Hero surya
-
హీరో సూర్య యాక్టింగ్ చూడండి ఎంత బాగా చేశాడో..!
-
దర్శకుడు హరికి సూర్యకు మధ్య మనస్పర్థలా? అంతా ఉత్తిదే! కాంబో రిపీట్
తమిళ సినిమా: నటుడు సూర్య, దర్శకుడు హరి సూపర్‌హిట్ కాంబినేషన్. ఇంతకు ముందు ఆరు, వేల్, సింగం సిరీస్ మొదలు హిట్ చిత్రాలు వచ్చాయి. సింగం-2 చిత్రం తరువాత వీరి కాంబినేషన్లో అరువా చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత సూర్యకు దర్శకుడు హరికి మధ్య మనస్పర్థలు తలెత్తాయని, దీంతో అరువా చిత్రం ఆగిపోయిందని ప్రచారం జరిగింది. అన్నట్టుగానే వీరి కాంబినేషన్లో ఇప్పటి వరకు మరో చిత్రం రాలేదు. నటుడు సూర్య ఇతర చిత్రాలతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువా అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్రం చేయనున్నారు. ఇక దర్శకుడు హరి చివరిగా అరుణ్ విజయ్ హీరోగా యానై చిత్రాన్ని చేశారు. కాగా ఇటీవల తన సతీమణితో కలిసి ఓ రికార్డింగ్, ప్రివ్యూ స్టూడియోను ప్రారంభించారు. ఆ వేడుకకు నటుడు సూర్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీంతో వీరి మధ్య మనస్పర్థలు అనేవి వదంతులని తేలింది. కాగా దర్శకుడు హరి ఇప్పుడు వరుసగా మూడు కమర్షియల్ కథా చిత్రాలను తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. చదవండి: వైరముత్తు నవలలో విక్రమ్ నటిస్తారా? అందులో ముందుగా నటుడు విశాల్ హీరోగా చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది. వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు పూజా, తామ్రరభరణి వంటి హిట్ చిత్రాలు రూపొందాయి. కాగా తదుపరి నటుడు సూర్య కథానాయకుడిగా ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా నటుడు కార్తీ తాను హరి చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
కాంబినేషన్ రిపీట్
హీరో సూర్య – దర్శకురాలు సుధ కొంగరది హిట్ కాంబినేషన్. సూర్య హీరోగా సుధ దర్శకత్వంలో రూపొందిన ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దు రా’) మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఈ చిత్రానికి ఐదు అవార్డులు దక్కాయి. కాగా సుధ కొంగర దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సూర్య అంగీకరించారు. గ్యాంగ్‌స్టర్ కథతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో సుధ పేర్కొన్నారు. అయితే ఈ సినిమా ఆరంభానికి కొంత టైమ్ పడుతుంది. ప్రస్తుతం బాల దర్శకత్వంలో సూర్య ‘వణంగాన్’ (తెలుగులో ‘అచలుడు’) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుధ దర్శకత్వంలో సూర్య చేసే సినిమా ఆరంభం అవుతుందని సమాచారం. పక్కా మాస్ మసాలా కథతో కమర్షియల్ చిత్రంగా సుధ తెరకెక్కించనున్నారని తెలిసింది. -
హీరో సూర్యను కలిసిన షణ్ముఖ్ జశ్వంత్
-
Oscar 2022: ఆస్కార్స్ నుంచి జై భీం ఔట్!
-
ఇంత ప్రేమ ఇంతకుముందెన్నడూ చూడలేదు: హీరో సూర్య
సాక్షి, హైదరాబాద్: తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన జైభీమ్ వివాదం, ఈ నేపథ్యంలో తనకు లభిస్తున్న స్పందనపై సూర్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమకు అండగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సూర్య బుధవారం ట్వీట్ చేశారు. (Jai Bhim: మరో ఘనత, హాలీవుడ్ క్లాసిక్ హిట్‌ను దాటేసింది ) జైభీమ్ మూవీని ఆదరిస్తున్న తీరు, ప్రేమ అపారమైనది. ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి ప్రేమ చూడలేదంటూ సూర్య తన ఆనందాన్ని ప్రకటించారు. ఈ సమయంలో తమకు అందించిన విశ్వాసం, భరోసాకు ఎంత కృతజ్ఞతతో ఉన్నానో మాటల్లో చెప్పలేనంటూ ట్వీట్ చేశారు. జైభీమ్ సినిమా వివాదం నేపథ్యంలో హీరో సూర్యకు సోషల్ మీడియాలో భారీ మద్దతు లభించింది. స్టాండ్ విత్ సూర్య అంటూ నెటిజనులు సూర్య అండ్ టీంకు అండగా నిలబడు తున్నారు. కాగా ఈ మూవీలో ప్రకాష్ రాజ్ చెంపదెబ్బ సీన్‌పై వివాదం సమసిపోకముందే ఈ సినిమాలోని పలు అంశాలు ఓ వర్గం వారికి కించపరిచేలా ఉన్నాయని పీఎంకే ఎంపీ అన్బుమణి రాందాస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. చిత్ర దర్శకుడు, నిర్మాతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీఎంకే మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్ సెల్వం అక్కడి పోలీస్ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. ఈ ఆరోపణలను హీరో సూర్య ఖండించారు. మరోవైపు హీరో సూర్యని కొట్టిన వారికి ఏకంగా లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని పీఎంకే పార్టీ నేతలు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే జైభీమ్ సినిమా వివాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయ వద్దని, ఆవేశకావేశాలకు లోను కావద్దని తన ఫ్యాన్స్‌కు పిలుపు నిచ్చారు. అన్ని వర్గాలు, కులాల వారిని సమంగానే చూడాలని ఎవరినీ కించపరచొద్దంటూ ఒకలేఖ రాశారు. అటు నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన జైభీమ్ సినిమా ఓటీటీలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఐఎండీబీ రేటింగ్‌లో టాప్ ప్లేస్‌లో దూసుకు పోతోంది. Dear all, this love for #Jaibhim is overwhelming. I’ve never witnessed this before! Can’t express in words how thankful I am for the trust & reassurance you all have given us. Heartfelt thanks for standing by us ✊🏼 — Suriya Sivakumar (@Suriya_offl) November 17, 2021 -
జైభీమ్: మరో ఘనత, హాలీవుడ్ క్లాసిక్ హిట్‌ను దాటేసింది
సాక్షి, హైదరాబాద్: సినిమా అంటే ఫైట్లు, ఫీట్లు, ఐటెం సాంగ్‌లు కాదని నిరూపించిన మూవీ జై భీమ్. సినిమాకు సామాజిక బాధ్యతకు ఉన్న అవినావ సంబంధాన్ని మరోసారి తట్టిలేపిన మూవీ. అంతేకాదు సింపుల్ బడ్జెట్‌తో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సగటు ప్రేక్షకుడిలో ఆలోచన రేకెత్తించిన సినిమాగా ప్రశంసలు దక్కించుకుంది. ఒక ఆడబిడ్డ నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోత్మకంగా తెరకెక్కించిన వైనం శభాష్ అనిపించుకుంది. ఈ మూవీ బ్లాక్ బ్లస్టర్హిట్ అవ్వడమే కాదు అనేక రికార్డులతో దూసుకుపోతోంది. తాజాగా ఐఎండీబీలో రేటింగ్స్‌లో హాలీవుడ్ క్లాసిక్ హిట్ ‘ది షాషాంక్ రిడంప్షన్’ అధిగమించి ప్రపంచవ్యాప్తంగా విమర్శకులను ఆకట్టుకుంటోంది. 1994లో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు ఐఎండీబీ సినిమాల జాబితాలో టాప్ ఉంది. ప్రస్తుతం 2.5 మిలియన్ల ఓట్లతో 9.3 రేటింగ్‌తో ఉండగా, జై భీమ్ 73 వేలకు పైగా ఓట్లతో 9.6 రేటింగ్ సాధించింది తమిళ హీరో సూర్య, నటి జ్యోతిక దంపతులకు వారి మూవీలు, ఫ్యాన్స్‌లో వారికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటెంట్ ప్రాధాన్యమున్న సినిమాలతో, అనేక ప్రయోగాలకు శ్రీకారం చుట్టడమే కాదు కమర్షియల్‌గా సూపర్ సక్సెస్ అవుతున్నారు.. ఈ మూవీ ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన టాప్ మూవీగా జైభీమ్ నిలిచింది. అరుదైన చిత్రాల జాబితా లిస్టులో చోటు సంపాదించుకుని 9.6 రేటింగ్‌తో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. -
జై బోలో భీమ్
-
హిందీలోకి ‘సూరరై పోట్రు’, బాలీవుడ్‌లోకి నిర్మాతగా సూర్య ఎంట్రీ
హీరో సూర్య ఇటీవల నటించిన తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’. తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో డబ్ అయిన సంగతి తెలిసిందే. సూర్య, జ్యోతికలు కలిసి నిర్మించిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఓటీటీలో విడుదలై విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తెలుగు తమిళంలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు సూర్య సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. సూర్య, జ్యోతిక, రాజశేఖర్ పాండియన్లు సంయుక్తంగా ఈ మూవీని అబన్డంతియ ఎంటర్టైన్మెంట్స్పై బాలీవుడ్లో నిర్మించబోతున్నారు. ఈ రీమేక్ ద్వారా హీరో సూర్య బాలీవుడ్‌లోకి నిర్మాతగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. దర్శకుడు సుధా కొంగర బాలీవుడ్‌లోనూ డైరెక్ట్ చేయబోతున్నారు. ఇక హీరో ఎవరన్నది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. హీరో, నటీనటులు ఎవరన్నది త్వరలోనే అధికారిక ప్రకటన వెలువనుంది. Excited to announce our association with @Abundantia_Ent lead by @vikramix for #SooraraiPottru in Hindi, Directed by #SudhaKongara@CaptGopinath#Jyotika @rajsekarpandian @ShikhaaSharma03 @2D_ENTPVTLTD pic.twitter.com/ECjSpO9OOT — Suriya Sivakumar (@Suriya_offl) July 12, 2021 -
వ్యాక్సిన్ తీసుకున్న హీరో సూర్య దంపతులు
హీరో సూర్య ఆయన భార్య, నటి జ్యోతిక వ్యాక్సిన్ తీసుకున్నారు. మంగళవారం(జూన్ 22) వారిద్దరూ వ్యాక్సిన్ తీసుకున్నట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘వ్యాక్సినేటెడ్’ అంటూ భార్య జ్యోతిక, సూర్య వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోలను ట్విటర్లో షేర్ చేశాడు. కాగా సూర్య ఇటీవల నటించిన ఆకాశం నీహద్దురా సినిమాతో సూపర్ హిట్‌ను అందుకున్నాడు. కొంతకాలంగా సక్సెస్ లేని సూర్యకు ఈ మూవీ ఘనవిజయాన్ని అందించింది. ప్రస్తుతం సూర్య సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సూర్య 40వ చిత్రంగా ఇది తెరకెక్కనుంది. ఈ మూవీలో సూర్యకు జోడీగా నాని గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నట్లు సమాచారం. #Vaccinated pic.twitter.com/3SJG9wYPFD — Suriya Sivakumar (@Suriya_offl) June 22, 2021 -
సూర్య 40: మంచి కిక్ ఇచ్చే మాస్ టైటిల్, త్వరలో వెల్లడి
సాక్షి, చెన్నై: సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ 35 శాతం పూర్తయిందని పాండిరాజ్ వెల్లడించారు. ఈ సినిమా గురించి ఇంకా పాండిరాజ్ మాట్లాడుతూ.. ‘లాక్డౌన్ ఎత్తివేసిన వెంటనే చిత్రీకరణను తిరిగా ప్రారంభిస్తాం త్వరలో ప్రీ లుక్‌తో పాటు టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుంది. సూర్య అభిమానులకు కిక్ ఇచ్చేలా టైటిల్ మాసీగా ఉంటుంది. వచ్చే నెలలో మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చెన్నైలో ప్రారంభం కానుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించనున్నారు. కోవిడ్ ఆటంకాలు లేకుండా అనుకున్న ప్రకారం షూటింగ్ జరిగితే ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. చదవండి: ‘శ్రుతీ.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?’ -
పుతం పుదు కలై టైటిల్ ట్రాక్ విడుదల
హీరో సూర్య, గురువారం తమిళ లఘు చిత్రాల సంకలనం ‘పుతం పుదు కలై’ టైటిల్ ట్రాక్‌ను ఆవిష్కరించారు. ఈ సంకలనం కోసం ఐదుగురు ప్రఖ్యాత దర్శకులు కృషి చేశారు. అక్టోబర్ 16 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. ఈ చిత్రాని కోసం గౌతమ్ మీనన్, సుధ కొంగారా, సుహాసిని మణిరత్నం, రాజీవ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్ కలిసి పనిచేశారు. పుతం పుదు కలై ట్రైలర్ ఇటీవల విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందింది. గురువారం జీవీ ప్రకాష్ స్వరపరిచిన ఈ చిత్రం టైటిల్ ట్రాక్ వీడియో పాటను నటుడు సూర్య విడుదల చేశారు. సూర్య ఈ పాట లింక్‌ను తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. వీజీవీ ప్రకాశ్ మీరు ఎల్లప్పుడూ సమకాలీన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తారు. . @gvprakash you always compete with contemporary content & deliver every time with utmost dedication #PuthamPudhuKaalai title track is full of energy & hope.. Best wishes team! https://t.co/Gunylzc7bM @menongautham #SudhaKongara @DirRajivMenon @hasinimani @karthiksubbaraj pic.twitter.com/wqsq5lkwwu — Suriya Sivakumar (@Suriya_offl) October 8, 2020 అదే విధంగా అంకిత భావంతో పనిచేస్తారు అని సూర్య ట్వీట్ చేశారు. అదేవిధంగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక స్టిల్‌ను కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఈ పాటను కబర్ వాసుకి రాయగా, రాజీవ్ మీనన్ టైటిల్ ట్రాక్ వీడియోకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అనేక భావోద్వేగాలు ఉంటాయి. ఐదు వేరు వేరు కథలు మనం చూడొచ్చు. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్ఎఫ్ఎస్ఐ) ఇటీవల నిర్ణయించిన నిబంధనలు పాటిస్తూ పుతం పుదు కలై షూటింగ్ జరిపినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. శ్రుతి హాసన్, అను హాసన్, ఆండ్రియా జెరెమియా, సిక్కుల్ గురుచరణ్, జయరామ్, కాళిదాస్ జయరామ్, కల్యాణి ప్రియదర్శన్, రితు వర్మ, ఎంఎస్ భాస్కర్, బాబీ సింహా సహా అనేక మంది ప్రముఖ నటులు ఇందులో నటించారు. చదవండి: సూర్య వ్యాఖ్యలపై కలకలం -
సూర్య వ్యాఖ్యలపై కలకలం
చెన్నై: తమిళనాడులో నీట్ పరీక్షకు ముందు నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో తమిళ హీరో సూర్య వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు జడ్జి సుబ్రమణ్యం చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. అయితే, సూర్య తమిళంలో ఇచ్చిన స్టేట్మెంట్ను ఆంగ్లంలో అన్వయించుకోవడంలో జరిగిన పొరపాటు వల్లనే జస్టిస్ సుబ్రమణ్యం తీవ్రంగా స్పందించారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం అత్యంత విషాదమని, ఇది తన మనసుని ఎంతగానో కలచివేసిందని సూర్య ట్విట్టర్లో స్పందించారు. కరోనా నేపథ్యంలో ప్రాణభయంతో న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలిస్తున్నారని, అయితే విద్యార్థులను మాత్రం నిర్భీతిగా వెళ్ళి పరీక్షలు రాయమని ఆదేశించడంలో నైతికత లేదని సూర్య ట్వీట్ చేసినట్లు జస్టిస్ సుబ్రమణ్యం తన లేఖలో పేర్కొన్నారు. అయితే సూర్య చేసిన ట్వీట్లో ‘‘అలాంటప్పుడు, నైతికత లేదు’’ అనే పదాలు లేవని, జడ్జి అన్వయం చేసుకోవడంలో పొరపాటుపడి ఉండొచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. మరోవైపు సూర్యపై ఎటువంటి చర్యలు చేపట్టొద్దని, ఆయన ఎంతోమంది పేద విద్యార్థులకు సాయపడ్డారని, ఒక దుర్ఘటనపై కళాకారుడి స్పందనను తీవ్రమైనదిగా పరిగణించరాదని ఆరుగురు మాజీ జడ్జీలు, కొందరు ప్రముఖ న్యాయవాదులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. -
లీడర్
-
యంగ్ సీఎం జగననన్నకు అభినందనలు
-
గోపాలకృష్ణ రైట్స్ రాధాకి
నంద గోపాలకృష్ణ 31న రాబోతున్నాడు. తీసుకొస్తున్నది ఎవరో తెలుసా? కేకే రాధామోహన్. నంద గోపాలకృష్ణ అంటే హీరో సూర్య పేరు. ‘7/జి బృందావన కాలని, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందిన చిత్రం ‘ఎన్.జి.కె’. అంటే నంద గోపాలకృష్ణ అని అర్థం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత, శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కేకే రాధామోహన్ సొంతం చేసుకున్నారు. మే 31న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్లు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, నిర్మాతలు:ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు. -
గజ తుఫాన్: హీరో సూర్య కుటుంబం విరాళం
సాక్షి, చెన్నై: దక్షిణ తమిళనాడుపై గజ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు ఏడు జిల్లాల్లో ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఇప్పటికే నష్టనివారణ చర్యలకై రంగంలోకి దిగిన తమిళనాడు ప్రభుత్వానికి ఆర్థికంగా భరోసా కల్పించడానికి ఒక్కొక్కరు కదిలి వస్తున్నారు. కోట్ల రూపాయలను నష్టపోయిన తమిళనాడుకు ఆపన్నహస్తం అందించేందుకు సినీ తారలు, రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలు, కార్పోరేట్ కంపెనీలు తమ వంతు బాధ్యతను తీసుకుంటున్నాయి. తాజాగా గజా తుఫాన్‌తో ఉక్కిరిబిక్కిరైన తమిళనాడులో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం కోలీవుడ్ టాప్ హీరో సూర్య కుటుంబం 50 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించింది. హీరో సూర్య, ఆయన సతీమణి జ్యోతిక, తండ్రి శివకుమార్, సోదరుడు కార్తీ నలుగురు కలిసి వారి తరఫున ఈ డబ్బును సీఎం సహాయనిధికి ఇవ్వనున్నారు. కేరళ వరదల సమయంలోనూ హీరో సూర్య, ఆయన తమ్ముడు కార్తిలు అందరికంటే ముందుంగా స్పందించి విరాళాలు అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా గజ తుఫాన్‌తో నష్టపోయిన తమిళనాడుకు తమ వంతుగా ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ముందుగా స్పందించి విరాళాన్ని ప్రకటించారు. అదేవిధంగా మరో హీరో విజయ్ సేతుపతి తన వంతు సహాయంగా 25 లక్షల విరాళాన్ని తమిళనాడు ప్రభుత్వానికి అందజేశారు. డీఎంకే ట్రస్ట్ కోటి రూపాయలను, ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి నెల జీతాన్ని ప్రకటించారు. గతంలో కూడా కేరళ వరదలు, తిత్లీ తుఫాన్ సమయంలో చాలా మంది తమిళ, తెలుగు సినీ తారలు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. -
కేరళ వర్షాలు : భారీ విరాళం ప్రకటించిన హీరోలు
భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరైన కేరళను ఆదుకునేందుకు ప్రముఖ సినీ నటులు స్పందిస్తున్నారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకోసం విరాళాలివ్వమని కేరళ ముఖ్యమంత్రి ఇలా విజ్ఞప్తి చేశారో లేదో సౌత్ సూపర్ స్టార్ సూర్య, ఆయన సోదరుడు, మరో హీరో కార్తి వేగంగా స్పందించారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే కేరళకు భారీ విరాళాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల అందించనున్నామని తమిళ, తెలుగు సినీరంగంలో హీరోలుగా వెలుగొందుతున్న ఈ సోదర బృందం వెల్లడించింది. మరోవైపు కేరళను భారీ వర్షాలు, వరదలు మరోసారి అతలాకుతలం చేస్తున్నాయి. మూడు రోజులుగా భారీ వర్షాలు అక్కడి జనజీవనాన్ని స్థంభింపజేశాయి. కొన్నిచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. నదులు, ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కేరళవాసులను ఆదుకునేందుకు ప్రముఖ తమిళ హీరో విశాల్ ముందుకు వచ్చారు. కేరళ రెస్క్యూ పేరుతో విరాళాలు సేకరించాలని నిర్ణయించినట్టు ట్విటర్ ద్వారా ప్రకటించారు. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న కేరళ ప్రజలను ఆదుకుందాం. వయనాడ్ ప్రాంతంలో ప్రజలకు సహాయం అందించేందుకు రేపు చెన్నైలోని మహాలింగపురంలో విరాళాలు సేకరిస్తున్నాం. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రిలీఫ్ మెటీరియల్స్‌ను తీసుకుంటాం. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న కేరళ వాసులను ఆదుకుందాం. కష్టసమయంలో ఉన్న వాళ్లకి అండగా ఉందాం. అత్యవసర వస్తువులను ప్రజలు అందజేయాల్సిందిగా నటుడు విశాల్ కోరారు. కాగా కేరళలో వరద పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ పరిస్థితి చాలా ఘోరంగా ఉందని ప్రకటించారు. ఈ సందర్భంగా మృతులకు, గాయపడిన వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్టు వెల్లడించారు. అంతేకాదు కేరళ ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధిగా విరాళాలివ్వాల్సింగా శనివారం సాయంత్రం విజ్ఞప్తి చేశారు. -
అభిమాన హీరోతో నటించనున్న సాయిపల్లవి
మాలయాళంలో ప్రేమమ్ చిత్రంలో మలర్ పాత్రలో హీరోయిన్ సాయిపల్లవి తన నటనతో అందర్నీ అకట్టుకుంది. టాలీవుడ్లో కూడా ఫిదా, ఎంసీఏ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం ఆమె కోలీవుడ్‌లో నటిస్తోంది. అయితే మలయాళం, తెలుగులో మాదిరిగా తన మ్యాజిక్ కంటిన్యూ కాలేదు. ఆరంభంలోనే మణిరత్నం లాంటి దర్శకుడి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. తాజాగా ఆమె ఆటో నేర్చుకుంటోందనే రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ బ్యూటీ తన అభిమాన హీరో సూర్యతో జతకట్టనున్నారు. అంతేకాక కోలీవుడ్‌లో మొదటి సినిమా ‘దియా’ కాస్తా నిరాశ పరిచింది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన దియా తెలుగులోనూ సక్సెస్ కాలేదు. కానీ తన నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. కోలీవుడ్‌లో మరో రెండు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అందులో ఒకటి తన అభిమనా హీరో సూర్యతో నటిస్తోంది. ‘ఎన్జీకే’ పేరుతో సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ చిత్రం దీపావళికి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. సాయిపల్లవి ధనుష్‌కు జంటగా ‘మారి-2’లో నటించనుంది. ఇందులో సాయిపల్లవి ఆటో డ్రైవర్ పాత్రలో నటిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ అమ్మడిప్పుడు ఆటో నేర్చుకోవటంలో శిక్షణ పొందుంతోందని సమాచారం. ‘ఫిదా’ చిత్రంలో ఈ బ్యూటీ ట్రాక్టర్ నడిపిన విషయం తెలిసిందే. బాలాజీమోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. -
గేట్ దూకి బయటకెళ్లిన హీరో సూర్య
సాక్షి, రాజమండ్రి : అభిమానుల తాకిడి నుంచి తప్పించుకునేందుకు నటీనటులు మరో దారి వెతుక్కునే ఘటనలు సినిమాల్లో చూస్తూనే ఉంటాం. అయితే రియల్ లైఫ్‌లో హీరో సూర్యకు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ‘ గ్యాంగ్’ సినిమా ప్రమోషన్ కోసం రాజమండ్రి వచ్చిన సూర్య స్థానిక మేనక సినిమా థియోటర్‌కు వెళ్లాడు. అక్కడ అభిమానులను ఉద్దేశించి మాట్లాడి, తిరిగి వెళ్తుండగా అతడితో సెల్ఫీ దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. అయితే అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో సూర్య గేటుదూకి అందరికీ అభివాదం చేస్తూ అక్కడి నుంచి కారులో వెళ్లిపోయాడు. సూర్యను చూసిన అభిమానులు కేరింతలు, ఈలలతో హంగామా చేశారు. -
గేట్ దూకి బయటకెళ్లిన హీరో సూర్య
-
గ్యాంగ్ లీడర్
-
అవే నా అందాన్ని పెంచాయ్: నటి
సాక్షి, చెన్నై: ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం. ఆ ప్రేమ గురించి యువ హీరోయిన్ సాయిపల్లవి ఏమంటుందో తెలుసుకుందాం! మలయాళ చిత్రం ప్రేమమ్‌తో అందర్ని ఆకర్షించింది సాయిపల్లవి. ఆ ఒక్క చిత్రమే ఈ నేచురల్ బ్యూటీ జీవితాన్ని మార్చేసింది. కోలీవుడ్, టాలీవుడ్‌లలో క్రేజీ నటిగా మారిపోయింది. టాలీవుడ్ ప్రేక్షకులు ఈ అమ్మడి నటనకు ‘ఫిదా’ అయిపోయారు. తన అభిమాన హీరో సూర్యతో నటించే అవకాశం రావడంతో మయ ఖుసీ అయిపోతున్న సాయిపల్లవి ఒక పత్రికతో తన ఆనందాన్ని పంచుకున్నారు. సాయిపల్లవి మాట్లాడుతూ.. ‘నాకు డాన్స్ అంటే ప్రాణం. చదువుకుంటూనే డాన్స్ నేర్చుకున్నాను. సినిమాల్లో నటించాలన్న ఆసక్తి ఉంది. అయితే నాన్నకు మాత్రం నన్ను డాక్టరుగా చూడాలన్న ఆశ. దీంతో డాక్టరు విద్య కోసం నాన్న జార్జియా పంపారు. ఆ సమయంలో దర్శకుడు అల్పోన్సా ఫోన్ చేసి నేను దర్శకత్వం వహించనున్న ప్రేమమ్ చిత్రంలో నటిస్తావా అని అడిగారు. అంతే ఎగిరి గంతేసి నటించడానికి సమ్మతించాను. ఆ చిత్రం నాకు చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది. నా ముఖానికి మొటిమలు ఎక్కువ. అయినా ఎలాంటి మేకప్ లేకుండా నటించాను. అవే నా ముఖానికి అందాన్ని రెట్టింపు చేశాయని చాలా మంది ప్రశంసించారు. సహజ సిద్ధమైన అందాలతో నటిస్తేనే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నా భావన. నేను కాలేజీలో చదువుతున్న చాలా మంది ప్రేమిస్తున్నామని చెప్పారు. నిజం చెప్పాలంటే నాకు ప్రేమ అంటే ఇష్టం ఉండదు. నటన అంటేనే ఇష్టం. హీరో సూర్య అంటే చిన్నతనం నుంచి ఇష్టం. అలాంటి నటుడితో జంటగా నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది’ అని సాయిపల్లవి చెప్పారు. -
‘కాట్టేరి’కి శ్రీకారం చుట్టారు
కాట్టేరి చిత్రానికి శ్రీకారం చుట్టారు. సూర్య కథానాయకుడిగా తానాసేర్న్‌ద కూట్టం, ఆర్య హీరోగా గజనీకాంత్ చిత్రాలను నిర్మిస్తున్న స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న తాజా చిత్రం కాట్టేరి. వైభవ్ హీరోగా నటించనున్న ఈ చిత్రంలో కరుణాకరన్, మొట్టై రాజేంద్రన్, పొన్నంబళం, యూట్యూబ్ ఫేమ్ సారా ముఖ్యపాత్రలను పోషించనున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను డీకే నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు యామిరుక్క భయమే వంటి కామెడీ హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో కూడిన సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. ఈ చిత్రాన్ని కూడా అదే బ్యానర్లో రూపొందించడానికి సిద్ధమయ్యారు. దీనికి సంగీతాన్ని ప్రసాద్, ఛాయాగ్రహణం విక్కీ అందిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో బుధవారం ఉదయం ఈ చిత్రం ప్రారంభమైంది. చెన్నైలోని స్టూడియో గ్రీన్ సంస్థ కార్యాలయంలో నిరాడంబరంగా పారంభమైన ఈ కార్యక్రమానికి దర్శకుడు కేవీ.ఆనంద్, పుష్కర్ గాయత్రి ద్వయం, ఆధిక్ రవిచంద్రన్, నటుడు జీవా, చిత్ర హీరో వైభవ్, కరుణాకరన్, మొట్ట రాజేంద్రన్, సీవీ.కుమార్, శక్తివేలన్, నటి వీజే.రమ్య, నాక్ స్టూడియోస్ అరుణ్ పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో వైభవ్‌కు జంటగా ఓ ప్రముఖ నటి కోసం చర్చలు జరుగుతున్నాయని దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ సంస్థలో సూర్య హీరోగా నిర్మాణం అవుతున్న తానాసేర్న్‌ద కూట్టం చిత్రం చిత్రీకరణను పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటూ జనవరిలో పొంగల్ సంబరాలకు తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. -
హాట్ మోడల్‌తో రోమాన్స్ చేయనున్న అగ్రహీరో!
తమిళ సినిమా: తొలి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న నటి మీరామిథున్ లక్కీ చాన్స్ కొట్టేసింది. మిస్ ఫెమీనా సౌత్ కిరీటాన్ని గెలుచుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత మోడలింగ్ రంగం నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. '8 తూట్టాకల్' చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన మీరాకు తొలిచిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత అవకాశాలు లేవనుకుంటున్న సమయంలో ఏకంగా స్టార్ హీరో సూర్యతో జతకట్టే అవకాశం తలుపు తట్టింది. ఇంతకంటే లక్కీ చాన్స్ ఏముంటుంది. సూర్య హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న 'తానాసేర్న్‌ద కూటం' చిత్రంలో ఈ అమ్మడు నటిస్తోంది. ఈ చిత్రంలో కథానాయికగా కీర్తీసురేశ్ నటిస్తుండగా.. మరో హీరోయిన్గా మీరా మిథున్ నటిస్తోంది. సూర్య సరసన నటించే అవకాశం రావడానికి కారణం తన తొలి చిత్రమేనని, చాలారోజుల క్రితం ఈ చిత్ర యూనిట్ తనను అప్రోచ్ అయిందని మీరా మిథున్ తెలిపింది. ఈ సినిమాలో తన పాత్ర ఏమిటన్నది ప్రస్తుతానికి చెప్పనని, కానీ, తన పాత్ర చాలా ఆసక్తిగా ఉంటుందని చెప్పింది. ఈ చిత్రంలో సూర్యతో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉందని తెలిపింది. నటి నయనతార లవర్‌గా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య చిత్ర నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టెయిన్మెంట్ నిర్మిస్తోంది. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. సంక్రాంతి బరిలోకి ఈ సినిమా దింపడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. -
‘సూర్య, అజిత్లంటే చాలా ఇష్టం’
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు మిథున్ కుమార్ హీరోలు సూర్య, అజిత్లంటే చాలా ఇష్టమని చెప్పాడు. సినిమా రంగంలోని వారి వారసులకు నటన కొత్త కాదు. సినిమాకు వారసులు వస్తుంటారు. అయితే ఆ వారసులందరూ సక్సెస్ కాలేరు. అందుకు కృషి, పట్టుదల, ప్రతిభ, అన్నింటికీ మించి అదృష్టం ఉండాలి. అవన్నీ తనలో ఉన్నాయని హీరోగా రాణించాలని ఆశిస్తున్నాడు నిర్మాత కుటుంబం నుంచి వచ్చిన యువ నటుడు మిథున్ కుమార్. ఇతను సీనియర్ నిర్మాత ఎస్.ఎ. రాజ్‌కన్ను సోదరుడు కృష్ణస్వామి కొడుకు. కమలహాసన్ హీరోగా మహానది వంటి పలు చిత్రాలను రాజ్‌కన్ను నిర్మించారు. మిథున్ మాట్లాడుతూ.. పొల్చాచ్చికి చెందిన ఈయన సినిమా ఫ్యాషన్‌తో చెన్నైకి వచ్చారట. ఇటీవల విడుదలైన కలత్తూర్ గ్రామం చిత్రంలో హీరోగా మిథున్ నటించాడు. ‘దర్శకత్వం అంటే నాకు ఆసక్తి. దర్శకుడు సముద్రకని, మహిళ్ తిరువేణి వద్ద శిష్యరికం చేశాను. చదువుకునే రోజుల్లోనే స్టేజ్ షోలో బహుమతులు పొందాను. నటించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ‘కలత్తూర్’లో నటించే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. అద్వైతన్ పొల్లాచ్చి చిత్రం చూసి బాగా చేశావురా అని పెద్దనాన్న అభినందిచారు. దర్శకుడు సముద్రకని కూడా బాగా నటించావు అని ప్రశంసించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దర్శకుడు రాజమౌళి శిష్యుడు ప్రదీప్ తమ్మినేని ఫోన్ చేసి కలత్తూర్ చిత్రం చూశాను. మీరు బాగా నటించారు. మనం కలిసి ఒక చిత్రం చేద్దాం అని అన్నారు. చాలా సంతోషం కలిగింది. నాకు తెలుగు చిత్రాలంటే చాలా ఇష్టం. ప్రదీప్ దర్శకత్వంలో తమిళం, తెలుగు భాషల్లో రూపొందనున్న చిత్రంలో హీరోగా నటించనున్నాను. నాకు నటులు సూర్య, అజిత్లంటే చాలా ఇష్టం అయినా నటనలో స్ఫూర్తి మాత్రం ఎస్.జే. సూర్యనే. ఇకపై కూడా నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా ఆశ అని మిథున్ చెప్పారు. -
ఏ స్త్రీ బాధపడకూడదు
‘‘ఏ దుర్గా గర్భస్రావానికి గురి కాకూడదు.ఏ సరస్వతీ స్కూల్‌కు వెళ్లకుండా ఉండకూడదు. ఏ లక్ష్మీ డబ్బు కోసం తన భర్తను బతిమాలకూడదు. ఏ పార్వతీ వరకట్న వేధింపులకు గురికాకూడదు. ఏ సీతా మనోవేధన చెందకూడదు.ఏ కాళికీ ఫెయిర్‌నెస్ క్రీమ్ ఇవ్వకూడదని ఈ నవమికి అందరూ ప్రార్థించండి. హ్యాపీ నవరాత్రి’’. దసరా సందర్భంగా హీరో సూర్య తన ట్విట్టర్లో ఈ విధంగా పోస్ట్ చేశారు. ఆడవాళ్ల పట్ల ఆయనకున్న గౌరవభావాన్ని, వారికే కష్టం రాకూడదని కోరుకునే మంచితనాన్ని ఈ ట్వీట్ చాటుతోంది. అందుకే ‘‘చాలా బాగా చెప్పారు అని కొందరు, మీ అభిమానిగా ఉండటం గర్వంగా ఉందని మరికొందరు’’ స్పందించారు. -
ఘనంగా మగలీర్ మట్టుం ఆడియో వేడుక
టాలీవుడ్ హీరో సూర్య సతీమణి, నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మగలీర్ మట్టుం. 1994లో రేవతి, ఊర్వశి, రోహినిల నటనలో విడుదలైన చిత్రం మగలీర్ మట్టుం ఉద్యోగాలకు వెళ్లే మహిళల ఇబ్బందుల నేపథ్యంలో రూపొందిన ఆ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. 23 ఏళ్ల తర్వాత ప్రస్తుతం అదే పేరుతో అటువంటి కథాంశంతోనే జ్యోతిక, శరణ్యా పొన్వన్నన్, ఊర్వశి, బానుప్రియ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్న ‘కుట్రం కడిదల్’ చిత్ర దర్శకుడు బ్రహ్మ దర్శకత్వ బాధ్యతలు చేపట్టగా, సూర్య తన 2డి ఎంటర్టైన్మెంట్ సంస్థ ద్వారా నిర్మించారు. ఈ చిత్ర టీజర్‌కు అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది. అదేవిధంగా ఈ చిత్ర ట్రైలర్‌ను నటుడు సూర్య తన ట్విటర్లో విడుదల చేశారు. ఈ స్థితిలో మగలీర్ మట్టుం ఆడియోను విడుదల చేశారు. కార్యక్రమంలో సూర్య, కార్తీలతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. కాగా ఈ చిత్రంలో సూర్య అతిథి పాత్రలో నటించడం విశేషం. -
సూర్య 'సింగం-3' టీజర్ ఎలా ఉందంటే..
-
‘ఎస్ 3’ యుముడు-3 టీజర్ విడుదల
హైదరాబాద్: స్టూడియో గ్రీన్, పెన్ మూవీస్ పతాకంపై సూర్య హీరోగా తెరకెక్కిస్తున్న ‘ఎస్ 3’ యుముడు-3 మూవీ తెలుగు టీజర్ సోమవారం విడుదలైంది. ‘సింగం 2’కి సీక్వెల్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను సూర్య తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తుండగా, హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. సూర్య సరసన అనుష్క, శ్రుతిహాసన్ హీరోయిన్లగా నటిస్తున్నారు. ‘ఎస్ 3’ యుముడు-3లో రోబో శంకర్, క్రిష్, అనూప్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండడంతో మూవీపై హైప్స్ మరింతగా పెరిగాయి. డిసెంబరు 16న ఈ చిత్రం విడుదల కానుంది. సూర్య మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా పవర్ ఫుల్ రోల్ పోషించాడు. ఈ టీజర్లో సూర్య యాక్షన్ అద్భుతంగా ఉంది. -
చెన్నైలో స్టార్ క్రికెట్ సందడి
ఫైనల్లో సూర్య జట్టు గెలుపు చెన్నై: క్రికెట్ మైదానంలో దక్షిణ భారత సినిమా స్టార్లు తళుక్కుమన్నారు. దక్షిణ భారత నటీనటుల సంఘం ఆధ్వర్యంలో చెన్నైలో ఆదివారం స్టార్స్ క్రికెట్ నిర్వహించారు. ఇక్కడి చెపాక్ స్టేడియంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగిన మ్యాచ్‌లకు దక్షిణాది రాష్ట్రాల నుంచి సినీ నటీనటులు తరలివచ్చారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ సమక్షంలో విశ్వనటుడు కమలహాసన్ తొలిమ్యాచ్‌కు టాస్ వేసి స్టార్స్ క్రికెట్ క్రీడాపోటీలను ప్రారంభించారు. ఆరంభం నుంచి ఫైనల్ మ్యాచ్ వరకు రసవత్తరంగా జరిగిన పోటీల్లో ఎనిమిది జట్లు తలపడ్డాయి. ఈ సందర్భంగా విలక్షణ నటుడు విక్రమ్ పుట్టినరోజును సంబరంగా జరుపుకున్నారు. మమ్ముట్టితోపాటు నాజర్, విశాల్, బాలకృష్ణ, శ్రీయ తదితరులు కేక్‌ను విక్రమ్‌కు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్స్‌లో సూర్య చెన్నై సింగమ్స్ జట్టు, జీవా తంజై వారియర్స్ జట్లు తలపడగా హోరాహోరీగా జరిగిన పోటీలో సూర్య చెన్నై సింగమ్స్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. పోటీలకు అక్కినేని నాగార్జున హాజరయ్యారు. -
నా ప్రేయసి...!
మూడు విభిన్నమైన గెటప్‌లతో హీరో సూర్య కనిపించిన ‘24’ చిత్రం టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ‘ఇష్క్’, ‘మనం’ ఫేమ్ విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హీరో సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ను తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్, గ్లోబల్ సినిమాస్, స్టూడియోగ్రీన్ సంస్థలు అందిస్తున్నాయి. నిత్యామీనన్, సమంత కథానాయికలు. ఏ.ఆర్.రెహమాన్ స్వరపరిచిన ఈ చిత్రం పాటల్లోని ఒక పాటను ఆదివారం చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ ‘నా ప్రేయసి’ అంటూ సాగే ఈ పాటను చంద్రబోస్ రాశారు. త్వరలోనే ఈ చిత్రం పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. టైమ్ ఆధారంగా సాగే ఈ చిత్ర కథాకథనాలు సరికొత్తగా ఉంటాయి. ఇందులో అజయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి పాటలు: చంద్రబోస్-శశాంక్ వెన్నెలకంటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రేయాస్ ఖేదేకర్, అసోసియేట్ ప్రొడ్యూసర్: సూరజ్ సాధన. -
సూర్య స్టన్నింగ్ పోస్టర్..
హీరో సూర్యకు తమిళంలో ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంది. వైవిధ్యమైన కథాంశాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటాయి సూర్య సినిమాలు. తాజాగా 'మనం' ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 24 సినిమాలో నటిస్తున్నాడు సూర్య. ఫస్ట్ లుక్‌తో ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెంచిన ఈ సినిమా తాజాగా మరోసారి ఆసక్తి రేకెత్తిస్తోంది. సూర్య తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మరో పోస్టర్ ను రిలీజ్ చేశాడు. ఇప్పటివరకు కనిపించని ఓ స్టన్నింగ్ లుక్‌లో ఉన్నారు సూర్య. ఇప్పటికే 24 టైం ట్రావెల్‌కు సంబంధించిన ఓ థ్రిల్లర్ స్టోరీ అనే ప్రచారం ఊపందుకుంది. ఈ సినిమాలో సూర్య త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. సూర్య సరసన సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. #24TheMovie @2D_ENTPVTLTD @StudioGreen2 @deepakbhojraj @arrahman #vikramkumar Found both interesting!Hope you like!! pic.twitter.com/2V7QKT7upV — Suriya Sivakumar (@Suriya_offl) January 23, 2016 -
మహేశ్ వద్దన్నాడు... సూర్య చేస్తున్నాడు!
చెన్నై: ప్రిన్స్ మహేశ్ బాబు వదులుకున్న సినిమాను తమిళ హీరో సూర్య చేస్తున్నాడు. 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న '24' సినిమాలో సూర్య నటిస్తున్నాడు. ముందుగా ఈ కథను మహేశ్ కు విక్రమ్ కుమార్ వినిపించాడట. అతడికి ఫస్టాప్ బాగా నచ్చిందట. సెకండాఫ్ అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ఈ సినిమా చేసేందుకు మహేశ్ ఆసక్తి చూపలేదట. తర్వాత ఈ సబ్జెక్ట్ సూర్యకు వద్దకు వెళ్లడం, అతడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో మూడు పాత్రల్లో సూర్య కనిపించనున్నాడని సమాచారం. అన్నదమ్ములుగా, అన్న కొడుకుగా కనిపిస్తాడని తెలుస్తోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌తో పాటు 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. 2016లో వేసవిలో '24' సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. మంగళవారం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆసక్తికరంగా ఉన్నాయి. -
కొత్త సూర్యుడు
హీరోగా ఎంతో సంపాదిస్తాం... పేరు, ఇమేజ్, డబ్బు... ఎట్సెట్రా... ఎట్సెట్రా... మరి, మనిషిగా ఏం సంపాదించాలి? తెలుగునాడు దాకా విస్తరించిన తమిళ హీరో సూర్యను అడిగి చూడండి. చాలా చెబుతాడు... ‘ఎదిగినకొద్దీ ఒదిగి ఉండమ’నే ఫిలాసఫీకి నిదర్శనంగా నిలుస్తాడు. సినిమా నుంచి జీవితం దాకా కొత్త సూర్యుడు కనిపిస్తాడు. కొత్త దర్శకులు, కొత్త తరహా సినిమాలతో ఇటీవల తమిళ చిత్రసీమలో చాలా మార్పులొచ్చాయి. గతంలో ప్రతి ఆరేడేళ్ళకు మార్పు వచ్చేది. ఇప్పుడు ప్రతి రెండున్నరేళ్ళకు ఐడియాల్లో, ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు వస్తోంది. మారుతున్న టెక్నాలజీ, ఇంటర్నెట్ వల్ల - షార్ట్ ఫిల్మ్స్‌ను యూ ట్యూబ్‌లో పెట్టడం, ఫిల్ము పోయి సినిమా డిజిటలైజ్ కావడం, 5డి కెమేరాతో కూడా సినిమాలు తీయడం, కోటి బడ్జెట్ లోపలే రెండు గంటల సినిమా తీయగలగడం సాధ్యమయ్యాయి. రెగ్యులర్ మెలోడ్రామా పక్కనపెట్టి, కొత్త కంటెంట్‌ను జనం కోరుతున్నారు. ఇదంతా వెల్కమ్ చేయాల్సిన మార్పు. సమకాలీన తమిళ హీరోల గురించి మీరేమంటారు? ఒకే కథ, స్క్రిప్ట్‌ను ఒక్కో హీరో, ఒక్కో దర్శకుడు ఒక్కో రకంగా తీస్తారు. అలాగే, కొత్త జనరేషన్ వాళ్ళు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే తీరు, వాళ్ళకు సినిమా ద్వారా చెప్పే విషయాలు, ఆ ఎక్స్ప్రెషన్స్ వేరుగా ఉంటాయి. ఒక యాడ్‌లా ఫాస్ట్‌గా చెప్పాలనుకుంటారు. ఎమోషన్ ఒక్క సెకన్లో అలా వచ్చి, వెళ్ళిపోవాలి. ఎమోషన్స్‌ను ఎక్స్టెండ్ చేయకూడదు. ఇప్పుడంతా టీ-20 జనరేషన్. న్యూ జనరేషన్ సినిమాకు మీరెలా సిద్ధమవుతున్నారు? ఒకటే మంత్రం. కొత్త ఆలోచనల్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉండాలి. కొత్త దర్శకులతో పనిచేయాలి. వాళ్ల కొత్త ఐడియాలతో, ఎడ్వెంచరస్‌గా ముందుకెళ్ళాలి. ఈ సినిమాను మీరే నిర్మించడానికి కారణం? మలయాళంలో వచ్చిన ‘హౌ ఓల్డ్ ఆర్ యు’ నచ్చి, ‘జో’ మళ్ళీ తెర మీదకు రావాలంటే ఇలాంటి బలమైన ఉమన్ సెంట్రిక్ ఫిల్మే సరైనదని రీమేక్ చేశాం. నిర్మాణం మరొక రికి అప్పగించి, రాజీ పడే కన్నా బాగా తీసి, జనానికి మంచి కంటెంట్ ఇవ్వాలనుకుని, సొంతంగా నిర్మించా. చాలామంది స్త్రీలకు స్ఫూర్తి నిస్తోంది. పత్రికలన్నీ ‘ఎల్లా ఆన్గళుమ్ పార్క వేండియ పడమ్’ (మగవాళ్ళంతా చూడాల్సిన సినిమా) అని రాశాయి. తెలుగులో రిలీజ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? ‘జో’కు ఇక్కడ మంచి మార్కెటుంది. జనానికి తను బాగా తెలుసు. రీమేక్ చేయలేను. డబ్ చేయాలనుంది. రానున్న మీ చిత్రం తమిళంలో ‘మాస్’, తెలుగులో ‘రాక్షసుడు’ అంటున్నారు. సంబంధమే ఉన్నట్లు లేదు. (నవ్వేస్తూ...) రెండు టైటిల్స్కూ అండర్ కరెంట్‌గా ఒక సంబంధం ఉంది. తమిళంలో నా పాత్ర పేరు - మాసిలామణి. అందుకు తగ్గట్లుగా అక్కడ ‘మాస్’ అని పెట్టాం. తెలుగులో హీరో నాగార్జున గారు ‘మాస్’ పేరుతో ఒక సూపర్‌హిట్ చిత్రం చేసేశారు. దాంతో, కథకూ, పాత్రకూ తగ్గట్లు ‘రాక్షసుడు’ అని పెట్టాం. ఈ సినిమా హార్రర్ అనీ, థ్రిల్లర్ అనీ రకరకాలుగా... దర్శకుడు వెంకట్ ప్రభు కానీ, నేను కానీ గతంలో ఎప్పుడూ చేయని తరహా సినిమా. ఇది హార్రర్ సినిమా కాదు. దెయ్యాలు, భూతాల లాంటివి ఉండవు. భయ పెట్టే యాక్షన్ థ్రిల్లర్, ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. నయనతారతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ‘గజిని’తో మొదలుపెడితే... నయన్‌తో నాకిది మూడో సినిమా. ఆమెలో ఎంతో మెచ్యూరిటీ వచ్చింది. ఆమె నడుచుకుంటూ వచ్చి, కెమేరా ముందు నిల్చొనే విధానం, పనిచేసే తీరు ఎంతో మారింది. మీరు, దర్శకుడు వెంకట్ ప్రభు మంచి ఫ్రెండ్సనుకుంటా? (నవ్వుతూ...) మేమిద్దరం స్కూల్మేట్లం. అతను నా కన్నా కేవలం నాలుగు నెలలు చిన్న. అయినా సరే, నన్ను ‘అన్నా’ అని పిలుస్తాడు. (నవ్వులు...) నన్ను అలా పిలిచే మొట్టమొదటి దర్శకుడు అతనే! నేను, మహేశ్‌బాబు, వెంకట్ ప్రభు, యువన్ శంకర్‌రాజా, కార్తీక్ రాజా, తమ్ముడు కార్తీ - మేమందరం చెన్నైలో సెయింట్ బీట్స్ స్కూల్లో చదువుకున్నవాళ్ళమే. సినిమా అంటే దర్శకుడితో దాదాపు పది నెలలు కలిసి ప్రయాణించాలి. ముందు నుంచి స్నేహితులం కాబట్టి, మేము కలిసి పనిచేయడం ఈజీ అవుతుంటుంది. మీరు, మహేశ్, వెంకట్ ప్రభు కలసి చేయనున్నారని... (నవ్వేస్తూ...) అది మహేశ్‌బాబుతో కాదు. రవితేజ సార్, నేను, వెంకట్ ప్రభు కలసి సినిమా చేయాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల అది ముందుకు వెళ్ళలేదు. సినిమా కథలో దర్శకుడికి కరెక్షన్స్ చెబుతారట! (ఒక్క క్షణం ఆగి...) అలాగని కాదు... దర్శకుల శక్తిసామర్థ్యాలు, వాళ్ళు అంతకు ముందు చేసిన ప్రాజెక్ట్‌లు నాకు తెలుసు. కాకపోతే, వాళ్ళ బెస్ట్ నా సినిమాకు ఇచ్చేలా చేయాలని చూస్తుంటా. ఆ విషయంలో నేను కొంత స్వార్థపరుణ్ణి. (నవ్వులు...) అందుకే, ఆ సినిమా కథ, స్క్రీన్‌ప్లే పరిధిలోనే ఎంత వరకు వెళ్ళవచ్చు, ఏయే కొత్త ఎలిమెంట్స్ తీసుకొచ్చి కలపవచ్చనేది చూస్తుంటాం. బేసిక్‌గా నా సబ్జెక్ట్‌లు నా కన్నా పెద్దవిగా ఉండాలని కోరుకుంటా. అంతే తప్ప నేను స్క్రిప్ట్‌నూ, కథనూ డామినేట్ చేయాలనుకోను. మీకు గ్రాఫిక్స్ మీద అవగాహన ఉందట? అంతలేదు. ‘అదెల్లా ఓవర్ బిల్డప్ సర్!’ (అదంతా మరీ ఓవర్‌గా బిల్డప్ ఇవ్వడం సార్). నాకో మంచి ఫ్రెండ్ ఉన్నాడు. అతను లండన్ వెళ్ళి, 15 ఏళ్లు అనుభవం సంపాదించి, చెన్నైకి తిరిగివచ్చాడు. అతను నా తాజా సినిమా గ్రాఫిక్స్‌కు హెల్ప్ చేశాడు. సినిమా మీద ఇంత అవగాహన ఉంది. దర్శకత్వం చేపట్టే ఛాన్సుందా? నాట్ ఎట్ ఆల్! అయామ్ హ్యాపీ విత్ మై డెరైక్టర్స్. కాకపోతే, నేను నటించలేకున్నా, మంచి విషయం ఉన్న చిన్నతరహా సినిమాలను నిర్మించాలని అనుకుంటున్నా. ఎందుకంటే, అలాంటి కథల్ని మన హీరో ఇమేజ్‌కు తగ్గట్లు మార్చడం, విషయాన్ని డైల్యూట్ చేయడం సరైనది కాదు. అందుకే, ఆ సినిమాల్లో నేను నటించకుండా, కేవలం నిర్మించాలనుకుంటున్నా. ఆస్కార్ సినిమాలు చూస్తుంటారా? ఇటీవల నచ్చిన హాలీవుడ్ హీరోలు? అంత లెవల్ లేదు సార్! నిజం చెప్పాలంటే, నేను అంత శ్రద్ధగా, రోజూ రాత్రి హాలీవుడ్ సినిమా చూసి పడుకొనే రకం కాదు. ఎక్కువగా స్క్రిప్టులు చదువుతుంటా. ప్రాంతీయ భాషా సినిమాలు చూస్తుంటా. వాటి గురించి తెలుసుకుంటూ ఉంటా. అంతే తప్ప, విదేశీ సినిమాలను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవడం ఉండదు. ఆ మధ్య ఆస్కార్ వచ్చిన ‘బర్డ్ మ్యాన్’ చూశా. బాగుంది. కాకపోతే, ఆ సినిమా బాగా అర్థం కావడానికి, ఆ పాత్ర లాగా కనిపించడానికి అతని ప్రయత్నం గురించి అర్థం చేసుకోవడానికి ఒకటికి, నాలుగుసార్లు చూడాలి. మీ ఇంట్లోనే తమ్ముడు కార్తీ నుంచి మంచి పోటీ! నటుడిగా మీకూ, అతనికీ పోలికలు, తేడాలు? కార్తీ సినిమాలు తెగ చూస్తాడు. స్క్రీన్‌ప్లే, స్క్రిప్ట్, షాట్ డివిజన్ లాంటివి బాగా ఎనలైజ్ చేయగల సమర్థుడు. ఆ విషయంలో వాడికి నా కన్నా బెటర్ నాలెడ్జ్ ఉంది. నిజానికి, వాడు దర్శకుడు కావాలనుకున్నాడు. మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. అందుకే, వాడికి సినిమా మేకింగ్‌లో విషయాలు తెలుసు. ఫలానా షాట్ ఎలా తీశారనేది అబ్జర్వ్ చేసి, అప్రీషియేట్ చేయడం ఒక్కోసారి నాకు తెలియదు. కానీ, కార్తీ అలా కాదు. వాడు సినిమాలు ఎంచుకొనే విధానం నాకు నచ్చుతుంది. వాడైనా, నేనైనా మా దగ్గరకొచ్చిన ఏ మంచి స్క్రిప్ట్‌నూ వదులుకోం. నాలుగైదేళ్ళుగా చేస్తున్నదదే. ధనుష్ లాగా బాలీవుడ్‌కు వెళ్ళాలని మీకెప్పుడూ అనిపించలేదా? నేనిక్కడ హ్యాపీగా ఉన్నా. ఇక్కడ ఎలాంటి వ్యాక్యూమ్ లేదు. అలాంటప్పుడు ఇక్కడ వదిలేసి, మరోచోటికి వెళ్ళడమెందుకు? మీ కుటుంబం సేవాకార్యక్రమాలు చేస్తారనీ, దిగువ తరగతికి చెందిన విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తున్నారనీ విన్నాం. అవును. ‘అగరమ్ ఫౌండేషన్’ (అగరమ్ డాట్ ఇన్) అని సంస్థను 2006లో ప్రారంభించాం. 2010 నుంచి దానిలో ‘విదై’ అని ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ ప్రారంభించాం. అందులో గవర్నమెంట్ స్కూల్స్‌లో చదివే ఫస్ట్ జనరేషన్ కిడ్స్ను ప్రోత్సహిస్తున్నాం. వాళ్ళు కాలేజ్ చదువు దాకా వెళ్ళి, డిగ్రీ పూర్తి చేసేవరకు సమస్తం మేము సమకూరుస్తాం. పిల్లలకు సైకోమెట్రిక్ టెస్ట్‌లు కూడా పెట్టి, వాళ్ళకు ఏది బాగా వస్తుందో ఆ కోర్సులో చేర్పిస్తాం. వాళ్ళకు ఏదో ఫీజు కట్టేసి వదిలేయడం కాకుండా, వాళ్ళు ప్రొఫెషనల్ డిగ్రీ చదివే నాలుగేళ్ళూ వాళ్ళ గురించి పట్టించుకొనే వలంటీర్లు ఉంటారు. ప్రతి వారం వాళ్ళకు వర్క్‌షాపులు పెడతాం. ఐ.ఎ.ఎస్. ఆఫీసర్లతో ఇంటరాక్షన్ పెడతాం. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరుస్తాం. అలా సమగ్రమైన విద్యను అందించడం మా ప్రాజెక్ట్ లక్ష్యం. దాని వల్ల వాళ్ళు బాగా చదువుకొని, మంచి ఉద్యోగాలు సంపాదించుకొని మళ్ళీ ‘అగరమ్’కు వచ్చి, వలంటీర్లుగా పనిచేస్తున్నారు. నటులుగా కన్నా, వ్యక్తులుగా మా కుటుంబానికి ఎక్కువ తృప్తినిస్తున్న పని ఇది. మీ నాన్న గారైన... ఆ తరం ప్రముఖ హీరో శివకుమార్ ప్రభావం మీ మీద ఏ మేరకు ఉంది? నాన్న గారి ప్రభావం చాలా ఉంది. మాలోని మంచి లక్షణాలన్నిటికీ మా అమ్మా నాన్నే కారణం. మాకు కొన్ని విలువలు నేర్పారు. చాలామంది నటీనటుల జీవితాల్లో ఏం జరిగిందో మా నాన్న గారు మాతో పంచుకునేవారు. ‘ఈ ఇమేజ్, ఈ జీవితం అంతా ఒక నీటి బుడగ లాంటిది. ఏ క్షణమైనా ఈ బుడగ పేలిపోతుంది. కోట్ల మంది చూసి, మెచ్చుకొనే సినీ జీవితం ఒక అదృష్టం. అయితే, అంతా మన ప్రతిభ అనుకొంటే పొరపాటు. మనకు తెలియని అతీత శక్తి ఆశీర్వాదం వల్ల ఈ పేరు ప్రతిష్ఠలు, డబ్బు వచ్చాయని గ్రహించాలి. ‘సక్సెస్, ఫెయిల్యూర్... ఏదీ శాశ్వతం కాదు. ప్రతిదీ వెళ్ళిపోతుంద’ని గుర్తుంచుకోవాలి’ అని చెబుతుంటారు. అదే నా జీవన సూత్రం. -
పిల్లలకు A సినిమా!?
చిన్నప్పుడు బూట్లు పాలిష్ చేసి, కంపాస్ బాక్స్‌లో పెన్సిల్ షార్పెన్ చేసిచ్చి, రెండు జడలకీ రిబ్బన్ సమానంగా ఉండేటట్టు కట్టి, ఎడం చేతితో పాపనెత్తుకుని, కుడిచేత్తో బువ్వ పెడుతూ బస్సెక్కించిన నాన్న ఇప్పుడు ‘ఏ’ సినిమాకి టికెట్టు కొనాలి? ‘మీ అమ్మాయి ఏది చూసినా అట్టే గ్రహించేస్తుందండీ’... అన్న టీచరు మెచ్చుకోలు గుర్తుకొచ్చి పాపతో సినిమా చూస్తున్న నాన్న ‘సీన్’ని చూసి ఇబ్బంది పడాలా? పాపను చూసి ఇబ్బంది పడాలా? ఏది దారి? ఎక్కడ ఎగ్జిట్? స్కూలు సెలవులతో సినిమాకు తీసుకెళ్ళమంటూ పిల్లల డిమాండ్లు. ఏ సినిమా చూపించాలి?బల్ల కింద నుంచి హీరో తొడ మీద చేయి వేసిన హీరోయిన్ ‘టచ్‌లో ఉంటానండీ’ అంటుంది. ‘మీ టచింగ్ కోసం ఎదురుచూ....స్తూ ఉంటానండీ’ అంటాడు హీరో. ఈ సినిమానా?గొడ్డలితో హీరో విసురుగా గూండా తలపై కొడితే, తల పగిలి రక్తం చిందుతుంది. ఈ సినిమానా? కమెడియన్‌ను హీరో లెంపకాయ కొడుతుంటే, హీరోయిన్ సంబరపడు తుంటుంది. ఈ సినిమానా?హీరో ఇంట్లో హీరోయిన్ ‘దారా! కమిటైపోదాం’ అని పైన పడుతుంది. ఈ సినిమానా?కాలేజ్‌లో లెక్చరర్‌ను వెకిలి కామెంట్లు చేస్తుంటారు స్టూడెంట్స్. ఈ సినిమానా?తండ్రిని హీరో ఒరే అనీ, పేరు పెట్టీ పిలుస్తుంటాడు. కలసి మందు కొడతారు. ఈ సినిమానా? సినిమాలు వేరు కావచ్చు... సీన్లు వేర్వేరు కావచ్చు. కానీ, తెర నిండా పరుచుకొంటున్నవి అదుపు లేని రొమాన్స్, అదుపు తప్పిన వయొలెన్స్... అంతే వయొలెంట్ కామెడీ. వీటిలో పిల్లలకు ఏ సినిమా చూపించాలి? పెద్దల సినిమాకే... పిల్లలు కూడా! ‘ఏ’ సర్టిఫికెట్ సినిమాలకు మనమే అనాలోచితంగా మన పిల్లల్ని తీసుకెళుతున్నాం. హైదరాబాద్‌లో ఒక అగ్రహీరో సినిమా చూసిన పదేళ్ళ సందీప్ చేతిలో బొమ్మ తుపాకీ తీసుకొని ‘డిష్యుం... డిష్యుం...’ అంటూ కాల్చడం, ఆ తుపాకీ దెబ్బకు చుట్టుపక్కలవాళ్ళు పడిపోవాలనుకోవడం... ఇదీ వాలకం. విజయవాడ... గాంధీనగర్‌లోని పద్నాలుగేళ్ళ దివ్య ప్రవర్తనలో తేడా వచ్చింది. అబ్బాయిలతో సన్నిహితంగా తిరగడం... చదువు మీద ఆసక్తి లేకపోవడం... ఎప్పుడూ ఫోన్లో కబుర్లు... నెట్లో మెయిల్స్... (పేర్లు మార్చి రాశాం). ‘‘హాలీవుడ్లో 60 శాతం సినిమాలు - బాలల చిత్రాలు, లేదంటే బాలల్ని ఆకట్టుకొనే అంశాల చుట్టూ నడిచే సినిమాలు. అక్కడ పిల్లల కోసం పెద్దవాళ్ళు కూడా సినిమాలకు వెళ్ళే ట్రెండ్ ఉంది. కానీ, ఇక్కడ రివర్స్. పెద్దవాళ్ళు తమ వయసుకు నచ్చే సినిమాలకు వెళుతూ, పిల్లల్ని వెంట తీసుకువెళుతున్నారు. అలా పిల్లలు తమ వయసుతో సంబంధం లేని ‘పెద్దల’ చిత్రాలు చూసేస్తున్నారు. సహజంగానే అది ఆ పసి మనసుల్ని ఇంప్యాక్ట్ చేస్తోంది’’ అని ‘హీరో’తో ఉత్తమ బాలల చిత్రం నంది అవార్డు సాధించిన దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి అన్నారు. మార్కెట్ ఉంది! తీసేదెవరు? పిల్లలకు ప్రత్యేకంగా సినిమాలేంటి అని ఆశ్చర్యపోకండి! హాలీవుడ్ సినిమా ‘స్పైడర్ మ్యాన్’కు ప్రపంచం మొత్తంలో అత్యధిక కలెక్షన్లు వచ్చింది మన హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐ-మ్యాక్స్‌లోనే! నిజానికి, ఒక టాప్ స్టార్ చిల్డ్రన్స ఫిల్మ్ చేస్తే చూడరా? ఆమిర్‌ఖాన్ ‘తారే జమీన్ పర్’ నుంచి ‘స్టాన్లీ కా డబ్బా’, సల్మాన్‌ఖాన్ తీయగా రణ్‌బీర్ కపూర్ నటించిన ‘చిల్లర్ పార్టీ’, సూపర్‌హీరో కాన్సెప్ట్‌తో వచ్చిన ‘క్రిష్’ లాంటివన్నీ ఆ పనే చేశాయి. తెలుగులో అలా జరగడం లేదు. హాలీవుడ్ చిత్రం ‘బేబీస్ డే అవుట్’ ఆధారంగా నాగార్జున తీసిన ‘సిసింద్రీ’లో చాలా ఏళ్ళ క్రితం అలాంటి ప్రయత్నం కొంత జరిగినా, ఆ సినిమా కూడా ప్రత్యేక గీతాలు, ఫైట్ల ఫార్ములాలోనే ఇరుక్కుపోయింది. ప్రోత్సాహకాలన్నీ పేపర్ మీదే! వాస్తవానికి, ప్రభుత్వ పక్షాన బాలల చిత్రాలకు దాదాపు రూ. 35 లక్షల దాకా ప్రోత్సాహకాలున్నాయి. ‘‘కానీ, వాళ్ళు చెప్పిన పూర్తిస్థాయిలో సబ్సిడీ అందుకున్న సినిమా ఇప్పటి దాకా ఒక్కటీ లేదు. చాలా రోజులుగా అసలు చిల్డ్రన్స్ ఫిల్మ్‌ల స్క్రిప్ట్ సెలక్షన్ కమిటీయే లేదు. ఇప్పుడు రెండు రాష్ట్రాలయ్యాక, ఆ ప్రోత్సాహకాల పేపర్ ఎక్కడుందో కూడా తెలీదు’’ అని బాలల చిత్రాలు తీసిన దర్శక - రచయిత అక్కినేని కుటుంబరావు అన్నారు. చివరకు పెద్దలు చూసే సినిమాలే పిల్లలూ చూస్తూ, మన సగటు ‘ఏ’ గ్రేడ్ హీరోల సినిమాల హీరోయిజమ్, డైలాగ్‌లు, ఆ భాషనే నేర్చుకుంటున్నారు. వయెలెన్స్, సెక్స్, పక్కవాణ్ణి తన్నడం వల్ల వచ్చే వెకిలి కామెడీనే ఇష్టపడుతున్నారు. మరి, ఆ తప్పెవరిది? పిల్లలదా? ఇంటా, బయటా ఆ సినిమాలే చూపుతున్న పెద్దలదా? పరిశ్రమదా? హెల్దీ న్యూ జనరేషన్‌ను తీర్చిదిద్దడంలో ఫెయిలవుతున్న సమాజానిదా? - రెంటాల జయదేవ నేనెప్పుడూ పిల్లలు, ఫ్యామిలీ చుట్టూ తిరుగుతా! ‘‘జ్యోతికతో నేను ‘36 వయదునిలే’ తీసిన బ్యానర్ ‘2డి’. అందులో ఒక ‘డి’ - మా ఎనిమిదేళ్ళ అమ్మాయి దియా. మరొక ‘డి’ - మా నాలుగేళ్ళ అబ్బాయి దేవ్. ఐ ఆల్వేస్ లవ్ డిస్నీ కంటెంట్. పిల్లలతో సహా వెళ్ళి, చూసే సినిమాలంటే నాకు ఇష్టం. బహుశా, చిన్న పిల్లల తండ్రిని కావడం కూడా అందుకు కారణమేమో! ఐ థింక్ సోమచ్ స్కోప్ ఈజ్ దేర్ ఫర్ కిడ్స్ ఫిల్మ్స్. నా మటుకు నేను పిల్లలు, ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ, అంతా కలిసి చూసే సినిమాలు చేయాలనుకుంటున్నా. - హీరో సూర్య ఎమోషనల్ కనెక్టే తప్ప... వయొలెన్స్ కాదు! పిల్లలకు మనమేం చెప్తే, ఏం చూపిస్తే అది నేర్చుకుంటారు. నా సినిమాలన్నిట్లో చైల్డ్ సైకాలజీ నుంచే ఎమోషన్ బిల్డప్ చేశా. చెడు మీద మంచి విజయం సాధించాలనే ఎమోషన్ రప్పించి ఫైట్స్ పెడతాం. వయొలెన్స్గా కాదు! - బోయపాటి శ్రీను, డెరైక్టర్ కల్చరల్ యాక్టివిటీస్‌లోనూ జాగ్రత్త పడాలి! పిల్లలపై సినిమాల ప్రభావం సబ్కాన్షస్ లెవల్లో ఉంది. పిల్లలకు ఎలాంటి వినోదం ఇస్తున్నామనేది తల్లితండ్రులు, టీచర్లు గమనించాలి. కల్చరల్ యాక్టివిటీస్‌లో ఎలాంటి పాటలకు డ్యాన్స్ చేయిస్తున్నామో చూసుకోవాలి. - శైలజారావు, ‘ది ఫ్యూచర్ కిడ్స్’ స్కూల్ - హైదరాబాద్ ఫౌండర్ డెరైక్టర్ ఇది మనందరి వైఫల్యం! తెరపై నరుక్కోవడం నిత్యం చూపిస్తే అవన్నీ మామూలనే భావన వచ్చేస్తుంది. పెళ్ళిళ్ళలో ఐటమ్‌సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తున్నాం. ఇది స్లో పాయిజన్. దీన్ని సమస్యగా గుర్తించకపోవడం సమష్టి వైఫల్యం. - డా. పద్మా పాల్వాయ్, చైల్డ్ -ఎడల్ట్ సైకియాట్రిస్ట్ ఇవాళ అన్నీ కమర్షియల్ యాంగిల్లోనే! నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే, సెన్సార్ కట్ అమలవుతోందా, లేదా అని చూసే పకడ్బందీ వ్యవస్థ లేదు. హీరో క్యారెక్టరైజేషన్, టాప్ హీరోయిన్స్ దుస్తుల దాకా అన్నీ కమర్షియల్ యాంగిల్లోనే ఉన్నార. - జీవిత, నటి-కేంద్ర సెన్సార్‌బోర్డ్ సభ్యురాలు కామెడీ, యాక్షన్ లైక్ చేస్తా. ‘దూకుడు’ ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు! ‘అత్తారింటికి దారేది’లో అహల్య సీన్, ‘కిక్’లో పోలీసును గుద్దుకొనే సీన్ భలే నవ్విస్తాయి. స్కూల్‌మేట్స్ కొంతమంది సినిమాలు చూసి చెడ్డమాటలు నేర్చుకోవడం నాకు తెలుసు. - పి. అనీష్, 12 సం, హైదరాబాద్ ‘ఛత్రపతి, డార్లింగ్’ ఇష్టం. ‘టెంపర్’ నచ్చింది. వయొలెంట్ థ్రిల్లర్ ‘ఎన్‌హెచ్ 10’లో అనుష్క శర్మ వాళ్ళు మర్డరవడం, తిరిగి వాళ్ళను ఆమె మర్డర్ చేయడం థ్రిల్లింగ్. ఏ సినిమా చూసినా మన లైఫ్‌లో కూడా జరుగుతుందేమో అనిపిస్తుంటుంది. - శేషాద్రి, 15 సం, కర్నూలు సమ్మర్లో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చూశా. అందులో ‘కమ్ టు ది పార్టీ సుబ్బల క్ష్మి...’ పాట ఇష్టం. ఇంట్లో నేను, తమ్ముడు బాగా ఫైటింగ్ చేసుకుంటాం. నాకు పాటలు, డ్యాన్సులు ఇష్టమైతే, మా తమ్ముడు సాత్విక్‌కు ఫైటింగ్ సినిమాలు ఇష్టం. - సింధు, 10 సం, నెక్కొండ సినిమాల్లో ఫైట్స్, కామెడీ లైక్ చేస్తా. విలన్‌ను హీరో కొడుతుంటే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ‘కిర్రాకు...’ పాట ఎప్పుడూ పాడుతుంటా. ఐటమ్ సాంగ్స్‌లో అయితే, ‘గబ్బర్ సింగ్’లోని ‘కెవ్వుకేక...’ ఇష్టం. దానికి సరదాగా డ్యాన్స చేస్తుంటా. - సాహితి, 14 సం, హైదరాబాద్ ఫైటింగ్ సిన్మాలిష్టం. విలన్లని హీరో కొడుతుంటే భలే ఉంటుంది. ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘డార్లింగ్’లో ఆ సీన్స బాగా నచ్చాయి. బ్రహ్మానందం కామెడీకి ఫ్యాన్‌ని. ‘రేసు గుర్రం’లో బ్రహ్మానందం కిల్‌బిల్ పాండే సీన్ ఇష్టం. అల్లు అర్జున్ డ్యాన్సులకు ఫ్యాన్‌ని. - కృష్ణజ, 13 సం, విశాఖపట్నం సిన్మాల్లోని పాటలు, ఫైట్లు, డ్యాన్సులంటే ఇష్టం. గట్లంటి సిన్మాలు సూస్తా. హీరో అల్లు అర్జున్ సిన్మాలు, అతని ఫైట్లు, డ్యాన్సులు మస్తుగుంటయ్. - తండ్రి లేని పిల్లాడు ఆలకుంట్ల అనిల్, 10 సం., ప్రభుత్వ పాఠశాల, వర్ధన్నపేట, వరంగల్ జిల్లా -
హీరో సూర్య ఫ్యామిలీ రూ.50లక్షల సాయం
హైదరాబాద్ : హదూద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు తమిళ నటులు కూడా తమ వంతు సాయం అందిస్తున్నారు. తమిళ హీరో సూర్య కుటుంబం హుదూద్ బాధితులకు రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. సూర్య 25 లక్షలు, కార్తీ 12.5 లక్షలు, జ్ఞాన్వేల్ రాజా 12.5 లక్షల విరాళం అందిస్తున్నారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు మేము సైతం అంటూ బాధితులకు ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. ఆ వివరాలు: అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రూ.20 లక్షలు యువ హీరో నందూ రూ.లక్ష హీరో నితిన్ రూ.10 లక్షలు హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ రూ.30 లక్షలు +ఇరవై టన్నుల బియ్యం, మందులు రామానాయుడు ఫ్యామిలీ రూ.50 లక్షలు హీరోయిన్ రకుల్ ప్రీత్ రూ.లక్ష హీరో విశాల్ రూ.15 లక్షలు బ్రహ్మానందం రూ.3లక్షలు ప్రకాశ్‌రాజ్ రూ.5 లక్షలు యువ హీరో సందీప్ కిషన్ రూ.2.5లక్షలు అల్లరి నరేష్ రూ.5 లక్షలు రవితేజ రూ.10 లక్షలు కాగా తుఫాను బాధితులకు భారీ విరాళమిచ్చిన పవన్‌కళ్యాణ్ ముందు వరుసలో నిలిచారు. ఆయన రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. మహేష్ బాబు రూ.25 లక్షలు, అలాగే సూపర్‌స్టార్ కృష్ణ కూడా 15 లక్షలు, విజయనిర్మల 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. హీరో రామ్ చరణ్ 15 లక్షలు ప్రకటించగా, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ 20 లక్షలు విరాళం ఇచ్చారు. ప్రభాస్ 10 లక్షలు, హృదయ కాలేయం ఫేమ్ సంపూర్ణేశ్ బాబు లక్ష ఆర్థిక సాయం అందించారు. మోహన్‌బాబు కుటుంబం అంతా కలిసి తుఫాన్ ప్రాంతాలను పర్యటించి బాధితులకు అండగా ఉంటామని తెలిపారు.