సాక్షి, విజయవాడ: గుడివాడ టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. దీంతో బుధవారం నిర్వహించాల్సిన మినీ మహానాడు సైతం రద్దయింది. నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, పార్టీ నేత శిష్లా లోహిత్ వర్గాలు ఫ్లెక్సీలు చించుకుని పార్టీ పరువును రోడ్డున పడేశారు. దీంతో రెండు వర్గాల మధ్య విభేదాలు ఓ కొలిక్కి రాకపోవడంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మహానాడుకు ఏర్పాట్లు పూర్తయినా టీడీపీ అదిష్టానం కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఇప్పటికే రెండు వర్గాల మధ్య రాజీ చేసినా ఫలితం దక్కకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment