
రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా జంటగా ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన చిత్రం ‘తిరగబడరసామీ’. మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 2న రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రం టైటిల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘కత్తులు దిగనీ నెత్తురుతోని తడపర భూమి తెగబడవేమీ...’ అంటూ సాగే ఈ పాటకి జేబీ సంగీతం అందించారు.
సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించిన ఈ పాటని సాయి చరణ్, లోకేశ్వర్ ఈదర, చైతు సత్సంగి పాడారు. ‘‘యూత్‌ని ఆకట్టుకునే రొమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటి మెంట్, మాస్‌ని అలరించే హై ఓల్టేజ్ యాక్షన్ అంశాలతో ‘తిరగబడర సామీ’ రూపొందింది. టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి’’ అని చిత్రబృందం పేర్కొంది.