హాస్టల్లో ఉంటున్నారా! అయితే ఇక పండుగే! | E-Hostels in AP | Sakshi
Sakshi News home page

హాస్టల్లో ఉంటున్నారా! అయితే ఇక పండుగే!

Published Tue, Sep 23 2014 6:59 PM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM

రావెల కిషోర్ బాబు

రావెల కిషోర్ బాబు

హైదరాబాద్: ఏపి ప్రభుత్వం ప్రకటించిన విధానాలతో హాస్టల్ విద్యార్థులకు ఇక పండుగే. ఈ-హాస్టల్స్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు చెప్పారు. హాస్టల్లో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించడంతోపాటు, అవినీతిని పారదోలతామన్నారు. తొలి విడత 998 ఎస్సి హాస్టల్స్లో ఈ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు.

ఈ విధానం ప్రకారం ప్రతి హాస్టల్లో లాప్టాప్, వెబ్ కెమెరా, బయోమెట్రిక్ మిషన్, సరుకుల వినియోగం, విద్యార్థులు-సిబ్బంది హాజరు...అన్ని వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తారు. హాస్టల్స్లో అవినీతి నిరోధానికి చర్యలు తీసుకుంటామని మంత్రి రావెల తెలిపారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement