ప్రగతి భవన్‌ వద్ద ఉద్రిక్తత | TRT PET Aspirants Protest At Pragathi Bhavan Demands For Posting | Sakshi
Sakshi News home page

ఫలితాలు వెల్లడించాలి: టీఆర్టీ అభ్యర్థులు

Published Wed, Oct 16 2019 1:02 PM | Last Updated on Wed, Oct 16 2019 2:12 PM

TRT PET Aspirants Protest At Pragathi Bhavan Demands For Posting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌టీ (టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌), పీఈటీ ఫలితాలు ప్రకటించాలంటూ అభ్యర్థులు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. బుధవారం ప్రగతి భవన్‌ను ముట్టడించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్‌టీ, పీఈటీ ఫలితాల జాబితాను ప్రకటించి పోస్టింగులు ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో బేగంపేట పరిసరాల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఆందోళన చేస్తున్న అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక 2017లో తెలంగాణ ప్రభుత్వం టీఆర్‌టీ నోటిఫికేషన్‌ జారీ చేయగా ఇప్పటికీ నియామక ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో అభ్యర్థులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.





No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement