vangaveeti movie
-
‘‘గంధర్వ’’ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల
వంగవీటి, 'జార్జిరెడ్డి' ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గంధర్వ. గాయత్రి ఆర్. సురేష్, శీతల్ భట్ కథనాయికలు. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్, వీర శంకర్ సిల్వర్ స్క్రీన్స్ పతాకాలపై అప్సర్ దర్శకత్వంలో ఎమ్.ఎన్ మధు ఈ మూవీని నిర్మిస్తున్నారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్, సురేష్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఆదివారం విడుదల చేసింది. ఇండియన్ సినిమాల్లో రానటువంటి ఓ డిఫరెంట్ కథాంశంతో దర్శకుడు అప్సర్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ఇప్పటి వరకు నటించని ఓ డిఫరెంట్ రోల్లో సందీప్ మాధవ్ కనిపించనున్నారు. ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను గమనిస్తే హీరో సందీప్ మాధవ్ రౌడీలను చితక్కొడుతున్నారు. హీరో చేతులు ఓ కుర్చీకి కట్టేసి ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే గంధర్వ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలుంటాయని తెలుస్తుంది. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. నాగు.వై ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ర్యాప్ రాక్ షకీల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నిరంజన్ జె.రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. -
వర్మ, దాసరిలను తక్షణమే అరెస్టు చేయండి
-
వర్మ, దాసరిలను తక్షణమే అరెస్టు చేయండి
- పోలీసులకు విజయవాడ కోర్టు ఆదేశం విజయవాడ : ‘వంగవీటి’ సినిమాకు సంబంధించిన వివాదంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌లకు విజయవాడ కోర్టు షాకిచ్చింది. ఆ ఇద్దరిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. అభ్యంతరాలను పట్టించుకోకుండా వంగవీటి రంగా జీవితగాథ ఆధారంగా ‘వంగవీటి’ సినిమాను తీసి, తమ కుటుంబాన్ని అవమానపర్చారంటూ రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ కోర్టును ఆశ్రయించారు. నెలలపాటు జరిగిన విచారణ అనంతరం దర్శకుడు వర్మ, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌లను అరెస్టు చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. -
పెట్రోలు కూడా లేకుండా తగలబెడతా: వర్మ
వంగవీటి సినిమాలో రంగా పాత్రను సరిగా చూపించలేదని ఆరోపించిన రాధారంగా మిత్రమండలిపై దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి మండిపడ్డారు. పనీపాటా లేకుండా వీధుల్లో తిరిగే మీలాంటి వారు రాధా రంగాల పేరు చెడగొట్టడానికే పుట్టారని విమర్శించారు. తన దిష్టిబొమ్మలను తగలబెట్టొచ్చు గానీ, తాను మాత్రం మీ లోపలి కుళ్లును పెట్రోలు కూడా లేకుండా తగలబెడతానని హెచ్చరించారు. తాను క్షమాపణలు చెప్పడం అటుంచి.. మీరు మొరగడం ఆపకపోతే మీ అసలు జాతేంటో అందరికీ తెలిసిపోతుంది ఖబడ్దార్ అంటూ మండిపడ్డారు. తాము సినిమా షూటింగులో పాల్గొన్నప్పుడు చిత్రీకరించిన సన్నివేశాలేవీ సినిమాలో లేవని, అసలు రంగా చేసిన సమాజసేవ లాంటివాటిని చూపించలేదని, అందువల్ల వాటిని కూడా కలిపి సినిమాను రీ రిలీజ్ చేయాలని రాధా రంగా మిత్రమండలి సభ్యులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. వర్మకు డబ్బులే కావాలనుకుంటే రాధా రంగా అభిమానులు చందాలు వేసుకుని ఇచ్చేవారని వంగవీటి రాధాకృష్ణ కూడా వర్మను విమర్శించారు. రంగా జీవితచరిత్ర తెలియని ఆయనను అసలు సినిమా తీయొద్దని, విడుదల చేయొద్దని ముందే చెప్పానని ఆయన అన్నారు. -
’వంగవీటి’వార్ : వర్మ VS రాధ
-
వర్మ మూల్యం చెల్లించుకోక తప్పదు: రాధా
రంగా 28వ వర్ధంతి కార్యక్రమంలో రాధాకృష్ణ కృష్ణలంక (విజయవాడ): చరిత్రను వక్రీకరించి ‘వంగవీటి’ చిత్రాన్ని నిర్మించిన దర్శకుడు రాంగోపాల్‌వర్మ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ హెచ్చరించారు. విజయ వాడలో సోమవారం వంగవీటి రంగా 28వ వర్ధంతి జరిగింది. బందరురోడ్డులోని రాఘవయ్య పార్కు సమీపంలో ఉన్న రంగా విగ్రహానికి రాధా కృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వంగవీటి రాధా కృష్ణ మాట్లాడుతూ రాంగోపాల్‌వర్మకు డబ్బే కావాలనుకుంటే రంగా అభిమానులు చందాలు పోగుచేసి వెదజల్లేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రంగా జీవిత చరిత్ర తెలియని ఆయనను అసలు సినిమా తీయొద్దని, విడుదల చేయొద్దని ముందే చెప్పా నని తెలిపారు. అనంతరం రంగా అభిమానులు భారీ ఊరేగింపు నిర్వహించారు. పేదలకు పండ్లు, దుప్పట్లు పంపిణీ, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. వంగవీటి కుటుంబాన్ని రెచ్చగొట్టొద్దు అక్కిరెడ్డిపాలెం (విశాఖ): వంగవీటి కుటుంబం పాత కక్షలన్నీ మరిచి ప్రశాంతంగా బతుకుతోందని, తిరిగి ఈ కుటుంబాన్ని రెచ్చగొట్టవద్దని వంగవీటి మోహన రంగ సోదరుని కుమారుడు వంగవీటి మేఘనాథ్ కోరారు. 65వ వార్డు మిందిలో వంగవీటి మోహన రంగ వర్థంతి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన వంగవీటి సినిమాపై స్పందించారు. వంగవీటి సినిమాను తీసిన డైరెక్టర్ ఒక మెంటల్ అని, ఆయనకు సహకరించింది మరో మెంటల్ అని తీవ్ర పరుష పదజాలంతో విమర్శించారు. వంగవీటి కుటుంబాన్ని రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు ఎదురౌతాయని హెచ్చరించారు. సెంటర్ నేను చెప్పను..టైం నువ్వు చెప్పొద్దు వంగవీటి రాధాకృష్ణ వాఖ్యలపై రాంగోపాల్ వర్మ కౌంటర్ సాక్షి, హైదరాబాద్: వంగవీటి రంగ తనయుడు రాధాకృష్ణ వాఖ్యలపై సినీ డైరెక్టర్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. తననేదో చేస్తానన్న రాధా వాఖ్యలపై వర్మ సోమవారం ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘బస్తీ మే సవాల్– సెంటర్ నేను చెప్పను. టైం నువ్వు చెప్పొద్దు’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు. రంగ వ్యక్తిత్వాన్ని వక్రీకరించానన్న రాధ వాఖ్యలపై తన సమాధానమిదంటూ వర్మ ట్వీట్ చేశారు. ‘ అన్నదానాలు, ప్రజాసేవ తప్పా వంగవీటి రంగా చీమకైనా హాని చేయని గౌతమ బుద్ధుడని చూపించాలా’ అంటూ ఆయన ప్రశ్నించారు. రంగ వ్యక్తిత్వం గురించి ఆయన అభిమానులు, రంగ భార్య వినడానికి ఇష్టపడని వాస్తవాలను కూడా తాను చూపించగలనని, కానీ రంగపై ఉన్న గౌరవంతో అవి చూపించలేకపోయానని తెలి పారు. రాధాకు దమ్ముంటే ఆ వాస్తవాలను చూపమని తనను డిమాండ్ చేయాలని, అలా చేస్తే కుండబద్ధలు కొట్టినట్లు వాటిని వెల్లడిస్తానని స్పష్టం చేశారు. సున్నితమైన భావోద్వేగాలను చూపించడానికే ఈ చిత్రాన్ని తీసినట్లు చెప్పారు. -
'అసలు వంగవీటి'ని మీరే తీసుకోండి
హైదరాబాద్: వంగవీటి చిత్రంపై వంగవీటి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. 'రాధా, రత్నకుమారి కంటే రంగాపై నాకే ఎక్కువ గౌరవం ఉంది. నా సినిమా కరెక్ట్ కాదనుకుంటే 'అసలు వంగవీటి' అని ఇంకో సినిమా తీసుకోండి. అప్పటి భావోగ్వేదాలను మాత్రమే నేను సినిమాలో చూపించా. రంగాను బోసిపళ్ల మహాత్ముడిలా చూపించాలా?. మర్డర్ల మాట అటుంచి ఎవరినీ మొట్టికాయ కూడా కొట్టలేదని చూపించాలా?. రంగా గురించి అభిమానులు ఇష్టపడని వాస్తవాలు నా దగ్గర చాలా ఉన్నాయి. రాధా డిమాండ్ చేస్తే వాటన్నింటినీ కుండబద్దలు కొట్టినట్లు చెప్తా. రాధా...బస్తీ మే సవాల్... సెంటర్ నేను చెప్పను, టైమ్ నువ్వు చెప్పొద్దు' అని వర్మ వ్యాఖ్యలు చేశారు. కాగా వంగవీటి చిత్రంలో రంగా పాత్ర చిత్రీకరణపై ఆయన కుమారుడు, వైఎస్ఆర్సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాతో పాటు రంగా అభిమానులు కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వంగవీటి సినిమా తీసేటప్పుడు రాంగోపాల్ వర్మ చరిత్రను వక్రీకరించి తీశారని వంగవీటి రాధాకృష్ణ మండిపడ్డారు. ఇందుకు ఆయన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. డబ్బుకోసం సినిమా తీసేబదులు.. డబ్బులు అడిగితే రంగా అభిమానులే ఆయనకు చందాలు ఇచ్చేవారన్నారు. రంగా హంతకులు నేటికీ బయట తిరుగుతూనే ఉన్నారని, తనకు అన్నీ తెలుసన్న వర్మకు ఈ విషయం తెలియదా అని ఆయన ప్రశ్నించారు. తానేం చేయాలో అది చేసి చూపిస్తానని అన్నారు. ఇప్పటికే దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, తాను కూడా ఏం చేయాలో చేస్తానని చెప్పారు. రంగా పెళ్లిని చూపించిన తీరుపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే వంగవీటి చిత్రంలో కాపుల మనోభావాలు దెబ్బతినేవిధంగా, అభ్యంతరకరంగా చిత్రీకరించారంటూ రంగా అభిమాన సంఘాలు శనివారం మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై జనవరి 16లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీని హెచ్ఆర్సీ ఆదేశాలు ఇచ్చింది కూడా. చదవండి...(వర్మ మూల్యం చెల్లించుకోక తప్పదు) -
వర్మ మూల్యం చెల్లించుకోక తప్పదు: రాధా
-
వర్మ మమ్మల్ని మోసం చేశారు
-
వర్మ మమ్మల్ని మోసం చేశారు
వంగవీటి సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ తమను మోసం చేశారని వంగవీటి యువసేన తీవ్రంగా మండిపడింది. ఈ సినిమాలో రంగాను హీరోగా చూపిస్తామని తమకు చెప్పారని, తాము షూటింగ్లో పాల్గొన్న సమయంలో రంగాను హీరోగానే చూపించారు గానీ, అసలు విడుదలైన సినిమాలో అలాంటి సీన్లు ఎక్కడా లేవని యువసేన ప్రతినిధులు అన్నారు. రంగా చేసిన సామాజిక సేవలను ఎక్కడా చూపించలేదని మండిపడ్డారు. వర్మ తీరుతో తమ మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వంగవీటి మోహనరంగా చేసిన సమాజసేవను మళ్లీ చిత్రీకరించి రెండు రోజుల్లో సినిమాను రీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తాము తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
`వంగవీటి` విడుదల తేదీ ప్రకటించిన వర్మ
విజయవాడ నగరంలోఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన కొంతమంది వ్యక్తులు, కొన్ని సంఘటనలు ఆధారంగా రామ్‌గోపాల్ వర్మ ‘వంగవీటి’ సినిమా చేయబోతున్నానని అనౌన్స్ చేయగానే సినిమాపై చాలా ఆసక్తి పెరిగింది. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభం నుండి ప్రేక్షకుల్లో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేసిన వంగవీటి ట్రైలర్‌కు రెండు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ``విజయవాడ రౌడీయిజంపై నా దర్శకత్వంలో రూపొందుతోన్న `వంగవీటి` నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. అప్పట్లో అక్కడ జరిగిన చాలా సంఘర్షణలకు నేను ప్రత్యక్షసాక్షిని. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రవి శంకర్ మ్యూజిక్‌లో రూపొందిన మిగిలిన పాటలు కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. డిసెంబర్ 3న వంగవీటి ఆడియో విడుదల కార్యక్రమాన్ని విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో పలువురి ప్రముఖుల సమక్షంలో విడుదల చేయనున్నాం. ఇప్పుడు నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ`ని తెలిపారు. ఈ సినిమాకు సాహిత్యం సిరాశ్రీ, చైతన్యప్రసాద్ అందించారు. సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్, కె.దిలీప్ వర్మ, సూర్య చౌదరి, ఎడిటర్: సిద్ధార్థ్ తాతోళ్లు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విస్సు. -
'వంగవీటి' సినిమాలో కొన్ని షాట్స్..
సినిమాపై ఆసక్తిని పెంచేందుకు విడుదలకు ముందు టీజర్లు, ట్రైలర్లు అంటూ ప్రచారం చేసుకోవడం అందరూ చేసే పని. దర్శకుడు రాంగోపాల్ వర్మది అందుకు భిన్నమైన శైలి. ఆయన రూపొందించిన 'వంగవీటి' సినిమా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదల కానుంది. అయితే విడుదలకు ముందే 'వంగవీటి'కి సంబంధించిన కొన్ని షాట్లను దసరా సందర్భంగా(మంగళవారం) సోషల్ మీడియాలో పెట్టారాయన. అద్భుతమైన బ్యాగ్రౌడ్ స్కోర్ తో.. 'చంపరా.. చంపెయ్యరా..' అంటూ దడపుట్టేంచే వంగవీటి షాట్లను వీడియోలో చూడోచ్చు. (చూడండి: రాంగోపాల్ వర్మ 'వంగవీటి' ట్రైలర్) గాంధీ జయంతి సందర్భంగా వర్మ అక్టోబర్ 2న 'వంగవీటి' ట్రైలర్ విడుదల చేశారు. యూ ట్యూబ్ లో ఇప్పటివరకు 15.5 లక్షల మంది దానిని చూశారు. ఇక వంగవీటి షాట్లు నెటిజన్లను ఏమేరకు ఆకట్టుకుంటాయో చూడాలి. రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే మార్కెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
'వంగవీటి' సినిమాలో కొన్ని షాట్స్..
-
అది ముగిసిన చరిత్ర..: వర్మతో నెహ్రూ
విజయవాడ (గుణదల): ‘బెజవాడ ఇప్పుడు పవిత్రంగా ఉంది.. 30 ఏళ్ల కిందట జరిగిన సంఘటనలపై ఇప్పు డు సినిమా తీసి నగరంలో కల్మషాలు సృష్టించవద్దని’ సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మకు మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) హితవు పలికారు. ‘వంగవీటి’ సినిమా నిర్మాణంలో భాగంగా శుక్రవారం నగరానికి వచ్చిన రాంగోపాల్‌వర్మ శనివారం గుణదలలో నెహ్రూను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ.. సినిమా అనేది వ్యాపారం.. ఎవరు ఎలాంటి అంశాన్ని అయినా ఎంచుకుని సినిమా తీయవచ్చన్నారు. రెండు కుటుంబాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు అప్పుడున్న పరిస్థితుల్లో కుల రాజకీయాలకు దారితీశాయని తెలిపారు. ముగిసిపోయిన ఆ చరిత్రను కొత్తగా పరిచయం చేయడం వల్ల ప్రయోజనం లేదని వివరించారు. బెజవాడ కమ్యూనిస్టులకు కంచుకోట.. సినిమా పరిశ్రమకు వెన్నెముక లాంటిదని.. పత్రికారంగానికి తలమానికమైనదని చెప్పారు. నగరంలో చోటుచేసుకున్న కొన్ని ఘర్షణలు.. వివాదాలు తెరకెక్కించడం వల్ల వచ్చే ప్రయోజనం శూన్యమని పేర్కొన్నారు. -
వంగవీటి టైటిల్ సాంగ్ విడుదల
రాంగోపాల్ వర్మ తన కొత్త సినిమా ఇంకా మొదలు పెట్టలేదు గానీ, ముందునుంచే దానికి సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తున్నాడు. గురువారం నాడు 'వంగవీటి' టైటిల్ లోగోను విడుదల చేసిన వర్మ.. తాజాగా ఆ సినిమా టైటిల్ సాంగ్‌ను విడుదల చేశాడు. యూట్యూబ్‌లో విడుదల చేసిన ఆడియో సాంగ్ లింకును తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు వెల్లడించాడు. 'ఇది వంగవీటి కత్తి.. కాపు కాసే శక్తి' అంటూ ప్రారంభమయ్యే ఈ పాటను సిరాశ్రీ రాయగా, సుసర్ల రాజశేఖర్ సంగీత దర్శకత్వం వహించి.. టైటిల్ సాంగ్ కూడా పాడారు. ఈ విషయాలను వర్మ తన ట్విట్టర్లో వెల్లడించాడు. ఇక ఎయిర్కోస్టా విమానం రద్దు కావడంతో ఎయిరిండియా విమానంలో 4.10 గంటలకు విజయవాడ వస్తున్నానని, అదే హోటల్లో ఉండబోతున్నానని కూడా ట్విట్టర్ ద్వారా చెప్పాడు. వంగవీటి గురించి కొన్ని రహస్యాలు తెలుసుకోడానికి విజయవాడకు బహిరంగంగా వస్తున్నట్లు వర్మ తెలిపాడు. "Vangaveeti" title song ..written by Sirasri..music and sung by Susarla Rajshekar https://t.co/6IuNVjxd0T — Ram Gopal Varma (@RGVzoomin) February 26, 2016 Since aircosta got cancelled coming to Vijayawada 4.10 air india flight from Hyderabad but staying at same place pic.twitter.com/bFNo8gJxNU — Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2016 "Vangaveeti" gurinchi konni rahasyalani thelusukovadaniki Vijayawadaki bahiranganga vasthunna pic.twitter.com/aEF8CzL19J — Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2016 -
విజయవాడ వెళ్తున్నా: వర్మ
తాను ఈనెల 26వ తేదీన విజయవాడ వెళ్లనున్నట్లు దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తాను త్వరలో తీయబోతున్న 'వంగవీటి' సినిమా గురించి పరిశోధన చేయడానికి, కొంతమంది వ్యక్తులను కలవడానికి వెళ్తున్నట్లు చెప్పాడు. వంగవీటి సినిమా తర్వాత ఇక తాను తెలుగులో సినిమాలు తీయబోనని, ఇదే చివరిది అవుతుందని అంతకుముందు వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. విజయవాడలోనే చదువుకున్న వర్మ.. అప్పట్లో తాను చూసిన విషయాలతో పాటు.. మరిన్ని విషయాలు తెలుసుకుని ఆ సినిమాను రూపొందించే ప్రయత్నాలలో పడ్డాడు. ఇంతకుముందే.. తన సినిమాలో వంగవీటి మోహనరంగా పాత్రధారి ఎలా ఉండబోతున్నాడో చూడమంటూ ఓ ఫొటోను కూడా వర్మ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. Going to Vijayawada on 26th to meet some people for the research on "Vangaveeti" — Ram Gopal Varma (@RGVzoomin) February 22, 2016 -
వంగవీటి సినిమా పై వర్మ ఏమన్నారు?