title song released
-
తెగబడవేమీ...
రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా జంటగా ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన చిత్రం ‘తిరగబడరసామీ’. మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 2న రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రం టైటిల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘కత్తులు దిగనీ నెత్తురుతోని తడపర భూమి తెగబడవేమీ...’ అంటూ సాగే ఈ పాటకి జేబీ సంగీతం అందించారు.సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించిన ఈ పాటని సాయి చరణ్, లోకేశ్వర్ ఈదర, చైతు సత్సంగి పాడారు. ‘‘యూత్‌ని ఆకట్టుకునే రొమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటి మెంట్, మాస్‌ని అలరించే హై ఓల్టేజ్ యాక్షన్ అంశాలతో ‘తిరగబడర సామీ’ రూపొందింది. టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా నేర్చుకున్నా
‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీని చూసి చాలా నేర్చుకుని, రాసుకుని సినిమాలు చేశాను. దర్శకుడు చంద్రు మూడేళ్లు కష్టపడి ‘కబ్జ’ చిత్రాన్ని ఇక్కడి వరకు తీసుకువచ్చారు’’అని ఉపేంద్ర అన్నారు. ఆర్.చంద్రు దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘కబ్జ’. ఉపేంద్ర, శ్రియ జంటగా సుదీప్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ మార్చి 17న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని నిర్మాత ఎన్ .సుధాకర్ రెడ్డి సమర్పణలో హీరో నితిన్ రుచిరా ఎంటర్టైన్ మెంట్స్, ఎన్. సినిమాస్ పతాకాలపై తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఆర్.చంద్రు మాట్లాడుతూ–‘‘మార్చి 17న పునీత్ రాజ్‌కుమార్‌గారి జయంతి.. ఆ రోజు మా ‘కబ్జ’ని రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఉపేంద్రగారితో వర్క్ చేయడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు శ్రియ. కాగా ఆస్కార్ ముంగిట నిలిచిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను నిర్మించిన డీవీవీ దానయ్య, ‘నాటు నాటు..’ పాట రాసిన చంద్రబోస్‌ను ఉపేంద్ర అండ్ టీమ్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సాయినాథ్, హనుమంత రెడ్డి, లగడపాటి శ్రీధర్, హీరో విశ్వక్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
‘గాడ్ ఫాదర్’ టైటిల్ సాంగ్ రిలీజ్.. ఇంకెందుకు ఆలస్యం వినేయండి..!
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'గాడ్ ఫాదర్'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ మెగాస్టార్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. (చదవండి: 'గాడ్‌ఫాదర్' హిందీ ట్రైలర్ రిలీజ్.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్) ఈ సందర్భంగా తాజాగా టైటిల్ సాంగ్‌ను అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం. చిరు పాత్రకు అద్దం పట్టే టైటిల్ సాంగ్‌ను రామజోగయ్యశాస్త్రి రాశారు. తమన్ పవర్ఫుల్ సంగీతం అందించారు. సల్మాన్‌ఖాన్, నయనతార, సత్యదేవ్, పూరీ జగన్నాథ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్‌గా గాడ్ ఫాదర్ ప్రేక్షకుల ముందుకొస్తోంది. -
బిగ్‌బాస్ ఫేమ్ సొహైల్ ‘లక్కీ లక్ష్మణ్’ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్..
Bigg Boss Sohel Lucky Laxman Title Song Released By Shiva Nirvana: బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా దత్తాత్రేయ మీడియా పతాకంపై రూపొందిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. చుట్టూ ఉన్న వారంతా లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీ ఫెలోనే అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలతో ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందింది ఈ చిత్రం. ఎ.ఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మించిన ఈ చిత్రంలో హీరోయిన్గా మోక్ష నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా టైటిల్ లిరికల్ వీడియో సాంగ్‌ను డైరెక్టర్ శివ నిర్వాణ విడుదల చేశారు. "అదృష్టం హలో అందిరో.. చందమామ" అంటూ సాగే ఈ గీతం ఆకట్టుకునేలా ఉంది. కథానాయకుడు రాత్రికి రాత్రే ధనవంతుడు అవుతాడనే కాన్సెప్ట్ చుట్టూ ఈ పాట తిరుగుతుంది. ఈ పాటకు సోహైల్ డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ప్రముఖ రచయిత భాస్కర భట్ల రాసిన ఈ గీతాన్ని సింగర్.. రామ్ మిరియాల చక్కగా ఆలపించారు. ఈ పాటకు విశాల్ అందించిన కొరియోగ్రఫీ చక్కగా కుదిరింది. డీఓపీ ఆండ్రు చక్కటి విజువల్స్ ఇచ్చాడు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ పాటలకు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంది. ఈ చిత్రంలోని పాటలు కూడా ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తాయని చిత్రబృందం ఆశాభావం తెలిపింది. ఈ సందర్బంగా ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూలక్కీ ‘‘లక్ష్మణ్’ లోని ఈ టైటిల్ సాంగ్ చాలా బాగుంది. ఈ చిత్ర దర్శకుడు ఏ ఆర్.అభి, నిర్మాత హరిత గిగినేనిలకు ఇది మొదటి చిత్రమైనా చాలా చక్కగా తెరకెక్కించారు. వీరిద్దరికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలి. సోహైల్ నటన బాగుంటుంది. ఇందులో తన డ్యాన్స్ చూడముచ్చటగా ఉంది. వీరి ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’ అని తెలిపారు. -
‘క్రేజీ అంకుల్స్’తో వస్తున్న శ్రీముఖి..
యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా క్రేజీ అంకుల్స్.. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రం ఇటీవలె ట్రైలర్ విడుదలైంది. కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టులో థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా క్రేజీ అంకుల్ టైటిల్ లిరికల్ సాంగ్‌ని చేసింది చిత్ర యూనిట్. ఇక క్రేజీ అంకుల్స్ సినిమాపై యాంకర్ శ్రీముఖి మాట్లాడుతూ..సినిమాకు మొదట్నుంచే మంచి రెస్పాన్స్ వస్తుంది. థియేటర్స్‌లో చూడాల్సిన చక్కని ఫ్యామిలీఎంటర్టైనర్ మూవీ ఇది. ఈ సినిమాలో చాలా మంది ఫేమస్ యాక్టర్స్ నటించారు అని తెలిపింది. ప్రస్తుతం పెద్ద సినిమాలు సైతం థియేటర్స్‌లో రిలీజ్ అవుతున్న ఈ తరుణంలో క్రేజీ అంకుల్స్ సినిమాను కూడా థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న నిర్మాతలకు ధన్యవాదాలు అని నటుడు రాజా రవీంద్ర అన్నాడు. -
పుతం పుదు కలై టైటిల్ ట్రాక్ విడుదల
హీరో సూర్య, గురువారం తమిళ లఘు చిత్రాల సంకలనం ‘పుతం పుదు కలై’ టైటిల్ ట్రాక్‌ను ఆవిష్కరించారు. ఈ సంకలనం కోసం ఐదుగురు ప్రఖ్యాత దర్శకులు కృషి చేశారు. అక్టోబర్ 16 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. ఈ చిత్రాని కోసం గౌతమ్ మీనన్, సుధ కొంగారా, సుహాసిని మణిరత్నం, రాజీవ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్ కలిసి పనిచేశారు. పుతం పుదు కలై ట్రైలర్ ఇటీవల విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందింది. గురువారం జీవీ ప్రకాష్ స్వరపరిచిన ఈ చిత్రం టైటిల్ ట్రాక్ వీడియో పాటను నటుడు సూర్య విడుదల చేశారు. సూర్య ఈ పాట లింక్‌ను తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. వీజీవీ ప్రకాశ్ మీరు ఎల్లప్పుడూ సమకాలీన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తారు. . @gvprakash you always compete with contemporary content & deliver every time with utmost dedication #PuthamPudhuKaalai title track is full of energy & hope.. Best wishes team! https://t.co/Gunylzc7bM @menongautham #SudhaKongara @DirRajivMenon @hasinimani @karthiksubbaraj pic.twitter.com/wqsq5lkwwu — Suriya Sivakumar (@Suriya_offl) October 8, 2020 అదే విధంగా అంకిత భావంతో పనిచేస్తారు అని సూర్య ట్వీట్ చేశారు. అదేవిధంగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక స్టిల్‌ను కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఈ పాటను కబర్ వాసుకి రాయగా, రాజీవ్ మీనన్ టైటిల్ ట్రాక్ వీడియోకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అనేక భావోద్వేగాలు ఉంటాయి. ఐదు వేరు వేరు కథలు మనం చూడొచ్చు. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్ఎఫ్ఎస్ఐ) ఇటీవల నిర్ణయించిన నిబంధనలు పాటిస్తూ పుతం పుదు కలై షూటింగ్ జరిపినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. శ్రుతి హాసన్, అను హాసన్, ఆండ్రియా జెరెమియా, సిక్కుల్ గురుచరణ్, జయరామ్, కాళిదాస్ జయరామ్, కల్యాణి ప్రియదర్శన్, రితు వర్మ, ఎంఎస్ భాస్కర్, బాబీ సింహా సహా అనేక మంది ప్రముఖ నటులు ఇందులో నటించారు. చదవండి: సూర్య వ్యాఖ్యలపై కలకలం -
సంక్రాంతికి రెడీ
శైలేష్ సాగర్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘శివ 143’. ఎలీషా ఆదరహ, హ్రితిక సింగ్, డి.ఎస్.రావ్, ప్రియ పాల్వాయి ఇతర పాత్రల్లో నటించారు. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా జనవరి 12న సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాలోని టైటిల్ సాంగ్‌ని ‘గీత గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరుశురాం విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ట్రైలర్స్, పాటలు చాలా బాగున్నాయి. ఇప్పటి పరిస్థితుల్లో చిన్న బడ్జెట్ సినిమాకి చాలా ఇబ్బందులు ఉన్నాయి.. కానీ వాటిని అధిగమించి ‘శివ 143’ చిత్రం ఇంత బాగా రావటానికి కారణం రామ సత్యనారాయణగారు. మ్యూజిక్ డైరెక్టర్ మనోజ్ కొత్తవాడైనా పాటలు బాగున్నాయి’’ అన్నారు. ‘‘సంక్రాంతికి విడుదలకానున్న మా సినిమా సక్సెస్ సాధిస్తుంది’’ అన్నారు టి. రామసత్యనారాయణ. ‘‘పరుశురాంగారు విడుదల చేసిన పాట సినిమాలో సందర్భానుసారం వస్తుంది. ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు శైలేష్ సాగర్. ∙సాగర్, ఎలీషా -
అక్కడొకడుంటాడు... లెక్క గడుతుంటాడు!
రామ్‌కార్తీక్, శివ హరీష్, రసజ్ఞదీపిక, అలేఖ్య హీరోహీరోయిన్లుగా శివ కంఠంనేని, ‘అల్లరి’ రవిబాబు, వినోద్ కుమార్, ఇంద్రజ ముఖ్య తారలుగా శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. లైట్‌హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా తర్వలో విడుదల కానుంది. ‘అక్కడొకడుంటాడు... లెక్క గడుతుంటాడు...’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ని నిర్మాతలు సి.కల్యాణ్, అశోక్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘డ్రంకన్ డ్రైవ్ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ సినిమా నేను చూశా. మంచి సందేశం ఉంది. శివ కంఠంనేని సీనియర్ నటుల కోవలో తన పాత్రలో ఒదిగిపోయాడు’’ అన్నారు. ‘‘ఈ సినిమా నేను కూడా చూశా. కొత్త నిర్మాతలు తీశారనే భావన ఎక్కడా కలగదు. పేరెంట్స్‌తో పాటు యువత చూడాల్సిన చిత్రమిది’’ అన్నారు అశోక్ కుమార్. ‘‘మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకూ ప్రేక్షకులను కదలనివ్వకుండా కూర్చోబెట్టే చిత్రమిది’’ అన్నారు శివ కంఠంనేని. ‘‘ఈ నెలాఖరులో సినిమా విడుదల చేస్తున్నాం’’ అని రావుల వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీపాద విశ్వక్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్.రాజశేఖరన్, సంగీతం: సార్క్స్, సహనిర్మాతలు: జి.రాంబాబు యాదవ్, ఎన్.వి.గోపాలరావు, కె. శ్రీధర్‌రెడ్డి. -
ఓ ప్రేమకథ
విరాజ్ జె.అశ్విన్ హీరోగా, రిద్ధి కుమార్, రాధా బంగారు హీరోయిన్లుగా టి.ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. కె. సతీష్ కుమార్ సమర్పణలో ప్రముఖ ఫైనాన్షియర్ కె.ఎల్.ఎన్.రాజు నిర్మించిన ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు. అనంతరం శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టైటిల్ సాంగ్ సాహిత్యం, సంగీతం చాలా బాగున్నాయి. ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్‌గారితో నేను చాలా సినిమాలు చేశా. ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్న ఆయన మేనల్లుడు విరాజ్ అశ్విన్ మంచి కథానాయకుడు అవుతాడు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు కె.ఎల్.ఎన్.రాజు. -
వారం రోజులు ముందుగానే వస్తున్నాం
సంతోష్ శోభన్, రియా సుమన్ జంటగా జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పేపర్ బాయ్’. తాన్యా హోప్ కీలక పాత్ర చేశారు. దర్శకుడు సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహులు నిర్మించారు. ఈ సినిమా టైటిల్ సాంగ్ ‘ఓయ్ ఓయ్...పేపర్ బాయ్’ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశారు. భీమ్స్ స్వరకర్త. ప్రముఖ సంగీత దర్శకుడు చంద్రబోస్ ఈ పాటను పాడటం విశేషం. ఈ సినిమాను ముందు అనుకున్నట్లుగా సెప్టెంబర్ 7న కాకుండా ఈ నెల 31న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపారు. సంపత్ నంది మాట్లాడుతూ – ‘‘టీజర్, ట్రైలర్లతో పాటు ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేందుకు రోడ్ ట్రిప్ ప్లాన్ చేశాం. పేపర్ బాయ్స్ ఉన్నంత కాలం ఈ పాట ఉంటుంది. పాట పాడిన చంద్రబోస్‌గారికి, టీమ్ అందరి తరఫున థ్యాంక్స్’’ అన్నారు. ‘‘టెన్షన్ పడేంత టైమ్ కూడా లేదు. వారం రోజులు ముందే వస్తున్నాం. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అన్నారు సంతోష్ శోభన్. చంద్రబోస్‌గారిని అనుసరిస్తున్న శిష్యుల్లో నేను, కాసర్ల శ్యామ్ కూడా ఉన్నాం. ఈ సినిమా టైటిల్ సాంగ్ పాడినందుకు చంద్రబోస్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు భీమ్స్. ‘‘నేను లిరిక్స్ అందించిన పాటకు చంద్రబోస్‌గారు గాత్రం అందించడం నా వరం. నా అదృష్టంగా భావిస్తున్నా. సంపత్ నంది మంచి డైలాగ్స్ రాశారు’’ అన్నారు కాసర్ల శ్యామ్. ఈ కార్యక్రమంలో నిర్మాత నరసింహులు, డైరెక్టర్ జయశంకర్, కెమెరామెన్ సౌందర రాజన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్వెల్లో అర్థమవుతుంది
‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘అంతకు మించి’. మా చిత్రం పోస్టర్స్ విడుదలైన తర్వాత అందరూ రష్మీ ఎక్స్పోజింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. రేపు సినిమా విడుదలైన తర్వాత ఆమె నటన గురించి మాట్లాడతారు’’ అని దర్శకుడు జానీ అన్నారు. జై హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘అంతకు మించి’. రష్మీ గౌతమ్ కథానాయిక. యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ చిత్రం టైటిల్ సాంగ్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. హీరో–నిర్మాత జై మాట్లాడుతూ– ‘‘అంతకు మించి’ సినిమా లాస్ట్ టూ రీల్స్‌లో ప్రేక్షకులు కచ్చితంగా భయపడతారు. ఈ సినిమాకు ‘అంతకు మించి’ టైటిల్ ఎందుకు పెట్టామో ఇంటర్వెల్లో అర్థం అవుతుంది. రష్మీగారు తన నటనతో సినిమాకు ప్రాణం పోశారు’’ అన్నారు. ‘‘కేక్‌లా డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో సినిమా ఉంటుంది’’ అన్నారు రష్మీ. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: భానుప్రకాష్ తేళ్ల, కన్నా తిరుమనాధం. -
వంగవీటి టైటిల్ సాంగ్ విడుదల
రాంగోపాల్ వర్మ తన కొత్త సినిమా ఇంకా మొదలు పెట్టలేదు గానీ, ముందునుంచే దానికి సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తున్నాడు. గురువారం నాడు 'వంగవీటి' టైటిల్ లోగోను విడుదల చేసిన వర్మ.. తాజాగా ఆ సినిమా టైటిల్ సాంగ్‌ను విడుదల చేశాడు. యూట్యూబ్‌లో విడుదల చేసిన ఆడియో సాంగ్ లింకును తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు వెల్లడించాడు. 'ఇది వంగవీటి కత్తి.. కాపు కాసే శక్తి' అంటూ ప్రారంభమయ్యే ఈ పాటను సిరాశ్రీ రాయగా, సుసర్ల రాజశేఖర్ సంగీత దర్శకత్వం వహించి.. టైటిల్ సాంగ్ కూడా పాడారు. ఈ విషయాలను వర్మ తన ట్విట్టర్లో వెల్లడించాడు. ఇక ఎయిర్కోస్టా విమానం రద్దు కావడంతో ఎయిరిండియా విమానంలో 4.10 గంటలకు విజయవాడ వస్తున్నానని, అదే హోటల్లో ఉండబోతున్నానని కూడా ట్విట్టర్ ద్వారా చెప్పాడు. వంగవీటి గురించి కొన్ని రహస్యాలు తెలుసుకోడానికి విజయవాడకు బహిరంగంగా వస్తున్నట్లు వర్మ తెలిపాడు. "Vangaveeti" title song ..written by Sirasri..music and sung by Susarla Rajshekar https://t.co/6IuNVjxd0T — Ram Gopal Varma (@RGVzoomin) February 26, 2016 Since aircosta got cancelled coming to Vijayawada 4.10 air india flight from Hyderabad but staying at same place pic.twitter.com/bFNo8gJxNU — Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2016 "Vangaveeti" gurinchi konni rahasyalani thelusukovadaniki Vijayawadaki bahiranganga vasthunna pic.twitter.com/aEF8CzL19J — Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2016 -
టెంపర్ టైటిల్ సాంగ్ వీడియో విడుదల
పూరీ జగన్నాథ్, ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందుతున్న టెంపర్ సినిమా టైటిల్ సాంగ్ వీడియో యూట్యూబ్‌లో విడుదలైంది. ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ పాటను రిలీజ్ చేసింది. ఇంతకుముందు సమంతతో రభస చేసిన ఎన్టీఆర్.. ఇప్పుడు మంచి సక్సెస్ కోసం చూస్తున్నాడు. నందమూరి ఫ్యామిలీలో కళ్యాణ్ రామ్ పటాస్‌తో మంచి హిట్ కొట్టడంతో.. ఇప్పుడు అదే సెంటిమెంటు ఎన్టీఆర్‌కు కూడా వర్కవుతుందని అంచనా వేస్తున్నారు. టెంపర్ టైటిల్ సాంగ్ వీడియోలో ఎన్టీఆర్ లుక్ బాగా స్టైలిష్‌గా కనిపిస్తోంది. సినిమాను సంక్రాంతికే విడుదల చేయాల్సి ఉన్నా, నందమూరి కుటుంబంలో జరిగిన విషాద ఘటన కారణంగా దాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు వాలెంటైన్స్‌డేకు ఒక్కరోజు ముందు సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ టైటిల్ సాంగును భాస్కరభట్ల రవికుమార్ రాశారు. ఈ పాటకు తారక్ తనదైన శైలిలో డాన్సులు చేస్తాడని అంటున్నారు. 'నీ తాత టెంపర్, నీ అయ్య టెంపర్, బాబాయి టెంపర్, నువ్వింకా టెంపర్ ఏ.. బ్లడ్‌లోనే ఉందమ్మా బెండు తీసే టెంపర్.. దమ్మున్న ప్రతోడికి ఉందమ్మా టెంపర్.. సబ్కో ఫటాలే సబ్కో బచాలే నాచ్ నాచ్...' అంటూ ఈ పాట సాగుతుంది.