
సాక్షి, కృష్ణా జిల్లా: గుడివాడ టీడీపీ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావుపై కాపు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రావి వెంకటేశ్వరరావు ఒక రాజకీయ అజ్ఞాని అంటూ మండిపడ్డారు. గుడివాడలో బలమైన వర్గాలైన బీసీ, కాపు వర్గాలకు టీడీపీలో రావి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు.
రావి కుటుంబ హయాంలో కాపు వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. ఏ ముఖం పెట్టుకుని రంగా వర్ధంతి, జయంతి కార్యక్రమాల్లో రావి పాల్గొంటున్నారని ప్రశ్నించారు. టీడీపీలోని కాపు వర్గాల నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరారు. కాపు వర్గాలకు అన్యాయం చేస్తున్న రావి కుటుంబం ఉన్నంతకాలం గుడివాడలో టీడీపీ గెలిచే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment