వంగవీటి టైటిల్ సాంగ్ విడుదల | ramgopal varma releases vangaveeti title song | Sakshi
Sakshi News home page

వంగవీటి టైటిల్ సాంగ్ విడుదల

Published Fri, Feb 26 2016 10:22 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

వంగవీటి టైటిల్ సాంగ్ విడుదల - Sakshi

వంగవీటి టైటిల్ సాంగ్ విడుదల

రాంగోపాల్ వర్మ తన కొత్త సినిమా ఇంకా మొదలు పెట్టలేదు గానీ, ముందునుంచే దానికి సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తున్నాడు. గురువారం నాడు 'వంగవీటి' టైటిల్ లోగోను విడుదల చేసిన వర్మ.. తాజాగా ఆ సినిమా టైటిల్ సాంగ్‌ను విడుదల చేశాడు. యూట్యూబ్‌లో విడుదల చేసిన ఆడియో సాంగ్ లింకును తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు వెల్లడించాడు. 'ఇది వంగవీటి కత్తి.. కాపు కాసే శక్తి' అంటూ ప్రారంభమయ్యే ఈ పాటను సిరాశ్రీ రాయగా, సుసర్ల రాజశేఖర్ సంగీత దర్శకత్వం వహించి.. టైటిల్ సాంగ్ కూడా పాడారు. ఈ విషయాలను వర్మ తన ట్విట్టర్‌లో వెల్లడించాడు.

ఇక ఎయిర్‌కోస్టా విమానం రద్దు కావడంతో ఎయిరిండియా విమానంలో 4.10 గంటలకు విజయవాడ వస్తున్నానని, అదే హోటల్లో ఉండబోతున్నానని కూడా ట్విట్టర్ ద్వారా చెప్పాడు. వంగవీటి గురించి కొన్ని రహస్యాలు తెలుసుకోడానికి విజయవాడకు బహిరంగంగా వస్తున్నట్లు వర్మ తెలిపాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement