ఉపాధ్యాయ ఖాళీ పోస్టుల వెల్లడి | Revealed the post of teacher in space | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ ఖాళీ పోస్టుల వెల్లడి

Published Mon, Jun 22 2015 11:24 PM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM

Revealed the post of teacher in space

 నల్లగొండ
 జిల్లా వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల తాత్కాలిక జాబితాను సోమవారం జిల్లా విద్యాశాఖ ప్రకటించింది. కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఆమోదంతో డీఈఓ ఎస్.విశ్వనాథరావు ఖాళీల వివరాలను కేటగిరీల వారీగా విడుదల చేశారు. ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులతోపాటు, లాంగ్వేజి పండిట్లు, ఐదేళ్లు, ఎనిమిదేళ్లు సర్వీసు దాటిన ప్రధానోపాధ్యాయుల స్థానాలు, ఎల్‌ఎఫ్‌ఎల్ పాఠశాలల్లో 50 ఏళ్లలోపు పనిచేస్తున్న హెచ్‌ఎంల పోస్టుల వివరాలను విద్యాశాఖ వెబ్‌సైట్ ఠీఠీఠీ. ఛీౌ్ఛ ్చజౌఛ్చీ.ఛౌజటఞ్టౌ.ఛిౌఝలో ప్రవేశపెట్టారు. ఈ జాబితాపైన ఏమైన అభ్యంతరాలు లేదా సవరణలు ఉన్నట్లయితే అట్టి అభ్యంతరాలను సంబంధిత అధికారి ధ్రువీకరణతో మంగళ, బుధవారాల్లో విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలి.
 
  ఇదిలాఉంటే షెడ్యూల్ ప్రకారం రేషనలైజేషన్ జాబితాను కూడా సోమవారం ప్రకటించాల్సి ఉంది. కానీ గుర్తించిన మిగులు పోస్టులను ఏవిధంగా సర్దుబాటు చేయాలనే దానిపై విద్యాశాఖ డెరైక్టర్ నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇక పదో తరగతి ఫలితాల్లో 25 శాతం కంటే తక్కువ మార్కులు సాధించిన ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలకు ఊరట లభించింది. తొలుత జారీ చేసిన నిబంధనల ప్రకారం ఆ పాఠశాలల టీచర్లు, హెచ్‌ఎంలను 3 లేదా 4 కేటగిరీ పాఠశాలలకు కౌన్సెలింగ్ ముందే బదిలీ చేయాలని ఉంది. దీని ప్రకారం జిల్లాలో ఇద్దరు హెచ్‌ఎంలు, గణితం సబ్జెక్టుకు సంబంధించిన ఐదుగురు టీచర్లును గుర్తించారు.
 
 కానీ సోమవారం డెరైక్టర్ నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు వారిని సాధారణ కౌన్సిలింగ్‌లోకి తీసుకోవాలని చెప్పడంతో ఆ ఖాళీల వివరాలను కూడా వెల్లడించారు. 2013లో బదిలీ అయినా పాత స్థానాల్లో ఉండిపోయిన టీచర్లు 213 మంది ఉన్నారు. పాత స్థానాల్లో ఉండిపోయిన వారు కోరుకున్న స్థానం హేతుబద్ధీకరణలో పోతే వారి బదిలీ రద్దు చేసి అదనంగా ఐదు పాయింట్లు ఇచ్చి ప్రస్తుత బదిలీల్లో అవకాశం కల్పిస్తారు. అయితే హేతుబద్ధీకరణ కసరత్తు ఇంకా ఎటూ తేలకపోవడంతో ఆ ఖా ళీలను కూడా ప్రకటించారు. హేతుబద్ధీకరణలో పో స్టులు ఉన్నా...లేకున్నా...సాధారణ బదిలీల్లో అవకాశ క ల్పించాలనే డిమాండ్ కూడా ఉపాధ్యాయల వైపు నుంచి ఉంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతో ఆ ఖాళీలను కూడా జాబితాలో చేర్చారు.
 
 కేటగిరీల వారీగా ఖాళీలు...
 క్రాఫ్ట్ టీచరు పోస్టులు : లాంగ్‌స్టాండింగ్ -1, ఖాళీలు-97 మొత్తం=98
 డ్రాయింగ్ మాస్టర్స్ : ఖాళీలు-32 , మొత్తం=32
 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు :  లాంగ్‌స్టాండింగ్-283, ఖాళీలు-55 , మొత్తం=338
 ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం స్థానాలు : లాంగ్‌స్టాండింగ్-1, ఖాళీలు-88, మొత్తం=89
 లాంగ్వేజి పండిట్ హిందీ : లాంగ్‌స్టాండింగ్-9, ఖాళీలు-39, మొత్తం=48
 లాంగ్వేజి పండిట్ తెలుగు : 2013 బదిలీల్లో రిలీవ్ చేయని స్థానాలు-2, లాంగ్ స్టాండింగ్-8, ఖాళీలు-67, మొత్తం=77
 లాంగ్వేజి పండిట్ ఉర్ధూ : లాంగ్ స్టాండింగ్-1, ఖాళీలు-2. మొత్తం=3
 మ్యూజిక్ పోస్టు ఖాళీలు-5, మొత్తం=5
 ఫిజికల్ డెరైక్టర్ పోస్టులు : లాంగ్ స్టాండింగ్-7, ఖాళీలు-5, మొత్తం=12
 పీఈటీలు : 2013 బదిలీల్లో రిలీవ్ చేయని స్థానాలు -1, లాంగ్‌స్టాండింగ్-14, ఖాళీలు-41, మొత్తం=56
 స్కూల్ అసిస్టెంటు స్థానాలు...
 బయోసైన్స్ : 2013 బదిలీల్లో రిలీవ్ చేయని స్థానాలు-3, లాంగ్‌స్టాండింగ్-19, ఖాళీలు-57, మొత్తం=79
 ఇంగ్లిష్ : లాంగ్ స్టాండింగ్ -49, ఖాళీలు-36, మొత్తం=85
 హిందీ : 50 ఏళ్లు దాటిన స్థానాలు-1, 2013 బదిలీల్లో రిలీవ్ చేయని స్థానాలు-1, లాంగ్ స్టాండింగ్-19, ఖాళీలు-19., మొత్తం=40
 గణితం : 2013 బదిలీల్లో రిలీవ్ చేయని స్థానాలు-1, లాంగ్‌స్టాండింగ్-18, ఖాళీలు-51,
 మొత్తం=70
 ఫిజికల్ సైన్స్ : లాంగ్‌స్టాండింగ్-29, ఖాళీలు-17, మొత్తం=46
 సాంఘికశాస్త్రం : 2013 బదిలీల్లో రిలీవ్ చేయని స్థానాలు-5, లాంగ్‌స్టాండింగ్-25, ఖాళీలు-148, మొత్తం=178
 తెలుగు : 2013 బదిలీల్లో రిలీవ్ చేయని స్థానాలు-2, లాంగ్ స్టాండింగ్-10, ఖాళీలు-43, మొత్తం=55
 ఉర్దూ : ఖాళీలు-2, మొత్తం=2
 ఎస్‌జీటీ స్థానాలు : 2013 బదిలీల్లో రిలీవ్ చేయని స్థానాలు-202, లాంగ్‌స్టాండింగ్-129, ఖాళీలు -1088, మొత్తం=1419
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement