న్యాయ వివాదంలో ‘వంగవీటి’
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘వంగవీటి’ సినిమా న్యాయ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాను వాస్తవాలకు విరుద్ధంగా రూపొందించారని, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ఆమోదం లేకుండా సినిమా ట్రైలర్, టీజర్లను ఇంటర్నెట్, యూట్యూబ్, ట్వీటర్‌లలో ప్రదర్శిస్తున్నారంటూ వంగవీటి రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రరుుంచారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌లకు నోటీసులు జారీ చేస్తూ దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వంగవీటి రంగా జీవితచరిత్ర ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నామని దర్శక, నిర్మాతలు చెబుతున్నారని, అయితే ట్రైలర్‌లను చూస్తే వాస్తవాలను వక్రీకరించేలా సినిమా ఉందని వంగవీటి రాధాకృష్ణ తరఫు న్యాయవాది బండి వీరాంజనేయులు కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో విజయవాడ పోలీస్ కమిషనర్, సీబీఎఫ్‌సీ, రాంగోపాల్‌వర్మ, దాసరి కిరణ్‌కుమార్ తదితరులకు నోటీసులు జారీ చేశారు. విచారణను డిసెంబర్ 2కు వారుుదా వేశారు.