
సత్తెనపల్లి: వంగవీటి మోహనరంగా తనకు ప్రాణహాని ఉందని తెలిసి రక్షణ కోరితే.. ఆనాటి ప్రభుత్వం రక్షణ కల్పించక పోగా హత్య చేశారని, చంద్రబాబు, నాటి హోంమంత్రి ప్రోద్బలంతోనే ఆ హత్య జరిగిందని రాష్ట్ర మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు. పేదల పక్షపాతి రంగాను కుట్ర చేసి దారుణంగా చంపిన వాళ్లే తిరిగి సానుభూతి కోసం ఆయన జయంతి, వర్థంతిలను నిర్వహిస్తున్నారని టీడీపీ నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు.
వంగవీటి మోహనరంగా జయంతిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంగళవారం ఆయన కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పలువురు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment