పుతం పుదు కలై టైటిల్‌ ట్రాక్‌ విడుదల | Hero Surya Released Putham Pudhu Kaalai Title Track on Twitter | Sakshi
Sakshi News home page

పుతం పుదు కలై టైటిల్‌ ట్రాక్‌ను విడుదల చేసిన సూర్య

Published Thu, Oct 8 2020 8:21 PM | Last Updated on Mon, Oct 12 2020 10:45 AM

Hero Surya Released Putham Pudhu Kaalai Title Track on Twitter - Sakshi

హీరో సూర్య, గురువారం తమిళ లఘు చిత్రాల సంకలనం ‘పుతం పుదు కలై’ టైటిల్ ట్రాక్‌ను ఆవిష్కరించారు. ఈ సంకలనం కోసం ఐదుగురు ప్రఖ్యాత దర్శకులు  కృషి చేశారు. అక్టోబర్ 16 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. ఈ చిత్రాని కోసం గౌతమ్ మీనన్, సుధ కొంగారా, సుహాసిని మణిరత్నం, రాజీవ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్ కలిసి పనిచేశారు. పుతం పుదు కలై  ట్రైలర్ ఇటీవల విడుదలై,  ప్రేక్షకుల నుంచి  మంచి ‍స్పందనను పొందింది. గురువారం  జీవీ ప్రకాష్ స్వరపరిచిన ఈ చిత్రం టైటిల్ ట్రాక్ వీడియో పాటను నటుడు సూర్య విడుదల చేశారు. సూర్య ఈ పాట లింక్‌ను తన ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. వీజీవీ ప్రకాశ్‌ మీరు ఎల్లప్పుడూ సమకాలీన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తారు.
 

అదే విధంగా అంకిత భావంతో పనిచేస్తారు అని సూర్య ట్వీట్‌ చేశారు. అదేవిధంగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక స్టిల్‌ను కూడా తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఈ పాటను కబర్ వాసుకి రాయగా, రాజీవ్ మీనన్ టైటిల్ ట్రాక్ వీడియోకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అనేక భావోద్వేగాలు ఉంటాయి. ఐదు వేరు వేరు కథలు మనం చూడొచ్చు. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఐ) ఇటీవల నిర్ణయించిన నిబంధనలు పాటిస్తూ పుతం పుదు కలై  షూటింగ్‌ జరిపినట్లు చిత్రయూనిట్‌ పేర్కొంది. శ్రుతి హాసన్, అను హాసన్, ఆండ్రియా జెరెమియా, సిక్కుల్ గురుచరణ్, జయరామ్, కాళిదాస్ జయరామ్, కల్యాణి ప్రియదర్శన్, రితు వర్మ, ఎంఎస్ భాస్కర్, బాబీ సింహా సహా అనేక మంది ప్రముఖ నటులు ఇందులో నటించారు. చదవండి: సూర్య వ్యాఖ్యలపై కలకలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement