
వైఎస్సార్‌సీపీ నాయకులను మాజీ ఎమ్మెల్యే రావి సమక్షంలో రెచ్చగొడుతున్న టీడీపీ నాయకులు
గుడివాడ రూరల్: దివంగత నేత వంగవీటి మోహనరంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలను ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ నాయకులు మారణాయుధాలతో అడ్డుకుని బరి తెగించి ప్రవర్తించారు. రంగా వర్ధంతిని మీరెలా నిర్వహిస్తారంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సమక్షంలో దుర్భాషలాడారు. దీంతో గుడివాడ మెయిన్ రోడ్డు నెహ్రూచౌక్ నుంచి రావి టెక్స్‌టైల్స్ వరకు రాత్రి ఉద్రిక్తత నెలకొంది.
టీడీపీ నాయకులను చెదరగొడుతున్న వన్‌టౌన్ సీఐ గోవిందరాజులు, సిబ్బంది
టీడీపీ నాయకులు కర్రలు, బరిసెలతో రహదారిపై తిరుగుతూ ఎమ్మెల్యే కొడాలి నానిని దూషించారు. వారించేందుకు ప్రయత్నించిన వన్‌టౌన్ సీఐ గోవిందరాజులపై దాడికి యత్నించారు. సీఐ యూనిఫాంను చించేశారు. అనంతరం డీఎస్పీ ఎన్.సత్యానందం సిబ్బందితో కలసి అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను సముదాయించి పంపేశారు. ఓ మాజీ ఎమ్మెల్యే స్వయంగా దాడులకు ప్రోత్సహిస్తూ ఉద్రిక్తత రేకెత్తించటాన్ని గుడివాడ ప్రజలు తప్పుబడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment