Ravela Kishor Babu
-
దేనికైనా సిద్ధం.. విధేయుడిగా ఉంటా: రావెల
గుంటూరు, సాక్షి: అంబేద్కర్ ఆశయాల్ని నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆయన పేదలకు చేస్తున్న సేవ తనను ఆకట్టుకుందని ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. బుధవారం మధ్యాహ్నాం సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారాయన. ‘‘అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చుతున్న సీఎం జగన్ మాత్రమే. పేద, బడుగు, బలహీన వర్గాల రాజకీయ కలను జగన్ సాకారం చేస్తున్నారు. రెండున్నర లక్షల కోట్ల రూపాయలు పేదల ఖాతాలో జమ చేయటం ఒక చరిత్ర. డ్వాక్రా మహిళలను గత పాలకులు ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారు. జగన్ మాత్రం వారి రుణాలను విడతల వారీగా మాఫీ చేశారు . అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా జగన్ చూస్తున్నారు. పేదలకు చేస్తున్న సేవలను చూసి వైఎస్సార్సీపీలో చేరాను. పార్టీ కోసం జగన్ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధం. ఒక విధేయుడిగా ఉంటా అని రావెల తెలిపారు. ఐఆర్టీఎస్ మాజీ అధికారి అయిన రావెల 2014లో గుంటూరు ప్రత్తిపాడు(ఎస్సీ) నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసి నెగ్గారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2018 చివర్లో టీడీపీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరారు. -
ప్రకంపనలు రేపుతున్న వర్ల రామయ్య వ్యాఖ్యలు
-
మైనింగ్ సూత్రధారి మంత్రి సోదరుడే ?
సాక్షి, గుంటూరు: గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపాలెం వద్ద మట్టి దోపిడీకి నారాయణస్వామి అనే వ్యక్తి ప్రధాన సూత్రధారిగా మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నారాయణస్వామి ఎవరు? అనే దానిపై ఆరా తీస్తే ఆయన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు వరుసకు సోదరుడవుతాడంటూ సొంత పార్టీ నేతలే చెవులు కొరక్కుంటున్నారు. మంత్రి కనుసన్నల్లోనే తన బంధువులు, జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రావెల కిషోర్‌బాబు చేసిన వ్యాఖ్యలు రెండు రోజులుగా టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇదంతా కనుసన్నల్లోనే.. అక్రమ మైనింగ్ జరుగుతున్న విషయం మంత్రికి చెప్పినా పట్టించుకోవడం లేదంటూ రావెల చేసిన వ్యాఖ్యలతో ఇదంతా మంత్రి కనుసన్నల్లోనే జరుగుతుందనే అనుమానాలకు బలం చేకూర్చింది. రావెల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి ప్రత్తిపాటి తన పేరు చెప్పుకుని కొందరు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రకటించడం చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారుల్లో చలనం ఏదీ? మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరు చెప్పుకొని నారాయణ స్వామి అనే వ్యక్తి మరికొందరితో కలిసి అటవీ భూములు, పోరంబోకు భూములు అనే తేడా లేకుండా మట్టిని అక్రమంగా అమ్ముకుంటూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తమ జేబుల్లో వేసుకుంటున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. అధికార టీడీపీ నేతలు చేస్తున్న అక్రమ మైనింగ్ వద్దకు వెళ్లి రెండు పొక్లెయిన్లు, రెండు లారీలను అధికారులకు పట్టించినప్పటికీ వారిలో చలనం లేకపోవడం చూస్తుంటే అధికార పార్టీ ముఖ్య నేతల ఒత్తిడి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మట్టి దోపిడీకి పాల్పడుతున్న నారాయణస్వామి మంత్రి పుల్లారావుకు వరుసకు సోదరుడు అవుతాడనే దానిపై ఇప్పుడు టీడీపీలో తీవ్ర చర్చ నడుస్తుంది. సొంత బంధువుతోపాటు, తన అనుచరులు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నప్పటికీ తనకేమీ తెలియదని మంత్రి పుల్లారావు బుకాయిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మంత్రి అండతోనే మట్టి దోపిడీ అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే అడ్డు పడుతున్నా లెక్కచేయకుండా మట్టి దోపిడీ చేస్తున్నారంటే మంత్రి అండలేనిదే ఈ స్థాయిలో రెచ్చిపోతారా అనే వాదనలు వినిపిస్తున్నాయి. మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు ఎవరూ దీని జోలికి వెళ్లకపోవడం చూస్తుంటే రావెల కిషోర్‌బాబు చేసిన వ్యాఖ్యలు వాస్తవాలేనని అర్ధమవుతుంది. నిజంగా మంత్రికి అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఎటువంటి సంబంధం లేకపోతే సొంత పార్టీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నట్లు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న నారాయణస్వామితోపాటు, మరికొందరు టీడీపీ నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిపోయి మాటలకే పరిమితం అవడం అనుమానాలకు తావిస్తుంది. అంతేకాకుండా అక్రమ మైనింగ్ జరుగుతున్నా పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ సొంతపార్టీ నేతలనే ప్రశ్నిస్తున్నారు. మైనింగ్ ఏడీ శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే రావెల డిమాండ్ చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. -
రేపు మంత్రి రావెల రాక
అనంతపురం అర్బన్ : జిల్లాలో చేపట్టిన ‘చంద్రన్న దళిత బాట’ కార్యక్రమంలో పాల్గొనేందుకు సాంఘిక, గిరిజన సంక్షేమ సాధికారత శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు సోమవారం జిల్లాకు విచ్చేస్తున్నారు. సంక్షేమ పథకాలపై ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు, ప్రజ లకు ఆవగాహన కల్పించేందుకు మధ్యాహ్న ం మూడు గంటలకు ఆర్ట్ కళాశాల ఎదురుగా ఉన్న మైదానంలో సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రోశన్న ఒక ప్రకటనలో తెలిపారు. సదస్సుకు జిల్లాలోని దళిత, గిరిజన సామాజిక వర్గాల ప్రజలు, సంఘాల నాయకులు హాజరు కావాలని ఆయన కోరారు. -
‘ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి’
మడకశిర : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. కేంద్రంలో తమ మిత్రపక్షమైన బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ వివిధ రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలబడతామన్నారు. ఆయన బుధవారం రొళ్ల మండలం ఆవినకుంట వద్ద విలేకరులతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఈ కేసులో ఆడియో, వీడియో టేపులు చెల్లవని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ప్రతిపక్షాలు బురదజల్లుతున్నాయన్నారు. స్టింగ్ ఆపరేషన్లు చట్టవిరుద్ధమన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే ఈరన్న, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. -
'కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పట్టి పీడించింది'
ఒంగోలు సెంట్రల్: కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా రాష్ట్రాన్ని పట్టి పీడించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆదివారం నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి రావెల మాట్లాడుతూ అరాచక కాంగ్రెస్ పార్టీ చేతుల్లో టీడీపీ కార్యకర్తలు పదేళ్లపాటు ఇబ్బందులకు గురయ్యారన్నారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్‌గా మార్చేందుకు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. జూన్ 3వ తేదీ నుంచి డ్వాక్రా రుణాల మాఫీ ప్రక్రియ చేస్తామన్నారు. మద్యం మాఫియాను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అధిష్టానం నిర్ణయం మేరకు దామచర్ల జనార్దన్‌ను టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నుకున్నట్లు తెలిపారు. సమష్టిగా కృషి చేస్తే జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. -
గిరిజన టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
హైదరాబాద్: రాష్ట్రంలో 402 గిరిజన టీచర్ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ విడుదలైనట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లోని షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రత్యేక డీఎస్సీద్వారా ఈ నియామకాలు చేపట్టినట్లు అందులో పేర్కొన్నారు. ఈ డీఎస్సీలో ఎలాంటి రాత పరీక్ష ఉండబోదన్నారు. అభ్యర్థులు... ఇంటర్, డిగ్రీలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ, బీఈడీ లేదా డీఈడీలో వచ్చిన మార్కులకు 30 శాతం వెయిటేజీ, టెట్‌లో మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందన్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు మే 30 చివరి తేదీ అని, దరఖాస్తుల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ లాంటి విధివిధానాలను పూర్తిచేసి వచ్చే నెల 14న మెరిట్ తుది జాబితా విడుదల చేస్తామన్నారు. 15న కౌన్సెలింగ్ ద్వారా నియామక ఉత్తర్వులు వెలువరిస్తామని తెలిపారు. -
రావెల తీరు దళితజాతికే అవమానం
నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు వ్యవహరిస్తున్న తీరు దళిత జాతికే సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు పాశం సునీల్‌కుమార్, కె. సర్వేశ్వర్రావు, పాలపర్తి డేవిడ్‌రాజు, ఉప్పులేటి కల్పన, గిడ్డిఈశ్వరి, విశ్వసరాయి కళావతి, వంతల రాజేశ్వరి, కె.సంజీవయ్యలు బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. సాటికులం వాళ్లని ఎలా గౌరవించాలో మంత్రి నేర్చుకోవాలని.. స్పీకర్ సాక్షిగా అసెంబ్లీలో గిరిజన మహిళా ఎమ్మెల్యేని వేలుపెట్టి చూపుతూ అసభ్య పదజాలంతో అవమానించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఆ శాఖను గిరిజనులకే ఇవ్వండి: ఈ నెల7 నుంచి 27 వరకు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో గిరిజన ఎమ్మెల్యేగా తనకు బుధవారమే మాట్లాడే అవకాశం వచ్చిందని, ఆ సమయంలో మంత్రి రావెల కిశోర్‌బాబు తనను కించపరిచే విధంగా మాట్లాడడం బాధకరమని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. -
హాస్టల్లో ఉంటున్నారా! అయితే ఇక పండుగే!
హైదరాబాద్: ఏపి ప్రభుత్వం ప్రకటించిన విధానాలతో హాస్టల్ విద్యార్థులకు ఇక పండుగే. ఈ-హాస్టల్స్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు చెప్పారు. హాస్టల్లో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించడంతోపాటు, అవినీతిని పారదోలతామన్నారు. తొలి విడత 998 ఎస్సి హాస్టల్స్‌లో ఈ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ విధానం ప్రకారం ప్రతి హాస్టల్లో లాప్టాప్, వెబ్ కెమెరా, బయోమెట్రిక్ మిషన్, సరుకుల వినియోగం, విద్యార్థులు-సిబ్బంది హాజరు...అన్ని వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తారు. హాస్టల్స్‌లో అవినీతి నిరోధానికి చర్యలు తీసుకుంటామని మంత్రి రావెల తెలిపారు. ** -
టీ సర్కారు 36 జీవోపై కోర్టుకు వెళతాం
ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబు హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 36 రాజ్యాంగానికి వ్యతిరేకమని, ఈ జీవో జారీ చేయడం ద్వారా సీఎం కేసీఆర్ రాజ్యాంగ హక్కులను కాలరాశారని ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు విమర్శించారు. ఆయన బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి అడ్మిషన్లను పదేళ్లపాటు కొనసాగించాలన్న నిబంధనకు ఈ స్థానికత జీవో తూట్లు పొడిచినట్లుందన్నారు. 1956కు ముందున్న వారినే స్థానికులుగా పరిగణించాలంటూ జారీ చేసిన ఈ జీవోపై కోర్టుకు వెళతామని, దీనిపై ఇప్పటికే అడ్వొకేట్ జనరల్(ఏజీ)ను సంప్రదించానని తెలిపారు. తాము చేసే న్యాయపోరాటంలో తప్పక విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రా వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామన్న కేసీఆర్.. ఇప్పుడు వారిని ద్వితీయశ్రేణి పౌరులుగా మార్చేందుకు అనుసరిస్తున్న వైఖరి దారుణంగా ఉందన్నారు. 1956 తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన ఆదాయాన్ని కేసీఆర్ వెనక్కు ఇచ్చేస్తారా? అని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో వేలాదిమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం కేసీఆర్‌కు తగదన్నారు. -
ఇది మరో కుట్ర : ఏపి మంత్రి రావెల
హైదరాబాద్: విద్యార్థుల స్థానికతపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధం అని ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ప్రసిడెన్షియల్ ఆర్డర్‌ను కాదని తండ్రి స్థానికత అనడం సమంజసం కాదని పేర్కొన్నారు. అధికారం కోసం విద్వేషాలను రెచ్చగొట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆ కుట్రలో భాగంగానే ఫీజు రీయింబర్స్మెంట్ వివాదాన్ని తీసుకొస్తున్నారని విమర్శించారు. గవర్నర్ కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థలుకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. Follow @sakshinews