'కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పట్టి పీడించింది' | Congress to hold the perpetrators state says ravela kishor babu | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పట్టి పీడించింది'

Published Sun, May 24 2015 7:46 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress to hold the perpetrators state says ravela kishor babu

ఒంగోలు సెంట్రల్: కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా రాష్ట్రాన్ని పట్టి పీడించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆదివారం నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి రావెల మాట్లాడుతూ అరాచక కాంగ్రెస్ పార్టీ చేతుల్లో టీడీపీ కార్యకర్తలు పదేళ్లపాటు ఇబ్బందులకు గురయ్యారన్నారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్‌గా మార్చేందుకు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు.

జూన్ 3వ తేదీ నుంచి డ్వాక్రా రుణాల మాఫీ ప్రక్రియ చేస్తామన్నారు. మద్యం మాఫియాను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అధిష్టానం నిర్ణయం మేరకు దామచర్ల జనార్దన్‌ను టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నుకున్నట్లు తెలిపారు. సమష్టిగా కృషి చేస్తే జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement