ఒకే పరీక్ష! | TSPSC teacher recruitment 2017 | Sakshi
Sakshi News home page

ఒకే పరీక్ష!

Published Fri, Oct 13 2017 7:04 AM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఒకే పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయానికి వచ్చింది. గురుకుల పోస్టుల తరహాలో ప్రిలిమ్స్, మెయిన్స్‌ విధానం కాకుండా గతంలో డీఎస్సీ నిర్వహించిన విధంగానే ప్రతి సబ్జెక్టుకూ ఒకే పరీక్ష చొప్పున నిర్వహించాలని నిర్ణయించింది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి అధ్యక్షతన గురువారం కమిషన్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరీక్ష విధానంపై సమగ్రంగా చర్చించారు. పరీక్ష విధానాన్ని ఖరారు చేసే బాధ్యత ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీకే ఇచ్చిన నేపథ్యంలో.. పాత పద్ధతిలోనే ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఇవ్వనుంది. ప్రస్తుతం పాఠశాలల్లో బోధిస్తున్న పాఠ్యాంశాల ఆధారంగా ఆయా సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్‌ను ఖరారు చేయనుంది. ఈ బాధ్యతను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలికి (ఎస్‌సీఈఆర్‌టీ) అప్పగించింది. ఎస్‌సీఈఆర్‌టీ ఇచ్చే సిలబస్‌ ప్రకారమే పరీక్షలను నిర్వహించనుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement