత్రులు, జిల్లా అధ్యక్షుడు డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో గురువారం నెల్లూరునగరంలో జిల్లా మహానాడు జరగనుంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అధికార పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. నిత్యం పర్యటనలు, సమీక్షలు అంటూ హడావుడి తప్ప క్షేత్రస్థాయిలో పార్టీ నేతల మధ్య సమన్వయం కొరవడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పార్టీలో ఇద్దరు నేతలు తాత్కాలిక ప్రయోజనాల కోసం కలిసినట్లుగా కనిపిస్తారు తప్ప ఎవరికి వారే యమునా తీరే చందంగా రాజకీయాలు సాగిస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిలు మొదలుకొని జిల్లాకు రాష్ట్ర మంత్రుల వరకు ఇదే వైఖరి కొనసాగుతుంది. మంత్రులు సోమరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. పి.నారాయణలు ఎదురు పడితే మాట్లాడుకోవటం మినహా గడిచిన నాలుగేళ్లలో ఏకతాటిపై పని చేసింది లేదు. ఎవరికి వారే జిల్లాపై పెత్తనం కోసం పాకులాడుతూనే ఉన్నారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంటడం ప్రస్తుతం అధికారంలో ఉండి టీడీపీ చివరిగా నిర్వహించే మహానాడు కావటంతో లోటుపాట్లపైనే ఎక్కువగా చర్చ సాగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో జరిగిన మినీ మహానాడులు వేదికగా అనేక చోట్ల వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఆత్మకూరుతో మొదలైన ఈ సంఘర్షణలు కోవూరు, ఉదయగిరి, నెల్లూరు రూరల్ వరకు కొనసాగింది. కొన్ని చోట్ల పరోక్ష విమర్శలు ఉంటే మరికొన్ని చోట్ల ప్రత్యక్ష విమర్శలు కొనసాగిన నేపథ్యంలో జిల్లా అధికార పార్టీలో గత వారం రోజులుగా నేతల తీరు, జరగుతున్న పరిణామాలపై తీవ్రస్థాయిలో చర్చ కొనసాగుతోంది. మంత్రి సోమిరెడ్డిని టార్గెట్ చేసిన ఆనం ఆత్మకూరు మినీ మహానాడులో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ప్రత్యక్షంగా మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. వాస్తవానికి విమర్శల విషయం పక్కన పెడితే ఇద్దరికి సుదీర్ఘ కాలంగా రాజకీయ వైరం ఉండటంతో పాటు తాజాగా ఆనం టీడీపీలో చేరినప్పటి నుంచి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఆత్మకూరులో కన్నబాబును మంత్రి సోమరెడ్డి ప్రోత్సహించి తన ప్రాధాన్యత తగ్గిస్తున్నారనేది బలమైన కారణంగా ఉంది. సీఎం చంద్రబాబుకు అనేక మార్లు ఫిర్యాదులు చేసినా పరిస్థితిలో మార్పు రాకపోవటంతో అందరిని టార్గెట్ చేసి బహిరంగ వేదికలపైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆత్మకూరులో మంత్రి సోమిరెడ్డిని విమర్శిస్తూ పనిలో పనిగా మంత్రి నారాయణను ఇరకాటంలో పడేశారు. జిల్లాలో జరిగేదంతా సీఎంకు మీరే చెప్పండి అంటూ ఆయన్ను బాధ్యుడ్ని చేయడంతో ఆ తర్వాత జరిగిన మినీ మహానాడులకు మంత్రి నారాయణ దూరంగా ఉన్నారు. ఇసుక అక్రమ రవాణా, సిలికా వ్యాపారం, రేషన్ మాఫియా, ఎర్ర చందనం అక్రమ రవాణా వెనుక కీలక అధికార పార్టీ నేతలు ఉన్నారనది బహిరంగ సత్యం. ఈ క్రమంలో ఆనం వాటిపైనా మాట్లాడటంతో పార్టీ కీలక నేతలందరికీ ఆనం వ్యాఖ్యలతో సెగ తగిలింది. అయితే ఇప్పటి వరకు వీటిపై మంత్రి సోమిరెడ్డి కానీ ఆయన వర్గం కానీ ఒక్కమాట కూడా మాట్లాకుండా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. అదే బాటలో మాజీ మంత్రి ఆదాల ఇక మంత్రి సోమరెడ్డిని మొదటి నుంచి రాజకీయంగా ఆదాల ప్రభాకరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2014 ఎన్నికల్లో పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆదాలకు జిల్లా పార్టీ కనీస ప్రాధాన్యత లేకపోవటంతో నెల్లూరురూరల్ నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. మంత్రి సోమరెడ్డి తీరుపై రెండు..మూడు సార్లు చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తే ఆయన నేతలందరికీ సీరియస్‌గా క్లాస్ తీసుకున్నారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఇక ఇదే అసంతప్తితో పార్టీ సీనియర్ నేతలు అనేక మంది ఉన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోలంరెడ్డికి సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి మధ్య ఉన్న వర్గ విభేదాల నేపథ్యంలో పెళ్లకూరుకు మినీమహానాడుకు ఆహ్వానం లేదు. మంత్రి సోమిరెడ్డి ఒత్తిడితో అలా వెళ్లి ఇలా వచ్చారు. ఉదయగిరి నియోజక వర్గ మహానాడుకు మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డికి ఆహ్వానం అందని పరిస్థితి. బీద మౌనపాత్ర జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో గొడవల్ని సర్దుబాటు చేసి వివాదాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాల్సిన జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మౌనప్రాత పోషిస్తున్నారు. ఈయన పార్టీలో వివాదాలకు దూరంగా, సమస్యలు తీవ్రమైనప్పుడు ఎవరికి దొరకరనే ఆరోపణ ఉంది. ప్రస్తుతం వర్గ విభేదాలు, వివాదాలు పడుతున్న నేతలంతా సీనియర్లు, రాష్ట్రస్థాయి నేతలు కావటంతో అన్నింటికి దూరం దూరంగా ఉంటున్నారు. -
నిలదీత.. ఎదురీత
సాక్షి, గుంటూరు: నిరసనలు.. నిలదీతలు.. టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు.. జనం లేక వెలవెల.. ఇది మొత్తంగా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో జరిగిన మినీ మహానాడు జరిగిన తీరు. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా కార్యక్రమం చేపడితే నియోజకవర్గ పరిధిలో కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవుతారు. జిల్లాలో వారం రోజులుగా జరుగుతున్న మినీ మహానాడు కార్యక్రమాలు మాత్రం జనం లేక వెలవెలబోతున్నాయి. గ్రామాల నుంచి వాహనాల్లో జనాన్ని తరలించాల్సి వస్తోందని టీడీపీ ముఖ్య నేతలు ఆందోళన చెందుతున్నారు. వచ్చిన జనం కూడా కార్యక్రమం ముగియకముందే వెళ్లిపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. మరికొన్ని చోట్ల అయితే జన్మభూమి కార్యక్రమాల మాదిరిగా రేషన్ కార్డులు, ఇల్లు, పింఛన్లు మంజూరు చేస్తారని పుకారు పుట్టించి జనాన్ని సమీకరిస్తున్నారు. కార్యక్రమంలో నేరుగా ఎమ్మెల్యేలు, మంత్రులను సైతం సొంత పార్టీ కార్యకర్తలే నిలదీస్తున్నారు. ప్రత్తిపాడులో గందరగోళం టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటుతున్నా తమకు ఒరిగిందేమీ లేదంటూ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. ఈ నెల 18వ తేదీన జరిగిన ప్రత్తిపాడు నియోజకవర్గ మినీ మహానాడు రసాభాసగా మారింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి దివి శివరామ్ మాట్లాడుతూ పార్టీ వట్టిచెరుకూరు మండల అధ్యక్షుడిగా మన్నవ పూర్ణచంద్రరావు విజయానికి కృషి చేశానని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై సభావేదికపైనే ఉన్న మన్నవ పూర్ణచంద్రరావు అసంతృప్తి వ్యక్తం చేస్తూ మీ దానధర్మాలతో మాకు పదవులు రాలేదని, పార్టీ నిర్వహించిన ఐవీఆర్ఎస్ ఓటింగ్‌లో అత్యధిక ఓట్లు పోలు కావడంతోనే వచ్చాయని చెప్పారు. ఈ సమయంలో మన్నవ పూర్ణచంద్రరావు వర్గీయులు దివి శివరామ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ వ్యతిరేక వర్గమైన మాజీ ఎంపీపీ పూనాటి రమేష్ వర్గీయులకు అనుకూలంగా దివి శివరామ్ వ్యవహరించారని విమర్శలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు జోక్యం చేసుకున్నా గొడవ సద్దుమణుగలేదు. మంత్రి పుల్లారావుకు చేదు అనుభవం జీవీ ఆంజనేయులు ప్రాతినిధ్యం వహిస్తున్న వినుకొండ నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓ టీడీపీ కార్యకర్త సభలోనే నిలదీయడం కలకలం రేపింది. ఓ సామాజిక వర్గానికి తప్ప, కష్టపడేవారికి పదవులు దక్కడం లేదని కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన మంత్రి ‘నువ్వు హీరో అనుకుంటున్నావా., పెద్ద మగాడిలా మాట్లాడుతున్నావ’ంటూ మండిపడ్డారు. సదరు టీడీపీ కార్యకర్త మంత్రిపై గొడవకు దిగడంతో పోలీసులు సభ నుంచి లాక్కెళ్లారు. జనం లేక వెలవెల రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న వేమూరు నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమానికి స్పందన కరువైంది. కార్యక్రమానికి వచ్చిన కొద్దిపాటి జనం కూడా లేచి వెళ్లిపోతుండటంతో త్వరగా ముగిద్దాం కూర్చోండంటూ మంత్రే స్వయంగా బతిమాలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెదకూరపాడు, గురజాల, మంగళగిరి వంటి నియోజకవర్గాల్లో సైతం కార్యక్రమాల వైపు ప్రజలు చూడలేదు. ప్రజలే కాకుండా సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేయడంతో టీడీపీ నేతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. -
బహిరంగ వేదికపై..తమ్ముళ్ల తగవు
పులివెందుల/రూరల్ : పులివెందుల పట్టణంలోని శిల్పారామంలో జరిగిన టీడీపీ జిల్లా మినీ మహానాడులో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సోమవారం జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఆధ్యక్షతన జిల్లా మినీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జమ్మలమడుగు టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ పరోక్షంగా మంత్రి ఆదినారాయణరెడ్డిపై విరుచుకుపడ్డారు. రాజకీయాలు అనేవి.. ప్రజలకు సేవ చేసేందుకే కానీ.. పెత్తనం చెలాయించేందుకు కాదని మంత్రి ఆదిపై పరోక్షంగా విమర్శలు చేశారు. అలాగే తాము పార్టీ స్థాపించినప్పటినుంచి ఉన్నామని.. వీరారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు తాను జిల్లా అధ్యక్షునిగా పనిచేశానని తెలిపారు. ఇటీవల కొంతమంది స్టేట్మెంట్లు చూస్తే తనకు బాధగా ఉందని.. మహానాడును ఒక పండుగగా జరుపుకుంటున్నామని.. ఇక్కడ కొన్ని విషయాలు తాను మాట్లాడాలనుకుంటున్నా.. పార్టీ మీద ఉన్న గౌరవంతో మాట్లాడలేకపోతున్నానని పేర్కొన్నారు. ఒకవేళ మాట్లాడితే చంద్రబాబుకు మచ్చ తెచ్చే విధంగా ఉంటుందన్నారు. పదేళ్లపాటు ప్రభుత్వం లేకున్నా.. ఎన్నో అవాంతరాలు ఎదురైనా ప్రాణాలను ఫణంగా పెట్టి ఎదుర్కొన్నామేతప్ప.. పార్టీని వీడలేదన్నారు. పార్టీ అధికారంలో లేకున్నా.. ఎన్నో త్యాగాలు చేసి నష్టాలను ఎదుర్కొని.. పార్టీకి, ప్రజలకు సేవ చేశామన్నారు. ఇప్పటికి కూడా తమ పార్టీ నాయకులు కొంతమంది జైళ్లలోనే ఉన్నారన్నారు. తాను కూడా రెండేళ్లపాటు జైలులో ఉన్నా కూడా.. తమ ఇంటిలోని ఆడవాళ్లు రాజకీయం నడిపారన్నారు. ముఖ్యమంత్రి చెప్పడంతోనే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని గౌరవిస్తున్నామన్నారు. వారు పార్టీలో ఉన్నవాళ్లను కించపరిచే విధంగా విమర్శలు చేస్తే పార్టీకి నష్టం కలుగుతుందని ఆదినారాయణరెడ్డిని ఉద్దేశించి అన్నారు. రామ సుబ్బారెడ్డి ఆదినారాయణరెడ్డిపై వ్యాఖ్యలు చేస్తుంటే పెద్ద ఎత్తున ఈలలు, కేకలతో సభా ప్రాంగణం మారుమోగింది. అంతకుముందు వేదికపై ఉన్న నాయకుల పేర్లు చెబుతున్నప్పుడు మంత్రి ఆది పేరు ప్రస్తావించకపోవడం కొసమెరుపు. ఎన్ని పుంగనూర్లు అయితే ఒక బెంగళూరవుతుంది.. : సీఎం రమేష్ నాయుడు టీడీపీ మినీ మహానాడులో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడు కూడా మంత్రి ఆదిపై పరోక్ష విమర్శలు చేశారు. తనను రెండవసారి ముఖ్యమంత్రి రాజ్యసభకు ఎంపిక చేశారన్నారు. రాజ్యసభకు ఎంపిక చేయడమంటే.. 45మంది ఎమ్మెల్యేలు బలపరచాలన్నారు. 45మంది ఎమ్మెల్యేలంటే.. 7మంది పార్లమెంటు సభ్యులతో సమానమన్నారు. అంటే దీని అర్థం ఎన్ని పుంగనూర్లు అయితే ఒక బెంగళూరవుతుందో తెలుసుకోవాలని మంత్రి ఆదిని ఉద్దేశించి పరోక్షంగా పేర్కొన్నారు. ఇటీవల ఆదినారాయణరెడ్డి సీఎం రమేష్‌పై విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు అక్కడి కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది. సీఎం నన్ను ఆహ్వానించారు : ఆది టీడీపీ మినీ మహానాడులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యడు సీఎం రమేష్‌నాయుడుల ప్రసంగాలు ముగిసిన తర్వాత మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ నేను ఎవరిని పార్టీలో చేర్చుకోమని అడగలేదని.. ముఖ్యమంత్రే స్వయంగా తనను పిలిపించుకుని 45నిమిషాలు మాట్లాడి పార్టీలో చేర్చుకున్నారన్నారు. అనంతరం ఆయనే తనకు మంత్రి పదవి ఇచ్చారని వారు చేసిన విమర్శలకు సభాముఖంగా సమాధానం చెప్పారు. పార్టీ నేతలు ఈ విధంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో అక్కడ ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహపడ్డారు. రక్తదాన శిబిరానికి స్పందన కరువు : పులివెందుల శిల్పారామంలో సోమవారం నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో తెలుగుదేశం పార్టీ నేతలు సభా ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి తెలుగు తమ్ముళ్ల నుంచి స్పందన కరువైంది. మధ్యాహ్నం 1గంట సమయానికి కూడా ఒకరు కూడా రక్తదానం చేయకపోవడంతో రక్తదాన నిర్వాహకులు స్థానిక పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. తూ తూ మంత్రంగా కేవలం పది మంది మాత్రమే రక్తదానం చేసినట్లు తెలిసింది. -
సీనియర్ నాయకులకు పార్టీ ఏం చేస్తోంది?
