హీరో సూర్య ఫ్యామిలీ రూ.50లక్షల సాయం | Hero surya family announces Rs 50 lac for hudud cyclone relief | Sakshi
Sakshi News home page

హీరో సూర్య ఫ్యామిలీ రూ.50లక్షల సాయం

Published Wed, Oct 15 2014 10:32 AM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

సూర్య, కార్తీ,  జ్ఞాన్వేల్ రాజా

సూర్య, కార్తీ, జ్ఞాన్వేల్ రాజా

హైదరాబాద్ : హదూద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు తమిళ నటులు కూడా తమ వంతు సాయం అందిస్తున్నారు. తమిళ హీరో సూర్య కుటుంబం హుదూద్ బాధితులకు రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. సూర్య 25 లక్షలు, కార్తీ 12.5 లక్షలు, జ్ఞాన్వేల్ రాజా 12.5 లక్షల విరాళం అందిస్తున్నారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు  మేము సైతం అంటూ బాధితులకు ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. ఆ వివరాలు:    

అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రూ.20 లక్షలు
యువ హీరో నందూ రూ.లక్ష
హీరో నితిన్ రూ.10 లక్షలు
హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ రూ.30 లక్షలు +ఇరవై టన్నుల బియ్యం, మందులు
రామానాయుడు ఫ్యామిలీ రూ.50 లక్షలు
హీరోయిన్ రకుల్ ప్రీత్ రూ.లక్ష
హీరో విశాల్ రూ.15 లక్షలు
బ్రహ్మానందం రూ.3లక్షలు
ప్రకాశ్రాజ్ రూ.5 లక్షలు
యువ హీరో సందీప్ కిషన్ రూ.2.5లక్షలు
అల్లరి నరేష్ రూ.5 లక్షలు
రవితేజ రూ.10 లక్షలు


కాగా తుఫాను బాధితులకు భారీ విరాళమిచ్చిన పవన్‌కళ్యాణ్ ముందు వరుసలో నిలిచారు. ఆయన రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. మహేష్ బాబు రూ.25 లక్షలు, అలాగే సూపర్‌స్టార్ కృష్ణ కూడా 15 లక్షలు,  విజయనిర్మల 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. హీరో రామ్ చరణ్ 15 లక్షలు ప్రకటించగా, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ 20 లక్షలు విరాళం ఇచ్చారు. ప్రభాస్ 10 లక్షలు, హృదయ కాలేయం ఫేమ్ సంపూర్ణేశ్ బాబు లక్ష ఆర్థిక సాయం అందించారు. మోహన్‌బాబు కుటుంబం అంతా కలిసి తుఫాన్ ప్రాంతాలను పర్యటించి బాధితులకు అండగా ఉంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement