teacher recruitment
-
9న సీఎం చేతుల మీదుగా ఉపాధ్యాయ నియామక పత్రాలు
హైదరాబాద్: ఈనెల 9 తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు సీఎం ఎ.రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామ క పత్రాలను అందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో ఆదివారం సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, దాదాపు పదివేలకు పైగా ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నియామక పత్రాలను జారీచేస్తున్నట్టు తెలిపారు. ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు సంబంధించి సరి్టఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను సంబంధిత జిల్లా కలెక్టర్లు పూర్తి చేశారని, సోమవారం సాయంత్రంలోగా తుది జాబితాను పాఠశాల విద్యా కమిషనర్ సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేస్తారని తెలిపారు. ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులందరూ తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం రెండు గంటలలోపే ఎల్.బి.స్టేడియానికి చేరేలా తగు ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. వారిని హైదరాబాద్‌కు చేరవేయడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి బస్సులో ఒక పోలీస్ కానిస్టేబుల్, సమన్వయ అధికారిని నియమించాలని సూచించారు. -
Patna: లాఠీఛార్జిలో బీజేపీ కార్యకర్త మృతి.. తీవ్ర ఉద్రిక్తత
పాట్నా: నితీశ్ సర్కారకు వ్యతిరేకంగా.. బీజేపీ చేపట్టిన ఆందోళన బీహార్ రాజధానిలో ఉద్రిక్తతకు దారి తీసింది. అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. అయినా పరిస్థితి అదుపు కాకపోవడంతో.. టియర్ గ్యాస్, వాటర్ కెనన్లకూ పని చెప్పారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త మృతి చెందినట్లు తెలుస్తోంది. టీచర్ రిక్రూట్మెంట్ స్కాం ఆరోపణలతో పాటుగా పలు అంశాలపై నితీశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు గురువారం గాంధీ మైదాన్ వద్ద నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ క్రమంలో అసెంబ్లీ ముట్టడికి బయల్దేరగా పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. ఇరువర్గాల నడుమ వాగ్వాదం చోటు చేసుకోగా.. పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. ఆందోళనకారులు తమతో దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులు.. పోలీసులు లాఠీఛార్జికి దిగారు. టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు వాటర్ కెనన్లు ఉపయోగించి వాళ్లను చెదరగొట్టారు. అయితే లాఠీఛార్జిలో గాయపడిన ఓ కార్యకర్త మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో.. పాట్నాలో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. నితీశ్ ప్రభుత్వంపై బీజేపీ అవినీతి ఆరోపణలతో విరుచుకుపడుతోంది. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కాంలో జులై 3వ తేదీన సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయగా.. అందులో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పేరును సైతం చేర్చింది. దీంతో తేజస్వి రాజీనామా డిమాండ్ చేస్తూ.. ఆందోళన ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. पटना में बीजेपी नेताओं के मार्च के दौरान हंगामा, पुलिस ने बीजेपी नेताओं पर किया लाठीचार्ज#teachersprotest #Patna pic.twitter.com/uipUuklcI1 — Shashank Shekhar (@Shashan48591134) July 13, 2023 ఇదీ చదవండి: ఆ మాజీ సీఎం ఇంట్లోనే ఇక రాహుల్ గాంధీ ఉండబోయేది! -
ఏడేళ్ల ‘బడి ’కల.. 4 లక్షల మంది ఎదురు చూపు.. నోటిఫికేషన్ జాడేది?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇస్తుండటం నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ల్లో ఉత్తీర్ణులైన వారూ గంపెడాశలు పెట్టుకున్నారు. టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా వెలువడుతుందని భావించారు. కానీ కల నెరవేరకపోవడంతో, నోటిఫికేషన్ వెలువడే సూచనలు లేకపోవడంతో వారంతా నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2016 నుంచి ఇప్పటివరకు మూడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లు నిర్వహించింది. 2016, 2017ల్లో నిర్వహించిన టెట్లలో రెండు లక్షల మందికి పైగా ఉత్తీర్ణులయ్యారు. తాజాగా 2022 జూన్‌లో నిర్వహించిన టెట్‌లో మరో రెండు లక్షల మందికి పైగా ఉత్తీర్ణులయ్యారు. మూడు పరీక్షల్లో నాలుగు లక్షల మందికి పైగా అర్హత సాధించినా ఇప్పటివరకు ప్రయోజనం లేకుండా పోయింది. ఏడేళ్లుగా ఎదురుచూపులే మిగులుతున్నాయని టెట్ ఉత్తీర్ణులు వాపోతున్నారు. పదోన్నతులకు, నియామకాలకు ముడి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది ఓ అంచనా కాగా.. ప్రభుత్వం మాత్రం 12 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేస్తామని తెలిపింది. చాలా పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత వెంటాడుతోంది. పైగా గత ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టారు. కొన్ని పాఠశాలల్లో ఎస్జీటీలను ఉన్నత తరగతులకు పంపుతున్నారు. ఇందులో చాలామంది స్కూల్ అసిస్టెంట్లకు అర్హత ఉన్నా, పదోన్నతులు లేకపోవడంతో ఫలితం దక్కడం లేదు. పదోన్నతులు లేకపోవడంతో బదిలీలు జరగడం లేదు. ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు చేస్తే తప్ప కొత్త నియామకాలు చేపట్టలేమని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. కానీ ఈ ప్రక్రియ మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు హడావిడి చేసినా, కోర్టు వివాదాల కారణంగా వాయిదా పడింది. అయితే ఈ వివాదాల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులేయడం లేదనే విమర్శలున్నాయి. కోర్టు వివాదాలకు దారి తీసే రీతిలో విద్యాశాఖ వ్యవహరించడం వల్లే పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ముందుకెళ్ళడం లేదనే విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి బదిలీలు, ప్రమోషన్స్ పేరిట కాలయాపన చేయడం వల్ల ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో 4 లక్షల మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మేమంతా టీచర్ పోస్టులు వస్తాయని ఉన్న ఉద్యోగాలు మానేసి, పోటీ పరీక్షకు రూ.వేలు ఖర్చు పెట్టాం. అన్ని రకాల నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం, టీఆర్టీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదు. ప్రభుత్వం వెంటనే ఆర్థిక శాఖకు అనుమతివ్వాలి. – రావుల రామ్మోహన్ రెడ్డి (రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు) ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరత తీర్చాలి రాష్ట్రంలో 60 శాతానికి పైగా గెజిటెడ్ హెచ్ఎంలు, వేలాది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే విద్యాశాఖ ఎంత దారుణంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. కాలయాపన చేయకుండా తక్షణమే బదిలీలు, పదోన్నతుల వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్ళలో ఉపాధ్యాయుల కొరత తీర్చాలి. – ఎం చెన్నయ్య (పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు) వ్యయప్రయాసలకోర్చి శిక్షణ తీసుకుని.. బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసిన వారు ప్రభుత్వ టీచర్ పోస్టునే లక్ష్యంగా పెట్టుకుంటారు. అవకాశం వచ్చే వరకు ప్రైవేటు స్కూళ్ళలో టీచర్లుగా పనిచేస్తుంటారు. కొందరు ఇతర ఉద్యోగాలూ చేస్తుంటారు. టెట్ పరీక్ష నిర్వహించే కొన్ని నెలల ముందు వీరంతా తాము అంతకుముందు చేస్తున్న ఉద్యోగాలు వదిలేసి, వ్యయప్రయాసలకోర్చి కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటారు. ఇదే క్రమంలో గత ఏడాది జూన్‌లో నిర్వహించిన టెట్‌కు హాజరయ్యారు. గతానికి భిన్నంగా ఈసారి 6 లక్షల మంది వరకు పరీక్ష రాశారు. 1–5 తరగతులకు బోధించేందుకు డీఎడ్ అర్హతతో టెట్ పేపర్–1 రాస్తారు. గతంలో ఈ పరీక్ష రాయడానికి బీఈడీ చేసిన అభ్యర్థులు అర్హులు కారు. కానీ ఈసారి బీఈడీ అభ్యర్థులు పేపర్–2తోపాటు, పేపర్–1 రాసేందుకూ వీలు కల్పించారు. దీంతో అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పరీక్షలో ఏకంగా 2 లక్షల మందికి పైగా అర్హత సాధించడంతో మొత్తం అర్హుల సంఖ్య 4 లక్షలు దాటింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు మొదలవడంతో, తమకూ టీచర్ అయ్యే అవకాశం వస్తుందని వీరంతా ఎదురుచూశారు. -
సీఎం మమతా బెనర్జీ మేనల్లుడికి సుప్రీంకోర్టులో భారీ ఊరట..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. స్కూల్ రిక్రూట్మెంట్ స్కాంకు సంబంధించి ఆయనను సీబీఐ, ఈడీ ప్రశ్నించవచ్చంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 24కు వాయిదా వేసింది. దీంతో అప్పటివరకు దర్యాప్తు సంస్థలు ఆయనను ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. అలాగే బెంగాల్ పోలీసులు.. సీబీఐ, ఈడీ అధికారులపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా సీజేఐ జస్డిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్టే విధించింది. ఫలితంగా టీఎంసీ సర్కార్‌కు ఊరట లభించినట్లయింది. బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కాంకు సంబంధించి మాజీ మంత్రి పార్థ చటర్జీ, మాణిక్ భట్టాచార్యలను ఇదివరకే అరెస్టు చేసింది సీబీఐ. తాజాగా ఇవాళ మరో ఎమ్మెల్యే జీవన్ కృష్ణ సాహాను కూడా అదుపులోకి తీసుకుంది. అయితే ఈ స్కాంతో అభిషేక్ బెనర్జీకి కూడా సంబంధంముందని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయనను ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తోంది. చదవండి: కాంగ్రెస్ గూటికి మాజీ సీఎం.. బీజేపీపై కీలక వ్యాఖ్యలు.. -
ఆ నటి ఇంట్లోని నోట్ల కట్టలపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు!
కోల్‌కతా: ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ తనపై వచ్చిన ఆరోపణలను మరోమారు తోసిపుచ్చారు. తన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీ నివాసంలో దొరికిన డబ్బుల కట్టలు తనవి కావని పేర్కొన్నారు. తాను అరెస్టయిన తర్వాత కుట్ర జరిగిందని ఆరోపించారు. వైద్య పరీక్షల కోసం ఈఎస్ఐ ఆసుపత్రికి తీసుకెళ్లిన క్రమంలో మీడియాతో మాట్లాడారు పార్థా ఛటర్జీ. ‘సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి. ఆ డబ్బులు నావి కావు.’ అని పేర్కొన్నారు. టీచర్ నియామకాల్లో అవకతవకలపై మాజీ మంత్రి సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీ ఇళ్లల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. మూడు ఇళ్లల్లో సుమారు రూ.52 కోట్లు, విలువైన ఆభరణాలు, వస్తువులను స్వాధీనం చేసుకుంది. అనంతరం విచారించగా.. ఆ డబ్బంతా మంత్రిదేనని, తన ఇంట్లోని గదులను ఉపయోగించుకునే వారని ఈడీకి చెప్పారు. ఆ గదుల్లోకి తాను సైతం వెళ్లేందుకు అనుమతించేవారు కాదని పేర్కొన్నారు. ఇదీ చదవండి: పార్థా ఛటర్జీ ఇంట్లోకి దూరిన దొంగ.. ఈడీ రైడ్‌గా భావించిన స్థానికులు -
Teacher Eligibility Test: టెట్–2021 విధానం, సిలబస్ ఖరారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి అభ్యర్థులకు ముందుగా నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)–2021 పేపర్ల విధివిధానాలు, సిలబస్‌ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విడుదల చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సిలబస్‌ను ‘హెచ్‌టీటీపీఎస్://ఏపీటీఈటీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఐఎన్’లో అందుబాటులో ఉంచామని మంత్రి సురేష్ తెలిపారు. రాష్ట్రంలో టెట్ నిర్వహణపై ప్రభుత్వం మార్చి 17న జీవో 23 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. టెట్‌కు సంబంధించిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. టెట్‌లో రెండు పేపర్లు.. ► టెట్‌లో 2 పేపర్లు (పేపర్–1, పేపర్–2) ఉంటాయి. పేపర్ 1–ఏ, 1–బీ, 2–ఏ, 2–బీలుగా వీటిని నిర్వహిస్తారు. ► రెగ్యులర్ స్కూళ్లలో 1–5 తరగతుల టీచర్ పోస్టులకు పేపర్ 1–ఏలో అర్హత సాధించాలి. ► దివ్యాంగులు, ఇతర విభిన్న ప్రతిభావంతులు స్పెషల్ స్కూల్స్‌లో 1–5 తరగతులు బోధించాలంటే పేపర్ 1–బీలో అర్హత తప్పనిసరి. ► రెగ్యులర్ స్కూళ్లలో 6–8, ఆ పై తరగతులు బోధించాలంటే పేపర్ 2–ఏలో అర్హత సాధించాలి. అలాగే స్పెషల్ స్కూళ్లలో ఇవే తరగతులకు పేపర్ 2–బీలో అర్హత తప్పనిసరి. ఆయా పేపర్ల పరీక్ష విధానం ఇలా.. -
ఈ టీచర్లకు 30 శాతం పీఆర్సీ వర్తించదా?
సాక్షి, హైదరాబాద్: తాజా పీఆర్సీలో రాష్ట్రంలో 2017 టీఆర్టీ ద్వారా కొత్తగా నియమితులైన టీచర్లకు భారీ నష్టం వాటిల్లనుంది. కిందిస్థాయి పోస్టు లో ఉండి, ఎస్ఏ పోస్టులకు ఎంపికైన టీచర్లకు పే ప్రొటెక్షన్ లేకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లనుండగా, నియామకాల్లో జాప్యం కారణంగా కొత్త పీఆర్సీ ద్వారా లభించాల్సిన ప్రయోజనాలు ఎక్కు వ మందికి దక్కకుండాపోయే పరిస్థితి నెలకొంది. మొత్తంగా 8,792 మంది టీచర్లకు నష్టం వాటిల్లనుండటంతో వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరికి పే ప్రొటెక్షన్ లేక నష్టం రాష్ట్రంలో 2017 టీఆర్టీ ద్వారా ప్రభుత్వం 1,941 ఎస్ఏ పోస్టులను భర్తీ చేసింది. అందులో దాదాపు వెయ్యి పోస్టులకు ప్రస్తుతం స్కూళ్లలో ఎస్జీటీలుగా, భాషా పండితులుగా (ఎల్పీ) పని చేస్తున్నవారే ఎంపికయ్యారు. మిగతా పోస్టుల్లో కొత్తవారు ఎంపికయ్యారు. ఇలా ఎస్ఏ పోస్టులకు ఎంపికైన వారిలో కొందరికి పలు కారణాలతో 2019లో నియామక పత్రాలు అందజేయగా, మరికొందరికి 2020లో నియామక పత్రాలు అందజేశారు. ఇంకొందరికైతే 15 రోజుల కిందటే అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేశారు. వారిలో 95 శాతం మంది పంచాయతీరాజ్ టీచర్లే ఉన్నారు. అయితే వారికి ఇప్పుడు కొత్త పీఆర్సీ ప్రకారం స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలోని కనీస మూల వేతనంతోనే వేతనాలను చెల్లించనున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఏదేని ఉన్నత స్థాయి పోస్టుకు ఎంపికైనప్పుడు వారికి అంతకుముందు ఉద్యోగంలో వచ్చిన వేతనాన్ని కాపాడుతూ (పే ప్రొటెక్షన్ ఇస్తూ) ఉత్తర్వులిచ్చి కొత్త వేతనం ఖరారు చేస్తారు. అంతకుముందు వచ్చిన కనీస మూల వేతనానికి పీఆర్సీ అమలుతేదీ నాటికి ఉన్న డీఏ, ఫిట్‌మెంట్‌ను కలిపి కొత్త పోస్టులో కనీస మూల వేతనాన్ని ఖరారు చేస్తారు. కానీ ఇప్పుడు నియమితులైన పంచాయతీరాజ్ టీచర్లు, ఉద్యోగులకు ప్రభుత్వం పే ప్రొటెక్షన్ ఉత్తర్వులు జారీ చేయలేదు. వాస్తవానికి 2013 డిసెంబర్ తరువాత ప్రభుత్వం పే ప్రొటెక్షన్ ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో వారికి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా రూ.10 వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని, సర్వీస్ మొత్తం లెక్కిస్తే నష్టం లక్షల్లో ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. నియామకాల్లో ఆలస్యంతో ఎక్కువ మందికి... 2017 టీఆర్టీ ద్వారా ఎస్జీటీ, ఎల్పీ, ఎస్ఏ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ), ఫిజికల్ డైరెక్టర్లు (పీడీ)గా నియమితులైన 7,792 మంది టీచర్లకు తాజా పీఆర్సీలో ప్రకటించిన వేతన స్థిరీకరణలో కీలకమైన 30 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ అందని దుస్థితి ఏర్పడింది. ఎప్పుడో పూర్తి కావాల్సిన 2017 టీఆర్టీ నియామకాలను 2019 నుంచి 2021 వరకు సాగదీయడమే ఇందుకు కారణం. తాజా పీఆర్సీ ఇప్పుడు ప్రకటించినా 2018 జూలై 1 నుంచే అమల్లోకి రానుంది. కాబట్టి అప్పటివరకు సర్వీస్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు మాత్రమే 30 శాతం ఫిట్మెంట్ ప్రయోజనం కలుగుతుంది. ఆ తర్వాత నియామకమైన వారికి నియమితులైన రోజు నుంచి లెక్కించి తాజా పీఆర్సీలో మినిమమ్ బేసిక్‌తో వేతనం ఖరారు చేసి, కరెస్పాండింగ్ పేస్కేల్ ఇస్తారు. ఒకవేళ వారు అంతకుముందే నియమితులై ఉంటే వారికి అప్పుడు ఉన్న ఇంక్రిమెంట్‌తో కూడిన మూల వేతనంపై 30.392 శాతం డీఏ, 30 శాతం ఫిట్మెంట్ వచ్చేది. కానీ వారు 2018 జూలై 1 నాటికి నియమితులు కాలేదు కాబట్టి ఇప్పుడు వారికి 30 శాతం ఫిట్మెంట్ వర్తించదు. పైగా ఇప్పుడు రూపొందించిన మాస్టర్ స్కేల్ ప్రస్తుతం ఉన్న 30 శాతం ఫిట్మెంట్తో కాకుండా 15 శాతం ఫిట్మెంట్తోనే రూపొందించినందున వారికి రెండు రకాలుగా కలిపి నెలకు ఐదారు వేల రూపాయల నష్టం వాటిల్లుతుందని సంఘాల నేతలు పేర్కొంటున్నారు. టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ–2017) ద్వారా నియమితులైన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)కు తాజా పీఆర్సీతో ఇప్పుడు రూ.31,040 కనీస మూల వేతనం రానుంది. అదే టీచర్ 2018 జూలై 1కి ముందు నియమితులై ఉంటే పాత స్కేల్‌పై 30 శాతం ఫిట్మెంట్ కలసి రూ.34,690 కనీస మూల వేతనం వచ్చేది. అలాగే అదే టీఆర్టీ ద్వారా స్కూల్ అసిస్టెంట్‌గా (ఎస్ఏ) నియమితులైన వారికి ఇప్పుడు రూ.42,300 కనీస మూల వేతనం రానుంది. ఈ టీచర్ కూడా ముందే నియమితులై ఉంటే 30 శాతం ఫిట్మెంట్ కలసి రూ.47,240 వచ్చేది. 2017 టీఆర్టీ అయినప్పటికీ నియామకాల్లో ఆలస్యం కావడం వల్ల ఫిట్మెంట్ వర్తించకపోవడంతో ఒక్కో టీచర్ నెలకు నాలుగైదు వేలు నష్టపోనున్నారు. ఒక అభ్యర్థి 2008లో ఎస్జీటీగా ఎంపికయ్యారు. 2018 జూలై 1నాటికి ఆయన కనీస మూల వేతనం రూ. 31,460. ఆయన 2017 టీఆర్టీ ద్వారా ఎస్‌ఏగా ఎంపికయ్యారు. ఆయనకు ఇప్పుడు ఎస్ఏ పోస్టులో రూ.42,300 కనీస మూల వేతనం రానుంది. అయితే పే ప్రొటెక్షన్ ఉంటే 2018 జూలై 1 నాటికి ఉన్న కనీస మూల వేతనంపై 30.392 కరువు భత్యం (డీఏ), 30 శాతం ఫిట్మెంట్ కలిపి రూ.51,320 కనీస మూల వేతనంగా వచ్చేది. అది లేకపోవడం వల్ల ఇంక్రిమెంటు కలుపుకొని నెలకు రూ.10 వేల వరకు నష్టం వాటిల్లనుంది. న్యాయం చేయాల్సిందే టీఆర్టీ–2017లో భాగంగా రాత పరీక్ష, ఇతరత్రా నియామకాల ప్రక్రియ 2018 జూలై 1 నాటికి పూర్తయ్యింది. అయితే పోస్టింగ్‌లు ఇవ్వడంలో ఆలస్యం అయ్యింది. అందువల్ల వారికి 30 శాతం ఫిట్‌మెంట్‌ను వర్తింపజేసి న్యాయం చేయాలి. అలాగే పైస్థాయి పోస్టులకు ఎంపికైన టీచర్ల కోసం పే ప్రొటెక్షన్ ఉత్తర్వులు జారీ చేయాలి. లేకపోతే వారు తీవ్రంగా నష్టపోతారు. – మానేటి ప్రతాప్‌రెడ్డి,టీఆర్టీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చదవండి: ఉచిత నీటి పథకానికి తిప్పలెన్నో.. -
కొలిక్కి వస్తున్న లెక్కలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై లెక్క దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. ఈ లెక్కల కోసం గత మూడు రోజులుగా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, అధిపతులతో భేటీ అయి ఖాళీల వివరాలను సేకరించారు. దాదాపు 50 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించిన నేపథ్యంలో సీఎస్ సోమేశ్‌కుమార్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ సమావేశాలు జరిగాయి. గురు, శుక్ర, శనివారాల్లో జరిగిన ఈ సమావేశాల్లో భాగంగా కొన్ని శాఖల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం రాలేదని, దాదాపు 40 వేలకుపైగా పోస్టుల లెక్క తేలిందని తెలుస్తోంది. మిగిలిన శాఖల నుంచి పూర్తి స్థాయిలో లెక్కలు వస్తే ఆ సంఖ్య 50 వేలు దాటుతుందని అంచనా. కాగా, వివిధ శాఖల్లోని ఖాళీ పోస్టులను ప్రాధాన్యతల వారీగా భర్తీ చేయాలని, అన్నీ ఒకేసారి కాకుండా అత్యవసర ఖాళీలను ముందు భర్తీ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శాఖల వారీగా వచ్చే ఖాళీల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను త్వరలోనే జీఏడీ అధికారులు సీఎం కేసీఆర్‌కు సమర్పించనున్నారు. ఈ నివేదిక ప్రకారం వారం రోజుల్లో సమీక్షించనున్న సీఎం కేసీఆర్.. ఉద్యోగ ఖాళీల విషయంలో అనుసరించాల్సిన విధానంపై తుది నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, మరికొన్ని శాఖలకు సంబంధించిన కసరత్తు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. పాఠశాల విద్యకు సంబంధించిన లెక్కలు సోమ, మంగళ వారాల్లో జీఏడీ, ఆర్థిక శాఖలకు అందించనున్నట్లు సమాచారం. ఈ సమాచారం మేరకు టీచర్ పోస్టుల ఖాళీలపై ఓ స్పష్టత రానుంది. -
తెలంగాణలో కొలువుల జాతర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొలువుల జాతర మొదలవనుంది. పోలీస్ శాఖ, విద్యా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సీఎం నిర్ణయంతో దాదాపు 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వ్యవసాయేతర ఆస్తులు–వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అనుసరించాల్సిన పద్ధతులపై ఆయన ఆదివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త చెప్పారు. (చదవండి: ఇదేం పనయ్యా.. కానిస్టేబుల్!) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నంటినీ భర్తి చేయాలి. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలి. ఇంకా ఏఏ శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలి. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. (చదవండి: 14 నెలల తర్వాత ప్రధానిని కలిసిన సీఎం) -
అదరగొట్టిన అక్కాచెల్లెళ్లు
సాక్షి, ఆదిలాబాద్: కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమిలేదని నిరూపించారు అక్కాచెల్లెళ్లు.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ కొలువు రావడమే గగనం. కాని గిరిజన కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు ప్రభుత్వ కొలువులు సాధించారు. ఇటీవల టీఎస్పీఎస్పీ విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (హెచ్‌డబ్ల్యూవో) ఫలితాల్లో వీరు ఉద్యోగాలు పొందారు. ఆదిలాబాద్ పట్టణంలోని టైలర్స్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రభుత్వ రిటైర్డ్ టీచర్ గేడాం బాబారావు– శశికళ దంపతుల కుమార్తెలు గేడాం స్వప్న, గేడాం ప్రియలు మొదటి ప్రయత్నంలోనే సత్తాచాటారు. గతేడాది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల కావడంతో పరీక్ష రాసి ప్రతిభ కనబరిచారు. బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెండు ఉద్యోగాలకు ఎంపిక కాగా, ట్రైబల్ వెల్ఫేర్‌ను ఎంచుకున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతోనే ఉద్యోగాన్ని సాధించినట్లు తెలిపారు. ఎంఎస్సీ, బీఎడ్, సెట్ విద్యార్హత ఉన్న గేడం స్వప్న హెచ్‌డబ్ల్యూవో పోటీ పరీక్ష రాసిన అనంతరం ఆదిలాబాద్ పట్టణంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో ఇదివరకే గెస్ట్ లెక్చరర్‌గా పనిచేశారు. అలాగే బీఎస్సీ, బీఎడ్ చేసిన గేడాం ప్రియ ఇటీవల పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించినప్పటికీ ఉద్యోగంలో చేరలేదు. మొదటి ప్రయత్నంలోనే ప్రభుత్వ కొలువు సాధించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు అభినందించారు. -
ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్), పీఈటీ ఫలితాలు ప్రకటించాలంటూ అభ్యర్థులు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. బుధవారం ప్రగతి భవన్‌ను ముట్టడించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్టీ, పీఈటీ ఫలితాల జాబితాను ప్రకటించి పోస్టింగులు ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో బేగంపేట పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆందోళన చేస్తున్న అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక 2017లో తెలంగాణ ప్రభుత్వం టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయగా ఇప్పటికీ నియామక ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో అభ్యర్థులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. -
పాఠశాలలకు కొత్త ఉపాధ్యాయులు
సాక్షి, జిన్నారం(పటాన్చెరు): ఎట్టకేలకు కొన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 192 మంది ఉపాధ్యాయుల నియామకం పూర్తయింది. నియామక పత్రాలను జిల్లా ఉన్నతాధికారులు ఉపాధ్యాయులకు అందించారు. దీంతో నూతనంగా ఎన్నికైన ఉపాధ్యాయులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడంతోపాటు వారికి అన్ని రకాల విద్యాబుద్ధులు చెబుతామని నూతన ఉపాధ్యాయులు అంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా 1,285 ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా వీరిలో 876మంది ఎస్జీటీలు ఉన్నారు. ఎస్టీజీ పోస్టులకు సంబంధించిన ప్రక్రియ కోర్టులో ఉన్నందున వారి నియామకాలను ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టడం లేదు. దీంతో ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలు, లాంగ్వేజ్ పండిట్ల పోస్టులను మాత్రమే భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్, వ్యాయామ ఉపాధ్యాయులకు సంబంధించి 263 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 263 పోస్టుల్లో 55 పోస్టులు వివిధ కారణాలతో నిలిపేశారు. ప్రస్తుతం 208 పోస్టులను జిల్లా వ్యాప్తంగా అధికారులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ నెల 12న సంగారెడ్డిలోని జెడ్పీ హాలులో డీఈఓ విజయలక్ష్మి ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలించారు. 192 మంది ఉపాధ్యాయులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. ఆదివారం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 192మంది ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించి నియామక పత్రాలను అందించారు. జేసీ నిఖిల, డీఈఓ విజయలక్ష్మిల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా పోస్టులను భర్తీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, మనూర్, మునిపల్లి, ఝరాసంఘం, రేగోడ్, టేక్మాల్, కంగ్టి, న్యాల్కల్, హత్నూర, చిలప్‌చెడ్, కోహిర్, రాయికోడ్, సదాశివపేట, కౌడిపల్లి, అల్లాదుర్గం, వెల్దుర్తి, వట్పల్లి తదితర మండలాల్లో ఎక్కువ పోస్టుల ఖాళీలను అధికారులు చూపించారు. ఈ ప్రాంతాల్లో గత పదేళ్ల నుంచి సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో వీటిని భర్తీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఏదిఏమైనా నూతన ఉపాధ్యాయులు నేటి నుంచి ప్రభుత్వ బడుల్లోకి అడుగు పెడుతున్న సందర్భంగా వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏడేళ్ల నుంచి వారు కన్న కలలు సాకారం అవుతుండడంతో నూతన ఉపాధ్యాయుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చాలా సంతోషంగా ఉంది నేను టీఆర్టీలో ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. నాన్న, మామలు ప్రభుత్వ ఉపాధ్యాయులు కావడంతో నేను కూడా ఉపాధ్యాయురాలిని కావాలనే లక్ష్యంతో చదివాను. నేటి నుంచి నా కల నెరవేరబోతోంది. ఇది చాలా సంతోషం కలిగిస్తోంది. చదువు విషయంలో నా కుటుంబ సభ్యులు చాలా సహకరించారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు నా వంతు కృషి చేస్తా. – స్వప్న, జిన్నారం, లాంగ్వేజి పండిట్, తెలుగు లక్ష్యం నెరవేరింది ఉపాధ్యాయురాలిని కావాలనే నా లక్ష్యం నెరవేరింది. టీఆర్టీలో సెలక్ట్ కావ డంతో చాలా సంతోషంగా ఉంది. పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి వారిని ప్రయోజకులుగా చేసేలా ముందుకెళ్తా. కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరి సహకారంతోనే నా కల నెరవేరింది. – శశికళ, సంగారెడ్డి -
సర్దుబాటా.. సౌకర్యంబాటా..?
సాక్షి, కరీంనగర్: టీచర్ల సర్దుబాటు ప్రక్రియ వ్యవహారం జిల్లాలో గందరగోళంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా, ఇష్టారాజ్యంగా సర్దుబాటు ప్రక్రియ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్దుబాటు జరిగిన టీచర్లంతా తమకు అన్యాయం జరిగిందంటూ డీఈవో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. కొంత మంది అర్జీలు సమర్పిస్తున్నారు. మరికొంత మంది చోటామోటా నాయకులతో సర్దుబాటును రద్దు చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాల నుంచి విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు 114 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారనే నెపంతో ఆయా పాఠశాలలకు సర్దుబాటు చేసిన ప్రక్రియపై ఉపాధ్యాయ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. సర్దుబాటులో జరిగిన టీచర్ల వ్యవహరంపై మచ్చుకు కొన్ని ఉదాహరణలు.. చిగురుమామిడి మండలంలో ప్రాథమిక పాఠశాల సుందరగిరి నుంచి ఒక టీచర్‌ను బొల్లోనిపల్లి ప్రాథమిక పాఠశాలకు డిప్యూటేషన్ పెట్టారు. తిరిగి అదే సుందరగిరి ప్రాథమిక పాఠశాలకు లాలయ్యపల్లె ప్రాథమిక పాఠశాల నుంచి టీచర్‌ను డిప్యూటేషన్ పెట్టారు. నిబంధనలు పాటించారా, ఏమైనా కొత్త నిబంధనలు వచ్చాయా అంటే అదేమిలేదు. విద్యార్థులు తక్కువ ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటే విద్యార్థులు ఎక్కువ ఉండి ఉపాధ్యాయులు తక్కువ ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయాలి. పై సర్దుబాటు విషయంలో మండల విద్యాధికారి నిబంధనలు పాటించకుండా పై అధికారులకు తప్పుడుగా పంపించడం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కూడా చూసీచూడనట్లుగా ఉత్తర్వులు జారీ చేయడం ఇంకా ఈ ఉత్తర్వులను కలెక్టర్ ఆమోదం పొందడం విడ్డూరంగా ఉంది. అధికారులు ఇలాంటి తప్పిదాలను వెంటనే సరి చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. టీచర్స్ సర్దుబాటు జాబితా పరిశీలిస్తే చాలా పొరపాట్లు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. గంగాధర మండలంలో ప్రాథమికోన్నత పాఠశాల కొండన్నపల్లి నుంచి ఒక టీచరు అవసరం లేకున్నా కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గంగాధరకు ఉపనియుక్తం చేశారు. మండలంలో చాలా ప్రాథమిక పాఠశాలలకు ఎస్జీటీలు అవసరం ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేయడమేమిటని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రామడుగు మండలంలో ప్రాథమిక పాఠశాల చిప్పకుర్తి నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామడుగుకు ఎస్జీటీ టీచరును డిప్యూటేషన్ చేశారు. ఉన్నత పాఠశాల రామడుగులో అన్ని పోస్టులు ఉన్నాయి. కేవలం హెడ్మాస్టర్ పోస్టు మాత్రమే ఖాళీగా ఉన్నది. మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉన్న స్థానంలో ఒక టీచర్‌ను అదనంగా ఇచ్చినట్లయితే జిల్లా అంతటా కూడా హెడ్మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నచోట ఒక టీచర్‌ను సర్దుబాటులో ఎందుకు ఇవ్వలేదు. టీచర్ల సర్దుబాటు విషయంలో మండల విద్యాధికారులు జిల్లా విద్యాధికారికి సరైన వివరాలు అందించలేదు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎక్కువగా ఉన్న పోస్టులను గుర్తించక సర్దుబాటు వివరాలు పంపారు. రామడుగు మండలం తిర్మలాపూర్ నుంచి ఒక స్కూల్ అసిస్టెంట్‌ను జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్ హైస్కూల్లో సర్దుబాటు చేశారు. అదే మండలంలోని తిర్మలాపూర్ హైస్కూల్ నుంచి ఒక ఉపాధ్యాయుడిని చిగురుమామిడి మండలం రామంచకు సర్దుబాటు చేయడంపై కూడా అనుమానాలు తావిస్తున్నాయి. మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లిలో 400 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారు. అక్కడే పనిచేసే తెలుగు పండిట్ ఉపాధ్యాయుడిని మానకొండూర్ మండల కేంద్రంలోని హైస్కూల్లో ముగ్గురు తెలుగు పండిట్లు ఉన్నా మరో తెలుగు పండిట్‌ను సర్దుబాటు చేయడంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు నివ్వెరపోతున్నారు. ఒక హైస్కూల్లో రెండు మీడియంలో నడుస్తున్నప్పటికీ అక్కడ ఒకే సబ్జెక్టుకు సంబంధించిన టీచర్లు ముగ్గురు, నలుగురు ఉన్న సందర్భంలో వారిని సర్దుబాటు చేయడాన్ని అధికారులు విస్మరించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ గందరగోళంగా జరిగింది. -
యథావిధిగా టీఆర్టీ
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)లు యథావిధిగా జరుగుతాయని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మొద్దని చెప్పారు. ఈ నెల 24 నుంచి జరగనున్న పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డేటా ప్రాసెస్‌లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిబ్బంది(సీజీజీ) చేసిన పొరపాట్ల వల్ల పరీక్ష కేంద్రాల కేటాయింపులో తప్పులు దొర్లాయని, వాటిని మార్చామని చెప్పారు. రాత పరీక్షలకు (ఆఫ్‌లైన్) సంబంధించి పరీక్ష కేంద్రాల ను ఏ జిల్లా అభ్యర్థికి ఆ జిల్లాలోనే కేటాయించామని, సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్(మ్యాథ్స్, బయోలాజికల్ సైన్స్) పోస్టులకు ఆఫ్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నిబంధనల ప్రకారం పరీక్ష కేంద్రాలను ఎక్కడైనా కేటాయించే అధికారం టీఎస్పీఎస్సీకి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం గా పేర్కొన్నా.. అభ్యర్థులకు అసౌకర్యం కలగకూడదని మార్పులు చేసినట్లు చెప్పారు. 25 నాటి పరీక్షల హాల్‌టికెట్లు నేడు.. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్షలకు హెచ్ఎండీఏ సహా కరీంనగర్, వరంగల్, నల్ల గొండ, ఖమ్మం జిల్లాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశామని చక్రపాణి తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ అభ్యర్థులకు హైదరాబాద్ తదితర జిల్లాల్లో కేటాయించామని చెప్పారు. కరీంనగర్లో ఆన్లైన్ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో కొందరికి ఇతర జిల్లాల్లో కేంద్రాలు కేటాయించామన్నారు. 48 రకాల సబ్జెక్టులు, మీడియం పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని వివరించారు. 24న జరిగే పరీక్షల హాల్‌టికెట్ల జారీని బుధవారం ప్రారంభించామని, 25 నాటి పరీక్షలకు హాల్‌టికెట్లు గురువారం అందుబాటులో ఉంచుతామని, ఇలా మార్చి 4వ తేదీ వరకు జరిగే పరీక్షల హాల్‌టికెట్లను వరుసగా వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. టీఆర్టీ తర్వాత ‘గురుకుల లెక్చరర్’ గురుకుల టీజీటీ పోస్టుల పరీక్ష ఫలితాలు త్వరలోనే ప్రకటిస్తామని చక్రపాణి వెల్లడించారు. పీజీటీ పోస్టులు పొందిన వారు కొందరు టీజీటీ పోస్టుల ఎంపిక జాబితాలోనూ ఉన్నారని, అందులో టీజీటీ పోస్టు వద్దనుకునే వారి అభిప్రాయాలు తీసుకొని తరువాతి మెరిట్ అభ్యర్థుల ఎంపిక చేపట్టామన్నారు. నెల రోజుల్లో పోస్టింగులు ఇస్తామని చెప్పారు. గురుకుల లెక్చరర్ పోస్టుల మెయిన్ పరీక్షలకు 1:15 రేషియోలో సీజీజీ ఎంపిక చేసిన జాబితాలో పొరపాట్లు దొర్లినందున ఈ నెల 19 నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశామన్నారు. టీఆర్టీ పరీక్షలు పూర్తయ్యాక వాటికి మెయిన్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు టీఎస్పీఎస్సీ, పరీక్షలపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని టీఎస్పీఎస్సీ సభ్యుడు సి.విఠల్ హెచ్చరించారు. నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్న వారిని ఇప్పటికే గుర్తించామని, తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకునే అధికారం కమిషన్‌కు ఉందని చెప్పారు. గతంలో నిజామాబాద్‌లోని ఓ కాలేజీలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయకపోయినా అక్కడ పరీక్ష కేంద్రం ఉందని, అక్కడ పరీక్ష రాసిన 150 మందిని ఎంపిక చేశారని తప్పుడు ప్రచారం చేశారని, అలా ప్రచారం చేసిందెవరో గుర్తించామని వివరించారు. టీఎస్పీఎస్సీని అభాసుపాలు చేసేలా తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించండి హాల్టికెట్లలో పొరపాట్లు ఉంటే స్వయంగా లేదా ఫోన్ ద్వారా టీఆర్టీ హెల్ప్ డెస్క్‌ను సంప్రదించాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ తెలిపారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు హెల్ప్‌డెస్క్ పని చేస్తుందని చెప్పారు. రెండు రకాల సబ్జెక్టులు మినహా మిగతా 46 రకాల సబ్జెక్టులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నందున మాక్ టెస్టు లింకును వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రతి ప్రశ్నకు సరైన జవాబు ఎంపిక చేసుకొని టిక్ చేశాక జవాబు పక్కన ఉండే సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలని, అప్పుడే జవాబు రాసినట్లు ధ్రువీకరణ అవుతుందని వివరించారు. టీఆర్టీ పీఈటీ ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లోనూ ఇవ్వండి టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశం ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)ల్లో పీఈటీ పోస్టులకు హాజరయ్యే అభ్యర్థులకు తెలుగుతో పాటు ఇంగ్లిష్‌లోనూ ప్రశ్నపత్రం ఇవ్వాలని టీఎస్పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఆదేశాలు జారీ చేశారు. పీఈటీ కోర్సు ఇంగ్లిష్‌లోనే ఉంటుందని, తెలుగులోనే ప్రశ్నపత్రం ఇస్తే అభ్యర్థులు నష్టపోతారంటూ నల్లగొండ జిల్లాకు చెందిన కె.వెంకటరమణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. గతంలో రెండు భాషల్లోనూ పరీక్షను నిర్వహించారని పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రమేశ్ హైకోర్టుకు తెలపటంతో న్యాయమూర్తి పైవిధంగా ఆదేశాలిచ్చారు. -
ఒకే పరీక్ష!
-
ఒకే పరీక్ష!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఒకే పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయానికి వచ్చింది. గురుకుల పోస్టుల తరహాలో ప్రిలిమ్స్, మెయిన్స్ విధానం కాకుండా గతంలో డీఎస్సీ నిర్వహించిన విధంగానే ప్రతి సబ్జెక్టుకూ ఒకే పరీక్ష చొప్పున నిర్వహించాలని నిర్ణయించింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన గురువారం కమిషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరీక్ష విధానంపై సమగ్రంగా చర్చించారు. పరీక్ష విధానాన్ని ఖరారు చేసే బాధ్యత ప్రభుత్వం టీఎస్పీఎస్సీకే ఇచ్చిన నేపథ్యంలో.. పాత పద్ధతిలోనే ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఇవ్వనుంది. ప్రస్తుతం పాఠశాలల్లో బోధిస్తున్న పాఠ్యాంశాల ఆధారంగా ఆయా సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్‌ను ఖరారు చేయనుంది. ఈ బాధ్యతను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలికి (ఎస్సీఈఆర్టీ) అప్పగించింది. ఎస్సీఈఆర్టీ ఇచ్చే సిలబస్ ప్రకారమే పరీక్షలను నిర్వహించనుంది. అన్ని జిల్లాల్లో పోస్టులు ఉండేలా కసరత్తు విద్యా శాఖ పాత పది జిల్లాల ప్రకారం పోస్టులను గతంలో ఖరారు చేసింది. అయితే ఇపుడు 31 జిల్లాల ప్రకారం పోస్టులను ఇవ్వాల్సి ఉంది. ప్రాథమికంగా 31 జిల్లాల ప్రకారం కూడా పోస్టులు ఇచ్చినప్పటికీ వాటిలో కొన్ని మార్పులు అవసరమని విద్యా శాఖ భావించింది. కొత్త జిల్లాల ప్రకారం చూస్తే కొన్ని జిలాల్లో టీచర్ పోస్టుల్లేవు. నోటిఫికేషన్ జారీ చేస్తే పోస్టులు లేని జిల్లాల్లోని అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా జిల్లాల్లో కూడా పోస్టులను ఇచ్చేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. 8,792 పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, మరో 2,500కు పైగా పోస్టులు పెరిగే అవకాశం ఉంది. పోస్టులు లేని జిల్లాల్లో 2018 వరకు రిటైర్మెంట్ ద్వారా ఏర్పడే ఖాళీలను కూడా భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఆ ప్రకారం లెక్కలను ఖరారు చేసే పనిలో పడింది. అయితే వాటిని ఈ నోటిఫికేషన్ పరిధిలోకే తెస్తారా, తర్వాత సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేస్తారా, అన్నది నాలుగైదు రోజుల్లో తేలనుంది. మొత్తానికి పోస్టుల సంఖ్య 8,792 కాకుండా 11,500 దాటే అవకాశం ఉంది. ఈ అదనపు పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు పొందాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని విద్యా శాఖ టీఎస్పీఎస్సీకి తెలియజేసింది. కొత్త జిల్లాలు.. కొత్త రోస్టర్ మరోవైపు కొత్తగా ఏర్పడిన 31 జిల్లాల ప్రకారమే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టనున్న నేపథ్యంలో కొత్త రోస్టర్ విధానాన్ని అనుసరించేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. పాత పది జిల్లాలకు సంబంధించిన రోస్టర్ కొత్త జిల్లాల్లో వర్తింపజేయడం సాధ్యం కానుక కొత్తగా రోస్టర్ విధానాన్ని అమలు చేయనుంది. అయితే ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో మాత్రం వారి పాత రోస్టర్ విధానాన్ని కొనసాగించనుంది. గతంలో ఏ రోస్టర్ పాయింట్ వద్ద ఆగిపోయిందో.. ఆ తర్వాత పాయింట్ నుంచి ప్రస్తుత రోస్టర్‌ను కొనసాగించే అవకాశం ఉంది. 23వ తేదీలోగా నోటిఫికేషన్! ఇక పరీక్షను పాత పద్ధతిలోనే చేపట్టాలని నిర్ణయించినందున గతంలో జారీ చేసిన జీవోలను అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరాలని విద్యా శాఖ నిర్ణయించింది. మొత్తానికి నోటిఫికేషన్ జారీ సహా ఈ ప్రక్రియ అంతా ఈనెల 23వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిషన్ సభ్యులతోపాటు విద్యా శాఖ అదనపు డైరెక్టర్ పీవీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీ రద్దు.. సర్వీస్ కమిషనే దిక్కు!
ఉపాధ్యాయుల నియామకం తీరుతెన్నులు ఒక్కసారిగా మారిపోనున్నాయి. ఇన్నాళ్లూ జిల్లా సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా చేపట్టిన టీచర్ల నియామక పద్ధతికి తెలంగాణ సర్కారు చరమగతం పాడింది. ఆ స్థానంలో.. ఉపాధ్యాయులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మాత్రమే నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య ఉత్తర్వులను జారీచేశారు. ప్రత్యక్ష నియామకాలను రద్దుచేసి, వాటిని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పగించడానికి ఎంతవరకు వీలవుతుందో పరిశీలించాలని జీఏడీని కోరిన మేరకు.. తెలంగాణ పాఠశాల విద్య డైరెక్టర్ పరిధిలో ఉన్న అన్ని రకాల టీచర్ పోస్టులను ప్రత్యక్ష నియామక పద్ధతి నుంచి తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో స్కూలు అసిస్టెంట్లు, భాషా పండితులు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, పీఈటీలను ఇన్నాళ్లుగా డీఎస్సీల ద్వారా నియమిస్తుండగా.. ఇకపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా మాత్రమే నియమిస్తారు. ఏకరూపత, స్థిరత్వం, సరైన ఎంపిక పద్ధతుల కోసం ఇలా చేసినట్లు బుధవారం విడుదల చేసిన జీవో నెం. 19లో పేర్కొన్నారు. పాఠశాల విద్య డైరెక్టర్ నియంత్రణలో ఉన్న మోడల్ స్కూళ్లలో ఉన్న ప్రిన్సిపాళ్లు, పీజీ టీచర్లు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల పోస్టులను కూడా టీఎస్పీఎస్సీ ద్వారానే నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి, పాఠశాల విద్య డైరెక్టర్ తదితరులు తగు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులలో తెలిపారు. -
ప్రతి నియోజకవర్గంలో రెండేసి గురుకులాలు!
* ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ జనాభా ప్రాతిపదికన స్కూళ్ల ఏర్పాటు * అన్ని గురుకులాలకు ఒకే సర్వీసు రూల్స్, విద్యా విధానం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కనీసం రెండేసి సంక్షేమ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏ ప్రాంతంలో ఏ వర్గం ఎక్కువగా ఉంటే తదనుగుణంగా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకు అవసరమైన ఆయా వర్గాల జనాభా వివరాలను మండలాల వారీగా సరి చూసుకుని, వారి జనాభాకు తగ్గట్లుగా ఇంగ్లిష్ మీడియంలో ఈ పాఠశాలలను ప్రారంభిస్తారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది ఏర్పాటు చేయబోయే మొత్తం 221 గురుకుల (100 ఎస్సీ, 71 మైనారిటీ, 50 ఎస్టీ గురుకులాలు) పాఠశాలల్లో ఒకే రకమైన విధానాన్ని అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాల్లో ఆయా సొసైటీ గైడ్లైన్లు విడివిడిగా ఉండడంతోపాటు టీచర్ల నియామకానికి సంబంధించిన నియమ, నిబంధనలు, సర్వీసు రూల్స్ కూడా వేర్వేరుగా ఉన్నాయి. ప్రస్తుతం చేపట్టబోయే టీచర్ల రిక్రూట్మెంట్కు ఒకే విధానం, సర్వీస్‌రూల్స్‌ను పెట్టాలని మంగళవారం ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. అన్ని గురుకులాల్లో ఒకే విధంగా టీచర్ల నియామకానికి బీఈడీని అర్హతగా తీసుకోనున్నారు. వచ్చే జూన్ చివరికల్లా జనాభాప్రాతిపదికన 221 ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల్లో 5, 6 తరగతులను ప్రారంభించేందుకు ఆయా సంక్షేమ శాఖలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ఈ స్కూళ్లలోనే జూనియర్ కాలేజీల నిర్వహణకు ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. బాలికల కోసం 25, బాలుర కోసం 5 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయనున్నాయి. ఈ గురుకులాల శాశ్వత భవనాల నిర్మాణం కోసం ఏడాది సమయం పట్టనున్నందున, అప్పటివరకు అందుబాటులో ఉన్న వివిధ శాఖల ప్రభుత్వ భవనాలు, అద్దెభవనాల్లో గురుకులాలను ప్రారంభించనున్నారు. -
డీఎస్సీతోపాటే టెట్?
- దీనిపై డీఎస్సీ నోటిఫికేషన్ సమయంలో స్పష్టత ఇస్తాం - జనవరి లేదా ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ - రాష్ట్రవ్యాప్తంగా 7,491 మంది విద్యా వలంటీర్ల నియామకం - ఈనెల 5 వరకు స్కూళ్లలో చేరేందుకు గడువు పెంపు - సుప్రీం తీర్పు మేరకు ఏకీకత సర్వీసు రూల్స్‌పై నిర్ణయం - డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జనవరి లేదా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. గురువారం సచివాలయంలో కడియం విలేకరులతో మాట్లాడుతూ జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి స్కూళ్లలో కొత్త టీచర్లు ఉండేలా చూస్తామన్నారు. అయితే డీఎస్సీ, టెట్‌ను వేర్వేరుగా నిర్వహించాలా లేక కలిపి చేపట్టాలా అనే దానిపై డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేప్పుడు స్పష్టత ఇస్తామని, దానికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించాల్సి ఉందని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల తరువాత విద్యార్థుల సంఖ్యనుబట్టి అవసరమైన ఖాళీలపై స్పష్టత వచ్చిందని..అందుకే 7,994 విద్యా వలంటీర్ల భర్తీకి ఆమోదించినా అవసరాలను బట్టి 7,759 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. దాదాపు 59 వేల మంది దరఖాస్తు చేసుకోగా అర్హతలు, రోస్టర్, రిజర్వేషన్లు, మెరిట్‌ను (ఇంటర్, డిగ్రీ, ఉపాధ్యాయ కోర్సు, టెట్ మార్కుల వెయిటేజీ ప్రకారం) బట్టి అభ్యర్థులను ఆన్లైన్ పద్ధతిలో జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఎంపిక చేసినట్లు కడియం తెలిపారు. మండలాల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలను గత నెల 18న ఎంఈవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామన్నారు. వాటిపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించామన్నారు. 21న తుది ఎంపిక జాబితాలను ప్రకటించి 23లోగా స్కూళ్లలో చేరాలని సూచించామన్నారు. అయితే జిల్లా కలె క ్టర్ల విజ్ఞప్తి మేరకు ఆ గడువును ఈ నెల 5 వరకు పొడిగించినట్లు కడియం చెప్పారు. నోటిఫై చేసిన 7,759 పోస్టుల్లో 7,491 పోస్టులను భర్తీ చేయగా ఇప్పటివరకు 6,488 మంది విధుల్లో చేరారని, మిగిలినవారు ఈ నెల 5లోగా విధుల్లో చేరాల్సి ఉందన్నారు. ఈ నియామకాలపై ఇంకా అభ్యంతరాలుంటే ఆధారాలతో పాఠశాల విద్యా డెరైరక్టర్కు ఫిర్యాదు చేయవచ్చని కడియం సూచించారు. విద్యా వలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ. 5 వేల నుంచి తమ ప్రభుత్వం రూ. 8 వేలకు పెంచినట్లు కడియం తెలిపారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి తదితర కొన్ని జిల్లాల్లోని స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో అదనంగా విద్యావలంటీర్లు కావాలని జిల్లా కలెక్టర్లు కోరారన్నారు. ఈనెల 5న చివరి జాయినింగ్ తరువాత ఆ నియామకాలపై దృష్టిపెడతామన్నారు. ఏకీకృత సర్వీసు రూల్స్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు పూర్తిస్థాయి కాపీ అందలేదని, కోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. -
ఈ ఏడాది డీఎస్సీ లేదు
స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నిర్వహించబోమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. సెకండరీ గ్రేడ్ టీచర్లు చాలా జిల్లాల్లో అవసరానికి మించి ఉన్నారని, కొన్ని జిల్లాల్లో మాత్రం స్వల్పంగా అవసరం ఉందని చెప్పారు. మరికొన్ని జిల్లాల్లో ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ల అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో అవసరమైతే అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు లేదా విద్యా వలంటీర్లను నియమిస్తామని వివరించారు. బుధవారం సచివాలయంలో పాఠశాల విద్యాశాఖపై సమీక్ష అనంతరం కడియం శ్రీహరి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగులంతా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారని, నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు కడియంపై పైవిధంగా స్పందించారు. ప్రస్తుతం తల్లిదండ్రులు ఇంగ్లిషు మీడియం వైపు మొగ్గు చూపుతున్నారని, అందుకు అనుగుణంగా టీచర్లు ఆంగ్ల మాధ్యమంలో చెప్పగలిగేలా మెథడాలజీలో మార్పులు చేయాల్సి ఉందన్నారు. అందుకే ఈ విద్యా సంవత్సరం డీఎస్సీ నిర్వహించబోమని చెప్పారు. 1998 నుంచి 2012 వరకు నిర్వహించిన డీఎస్సీల్లో నష్టపోయిన వారికి న్యాయం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, దీనిపై సాధారణ పరిపాలన శాఖ (జే ఏడీ), న్యాయశాఖ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ సంఘాల అవసరం ఉందా అన్న అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలోనే దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో సమావేశమై చర్చిస్తామన్నారు. మరోవైపు ఉపాధ్యాయ సమస్యలపై బుధవారం ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్, ఇతర సమస్యలను కడియంకు తెలియజేశారు. నెలాఖరులోగా హాస్టళ్లలో ప్రవేశాలు రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల ఆవరణలో నిర్మించిన 102 బాలికల హాస్టళ్లలో ఈ నెలాఖరులోగా విద్యార్థులకు ప్రవేశాలను కల్పించనున్నట్లు కడియం శ్రీహరి వెల్లడించారు. వచ్చేనెల 1 నుంచి బాలికలు హాస్టళ్లలో ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ‘‘ఒక్కో హాస్టల్లో 25 గదులు నిర్మించాం. ఒక్కో గదిలో నలుగురు బాలికలకు వసతి కల్పిస్తాం. ఇలా 102 హాస్టళ్లలో 10,200 మంది బాలికలకు హాస్టల్ సదుపాయం కల్పిస్తాం. వీటిని ప్రభుత్వం ఈనెల 17 నుంచి 23 వరకు నిర్వహించే గ్రామజ్యోతి కార్యక్రమంలో ప్రారంభిస్తాం. బాలిక విద్యను ప్రోత్సహించేందుకు రూ.247 కోట్లతో ఈ హాస్టళ్లను నిర్మించాం. వీటి నిర్వహణ బాధ్యతను సీనియర్ టీచర్లకు అప్పగించాలా? ఔట్‌సోర్సింగ్‌పై ఇతరులకు అప్పగించాలా? అన్నది ఆలోచిస్తున్నాం. బాలికల హాస్టళ్లు కాబట్టి భద్రతపైనా ప్రత్యేక దృష్టి పెడతాం’’ అని ఆయన వివరించారు. రాష్ట్రానికి మొదటి విడతలో మంజూరైన 192 మోడల్ స్కూళ్లలో 177 స్కూళ్లను ఇప్పటికే ప్రారంభించామని, ఈ ఏడాది శంకర్పల్లి, షాబాద్, మంచిర్యాల, నర్నూర్, కొడిమ్యాలలో ప్రవేశాలు చేపట్టామన్నారు. స్కూళ్లల్లో రికార్డు స్థాయిలో 18,820 మరుగుదొడ్లను నిర్మించి అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇందులో 30 శాతం మరుగుదొడ్లలో నీటి సదుపాయం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు, మోడల్ స్కూల్స్ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ ఖాళీ పోస్టుల వెల్లడి
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల తాత్కాలిక జాబితాను సోమవారం జిల్లా విద్యాశాఖ ప్రకటించింది. కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఆమోదంతో డీఈఓ ఎస్.విశ్వనాథరావు ఖాళీల వివరాలను కేటగిరీల వారీగా విడుదల చేశారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులతోపాటు, లాంగ్వేజి పండిట్లు, ఐదేళ్లు, ఎనిమిదేళ్లు సర్వీసు దాటిన ప్రధానోపాధ్యాయుల స్థానాలు, ఎల్ఎఫ్ఎల్ పాఠశాలల్లో 50 ఏళ్లలోపు పనిచేస్తున్న హెచ్ఎంల పోస్టుల వివరాలను విద్యాశాఖ వెబ్సైట్ ఠీఠీఠీ. ఛీౌ్ఛ ్చజౌఛ్చీ.ఛౌజటఞ్టౌ.ఛిౌఝలో ప్రవేశపెట్టారు. ఈ జాబితాపైన ఏమైన అభ్యంతరాలు లేదా సవరణలు ఉన్నట్లయితే అట్టి అభ్యంతరాలను సంబంధిత అధికారి ధ్రువీకరణతో మంగళ, బుధవారాల్లో విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలి. ఇదిలాఉంటే షెడ్యూల్ ప్రకారం రేషనలైజేషన్ జాబితాను కూడా సోమవారం ప్రకటించాల్సి ఉంది. కానీ గుర్తించిన మిగులు పోస్టులను ఏవిధంగా సర్దుబాటు చేయాలనే దానిపై విద్యాశాఖ డెరైక్టర్ నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇక పదో తరగతి ఫలితాల్లో 25 శాతం కంటే తక్కువ మార్కులు సాధించిన ఉపాధ్యాయులు, హెచ్ఎంలకు ఊరట లభించింది. తొలుత జారీ చేసిన నిబంధనల ప్రకారం ఆ పాఠశాలల టీచర్లు, హెచ్ఎంలను 3 లేదా 4 కేటగిరీ పాఠశాలలకు కౌన్సెలింగ్ ముందే బదిలీ చేయాలని ఉంది. దీని ప్రకారం జిల్లాలో ఇద్దరు హెచ్ఎంలు, గణితం సబ్జెక్టుకు సంబంధించిన ఐదుగురు టీచర్లును గుర్తించారు. కానీ సోమవారం డెరైక్టర్ నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు వారిని సాధారణ కౌన్సిలింగ్లోకి తీసుకోవాలని చెప్పడంతో ఆ ఖాళీల వివరాలను కూడా వెల్లడించారు. 2013లో బదిలీ అయినా పాత స్థానాల్లో ఉండిపోయిన టీచర్లు 213 మంది ఉన్నారు. పాత స్థానాల్లో ఉండిపోయిన వారు కోరుకున్న స్థానం హేతుబద్ధీకరణలో పోతే వారి బదిలీ రద్దు చేసి అదనంగా ఐదు పాయింట్లు ఇచ్చి ప్రస్తుత బదిలీల్లో అవకాశం కల్పిస్తారు. అయితే హేతుబద్ధీకరణ కసరత్తు ఇంకా ఎటూ తేలకపోవడంతో ఆ ఖా ళీలను కూడా ప్రకటించారు. హేతుబద్ధీకరణలో పో స్టులు ఉన్నా...లేకున్నా...సాధారణ బదిలీల్లో అవకాశ క ల్పించాలనే డిమాండ్ కూడా ఉపాధ్యాయల వైపు నుంచి ఉంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతో ఆ ఖాళీలను కూడా జాబితాలో చేర్చారు. కేటగిరీల వారీగా ఖాళీలు... క్రాఫ్ట్ టీచరు పోస్టులు : లాంగ్‌స్టాండింగ్ -1, ఖాళీలు-97 మొత్తం=98 డ్రాయింగ్ మాస్టర్స్ : ఖాళీలు-32 , మొత్తం=32 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు : లాంగ్‌స్టాండింగ్-283, ఖాళీలు-55 , మొత్తం=338 ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం స్థానాలు : లాంగ్‌స్టాండింగ్-1, ఖాళీలు-88, మొత్తం=89 లాంగ్వేజి పండిట్ హిందీ : లాంగ్‌స్టాండింగ్-9, ఖాళీలు-39, మొత్తం=48 లాంగ్వేజి పండిట్ తెలుగు : 2013 బదిలీల్లో రిలీవ్ చేయని స్థానాలు-2, లాంగ్ స్టాండింగ్-8, ఖాళీలు-67, మొత్తం=77 లాంగ్వేజి పండిట్ ఉర్ధూ : లాంగ్ స్టాండింగ్-1, ఖాళీలు-2. మొత్తం=3 మ్యూజిక్ పోస్టు ఖాళీలు-5, మొత్తం=5 ఫిజికల్ డెరైక్టర్ పోస్టులు : లాంగ్ స్టాండింగ్-7, ఖాళీలు-5, మొత్తం=12 పీఈటీలు : 2013 బదిలీల్లో రిలీవ్ చేయని స్థానాలు -1, లాంగ్‌స్టాండింగ్-14, ఖాళీలు-41, మొత్తం=56 స్కూల్ అసిస్టెంటు స్థానాలు... బయోసైన్స్ : 2013 బదిలీల్లో రిలీవ్ చేయని స్థానాలు-3, లాంగ్‌స్టాండింగ్-19, ఖాళీలు-57, మొత్తం=79 ఇంగ్లిష్ : లాంగ్ స్టాండింగ్ -49, ఖాళీలు-36, మొత్తం=85 హిందీ : 50 ఏళ్లు దాటిన స్థానాలు-1, 2013 బదిలీల్లో రిలీవ్ చేయని స్థానాలు-1, లాంగ్ స్టాండింగ్-19, ఖాళీలు-19., మొత్తం=40 గణితం : 2013 బదిలీల్లో రిలీవ్ చేయని స్థానాలు-1, లాంగ్‌స్టాండింగ్-18, ఖాళీలు-51, మొత్తం=70 ఫిజికల్ సైన్స్ : లాంగ్‌స్టాండింగ్-29, ఖాళీలు-17, మొత్తం=46 సాంఘికశాస్త్రం : 2013 బదిలీల్లో రిలీవ్ చేయని స్థానాలు-5, లాంగ్‌స్టాండింగ్-25, ఖాళీలు-148, మొత్తం=178 తెలుగు : 2013 బదిలీల్లో రిలీవ్ చేయని స్థానాలు-2, లాంగ్ స్టాండింగ్-10, ఖాళీలు-43, మొత్తం=55 ఉర్దూ : ఖాళీలు-2, మొత్తం=2 ఎస్జీటీ స్థానాలు : 2013 బదిలీల్లో రిలీవ్ చేయని స్థానాలు-202, లాంగ్‌స్టాండింగ్-129, ఖాళీలు -1088, మొత్తం=1419 -
డీఎస్సీ అభ్యర్థులు డీలా
డీఎస్సీ ఫలితాలు ఆలస్యం కావడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. జూన్ 15 నాటికే ఉపాధాయ్య నియామకాలు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పినా ఆ హామీ నెరవేరలేదు. డీఎస్సీ నిర్వహణ, ఫలితాలకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఎదురుకావడం తో మెరిట్ జాబితా విడుదల, నియామకాల ప్రక్రియ ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఇందుకు ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి. - మెరిట్ జాబితా మరింత ఆలస్యం - న్యాయపరమైన చిక్కులే కారణం - ఉపాధ్యాయ నియామకాలు ఎప్పటికో...? సాక్షి,చిత్తూరు: డీఎస్సీ అభ్యర్థులు డీలా పడ్డారు. మెరిట్ జాబితా కోసం ఎదురు చూపులు తప్పడంలేదు. న్యాయపరమైన చిక్కులంటూ రాష్ట్రప్రభుత్వం చేతులెత్తేయడం విమర్శలకు తావిస్తోంది. గత ఏడాది నవంబర్ 20న డీఎస్సీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో 1336 ఉపాధ్యాయపోస్టులకు సంబంధించి తొలుత 42 వేల మందికి పైగా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా 37,268 మంది అభ్యర్థులు మాత్రమే డీఎస్సీ పరీక్షకు హాజరయ్యారు. మే 9, 10, 11 తేదీల్లో ప్రభుత్వం డీఎస్సీ పరీక్ష నిర్వహించింది. జూన్ 3న విద్యాశాఖ ఫలితాలను వెల్లడించింది. జూన్ 9 నాటికి మెరిట్ లిస్ట్ జిల్లాలకు పంపి 15 నాటికే ఉపాధ్యాయ నియామకాలు పూర్తిచేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ప్రకటించారు. అయితే న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో విద్యాశాఖ మెరిట్ జాబితా విడుదలను వాయిదా వేసింది. డీఎస్సీ ప్రశ్నాపత్రాల కీ లోని తప్పులపై 1,836 కేసులు నమోదయ్యాయి. డీఎస్సీ ప్రాథమిక కీ పైనే 3 వేలకుపైగా అభ్యంతరాలు విద్యాశాఖకు అందినట్లు సమాచారం. ప్రాథమిక కీ పై అభ్యంతరాలు వచ్చినా విద్యాశాఖ ఫైనల్ కీ విడుదలలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వీటిన్నింటినీ అంశాల వారీగా న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు సరిచేసుకోవాల్సి ఉంది. అనంతరం ఈ నివేదికలను ట్రిబ్యునల్‌కు సమర్పించాలి. ఆపై ట్రిబ్యునల్ ఇచ్చే ఆదేశాల మేరకు అభ్యర్థుల మెరిట్ జాబితా, నియామకపు ఉత్తర్వులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు డీఎస్సీ -2014 నిర్వహణ పైనే మరో కేసు ఉంది. డీఎస్సీ 2014ను గతకంటే భిన్నంగా నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. గతంలో టీచర్ ఎలిజబులిటి టెస్ట్ (టెట్)ను నిర్వహించి అందులో క్వాలిఫై అయిన వారికి డీఎస్సీ (టీచర్ రిక్రూట్మెంట్ -టెర్ట్)ను పెట్టేవారు. ఈ సారి టెట్, టెర్ట్లను కలిపేసి డీఎస్సీ నిర్వహించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని న్యాయస్థానంలో ఇప్పటికే కొందరు సవాల్ చేస్తున్నారు. ఈ వివాదాలన్నింటికీ తెరపడాల్సి ఉంది. దీనికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల, ఉపాధ్యాయ నియామకాలు మరింత ఆలస్యం కానున్నాయి. డీఎస్సీ రాసిన అభ్యర్థుల్లో మరింత ఆందోళన నెలకుంది. -
డీఎస్సీయా.. ఏపీ ఎస్సీయా
ఏలూరు సిటీ : ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో నూతన విధానాలకు తెరలేస్తోంది. జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ద్వారా నియామకాలు చేపట్టాల్సి ఉండగా, ఈసారి రాజధాని నుంచే ఎంపిక ప్రక్రియ చేస్తారని తెలుస్తోంది. టెట్ కమ్ టెర్ట్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక జాబితాను హైదరాబాద్ నుంచి విడుదల చేస్తారని, ఆ జాబితాను అనుసరించే ఉద్యోగాల భర్తీ చేస్తారని చెబుతున్నారు. అదే జరిగితే డీఎస్సీగా ప్రకటించడం దేనికని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో రోస్టర్ కమ్ మెరిట్ ఆధారంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎంపిక జాబితాను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించి అనంతరం కౌన్సెలింగ్ చేపట్టి పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే, డీఎస్సీ-14 నియామక ప్రక్రియను ఏ విధంగా చేస్తారో తెలియక అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. జిల్లాలో ఎంపిక చేస్తేనే గతంలో అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఈసారి హైదరాబాద్‌లో ఎంపిక చేస్తే ఎవరికి చెప్పుకోవాలని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 15నాటికి ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్ ? రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ డీఎస్సీ ఫలితాలు విడుదల చేసిన సమయంలో ఈనెల 15నాటికి కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని ఘంటాపథంగా చెప్పారు. నేటికీ మెరిట్ లిస్ట్ కూడా విడుదల కాలేదు. కోర్టు కేసు నేపథ్యంలోనే జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. అయితే 15నాటికి ప్రొవిజి నల్ సెలక్షన్ లిస్ట్ విడుద చేస్తారని తెలుస్తోంది. ఉద్యోగాలకు ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులతో సీఎం చంద్రబాబు ప్రతిజ్ఞ చేయిస్తారని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన వారందరినీ ఒకేచోటకు రప్పించి నియామక పత్రాలు ఇచ్చి ప్రతిజ్ఞ చేయిస్తారా లేక ఒక జిల్లా అభ్యర్థులతోనే ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తారా అనే దానిపై సందిగ్ధత ఉంది. వెబ్ కౌన్సెలింగ్ ఆలోచన ఉపాధ్యాయ నియామకాల్లో వెబ్ కౌన్సెలింగ్‌ను తెరపైకి తెచ్చేందుకు అధికారులు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధానం సత్ఫలితాలిస్తుందా లేదా అనే దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఎంపిక జాబితా అధారంగా అభ్యర్థులకు 1 నుంచి 99 ఆప్షన్లు నమోదు చేసుకునే వీలు కల్పిస్తారని, ర్యాం కుల ఆధారంగా ఆన్లైన్లోనే వారికి కావాల్సిన పాఠశాలను ఎంపిక చేసుకునేలా అవకాశం ఇస్తారని సమాచారం. తద్వారా డీఈవో కార్యాలయం, జిల్లా ఎంపిక కమిటీ ప్రమేయం లేకుండానే హైదరాబాద్ నుంచే నియామకాలు చేపడతారని అంటున్నారు. మొత్తానికి ఎన్నడూలేని విధంగా డీఎస్సీ-14 అభ్యర్థులను సర్కారు తీవ్ర ఇరకాటంలోకి నెట్టేసింది. -
గిరిజన టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
హైదరాబాద్: రాష్ట్రంలో 402 గిరిజన టీచర్ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ విడుదలైనట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లోని షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రత్యేక డీఎస్సీద్వారా ఈ నియామకాలు చేపట్టినట్లు అందులో పేర్కొన్నారు. ఈ డీఎస్సీలో ఎలాంటి రాత పరీక్ష ఉండబోదన్నారు. అభ్యర్థులు... ఇంటర్, డిగ్రీలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ, బీఈడీ లేదా డీఈడీలో వచ్చిన మార్కులకు 30 శాతం వెయిటేజీ, టెట్‌లో మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందన్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు మే 30 చివరి తేదీ అని, దరఖాస్తుల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ లాంటి విధివిధానాలను పూర్తిచేసి వచ్చే నెల 14న మెరిట్ తుది జాబితా విడుదల చేస్తామన్నారు. 15న కౌన్సెలింగ్ ద్వారా నియామక ఉత్తర్వులు వెలువరిస్తామని తెలిపారు. -
ఉపాధ్యాయ నియామక పరీక్షకు సర్వంసిద్ధం
హైదరాబాద్: లక్షలాది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న టీచర్ నియామక పరీక్షలు (డీఎస్సీ-2014) మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని 10,313 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చే శామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి తెలిపారు. మంగళవారం ఆమె సాక్షి’తో మాట్లాడుతూ.. మాస్ కాపీయింగ్, హైటెక్ కాపీయింగ్ వంటి అక్రమాలను నిరోధించేందుకు ప్రశ్నపత్రాల పంపిణీలో జంబ్లింగ్ విధానాన్ని అనుసరిస్తున్నాం. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా, గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయిస్తున్నాం. 10,313 పోస్టులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం. వీటిలో స్కూల్ అసిస్టెంటు (ఎస్ఏ-లాంగ్వేజ్, నాన్‌లాంగ్వేజ్) పోస్టులు 2,033, భాషా పండిత్ 1,026, పీఈటీ 197, సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) 7,055, స్పెషల్ టీచర్లు పోస్టులు 2 ఉన్నాయి. వీటికోసం 4,20,713 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 61,489 మంది ఎస్జీటీలు, 56,497 మంది భాషాపండిత్లు, 8,878 మంది పీఈటీలు, 60,476 మంది ఎస్ఏ(లాంగ్వేజెస్), 2,33,362 మంది ఎస్ఏ(నాన్ లాంగ్వేజెస్)లున్నారు. ఇప్పటికే 3,33,641 మంది హాల్‌టిక్కెట్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నారు. కొంతమంది దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేయడంలో ఫొటోలు సరిగా స్కాన్ చేయలేకపోయారు. వారికి ఫొటోలు అప్లోడ్ చేసుకొని మరోసారి హాల్‌టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించాం. అభ్యర్దులందరికీ ఎస్సెమ్మెస్‌ల ద్వారా సమాచారాన్ని పంపించాం. పరీక్షల నిర్వహణ కు ఇన్విజిలేటర్లుగా విద్యాశాఖేతర విభాగాల సిబ్బందిని నియమిస్తున్నాం. ప్రశ్నపత్రాలను ఏబీసీడీ సెట్లుగా చేసి జంబ్లింగ్ విధానంలో పంపిణీ చేయిస్తున్నాం. భద్రత ఏర్పాట్లుపై పోలీసు అధికారులతో మాట్లాడాం. వైద్య సేవలకు ఏఎన్ఎంలను నియమిస్తున్నాం. మధ్యాహ్న పరీక్ష వేళలను రెండు గంటలకు బదులు మూడు గంటలకు మార్పు చేశాం. వేర్వేరు పోస్టులకు దరఖాస్తు చేసిన వారు రాతపరీక్షకు హాజరయ్యేందుకు వీలుగా ఈ మార్పు చేశాం. అభ్యర్థులు పరీక్ష సమయానికి అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. సమయం దాటాక వచ్చే వారిని లోపలకు అనుమతించం’ అని అన్నారు. -
శుభవార్త..
ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి మంత్రి హామీ పది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల సీఈటీ ద్వారా నియామకాలు దళారుల ప్రమేయం వద్దు బెంగళూరు :ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ర్ట ప్రాథమిక విద్యాశాఖ మంత్రి కిమ్మెన రత్నాకర్ తెలిపారు. రాష్ర్ట వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 11,200 ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేలా ఈ సారి ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సీఈటీ) నిర్వహించనున్నట్లు చెప్పారు. పాఠ్య పుస్తకాల మార్పు విషయమై బెంగళూరులో గురువారం జరిగిన సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు టెట్ పరీక్షలో ఉత్తీర్ణులైన 23 వేల మంది అర్హులేనని అన్నారు. ఉద్యోగాల కోసం దళారులను ఆశ్రయించరాదని అభ్యర్థులకు సూచించారు. విద్యా హక్కు చట్టాన్ని (ఆర్టీఈ) అనుసరించి ప్రవేశాలు ఈ ఏడాది నుంచే మొదటిసారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అందువల్ల సాంకేతిక ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవమన్నారు. ఒకటి రెండు రోజుల్లో ఇందుకు పరిష్కారం కనుగొంటామన్నారు. బెంగళూరుతో సహా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గుర్తింపు లేని పాఠశాలలు ఉన్నాయన్నారు. ఈ పాఠశాల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నామని తెలిపారు. కాలానుగుణంగా విద్యా విధానంలో మార్పులు తీసుకురావాల్సి ఉంటుందన్నారు. అందులో భాగంగానే పాఠ్యపుస్తకాల్లో మార్పులు తీసుకువస్తున్నామన్నారు. అయితే మతానికి ఈ విషయాన్ని ముడిపెట్టి కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. -
టీపీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయ నియూమకాలు చేపట్టాలి
టీపీఎస్సీ చైర్మన్‌కు టీపీఆర్టీయూ వినతి మహబూబ్‌నగర్ విద్యావిభాగం: టీపీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయ నియూమకాలు చేపట్టాలని టీ పీఎస్సీ ఛైర్మన్ గంటా చక్రపాణికి పీఆర్టియు తెలంగాణ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకుల పోరాట ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో వారిజీవితాలు స్థిరపడే విధంగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కోరారు. లక్షమంది ఉద్యోగుల పదోన్నతులకు ఉపయోగపడే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్‌ను నిర్వహించాలని, టీపీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని కోరారు. గతంలో చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో అనేక అక్రమాలు, తప్పులు జరిగాయాయని, అలాంటివాటికి తావుతావులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చలపతిరావు, నరేందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, సదానంద్ తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీ రోస్టర్ పాయింట్లు విడుదల
గుంటూరు ఎడ్యుకేషన్ డీఎస్సీ-2014 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి పాఠశాలల్లో భర్తీ చేయనున్న పోస్టుల వారీగా రోస్టర్ పాయింట్లను విద్యాశాఖ విడుదల చేసింది. వచ్చే ఏడాది మేలో జరగనున్న టెట్ కం టీఆర్టీ రాత పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో 951 పోస్టులను భర్తీ చేయనుండగా, కేటగిరీల వారీగా రిజర్వేషన్ ఖరారు చేస్తూ విడుదల చేసిన జాబితాను ‘ఏపీ.డీఎస్సీ.సీజీజీ.ఇన్’ వెబ్‌సైట్‌తో పాటు ఏపీడీఎస్సీ-2014 పేరుతో ఉన్న సైట్లోనూ పొందుపర్చింది. గుంటూరులోని జిల్లా పరీక్షా భవన్లో ఏర్పాటుచేసిన డీఎస్సీ ప్రత్యేక విభాగం వద్ద అభ్యర్థుల ప్రయోజనార్ధం రోస్టర్ల పాయింట్లను నోటీస్ బోర్డులో ప్రదర్శనకు ఉంచారు. తక్కువగానే దరఖాస్తులు.. డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైన వారం అయినా చాలా తక్కువ సంఖ్యలోనే దరఖాస్తులు అందాయి. ఆన్లైన్లో ప్రింటవుట్ తీసుకున్న దరఖాస్తుల్లో సోమవారానికి కేవలం 10 మంది అభ్యర్థులు మాత్రమే డీఎస్సీ విభాగంలో అందజేశారు. పూర్తిగా ఆన్లైన్ విధానం కావడం, దరఖాస్తుకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసేందుకు సరైన అవకాశం లేకపోవడంతో ఇప్పటివరకూ స్వల్ప సంఖ్యలోనే దరఖాస్తులు అందాయని తెలుస్తోంది. తాజాగా రోస్టర్ పాయింట్ల విడుదలతో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, భాషా పండిట్, పీఈటీ పోస్టుల వారీగా అభ్యర్థులు రిజర్వేషన్ అనుసరించి దరఖాస్తు చేసేందుకు ముందుకు వస్తారని తెలుస్తోంది. -
8 నుంచి డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
విశాఖ రూరల్ : డీఎస్సీ-2014 ఉపాధ్యాయ నియామకానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను ఈ నెల 8 నుంచి జనవరి 31వ తేదీ చేపడుతున్నట్టు జిల్లా విద్యా శాఖాధికారి ఎం.వి.కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అర్బన్ తహశీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఇందుకోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సమర్పించిన దరఖాస్తుతో పాటు అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలన నిమిత్తం అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో వ్యక్తిగతంగా హాజరై నకలు కాపీలను దరఖాస్తుతో సమర్పించాలని సూచించారు. ఈ నెల 8 నుంచి జనవరి 31వ తేదీ వరకు ఆ దరఖాస్తులను అన్ని పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు, ఇతర సమాచారం కోసం ఠీఠీఠీ.్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. -
ఊరించి.. ఉసూరుమనిపించి!
కర్నూలు విద్య: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని చెబుతున్న టీడీపీ ప్రభుత్వం మాట తప్పుతోంది. తాజాగా నిరుద్యోగ బీఎడ్‌ల ఆశలపై నీళ్లు చల్లింది. ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పిస్తామని నమ్మబలికిన చంద్రబాబునాయుడు.. చివరకు కేంద్రం అనుమతి ఇవ్వలేదంటూ చేతులెత్తేశారు. గురువారం రాష్ట్రంలో 9,061 టీచర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 730 ఉపాధ్యాయుల భర్తీకి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించగా అన్నింటికీ ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే ప్రాథమిక పాఠశాల విద్యను బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు డీఎడ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులే అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నేడు నోటిఫికేషన్ వెలువడనుంది. ఇదిలాఉంటే ఎన్నికల హామీలో భాగంగా బీఎడ్‌లకు ఎస్జీటీ పోస్టులకు అవకాశం కల్పించేందుకు ఎన్సీఈఆర్టీ నిబంధనలను సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. ఇలాంటి ప్రతిపాదననే చేసిన పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి సైతం నిబంధనలు అంగీకరించబోవని స్పష్టం చేశామని.. ఆంధ్రప్రదేశ్‌కు స్పష్టంగా నిబంధనలు సండలించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇచ్చిన హామీ నిలుపుకోవడంలో భాగంగా గత ఏడాది ప్రైమరీ స్కూళ్లను అప్పర్ ప్రైమరీ స్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేసిన వాటిలో స్కూల్ అసిస్టెంట్లను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందుకు ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత తప్పదనే భావనతో ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవడంలో ఆలస్యమవుతుందనే సాకుతో చడీచప్పుడు కాకుండా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. ఎన్నికల హామీ విస్మరించిన బాబు తీరుపై బీఎడ్ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు డీఎస్సీగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను ఇకపై టెట్‌కామ్ టెర్ట్‌గా మార్పు చేశారు. గత ప్రభుత్వం నిర్వహించిన టెట్‌కు స్వస్తి పలికారు. రెండింటికీ ఒకే పరీక్షను నిర్వహించనున్నారు. ఇదివరకు టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు సైతం తాజాగా పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ఎక్కువ మార్కులనే పరిగణనలోకి తీసుకోనున్నారు. మూడు గంటల రాత పరీక్షలో భాగంగా ప్రశ్న పత్రాన్ని చదివేందుకు 15 నిముషాల ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. ఎస్జీటీ ప్రశ్న పత్రంలో 180 ప్రశ్నలకు 180 మార్కులు.. స్కూల్ అసిస్టెంట్‌లో 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. -
టీచర్ పోస్టుల భర్తీకి విధివిధానాలు ఖరారు
హైదరాబాద్: ఏపీలో టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష), టీచర్ పోస్టుల భర్తీకి విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఎస్జీటి, స్కూల్ అసిస్టెంట్, పీఈడీ పోస్టుల భర్తీకి నిబంధనలు ఖరారు చేశారు. ఎస్జీటి పోస్టులకు 180 మార్కులకు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 200 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా స్థాయి ఎంపిక కమిటీలు ఉంటాయి. ఓసీలకు 40 సంవత్సరాలు,ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 సంవత్సరాలు వయోపరిమితిగా నిర్ణయించారు. ** -
గురువులకు సర్కారు నామాలు
డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా - ఎప్పుడు జారీ చేస్తారో చెప్పలేని పరిస్థితి - బదిలీ ఉత్తర్వుల్లోనూ చివరి క్షణంలో మెలిక - 20 శాతం పరిమితి విధింపుపై ఆందోళన - దీని ప్రభావం ఖాళీల భర్తీపైనా పడుతుందంటున్న సంఘాలు - సమస్యలను ముందుగా పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి శ్రీకాకుళం: ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా ప్రణాళిక ప్రకారం నీరుగారుస్తున్న టీడీపీ ప్రభుత్వం టీచర్ల నియామకాలు, బదిలీల విషయంలోనూ అదే పంథా అనుసరిస్తోంది. టీచర్ల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్‌ను వాయిదా వేసిన సర్కారు, టీచర్ల బదిలీలకు సంబంధించి కొత్త జారీ చేసిన ఉత్తర్వులు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వ పెద్దలు పదే పదే ప్రకటించినా అది ఆచరణకు నోచుకోలేదు. కొన్ని న్యాయపరమైన అంశాలు తేలకపోవడంతో నోటిఫికేషన్‌ను వాయిదా వేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో స్థానికత అంశం తేలకపోవడంతోనే వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీనితోపాటు పండిట్ పోస్టుల అప్‌గ్రేడేషన్ తదితర విషయాలపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, లేనిపక్షంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేరని ఉపాధ్యాయ సంఘాలు మొదటి నుంచీ మొత్తుకుంటున్నా విధ్యాశాఖ మంత్రి ఏమాత్రం పట్టించుకోకుండా.. సెప్టెంబర్ 5న కచ్చితంగా నోటిఫికేషన్ విడుదల చేస్తామనే పాట పాడుతూ వచ్చారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులను డీఎస్సీ ప్రకటన వాయిదా నిర్ణయం ఉసూరుమనిపించింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేస్తారన్నది అధికారులే చెప్పలేకపోతున్నారు. పరిమితంగానే బదిలీలు ఇదిలా ఉంటే బదిలీలకు సంబంధించి శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు ఉపాధ్యాయులను కలవరపరుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 20 శాతం మందినే బదిలీ చేయాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో ఆదేశించింది. శ్రీకాకుళం జిల్లాలో 600 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి. 20 శాతం పోస్టులకు మాత్రమే బదిలీలు చేయాలంటే 120 పోస్టులు మాత్రమే నింపాల్సి ఉంటుంది. మిగిలిన వాటిని ఖాళీలుగా చూపించలేని పరిస్థితి ఉంది. దీనివల్ల మైదాన, పట్టణ పరిసర ప్రాంతాలతోపాటు మండల కేంద్రాల్లోని ఖాళీలను చూపించకూండా మారుమూల ప్రాంతాలను మాత్రమే ఖాళీగా చూపించే అవకాశం ఉంది. ఫలితంగా ఇప్పటికే 8 ఏళ్ల సర్వీసును ఒకే పాఠశాలలో పూర్తి చేసి తప్పనిసరిగా బదిలీ కావాల్సినవారు తాము మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుం దని ఆవేదన చెందుతున్నారు. ఖాళీలను దాచి ఉంచడానికి మరో కారణం ఉందని కొన్ని సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి సుమారు 5వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వారికి అడ్డదారిన అనుకూలమైన పాఠశాలలను కేటాయించేందుకే ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి విధానాలకు స్వస్తి చెప్పి గతంలో మాదిరిగా బదిలీలను పరిమితి లేకుండా చేయకుంటే ఆం దోళన తప్పదని పలువురు సంఘ నేతలు హెచ్చరిస్తున్నారు. -
సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన డీఎస్సీ నోటిఫికేషన్ సెప్టెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 10,603 పోస్టులను ఈసారి భర్తీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు 1849, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 7,594, పండిట్ ఉపాధ్యాయ పోస్టులు 975, పీఈటీ పోస్టులు 185 ఉంటాయని ఆయన వివరించారు. ఇక టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) రద్దుపై తాము న్యాయసలహా తీసుకుంటామని గంటా అన్నారు. డీఈడీ విద్యార్థులను ఎస్జీటీ పోస్టులకు అనుమతించే అవకాశం కల్పించడం మీద ఇంతవరకు ఎలాంటి ఆలోచన చేయలేదని చెప్పారు.