మడకశిర : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. కేంద్రంలో తమ మిత్రపక్షమైన బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ వివిధ రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలబడతామన్నారు. ఆయన బుధవారం రొళ్ల మండలం ఆవినకుంట వద్ద విలేకరులతో మాట్లాడారు.
ఓటుకు కోట్లు కేసుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఈ కేసులో ఆడియో, వీడియో టేపులు చెల్లవని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ప్రతిపక్షాలు బురదజల్లుతున్నాయన్నారు. స్టింగ్ ఆపరేషన్లు చట్టవిరుద్ధమన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే ఈరన్న, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు.
‘ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి’
Published Thu, Sep 1 2016 12:08 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement