ravi venkateswara rao
-
గుడివాడ అసెంబ్లీ సీటు నాదే... వచ్చే ఎన్నికల్లో నేనే పోటీచేస్తా..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘గుడివాడ అసెంబ్లీ సీటు నాదే. వచ్చే ఎన్నికల్లో నేనే పోటీచేస్తా. ఇదే విషయాన్ని సార్‌కు నా మాటగా స్పష్టంగా చెప్పండి’ అని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తేల్చి చెప్పేయడంతో టీడీపీ రాష్ట అధ్యక్షుడు కె.అచ్చన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు పరిస్థితులను పూసగుచ్చినట్లు వివరించారు. తాము అనుకున్నదొకటి, అవుతున్నది మరొకటి అన్నరీతిలో పరిస్థితులు తల్లకిందులు అవుతుండటంతో చంద్రబాబు దీర్ఘాలోచనల్లో పడినట్లు తెలిసింది. కింకర్తవ్యం... తాత్కాలిక మౌనమే శ్రేయస్కరమనే ముఖ్యుల అభిప్రాయాలను అంగీకరించిన ఆయన గుడివాడలో కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపేయాలని, మళ్లీ చెప్పేవరకు అటువైపు వెళ్లవద్దని వెనిగండ్ల రాముకు సూచించారనేది సమాచారం. తానిక హైదరాబాద్‌కు పరిమితమవ్వాలా లేక అమెరికాకు పయనమవ్వాలా అనే మీమాంసలో ఉన్న రాము ఆఖరు ప్రయత్నంగా తనను ప్రోత్సహిస్తున్న లోకే‹Ùను కలిసి తుది నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో సోమవారం ఒంగోలుకు వెళ్లారు. పార్టీ వర్గాల అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు... సుమారు నెల రోజులుగా గుడివాడ టికెట్ అంశంపై టీడీపీలో అంతర్గత చర్చలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)పై బలమైన అభ్యరి్థని రంగంలోకి దింపి ఎలాగైనా జెండా ఎగరేయాలనే యోచనతో ప్రవాసాంధ్రుడైన వెనిగండ్లను కొన్ని నెలలుగా చంద్రబాబు, లోకేష్ లు ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా లోకేష్ ఆశీస్సులే రాముకు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. తగ్గేదేలేదన్న రావి మాజీ ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడాలని, భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని చంద్రబాబు పురమాయించడంతో మూడు వారాల కిందట అచ్చెన్నాయుడు రావిని విజయవాడకు ఆహ్వానించారు. బాబు అభిప్రాయాలను రావి వద్ద ప్రస్తావించడం.. అందుకు ససేమిరా అనడంతో పాటు తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టి ఈమారు తగ్గేదేలేదన్నారనేది సమాచారం. ‘డబ్బుల కట్టలతో వచ్చిన వారికి టికెట్ ఇచ్చేస్తాం. వారు పోటీచేస్తారు. మీరు పక్కకు తప్పుకోండి. ఇంకేదైనా పదవి ఇస్తామంటే కుదరదు’ గతంలో కూడా ఇలాగే జరిగింది. ఈ పర్యాయం అంగీకరించేది లేదు. ఖర్చు పెట్టుకోలేరు అంటున్నారు. నా స్థాయిలో నేను ఖర్చుకు సిద్ధం. తక్కినది పార్టీ భరించాల్సిందే. ఇన్నేళ్లుగా పార్టీ కార్యక్రమాలను కొనసాగించింది ఎవరు? ఇవన్నీ పార్టీ నాయకత్వానికి తెలియదా? అని నిలదీయడంతో కంగుతినడం పార్టీ రాష్ట్ర అ«ధ్యక్షుడి వంతైందని పారీ్టవర్గాలు అంటున్నాయి. తన అభిప్రాయాలన్నింటినీ అధినేతకు స్పష్టంగా వివరించాలనడంతో అచ్చెన్నాయుడు అదే చేశారనేది సమాచారం. మరో ప్రయత్నంగా రెండు వారాల కిందట మాజీమంత్రి, పొలిట్‌బ్యూరో సభ్యుడు అయిన కొల్లు రవీంద్రను గుడివాడలోని రావి వద్దకు అధిష్టానం రాయబారానికి పంపింది. అచ్చెన్నాయుడు వద్ద కన్నా ఇంకాస్త ఘాటుగానే స్వరం పెంచడంతో కొల్లు వెళ్లి రావి వైనాన్ని బాబుకు వివరించారని తెలిసింది. వెనిగండ్లనే కావాలంటే.. మీరే చేసుకోండి గుడివాడ నుంచి వెనిగండ్లనే పోటీ చేయించాలనుకుంటే ఎన్నికలు కూడా మీరే చేసుకోండని, తాము దూరంగా ఉంటామని అధిష్టానానికి నియోజకవర్గంలోని పలువురు మండల ముఖ్య నాయకులు తేల్చిచెప్పారని పార్టీ వర్గాలు అంటున్నాయి. వారితో పార్టీ మండల అధ్యక్షులు కూడా శ్రుతి కలపడం అధిష్టానాన్ని ఆలోచనల్లో పడేసినట్లయ్యింది. రావికి దన్నుగా... విజయవాడ లోక్‌సభ స్థానంతో పాటు ఉమ్మడి కృష్ణాలోని పలు నియోజకవర్గాల సీనియర్లకు టికెట్ ఉంటుందో, ఊడుతుందో అంతుబట్టడంలేదు. వెనిగండ్లలాంటి ప్రవాసాంధ్రులు, పారిశ్రామికవేత్తలు రంగంలోకి వస్తున్నారని, ఒకవేళ టీడీపీ జనసేన కలిసి పోటీచేస్తే ఎవరెవరి సీట్లకు ఎసరొస్తుందో దిక్కుతెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్లుగా పరస్పర అవగాహనతో వ్యవహరిస్తే ఎవరి స్థానాలను వారు కాపాడుకోవచ్చనే అంచనాకు వచ్చారని, ఆ దృష్ట్యానే రావి తన వాయిస్‌ను గట్టిగా వినిపించారంటున్నారు. ‘మాదగ్గర డబ్బులున్నాయి. మేం పోటీచేస్తాం. మీరు పక్కకు తప్పుకోండి’ అని వేషగాళ్ల మాదిరి ఎవరుపడితే వారొచ్చేస్తుంటే మనం ఎందుకు తప్పుకోవాలి. అవసరమైతే పిలువు గుడివాడకు వస్తా. నీకు అండగా నేను నిలుస్తా’ అని ఓ సీనియర్ నేత భుజం తట్టినందునే రావి అంత దన్నుగా ఉన్నారనేది విశ్లేషకుల అభిప్రాయం. -
మున్సిపల్ అధికారులపై రెచ్చిపోయిన ‘రావి’
సాక్షి ప్రతినిధి, విజయవాడ/గుడివాడరూరల్: హైకోర్టు ఆదేశాల మేరకు గుడివాడలో ఆక్రమణలు తొలగిస్తున్న మున్సిపల్ అధికారులపై టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు రెచ్చిపోయారు. ఉద్యోగుల విధులకు అడ్డుతగిలి బూతులు తిడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. గుడివాడలోని నాగవరప్పాడు–లింగవరం చానల్‌ను ఆక్రమించుకుని ఏడుగురు ఇళ్లు నిర్మించుకున్నారు. దీంతో మురుగు నీటిపారుదలకు ఆటంకం ఏర్పడుతోందని అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరుతూ ఆ ప్రాంతంలో సొంత స్థలం కలిగిన మలిరెడ్డి శ్రీనివాసరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేసిన హైకోర్టు... అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగించాలని సచివాలయ ఉద్యోగులు మూడు నెలల కిందట ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చారు. ఆక్రమణలో ఉన్నవారికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేసింది. నలుగురు స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేశారు. ముగ్గురు మాత్రం ఖాళీ చేయలేదు. దీంతో ఫిర్యాదుదారుడు మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా, వెంటనే ఆక్రమణలు తొలగించాలని ఆదేశించింది. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ నాగేంద్రప్రసాద్, సిటీ ప్లానర్ వై.రాంబాబు, మున్సిపల్ సిబ్బంది, ఇరిగేషన్ అధికారులు, పోలీసులతో కలసి సోమవారం ఆక్రమణలను తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా... రావి వెంకటేశ్వరరావు తమ పార్టీ నాయకులతో కలసి వచ్చి అడ్డుకున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రావి వెంకటేశ్వరరావుతోపాటు మరికొందరు టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం కోర్టులో హాజరుపరచగా, రూ.20వేలు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. -
గుడివాడలో బరిసెలతో ‘రావి’ రౌడీయిజం.. సీఐపై దాడి.. చిరిగిన యూనిఫాం
గుడివాడ రూరల్: దివంగత నేత వంగవీటి మోహనరంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలను ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ నాయకులు మారణాయుధాలతో అడ్డుకుని బరి తెగించి ప్రవర్తించారు. రంగా వర్ధంతిని మీరెలా నిర్వహిస్తారంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సమక్షంలో దుర్భాషలాడారు. దీంతో గుడివాడ మెయిన్ రోడ్డు నెహ్రూచౌక్ నుంచి రావి టెక్స్టైల్స్ వరకు రాత్రి ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నాయకులను చెదరగొడుతున్న వన్‌టౌన్ సీఐ గోవిందరాజులు, సిబ్బంది టీడీపీ నాయకులు కర్రలు, బరిసెలతో రహదారిపై తిరుగుతూ ఎమ్మెల్యే కొడాలి నానిని దూషించారు. వారించేందుకు ప్రయత్నించిన వన్‌టౌన్ సీఐ గోవిందరాజులపై దాడికి యత్నించారు. సీఐ యూనిఫాంను చించేశారు. అనంతరం డీఎస్పీ ఎన్.సత్యానందం సిబ్బందితో కలసి అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను సముదాయించి పంపేశారు. ఓ మాజీ ఎమ్మెల్యే స్వయంగా దాడులకు ప్రోత్సహిస్తూ ఉద్రిక్తత రేకెత్తించటాన్ని గుడివాడ ప్రజలు తప్పుబడుతున్నారు. -
'ఆయన ఉన్నంతకాలం టీడీపీ గుడివాడలో గెలిచే ప్రసక్తే లేదు'
సాక్షి, కృష్ణా జిల్లా: గుడివాడ టీడీపీ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావుపై కాపు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రావి వెంకటేశ్వరరావు ఒక రాజకీయ అజ్ఞాని అంటూ మండిపడ్డారు. గుడివాడలో బలమైన వర్గాలైన బీసీ, కాపు వర్గాలకు టీడీపీలో రావి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. రావి కుటుంబ హయాంలో కాపు వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. ఏ ముఖం పెట్టుకుని రంగా వర్ధంతి, జయంతి కార్యక్రమాల్లో రావి పాల్గొంటున్నారని ప్రశ్నించారు. టీడీపీలోని కాపు వర్గాల నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరారు. కాపు వర్గాలకు అన్యాయం చేస్తున్న రావి కుటుంబం ఉన్నంతకాలం గుడివాడలో టీడీపీ గెలిచే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. చదవండి: (వైఎస్సార్ షాదీ తోఫాకు దూదేకులు అర్హులే) -
గుడివాడ టీడీపీలో తీవ్రస్థాయికి విభేదాలు.. మినీ మహానాడు సైతం రద్దు
సాక్షి, విజయవాడ: గుడివాడ టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. దీంతో బుధవారం నిర్వహించాల్సిన మినీ మహానాడు సైతం రద్దయింది. నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, పార్టీ నేత శిష్లా లోహిత్ వర్గాలు ఫ్లెక్సీలు చించుకుని పార్టీ పరువును రోడ్డున పడేశారు. దీంతో రెండు వర్గాల మధ్య విభేదాలు ఓ కొలిక్కి రాకపోవడంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మహానాడుకు ఏర్పాట్లు పూర్తయినా టీడీపీ అదిష్టానం కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఇప్పటికే రెండు వర్గాల మధ్య రాజీ చేసినా ఫలితం దక్కకపోవడం గమనార్హం. చదవండి: (చంద్రబాబుకు ప్రకృతి కూడా సహకరించదు: కొడాలి నాని) -
తెలుగు తమ్ముళ్లపై చంద్రబాబు సీరియస్
విజయవాడ: తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోవడంపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. గుడివాడ ఆఫీసర్స్ క్లబ్లో రావి వెంకటేశ్వరరావు రివాల్వర్‌తో హల్ చల్ చేయడం, బాపట్ల బీచ్‌లో ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ..హరిత రిసార్ట్స్ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ రెండు సంఘటనలపై వివరణ ఇవ్వాలని రావి వెంకటేశ్వరరావు, అన్నం సతీశ్‌లో చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. చదవండి...(రివాల్వర్ అప్పగించిన టీడీపీ నేత) అధ్యక్షుడి ఆదేశాలతో రావి వెంకటేశ్వరరావు శనివారం హుటాహుటీన సీఎం నివాసానికి వచ్చారు. గుడివాడ కాల్పుల ఘటనపై చంద్రబాబుకు వివరణ ఇచ్చారు. మరోవైపు బాపట్ల బీచ్ ఘటనపై ఎమ్మెల్సీ అన్నం సతీశ్...సీఎంకు ఫోన్ కాల్ చేశారు. ప్రస్తుతం దూరంగా ఉన్నందున తర్వాత వచ్చి కలుస్తానంటూ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. (బీచ్‌లో టీడీపీ ఎమ్మెల్సీ సతీశ్ వీరంగం) -
ముందంజలో కొడాలి నాని
గుడివాడ : కృష్ణాజిల్లా గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడాలి నాని ముందంజలో ఉన్నారు. ఆయన తన సమీప టీడీపీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావుపై ఆధిక్యంలో 630 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా మచిలీపట్నంలో పేర్ని నాని వెనుకంజలో ఉన్నారు. -
టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన కార్యకర్తలు
గుడివాడ : కృష్ణాజిల్లా గుడివాడలో టీడీపీ కార్యాలయాన్ని కార్యకర్తలు బుధవారం ముట్టడించారు. రావి వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పార్టీ ఫండ్ ఇవ్వలేదని వారు ఆందోళనకు దిగారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా రావి వెంకటేశ్వరరావు బరిలో ఉన్న విషయం తెలిసిందే. కాగా గుడివాడ నియోజకవర్గం ఫలితాలపై జిల్లావాసులంతా ఆసక్తి కనబరుస్తున్నారు. చంద్రబాబు విశ్వాస ఘాతుకాన్ని, అవకాశవాదాన్ని తూర్పారబడుతూ టీడీపీకి గుడ్‌బై చెప్పిన తాజా మాజీ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఈసారి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు గెలిచిన ఆయన మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు సమాయత్తమవుతున్నారు. -
బాబు సాక్షిగా తమ్ముళ్ల తన్నులాట!
=ఒకరిపై మరొకరు దాడి. =పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు =అర్ధరాత్రి ‘రావి’ పంచాయితీ గుడివాడ అర్బన్, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్ల మధ్య రోజు రోజుకు ఘర్షణలు పెరిగిపోయి కొట్లాడుకునేస్థాయికి చేరుతున్నాయి. చివరికి బాబు ఎదుటే పంచాయతీ పెట్టే స్థాయికి వచ్చాయి. వివరాల్లోకి వెళితే గుడివాడ తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్ష పదవి కోసం ఇద్దరు యువకులుపోటీపడుతున్నారు. వీరిద్దరిలో ఎవర్ని నియమించాలో తెలియక నియోజకవర్గపు ఇన్‌ఛార్జి రావి వెంకటేశ్వరరావు సతమతమవుతున్నారు . దీంతో ఆ ఇద్దరు యువకుల వర్గాల మధ్య నిత్యం ఘర్షణలు చోటు చేసుకుని పోలీస్‌స్టేషన్ వరకూ వెళ్తున్నాయి. కడియాల గణేష్, నానాజీ అనే ఇద్దరు తమ అనుచరవర్గంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తుపాను దెబ్బకు పంటనష్టపోయిన రైతులను పరామర్శించేందకు చంద్రబాబు మంగళవారం గుడివాడ నియోజకవర్గానికి వస్తున్నారనే విషయం తెలుసుకున్న గణేష్, నానాజీ తమ తమ అనుచరులతో విద్యుత్ కార్యాలయం వద్దకు ర్యాలీగా వచ్చారు. బాబు కాన్వాయ్ వెంట గణేష్‌కు చెందిన 12మంది కుర్రాళ్లు, నానాజీకి చెందిన 18మంది కుర్రాళ్లు ర్యాలీగా వెళ్తున్నారు. నాగవరప్పాడు వంతెన వద్దకు రాగానే రోడ్డు గతుకులుగా ఉండటం వల్ల పక్కపక్కన వెళ్తున్న గణేష్ అనుచరుడు శంకర్, నానాజీ అనుచరుడు వల్లభనేని హరీనాథ్ వాహానాలు ఒకదానికొకటి రాసుకున్నాయి. దీంతో అసహనానికి గురైన నానాజీతో సహా 6గురు శంకర్‌పై దాడి చేశారు. ఈ దాడిలో శంకర్‌కు కన్ను పక్కన, నుదిటిపై గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గణేష్ స్థానిక పాలిటెక్నిక్ కళాశాల వద్ద తన ద్విచక్రవాహానాన్ని బాబు కాన్వాయ్‌కు అడ్డం పెట్టారు. అప్పటికే సమయం మించిపోవడంతో బాబు కాన్వాయ్ ఆపకుండా పక్కన నుంచి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన గణేష్ జొన్నపాడులో రైతులతో మాట్లాడుతున్న చంద్రబాబు వద్దకు చేరుకుని ర్యాలీకి వస్తే నా అనుచరులను కొడతారా..? పార్టీలో రావి మాకు సరైన అవకాశం ఇవ్వట్లేదు మమ్మల్ని గుర్తించట్లేదు అధినాయకుడుగా మీరైనా న్యాయం చేయాలని బిగ్గరగా అరుస్తూ ఆందోళనకు దిగాడు. ఈ గొడవను బాబు గమనించేలోపు అక్కడ ఉన్న నాయకులు జోక్యం చేసుకుని పార్టీ కార్యాలయంలో సమస్య పరిష్కరిస్తాం.. ఇక్కడ ఎటువంటి ఆందోళన చేయొద్దు అని బతిమిలాడుతుండగానే బాబు అక్కడ నుంచి నిష్ర్కమించారు. నాపై అన్యాయంగా దాడి చేశారంటూ గణేష్ అనుచరుడు శంకర్ నానాజీ అతని అనుచరులపై అర్ధరాత్రి సమయంలో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం రాత్రి ఒంటిగంట సమయంలో స్థానిక పార్టీ కార్యాలయంలో రావి సమక్షంలో గణేష్ అనుచరులపై జరిగిన దాడి విషయమై పంచాయితీ పెట్టారు. పరిస్థితులు చక్కదిద్దడం మీకు చేతకాకపోతే తప్పుకోండి అంటూ రావిపై రుసరుసలాడినట్లు తెలిసింది. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని రావి వారికి హామీ ఇచ్చారని సమాచారం.