వినుకొండ రూరల్: సీనియర్ నాయకులకు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తోంది అంటూ మంత్రి ప్రత్తిపాటిని ఓ కార్యకర్త నిలదీసిన ఘటన వినుకొండ నియోజకవర్గ మినీ మహానాడులో ఆదివారం చోటుచేసుకుంది. వినుకొండలోని గంగినేని కల్యాణ మండపంలో ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు జరిగింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే పట్టణంలోని ఓ సెలూన్లో పనిచేస్తున్న టీడీపీ కార్యకర్త పోతురాజు పుల్లారావు వద్దకు వచ్చి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నాయకులకు పార్టీ ఏమి చేసిందంటూ నిలదీశారు. ఇంతలో మంత్రి కలుగజేసుకొని ‘ఇంతమందిలో నీవు ఒక్కడివే హీరో కాదు’ అంటూ సమాధానం ఇచ్చారు. ఆయన మాటలకు పోతురాజు బదులిస్తుండగా పోలీసులు, టీడీపీ కార్యకర్తలు అతడిని బయటకు పంపించేశారు. నూజెండ్ల మండలానికి చెందిన సీనియర్ నాయకుడికి పార్టీలో పదవులు దక్కకుండా కొందరు అడ్డుపడుతున్నట్లు మినీమహానాడులో విమర్శలు వినిపించాయి. -
రాంగ్ పోస్టింగ్‌లు పెడితే సహించేది లేదు
అమలాపురం: ‘సోషల్ మీడియాలో కొందరు ఉద్దేశపూర్వకంగా రాంగ్ పోస్టులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి వారిని సహించేది లేదు. మాజీ మంత్రి దివంగత డాక్టర్ మెట్ల సత్యనారాయణరావుపై ఓ టీవీ చానల్లో నేను మాట్లాడిన మాటలు ఫ్లోలో వచ్చినవే తప్ప, మరేమీ కాదు’’ అంటూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన స్థానిక అంబేడ్కర్ కమ్యూనిటీ హాలులో ఆదివారం జరిగిన నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు సభలో చినరాజప్ప ప్రసంగించారు. ఇటీవల ఓ టీవీ చానల్లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ మంత్రి దివంగత డాక్టర్ మెట్లపై చేసిన ఓ వ్యాఖ్య వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆ మినీ మహానాడు వేదికపై పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు ఇలా వివరణ ఇచ్చారు. ‘నాకు డాక్టర్ మెట్ల అంటే గౌరవం ఉంది. అలాగే ఆయన తనయుడు రమణబాబు అంటే అభిమానం’ అని రాజప్ప చెప్పుకొచ్చారు. తమ రెండు కుటుంబాల మధ్య సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని కొందరు పుల్లలు పెట్టాలని చూశారని, వారెవరో తనకు తెలుసునని స్పష్టం చేశారు. సోషల్ మీడియాల్లో తప్పుడు ప్రచారం చేసేవారిపై ఇక నుంచి చర్యలు తప్పవని హెచ్చరించారు. రమణబాబుకు పార్టీపరంగా ఎదిగేందుకు తనవంతు ప్రోత్సాహం, కృషి ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. పార్టీలో నిజాయితీగా కష్ట పడేవారిని గుర్తించాలని ఎమ్మెల్యే ఆనందరావుకు సభలో రాజప్ప సూచించారు. పార్టీ పరిశీలకుడు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మెంటే పార్ధసారధి, మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి, మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణబాబు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెచ్చెట్టి చంద్రమౌళి, అల్లవరం మార్కెట్ కమిటీ చైర్మన్ నిమ్మకాయల సూరిబాబు, ఆత్మ చైర్మన్ లింగోలు పెదకాపు, జెడ్పీటీసీ సభ్యులు అధికారి జయ వెంకటలక్ష్మి, వేగిరాజు ప్రవీణ, ఎంపీపీలు యెరుబండి వెంకటేశ్వరరావు, చింతా లక్ష్మీ గౌరీ, తెలుగు రైతు నాయకుడు మట్ట మహాలక్ష్మీ ప్రభాకర్, టీడీపీ నాయకులు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు, జంగా బాబూరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ, అభివృద్ధి పనుల గురించి వివరించారు. -
టీడీపీలో పెరుగుతున్న ఆధిపత్య పోరు
సాక్షి, వైఎస్సార్ జిల్లా : అధికార పార్టీలో ఆధిపత్య పోరు రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇటీవల మంత్రి అఖిలప్రియ- ఏవీ సుబ్బారెడ్డి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుగజేసుకుని వారికి సర్ది చెప్పారు. మినీ మహానాడు సమావేశంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఫైర్ అయిన విషయం విదితమే. అయితే జమ్మలమడుగులో మరోమారు టీడీపీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. వైఎస్సార్ జిల్లాలో రామసుబ్బారెడ్డి- మంత్రి ఆదినారాయణ రెడ్డిల మధ్య వివాదాలు తలెత్తాయి. నేతలు పోటా పోటీగా మినీ మహానాడు సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. శనివారం రామసుబ్బారెడ్డి మినీ మహానాడును ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఆదినారాయణ రెడ్డిల విడిగా మినీ మహానాడు ఏర్పాటు చేశారు. దీంతో నేతల మధ్య అధిపత్య పోరు మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ విధమైన సమస్యలు టీడీపీకి ఎదురు దెబ్బని చెప్పవచ్చు. -
కలసి నడవటం కష్టమే!
‘మా నియోజకవర్గాలకు మేమే రాజులం.. మాకు ఎవరితోనూ సంబంధం లేదు. అధినేత చంద్రబాబునాయుడు కాదు కదా మరెవరు చెప్పినా మాపని మాదే.. మాకు నచ్చిన వారినే పిలుస్తాం. నచ్చని వారిని పిలిచి కలుపుకెళ్లాల్సిన పని లేదు.’ ఇది జిల్లాలోని టీడీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్చార్జిల తీరు. జిల్లాలో నాలుగు రోజులుగా నియోజకవర్గాల్లో మినీ మహనాడు కార్యక్రమం సాగుతోంది. కార్యక్రమాలు కూడా ఇన్చార్జిలు ఎవరికి వారుగానే ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారు తప్ప పార్టీ ప్రొటోకాల్ పాటిస్తున్న దాఖలాల్లేవు. దీంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. పార్లమెంట్ ఇన్చార్జి నేతగా ఉన్న ఆదాల ప్రభాకరరెడ్డిని ఆ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లోని కార్యక్రమాలకు ఆహ్వానించకపోవటం, కోవూరు సీనియర్ నేతగా ఉన్న పెళ్లకూరు విషయంలోనూ నేతలు అదే తీరు ప్రదర్శిస్తుండటంతో ఆ నాయకులు ఇద్దరూ అసంతృప్తిలో ఉన్నారు. దీంతో అధికార పార్టీ అంతర్గత రాజకీయలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మినీ మçహానాడు కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం పిలుపున్చింది. దీనికి అనుగుణంగా ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు నేతలను పరిశీలన కోసం కమిటీని నియమించారు. పార్టీ విధివిధానాలకు లోబడి కార్యక్రమాలు జరగాల్సి ఉంది. అయితే ఇన్చార్జిలు ఇష్టానుసారంగా వారికి కావాల్సిన నేతల్నే ఆహ్వానించటం, మిగిలిన సీనియర్ నేతలను ఉద్దేశపూర్వకంగా ఆహ్వానించకపోవటం తదితర ఘటనలతో నాయకుల తీరు మారలేదని సృష్టం అయింది. జిల్లాలోని 10 నియోజకవర్గాలకు గానూ ఇప్పటి వరకు సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, నెల్లూరు సిటీ, కోవూరు, సూళ్లూరుపేట, ఆత్మకూరు నియోజకవర్గాల్లో మినీ మహానాడులు జరిగాయి. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో జరగాల్సి ఉంది. 20వ తేదీన ఉదయగిరి, 21న నెల్లూరు రూరల్, 22న కావలి, 24న జిల్లా మహానాడు జరగనుంది. ఈ క్రమంలో పార్టీ అంతర్గతంగా ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పనిచేయని బాబు హితబోధ గత వారంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జిల్లా నేతలకు సుదీర్ఘక్లాస్ తీసుకున్నారు. పార్లమెంట్ స్థాయిలో పార్టీల సమీక్షలో భాగంగా జిల్లా నేతలతో అమరావతిలో సమావేశం నిర్వహించారు. జిల్లాలో పార్టీ పరిస్థితి మరింత మెరుగుపడాలని హితబోధ చేస్తూ నియోజకవర్గ ఇన్చార్జిలు ఒక్కొక్కరితో మాట్లాడి క్లాస్ తీసుకున్నారు. ఉదయగిరి ఎమ్మెల్యేను గెస్ట్ ఎమ్మెల్యేలా కాకుండా నియోజకవర్గంలో ఎక్కువ సమయం ఉండి పనిచేయాలని చెప్పారు. అలాగే కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని పార్టీ సీనియర్ నేతలను కలుపుకుని వెళ్లాలని, పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని హితబోధ చేశారు. ఇదేసమావేశంలో నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి నేతల తీరుపై అధినేత సమక్షంలోనే ఫైర్ అయ్యారు. జిల్లాలో పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని, తనకు పార్టీ కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాలకు తనకి ఆహ్వానం ఉండటం లేదని చెప్పారు. చివరకు తాను ఇన్చార్జిగా ఉన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనూ మంత్రి సోమిరెడ్డి జోక్యం ఎక్కువఅయిందని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పార్టీ నేతలు అందరూ కలసి పనిచేయాలని నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలకు ఆదాలను పిలవాలని బాబు సూచించారు. అలాగే సీనియర్ నేతలకు గౌరవం ఇవ్వాలని పేర్కొన్నారు. ఆదాల, పెళ్లకూరుకు ఆహ్వానాలు లేవు చంద్రబాబు జిల్లా నేతలకు వారం రోజులు కూడా గడవక ముందే నేతలు యథావిధిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నెల్లూరు నగరంలో జరిగిన సిటీ మహానాడు, కోవూరులో జరిగిన కార్యక్రమాలకు ఆదాలకు ఆహానాలు లేవు. రెండు చోట్ల మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డే అతిథిగా హాజరయ్యారు. ఇక కోవూరు పార్టీ సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి కూడా ఆహ్వానాలు అందలేదు. కోవూరు మహానాడు ఇనమడుగులో నిర్వహించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పోలంరెడ్డి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ఆహ్వానించారు. మంత్రి హుటాహుటిన పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డిని సభకు తీసుకెళ్లారు. తనకు ఆహ్వానం లేదని తాను రానని చెప్పినా మంత్రి ఒత్తిడి చేసి తీసుకెళ్లారు. తనకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని మంత్రి వద్ద పెళ్లకూరు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై పార్టీ అధినేత బాబుకు ఫిర్యాదు చేస్తానని మంత్రికి చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో సభకు వెళ్లి మంత్రితో వెంటనే తిరిగి వచ్చేటంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద జిల్లా పార్టీలో ఇదే తరహా రగడ అన్ని చోట్ల కొనసాగుతుంది. -
‘మినీ’ లుకలుకలు
జిల్లాలో జరుగుతున్న మినీ మహానాడు సమావేశాలు అసంతృప్తులకు..విభేదాలకు వేదికగా నిలుస్తున్నాయి. ఎవరికి వారు తమ అసంతృప్తిని..ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి దీనిని మార్గంగా ఎంచుకుంటున్నారు. అలకలు తీర్చడం.. ఆగ్రహాన్ని చల్లార్చడం నేతలకు తలనొప్పిగా మారుతోంది. ఇప్పటికే జరిగిన కొన్ని సమావేశాల్లో ఈ తరహా సన్నివేశాలు కనిపించాయి. సాక్షి, తిరుపతి: జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో ప్రారంభమైన టీడీపీ మినీమహానాడు సమావేశాల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఇటీవల తిరుపతి మినీ మహానాడులో నాయకులు, కార్యకర్తలు పార్టీ అధిష్టానంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో తమను ఇబ్బంది పెట్టిన నాయకులను పార్టీలోకి తీసుకుని మళ్లీ అదే సమస్యలను తెచ్చి పెడుతున్నారని సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరంభం నుంచి కష్టపడి పనిచేస్తున్నా æ అధికారం వచ్చాక కూడా తమకు ఆ భావన కలగడంలేదని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం బాలాజీ, బుల్లెట్ రమణ, గుణశేఖర్‌నాయు డు తదితరులు ఆవేదన వ్యక్తం చే శారు. తిరుపతి నాయకులంటే అధినాయకుల దృష్టిలో చులకనభావం నెలకొందని ఆగ్రహం చెం దారు. బీజేపీ, జనసేన నాయకులకు గతంలో టీటీడీ చైర్మన్ పదవి తోపాటు ఇద్దరికి బోర్డు మెంబర్లుఇచ్చారని గుర్తు చేశారు. ఈ సారి ఒక్కరికీ అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తిరుపతిలో తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప ప్రాధాన్యత ఇవ్వడంలేదని బలిజ సామాజిక వర్గ నేతలు మండిపడ్డారు. నామినేటెడ్ పదవుల్లోనూ అన్యాయం చేశారన్నారు. ♦ సత్యవేడు మినీ మహానాడులో ఎమ్మెల్యే ఆదిత్యపై నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్ర భుత్వ పథకాల మంజూరులోనూ ఎమ్మెల్యే కమీషన్లు తీసుకుంటూ అవమానిస్తున్నారని ఆరోపించారు. పార్టీ గుర్తింపు కార్డు ఇవ్వటంలోనూ ఎమ్మెల్యే వివక్ష ప్రదర్శించారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ♦ నగరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రతిపక్షంలో ఉన్నా అభివృద్ధి పనులు చేసుకుంటూ ప్రజల్లో చొచ్చుకుపోతున్నారంటూ పలువురు నాయకులు సు ధీర్ఘంగా చర్చించుకున్నారు. ఆమె వేగాన్ని ఎలా కట్టడి చేయాలనే అంశంపై మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ వర్గీయులు ప్రధానంగా దృష్టి సారించాలని నిర్ణయించినట్లు భోగట్టా. ♦ చంద్రగిరిలోఅధిష్టానం తీరుపట్ల నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ♦ తంబళ్లపల్లె మినీ మహానాడుకు స్థానిక నాయకులు ఎవ్వరూ హాజరుకాలేదు. తమకు ప్రాధాన్యం ఇవ్వకపోవటంతో పాటు... పార్టీ వర్గాలుగా విడిపోవటానికి ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కారణమయ్యారని స్థానిక నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ♦ జిల్లా వ్యాప్తంగా మినీ మహానాడు నిర్వహణపై ఎవరికి వారు విమర్శలు చేసుకుంటున్నారు. పార్టీలో వర్గాలుగా చీలిపోవటంతో నియోజకవర్గ సమన్వయకర్త ఆధ్వర్యంలో నిర్వహించే మినీ మహానాడుకు హాజరు కాలేమని తేల్చి చెబుతున్నారు. అందువల్లే మిగిలిన నియోజకవర్గాల్లో నిర్వహించాల్సిన మినీ మహానాడు సమావేశాలు ఆలస్యం అవుతున్నాయని పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు. గొడవులుంటే తరువాత చూసుకుందాం... మినీ మహనాడు కార్యక్రమాలను సజావుగా పూర్తి చేయండంటూ ఓ వైపు మంత్రి, మరో వైపు పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయకులను చెబుతున్నట్లు తెలిసింది. -
టీడీపీ నేతల తీరుపై మాజీమంత్రి ఆనం ఫైర్..
సాక్షి, నెల్లూరు : ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇటీవల మంత్రి అఖిలప్రియ, టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య గొడవలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. నేడు టీడీపీ నేతల తీరుపై మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జరిగిన ఆత్మకూరు మినీ మహానాడులో ఆనం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇన్ని అవమానాలు పడలేదని ఆయన తెలిపారు. ప్రజల్లో ప్రభుత్వంపై 80 శాతం సంతృప్తి ఉందని చెప్పడం అబద్ధమన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఉన్నా, జిల్లాలో వ్యవసాయ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆనం మండిపడ్డారు. మా సమస్యలు పట్టని ప్రభుత్వంలో మేము ఇంకా కొనసాగుతున్నామా అనే బాధ రైతుల్లో ఉంది, వారు తిరుగుబాటు చేసే పరిస్థితి దగ్గర్లో ఉందని ఆనం తెలిపారు. ‘అధికార పార్టీ ఇంచార్జిగా ఉన్న చార్జింగ్ మాత్రం లేదు. నేను కేవలం జెండా పట్టుకోవడానికే సరిపోతానా. ప్రజల సమస్యలు తీర్చడానికి నేను పనికిరానా. మినీ మహానాడు పెట్టుకుని మనకు మనమే భజన చేసుకుంటూ ఉంటే సరిపోతుందా. అభివృద్ధితోనే గెలుపు సాధ్యం కాదు. కార్యకర్తలకు అండగా ఉన్నప్పుడే విజయం వరిస్తుంది. జిల్లాలో ఉన్న వారి వద్ద నుంచి మాకు వ్యతిరేకత వస్తున్నప్పుడు మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. నియోజక వర్గంలో ఎన్నో సమస్యలు. అభివృద్ధిపై ఎన్నిసార్లు చంద్రబాబుకు విన్నవించుకున్నా ఫలితం శూన్యం. సోమశిల హైలెవల్ కెనాల్ ప్రారంభించి ఐదేళ్లు అవుతున్నా ఇప్పటికీ ముప్పై శాతం పనులు కూడా పూర్తి కాలేదు. మొదటి దశ పూర్తి కాకముందే రెండవ దశకు టెండర్లు పిలుస్తున్నారు. కమీషన్ల కోసమా లేక రైతులను మభ్యపెట్టడానికా’. అని ప్రభుత్వ తీరుపై ఆనం రామనారాయణ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. -
మినీ మహానాడులో తమ్ముళ్ల రచ్చ
ఆలూరు: ఆలూరు నియోజకవర్గ టీడీపీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఇందుకు మినీ మహానాడు వేదికైంది. బుధవారం కర్నూలు–బళ్లారి రోడ్డు సమీపంలోని సెయింట్ జాన్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో టీడీపీ ఇన్చార్జ్ వీరభద్రగౌడ్ అధ్యక్షతన మినీ మహానాడు నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పరిశీలకుడు జకీవుల్లా, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు..నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ వైకుంఠం మల్లికార్జున చౌదరిని ఉద్దేశించి ఆలూరులో టీడీపీ రెండో కార్యాలయం ప్రారంభించడం వెనక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆగ్రహించిన మల్లికార్జున చౌదరి వేదిక పై నుంచే మైకును తీసుకుని తనను నమ్ముకున్న వారిని, పార్టీ కార్యకర్తలను కాపాడుకునేందుకేనని సమధానం చెప్పడంతో వీరభద్రగౌడ్ వర్గీయులు సభ ముందు గందరగోళం సృష్టించారు. గట్టిగా కేకలు వేశారు. దీంతో మనస్తాపం చెందో, మరేమో తెలియదు కాని సభ వేదిక నుంచి వైకుంఠం మల్లికార్జున నిష్క్రమించారు. పక్కనే ఉన్న ఆయన అనుచరులు వీరభద్ర గౌడ్ డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు చొక్కాలు పట్టుకుని తోసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసినా పరిస్థితి అదుపుకాలేదు. కొందరు పోలీసులపైనే దురుసుగా ప్రవర్తించారు. ఒకానొక దశలో ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకునే పరిస్థితి కనిపించడంతో పార్టీకార్యకర్తలు భయాందోళన చెందారు. ఇదిలా ఉంటే మినీ మహానాడుకు తమకు ఆహ్వానం అందలేదని పలువురు సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ చైర్మన్ హనుమంతప్ప, చిట్టెం చెన్నయ్య శెట్టి, మల్లయ్య,రామారావు నాయుడు, ప్రభాకర్ నాయుడు, హొళగుంద మాజీ జెడ్పీటీసీ సభ్యులు గజ్జెహల్లి తిమ్మారెడ్డి, రామలింగా రెడ్డి, మొలగవల్లి సుబ్బారెడ్డి తదితరులు నియోజకవర్గ ఇన్చార్జ్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. -
టీడీపీలో ముదిరిన వర్గ పోరు
ప్రొద్దుటూరు టౌన్ : ప్రొద్దుటూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. మంగళవారం సాయంత్రం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన మినీ మహానాడుకు లింగారెడ్డి వర్గం, ఎంపీ రమేష్ వర్గం గైర్హాజరయ్యారు. మినీ మహానాడుకు రావాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి లింగారెడ్డి ఇంటికి వచ్చి ఆహ్వానించినా, సమస్యను పరిష్కరించలేనప్పుడు తాము ఎలా వస్తామని ఆయనను నిలదీశారు. ప్రతి విషయంలో లింగారెడ్డి వర్గానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా వరదరాజులరెడ్డి వ్యవహరిస్తున్నారని ఇప్పటికే చాలా సార్లు జిల్లా అధ్యక్షునితోపాటు ఇన్చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో ఆసం రఘురామిరెడ్డిని చైర్మన్‌ను చేస్తే తనకు ఇన్చార్జి పదవి కూడా వద్దని వరదరాజులరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పెద్దల సమక్షంలో చెప్పారు. ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ఇన్చార్జి పదవిని వదులుకోలేదు. పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పదవుల్లో వరద వర్గీయులకే ప్రాధాన్యత ఇస్తుండటం లింగారెడ్డి వర్గానికి మింగుడు పడటం లేదు. పింఛన్లు, ఇళ్ల స్థలాలు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లింగారెడ్డి వర్గీయ కౌన్సిలర్లకు ప్రాధాన్యత లేకుండా చేశారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో మినీ మహానాడు వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, మంత్రి ఆదినారాయణరెడ్డి, వరద వర్గీయ కౌన్సిలర్లు, నాయకులు మాత్రమే హాజరయ్యారు. లింగారెడ్డి ఇంటికి జిల్లా అధ్యక్షుడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మంగళవారం సాయంత్రం వైఎంఆర్ కాలనీలోని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఇంటికి వచ్చారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీఎస్ ముక్తియార్, టీడీపీ పట్టణాధ్యక్షుడు ఈవీ సుధాకరరెడ్డి, వర్గీయ కౌన్సిలర్లు, నాయకులతో మాట్లాడారు. మినీ మహానాడుకు రావాలని పిలిచారు. లింగారెడ్డి వర్గీయులు జిల్లా అధ్యక్షుడిని పలు సమస్యలపై నిలదీశారు. వరదరాజులరెడ్డి వేధింపులు తట్టుకోలేకపోతున్నామని చెప్పారు. రాజుపాళెం మండలంలో చేపట్టిన బైక్ ర్యాలీకి తన వెంట వచ్చారని, పార్టీ కార్యకర్తలపై విద్యుత్ అధికారులతో దాడులు చేయించి భయబ్రాంతులకు గురిచేయించాడని ఫిర్యాదు చేశారు. తనకు చెందిన కళాశాల స్థలాన్ని దేవాదాయశాఖాధికారులు వెంటనే స్వాధీనం చేసుకోవాలని వరదరాజులరెడ్డి పురమాయించడం నీచమైన చర్య అని జిల్లా అధ్యక్షునికి చెప్పారు. ఫ్లె్లక్సీల్లో మాజీ ఎమ్మెల్యేనైన తన ఫొటో, రాష్ట్ర కార్యదర్శి ముక్తియార్ ఫొటో ముద్రించలేదని, వరద కొడుకు, మనువడి ఫొటోలు ఏ హోదాలో వేశారని జిల్లా అధ్యక్షుడిని ప్రశ్నించారు. ప్రజలందరూ పార్కులో ట్యాంకు నిర్మాణం వద్దంటుంటే వరదరాజులరెడ్డి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా పార్కులోనే ట్యాంకు నిర్మిస్తామని మంత్రి ఆదినారాయణరెడ్డిని పిలిపించి చెప్పించడం ఏమిటని ప్రశ్నించారు. తమకు న్యాయం చేస్తామని హామీ ఇస్తామంటే మినీ మహానాడుకు వస్తామని తేల్చి చెప్పారు. తాను ఎలాంటి హామీ ఇవ్వలేనని, విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని జిల్లా అధ్యక్షుడు చెప్పారు. ఎలాంటి హామీ ఇవ్వనప్పుడు మేము ఎలా మినీ మహానాడుకు వస్తామని లింగారెడ్డి వాదించారు. దీంతో లింగారెడ్డి ఇంటి నుంచి ఆయన వెళ్లిపోయారు. -
పార్టీని నమ్ముకుని నష్టపోయాం
తిరుపతి తుడా: ‘పార్టీ స్థాపించిన నాటి నుంచి జెండాలు మోశాం. అధికారంలో లేనపుడు కష్టపడి పోరాటాలు చేశాం. అయినా అన్నింటా అన్యాయం జరుగుతూ ఉంది’ అని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి నియోజకవర్గ మినీ మహానాడు సోమవారం ఎంవీఆర్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి నీలం బాలాజీ మాట్లాడుతూ పార్టీ స్థాపన నుంచి కష్టపడి పనిచేస్తున్నానన్నారు. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉన్నా అలాంటి భావన కలగడం లేదన్నారు. ఇది 100లో 95 శాతం మంది మనోవేదనగా ఆయన చెప్పుకొచ్చారు. తిరుపతి నేతలకు గతంలో టీటీడీ చైర్మన్‌తో పాటు బీజేపీ, జనసేన నుంచి ఇద్దరిని బోర్డు మెంబర్లుగా నియ మించారని, ప్రస్తుతం నాయకులు పనికిరాకుండా పోయారా అని ప్రశ్నించారు. జిల్లా నాయకుడు బుల్లెట్ రమణ మాట్లాడుతూ టీడీపీ బలిజలను ఓట్ల కోసం వాడుకుంటోందే తప్ప పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. జిల్లా వైస్ ప్రెసిడెంట్ గుణశేఖర్ నాయుడు మాట్లాడుతూ పదవుల మాట దేవుడెరుగు కార్యకర్తలకు కనీస రక్షణ కరువైందన్నారు. వీరికి మరింత మంది నాయకులు గొంతుకలపడంతో గందరగోళం నెలకుంది. ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్ నరసింహా యాదవ్‌లు సమాధానం చెప్పలేని స్థితిలో ఉండిపోయారు. ఎమ్మెల్యే సుగుణమ్మ అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. -
మినీ మహానాడులో రచ్చకెక్కిన విభేదాలు
-
టీడీపీలో రచ్చ : మహానాడులో కేఈ, తుగ్గలి మాటల యుద్ధం
సాక్షి, తుగ్గలి : టీడీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఆదివారం తుగ్గలిలో టీడీపీ నియోజవర్గ ఇన్చార్జ్ కేఈ శ్యాంబాబు అధ్యక్షతన జరిగిన మినీ మహానాడు అందుకు వేదికైంది. కార్యక్రమం ప్రారంభం కాగానే ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ స్టేజి మీద ఆశీనులయ్యారు. కొంతసేపటి తర్వాత శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ నాగేంద్ర తన భార్య జెడ్పీటీసీ సభ్యురాలు వరలక్ష్మితో కలిసి తప్పెట్ల హంగామాతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇదంతా చూస్తున్న ఎమ్మెల్సీ కేఈ.. తన ముందుగా వెళుతున్న నాగేంద్రను ఏదో అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. కేఈ ఘాటుగా మాట్లాడడంతో ప్రతిగా నాగేంద్ర..‘‘ఏయ్ మాట్లాడే విధానం నేర్చుకో భూస్థాపితం అవుతావు’’ అని హెచ్చరించారు. ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసు కోవడంతో కొద్ది సేపు అక్కడ ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఈ తతంగం అంతా టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఎదుటే జరగడంతో అక్కడున్న వారంతా విస్తుపోయారు. సోమిశెట్టి, శ్యాంబాబు, పోలీసులు, వేదిక మీద ఉన్న నాయకులు ఇద్దరికీ సర్ది చెప్పాల్సి వచ్చింది. అంతటితో ఆగకుండా సమావేశం ముగిసే వరకు మధ్యమధ్యలో వారి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఎమ్మెల్సీ ప్రభాకర్ మాట్లాడుతూ.. పత్తికొండలో ఎస్వీ మోహన్‌రెడ్డి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోందని ఇక్కడికి ఎవరూ రారని, కేఈ శ్యాంబాబే పోటీ చేస్తారన్నారు. రక్తమోడైనా విజయం కోసం పని చేస్తానన్నారు. తుగ్గలిలో 2009 సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేసినప్పుడు టీడీపీకి 23 ఓట్లు మాత్రమే మెజార్టీ వచ్చిందని, 2014లో వైఎస్సార్సీపీకి 240 ఓట్లు మెజార్టీ వచ్చిందని ఇక్కడ ఎవరూ ఏమీ పొడిచింది లేదంటూ పరోక్షంగా కేఈ నాగేంద్రను అనడంతో మరోసారి వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మొదటి నుంచి రికార్డులు చూసుకోవాలని నాగేంద్ర వాదించారు. ఇలా ఇద్దరి మధ్య పలుమార్లు మాటల తూటాలు పేలాయి. వీరి మధ్య విభేదాలు ఇప్పటివి కావని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. -
విమర్శలతో సరి
కొవ్వూరు/కొవ్వూరు రూరల్ : తెలుగుదేశం పార్టీ జిల్లా మినీ మహానాడు నేతల ప్రసంగాలకే పరిమితమైంది. ప్రతిపక్షంపై విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లాలో నెలకొన్న సమస్యలపై ఏ విధమైన చర్చ చేపట్టలేదు. కొవ్వూరులో ఉదయం 11.05 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం మధ్యాహ్నం 1.55 గంటల వరకు సాగింది. నేతలు ముందు నుంచి ఇరవై ఐదు వేల మంది హాజరవుతున్నారని ప్రకటనలు ఇచ్చినప్పటికీ ఆశించినస్థాయిలో జనం హాజరు కాలేదు. పైగా సభ ప్రారంభమైన కొద్ది సేపటికే భోజనాలు ప్రారంభం కావడంతో జనం భోజనాలకు వెళ్లి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. దీంతో గంట ఆలస్యంగా ప్రారంభమైన సమావేశంను మూడు గంటల్లోనే ముగించారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ మాట్లాడుతూ ఎ¯ŒSటీఆర్ పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. ఈయన హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారన్నారు. జిల్లా ఇ¯ŒSచార్జ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ చౌక దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అధికారులు కార్డుదారులను ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని ఆరోపించారు. క్యాష్‌లెస్ లావాదేవీలు ఇష్టమైన వాళ్లు చేతులెత్తండి... అనగానే ఒక్క చెయ్యి లేవకపోవడంతో మంత్రి విస్తుపోయారు. దీనిపై తక్షణమే కలెక్టర్, జేసీలతో మాట్లాడాతానన్నారు. అధికారులు ఈ వి«ధానంపై ఒత్తిడి చేస్తే సస్పెండ్ చేయిస్తామని హెచ్చరించారు. డీలర్లు ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవన్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. కర్నూలు జిల్లాలో వైఎస్సార్ సీపీ నేత నారాయణ రెడ్డి హత్య కేసులో చంద్రబాబు, కేఈ కృష్ణమూర్తి, ఆయన కుమారుడిపై ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. వైఎస్సార్ సీపీ సీబీఐ విచారణ కోరడంలో అర్థం లేదన్నారు. మంత్రి పితాని సత్యనారాయణ కేవలం సమావేశానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపి ప్రసంగం ముగించారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు పార్టీలో ప్రాధాన్యం కల్పిస్తున్నారని, ఐదు సార్లు తనకు జిల్లా సారథి పగ్గాలు అప్పగించడమే నిదర్శమని అన్నారు. ఎంపీ మాగంటి బాబు (వెంకటేశ్వరావు)మాట్లాడుతూ కొల్లేరు అంటే తనకు ఎంతో ఇష్టమని, కానీ అక్కడ ప్రజలకు తాము ఏం చేయగలుగుతున్నామంటే సమాధానం లేదన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఆస్తులు తెలంగాణకు, అప్పులు మనరాష్ట్రానికి వచ్చాయన్నారు. రానున్న రోజుల్లో నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. స్థానిక నేతలు అతిథులకు శాలువాలు కప్పి జ్జాపికలు అందజేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకరరావు కేవలం పది నిమిషాలుండి ప్రసగించకుండానే వెళ్లిపోయారు. మాజీ మంత్రి పీతల సుజాత ఒక నిమిషం మాట్లాడి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. నరసారపురం ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, జెడ్పీ చైర్మ¯ŒS ముళ్లపూడి బాపిరాజు, రాజమõßహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహ¯ŒSలు విదేశీ పర్యటనలో ఉండడంతో హాజరు కాలేదు. గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సోదరుడు మృతి చెందారు. దీంతో ఆయన సమావేశానికి హాజరు కాలేదు. పార్టీ జిల్లా ఎన్నికల పరిశీలకుడు చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, వేటుకూరి శివరామరాజు, నిమ్మల రామానాయుడు, బురుగుపల్లి శేషారావు, గన్ని వీరాంజనేయులు, మొడియం శ్రీనివాసరావు, ఆరిమిల్లి రాధాకృష్ణ, పులపర్తి ఆంజనేయులు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహ¯ŒSరావు, మంతెన సత్యనారాయణ రాజు, ఎంఏ షరీఫ్, పార్టీ నేతలు పెండ్యాల అచ్చిబాబు, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఈలినాని, అంబికా కృష్ణ, పాలి ప్రసాద్, జొన్నలగడ్డ సుబ్బ రాయ చౌదరి, మునిసిపల్ చైర్మ¯ŒS జొన్నలగడ్డ రాధా రాణి, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఐదు అంశాలపై తీర్మానం lవ్యవసాయ రంగాన్ని పటిష్ట పరిచి రైతులను బలోపేతం చేయాలి. lజిల్లాలో పారిశ్రామికీకరణను ప్రోత్సహించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, జీవన ప్రమాణాలు మొరుగుపర్చడం. lపర్యావరణానికి నష్టం కలగకుండా ఆక్వా కల్చర్‌ను అభివృద్ధి చేయడం, తద్వారా ఉపా«ధి అవకాశాలు మెరుగుపరచడం. lఅభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు బలహీన వర్గాలకు అందేలా చర్యలు తీసుకోవడం. lరాష్ట్రానికి వచ్చే జాతీయ సంస్థలను జిల్లాలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. -
అత్మ స్తుతి...పరనింద
ప్రతిపక్షంపై విమర్శలే అజెండా - పార్టీకి దిశ, నిర్దేశం గాలికి వదిలేసిన వక్తలు - చినబాబు భజనలో పోటాపోటీ - జిల్లా సమస్యల ప్రస్తావనే లేని వైనం.. . సాక్షి ప్రతినిధి, కాకినాడ : పార్టీకి దిశా, దశ నిర్థేశనం చేయాల్సిన టీడీపీ మినీ మహానాడు బహిరంగ సభ మాదిరి ప్రతిపక్షంపై విమర్శనాస్త్రాలే అజెండాగా సాగింది. విశాఖలో జరిగే పార్టీ రాష్ట్ర మహానాడుకు కేడర్‌ను ముందస్తు సన్నాహకంలో భాగంగా ప్రత్తిపాడు పామాయిల్ తోటల మధ్య మంగళవారం మినీ మహానాడు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కిమిడి కళా వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ మినీ మహానాడు ఆత్మస్తుతి, పరనింద అన్నట్టుగా నడిచింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం భోజన విరామంతో ముగిసింది. గడచిన నాలుగైదు రోజులుగా టీడీపీ జిల్లా పగ్గాలు, జెడ్పీ చైర్మన్ మార్పు వ్యవహారంపై పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఈ మినీ మహానాడును ప్రభావితం చేశాయి. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిని ప్రకటించడం సంప్రదాయంగా పార్టీ నేతలు భావించారు. తీరా ఆ ప్రక్రియకు తెరదించలేక చేతులెత్తేయడం పార్టీ ముఖ్యనేతల వైఫల్యాన్ని చెప్పకనే చెప్పింది. జిల్లాలో పలు వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా చర్చించి వాటికి పరిష్కారం చూపించే దిశగా ప్రతిపాదనలు మహానాడు ముందుంచాలనేది పార్టీ ఆలోచన. పార్టీ కేడర్, చివరకు నేతలు కూడా అదే ఆశించారు. కానీ ప్రజా సమస్యలపై చర్చ మొక్కుబడి తంతుగానే ముగించడం కార్యకర్తల్లో సైతం నిరాశనే మిగిల్చింది. ఒక్కో నేతకు ఒక్కో అంశంపై సావధానంగా చర్చించి తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి కొద్దిసేపటికే ‘సమయం లేదు మిత్రమా’ అంటూ ముగింపు పలికే వరకూ వెంటపడటం విమర్శపాలైంది. వేదికపై మహానాడును నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాలయ చినరాజప్ప ఈ బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తించారనే చెప్పాలి. అంటే ఏ ఒక్క నాయకుడినీ తనకు అప్పగించిన సబ్జక్టుపై పూర్తిగా మాట్లాడకుండా సమయం లేదంటూ మైకు కొడుతూ మధ్యలోనే ప్రసంగాన్ని ముగించే వరకు వదిలిపెట్ట లేదు. . జిల్లా సమస్యలపై చర్చేదీ...? మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వకుండా సర్కార్ చిన్నచూపు చూడటం, విలీన మండలాల్లో గిరిజనుల సమస్యలు పట్టించుకోకపోవడం, పెండింగ్‌లో ఉన్న కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్, మెట్టలో సుబ్బారెడ్డి సాగర్, చంద్రబాబు సాగర్ తదితర సమస్యలపై పూర్తిగా చర్చకు అవకాశం దక్కక నేతలు అసహనానికి గురవడం కనిపించింది. ఈ విషయాల్లో చంద్రబాబు సర్కార్ వైఫల్యాన్ని ఎమ్మెల్యేలు, ఆ విభాగ నేతలు పరోక్షంగా చెప్పకనే చెప్పడం చర్చనీయాంశమైంది. పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ఎప్పటిలానే అసలు సమస్యలను విడిచిపెట్టి రైతు పక్షపాతి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని రైతులకు ఏమీ చేయలేదంటూ ఆడిపోసుకోవడానికే సమయాన్నంతటినీ వెచ్చించడం కేడర్‌లో చిరాకు కలిగించింది. కెఎస్ఈజడ్లో 10వేల ఎకరాలు బలవంతంగా సేకరించారంటూ వైఎస్‌పై విమర్శలు సంధించిన వర్మ అసలు ఆ జీఓ ఇచ్చింది చంద్రబాబు హయాంలోనే అన్న సంగతి తెలిసి కూడా విమర్శలతో రాజకీయ ప్రసంగం సాగించడంపై ఆ వర్గంలోనే గుసగుసలు వినిపించాయి. రాజకీయాల్లో అపారమైన అనుభవం కలిగిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా మినీ మహానాడు వేదికను బహిరంగ సభ మాదిరిగా కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం చేయడం గమనార్హం. జిల్లాలో నలుమూలలా ఉన్న ప్రధాన సమస్యలను మినీ మహానాడు ద్వారా చర్చించి ఆర్థిక మంత్రిగా తనకున్న పలుకుబడిని వినియోగించి విశాఖ మహానాడులో ఆమోదింప చేయించి తమ సత్తా చాటాల్సిన యనమల ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డిపై చౌకబారు రాజకీయ విమర్శల ద్వారా మినీ మహానాడు లక్ష్యాన్ని దెబ్బతీశారన్న విమర్శలు వినిపించాయి. ప్రలోభాలతో పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వచ్చిన వారంతా సచ్చీలురుగా పొగడడం, ప్రతిపక్షంలో ఉన్న వారిపై కేసులు ఉన్నాయనే విమర్శలకు తప్ప మరో వేదిక దొరక లేదా అని ఆ పార్టీ కేడరే విమర్శలు గుప్పించింది. యనమల మొత్తం ప్రసంగంలో కోటిపల్లి రైల్వే ౖలైన్ను, పిఠాపురం–కాకినాడ మెయిన్ లైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25 శాతం వాటా భరించేలా చూస్తానని కాస్తంత ఊరటనిచ్చే అంశాన్ని ప్రకటించడం కొసమెరుపు. . లోకేష్ భజన... మినీ మహానాడులో ప్రసంగించిన మెజార్టీ నేతలు సీఎం తనయుడు నారా లోకేష్ జపం చేయడంలో ఒకరు మించి ఒకరు పోటీపడటం కనిపించింది. పార్టీ కార్యదర్శి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే నిమ్మల రమానాయుడు ఒక అడుగు ముందుకేసి లోకేష్ విద్యాభ్యాసం దగ్గర నుంచి మొదలుపెట్టి హెరిటేజ్‌లో డైరెక్టర్‌గా సమర్థవంతమైన సేవలందిస్తూ పార్టీ భవిష్యత్తు అతని చేతుల్లోనే ఉందని చెప్పుకు రావడం సహచర నేతలే విస్తుపోయేటట్టు చేసింది. . అసంతృప్తి నేతల డుమ్మా... పార్టీలో అసంతృప్తితో ఉన్న కొందరు నేతలు మినీ మహానాడుకు డుమ్మా కొట్టారు. మంత్రి పదవి దక్కక రోడ్డెక్కి రచ్చరచ్చ చేసిన మాజీ మంత్రి, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి కనిపించ లేదు. ఈయన గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మినీ మహానాడు జరుగుతుందని తెలిసి ముందుగానే ఆయన అమెరికాకు చెక్కేశారని నేతలు చర్చించుకోవడం కనిపించింది. అమలాపురం, రాజమహేంద్రవరం ఎంపీలు పండుల రవీంద్రనాథ్ మురళీమోహన్ కూడా గైర్హాజరయ్యారు. మొత్తంమీద ప్రత్తిపాడు మినీ మహానాడు నిర్వహణ బాధ్యతలను భుజాన వేసుకున్న ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజాకు పార్టీ వైపు నుంచి లభించే భరోసా ఏమిటో భవిష్యత్తులో తేలనుంది. -
అంతా మా ఇష్టం
- బస్టాండ్ వద్ద టీడీపీ మినీ మహానాడు సభ - వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం - నానా ఇబ్బందులు పడిన ప్రయాణికులు కనగానపల్లి (రాప్తాడు): అధికారం ఉంది కదా.. అని తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ‘అంతా మా ఇష్టం’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. మండల కేంద్రం కనగానపల్లిలో గురువారం టీడీపీ మినీ మహానాడు నిర్వహించారు. అయితే బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేయాల్సిన సమావేశ ప్రాంగణాన్ని బస్టాండు కూడలిలో నిర్వహించారు. దీంతో వాహదారులు, ప్రయాణికులు అనేక అవస్థలు పడ్డారు. గ్రామంలోకి రావాల్సిన ఆర్టీసీ బస్సులు, ఆటోలు లోపలికి రాలేక ఎంపీడీఓ కార్యాలయం కూడలిలోనే ప్రయాణికులను దింపేశారు. ఫలితంగా ప్రయాణికులు మెయిన్ రోడ్డు నుంచి కనగానపల్లిలోకి కాలినడకన రావాల్సిన దుస్థితి నెలకొంది. అయితే మధ్యాహ్నం వేళ మండుటెండలో నడుచుకుని రాలేక వృద్థులు, మహిళలు నానా అవస్థలు పడ్డారు. బ్యాగులు, పిల్లలను ఎత్తుకుని రోడ్డుపై ఎండలో నిలుచోలేకపోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు భారీ స్పీకర్లు పెట్టి నిర్వహించని సభను పోలీస్‌స్టేషన్ పక్కనే నిర్వహించటంపై స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ రాజకీయ సభకు స్టేషన్ ఎదురుగా నిర్వహించుకునేందుకు అనుమతులు ఎలా ఇచ్చారని చర్చంచుకున్నారు. కాగా పోలీస్‌స్టేషన్ గోడలు, బోర్డులపైనే టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు కట్టినా పోలీసు అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. జనం కోసం బస్టాండ్ కూడలిలో సభ పెట్టి టీడీపీ నాయకులు ఎంత హడావుడి చేసినా సమావేశానికి అనుకున్నంత మంది రాకపోవడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నోరెళ్లబెట్టక తప్పలేదు. -
మినీ మహానాడు పద్ధతి ప్రకారం జరగలేదు: కరణం బలరాం
ఒంగోలు: టీడీపీ నిర్వహించిన మినీ మహానాడులో గొడవపై ఆ పార్టీ సీనియర్ నేత కరణం బలరాం వివరణ ఇచ్చారు. మీడియాతో ఆయన బుధవారం మాట్లాడారు. మినీ మహానాడు ఓ పద్ధతి ప్రకారం జరగలేదని వ్యాఖ్యానించారు. తనతో సహా చాలా మంది సీనియర్ నేతలు, పరిశీలకులు సమావేశం జరిగే హాలులో 2 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అంత సమయం ఎదురుచూసినా సమావేశానికి కొంతమంది ఎమ్మెల్యేలు, నేతలు రాకపోవడం అవమానకరమని కరణం బలరాం అభిప్రాయపడ్డారు. అద్దంకి ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోకముందే తాను అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వివరించారు. అందుకే ఆ ఎమ్మెల్యే టీడీపీలో చేరేరోజు తాను వెళ్లలేదని, అధిష్టానానికి తన కమిట్ మెంట్, క్రమశిక్షణ గురించి తెలుసునని మాట్లాడారు. -
కొడుకు సెల్ఫీలతో.. తండ్రి సెల్ఫ్ డబ్బాతో..
- కేసీఆర్, కేటీఆర్‌లపై రేవంత్ సెటైర్ - టిక్కెట్లిస్తాం.. టీడీపీలోకి రండి హైదరాబాద్: కంటి ముందు అభివృద్ధి.. ఇంటిముందు అభ్యర్థి అని ఆర్భాటపు ప్రకటనలతో ప్రజలను నమ్మించి బల్దియా ఎన్నికల్లో 99 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ నాయకులు ఆపత్కాలంలో ప్రజలను విస్మరించారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. మంగళవారం టీడీపీ హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో జరిగిన మినీమహానాడుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగిస్తూ, ఇటీవలి గాలివానలకు భారీ హోర్డింగుల కూలినా, రోడ్లు దెబ్బతిన్నా,నాలుగు రోజులైనా కరెంటు రాకున్నా, ప్రజా జీవనం అస్తవ్యస్తమైనప్పటికీ ఏ ఒక్క మంత్రి కూడా ప్రజల వద్దకు రాలేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హస్‌కు, ఆయన కొడుకు అమెరికాకు పారిపోయారని ఎద్దేవా చేశారు. యాపిల్ సంస్థ సీఈవో నగరానికి వచ్చిన సందర్భంగా కొడుకు సెల్ఫీలతో, తండ్రి సెల్ఫ్ డబ్బాతో డంబాలు పలికినా పెద్ద ప్రాజెక్టు మాత్రం బెంగళూరుకు వెళ్లిందన్నారు. నగరంలో 300 అడుగుల భారీ జాతీయ పతాకంతో సహ అమలు కాని ఆర్భాటపు ప్రకటనలతో ప్రజలను మభ్య పెడుతూ కేసీఆర్ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. టిక్కెట్లిస్తాం.. టీడీపీలోకి రండి.. రాబోయే రోజుల్లో తెలంగాణ పార్లమెంటు స్థానాలు 40 కి పెరుగుతాయని, సీనియర్లు పెద్దగా లేరని, టీడీపీలోకి వచ్చే యువకులకు మంచి అవకాశం ఉంటుందన్నారు. మాపార్టీలోకి రండి దాదాపు 30 మంది యువతకు సీట్లిచ్చి గెలిపించుకుంటామని పిలుపునిచ్చారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్, సి.కృష్ణయాదవ్ వంటివారు సైతం టీడీపీ నుంచి ఎదిగిన వారే తప్ప వారేం పెద్ద మొనగాళ్లు కాదన్నారు. రాష్ట్రానికి గుండెకాయ వంటి నగరంలో బల్దియా ఎన్నికల్లో కొందరు మోసం చేసి పోయారని, రాబోయే రోజుల్లో పేద, దళిత, బడుగు, బలహీనవర్గాల వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. కేసీఆర్‌పై పోరాటాం సెంటిమెంట్‌తో టీఆర్ఎస్ను గెలిపించిన ప్రజలు తప్పయిందని ఇప్పుడు చెంపలు వేసుకుంటున్నారని పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను మరిచిపోయి పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీని కాపాడుకోవాల్సి ఉందన్నారు. 2019 కోసం పోరాటం చేయాలన్నారు. గతంలో నిజాం పాలనపై పోరాటం చేసిన ప్రజలు ప్రస్తుతం కేసీఆర్ పాలనపై పోరాటాం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన దొరల పాలన. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ, గత సీఎంలు నెలలో కనీసం 15 సార్లు సచివాలయానికి వచ్చేవారని, కేసీఆర్ మాత్రం ఆర్నెళ్లకు ఆరుసార్లు మాత్రమే వచ్చారన్నారు. -
ప్రకాశం టీడీపీలో ‘మినీ’రణం
- కరణం, గొట్టిపాటి వర్గీయుల మధ్య ఘర్షణ - మంత్రులు, పార్టీ పరిశీలకుని ముందే రచ్చ రచ్చ సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు రోడ్డెక్కాయి. శనివారం ఒంగోలులో నిర్వహించిన మినీ మహానాడు వేదికగా.. అధికారపార్టీ పాత నేత కరణం బలరాం, కొత్తగా పార్టీలో చేరిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాలమధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రులు రావెల కిషోర్‌బాబు, శిద్దా రాఘవరావు, పార్టీ పరిశీలకుడు బుచ్చయ్యచౌదరి.. సమక్షంలోనే ఇరువర్గాలవారు బాహాబాహీకి దిగారు. పరస్పరం దాడులకు దిగి సమావేశంలోనే కొట్టుకున్నారు.అడ్డొచ్చిన పోలీసులను తోసేశారు. ఈ నేపథ్యంలో అదనపు పోలీసు బలగాలు రావడంతో గొడవ సర్దుమణిగింది. అనంతరం గొట్టిపాటి మాట్లాడుతుండగా మళ్లీ గొడవ చెలరేగింది. దాంతో ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగించి సమావేశం నుంచి గొట్టిపాటి వె ళ్లిపోయారు. తర్వాత ప్రసంగించిన కరణం బలరాం బహిరంగంగానే గొట్టిపాటిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్యాకేజీలకోసం వచ్చినవారు అదే చూసుకోవాలితప్ప తమ కార్యకర్తల్ని టార్గెట్ చేస్తే సహించేది లేదన్నారు. కొత్తగా వచ్చినవారు తమ మెడలపెకైక్కి స్వారీ చేయాలని చూస్తే.. బే ఆఫ్.. బెంగాల్(బంగాళాఖాతం)లో వేస్తామని వ్యాఖ్యానించారు. చాల్లే... మూసుకుని కూర్చో.. టీడీపీ జిల్లా మినీ మహానాడు కార్యక్రమాన్ని శనివారం ఉదయం 11.30 గంటలకు ఒంగోలులో నిర్వహించారు. తొలుత గొట్టిపాటిని వేదికపై కూర్చోనివ్వద్దంటూ కరణం వర్గీయులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసుల సహకారంతో గొట్టిపాటి వేదికపైకి చేరుకున్నారు. తర్వాత గొట్టిపాటి ప్రసంగిస్తుండగా.. ‘చాల్లే.... మూసుకొని కూర్చో... టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీశావు. పదేళ్లు కేసులు భరించాం... ఇప్పుడు అధికారంకోసం పార్టీలో చేరతావా?’ అంటూ కరణం వర్గీయులు దూషించారు. ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇందుకు ప్రతిగా గొట్టిపాటి వర్గీయులూ నినాదాలకు దిగారు. దీంతో మరలా ఘర్షణ వాతావరణం నెలకొంది. మంత్రులతోపాటు బుచ్చయ్యచౌదరి ఎంత వారించినా గొడవ సద్దుమణగలేదు. మరోమారు పోలీసులు రంగప్రవేశం చేయాల్సివచ్చింది. తర్వాత గొట్టిపాటి సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. స్వారీ చేస్తే సహించం: అనంతరం కరణం బలరాం మాట్లాడారు. గతంలో అధికారం అనుభవించి తమను ఇబ్బంది పెట్టిన గొట్టిపాటి.. ఇప్పుడు అధికారంకోసం సీఎం కార్యాలయం చుట్టూ పలుమార్లు తిరిగి పార్టీలో చేరారని మండిపడ్డారు. తమపై స్వారీచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అంతేగాక పార్టీ పెద్దలు అధిష్టానానికి వాస్తవాలు చెప్పాలంటూ ఆయన మంత్రులనుద్దేశించి వ్యాఖ్యానించారు. గొట్టిపాటి.. నియోజకవర్గంలో పోలీసులతోపాటు అధికారుల్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలీసు బలగాల్లేకుండా ఆయన బయట తిరగలేరన్నారు. -
మినీ మహానాడులో ఘర్షణ
ఒంగోలు: ప్రకాశం జిల్లా తెలుగుదేశం నేతలు తలపెట్టిన మినీ మహానాడులో శనివారం ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం వర్గీయులు, ఇటీవల వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరిన గొట్టిపాటి రవికుమార్ వర్గం బాహాబాహీకి దిగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. రవి వర్గాన్ని తెలుగుదేశంలో చేర్చుకోవడాన్ని ముందు నుంచే వ్యతిరేకిస్తున్న బలరాం వర్గీయులు ఒకవైపు, ఎమ్మెల్యే హోదాలో ఉన్న రవి వర్గం మరోవైపు తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నించడంతో గొడవ ప్రారంభమైనట్టు సమాచారం. -
ఉన్నట్టా.. లేనట్టా..?
* కొత్త జిల్లా కమిటీతో లింకు పెట్టిన మోత్కుపల్లి వర్గం * తమ ఆమోదం లేకుండా కొత్త కమిటీ ఎలా వేస్తారంటున్న ఉమ వర్గం * కమిటీ వేయకపోతే సాధ్యం కాదంటున్న జిల్లా అధ్యక్షుడు * సయోధ్య కోసం నిర్వహించాల్సిన సమావేశం వాయిదా * రేవూరి నేతృత్వంలో మళ్లీ రేపు జిల్లా ముఖ్య నేతల భేటీ * ఏకాభిప్రాయం రాకపోతే మినీ మహానాడు ఈ సారికి అంతే.. * అదే జరిగితే పార్టీ పుట్టిన తర్వాత ఇదే మొదటి సారి! సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రెండేళ్లకోసారి ఆనవాయితీగా జిల్లా స్థాయిలో జరిగే తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు నిర్వహణ ఈసారి డోలాయమానంలో పడింది. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న గ్రూపు గొడవలకు తోడు ప్రస్తుతం గడ్డుకాలం రావడంతో మినీ మహానాడును ఈసారి నిర్వహించడం లేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మినీ మహానాడు నిర్వహణపై ఇప్పటికే ఓసారి భేటీ కావాలనుకున్నప్పటికీ, ముఖ్య నేతలు అందుబాటులో లేకపోవడంతో పాటు పార్టీ జిల్లా కమిటీపై ఏకాభిప్రాయం రాకపోవడంతో వాయిదా పడింది. కానీ, రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి నేతృత్వంలో ఆదివారం హైదరాబాద్‌లోని ట్రస్ట్ భవన్లో జిల్లాకు చెందిన ముఖ్య నేతల సమావేశం జరగనుంది. ఇందులో మినీ మహానాడు నిర్వహించాలా.. వద్దా.. అన్నది నిర్ణయిస్తామని పైకి చెబుతున్నా.. అంతర్గతంగా మాత్రం ఈసారికి లేనట్టేనని ఆ పార్టీ నేతలు తీర్మానించుకున్నట్టు తెలుస్తోంది. రెండేళ్లకోసారి తెలుగుదేశం పార్టీలో ఆనవాయితీ ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి రాష్ట్రస్థాయిలో మహానాడు పేరుతో పార్టీ మహాసభను జరుపుతారు. దీనికి ముందే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో మినీ మహానాడు నిర్వహిస్తారు. ఈ మేరకు తెలంగాణలోని జిల్లాల్లో ఈసారి మినీమహానాడులు ప్రారంభమయ్యాయి. గండిపేటలో పెద్ద మహానాడును మే 27, 28, 29వ తేదీల్లో నిర్వహించనుండగా, ఆలోపే అన్ని జిల్లాల్లో మినీ మహానాడు నిర్వహించాల్సి ఉంది. మహానాడుకు వారం రోజుల వ్యవధే ఉన్నా.. ఇప్పటి వరకు జిల్లాలో మినీ మహానాడు నిర్వహించాలా.. వద్దా.. అన్న దానిపై నిర్ణయం తీసుకోలేదు. ఇందుకు పార్టీలోని గ్రూపు తగాదాలే కారణంగా తెలుస్తోంది. జిల్లాలో ఉమా మాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు గ్రూపుల మధ్య పార్టీ జిల్లా కమిటీ ఏర్పాటుపై ఇప్పటికీ ఏకాభిప్రాయం లేకపోవడం, గతంలో నియమించి రద్దు చేసిన పార్టీ జిల్లా కమిటీని ఇప్పటి వరకు పునరుద్ధరించకపోవడం, టీడీపీకి చెందిన క్షేత్రస్థాయి నేతలు వలసబాట పట్టిన నేపథ్యంలో ఈసారి మహానాడు నిర్వహణ సందిగ్ధంలో పడింది. మినీ మహానాడు నిర్వహించే ఆలోచన పార్టీ జిల్లా నాయకత్వానికి ఉంటే ఈ సమయానికే తేదీ ప్రకటించాల్సి ఉందని, 22న ముఖ్య నేతల సమావేశం పెట్టుకుని ఇంకెప్పుడు నిర్వహిస్తారని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించడాన్ని బట్టి చూస్తే ఈసారికి అంతేసంగతులని అర్థమవుతోంది. మరోవైపు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బిల్యా నాయక్ కూడా జిల్లా కమిటీ ఏర్పాటు తదనంతర పరిణామాల నేపథ్యంలో పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. కొత్త జిల్లా కమిటీని ప్రకటిస్తేనే మహానాడుకు ఏర్పాటు చేసుకుంటానని ఆయన పార్టీ పెద్దల ముందు కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. అయితే.. తమ ఆమోదం లేకుండా కొత్త కమిటీని ఎలా ఏర్పాటు చేస్తారని ఉమా మాధవరెడ్డి వర్గం ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో నేరుగా కొందరు నేతలు మహానాడుకు మాత్రమే వెళతారని, జిల్లాలో ఎలాంటి కార్యక్రమం ఉండదని తెలుస్తోంది. అసలు జిల్లా కమిటీ ఏది? టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక జరిగి చాలా కాలం అవుతున్నా ఇప్పటివరకు జిల్లా కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. మూడు నెలల క్రితం ఓ కమిటీని ప్రకటించినా, ఓ వర్గానికే ప్రాధాన్యం దక్కిందన్న ఆలోచనతో దాన్ని రాష్ట్ర నాయకత్వం రద్దు చేసింది. దీంతో మనస్తాపం చెందిన బిల్యా.. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కానీ, రాష్ట్ర నాయకత్వం బుజ్జగించడంతో తాత్కాలికంగా ఆయన తన రాజీనామాను విరమించుకున్నారు. ఆ పరిణామం తర్వాత జిల్లాలో ఇంతవరకు టీడీపీ ఊసే కనిపించడం లేదు. అడపాదడపా యాదాద్రి జిల్లా కోరుతూ మోత్కుపల్లి నర్సింహులు దీక్షలు, ప్రదక్షిణలు చేయడం, అక్కడి నేతలు ప్రెస్మీట్లు పెట్టి యాదాద్రిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేయడం మినహా పార్టీ కార్యక్రమాలేవీ నిర్వహించడం లేదు. ఇటీవల కరువు యాత్ర పేరుతో జిల్లాలో కొందరు రాష్ట్ర నేతలు పర్యటించినా... ఆ కార్యక్రమం మొక్కుబడిగా మాత్రమే సాగింది. ఈ పరిస్థితుల్లో అసలు జిల్లా కమిటీ ఎప్పుడు వేస్తారు? జిల్లా కమిటీ నియమించేంతమంది నాయకులు అసలు పార్టీలో ఉన్నారా లేదా? అన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జిలున్నారా? ఉన్నవాళ్లు ఆసక్తి కనబరుస్తున్నారా.. లేదా.. అన్నది అనుమానంగానే ఉందని, ఈ పరిస్థితుల్లో జిల్లాలో మినీ మహానాడు నిర్వహించడం కష్టసాధ్యమేనని తెలుస్తోంది. జిల్లాల విభజన తర్వాతే... తెలంగాణ వ్యతిరేక పార్టీగా వచ్చిన ముద్ర నుంచి బయటపడేందుకు రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలో తెలుగు తమ్ముళ్లు కొంత ప్రయత్నం చేసినా.. ఆ మరక పోవడం లేదనే అంతర్మథనం పార్టీలో జరుగుతోంది. ముఖ్యంగా ఓటుకు నోటు కుంభకోణం తోపాటు పలు అంశాల్లో తెలంగాణ రాష్ట్రానికి వ్యతి రేకంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కార్యక్రమాలు నిర్వహిస్తుండం, ముఖ్య నేతలందరూ పార్టీ వీడిపోవడంతో టీడీపీ పూర్తిగా నిస్తేజంగా మారిపోయింది. దీనికి జిల్లాలోని గ్రూపు గొడవలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లా విభజన ఎప్పుడు జరుగుతుందా.. అని తమ్ముళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందరూ అనుకున్నట్టుగానే నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు ఏర్పాటై, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలు విడిపోతే తప్ప పార్టీ పునర్నిర్మాణం సాధ్యం కాదని రాజకీయ వర్గాలంటున్నాయి. గతంలో జిల్లాలో పార్టీ చాలా బలంగా ఉండేదని, ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాల విభజన తర్వాత అయినా.. పార్టీకి ఊపు వస్తుందన్న నమ్మకం తమకు లేదని ఆ పార్టీకి చెందిన మరో నేత వ్యాఖ్యానించడం అటు రాష్ట్రంలోనూ, ఇటు జిల్లాలోనూ టీడీపీ పరిస్థితికి అద్దం పడుతోంది. -
'మనోభావాలకు దెబ్బతగిలితే రాజీపడేది లేదు'
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘అధికారుల కారణంగా పార్టీకి, కార్యకర్తల మనోభావాలకు నష్టం జరిగినా.. వేధించినా రాజీపడే ప్రసక్తి లేదు. ఇటీవల పార్టీకి చెందిన మండల అధ్యక్షుడు ఓ ఆర్డీఓను కలిస్తే పట్టించుకోలేదని తెలిసింది. వెంటనే ఫోన్లో మాట్లాడి ఆ ఆర్డీఓను మందలించాను. అలా ఎవరైనా కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. నెల్లూరులో టీడీపీ నిర్వహించిన మినీ మహానాడులో ఆయన సప్రసంగించారు. వైఎస్సార్ సెంటిమెంట్ తుపానులా వీస్తుంటే పార్టీ కోసం.. కార్యకర్తల కోసం నిలబడ్డామని చెప్పారు. ఒక్కటిగా ఉన్న రాష్ట్రం విడిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. కొంతకాలం గడిచాక తెలంగాణ వారు ఆంధ్రాలో కలవాలని కోరుకునే రోజు వస్తుందని సోమిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా నెల్లూరు జిల్లాకు వద్దంటున్నా పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి శిద్ధా రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీకి కలెక్టర్ సెగ!
సాక్షి ప్రతినిధి, కడప : జిల్లా కలెక్టర్ తీరు పసువుదళంలో తీవ్ర అలజడి సృష్టిస్తోంది. ఏకపక్ష చర్యలకు పాల్పడ్డమే కాకుండా ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారని అధికార పార్టీ నేతల నుంచే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అందులో భాగంగానే ఆదివారం నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో కలెక్టర్ డౌన్‌డౌన్ అంటూ ఆ పార్టీ కార్యకర్తల్లు నినాదాలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా కలెక్టర్ వ్యవహరిస్తున్నప్పటికీ అధికార పార్టీ నాయకులు సమర్థించడంపై పలువురు భగ్గుమంటున్నారు. ప్రజావ్యతిరేక పద్దతులు వీడాలంటూ ప్రజాసంఘాలు గళమెత్తాయి. ప్రజలు ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టారు. ప్రజాప్రతినిధులు సైతం ఆందోళన చేపట్టారు. తుదకు ప్రభుత్వ విఫ్ సైతం రాజీనామాకు సిద్ధపడ్డారు. ఉద్యోగులు సైతం మానసిక ఆవేదన చెందుతున్నారు. అన్ని వర్గాల వారికి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ వివాదాస్పదమయ్యారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆయన ధోరణిలో మార్పు రాకపోవడం మరింత వివాదాస్పదమైంది. మినీ మహానాడుకు తాకిన కలెక్టర్ సెగ అధికార పార్టీ, ప్రతిపక్షం, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు జిల్లా కలెక్టర్ తీరుపై వరసగా ఆరోపణలు గుప్పించాయి. ఇక్కడ పనిచేసి వెళ్లిన ఏ కలెక్టర్‌పై ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన దాఖలాలు లేవు. ఒకరి తర్వాత మరొకరు ఆరోపణలు గుప్పిస్తుంటే ఉన్నతాధికారి ఎవరైనా పనితీరు సవరించుకోవడం పరిపాటి. అయితే కలెక్టర్ తీరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. తుదకు ఆ సెగ అధికార పార్టీకి సైతం తాకింది. ఈ నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో ఆ పార్టీ కార్యకర్తలు ‘కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కార్యకర్తలు చెబితే అధికారులు పనులు చేయాల్సిందేనని సదరు మంత్రి గట్టిగా నొక్కి చెప్పిన నేపథ్యంలో.. జిల్లా కలెక్టర్ వల్ల తాము ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని కార్యకర్తలు భగ్గుమన్నారు. కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో సర్ది చెప్పడానికి పలువురు నేతలు కాస్త శ్రమించాల్సి వచ్చింది. కాగా, వేదికపై ఉన్న కొందరు నేతలు కలెక్టర్‌ను సమర్థిస్తుండటం వల్లే ఆయన అలా వ్యవహరిస్తున్నారని.. ఆ విషయం మంత్రి దృష్టికి వెళ్లాలనే నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. నేతల్నీ వదలని తమ్ముళ్లు కలెక్టర్ తీరుపై కొందరు నినాదాలు చేస్తే మరికొందరు ‘చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న’వైనాన్ని ఎండగడుతూ మినీ మహానాడులో కరపత్రాలు పంచిపెట్టారు. టీడీపీ నేతలు గోవర్ధన్‌రెడ్డి, లక్ష్మిరెడ్డి, దుర్గాప్రసాద్, సుభాన్భాషల తీరుపై ఆరోపణలు గుప్పించారు. ఇవన్నీ పరిశీలిస్తే పార్టీ అభివృద్ధి కాంక్షించిన కార్యకర్తలు వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. అటు జిల్లా కలెక్టర్ తీరు, ఇటు పార్టీ అంతర్గత వ్యవహారాలపై ప్రభుత్వం దృష్టి సారించకపోతే టీడీపీకి గడ్డు పరిస్థితులు తప్పవనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
నైరాశ్యంలో తమ్ముళ్లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మినీ మహానాడు సాక్షిగా అధినాయకులపై తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినా ప్రయోజనం కనిపించలేదని పలువురు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా.. పార్టీ పదవులు లేవు.. పథకాలు దక్కటం లేదన్న అభిప్రాయం తమ్ముళ్లలో కనిపిం చింది. తమ పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. నెల్లూరులో సోమవారం టీడీపీ మినీ మహానాడు జరిగింది. ఈ సందర్భంగా అనేకమంది టీడీపీ నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీచేసిన దేశాయిశెట్టి హనుమంతరావు తమ సంగతేమిటని మంత్రి, జిల్లా అధ్యక్షుడిని ప్రశ్నించారు. మీరు పదవులు పొందారు.. మా గురించీ ఆలోచించండంటూ చురకలంటించారు. బల్లి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. రుణమాఫీపై ఇప్పటికీ స్పష్టత లేదు.. ఇప్పటికైనాస్వచ్ఛమైన నిర్ణయాన్ని ప్రకటించి రైతులకు రుణమాఫీపై ఉన్న సందేహాలను తీర్చాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. సంక్షేమ పథకాల అమలుకు జన్మభూమి కమిటీలు ఉన్నా.. అధికారులు తాము చెప్పిన వారికి ఇవ్వకుండా ఇష్టమొచ్చిన వారికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. మెజారీటీ మండలాలు ప్రతిపక్షాల చేతిలో ఉండటంతో పథకాల అమలు తీరులో కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. వైఎస్ఆర్ హయాంలో రూ.200 పింఛను తీసుకునేప్పుడు కనిపించిన ఆనందం ప్రస్తుతం రూ. వెయ్యి ఇస్తున్నా కనిపించటం లేదన్నారు. పార్టీని వీడిపోయే సందర్భంలో ఎమ్మెల్సీలు ఇచ్చారా? అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారని గూడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ జోత్స్నలత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని వీడిపోతారన్న సందర్భంలో రెండు ఎమ్మెల్సీలు ఇచ్చారని ఆమె అన్నారు. ఆమె వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా మహిళలకు పదవులేవీ ఇవ్వలేదని ఆమె పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సైతం కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, వారికి సముచిత స్థానం కల్పించాలని నేతలను కోరటం గమనార్హం. డీసీసీబీ చైర్మన్ ధనుంజయరెడ్డి, సూళ్లూరుపేట జడ్పీ ఫ్లోర్‌లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రధానంగా ధాన్యానికి గిట్టుబాటు ధర లభించక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కు గురవుతున్నారని గుర్తుచేశారు. అభివృద్ది అంటే సముద్రతీరంలో ఆరులైన్ల రోడ్లు, బకింగ్‌హాం కాలువ అభివృద్ధి మంచిదే అయినా... వాటి వల్ల చాల మత్స్యకార గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుందని ఆ విభాగం అధ్యక్షుడు పోల్‌శెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. -
'ఓయూ విద్యార్థుల జోలికి వస్తే సమాధి కడతం'
మెదక్ (సంగారెడ్డి) : ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల జోలికి వస్తే సీఎం కేసీఆర్‌కు సమాధి కడతామని టీటీడీపీ నేత, కల్వకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. సోమవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో జరిగిన మినీ మహానాడులో ఎర్రబెల్లి మాట్లాడారు. విద్యార్థులపై లాఠీచార్జి చేయించినందుకు టీఆర్ఎస్ సర్కార్ వెంటనే ఓయూ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని ఎర్రబెల్లి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు టీడీపీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. -
ఏడాదిలో ఎంతో చేశాం..
- ప్రతిపక్షాలు పనిగట్టుకుని విమర్శిస్తాయి - వాటిని పట్టించుకోనవసరం లేదు.. - మినీ మహానాడులో టీడీపీ నేతలు సాక్షి, విశాఖపట్నం : ‘స్వలాభం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేశారు. రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో అప్పగించారు. ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అయినాసరే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. పింఛన్లు ఐదురెట్లు పెంచాం.. రైతులకు రుణమాఫీ చేశాం.. డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తున్నాం.. ఇలా గత ఏడాదిలో ఎన్నో చేశాం.. అయితే వాటిని ప్రజల్లోకి మాత్రం తీసుకెళ్లలేకపోతున్నాం’ అని టీడీపీ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కార్యకర్తల్లో ఒక విధమైన అసంతృప్తి.. నాయకుల్లో అభద్రతాభావం ఎందుకో అర్థం కావడం లేదు. చేసింది చెప్పుకుంటే చాలు..ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లగలం అని వారు వ్యాఖ్యానించారు. టీడీపీ జిల్లా మినీ మహానాడు స్థానిక ఆంకోసా ఆడిటోరియంలో ఆదివారం అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీకీ ఎన్నికల మేనిఫెస్టో ఒక పవిత్ర గ్రంథం లాంటిదని..అందులో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హామీలు అమలు చేయడం కాస్త ఆలశ్యం కావచ్చేమో కానీ..అమలు చేయడం మాత్రం పక్కా అని వ్యాఖ్యానించారు. మరో మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ క్రమశిక్షణ, సిద్ధాంతం గల పార్టీలో ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. టీడీపీ కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికి సముచిత గౌరవం ఇస్తామని చెప్పారు. అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి మాట్లాడుతూ విశాఖను కాలుష్య భూతం వెన్నాడుతోందని, పోర్టు వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. పోర్టులో జరుగుతున్న డ్రెడ్జింగ్ కార్యకలాపాల వల్ల గతంలో ఎన్నడూచూడని బీచ్ తీవ్ర కోతకు గురవుతోందన్నారు. ఇక్కడ జరుగుతున్న కోర్, ఐరన్ హ్యాండలింగ్ను ఆపేలా చర్యలు చేపట్టాలని లేకపోతే ప్రజలు మనల్ని అసహ్యించుకుంటారని చెప్పారు. ఏడాది పాలనలో ప్రజల ఆశలకు రీచ్కాలేక పోయా మన్న భావన అందరిలోనూ ఉందన్నరు. రూరల్ అధ్యక్షుడు పప్పల చలపతిరావు మాట్లాడుతూ జిల్లాపై తనకు ఎంతో అవగాహన ఉంది.. పార్టీని మరింత పటిష్ట పర్చేందుకు కృషి చేస్తానన్నారు. జెడ్పీ చైర్‌పర్శన్ లాలం భవాని మాట్లాడుతూ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీదేనని చెప్పారు. ఎంపీ అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ వాసుల కలైన కొత్తరైల్వే జోన్ ప్రకటన ఈ వారంలోనే రానుందన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరాతో ఏపీకి ఉజ్వలభవిష్యత్ ఏర్పడిందన్నారు. మాజీ ఎంపీ ఎం.వి.వి.ఎస్. మూర్తి మాట్లాడుతూ దీర్ఘకాలంగా ఉన్న పంచగ్రామాల సమస్య, గాజువాక భూ సమస్య పరిష్కారానికి చొరవచూపాలని సూచించారు. రూరల్ జిల్లా మాజీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, పల్లా శ్రీనివాసరావు, గణబాబు, అనిత, పీలా గోవింద్, బండారు సత్యనారాయణమూర్తి, డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ, మాజీ మంత్రులు మణికుమారి, అప్పల నరసింహ రాజు, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, ఎస్ఎ రెహ్మాన్ తదితరులు ప్రసంగించారు. పార్టీ నాయకులు పట్టాభిరామ్, అవిడి అప్పలనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌కు రాజకీయాలే తెలియవు ఎన్టీఆర్‌కు రాజకీయాలు తెలియవు..ఆయనెప్పుడూ పేపర్లు చదవలేదు. మేము చెప్పిందే వినేవాడు. పేపర్ చూసారా అన్నా అని అడిగితే ఎందుకు బ్రదర్ అని ప్రశ్నించేవాడు. ఎలాంటిరాజకీయాలు తెలియకుండా రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించాడు. ఎన్టీఆర్ దయ వల్ల నేను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. మూడు సార్లు ఆయన కేబినెట్లో మంత్రిగా ఆయన పక్కనే కూర్చొని పనిచేసాను. నాకు పదవులు కొత్త కాదు. పదువులున్నంత వరకే మన చుట్టూ జనం ఉంటారు. ఒకసారి పదవి పోతే ఏ ఒక్కడు కన్పించడు..ఇది అనుభవంతో చెబుతున్న మాటలు. గత ముపైప మూడేళ్ల్ల నా రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుకులు చూసాను.ఎన్నో కూర్చీలు ఎక్కాను.. కుర్చీల కింద కూడా కూర్చున్నాను. పదవులున్నా లేక పోయినా పార్టీ కోసమే పనిచేసాను. అలాగే పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలు కూడా పదవుల ఆశించడంలో తప్పేమి లేదు. అలాగని అందరికీ సంతృప్తి పర్చడం సాధ్యం కాదు. పదువుల పందారంలో 1983 నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికే ముందు పీట వేయాలి. మధ్యలో వచ్చిన వారికి ఆ తర్వాత స్థానం కల్పించాలి. రేపు నేను వేరే పార్టీలోకి వెళ్లొచ్చు ఈరోజు నేను ఈ పార్టీలో ఉండోచ్చు..రేపు వేరే పార్టీలోకి వెళ్లొచ్చు..ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో చెప్పలేకపోతున్నాం. అయినా సరే నా వెంట రాకుండా పార్టీ కోసమే పనిచేసేలా కార్యకర్తలుండాలి. అలాంటి కార్యకర్తలకే కమిటీల్లో సముచిత స్థానం కల్పించాలి. మరో పక్క కనీసం ఒక్క సీటు కాని కాంగ్రెస్ నాయకులు మతి భ్రమించి పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతున్నారు. ఆర్ధిక ఇబ్బందులన్నా చంద్రబాబు ఎన్నో కార్యక్రమాలు చేశాడు.రూ.200ల పించన్‌ను 1000లు, 1500లు పెంచారు. చంద్రబాబు రూ.75లు ఇ చ్చిన పింఛన్ మొత్తాన్ని 200లు పెంచానని సా గదీస్తూ చెప్పేవారు. ఇప్పుడు ఆ రూ.200ల నుంచి ఏకంగా ఐదురెట్లు పెంచాం. మనమెంత సాగ దీసుకుని చెప్పాలో మీరే ఆలోచించండి. రైతురుణమాఫీ చేసాం. డ్వాక్రా రుణమాఫీ చేస్తున్నాం. నీరు చెట్టు అమలు చేస్తున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు కాదా అని ప్రశ్నించారు. వీటిపై రాజకీయ అవగాహన లేకుండా ఇష్టమొచ్చి నట్టు విమర్శలుచేయడం సరికాదన్నారు. -
టీడీపీకి పూర్వ వైభవం
మినీ మహానాడులో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా కడప రూరల్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తానని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం స్థానిక మేడా కన్వర్షన్లో నిర్వహించిన మినీ మహానాడుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కార్యకర్తలు తమ వంతు కృషి చేయాలన్నారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. కార్యకర్తలు సూచించిన పనులను అధికారులు చేయాలన్నారు. మినీ మహానాడులో ఆయా నియోజకవర్గాల వారీగా వచ్చిన సమస్యల పరిష్కారం గురించి హైదరాబాద్‌లో జరిగే మహానాడులో చర్చిస్తామన్నారు. విభజన కారణంగా లోటు బడ్జెట్‌తో ఉన్న ఏపీని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. కడప నగరంలో ఒక ఎకరా స్థలంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి (వాసు) మాట్లాడుతూ జిల్లాలో పార్టీ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తామన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి చేయూత నివ్వాలన్నారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు సుధాకర్ యాదవ్, మాజీ ఎంపీ గునిపాటి రామయ్య, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులురెడ్డి, రమేష్‌కుమార్‌రెడ్డి, విజయమ్మ తదితరులు మాట్లాడుతూ టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో జరిగే మహానాడులో జిల్లా అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలను అధికారులు గౌరవించాలన్నారు. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, రాయచోటిలో తాగునీటి సమస్య పరిష్కరించాలని, జిల్లా పేరును గతంలోలా ‘కడప’గానే ఉంచాలని, మైదుకూరులో కేపీ ఉల్లి ఎగుమతి కేంద్రం ఏర్పాటు, చెన్నూరు చక్కెర కర్మాగారాన్ని పునః ప్రారంభించాలని, రాజంపేటలో ఆల్సిన్ ఫ్యాక్టరీని తెరిపించాలని, కమలాపురంలో డ్రైనేజీ వ్యవస్థ, రైల్వేకోడూరులో మినీ ప్రాజెక్టుల నిర్మాణం, బద్వేలులో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, జమ్మలమడుగులో ఉక్కు ఫ్యాక్టరీ, టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు పలు ప్రతిపాదనలు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బహ్మయ్య, గోవర్దన్‌రెడ్డి, ఎద్దుల సుబ్బరాయుడు, హరిప్రసాద్, దుర్గాప్రసాద్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
నేడు టీడీపీ మినీ మహానాడు
♦ ముఖ్య అతిథులుగా మంత్రులు శిద్దా, నారాయణ ♦ అనిల్‌గార్డెన్స్‌లో ఏర్పాట్లు నెల్లూరు (రవాణా) : తెలుగుదేశం పార్టీ జిల్లా మహానాడును సోమవారం ఘనంగా నిర్వహించనున్నారు. స్థానిక మినీబైపాస్‌లోని అనిల్‌గార్డెన్స్‌లో ఉదయం 10 గంటలకు మహానాడు కార్యక్రమం ప్రారంభం కానుంది.. ఈ మహానాడుకు ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి మంత్రి శిద్దా రాఘవరావు, పురపాలకశాఖ మంత్రి నారాయణ హాజరుకానున్నారు. జిల్లాలోని ముఖ్య నాయకులు, పార్టీ అనుబంధసంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, మండల, నియోజకవర్గ నాయకులుకు మహానాడుకు సంబంధించి ఆహ్వానం పంపారు. మహానాడుకు సుమారు మూడు వేల మంది హాజరుకానున్నారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అనిల్‌గార్డెన్స్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. మహానాడుకు వచ్చిన నాయకులకు భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. మహానాడుకు వచ్చే వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షడు బీద రవిచంద్రతో పాటు నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, జెడ్.శివప్రసాద్ మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
కాకతో వేగుతుంటే ఊకదంపుడు ఉపన్యాసాలు
మినీ మహానాడులో టీడీపీ నేతల మైకు పూనకం మంత్రి, పార్టీ అధ్యక్షుడు వలదన్నా సుదీర్ఘ ప్రసంగాలు ఆరుబయట సెగలు కక్కే వాతావరణంలో కార్యకర్తల అగచాట్లు అన్నవరం: అసలే ఎండలు మండిపడుతున్న వేసవికాలం. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, వెళ్లాల్సి వస్తే వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెపుతున్నారు. ఇవేమీ తెలుగుదేశం నాయకులకు పట్టినట్టు లేదు. జనం వేగిపోతున్న ప్రాణాంతక వాతావరణంలోనే ఆరుబయట షామియానాలు వేసి మినీమహానాడు నిర్వహించారు. ఇక మైకు ముందుకొచ్చిన ప్రతి నాయకుడూ పావుగంటకు తక్కువ కాకుండా ప్రసంగిస్తుంటే మల మల మాడిపోవడం కార్యకర్తల వంతయింది. అన్నవరం శివారు వల్లభ ఎస్టేట్‌లో టీడీపీ మినీ మహానాడు ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. వేదిక మీద కూలర్లు, ఏసీ మిషన్లు అమర్చడంతో అక్కడి నాయకులకు వేడి తగల్లేదు. కానీ వేదిక దిగువనున్న వారికి మాత్రం ఎండ వేడితో నరకం కనిపించింది. పార్టీ నేతలు రెడ్డి సుబ్రహ్మణ్యం, బత్తుల రాము, ఎమ్మెల్యేలు వర్మ, అయితాబత్తుల ఆనందరావు, తోట త్రిమూర్తులు, బుచ్చయ్య చౌదరి తదితరులు ఒకరితో ఒకరు పోటీ పడి ప్రసంగించారు. కొందరైతే మైకు దొరకడమే పండుగ అన్నట్టు వ్యవహరించారు. వర్మ ప్రసంగించేటపుడు మంత్రి దేవినేని వారించినా మరో రెండు నిమిషాలు మాత్రమే అంటూనే అందరి సహనాన్ని పరీక్షించారు. వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని కొద్దిసేపే మాట్లాడాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు సూచించినా ఎవరూ పట్టించుకోలేదు. దీనికి తోడు అందరి ప్రసంగాలూ ముఖ్యమంత్రి చంద్రబాబును పొగడడానికి, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీని, ఆ పార్టీ అధినేత జగన్‌ను విమర్శించడానికి పరిమితం కావడంతో విసుగు పుట్టించారుు. ఆ ఆరుగురూ ప్రసంగించేటప్పటికే సమయం మధ్యాహ్నం రెండు అయింది. కాగా, సమావేశం ప్రారంభమైన అరగంటకే ఎండవేడి భరించలేక సగానికి పైగా జనం వెళ్లిపోయారు. మిగిలిన వారు కూడా దగ్గరలోని చెట్ల కింద చేరి సేద తీరారు. సమావేశం ముగిసేటప్పటికి రెండు, మూడు వందల మంది మాత్రమే మిగిలారు. పోలీసులను వెళ్లిపొమ్మన్న హోంమంత్రి మంత్రుల కార్యక్రమమంటేనే పోలీసుల హడావిడి ఎక్కువ. దానికి తోడు హోం మంత్రి పోగ్రాం అంటే చెప్పనక్కర్లేదు. వేదిక మీదున్న హోమంత్రి నిమ్మకాయల చినరాజప్పను కలవడానికి వెళుతున్న పెద్దాపురం నియోజకవర్గ నాయకుడిని తుని సీఐ అప్పారావు ఆపారు. దాంతో ఆ నాయకుడు సీఐతో వాగ్వాదానికి దిగాడు. అతనికి మద్దతుగా మరికొందరు రావడంతో హోంమంత్రి కలగజేసుకుని ‘ఇది పార్టీ కార్యక్రమం. పార్టీ వాళ్లే చూసుకుంటారు. పోలీసులు సమావేశ ప్రదేశం నుంచి వెళ్లిపోవాలి’ అని ఆదేశించడంతో చిన్నబుచ్చుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. మాకు పరిహార మిప్పించాలి.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన తమ భూములు పోతున్నాయని, మంచి పరిహారం ఇప్పించాలని ఖమ్మం జిల్లా నుంచి జిల్లాలో విలీనం అయిన నాలుగు మండలాల నాయకులు కోరారు. కొత్తగా ఏర్పాటైన ఎటపాక రెదవెన్యూ డివిజన్‌కు చెందిన మువ్వా శ్రీను నాయకత్వంలో రైతులు, నాయకులు ఈ మేరకు మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమ తదితరులను అభ్యర్థించారు. -
కొలిక్కిరాని కమిటీలు
►జాబితా తగ్గించి పంపాలన్న అధిష్టానం ►నేతల మధ్య సమన్వయం లేక వాయిదా ►ఎమ్మెల్సీలతో తృప్తి చెందుతున్న నేతలు ►కార్యకర్తలను పట్టించుకోకపోవడంపై అసంతృప్తి ►నేడు నెల్లూరులో టీడీపీ మినీ మహానాడు సాక్షి ప్రతినిధి, నెల్లూరు : టీడీపీ జిల్లా, అనుబంధ సంఘాల కమిటీల నియామకంపై ఇంకా కొలిక్కిరాలేదు. పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు వారం రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే నేతలు మాత్రం కమిటీ నియామకాలపై నిర్ణయానికి రాలేదని తెలిసింది. జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించి వారం గడచిపోతోంది. సమావేశం రోజు జిల్లా ఇన్చార్జి మంత్రి శిద్దా రాఘరావు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, తదితరులు రాత్రంతా, మరుసటి రోజు ఉదయం వరకు పార్టీ కార్యాలయంలోనే తిష్టవేసి కమిటీ ఎంపిక కోసం సుదీర్ఘంగా కసరత్తు చేశారు. అయినా కుదరలేదు. మినీ మహానాడు కంటే ముందే కమిటీ ప్రకటించాల్సి ఉన్నా.. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో కమిటీ ఇంత వరకు ప్రకటించలేదు. దీంతో పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రతి రెండేళ్లకోసారి జిల్లా, అనుబంధ సంఘాల కమిటీ ఎన్నికలు జరపాల్సి ఉంది. అయితే జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిని మాత్రం ప్రకటించారు. మిగిలిన వారి నియామకంపై నేతల మధ్య సమన్వయం కుదరలేదని తెలిసింది. ఈ ఎన్నికల కోసం అధిష్టానం నలుగురు సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని నియమించింది. వారిలో మంత్రి నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర, మాజీ మంత్రి సోమిరెడ్డ్డి, ఆదాల ఉన్నారు. వీరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది. కమిటీ ఎంపికపై ఈ నలుగురు ఏనాడూ ఓ చోట కూర్చొని చర్చించుకున్న దాఖలాలు లేవు. ఎవరికి వారు వారి అనుచరుల పేర్లతో జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. జిల్లా, అనుబంధ సంఘాల కమిటీల జాబితా మొత్తం 280 మందికిపైగా ఉండడంతో అధిష్టానం తిప్పి పంపినట్లు సమాచారం. జాబితా మొత్తం 75 మందికి మించి ఉండకూడదని స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. అందులో ఎవరిని తొలగించాలి.. ఎవరి పేర్లు ఉంచాలో అర్థం కాక నేతలు తలలుపట్టుకుంటున్నట్లు సమాచారం. -
మినీ మహానాడును విజయవంతం చేయాలి
టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ కొరిటెపాడు(గుంటూరు) : జిల్లా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడును విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ జీవవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా మినీ మహానాడు సోమవారం(నేడు) ఉదయం 9.30 గంటలకు శ్రీ వవేంకటేశ్వర విజ్ఞానమందిరంలో ప్రాంభమవుతుందన్నారు. రాష్ట్ర పార్టీ ప్రతినిధుల మహాసభ(మహానాడు)లో ప్రవేశపెట్టబోయే ముసాయిదా తీర్మానాల అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ జిల్లాలో మౌలిక వసతుల కల్పన-ప్రధాన సమస్యలపై తగిన విధంగా చర్చించి, అవసరమైన మార్పులు, కూర్పులతో రాష్ట్ర మహాననాడుకు పంపుతామన్నారు. పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, కొమ్మాలపాటి శ్రీధర్, పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, రాయపాటి శ్రీనివాస మద్ధాళి గిరిధర్, బోనబోయిన శ్రీనివాసయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
'కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పట్టి పీడించింది'
ఒంగోలు సెంట్రల్: కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా రాష్ట్రాన్ని పట్టి పీడించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆదివారం నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి రావెల మాట్లాడుతూ అరాచక కాంగ్రెస్ పార్టీ చేతుల్లో టీడీపీ కార్యకర్తలు పదేళ్లపాటు ఇబ్బందులకు గురయ్యారన్నారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్‌గా మార్చేందుకు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. జూన్ 3వ తేదీ నుంచి డ్వాక్రా రుణాల మాఫీ ప్రక్రియ చేస్తామన్నారు. మద్యం మాఫియాను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అధిష్టానం నిర్ణయం మేరకు దామచర్ల జనార్దన్‌ను టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నుకున్నట్లు తెలిపారు. సమష్టిగా కృషి చేస్తే జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. -
'మంచివారంటూనే మమ్మల్ని పక్కన పెట్టారు'
విజయనగరం: విజయనగరంలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో ఎమ్మెల్యే పత్తివాడ నారాయణస్వామి నాయుడు ఆదివారం చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. మంచివారంటూనే మమ్మల్ని పక్కన పెట్టారని ఆయన పార్టీ అధినేత చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని ఆరోపించారు. విజయనగరం జిల్లా వెనకబడిన జిల్లా అని ఆయన తెలిపారు. అలాంటి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మిస్తామని చెప్పి... ఇప్పుడు ప్రైవేట్ వైద్య కళాశాల అని ప్రభుత్వం చెబుతుందని ఆయన విమర్శించారు. ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాలనే ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎవరేమనుకున్న ఇది ప్రజల మాట అని నారాయణ స్వామి పేర్కొన్నారు. అయితే కర్నూలు జిల్లాలో శనివారం జరిగిన టీడీపీ మినీ మహానాడులో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలకు తెర తీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చూపంతా పశ్చిమ గోదావరి జిల్లాపైనే అని ఆరోపించారు. కర్నూలు జిల్లాపై ఆయన దృష్టి సారించడం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా మొత్తంలో కేవలం మూడు సీట్లు గెలుచుకుందని అప్పుడప్పుడు చంద్రబాబు తనకు గుర్తు చేస్తున్నారని... అయితే అందులో తన తప్పు లేదని చెప్పారు. ఎన్నికల ముందు ప్రజా వ్యతిరేకత ఉన్న పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులను టీడీపీలో చేర్చుకోవడం వల్లే... ఆ ఫలితాలు వచ్చాయని చంద్రబాబుకు ఈ సందర్భంగా తెలిపారు. కేఈ అసంతృప్తి వెళ్లగక్కిన మరునాడే పత్తివాడ నారాయణ స్వామి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
'రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పిస్తాం'
ధర్మవరం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పిస్తామని, అందుకోసం రాజీలేని పోరాటం చేస్తామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం జరిగిన తెలుగుదేశం మినీమహానాడులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి మోదీతో మాట్లాడారని చెప్పారు. ఈ మేరకు ప్రధానమంత్రి కూడా హామీ ఇచ్చారన్నారు. మోదీపై తనకు నమ్మకముందని, త్వరలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటన వస్తుందని పేర్కొన్నారు. అనంత వాసులు టీడీపీపైనేగాక ప్రత్యేకంగా నందమూరి కుటుంబంపై అభిమానం చూపుతారని, అందుకు జిల్లా వాసులకు తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ధర్మవరంలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తానని ఆయన తెలిపారు. -
పార్టీ పటిష్టతే లక్ష్యం
♦గ్రూపు తగాదాలు లేవని చెప్పలేం ♦సమన్వయంతో ముందుకు వెళ్లాలి ♦కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయబోం ♦జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు కర్నూలు : పార్టీ పటిష్టతే లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కర్నూలు శివారులోని ఎంఆర్సీ కన్వెన్షన్‌లో టీడీపీ జిల్లా నూతన అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అధ్యక్షతన పార్టీ మినీ మహానాడు నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బలహీనవర్గాల ఆశాజ్యోతి దివంగత కె.ఇ.మాదన్న వర్ధంతిని పురస్కరించుకుని నాయకులు, కార్యకర్తలు సభలో రెండు నిముషాలు మౌనం పాటించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో మహానాడు ప్రారంభమయ్యింది. ముఖ్య అతిథిగా అచ్చెన్నాయుడు ప్రసంగించారు. టీడీపీలో గ్రూపు తగాదాలు లేవని చెబితే అవివేకమే అవుతుందని, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులకు, ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారికి మధ్యలో సమస్యలు ఉన్నాయన్నారు. వీరంతా సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీ జెండా మోసినవారికి కాకుండా వలస నేతలకే పదవులు దక్కుతున్నాయన్న అసంతృప్తి వీడాలని సూచించారు. కార్యకర్తల మనోభావాలకు దెబ్బతీయబోమని, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని త్వరలో డీలర్‌షిప్‌లను కూడా భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రసంగించారు. ఇతర నేతలు ఏమన్నారంటే.. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇతర పార్టీ నాయకులకే పనులు జరుగుతున్నాయని బనగానపల్లె ఎమ్మెల్యే బి.సి.జనార్దన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వలస నేతలకే పదవులు దక్కుతున్నాయని తన క్లాస్ మేట్ మీనాక్షి నాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఎమ్మెల్యే పదవులు కూడా రొటేషన్ పద్ధతిలో కార్యకర్తలకు ఇస్తే బాగుంటుందని మాజీ మంత్రి టి.జి.వెంకటేష్ అభిప్రాయపడ్డారు. తాను అందరికంటే పాత కార్యకర్తనని, ఒకరినొకరు నిందించుకుంటూ పోతే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని మాజీ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ అన్నారు. మినీ మహానాడులో ప్రత్యేకంగా జిల్లా సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయాల్సిన అవసరం లేదని, ఆగస్టు 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే చాలని మాజీ మంత్రి కె.ఇ.ప్రభాకర్ తెలిపారు. సైడ్‌లైట్స్.. మహానాడు ప్రారంభానికి ముందే నంద్యాల ఎంపీ ఎస్.పి.వై.రెడ్డి సభలో నుంచి వెళ్లిపోయారు. పార్టీ కండువాను మెడలో వేసేందుకు ఒక నాయకుడు ప్రయత్నించగా వద్దని వారించి కండువాను తన కుర్చీ ముందున్న టీపాయిపై ఉంచి సభలో నుంచి నిష్ర్కమిం చారు. అలాగే తన ఉపన్యాసం పూర్తి కాగానే టి.జి.వెంకటేష్ సభ నుంచి వెళ్లిపోవడం కార్యకర్తల్లో చర్చనీయాంశ మయ్యింది. పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానకర్తగా పనిచేస్తా పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానకర్తగా పని చేస్తూ ఎల్లప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని జిల్లా టీడీపీ నూతన అధ్యక్షుడు శిల్పాచక్రపాణిరెడ్డి హామీ ఇచ్చారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లు పార్టీ బాధ్యతలను శిల్పాకు అప్పగించారు. రాష్ట్ర పార్టీ నుంచి పంపిన పత్రాన్ని చదివి శిల్పాచక్రపాణిరెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ మాజీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూచనలు, సలహాలతో డిప్యుటీ సీఎం కె.ఇ.కృష్ణమూర్తి, ఇన్చార్జి మంత్రి అచ్చన్నాయుడు ఆశీస్సులతో పార్టీని పటిష్టపరుస్తూనే జిల్లా అభివృద్ధి కోసం పాటు పడతానని హామీ ఇచ్చారు. తనపై గురుతర బాధ్యతతో జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టినందుకు నారా లోకేష్‌కు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. -
కలిసికట్టుగా పనిచేద్దాం
►టీడీపీని తిరుగులేని శక్తిగా చేద్దాం ►{పాణహిత చేవెళ్ల జాతీయహోదా కోసం పోరాడుదాం ►మినీ మహానాడులో నేతల పిలుపు టవర్‌సర్కిల్ : ‘పార్టీ పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పుడు అండగా నిలిచిన కార్యకర్తలను పార్టీ ఎన్నడూ మరిచిపోదు... పార్టీ నుంచి ఎంత మంది నేతలు వెళ్లినా... అంతకంటే రెట్టింపు సంఖ్యలో నేతలను తయారు చేసే శక్తి టీడీపీకి ఉంది.. టీడీపీని బలహీనపరచాలని టీఆర్ఎస్ కుయుక్తులు పన్నుతోంది, కార్యకర్తలు గురుతర బాధ్యతతో కలిసికట్టుగా పనిచేసి పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చి తిరుగులేని శక్తిగా తయారు చేయాలి’ అని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కార్యకర్తలను కోరారు. స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో శనివారం టీడీపీ మినీ మహానాడు సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రమణ, దయూకర్‌రావు మాట్లాడుతూ.. మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేవరకు పోరాటం చేస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని దుయ్యబట్టారు. కార్యకర్తలు నిస్వార్థంగా, నిజాయితీగా పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారని, టీడీపీకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న 2019 సాధారణ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరాలన్నారు. అవినీతి టీఆర్ఎస్ను ఎండగడదాం : విజయరమణారావు అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోరుుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు విమర్శించారు. అవినీతి టీఆర్ఎస్ను ఎండగట్టాలని కార్యకర్తలను కోరారు. సంక్షేమ పథకాలు, సబ్సిడీలు టీఆర్ఎస్ కార్యకర్తలకు అందుతుంటే మంత్రి ఈటెల రాజేందర్ అవినీతి లేదనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీలు కర్రు నాగయ్య, ముద్దసాని కశ్యప్‌రెడ్డి, మేడిపల్లి సత్యం, అన్నమనేని నర్సింగరావు, పి.రవీందర్రావు, కవ్వంపల్లి సత్యనారాయణ, నాయకులు సంకు సుధాకర్, రావుల రమేశ్, రాజునాయక్, కళ్యాడపు ఆగయ్య, చెల్లోజి రాజు, దామెర సత్యం, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహానాడును బహిష్కరించిన ‘సాంబారి’ అనుచరులు? కోరుట్లకు చెందిన సంకు సుధాకర్‌కు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడంతో ఆ నియోజకవర్గ ఇన్చార్జి సాంబారి ప్రభాకర్ అనుచరులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. రాజీనామా చేస్తామని జిల్లా అధ్యక్షుడు విజయరమణారావుతో రెండు రోజులుగా వారు చెబుతున్నారు. ఈ విషయమై శనివారం కూడా పార్టీ అధ్యక్షుడితో చెప్పినట్లు తెలిసింది. అయితే ఇన్చార్జి పదవికి, జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి ఎలాంటి సంబంధం లేదని, ఎవరి పనులు వారు చేసుకోవాలని విజయరమణారావు నచ్చజెప్పినట్లు తెలిసింది. అరుునా అలకవీడని ప్రభాకర్ అనుచరులు మినీ మహానాడును బహిష్కరించి వెళ్లిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. సందెట్లో సడేమియా టీడీపీ మినీ మహానాడులో జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. కార్యకర్తలందరూ ఒకేసారి భోజనాలు చేసేందుకు వెళ్లడంతో హాలంతా కిక్కిరిసిపోయింది. ఒకరినొకరు తోసుకునే పరిస్థితి ఎదురైంది. సందెట్లో సడేమియాలా ఇద్దరు గుర్తుతెలియని పిక్పాకెటర్లు హాల్లో చొరబడి జేబుల్లోంచి డబ్బులు దొంగిలిస్తుండగా కార్యకర్తలు వారిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మినీ మహానాడు తీర్మానాలు ►కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి. ►{పాణిహిత-చేవెళ్లకు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. ► రైతుల, చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణకు, సంక్షేమానికి సత్వర చర్యలు చేపట్టాలి. ►{పభుత్వ ఆస్పత్రుల్లో వసతులు కల్పించాలి. ►ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయూలి. ►మహిళల రక్షణ, భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. అమర వీరుల అన్ని కుటుంబాలను గుర్తించి ఎక్స్‌గ్రేసియా అందజేయాలి. బీడీ కార్మికులందరికీ పింఛన్లు మంజూరు చేయూలి. -
మినీ మహానాడు తీర్మానాలివీ
చర్చకు రాని పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్ అంశాలు పాలకొల్లు/ఏలూరు :పాలకొల్లులో శనివారం నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై పలు తీర్మానాలను ఆమోదించారు. వాటిని చంద్రబాబుకు నివేదించి పార్టీ రాష్ట్ర మహానాడులో చర్చించి చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని మంత్రులు ప్రకటించారు. ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు ప్రవేశపెట్టిన తీర్మానాల వివరాలిలా ఉన్నాయి. జిల్లాలో జల రవాణాను పునరుద్ధరించాలని, నరసాపురం తీరలో ఫిషింగ్ హార్బర్, పోర్టు నిర్మించాలని తీర్మానించారు. డెల్టాలో ఆక్వా పార్క్ నిర్మాణం, ఫిష్ ప్రాసెసింగ్, కోల్డ్‌స్టోరేజ్ యూనిట్ల స్థాపనం, తీరంలో మరబోట్ల తయారీ కర్మాగారాలు, రొయ్యల, చేపల హేచరీలు, ఫిష్ అండ్ ప్రాన్ ఫీడ్ పరిశ్రమలు, ఉప్పుతో సోడియం హైడ్రాక్సైడ్, క్లోరిన్ తయారీ పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని మినీ మహానాడు కోరింది. చింతలపూడి వద్ద బొగ్గు నిక్షేపాలను వెలికితీయడం ద్వారా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, కొవ్వూరు, దేవరపల్లి ప్రాంతాల్లో సిరామిక్ పరిశ్రమలు, ద్వారకాతిరుమలలో సిమెంట్ కర్మాగారాలు, గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు, కొబ్బరి పీచు పరిశ్రమలు, కొబ్బరి చిప్పలను కాల్చడం ద్వారా యాక్టివేటెడ్ కార్బన్ తయారు చేసే పరిశ్రమలు, ఊక, కొబ్బరి పొట్టుతో విత్యుత్ ఉత్పత్తి, ప్యాకేజ్డ్ కోకోనట్ వాటర్, కోకోనట్ పౌడర్, కోకోనట్ మిల్క్ ఉత్పత్తి యూనిట్లు నెలకొల్పే అవకాశాల్ని పరిశీలించాలని కోరుతూ తీర్మానాలు ఆమోదించారు. తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్ట్, జిల్లాలో నిట్ కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, కొల్లేరు సరస్సు అభివృద్ది, గోదావరికి ఇరువైపులా రిసార్ట్స్, ఫుడ్ పార్కుల నిర్మాణం మార్టేరు వరి పరిశోధనా కేంద్రం అభివృద్ధి, మెట్టలో యూకలిప్టస్ తోటల పెంపకం, పామాయిల్, బయో డీజిల్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, ప్రధమ ప్రాధాన్యతతో డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తి చేయించాలని కోరుతూ తీర్మానించారు. పోలవరం, పట్టిసీమపై చర్చించని నేతలు జిల్లాలో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని రైతులు వ్యతిరేకిస్తున్న అంశాలు మినీ మహానాడులో కనీస ప్రస్తావనకైనా రాలేదు. ఈ అంశాలను ప్రజాప్రతినిధులు, నాయకులు పూర్తిగా విస్మరించడం విమర్శలకు తావిచ్చింది. ఇదిలాఉండగా, మినీ మహానాడు ప్రారంభానికి ముందు టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కెనాల్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రులు అయ్యన్నపాత్రుడు, సుజాత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీ గాంధీబొమ్మల సెంటర్, పెదగోపురం, పోలీస్ స్టేషన్, మునిసిపల్ కార్యాలయం, యడ్లబజార్ మీదుగా బ్రాడీపేట బైపాస్ రోడ్డులోని సభావేదిక వద్దకు చేరుకుంది. ప్రముఖ సినీగేయ రచయిత చేగొండి అనంత శ్రీరామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాటలు పాడి ఉత్సాహపరిచారు. టీడీపీ సేవలో తరించిన మునిసిపల్ యంత్రాంగం పాలకొల్లు రూరల్ పంచాయతీ సబ్బేవాని పేటలో శనివారం నిర్వహించిన టీడీపీ మినీ మహానాడు కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు, సిబ్బంది సేవలందించారు. ఇదే అంశంపై మునిసిపల్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ నాయకుడు యడ్ల తాతాజీ శనివారం ఒక ప్రకటన చేస్తూ మునిసిపల్ అధికారులు, ఉద్యోగులు టీడీపీ కార్యకర్తల మాదిరిగా పనిచేశారని ధ్వజమెత్తారు. మునిసిపల్ కమిషనర్ జీపులో నేరుగా మినీ మహానాడు ప్రాంగణానికి వెళ్లి స్వామిభక్తిని చాటుకున్నారన్నారు. ట్యాంకర్ల ద్వారా శివారు ప్రాంతాలకు అందించాల్సిన మంచినీటిని మినీ మహానాడుకు తరలించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ పరిధిలో నిర్వహించిన కార్యక్రమానికి మునిసిపల్ ఉద్యోగులు హాజరై ఎందుకు సేవలందించాల్సి వచ్చిందని ఆయన నిలదీశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను తాతాజీ కోరారు. -
అభివృద్ధిపైనే దృష్టి
మినీ మహానాడులో జిల్లా ఇన్చార్జి మంత్రి అయ్యన్నపాత్రుడు కార్యకర్తల కోసం ఏం చేయడానికైనా సిద్ధమని వెల్లడి పార్టీకి అనుగుణంగా పనిచేయని అధికారులను బదిలీ చేస్తామని హెచ్చరిక జల రవాణా పునరుద్ధరణ, పోర్టు, ఫిషింగ్ హార్బర్ నిర్మించాలంటూ తీర్మానాలు పాలకొల్లు :జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీహెచ్.అయ్యన్నపాత్రుడు తెలి పారు. పాలకొల్లు బ్రాడీపేట బైపాస్ రోడ్డులో శనివారం నిర్వహించిన టీడీపీ మినీ మహానాడు సభలో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. 16 వేల ఎకరాల అటవీ భూములను పరిశ్రమల స్థాపనకు ఉపయోగించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. కొబ్బరి, కోకో, మత్స్య ఆధారిత పరిశ్రమల ఏర్పాటు, పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారిస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన జిల్లాలోని పార్టీ కార్యకర్తలను కాపాడుకోడానికి దేనికైనా సిద్ధమని పేర్కొన్నారు. పార్టీకిఅనుగుణంగా పనిచేయని అధికారులను ఎక్కడికైనా బదిలీ చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నుంచి రూ.1,280 కోట్లు నిధులు విడుదల చేశామని చెప్పారు. పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్న పంచాయతీలకు రూ.7 లక్షల చొప్పున రూ.128 కోట్లు విడుదల చేశామని వివరించారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేక అవకాశాలు కల్పిం చడానికే ఇసుక ర్యాంపులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించామన్నారు. మహిళలపై దాడులను నిరోధించేందుకు సర్కారు కృషి చేస్తోందని చెప్పారు. తొలుత వేదికపై ఉంచిన ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి అయ్యన్నపాత్రుడు పూలమాలవేసి నివాళులు అర్పించగా, పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు, ఎంపీ తోట సీతారామలక్ష్మి జ్వోతి ప్రజ్వలనం చేశారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సారధ్యంలో నిర్వహించిన సభలో ఎంపీలు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), మాగంటి మురళీమోహన్, ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్, పార్టీ జిల్లా పరిశీలకుడు, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, పితాని సత్యనారాయణ, వేటుకూరి శివరామరాజు, కేఎస్ జవహర్, గన్ని వీరాంజనేయులు, బడేటి కోటరామారావు (బుజ్జి), బూరుగుపల్లి శేషారావు, ముప్పిడి వెంకటేశ్వరరావు, మొడియం శ్రీనివాసరావు, ఆరిమిల్లి రాధాకృష్ణ వివిధ అంశాలపై ప్రసంగించారు. డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం, మాజీ ఎమ్మెల్సీ బొమ్మడి నారాయణరావు, మునిసిపల్ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి, ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు, నాయకులు బోణం నరసింహరావు, గండేటి వెంకటేశ్వరరావు, పెచ్చెట్టి బాబు, కర్నేన గౌరునాయుడు, మహ్మద్‌జానీ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీలో ‘ఎమ్మెల్సీ' చిచ్చు
- దొరబాబు, అరుణమ్మకు మొండి చేయి - లాబీయింగ్ చేస్తేనే పదవులంటూ మినీ మహానాడులో గల్లా అసమ్మతి గళం - ఫలించని చిత్తూరు నేతల తంత్రం - అనూహ్యంగా గౌనివారికి చోటు సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎమ్మెల్సీ పదవుల వ్యవహారం టీటీపీ నేతల్లో చిచ్చు రగిలిస్తోంది. పదవులు ఆశించి భంగ పడిన నేతలు బాబు తీరుపై భగ్గుమంటున్నారు. నిజాయితీ గలవారికి పార్టీలో స్థానం లేదని, పైరవీలు చేసేవారికే అందలం అని గల్లా వ్యాఖ్యనించడం ఇందుకు నిదర్శనం. ఈ పరిణామాలు కిందిస్థాయి కార్యకర్తల్లో చర్చకు దారి తీశాయి. ఈ పరిస్థితుల్లో పార్టీని ఏకతాటిపై నడపటం కత్తి మీద సామేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవుల కేటాయింపులో టీడీపీ నాయకులు దొరబాబు, గల్లా అరుణకుమారికి చోటు దక్కలేదు.చివరివరకు వారు ప్రయత్నాలు చేసినా అదృష్టం కలిసి రాలేదు. ముఖ్యంగా చంద్రబాబు అడుగులకు మడుగులొత్తేవారికే ఎమ్మెల్సీ పదవులు దక్కాయని పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి. కష్టకాలంలో పార్టీకి వెన్నంటి నడిచిన వారికి సైతం బాబు మొండి చేయి చూపారని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. గతంలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసి, ఒక్క ఓటుతో ఓడిపోయిన దొరబాబుకు ఈసారి అవకాశం దక్కుతుందని అందరూ ఊహించారు. అయితే అనూహ్యంగా చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిని గౌనివారి శ్రీనివాసులుకు కట్టబెట్టారు. దొరబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చిత్తూరు ఎంపీ శివప్రసాద్, జెడ్పీచైర్ పర్సన్ గీర్వాణి, ఎమ్మెల్యే సత్యప్రభ,మేయర్ అనురాధ తదితరులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. చూద్దాంలే అంటూనే సీఎం దాటవేయడంతో నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ పదవుల వ్యవహారంలో మంత్రి మాటను సైతం పరిగణనలోకి తీసుకోనట్లు సమాచారం. రగులుతున్న అసంతృప్తి పదవులు ఆశించి భంగపడిన గల్లా అరుణతో పాటు, మరికొందరు బాబు వ్యవహార శైలిపై లోలోన రగిలిపోతున్నారు. ఇటీవల చిత్తూరులో జరిగిన మిని మహానాడులో షో చేసి, హైదరాబాద్ స్థాయిలో లాబీయింగ్ చేస్తేనే పదవులంటూ గల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టపడి పని చేసేవారికి పదవులు దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని ద్వితీయ శ్రేణి నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు తన వేగుల ద్వారా బాబు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు, గల్లా అరుణకుమారిని త్వరలో హైదరాబాద్‌కు పిలిపించి బుజ్జగించనున్నట్లు తెలిసింది. -
టీడీపీ కమిటీల తీర్మానాల మేరకే పల్లెల్లో అభివృద్ధి
- జూన్‌లో ఖరీఫ్ నారుమళ్లకు నీరు - రానున్న నాలుగేళ్లలో సాగర్ పనులకు రూ.2 వేల కోట్ల నిధులు - మినీ మహానాడులో మంత్రి దేవినేని ఉమ కంచికచర్ల : తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీల తీర్మానాల మేరకు పల్లెల్లో అభివృద్ధి పనులు జరుగుతాయని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అందుకనుగుణంగా నిధులు మంజూరు చేయటం జరుగుతుందని ఆయన చెప్పారు. మండలంలోని పరిటాల శివారు దొనబండ ఉమా హాలిడే ఇన్స్లో గురువారం జిల్లా స్థాయి మినీ మహానాడు నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఉమ మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ రోడ్లు, డొంక రోడ్ల అభివృద్ధి, తాగునీటి పథకం తదితర పనులకు ప్రాధాన్యత క్రమంలో కాకుండా పార్టీ సూచించిన మేరకే నిధులు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. పార్టీలో పెత్తనాలు చేసే నాయకులకు పనులు చేయబోమని, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకే చేస్తామని తెలిపారు. జూన్‌లో డెల్టాలోని నారుమళ్లకు కృష్ణానదీ జలా లు అందిస్తామని, రానున్న నాలుగేళ్ల కాలంలో నాగార్జునసాగర్ కాల్వల పనులకు రూ.2 వేల కోట్ల నిధులు మంజూరు చేస్తామని వివరించారు. టీడీపీ హయాంలో అభివృద్ధికి కృషి... జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, టీడీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి కృషిచేస్తోందని చెప్పారు. రైతులకు రూ.23 వేల కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు చెప్పారు. టీడీపీపై బీజేపీ కన్ను... ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మిత్రపక్షమైన బీజేపీ ప్రభుత్వం టీడీపీపై కన్నేసిందని చెప్పారు. పార్టీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎన్నికల అనంతరం పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా కార్యకర్తల్లో నిరుత్సాహం ఉందన్నారు. గుంటూరుపై చంద్రబాబుకు ప్రేమ... ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు గుం టూరు జిల్లాపై ప్రేమ ఉందని, అందుకే రాజధాని నిర్మాణం ఆ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. గుంటూరు జిల్లాకు సీఎం ఆశీస్సులుంటే కృష్ణాజిల్లాకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనూరాధ, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, బోడె ప్రసాద్, వల్లభనేని వంశీ, శ్రీరాంరాజగోపాల్, విజయవాడ మేయర్ శ్రీధర్, మాజీ ఎమ్మెల్యేలు రావి వెంకటేశ్వరరావు, జయమంగళ వెంకటరమణ, నల్లగట్ల స్వామిదాసు, కమ్మిలి విఠల్‌రావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి, నాయకులు వర్ల రామయ్య, గొట్టిపాటి రామకృష్ణ, ఆచంట సునీత తదితరులు పాల్గొన్నారు. నేతల గైర్హాజరుపై ఉమ రుసరుస పశ్చిమ కృష్ణా నేతలకే ఎక్కువ పదవులు దక్కుతుండటంతో తూర్పు కృష్ణాకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు మినీ మహానాడుకు దూరంగా ఉన్నారు. వీరుగైర్హాజరవడంతో సభా ప్రాంగణం వెలవెలబోయింది. దీంతో మంత్రి ఉమ రుసరుసలాడారు. కార్యకర్తలు లేక కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. -
ప్రాధాన్యతివ్వండి
45 మంది సభ్యులతో టీడీపీ జిల్లా కమిటీ ఏర్పాటు చేయాలన్న అధిష్టానం 90 మందితో ఉండాలని జిల్లా నేతల పట్టు అందుకే కమిటీ ప్రకటనలోజాప్యం చంద్రబాబు దృష్టికి‘జంబో’ సమస్య జెండా మోసిన కార్యకర్తలను పక్కనపెట్టి అనుచరులకే చోటు కల్పిస్తోన్న నేతలు మినీ మహానాడులో నిలదీసేందుకు సిద్ధమైన కార్యకర్తలు (సాక్షి ప్రతినిధి, అనంతపురం) : తెలుగుదేశం పార్టీలో జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందా? ఏళ్లుగా పార్టీ ఉన్నతి కోసం శ్రమించిన వారిని పక్కనపెట్టి అస్మదీయులైన వారికే ‘అనంత’ నేతలు జిల్లా కమిటీలో చోటు కల్పిస్తున్నారా? మినీ మహానాడులో నేతల తీరును కార్యకర్తలు ఎండగట్టనున్నారా?... ప్రస్తుతం టీడీపీలో పరిణామాలను బేరీజు వేస్తే ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తోంది. టీడీపీ జిల్లా కమిటీ ఏర్పాటు ‘అనంత’ నేతలకు పెద్ద సమస్యగా మారింది. పదేళ్ల తర్వాత ఆ పార్టీ అధికారాన్ని చేజిక్కించుంది. ఈ కాలంలో పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడిన కార్యకర్తలు కమిటీలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. నేతలు మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. చోటుకల్పించడం కుదరదని చెబుతున్నారు. ఇదీ అసలు సమస్య టీడీపీ జిల్లా కమిటీ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. మొదట ఈ నెల 16న ఏర్పాటు చేయాలని భావించారు. అయితే..వివాదం తలెత్తింది. గతేడాది 117 మందితో జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 45 మందితోనే నియమించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇందుకు జిల్లా నేతలు ససేమిరా అన్నారు. 117 మందితో ఏర్పాటు చేయాలని, 45 మంది అంటే సమస్యలు ఉత్పన్నమవుతాయని ఎన్నికల పరిశీలకులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సీఎం రమేశ్‌తో చెప్పారు. దీన్ని వారు పరిగణనలోకి తీసుకోలేదు. కనీసం 90 మందితోనైనా ఏర్పాటు చేయాలంటూ జాబితాను పరిశీలకుల చేతికిచ్చారు. అన్ని జిల్లాల్లో 45 మందితోనే నియమిస్తున్నామని, ‘అనంత’లో మాత్రం వేరుగా కుదరదని పరిశీలకులు తేల్చిచెప్పారు. కావాలంటే అనుబంధ సంఘాలు, రాష్ట్ర కమిటీలో చోటు కల్పించుకోండని సూచించారు. అనుబంధ సంఘాలు, రాష్ట్ర కమిటీలో ఏటా 400 మందికి చోటు లభిస్తోంది. ఈసారి ఈ సంఖ్యను కూడా సగానికి తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పయ్యావుల కేశవ్ 90 మందితో కూడిన జాబితాను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దానికి చంద్రబాబుతో ఆమోదముద్ర వేయించేలా కేశవ్, బీకే పార్థసారథి, వరదాపురం సూరి ప్రయత్నిస్తున్నారు. మినీ మహానాడులో నిలదీసేందుకు సిద్ధం ప్రస్తుతం నేతలు ఇచ్చిన 90 మంది పేర్లపై కూడా కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం శ్రమించిన వారిని కాదని, నేతలు చుట్టూ ఉన్నవారికే పదవులు కట్టబెడుతున్నారని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒకరు ‘సాక్షి’తో అన్నారు. అధిష్టానం అనుకున్నట్లు 45 మందితో కమిటీని ప్రకటిస్తే నియోజకవర్గానికి 4-5 మందికి కూడా అవకాశం రాదని ఆయన విశ్లేషించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి పని చేసేందుకు కమిటీలో చోటు కల్పించి, అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 23న ధర్మవరంలో జరిగే మినీ మహానాడులో ఇదే విషయాన్ని ప్రశ్నించేందుకు కార్యకర్తలు సన్నద్ధంగా ఉన్నారని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే మహానాడులో నేతల వైఖరిని కార్యకర్తలు కచ్చితంగా నిలదీస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. జిల్లా కమిటీ ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుడుగా బీకే పార్థసారథి, ప్రధాన కార్యదర్శిగా వరదాపురం సూరి, ప్రచార కార్యదర్శిగా బీవీ వెంకట్రాముడుతో పాటు 90 మంది పేర్లతో కూడిన జాబితాను పార్టీ అధిష్టానానికి పంపారు. మరో రెండుర ోజుల్లో కమిటీని ప్రకటిస్తామని పరిశీలకులు ఈ నెల 17న జిల్లాలో చెప్పారు. అయితే.. ఇప్పటి వరకూ ప్రకటన చేయలేదు. 90 మంది పేర్లకు అధిష్టానం ససేమిరా అంటోందని, 45 మందితోనే కమిటీ ప్రకటిస్తారని ఓ కీలక నేత చెప్పారు. -
16 నుంచి టీటీడీపీ మినీ మహానాడు
హైదరాబాద్: టీడీపీ నిర్వహించే మహానాడుకు ముందు అన్ని జిల్లాల్లో మినీ మహానాడులను నిర్వహించాలని తెలంగాణ పార్టీ కమిటీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో మహా నాడు ఏర్పాట్లు, జిల్లా కమిటీల ఎన్నికలపై సమావేశం జరిగింది. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇ.పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎం.అరవింద్ కుమార్‌గౌడ్, సి.కృష్ణయాదవ్, పి.రాములు, బుచ్చిలింగం, కాశీ నాథ్ తదితరులు హాజరయ్యారు. ఇప్పటికే పార్టీ గ్రామకమిటీలు, వార్డు కమిటీలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈనెల 10వ తేదీలోపు అన్ని జిల్లాల్లో మండల, డివిజన్ కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. 11 నుంచి 17వ తేదీ వరకు జిల్లా కమిటీలకు ఎన్నికలు నిర్వహించి, కార్యవర్గాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు హైదరాబాద్, రంగారెడ్డి మినహా అన్ని జిల్లాల్లో మినీ మహానాడులు నిర్వహించనున్నారు. 27 నుంచి 29 వరకు హైదరాబాద్‌లో జరిగే మహానాడులో టీడీపీని జాతీయ పార్టీగా రూపొందించేందుకు మార్గనిర్దేశం జరుగుతుందని, ఈ నేపథ్యంలో వినూత్న పద్ధతిలో మహానాడు నిర్వహిస్తామని సమావేశం అనంతరం ఎన్నికల కమిటీ నాయకులు ఇ.పెద్దిరెడ్డి, బుచ్చిలింగం, కాశీనాథ్ మీడియాకు చెప్పారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసి 2019 నాటికి టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బలమైన శక్తిగా రూపొందిస్తామన్నారు. జిల్లా పార్టీ ఎన్నికలు, మినీ మహానాడు తేదీలు టీడీపీ జిల్లా పార్టీ ఎన్నికలు ఈ నెల 11న కరీంనగర్, ఖమ్మం, 12న నల్లగొండ, 13న నిజామాబాద్, మెదక్, 14న వరంగల్, ఆదిలాబాద్, 15న మంచిర్యాల, 16న మహబూబ్‌నగర్, 17న హైదరాబాద్, రంగారెడ్డిల్లో నిర్వహించనున్నారు. మినీ మహానాడులను 16న కరీంనగర్, 17న ఖమ్మం, మంచిర్యాల, 18న నల్లగొండ, 20న ఆదిలాబాద్, 21న నిజామాబాద్, 22న మెదక్, 23న మహబూబ్‌నగర్, 24న వరంగల్‌లో నిర్వహించనున్నారు. -
మినీ మహానాడులో రభస
ఒంగోలు: ప్రకాశం జిల్లా టిడిపి మినీ మహానాడులో రభస జరిగింది. చీరాలలో గెలిచిన స్వతంత్ర ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు వ్యతిరేకంగా టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు. అతనిని పార్టీలోకి రానివ్వొద్దని కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టిడిపి అధిష్టానం ఆమంచిని పార్టీలో చేర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలియడంతో కార్యకర్తలు వ్యతిరికేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత టీడీపీ నాయకులు పోతుల సునీత, పాలేటి రామారావులు ఆమంచిని తీవ్రస్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని ఆమంచి కృష్ణమోహన్ నిన్న కలిసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆమంచి కృష్ణమోహన్ టిడిపిలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అతనిని పార్టీలో చేర్చుకోవడానికి సాంకేతికపరమైన ఇబ్బందులేమైనా ఉంటే ఆ పార్టీ అనుబంధ సభ్యుడిగా ఆమంచిని కొనసాగించే ఆలోచన ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడుని కలవడానికి ముందు ఆమంచి జనసేన వ్యవస్థాపకుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కూడా కలిశారు. ఆయనతో చాలాసేపు చర్చలు జరిపారు. ఇదిలా ఉండగా, ఆమంచి చేరిక విషయంలో కొంత మంది టీడీపీ సుముఖంగా ఉండగా, మరి కొంత మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టిడిపి బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన శ్రీరాం మాల్యాద్రికి చీరాల శాసనసభ స్థానంలో ఆధిక్యత ఓట్లు లభించాయి. ఇది ఆమంచిని ఆ పార్టీలో చేర్చుకోవడానికి ఉపయోగపడవచ్చని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆమంచి తన పట్టును నిరూపించుకున్నారు. ఈ పరిస్థితులలో అతనిని టీడీపీలో చేర్చుకోవడానికి చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే స్థానిక టిడిపి కార్యకర్తలు మాత్రం ఆమంచి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
అధ్యక్షుడి ఎన్నికకే మహానాడు పరిమితం!
-
రేపు మినీ మహానాడు
- జిల్లా వ్యాప్తంగా నాయకులకు ఆహ్వానం - టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యర్రాకుల శ్రీనివాసరావు యాదవ్ ఒంగోలు, న్యూస్‌లైన్ : ఒంగోలు దక్షిణ బైపాస్‌లోని సీతారామ ఫంక్షన్ హాలులో ఈ నెల 24వ తేదీ ఉదయం 10.45 గంటలకు జరిగే మినీ మహానాడుకు జిల్లాలోని టీడీపీ నాయకులందరూ తరలిరావాలని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యర్రాకుల శ్రీనివాసరావు యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం ఎన్టీఆర్ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీని గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు ప్రకటించారు. కుట్రపూరితంగా రాష్ట్ర విభజన చేయబట్టే కాంగ్రెస్ పార్టీ చివరకు ప్రతిపక్ష స్థానాన్ని కూడా పొందలేకపోయిందని విమర్శించారు. ఒంగోలు కార్పొరేషన్ అభివృద్ధి, సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పాటు, జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం వంటి వాటికి జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దనరావు, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, శిద్దా రాఘవరావు కృషి చేస్తారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మినీ మహానాడుకు హాజరై జిల్లా పార్టీ ప్రవేశపెట్టే తీర్మానాలను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. నగర అధ్యక్షుడు యానం చినయోగయ్య యాదవ్ మాట్లాడుతూ 23వ తేదీ సాయంత్రం 5గంటలకు పార్టీ జిల్లా కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి పలు తీర్మానాలను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మహిళా నాయకురాలు టి.అనంతమ్మ, మైనార్టీ సెల్ నాయకులు పఠాన్ హనీఫ్ఖాన్, మాజీ కౌన్సిలర్ మురళి, కపిల్‌బాషా, బాలిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.