హైదరాబాద్: రాష్ట్రంలో 402 గిరిజన టీచర్ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ విడుదలైనట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లోని షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రత్యేక డీఎస్సీద్వారా ఈ నియామకాలు చేపట్టినట్లు అందులో పేర్కొన్నారు. ఈ డీఎస్సీలో ఎలాంటి రాత పరీక్ష ఉండబోదన్నారు.
అభ్యర్థులు... ఇంటర్, డిగ్రీలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ, బీఈడీ లేదా డీఈడీలో వచ్చిన మార్కులకు 30 శాతం వెయిటేజీ, టెట్‌లో మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందన్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు మే 30 చివరి తేదీ అని, దరఖాస్తుల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ లాంటి విధివిధానాలను పూర్తిచేసి వచ్చే నెల 14న మెరిట్ తుది జాబితా విడుదల చేస్తామన్నారు. 15న కౌన్సెలింగ్ ద్వారా నియామక ఉత్తర్వులు వెలువరిస్తామని తెలిపారు.
గిరిజన టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Published Thu, May 21 2015 3:55 AM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM
Advertisement