కాస్త పొగరుబోతు నటిగా ముద్ర వేసుకున్న నటి నిత్యామీనన్. అది ఈమెలోని నటనా ప్రతిభ నుంచి వచ్చింది కావచ్చు. ఈమెను పొట్టి, బొద్దు అమ్మాయి అని కూడా అంటారు. అయితే వాటిని అస్సలు పట్టించుకోదు. అందుకే ఈ మలయాళ భామ తెలుగు, తమిళం భాషల్లోనూ కథానాయకిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. తిరుచ్చిట్రఫలం అనే తమిళ చిత్రంలోని నటనకుగానూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ అవార్డుల పట్టికలో ఉత్తమ నటి అవార్డుకు నిత్యామీనన్ పేరు చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా ఆమె తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ ‘‘చాలా సంతోషంగా ఉంది. ఇది నేను గెలుచుకున్న తొలి జాతీయ అవార్డు. చూడడానికి సాధారణంగా ఉన్నా, నటన వెనుక ఉన్న శ్రమ సాధారణం కాదని అర్థం చేసుకున్న జాతీయ అవార్డుల కమిటీకి ధన్యవాదాలు. ఉత్తమ నటన అనేది బరువు తగ్గడమో, పెరగడమో, సహజ సిద్ధమైన శరీరాకృతిని మార్చుకోవడంలోనే ఉండదు. అవంతా నటనలో ఒక భాగం మాత్రమే కానీ అవే నటన కాదు. దీన్ని నిరూపించడానికే నేను ప్రయతి్నస్తున్నాను. ఈ అవార్డు నాకు, దర్శకుడు భారతీరాజా, ప్రకాశ్‌రాజ్,ధను‹Ùకు చెందుతుంది.
ఎందుకంటే ఒక చిత్రంలో నటుడికి సరిసమానంగా నటికీ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నేను ఇంతకు ముందెప్పుడూ నటించలేదు. అది తిరుచ్చిట్రంఫలం చిత్రంలో జరిగింది. మరో విషయం ఏమిటంటే నిజాల కంటే వదంతులు అధికంగా ప్రచారం అవుతుంటాయి. ఒక రంగంలో ఎదగడం చాలా కష్టం’’ అని నిత్యామీనన్ పేర్కొన్నారు. కాగా తనకు జాతీయ ఉత్తమ నటి అవార్డును ప్రకటించిన విషయం ముందుగా ధనుష్ ఫోన్ చేసి చెప్పారన్నారు. ఆయన ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పడంతో విషయం ఏమిటని అడిగానన్నారు. అప్పుడు ఆయన ఈ అవార్డు గురించి వివరించారని నిత్యామీనన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment