
వర్మ, దాసరిలను తక్షణమే అరెస్టు చేయండి
- పోలీసులకు విజయవాడ కోర్టు ఆదేశం
విజయవాడ : ‘వంగవీటి’ సినిమాకు సంబంధించిన వివాదంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌లకు విజయవాడ కోర్టు షాకిచ్చింది. ఆ ఇద్దరిపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.
అభ్యంతరాలను పట్టించుకోకుండా వంగవీటి రంగా జీవితగాథ ఆధారంగా ‘వంగవీటి’ సినిమాను తీసి, తమ కుటుంబాన్ని అవమానపర్చారంటూ రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ కోర్టును ఆశ్రయించారు. నెలలపాటు జరిగిన విచారణ అనంతరం దర్శకుడు వర్మ, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌లను అరెస్టు చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీచేసింది.