వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా మంగళవారం వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు.
హైదరాబాద్: వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా మంగళవారం వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు వైఎస్‌ఆర్‌సీపీ మీడియా విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగా ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించినట్లు తెలిపింది.