AP TET 2021 Syllabus Notification Released: Check Here For Exam Patter, Marks Details - Sakshi
Sakshi News home page

Teacher Eligibility Test: టెట్‌–2021 విధానం, సిలబస్‌ ఖరారు

Published Sat, Jun 12 2021 4:02 AM | Last Updated on Sat, Jun 12 2021 4:40 PM

Adimulapu Suresh was released TET-2021 policy, syllabus finalized - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి అభ్యర్థులకు ముందుగా నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)–2021 పేపర్ల విధివిధానాలు, సిలబస్‌ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం విడుదల చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సిలబస్‌ను ‘హెచ్‌టీటీపీఎస్‌://ఏపీటీఈటీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఐఎన్‌’లో అందుబాటులో ఉంచామని మంత్రి సురేష్‌ తెలిపారు. రాష్ట్రంలో టెట్‌ నిర్వహణపై ప్రభుత్వం మార్చి 17న జీవో 23 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. టెట్‌కు సంబంధించిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..

టెట్‌లో రెండు పేపర్లు..
► టెట్‌లో 2 పేపర్లు (పేపర్‌–1, పేపర్‌–2) ఉంటాయి. పేపర్‌ 1–ఏ, 1–బీ, 2–ఏ, 2–బీలుగా వీటిని నిర్వహిస్తారు. 
► రెగ్యులర్‌ స్కూళ్లలో 1–5 తరగతుల టీచర్‌ పోస్టులకు పేపర్‌ 1–ఏలో అర్హత సాధించాలి.
► దివ్యాంగులు, ఇతర విభిన్న ప్రతిభావంతులు స్పెషల్‌ స్కూల్స్‌లో 1–5 తరగతులు బోధించాలంటే పేపర్‌ 1–బీలో అర్హత తప్పనిసరి.
► రెగ్యులర్‌ స్కూళ్లలో 6–8, ఆ పై తరగతులు బోధించాలంటే పేపర్‌ 2–ఏలో అర్హత సాధించాలి. అలాగే స్పెషల్‌ స్కూళ్లలో ఇవే తరగతులకు పేపర్‌ 2–బీలో అర్హత తప్పనిసరి. 

ఆయా పేపర్ల పరీక్ష విధానం ఇలా..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement