
'రంగాపై విమర్శలు చేసే అర్హత ఎవరికీ లేదు'
విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా ప్రజా నాయకుడని ఆయన తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు. వంగవీటి మోహన రంగా 27వ వర్థంతి సందర్భంగా శనివారం విజయవాడ నగరంలోని రాఘవయ్య పార్క్ సెంటర్లోని ఆయన విగ్రహానికి రాధాకృష్ణ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం రాధాకృష్ణ మాట్లాడుతూ... రంగాపై విమర్శలు చేసే అర్హత ఎవరికీ లేదని ఆయన తెలిపారు. తన తండ్రి రంగాపై అసంబద్ధమైన విమర్శలు ఎవరు చేసినా సహించమని రాధాకృష్ణ స్పష్టం చేశారు. రాధా - రంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా రాధాకృష్ణ ప్రారంభించారు.