Vangaveeti Radha krishna
-
వంగవీటి రాధాది చారిత్రక తప్పిదం
ఒంగోలు: వంగవీటి రాధా టీడీపీలో చేరి చారిత్రక తప్పిదం చేశారని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తండ్రిని హత్య చేయించిన పార్టీలో రాధా చేరకుండా ఉండాల్సిందన్నారు. రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు. వంగవీటి రాధా ఏ పార్టీలో ఉన్నా, రంగా కుటుంబంపై సీఎం వైఎస్ జగన్‌కు, తమకు ఎంతో గౌరవం ఉంటుందన్నారు. తనను హత్య చేసేందుకు నెల కిందట రెక్కీ నిర్వహించారని రాధా ప్రకటన చేయడంతో ప్రభుత్వం గన్మెన్లను కేటాయించిందని చెప్పారు. గన్మెన్లను వద్దనుకోవడం రాధా వ్యక్తిగతమని పేర్కొన్నారు. రాధా చేసిన రెక్కీ ఆరోపణలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారణకు ఆదేశించారని తెలిపారు. చంద్రబాబు ఈ విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. రాధా ఇప్పటికైనా తండ్రిని చంపిన పార్టీలో కొనసాగడంపై పునరాలోచించుకోవాలని ఒక మిత్రుడిగా తాను సూచిస్తున్నానని చెప్పారు. -
వంగవీటి రాధాకు ప్రభుత్వ భద్రత
సాక్షి, అమరావతి: దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. రాధాకు ఏమీ జరగకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. మంత్రి కొడాలి నాని సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. అనంతరం అక్కడి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. తనను చంపేందుకు రెక్కీ నిర్వహించారంటూ రాధా ఆదివారం చేసిన వ్యాఖ్యల్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వెంటనే సీఎం జగన్.. రాధాకు 2+2 గన్‌మెన్‌ను ఇవ్వాలని, భద్రత కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారని చెప్పారు. రాధాపై ఎవరు రెక్కీ నిర్వహించారో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ డీజీని ఆదేశించారని తెలిపారు. రాధాకు ఎవరిపైనన్నా అనుమానాలుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని కూడా సీఎం సూచించారని చెప్పారు. ఎవరికి ప్రాణభయం ఉందని చెప్పినా ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందన్నారు. రాధాపై ఎవరైనా ఏమైనా చేయాలనుకుంటే ఆ ఆలోచనను ఉపసంహరించుకోవాలని సూచించారు. లేదంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాజకీయాల గురించి వంగవీటి రాధాతో మాట్లాడలేదన్నారు. గుడ్లవల్లేరులో ఆదివారం రంగా విగ్రహావిష్కరణకు రావాలని అక్కడివారు పిలిస్తే వెళ్లానని, ఆ కార్యక్రమానికి రాధా కూడా వచ్చారని చెప్పారు. వైఎస్సార్సీపీలోకి వస్తానని రాధా తమతో చెప్పలేదని, తాము ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. రాధా వైఎస్సార్సీపీలోకి రావాలనుకుంటే ఆయనే చెబుతారని, అప్పుడు సీఎం జగన్‌తో మాట్లాడతామని చెప్పారు. సినిమా టికెట్ రేట్లు తగ్గించలేదు సినిమా టికెట్ రేట్లు ఎక్కడా తగ్గించలేదని, గతంలో ఉన్నవే కొనసాగుతున్నాయని మంత్రి కొడాలి నాని చెప్పారు. కోర్టుల ఆదేశాలతో సినిమా టికెట్ ధరలు పెంచి దోచుకునేందుకు తాము అవకాశం కల్పించలేదన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. తాము చేస్తున్నదానివల్ల ఎగ్జిబిటర్‌కు ఎలాంటి నష్టం లేదని చెప్పారు. కొందరు ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. కిరాణా కొట్టుకు కలెక్షన్లు ఎక్కువ వచ్చినప్పుడు సినిమా వాళ్లు పెట్టుబడులు కిరాణా కొట్లో పెట్టుకోవచ్చు కదా?.. అంటూ హీరో నాని మాటలకు కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కనీసం 10 నుంచి 20 శాతం సీట్లలో బీజేపీకి డిపాజిట్లు తెచ్చుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు సూచించారు. ఓటీఎస్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ వారు ధర్నాలు చేసి మమ అనిపించారని ఎద్దేవా చేశారు. 50 లక్షల మందిలో 10 లక్షల మంది ఓటీఎస్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేది లేదు.. ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసేది లేదు.. అని పేర్కొన్నారు. పేదల కోసం మనసున్న సీఎం జగన్ పెట్టిన ఓటీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
నీ ప్రచారం చూస్తుంటే.. గుండె తరుక్కుపోతుంది
సాక్షి, విజయవాడ: టీడీపీ కోసం వంగవీటి రాధ ప్రచారం చేయడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావటి మనోహర్ నాయుడు విమర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వంగవీటి రంగాను క్రూరంగా హత్యచేసిన టీడీపీ నేతలతో కలిసి రాధా ప్రచారం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రంగాని టీడీపీ నేతలు హత్య చేయలేదు అంటున్న రాధా మాటలు వింటుంటే.. రంగా కడుపున పుట్టావా అన్న అనుమానం వస్తోందన్నారు. మీ ఇంటి పేరు వంగవీటి కాదు చెన్నుపాటి రాధాగా మార్చుకో వాలని సూచించారు. ‘రాధా నువ్వు టీడీపీలో చేరి నెల దాటిపోయింది కదా, మరి చంద్రబాబుని నీ తండ్రి విగ్రహం వద్దకు ఎందుకు తీసుకురాలేకపోయావు. రాధా నిన్ను వైఎస్ జగన్ యువజన విభాగం అధ్యక్షుడుగా చేసినా ఏ రోజు అయినా పోరాడావా? రెండు నియోజకవర్గాలకు బాధ్యత ఇస్తే ఒక్కసారి అయినా ఒక్క కార్యక్రమం చేశావా? చంద్రబాబు నిన్ను కుట్రలో పావుగా వాడుకుంటున్నారు. చంద్రబాబు నీకు పోటీ చేసే అవకాశం ఇచ్చారా? రాధా నువ్వు టీడీపీ ప్రచారం కోసం వెళ్లడం చూస్తే గుండె తరుక్కుపోతుంద’ని అన్నారు. ఎందుకు పోటీ చేయడం లేదు? బుద్దా వెంకన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదని.. ఇత్తడి బెల్లులు, కొబ్బరి చిప్పలు అమ్ముకున్న ఆయన వైఎస్ జగన్‌ను విమర్శించడం శోచనీయమన్నారు. టీడీపీతో జనసేన కుమ్ముకైందని ఆరోపించారు. మంగళగిరిలో జనసేన పోటీ ఎందుకు చేయడం లేదన్నారు. చంద్రబాబు మాటలను ప్రజలు ఎవ్వరూ నమ్మడం లేదని మనోహర్ నాయుడు అన్నారు. -
రాధాకృష్ణ టీడీపీలో చేరడం బాధాకరం: వగవీటి నరేంద్ర
-
రంగా అభిమానుల నిరసన.. ఉద్రిక్తత
-
వంగవీటి రాధా చేరికను వ్యతిరేకిస్తూ..
సాక్షి, విజయవాడ : వంగవీటి రాధా కృష్ణ టీడీపీలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ దివంగత నేత వంగవీటి రంగా అభిమానులు, ఆయన సోదరుడు నారాయణరావు కుమారుడైన వంగవీటి నరేంద్ర.. రంగా విగ్రహం వద్ద దీక్షకు దిగారు. ఈ దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో రాఘవయ్య పార్క్‌లోని రంగా విగ్రహం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రంగా హత్యకు కారణమైన తెలుగుదేశంలో రాధాకృష్ణ చేరడం చాలా బాధకరమని, రాధాకృష్ణ నిర్ణయం వల్ల రంగా మరోసారి హత్యకు గురయ్యారని ఈ సందర్భంగా నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాధా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాధా-రంగా మిత్రమండలి సభ్యులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. గతంలో రంగా సతీమణి చేసిన తప్పే నేడు రాధా కూడా చేస్తున్నారని, తన రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రి ఆశయాలను వదులుకుంటున్నారని మండిపడ్డారు. ఈ నిర్ణయంతో రంగా అభిమానులంతా క్షోభకు గురువుతున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వంగవీటి రాధా టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. రంగా హత్యకు కారణమైన పార్టీలోకి ఎలా చేరుతారని ఆయన అభిమానులు రాధాను నిలదీస్తున్నారు. -
కొడాలి నానితో వంగవీటి రాధాకృష్ణ మంతనాలు
గుడివాడ టౌన్: కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావును (నాని) దివంగత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఆదివారం కలిశారు. గుడివాడలో స్థానిక ఏలూరు రోడ్డులోని ఫర్నిచర్ పార్క్‌లో నానిని కలిసి చర్చించారు. గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు 24 వేలకు పైగా ఉన్నాయి. కొడాలి నానితో జరిగిన భేటీలో రాధాకృష్ణ వెంట ఆయనకు అత్యంత సన్నిహితులైన కాపు నాయకులు ఉన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా వెంకటరమణ (బాబ్జీ), పాలేటి చంటి, ఎంవీ నారాయణరెడ్డి, కొడాలి నాగేశ్వరరావు (చిన్ని), మాజీ కౌన్సిలర్ పొట్లూరి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: టీడీపీకి దెబ్బ పడింది) -
వర్మ, దాసరిలను తక్షణమే అరెస్టు చేయండి
-
వర్మ, దాసరిలను తక్షణమే అరెస్టు చేయండి
- పోలీసులకు విజయవాడ కోర్టు ఆదేశం విజయవాడ : ‘వంగవీటి’ సినిమాకు సంబంధించిన వివాదంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌లకు విజయవాడ కోర్టు షాకిచ్చింది. ఆ ఇద్దరిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. అభ్యంతరాలను పట్టించుకోకుండా వంగవీటి రంగా జీవితగాథ ఆధారంగా ‘వంగవీటి’ సినిమాను తీసి, తమ కుటుంబాన్ని అవమానపర్చారంటూ రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ కోర్టును ఆశ్రయించారు. నెలలపాటు జరిగిన విచారణ అనంతరం దర్శకుడు వర్మ, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌లను అరెస్టు చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. -
'నా తండ్రిని పొట్టనపెట్టుకున్న పార్టీ టీడీపీ'
-
'నా తండ్రిని పొట్టనపెట్టుకున్న పార్టీ టీడీపీ'
నంద్యాల: చంద్రబాబునాయుడు పాలనలో నంద్యాల ప్రజలు ఎంతో నష్టపోయారని, ఆ నష్టాన్ని పూడ్చటం చాలా కష్టమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వంగవీటి రాధాకృష్ణ అన్నారు. నంద్యాలలోని ఎస్పీజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాడే ప్రతినిధి వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాలకు రావడం ఇక్కడి ప్రజల్లో ఆశలు చిగురించాయన్నారు. ఎక్కడ చూసినా ఫ్యాన్ గుర్తుకు ఫాలోయింగ్ పెరిగిపోతుంటే.. చంద్రబాబు గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయని చెప్పారు. వైఎస్ఆర్ ఫ్యామిలీపై, జగనన్నపై అభిమానంతో శిల్పామోహన్ రెడ్డి వెంట మేమున్నామంటూ ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి సైతం భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో ఇక్కడ పండుగ వాతావరణం కనిపిస్తుందన్నారు. '1988లో నా తండ్రి వంగవీటి మోహనరంగా గారిని పొట్టనపెట్టుకున్న పార్టీ టీడీపీ అని ఆరోపించారు. చేతగాని దద్దమ్మ అయితే చంద్రబాబు ఇంట్లో కూర్చోవాలి. చంద్రబాబు డబ్బు ఆశ చూపినా జనం లెక్కచేయలేదు. ఇవాళ రిజర్వేషన్ల పేరుతో మళ్లీ కాపులను మోసం చేస్తున్నారు. ప్రజల కోసం ఉద్యమాలు చేసే ముద్రగడ లాంటి నేతలను అడ్డుకోవడం దారుణం. మరోవైపు అన్న వస్తున్నాడన్న నినాదంతోనే మీరు చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని' రాధాకృష్ణ నంద్యాల ప్రజలకు పిలుపునిచ్చారు. -
'నేటి నుంచే చంద్రబాబు పాలన భూస్థాపితం'
విజయవాడ: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా దారుణంగా ఉందని వంగవీటి రాధాకృష్ణ ధ్వజమెత్తారు. 'సామాన్యవర్గంలో పుట్టినవాళ్లంతా కూడా చంద్రబాబు అనుమతితోనే బతికేయాలా? ఏమనుకుంటున్నారు ఆయన' అని నిలదీశారు. గురువారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో మల్లాది విష్ణు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విష్ణును వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలన భూస్థాపితం కావడం నేటి నుంచే మొదలైందని అన్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలతో రాబోయే రోజుల్లో రాజన్న రాజ్యం వస్తుందని, జగనన్న రాజ్యం ఆవిష్కృతమవుతుందని చెప్పారు. ఇక మల్లాది విష్ణు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడని, వైఎస్ జగన్ నాయకత్వంలో కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. -
డైరెక్టర్ వర్మ, నిర్మాతపై పిటిషన్ దాఖలు
-
డైరెక్టర్ వర్మ, నిర్మాతపై పిటిషన్ దాఖలు
వంగవీటి రాధాకృష్ణ విజయవాడ లీగల్: దర్శకుడు రామ్‌గోపా ల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్, సహ నిర్మాత పి.సుధీర్‌చంద్ర ‘వంగవీటి’ సినిమా ద్వారా తమ కుటుంబానికి పరువు నష్టం కలిగించారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ బుధవారం ఒకటవ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి జి.వెంకటేశ్వర్లు గతంలో పోలీసులకు ఫిర్యా దు చేసిన కాపీ ప్రతిని దాఖలు చేయాలని కోరుతూ వాయిదా వేశారు. వంగవీటి సోదరులైన రాధా, మోహనరంగారావులపై అసత్య, అబద్ధ కథనాలతో సినిమాను తీసి లక్షలాది వం గవీటి అభిమానుల మనోభా వాలను దెబ్బతీశారని పిటి షన్లో పేర్కొన్నారు. రంగా 1981 నుంచి జాతి, కుల, మత రహితంగా అనేక ప్రజాహిత కార్యక్రమాలలో పాల్గొన్నారని తెలిపారు. మేమేమన్నా రౌడీలమా? అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి తన పెదనాన్న, తండ్రిలను రౌడీలుగా చూపించారని మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. ఆయన కోర్టు బయట మీడియాతో మాట్లాడుతూ... సినిమా విడుదలకు ముందే తాము అభ్యంతరం తెలిపామన్నారు. -
'వంగవీటి'పై డీజీపీని కలిసిన రాధా
విజయవాడ: రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ‘వంగవీటి’ సినిమాపై మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీ డీజీపీ సాంబశివరావుని శుక్రవారం కలిశారు. తాము చెప్పిన అభ్యంతరాలను రామ్‌గోపాల్‌వర్మ పరిగణలోకి తీసుకోలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమాలోని అభ్యంతరకర దృశ్యాలను వెంటనే తొలగించాలని రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. 'వంగవీటి' సినిమా శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. -
న్యాయ వివాదంలో ‘వంగవీటి’ సినిమా
-
న్యాయ వివాదంలో ‘వంగవీటి’
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘వంగవీటి’ సినిమా న్యాయ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాను వాస్తవాలకు విరుద్ధంగా రూపొందించారని, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఆమోదం లేకుండా సినిమా ట్రైలర్, టీజర్లను ఇంటర్నెట్, యూట్యూబ్, ట్వీటర్లలో ప్రదర్శిస్తున్నారంటూ వంగవీటి రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రరుుంచారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌లకు నోటీసులు జారీ చేస్తూ దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వంగవీటి రంగా జీవితచరిత్ర ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నామని దర్శక, నిర్మాతలు చెబుతున్నారని, అయితే ట్రైలర్లను చూస్తే వాస్తవాలను వక్రీకరించేలా సినిమా ఉందని వంగవీటి రాధాకృష్ణ తరఫు న్యాయవాది బండి వీరాంజనేయులు కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో విజయవాడ పోలీస్ కమిషనర్, సీబీఎఫ్సీ, రాంగోపాల్‌వర్మ, దాసరి కిరణ్‌కుమార్ తదితరులకు నోటీసులు జారీ చేశారు. విచారణను డిసెంబర్ 2కు వారుుదా వేశారు. -
వంగవీటి సినిమా పై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: వంగవీటీ సినిమా వాస్తవాలకు విరుద్ధంగా ఉందటూ హైకోర్టులో వంగవీటి రాధాకృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వంగవీటి సినిమా పై తదుపరి విచారణ డిసెంబరు2కు వాయిదా వేసింది. -
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన
-
'రంగాపై విమర్శలు చేసే అర్హత ఎవరికీ లేదు'
-
'రంగాపై విమర్శలు చేసే అర్హత ఎవరికీ లేదు'
విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా ప్రజా నాయకుడని ఆయన తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు. వంగవీటి మోహన రంగా 27వ వర్థంతి సందర్భంగా శనివారం విజయవాడ నగరంలోని రాఘవయ్య పార్క్ సెంటర్లోని ఆయన విగ్రహానికి రాధాకృష్ణ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాధాకృష్ణ మాట్లాడుతూ... రంగాపై విమర్శలు చేసే అర్హత ఎవరికీ లేదని ఆయన తెలిపారు. తన తండ్రి రంగాపై అసంబద్ధమైన విమర్శలు ఎవరు చేసినా సహించమని రాధాకృష్ణ స్పష్టం చేశారు. రాధా - రంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా రాధాకృష్ణ ప్రారంభించారు. -
'కావాలనే రద్దు చేయించారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అవసరమని వైఎస్సార్ సీపీ నేత వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కాదు, ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడుగుతున్నారని విమర్శించారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో రేపు నిర్వహించనున్న సమావేశాన్ని కావాలనే చంద్రబాబు రద్దు చేయించారని ఆరోపించారు. ప్రత్యేక హోదాతొ కలిగే లాభాలను విద్యార్థులు, యువతకు తెలియజేయాలన్నదే వైఎస్ జగన్ ఉద్దేశమని తెలిపారు. చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళతామని స్పష్టం చేశారు. -
అధ్వానం... అగమ్యగోచరం
-
అధ్వానం... అగమ్యగోచరం
పట్నంబజారు (గుంటూరు) : గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (పెద్దాసుపత్రి)లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. కొద్ది రోజుల కిందట పెద్దాసుపత్రిలో ఎలుకల దాడిలో పసికందు మృతి చెందిన నేపథ్యంలో అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. పార్టీ నేతలు మాజీ మంత్రి కొలుసు పార్ధసారథి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, డాక్టర్లు నన్నపనేని సుధ, జగన్మోహనరావులు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావటి మనోహరనాయుడులతో కలసి కమిటీ ఆదివారం ఆసుపత్రిలో పర్యటించింది. ఈ సందర్భంగా విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. ముందుగా కమిటీ ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ ఉదయ్‌కుమార్‌ను కలిసిం ది. ఇక్కడ పారిశుధ్యం ఎప్పటినుంచో అధ్వానంగా ఉంది, దీనిపై ఎమ్మెల్యేలు పలుమార్లు చెప్పినా ఎందుకు పట్టించుకోలేదు. వార్డుల్లో ఏళ్లతరబడి ఎలుకలు సంచరిస్తున్నా ఎందుకు పట్టించుకోలేదు. కొరత ఉందని తెలిసినా సిబ్బంది ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదు. ఇలా కమిటీ సంధించిన పలు ప్రశ్నలకు ఇన్చార్జి సూపరింటెండెంట్ మాత్రం తనకు తెలియదనే సమాధానం ఇచ్చారు. దీనిపై కమిటీ తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా బాధ్యులైన వైద్యాధికారులకు తెలియకపోతే ఎలా అని పేర్కొంది. నర్సుల కొరత... స్టాఫ్ నర్సులను కలసి మాట్లాడిన అనంతరం ఆసుపత్రిలో నర్సుల కొరత ఉండటాన్ని వైఎస్సార్ సీపీ కమిటీ గమనించింది. దాదాపు 600 మంది నర్సుల వరకు అవసరం కాగా, కేవలం 180 మంది మాత్రమే ఉన్నారని నర్సులు వివరించారు. అనంతరం పసికందు మృతి చెందిన వార్డును కమిటీ సందర్శించింది. అక్కడే ఉన్న హౌస్ సర్జన్లతో సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. పసికందు మృతికి ముందే ఎలుకల సంచారంపై ఫిర్యాదు చేసిన కాపీని ఈ సందర్భంగా కమిటీకి చూపించారు. నర్సుల వినతిపత్రం.. ఆసుపత్రిలో తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నర్సుల అసోసియేషన్ నాయకురాలు రమణ ఆధ్వర్యంలో నర్సులు వైఎస్సార్ సీపీ కమిటీకి వినతి పత్రం అందజేశారు. ఒక్క స్టాఫ్ నర్సు మూడు, నాలుగు వార్డుల్లో విధులు నిర్వర్తించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పసికందు మృతి ఘటనలో నర్సును సస్పెండ్ చేయటంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. నర్సుల నియామ కం జరిగి 30 ఏళ్లు అవుతోందని తెలియజేశారు. ఈ సమస్యలను వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళతామని కమిటీ వారికి భరోసానిచ్చి ముందుకు సాగింది. పర్యటనలో వైఎస్సార్ సీపీ పలు విభాగాల నేతలు మామిడి రాము, కొత్తా చిన్నపరెడ్డి, సయ్యద్‌మాబు, కోవూరి సునీల్‌కుమార్, మెట్టు వెంకటప్పారెడ్డి, ఏలికా శ్రీకాంత్‌యాదవ్, షేక్ గులాంరసూల్, కోటా పిచ్చిరెడ్డి, పానుగంటి చైతన్య, ఆరుబండ్ల వెంకటకొండారెడ్డి, షేక్ జానీ, ఉప్పుటూరి నర్సిరెడ్డి, రాచకొండ ముత్యాలరాజు, ప్రేమ్‌కుమార్, మండే పూడి పురుషోత్తం, జూలూరి హేమంగదగుప్తా, రాజశేఖరరెడ్డి తదితరులు ఉన్నారు. -
'చంద్రబాబుదంతా పనికిమాలిన పాలన'
-
'చంద్రబాబుదంతా పనికిమాలిన పాలన'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్సీపీ నేత వంగవీటి రాధా విరుచుపడ్డారు. చంద్రబాబు చేస్తున్నదంతా కూడా పనికిమాలిన పరిపాలన అన్నారు. రాజధాని నిర్మాణం పేరిట బలవంతపు భూసేకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడ సీఆర్డీఏ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలంతా స్వచ్ఛందంగా రాజధాని కోసం తమ భూములు ఇచ్చారని చెప్తున్నారని అవన్నీ కూడా అవాస్తవాలు అని చెప్పారు. సింగపూర్ తరహా రాజధాని ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రాతిపదికన నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. తామెప్పుడూ రాజధాని నిర్మాణానికి విరుద్ధం కాదని తెలిపారు. విజయవాడకు గతంలో ఎన్నడూ లేని ట్రాఫిక్ తీసుకొచ్చారని, చంద్రబాబు వచ్చారని ఒకసారి నారాయణ వచ్చారని ఒకసారి, పుల్లారావు వచ్చారని ఒకసారి రోడ్డు వెంట అంగుళం కదలనివ్వకుండా వాహనాలు నిలిపేస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితిపట్ల గెలిపించిన ప్రజలే నానా తిట్లు చంద్రబాబును తిడుతున్నారని తెలియజేశారు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ రైతుల పక్షాన ఉండేది ఒక్క వైఎస్ జగనే అని, వైఎస్సార్సీపీనే అని వంగవీటి రాధ తెలిపారు.