Vangaveeti Mohana ranga
-
రంగా హంతకులకు ఊడిగం..పవన్..ఇం-కాపునీ నాటకం..
-
చంద్రబాబుపై రంగా హత్య రక్తపు మరకలు!
పాలకొల్లు సెంట్రల్ : విపక్షాల ఓట్లు చీలకుండా చేయడం వల్ల జనసేన అభ్యర్థులను కొంతవరకూ గెలిపించుకునే అవకాశాలున్నా టీడీపీతో పొత్తు వల్ల పలు నష్టాలున్నాయని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామజోగయ్య పేర్కొన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో టీడీపీపై అవినీతి, కుల ముద్రతో పాటు ఆయనపై రంగా హత్య ఉదంతం రక్తపు మరకలు అలాగే ఉన్నాయన్నారు. చంద్రబాబుకు వయోభారం, లోకేశ్‌కు అనుభవరాహిత్యం, ప్రధాని మోదీకి బద్ధ శత్రువుగా మిగలడం, కాపు రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లోపించడం, బీసీలకు జనాభా ప్రాతిపదికపైన రిజర్వేషన్ల డిమాండ్‌పై స్పందించకపోవడం లాంటి వాటివల్ల చివరకు జనసేనకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. జనసేన కనీసం 75 సీట్లలో పోటీ చేసి 50 సీట్లు కైవసం చేసుకుంటే గౌరవప్రదమైన అధికారాన్ని పొందవచ్చని జోగయ్య పేర్కొన్నారు. చంద్రబాబుకు పూర్తి కాలం అధికారాన్ని అప్పగిస్తే పవన్‌పై వస్తున్న ప్యాకేజీ ఆరోపణలు నిజమేనని భావించే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు రాజకీయ విశ్లేషణ పేరుతో చేగొండి బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో గత ఎన్నికల్లో బీజేపీకి ఒక్క శాతం లోపు మాత్రమే ఓట్లు రాగా జనసేనతో పొత్తు వల్ల రెండు శాతం పెరగవచ్చన్నారు. సీఎం జగన్‌ను ఓడించేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రమే అని పేర్కొన్నారు. కేంద్రంతో సీఎం జగన్‌కు ఉన్న సత్సంబంధాలే దీనికి కారణమన్నారు. -
చంపిన వాళ్లే సానుభూతికి ప్రయత్నిస్తున్నారు
సత్తెనపల్లి: వంగవీటి మోహనరంగా తనకు ప్రాణహాని ఉందని తెలిసి రక్షణ కోరితే.. ఆనాటి ప్రభుత్వం రక్షణ కల్పించక పోగా హత్య చేశారని, చంద్రబాబు, నాటి హోంమంత్రి ప్రోద్బలంతోనే ఆ హత్య జరిగిందని రాష్ట్ర మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. పేదల పక్షపాతి రంగాను కుట్ర చేసి దారుణంగా చంపిన వాళ్లే తిరిగి సానుభూతి కోసం ఆయన జయంతి, వర్థంతిలను నిర్వహిస్తున్నారని టీడీపీ నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు. వంగవీటి మోహనరంగా జయంతిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంగళవారం ఆయన కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పలువురు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
రంగా ఎదుగుదలను ఓర్వలేక ఓ పార్టీ పొట్టన పెట్టుకుంది
చల్లపల్లి (అవనిగడ్డ): తనను నమ్మినవారికోసం ఎన్నో కష్టాలు పడుతూ, కుట్రలు, కుతంత్రాల మధ్య విజయపథంలో పయనిస్తున్న వంగవీటి మోహనరంగాను చూసి తట్టుకోలేక స్వార్థ ఆలోచనతో ఒక పార్టీ ఆయన్ని హత్యచేసేవరకు నిద్రపోలేదని రాధారంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర చెప్పారు. కృష్ణాజిల్లా చల్లపల్లిలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఆయన వర్ధంతి సందర్భంగా సోమవారం నరేంద్ర ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడైనా రంగా విగ్రహం పెడుతున్నారంటే తప్పుచేసిన వారి వెన్నులో వణుకు పుడుతోందని చెప్పారు. నాడు రంగాను చంపిన పార్టీ నాయకులు ఇప్పుడు ఆయన విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు. రంగా విగ్రహాలు పెడతామని, వర్ధంతి, జయంతి చేస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రాధారంగా మిత్రమండలి జిల్లా అధ్యక్షుడు ‘బుల్లెట్’ ధర్మారావు, జెడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కల్యాణి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ పాల్గొన్నారు. -
పేదల కోసం పరితపించిన వ్యక్తి వంగవీటి రంగా: ఎంపీ బాలశౌరి
-
గుడివాడలో బరిసెలతో ‘రావి’ రౌడీయిజం.. సీఐపై దాడి.. చిరిగిన యూనిఫాం
గుడివాడ రూరల్: దివంగత నేత వంగవీటి మోహనరంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలను ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ నాయకులు మారణాయుధాలతో అడ్డుకుని బరి తెగించి ప్రవర్తించారు. రంగా వర్ధంతిని మీరెలా నిర్వహిస్తారంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సమక్షంలో దుర్భాషలాడారు. దీంతో గుడివాడ మెయిన్ రోడ్డు నెహ్రూచౌక్ నుంచి రావి టెక్స్టైల్స్ వరకు రాత్రి ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నాయకులను చెదరగొడుతున్న వన్‌టౌన్ సీఐ గోవిందరాజులు, సిబ్బంది టీడీపీ నాయకులు కర్రలు, బరిసెలతో రహదారిపై తిరుగుతూ ఎమ్మెల్యే కొడాలి నానిని దూషించారు. వారించేందుకు ప్రయత్నించిన వన్‌టౌన్ సీఐ గోవిందరాజులపై దాడికి యత్నించారు. సీఐ యూనిఫాంను చించేశారు. అనంతరం డీఎస్పీ ఎన్.సత్యానందం సిబ్బందితో కలసి అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను సముదాయించి పంపేశారు. ఓ మాజీ ఎమ్మెల్యే స్వయంగా దాడులకు ప్రోత్సహిస్తూ ఉద్రిక్తత రేకెత్తించటాన్ని గుడివాడ ప్రజలు తప్పుబడుతున్నారు. -
ప్రజల గుండెల్లో రంగా స్థానం నేటికీ పదిలం
విజయవాడ రూరల్: పేదల హక్కుల కోసం కృషి చేసిన వంగవీటి మోహనరంగా మరణించి 34 ఏళ్లు గడిచినా ప్రజల గుండెల్లో నేటికీ ఆయన చిరస్థాయిగా నిలిచే ఉన్నారని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. విజయవాడ సమీపంలోని నున్నలో వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ ఆదివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ.. 1989లో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే రంగా శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చన్నారు. మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం జీవించి, వారి కోసమే ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకుడు వీఎం రంగా అన్నారు. ఆయన మరణించి 34 సంవత్సరాలైనా ఇప్పటికీ ప్రజలు గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారని పేర్కొన్నారు. డబ్బు సంపాదించాలనే ఆపేక్ష లేని రంగా తనయుడు విజయవాడలో సొంత ఇల్లు కూడా సమకూర్చుకోలేదన్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. వీఎం రంగా ప్రజల మనిషని అన్నారు. మూడేళ్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు చేసి 35 సంవత్సరాలుగా ప్రజల మనిషిగా వారి గుండెల్లో నిలిచిపోయారన్నాని, రంగాకు మరణమే లేదని పేర్కొన్నారు. ఆయన తనయుడు రాధాకృష్ణ రాజకీయాల్లో ఎదగాలని ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ.. వీఎం రంగా పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నారు. వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి తోట వెంకయ్య, విగ్రహ దాత కొట్టే రవికుమార్, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆర్వీఆర్, ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి, జెడ్పీటీసీ కె.సువర్ణరాజు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ యర్కారెడ్డి నాగిరెడ్డి, సర్పంచ్ కాటూరి సరళ పాల్గొన్నారు. -
కృష్ణా జిల్లాలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ
-
‘వంగవీటిని హత్య చేయించిన టీడీపీని ఓడించండి’
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): వంగవీటి మోహనరంగాను హత్య చేయించిన టీడీపీని మునిసిపల్ ఎన్నికల్లో ఓడించి, వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు సుంకర శ్రీనివాసరావు కాపు కులస్తులకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎన్నడూ ప్రశ్నించని పవన్‌కల్యాణ్ ఇప్పుడు ప్రజాభిమానంతో సీఎం అయిన జగన్‌ను ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ నాయకులు జనసేనకు ఓటు వేయాలని ప్రచారం చేయడం వింతగా ఉందన్నారు. విజయవాడ అభివృద్ధి వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమన్నారు. -
విజయవాడలో వంగవీటి రంగా వర్ధంతి
సాక్షి, విజయవాడ: వంగవీటి మోహనరంగా 31వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. గురువారం విజయవాడ వైఎస్సార్సీపీ అర్బన్ కార్యాలయంలో వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర అర్బన్ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిలో వంగవీటి రంగా విగ్రహానికి మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళర్పించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘రంగాని కిరాతకంగా హత్య చేసింది టీడీపీనే’
సాక్షి, హైదరాబాద్ : వంగవీటి మోహనరంగాను కిరాతకంగా హత్య చేసింది తెలుగుదేశం పార్టీనేనని వైఎస్సార్ సీపీ నేత, విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను వ్యాఖ్యానించారు. రంగాని హత్య చేసింది టీడీపీ గూండాలు కాదని వంగవీటి రాధా చెప్పటం బాధాకరమన్నారు. గురువారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రంగాను టీడీపీ గూండాలు ఏ విధంగా హత్య చేశారో రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు. నాటి పరిస్థితులను తాము ప్రత్యక్షంగా చూశామని తెలిపారు. రాధా మాటలతో రంగా అభిమానిగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతగా బాధపడుతున్నానని పేర్కొన్నారు. చేగొండి హరిరామజోగయ్య ఆ రోజులలో మంత్రిగా ఉన్నారని, ఆయన రాసిన పుస్తకంలో కూడా రంగా హత్య వెనక చంద్రబాబు స్ర్కీన్ ప్లే వహించాడని రాశారన్నారు. రాధా మాటలతో రంగా అభిమానులందరు బాధపడుతున్నారని తెలిపారు. రాధా ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు చూస్తే టీడీపీలో చేరినట్లుగానే మాట్లాడారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వంగవీటి రంగా కుమారుడిగా రాధాకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. రాధాను యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని వెల్లడించారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘ఈ నాలుగు సంవత్సరాలలో రాధా పార్టీ కోసం ఉద్యమాలు చేశారా?. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారా?. మీ కుటుంబంతో మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మీ తండ్రిని ఘోరాతిఘోరంగా టీడీపీ గూండాలు బస్‌లో వచ్చి హత్య చేస్తే నువ్వు మళ్లీ తిరిగి ఆ పార్టీలో ఎందుకు చేరుతున్నావో ఆత్మపరిశీలన చేసుకో. మీ అమ్మగారు టీడీపీలో చేరినప్పుడే రంగా గారి ఆత్మఘోషించింది. ఇప్పుడు మళ్లీ ప్రెస్ మీట్లో నువ్వు మాట్లాడిన మాటలు విని రంగా గారి అభిమానులు బాధపడుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి గారు మీ తల్లికి టిక్కెట్ విషయంలో సమస్య తలెత్తితే టిక్కెట్ ఇప్పించారు. రాధా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇవాళ రంగా గారి ఆత్మ క్షోభిస్తుంది. ప్రజలను చంద్రబాబు ఏ విధంగా వంచిస్తున్నారో ఆ వంచనను ప్రజలకు తెలియచేయాలని వైఎస్ జగన్ తపిస్తుంటారు. వైఎస్ జగన్ గారు స్పష్టంగా ‘ మీ నాన్న గారు తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు కాబట్టి నువ్వు కూడా అక్కడినుంచి పోటీ చేస్తే బాగుంటుందని’ సూచించారు. దేవినేని నెహ్రూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానంటే రాధా చెప్పడం వల్లనే చేర్చుకోలేద’’ని తెలిపారు. -
రంగాకు ఘన నివాళి
విజయవాడ సిటీ/ఉయ్యూరు(పెనమలూరు) : పేదల అభ్యున్నతి కోసం ప్రజా పోరాటాలు చేసిన వంగవీటి రంగాను ఆదర్శంగా తీసుకుని నేటి యువత పనిచేయాలని వైఎస్సార్సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు అన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం రంగా వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పార్టీ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొప్పన భవకుమార్, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాలే పుల్లారావు పూలమాల వేసి నివాళులర్పించారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ పేదలకు అండగా నిలిచేతత్వమే ఆయనకు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిపెట్టిందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు, బీసీ సెల్ నేత కసగోని దుర్గారావు, డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ షేక్, వైఎస్సార్ విద్యార్థి విభాగం దొడ్డా అంజిరెడ్డి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పల్లి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. నా తండ్రి ఆశయాలు సాధిస్తా.. ‘ప్రజా సేవతో నా తండ్రి మోహనరంగా ఆశయాలను సాధిస్తా..’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. కాటూరులో రాధా–రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో బుధవారం దివంగత వంగవీటి మోహనరంగా వర్ధంతి నిర్వహించారు. రాధా–రంగా స్మరణ భూమిలో స్మృతివనం ఏర్పాటుకు భూమిపూజ చేశారు. రంగా చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాధాకృష్ణ మాట్లాడుతూ రాజకీయాలు, కులమతాలకతీతంగా సేవ చేస్తాన్నారు. చిరస్మరణీయుడు రంగా ప్రజలకు సేవచేసి వారి హృదయాల్లో రంగా నిలిచి ఉన్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. రాధా–రంగా స్మృతి వనం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో రంగా సతీమణి, మాజీ ఎమ్మెల్యే రత్నకుమారి, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, వైఎస్సార్సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి) తదితరులు పాల్గొన్నారు. రంగా చిత్రపటానికి నివాళులర్పించిన వైఎస్సార్సీపీ నేతలు -
వంగవీటి రంగాకు ఘన నివాళులు
సాక్షి, విజయవాడ: మాజీ శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ.. రాఘవయ్య పార్క్ సెంటర్లో గల రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ‘రాజకీయాలకు అతీతంగా రంగా వర్ధంతి చేస్తున్నాం. నాన్న ఆశయాల కోసం చివరి వరకూ పనిచేస్తా. ఆయనను నమ్ముకున్న వాళ్ళకి అండగా ఉంటా. వాళ్లకి న్యాయం చెయ్యాల్సి ఉంది. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది’అని వ్యాఖ్యానించారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ నేతలు బొప్పన భవకుమార్, ఆసిఫ్, చందన సురేష్, కాజా రాజ్‌కుమార్, పలువురు రాధా-రంగా మిత్రమండలి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విజయవాడ నుంచి కాటూరుకు రాధా ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. కాటూరులో వంగవీటి రంగా స్మారక భూమికి రాధా శంకుస్థాపన చేయనున్నారు. -
నువ్వు ఐఏఎస్ అయితే నేను.. ఐపీఎస్!
టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు.. అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేవి రెండే రెండు విషయాలు.. మొదటిది విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నిందితుడైతే.. రెండోది మద్యం సిండికేట్ ముఠా నాయకుడు..కానీ వీటితో పాటు ఆయనకు ఇంకో అర్హత కూడా ఉందట!.. దాని గురించి స్వయంగా ఆ సారే ఈ మధ్య చెప్పుకున్నారు.. అదేంటంటే.. ఆయన ఐపీఎస్ అట?!..అదేంటి.. ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ కదా.. మరి అప్పట్లో రాష్ట్రాన్నే కుదిపేసిన ఓ సంచలన హత్య కేసులో మూడో ముద్దాయి వెలగపూడి ఐపీఎస్ కావడమేమిటి? అసలు దాన్ని ఎలా.. ఎప్పుడు చేశారు??.. ఈ అదనపు అర్హతను ఇన్నాళ్లూ ఎందుకు దాచేశారు???.. అన్న ప్రశ్నలు మీ మెదళ్లను తొలిచేస్తున్నాయి కదూ.. అంత మల్లగుల్లాలు పడకండి.. ఎందుకంటే ఆయనకు అంత సీన్ లేదు.. ఆయన చెప్పుకున్న ఐపీఎస్ వేరు.. పోలీసు అధికారులయ్యేందుకు చేసే ఐపీఎస్ వేరు.. ఐపీఎస్ అంటే ఇండియన్ పొలిటికల్ సర్వీస్ అని.. ఆయనగారు కొత్త భాష్యం చెప్పుకున్నారు. ఇలా ఐపీఎస్ అని ఆయన తన అనుచరుల వద్దో, సామాన్యుల వద్దో బిల్డప్ ఇచ్చారనుకుంటే పోనీలే అనుకోవచ్చు.. కానీ ఆయనగారు ఏకంగా జిల్లా పరిపాలనాధికారి వద్దే... ‘నువ్వు ఐఏఎస్ అయితే.. నేను ఐపీఎస్ అంటూ’.. తన అహాన్ని,, ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూశారు. తీరా సదరు అధికారి నేరుగా సీఎంకే ఫిర్యాదు చేయడంతో కడకు ఒకింత తగ్గారు.. కానీ ఆయనపై అధికారుల ఆగ్రహం మాత్రం నేటికీ చల్లారలేదు. తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారశైలి రచ్చ అయిన నేపథ్యంలో.. ఇటీవల చోటుచేసుకున్న ‘వెలగపూడి ఐపీఎస్’ ఎపిసోడ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : మంత్రి గంటా శ్రీనివాసరావు ఆనందపురం తహసీల్దార్‌ను ఇంటికి పిలిపించుకుని బండ బూతులు తిట్టిన వ్యవహారం రచ్చకెక్కిన నేపథ్యంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ‘ఐపీఎస్’ ఎపిసోడ్ ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. తనకు తెలయకుండా మండలంలోని భూములను టిడ్కోకు కట్టబెట్టిన విషయమై మంత్రి గంటా తహసీల్దార్‌ను దూషించిన వైనంపై ‘ఏం వేషాలేస్తున్నావా’ అనే శీర్షికన బుధవారం సాక్షిలో వచ్చిన కథనం రెవెన్యూ వర్గాల్లో మనోస్థైర్యం నింపింది. ఈ నేపథ్యంలో ఇటీవల టీడీపీకే చెందిన ఎమ్మెల్యే వెలగపూడి.. ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ విషయంలో ఏకంగా జిల్లా ఉన్నతాధికారులనే నోటికొచ్చినట్లు ఆడిపోసుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో జేసీ నివాస్ ఇలానే ఎగిరిపోయాడంటూ బెదిరింపు ఎమ్మెల్యే ఒత్తిడికి లొంగని ఓ ఉన్నతాధికారి ధీటుగా సమాధానమిచ్చారు. ‘మిగిలిన వారి కంటే మీకే మూడు రెట్లు ఎక్కువిచ్చాం... కావాలంటే లిస్టు చూసుకోండి.. అని సూచించారు. ఆయన సమాధానంతో సంతృప్తి చెందని వెలగపూడి ఇంకా చాలా దరఖాస్తులు ఉన్నాయి కదాఅని అడగ్గా.. అవన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి.. అందుకే కొన్నింటిని తిరస్కరించాం, మరికొన్నింటిని పెండింగ్‌లో పెట్టాం.. అని ఆ అధికారి చెప్పుకొచ్చారు. కానీ ఎమ్మెల్యే ఇవేమీ పట్టించుకోకుండా ‘నువ్వు.. నువ్వు’.. అని ఏకవచనంతో సంభోదిస్తూ తీవ్రంగా మాట్లాడసాగారు. దీనికి సదరు అధికారి అభ్యంతరం చెబుతూ ‘సర్.. నేను ఐఏఎస్‌ను.. కాస్త, గౌరవంగా మాట్లాడండి’.. అని అన్నారు. దీంతో వెలగపూడి వ్యంగ్యంగా ‘నువ్వు ఐఏఎస్ అయితే నేను ఐపీఎస్.. ఇండియన్ పోలిటికల్ సర్వీస్.. అయితే ఏంటంట అని ఇష్టారాజ్యంగా మాట్లాడారు. అక్కడితో ఆగకుండా ‘ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ విషయంలోనే గతంలో ఐఏఎస్ అధికారి అయిన జాయింట్ కలెక్టర్ నివాస్ కూడా ఇలానే రూల్స్ మాట్లాడాడు. మేం తలుచుకోగానే దెబ్బకు ఎగిరిపోయాడు.. నువ్వు కూడా అంతే’.. అని ఆ అధికారినుద్దేశించి వ్యాఖ్యానించారు. సదరు అధికారి కూడా అదే స్థాయిలో స్పందిస్తూ ‘నేను ఎక్కడికైనా వెళ్లేందుకు రెడీ.. అందుకు సిద్ధపడే ఈ ఉద్యోగంలోకి వచ్చా.. నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు ఇచ్చే ప్రసక్తే లేదు.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి’.. అని స్పష్టం చేశారు. అందరి కంటే ఎక్కువే ఇచ్చినా.. జీవో నెంబర్ 388 ప్రకారం నగరంలో మూడో విడత క్రమబద్ధీకరణ భూ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని గత నెల 21న ఏయూ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా లాంఛనంగా కొంతమందికి.. మొత్తంగా 8271 మందికి పట్టాలు పంపిణీ చేశారు. జీవీఎంసీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి మొత్తం 48,137 దరఖాస్తులు రాగా.. 8271 దరఖాస్తులకు అధికారులు ఆమోదముద్ర వేశారు. ఆ మేరకు భీమిలి నియోజకవర్గంలో 340 దరఖాస్తులు, పెందుర్తిలో 876, గాజువాకలో 1045, విశాఖ పశ్చిమలో 1346, విశాఖ ఉత్తరలో 1049, విశాఖ దక్షిణలో 2 దరఖాస్తులకు ఆమోదముద్ర వేసిన అధికారులు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి మాత్రం అత్యధికంగా 3613 దరఖాస్తులకు ఆమోదముద్ర వేశారు. ఈ లెక్కన మిగిలిన ఎమ్మెల్యేల కంటే తూర్పు నియోజకవర్గంలోనే ఎక్కువ పట్టాలు అందజేశారు. కానీ దాంతోనే ఎమ్మెల్యే వెలగపూడి సంతృప్తి చెందలేదు. తన నియోజకవర్గం నుంచి 14,450 దరఖాస్తులు వస్తే 3,613 దరఖాస్తులకే ఓకే అంటే ఎలా?.. అని పట్టాల పంపిణీ కార్యక్రమానికి రెండురోజుల ముందు జిల్లా ఉన్నతాధికారులను నిలదీశారు. అన్ని దరఖాస్తులనూ ఆమోదించాలని ఒత్తిడి చేశారు. ఇంకా రగులుతున్న రెవెన్యూ వర్గాలు.. దీంతో అహం దెబ్బతిన్న వెలగపూడి రెండురోజుల పాటు పట్టాల పంపిణీ కార్యక్షకమ ఏర్పాట్లలో పాల్గొనలేదు. ఓ దశలో తోటి ఎమ్మెల్యేలను కూడగట్టి ఆ సభకు గైర్హాజరై సీఎంకు అధికారుల పట్ల తన అసమ్మతి తెలియజేయాలని భావించారు. అయితే ఇతర ఎమ్మెల్యేలు తోడు రాకపోవడం.. సరిగ్గా అదే సమయంలో జిల్లా ఉన్నతాధికారులు నేరుగా సీఎంకు ఫిర్యాదు చేసి.. ఆయన తీరును వివరించడంతో దిగివచ్చిన వెలగపూడి ఆ సభకు హాజరయ్యాడని అంటున్నారు. ఆ సభ చివరలో ముఖ్యమంత్రి స్వయంగా వెలగపూడి చేతుల మీదుగా జిల్లా అధికారులకు సన్మానం చేయించిన వైనం వెనుక ఇంత ఎపిసోడ్ నడిచిందని తెలిసింది. అయితే అప్పటికి ఆ వ్యవహారం సద్దుమణిగినా ఇప్పటికీ వెలగపూడి ‘ఐపీఎస్’ వ్యాఖ్యలు రెవెన్యూ వర్గాల్లో కాక పుట్టిస్తున్నాయని అంటున్నారు. -
రంగాని చంపింది టీడీపీ ప్రభుత్వమే
కృష్ణా జిల్లా: వంగవీటి రంగాని చంపింది టీడీపీ ప్రభుత్వమేనని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిథి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..రంగా బొమ్మ పెట్టుకుని ఓట్లు అడగటానికి వచ్చిన వ్యక్తులను నమ్మవద్దని సూచించారు. నిరాహార దీక్ష చేస్తున్న రంగాని హతమార్చింది ఎవరో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. రంగా మహోన్నత వ్యక్తి అని, ఆయన అడుగుజాడల్లో నడవటం వల్లే తాను ఈ రోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానని తెలిపారు. రంగాకి ద్రోహం చేసింది తెలుగుదేశం నాయకులేనని ఆరోపించారు. రంగా పేదల మనిషని, ప్రజలకు మేలు చేసే నాయకత్వం వహించే లక్షణాలు ఉన్న ఏకైక వ్యక్తి రంగన్న అని కొనియాడారు. వంగవీటి మోహన రంగా 71వ జయంతి సందర్భంగా రాధారంగా మిత్రమండలి, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అవనిగడ్డలో 10 స్కూళ్లలో 500 మంది విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పాల రాం ప్రసాద్ ఆధ్వర్యంలో పెడన నియోజకవర్గంలోని ఆకులమన్నాడు, ముంజులూరు, చెరుకుమిల్లి గ్రామాల్లో రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
‘కులమతాలకు అతీతంగా రంగా పనిచేశారు’
సాక్షి, విజయవాడ : కులమతాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి వంగవీటి మోహన రంగా కృషి చేశారని రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. వంగవీటి మోహన రంగా 71వ జయంతి సందర్భంగా నగరంలోని రాఘవయ్య పార్క్ వద్ద రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాధాకృష్ణ మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు తన తండ్రిని ఆరాధించడం సంతోషంగా ఉందన్నారు. పేదల కోసమే రంగా పనిచేశారని.. అందుకే ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయారని పేర్కొన్నారు. రంగా కుమారుడిగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానన్నారు. రాధా రంగా మిత్ర మండలి సభ్యులను కలుపుకొని పని చేస్తానని రాధాకృష్ణ పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో.. వంగవీటి మోహన రంగా 71వ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగా పేద ప్రజల కోసం కృషి చేసిన గొప్ప నాయకుడని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పార్థసారథి, సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, పైలా సోమినాయుడు, పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వెలిచేరులో రంగా విగ్రహం ధ్వంసం
తూర్పుగోదావరి ,ఆత్రేయపురం: గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి సమయంలో వెలిచేరు సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వంగవీటి మోహన్‌రంగా విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పోలీసు జాగిలాలు గుర్తుపట్టకుండా విగ్రహం చుట్టూ కారం చల్లారు. విగ్రహం మెడ భాగం నుంచి తలను వేరు చేసేందుకు విఫలయత్నం చేశారు. బుధవారం తెల్లవారు జామున విగ్రహాన్ని గమనించిన స్థానికులు ఆందోళనకు దిగారు. కాపు సంఘం నాయకులు వెలిచేరు గ్రామానికి చేరుకుని రోడ్డుపై బైఠాయించి దోషులను అరెస్టు చేయాలని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న రావులపాలెం సీఐ పెద్దిరాజు, ఆత్రేయపురం ఎస్సై నాగార్జునరాజు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరీస్థితిని సమీక్షించారు. ఇంతలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దోషులు ఎంతటివారైనా వదలొద్దని పోలీసులను ఆదేశించారు. దోషులు ఎంతటి వారైనా వదిలి పెట్టవద్దని పోలీసులను ఆదేశించారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదన్నారు. కులాల వారీగా కాకుండా మహానుభావులను అందరూ స్మరించుకునేందుకే విగ్రçహాలను ఏర్పాటు చేస్తారని, వాటిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అతి త్వరలో రంగా నూతన విగ్రహాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘాతుకానికి పాల్పడిన వారికి పడే శిక్షను చూస్తే మరెవరైనా భవిష్యత్‌లో ఇలాంటి నేరం చేయాలంటే భయపడే పరిస్థితి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. గతంలో మెర్లపాలెంలో విగ్రహం ధ్వంసానికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీ ఉన్నా నేటికీ ఆ కేసు కొలిక్కిరాలేదన్నారు. అలాగే వెలిచేరు గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం, ఉచ్చిలిలో రంగా విగ్రçహాలు ధ్వంసం వల్ల గొడవలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో దోషులను పట్టుకుని శిక్షించడంలో విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరితగతిన ఇలాంటి కేసుల్లో దోషులను పట్టుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని అదశగా చర్యలు తీసుకోవాలని పోలీసులను జగ్గిరెడ్డి కోరారు. అలాగే కాంగ్రెస్‌పార్టీ నియోజక వర్గ ఇన్చార్జి ఆకుల రామకృష్ణ, ప్రముఖ పారిశ్రామికవేత్త బండారు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు తనయుడు సంజీవ్ తదితరులు మాట్లాడుతూ తెలుగుజాతికి వంగవీటి మోహన్‌రంగా ఎన్నో సేవలు చేశారని, అలాంటి మహానేత విగ్రహన్ని ధ్వంసం చేయడం అమానుషమన్నారు. జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని సీఐ పెద్దిరాజు, తహసీల్దారు వరదా సుబ్బారావు ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. వివిధ పార్టీల నాయకులు, మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కనుమూరి శ్రీనివాసరాజు, జెడ్పీటీసీ మద్దూరి సుబ్బలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ వేగేశ్న చంద్రరాజు, రావులపాలెం ఎంపీపీ కోటచెల్లయ్య, ప్రముఖ న్యాయవాది పెద్దింటి వేణుగోపాల్, వైఎస్సార్సీపీ నాయకులు కునాధరాజు రంగరాజు, శ్రీనివాసరాజు, ఎంపీటీసీ వేముల నాగలక్ష్మి, గాదిరాజు రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
వంగవీటి పేరును పరిశీలించాలి
గాంధీనగర్(విజయవాడ): గన్నవరం విమానాశ్రయానికిగానీ, పశ్చిమ కృష్ణాజిల్లాకు గానీ వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు సుంకర శ్రీనివాసరావు (కబడ్డి శ్రీను) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్‌పేటలోని కాపునాడు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి వంగవీటి మోహనరంగా ఎంతో కృషి చేశారన్నారు. అయన చేసిన సేవలకు గుర్తింపుగా గన్నవరం విమానాశ్రయానికి రంగా పేరు పెట్టి గౌరవించాలని డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి, ఎన్టీ రామారావు, వంగవీటి మోహనరంగా ఈ ముగ్గురు వ్యక్తులే రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. అటువంటి వారిని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. తాము అధికారంలోకి రాగానే కృష్ణాజిల్లాకు ఎన్టీ రామారావు పేరు పెడతామని ప్రతిపక్షనేత జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పేదలకు సేవచేసిన ఆయన పేరును జిల్లాకు పెడతామని ప్రకటించడం సరైన నిర్ణయం అన్నారు. సీఎం చంద్రబాబు చేయలేని పని జగన్ మోహన్‌రెడ్డి చేస్తాననడం సంతోషకరమన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి కాపులను మోసం చేశారన్నారు. హడావిడిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపి ఆ విషయాన్ని మరుగున పడేశారన్నారు. కాపులు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదన్నారు. కాపులను చంద్రబాబు అనేక కష్టనష్టాలకు గురి చేశారన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు వంగవీటి రంగా పేరును చంద్రబాబు ప్రభుత్వం పెడుతుందన్న నమ్మకం తమకు లేదన్నారు. 2019లో జగన్ మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే తమ ప్రతిపాదనను పరిశీలించాలని కోరారు. జగన్‌పై తమకు అపారనమ్మకం ఉందన్నారు. రంగా పేరు పెడితే ఆయనను అభిమానించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా వైఎస్సార్సీపీకి అండగా నిలబడతారన్నారు. సమావేశంలో కాపునాడు నాయకులు జి.పానక్‌దేవ్, ఒగ్గు విక్కి, తాడికొండ విజయలక్ష్మి, రాంబాబు, రామ్మోహన్ పాల్గొన్నారు. -
రంగాకు వైఎస్సార్సీపీ ఘన నివాళి
సాక్షి, నెట్వర్క్: కాపు నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు రంగాకు ఘనంగా నివాళులర్పించారు. ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయి రెడ్డి, పార్టీ నేతలు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎన్.పద్మజ, ఎం.అరుణ్‌కుమార్, కొండా రాఘవరెడ్డి తదితరులు రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలోనూ రంగా వర్థంతి కార్యక్రమం జరిగింది. రంగా చిత్రపటానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు కొలుసు పార్థసారథి, వెలంపల్లి శ్రీనివాస్, పైలా సోమినాయుడు, విజయవాడ నగర కార్యనిర్వాహక అ«ధ్యక్షుడు మల్లాది విష్ణు నివాళులర్పించారు. రంగాపై వెబ్ సిరీస్ తన తండ్రి వంగవీటి రంగా స్ఫూర్తితో ముందుకు సాగుతానని వైఎస్సార్సీపీ నేత వంగవీటి రాధాకృష్ణ చెప్పారు. రంగా వర్థంతి సందర్భంగా మంగళవారం విజయవాడలోని రాఘవయ్య పార్క్ వద్దనున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సినీ నటుడు జీవీ సుధాకర్ నాయుడు మాట్లాడుతూ.. రంగా జీవిత చరిత్రను ప్రజలకు తెలియజేసేందుకు త్వరలో వెబ్ సిరీస్ తీయనున్నట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ అమెరికా విభాగం ఆధ్వర్యంలో.. వైఎస్సార్సీపీ డెట్రాయిట్ విభాగం ఆధ్వర్యంలో అమెరికాలో రంగా వర్థంతి కార్యక్రమం జరిగింది. ఎన్ఆర్ఐలు దీపక్ గోపాలం, సునీల్ మందుటి, చెంచురెడ్డి, దేవనాథరెడ్డి, గోపిరెడ్డి, రవి, నరసింహారెడ్డి, శ్రీకాంత్ గాయం, నరేశ్ పూల, ధీరజ్, ప్రసాద్, లలిత్ వడ్లమూడి, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ డాక్టర్స్ వింగ్ అధ్యక్షులు వాసుదేవరెడ్డి, నలిపిరెడ్డి తదితరులు రంగాకు ఘనంగా నివాళులర్పించారు. -
‘రంగా సేవా నిరతి ప్రతి ఒక్కరికి ఆదర్శం’
సాక్షి, డిట్రాయిట్: ప్రముఖ రాజకీయ నేత దివంగత వంగవీటి మోహన్ రంగా 29వ వర్ధంతి సందర్భంగా డిట్రాయిట్లో వైఎస్ఆర్సీపీ డిట్రాయిట్ కమిటీ, అభిమానులు సమావేశమై రంగాకి జోహార్ అంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సమావేశం దీపక్ గోపాలం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జితేంద్ర బొండాడ ప్రారంభోన్యాసం చేస్తూ రంగా సేవా నిరతి ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలన్నారు. అంతేకాక దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రంగాల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని వారు గుర్తు చేశారు. నేడు పేదల పెన్నిధిగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. మరి కొంతమంది రంగాతో వారి పరిచయానుభవాలను పంచుకున్నారు. అంతేకాక ప్రతి ఒక్కరు రంగా అడుగుజాడలలో నడవాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో సునీల్ మందుటి, చెంచు రెడ్డి తాడి, దేవానాథ్ గోపిరెడ్డి, శ్రీకాంత్ గాయం, రవి నర్సింహారెడ్డి, లలిత్ కుమార్ వడ్లమూడి, ప్రసాద్ బేతంచెర్ల, వెంకట్ ఎనుముల, ధీరజ్ పులిగడ్డ, నరేష్ పూల, మురళి సుంకర, సుధీర్ బస్సు, సుధాకర్ తోట, పలువురు పాల్గొన్నారు. -
వంగవీటికి ఘన నివాళి
హైదరాబాద్: వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా మంగళవారం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగా ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించినట్లు తెలిపింది. -
అమెరికాలో ఘనంగా రంగా వర్ధంతి
చికాగో: వంగవీటి మోహన రంగా 28వ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. అమెరికాలోని పలు పట్టణాల్లో రంగా అభిమానులు వర్థంతి కార్యక్రమాలను నిర్వహించారు. వర్జీనియాలోని రిచ్మండ్, ఇల్లినాయిస్లోని చికాగో, మిచిగాన్‌లోని డెట్రాయిట్, అట్లాంటా, మాంచెస్టర్, తదితర పట్టణాల్లో డిసెంబర్ 26న రంగా వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా అందించిన సేలను అభిమానులు గుర్తుచేసుకున్నారు. -
బందరు బయలుదేరిన చినరాజప్ప
ఈరోజు విజయనగరంలో పర్యటించాల్సిన ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకొని మచిలీపట్నం బయలుదేరారు. స్థానిక నిజాంపేటలో వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యతో పట్టణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అలజడులు సంభవించే అవకాశం ఉండటంతో.. ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా శాంతి భద్రతలు పర్యవేక్షించడానికి ఆయన వెళ్తున్నట్లు సమాచారం. -
వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం
♦ బందరులోని నిజాంపేటలో గుర్తుతెలియని వ్యక్తుల చర్య ♦ దోషులను శిక్షించాలని కాపు సంఘం నేతల రాస్తారోకో మచిలీపట్నం: కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని నిజాంపేటలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న కాపు సంఘం నాయకులు దోషులను శిక్షించాలంటూ రేవతి సెంటర్లో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అక్కడే ఉన్న రంగా విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వంగవీటి మోహనరంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ మచిలీపట్నం వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమని, రంగా విగ్రహాన్ని పునఃప్రతిష్టిస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త బూరగడ్డ వేదవ్యాస్ ఘటనాస్థలాన్ని పరిశీలించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. పోలీసులు త్వరితగతిన ఈ కేసును పరిష్కరించాలని కోరారు. రంగా విగ్రహం ధ్వంసం సంఘటన ఉద్రిక్తతకు దారితీయటంతో నిజాంపేటలో 144 సెక్షన్ అమలు చేశారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. మచిలీపట్నం ఆర్డీవో పి.సాయిబాబు, తహసీల్దార్ పి.నారదముని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దోషులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పట్టణంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
'రంగాపై విమర్శలు చేసే అర్హత ఎవరికీ లేదు'