Hudud
-
గృహ నిర్మాణాల పరిశీలన
శ్రీకాకుళం పాతబస్టాండ్: నగరంలోని కంపోస్టు కాలనీలో నిర్మిస్తున్న గహ నిర్మాణాలను ఆదివారం కలెక్టర్ పి.లక్ష్మీనసింహం పరిశీలించారు. హుదూద్ తుపాను వల్ల ఇళ్లు కోల్పోయిన 192 మంది లబ్ధిదారులకు కంపోస్టు కాలనీ వద్ద ఎన్టీఆర్ కాలనీ గహాలను ప్రభుత్వం గహనిర్మాణ సంస్థ ద్వారా నిర్మించిందని కలెక్టర్ తెలిపారు. ఒక్కొక్క బ్లాకులో 16 గహాలు చొప్పున నిర్మించామన్నారు. ప్రతి గహంలోను ఒక వంటిల్లు, ఒక పడక గది, ఒక హాలు, టాయ్లెట్ల సదుపాయం కల్పించామని తెలిపారు. 100 కిలో లీటర్ల సామర్థ్యంతో పెద్ద మంచినీటి సంప్‌ను నిర్మించామని, మున్సిపల్ ట్యాంకు నుంచి సంప్‌లో నీరు నింపి, ఇంటింటికీ రెండు పూటలా నీటి సరఫరా చేయనున్నట్టు తెలిపారు. ఆయనతోపాటు గహ నిర్మాణ సంస్థ పీడీ పీఆర్ నరసింగరావు, ఈఈ పి.శ్రీనివాసరావు, డీఈఈ డి.శ్రీనివాసరావు, ఏఈ డి.సత్యనారాయణ, తదితరులు ఉన్నారు. -
హుదూద్ బాధితులకు పోర్టుల విరాళం
హైదరాబాద్ : హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం పోర్టుల (నౌకాశ్రయాలు) నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. సీఎం రిలీఫ్ ఫంఢ్కు కృష్ణపట్నం పోర్టు రూ.5 కోట్లు, విశాఖపట్నం పోర్టు రూ.60 లక్షలు, కాకినాడ పోర్టు రూ. కోటి, గంగవరం పోర్టు రూ.కోటి విరాళం ప్రకటించాయి. మరోవైపు హుదూద్ తుఫానుకు నష్టపోయిన నాలుగు జిల్లాల బాధితుల కోసం పది రకాల నిత్యావసరాలు, కిరోసిన్‌కు సరఫరా చేసేందుకు ప్రభుత్వం జీఓ నం.88 విడుదల చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని సుమారు ఐదు లక్షల బాధిత కుటుంబాలకు ఈ సరుకులు అందించనున్నారు. -
కొండంత అండ
-
'హెచ్చరికల్ని స్టీల్ఫ్లాంట్ యాజమాన్యం పట్టించుకోలేదు'
విశాఖ : విశాఖ కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద వైఎస్ఆర్ సీపీ స్టీల్ఫ్లాంట్ ట్రేడ్ యూనియన్ నేతలు శుక్రవారం ఆందోళనకు దిగారు. హుదూద్ తుఫాను వల్ల స్టీల్ఫ్లాంట్కు భారీగా నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని వారు ఆరోపించారు. తుఫాను వల్ల స్టీల్ఫ్లాంట్కు రూ.1000 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. ఇంతవరకూ యాజమాన్యం స్టీల్ఫ్లాంట్ పునరుద్ధరణ పనులు చేపట్టలేదని వైఎస్ఆర్ సీపీ ట్రేడ్ యూనియన్ నేతలు మస్తానప్ప, పీవీ రమణ వ్యాఖ్యానించారు. -
రూ.35 లక్షల చెక్కు అందచేసిన బాలకృష్ణ
విశాఖ : హుదూద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమ కూడా భాగం పంచుకుంటుందని సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తుఫాను బాధితుల సహాయార్ధం రూ.35 లక్షల చెక్కును చంద్రబాబు అందించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ గతంలోనూ తుఫాను బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ పని చేసిందన్నారు. ఎన్టీఆర్ జోలెపట్టి విరాళాలు సేకరించారని ఆయన గుర్తు చేశారు. విశాఖకు అపారమైన నష్టం వాటిల్లిందని బాలకృష్ణ అన్నారు. తుఫాను బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రితో కలిసి పర్యటించనున్నట్లు ఆయన చెప్పారు. -
శ్రీజను కలవడానికి ఖమ్మం వెళుతున్నా
రాజమండ్రి : విశాఖలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారం ఉదయమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో పరిస్థితులు కుదుట పడుతున్నాయన్నారు. హుదూద్ తుఫాను బాధితులకు అందరూ అండగా నిలవాలని నిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో విపత్తు నివారణ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తుఫాను పునరావాస సహాయక చర్యల్లో సినీ పరిశ్రమ పాలుపంచుకోవటం అభినందనీయమన్నారు. మున్ముందు ఉత్తరాంధ్రలో పునరావాస కార్యక్రమాల్లో జనసేన పాలుపంచుకుంటుందన్నారు. కాగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీజను కలవటానికి ఖమ్మం వెళుతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. మేక్ ఏ విష్' సంస్థ చేసిన విజ్క్షప్తికి స్పందించిన ఆయన ఈరోజు శ్రీజను పరామర్శించనున్నారు. కార్తీక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 13 ఏళ్ల శ్రీజ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. ఈ చిన్నారికి పవన్ కల్యాణ్ అంటే ఎంతో అభిమానం. పవన్‌ను కలిపించేందుకు మేక్ ఎ విష్ ప్రయత్నించింది. అందుకోసం శ్రీజను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే వైద్యులు వద్దనడంతో ఆ ప్రయత్నం విరమించింది. దీంతో పవన్ పవన్ కళ్యాణే శ్రీజ దగ్గరికి రావాలని విజ్ఞప్తి చేయటంతో పవన్ సానుకూలంగా స్పందించి తానే ఖమ్మం బయల్దేరారు. ఆయన ఈరోజు ఉదయం రాజమండ్రి నుంచి నేరుగా ఖమ్మం బయల్దేరి వెళ్లారు. -
విశాఖలో అంతంత మాత్రంగానే నీటి సరఫరా
విశాఖ : హుదూద్ తుఫానుతో సర్వం కోల్పోయిన విశాఖ ప్రజల కష్టాలు ఆరో రోజూ కూడా కొనసాగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇంకా విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ కాలేదు. విద్యుత్ సరఫరా లేక జనం అవస్థలు పడుతున్నారు. మరోవైపు అంతంత మాత్రంగానే తాగునీరు సరఫరా అవుతోంది. దాంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్రంగా నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. చాలా కాలనీల్లో కూలిపోయిన భారీ వృక్షాలను ఇంకా తొలగించలేదు. విశాఖ నగరం అంతా చెత్తతో నిండిపోయింది. పారిశుద్ధ్య సిబ్బంది పత్తా లేకపోవటంతో రోడ్లన్ని చెత్తా చెదారంతో నిండిపోయాయి. పెను తుఫాను కారణంగా నగరం వ్యర్థాలతో నిండిపోయినా, చెట్ల శిథిలాలతో రోడ్లన్నీ బీభత్సంగా మారిపోయినా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) చోద్యం చూస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మహిళల ప్రశ్నలకు బిత్తర పోయిన బొత్స
విశాఖ : తుఫాను బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ... అక్కడ బాధితులు అడిగిన ప్రశ్నలకు బిత్తరపోయారు. సాయంపై మహిళలు వేసిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో ఆయనకు అర్ధం కాలేదు. విశాఖలోని 21వ వార్డులో బొత్స గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఆయనను నిలదీశారు. "ప్రధాన రోడ్లపై శ్రమదాన కార్యాక్రమాన్ని నిర్వహించి ఫోటోలు తీసుకున్న తర్వాత వెళ్లిపోవటం కాదు... ముందు వీధుల్లోకి వచ్చి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోండి..' అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రతినిధులెవ్వరూ రాలేదు. మీరు వచ్చారు అయితే పైపైనే పనులు చేపట్టి వెళ్లిపోతే వీధుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎవరు స్పందిస్తారంటూ బొత్సను నిలదీశారు. కాసేపు ఏమి జవాబు ఇవ్వాలో అర్థం కాని ఆయన తర్వాత మహిళలకు నచ్చజెప్పారు. -
తుపాను నష్టంపై బాలయ్య ఆరా
పాయకరావుపేట: తుపాను వల్ల పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగిన నష్టాలపై హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఆరా తీశారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖపట్నం వెళుతూ బాలకృష్ణ పాయకరావుపేలో ఎమ్మెల్యే కార్యాలయానికి గురువారం సాయంత్రం వచ్చారు. నియోజకవర్గంలో తుపాను వల్ల జరిగిన నష్టాలను ఎమ్మెల్యే వంగలపూడి అనితను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోటనగేష్, పెదిరెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ మరింత దూసుకుపోతుంది
త్వరలో కేంద్ర బృందం రాక మొత్తం 34 మంది మృతి సమన్వయంతో సహాయ కార్యక్రమాలు సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు హైదరాబాద్: హుదూద్ వంటి భారీ తుపాను తాకడం కారణంగా విశాఖ నగరంలో పెట్టుబడులు పెట్టడానికి కార్పొరేట్లు, మల్టీనేషనల్ కంపెనీలు వెనక్కి తగ్గుతాయనే ప్రచారంలో ఏ మాత్రం పసలేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. విశాఖ నగరం ఏపీకి ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఇపుడు మరింత వేగంగా అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. సచివాలయంలోని తన చాంబర్లో గురువారం ఆయన మాట్లాడుతూ గతంలో తుపాన్లు మన దేశంలో జనాభా ఉన్న నగరాలు, పట్టణాలను తాకలేదన్నారు. ఎక్కువ గాలుల వేగం ఉన్న అత్యంత ప్రమాదకరమైన పెను తుపాను హుదూద్‌తో కొంత భారీనష్టం కలిగిందే తప్ప ఇలాంటివి, ఇంతకంటే పెద్దవాటితో చైనా, జపాన్, తైవాన్, సౌత్‌కొరియా వంటి దేశాల్లో కోస్తా నగరాలు విలవిల్లాయాడన్న సంగతి మరువరాదని చెప్పారు. అయినా అక్కడ పెట్టుబడులు పెట్టడం ఎవరూ మానుకోలేదన్నారు. బంగాళాఖాతంలో 1891 నుంచి వచ్చిన 77 తుపానుల్లో విశాఖను వణికించినది ఇదొక్కటేనన్నారు. తుపాను, భారీవర్షాల కారణంగా ఉత్తరాంధ్రలోని 44 మండలాల్లో పంటలకు తీవ్ర నష్టం సంభవించిందని చెప్పారు. కేంద్ర బృందం కూడా త్వరలో వస్తుందని తెలిపారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో 60 శాతం విద్యుత్ స్తంభాలు కూలిన కారణంగా సరఫరా పునరుద్ధరణకు కొంచెం సమయం తీసుకోవలసి వచ్చిందన్నారు. శుక్రవారం నాటికి విశాఖకు, శనివారం నాటికి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సరఫరా ఇవ్వగలమని చెప్పారు. ఇంతవరకు అందిన సమాచారం ఆధారంగా 34 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఆస్తి నష్టం ఎంతన్నది మదింపు జరుగుతోందన్నారు. తుపాను రాక ముందు నుంచీ కేంద్ర ం, వాతావరణ శాఖ హెచ్చరికలు ఎంతో మేలు చే శాయన్నారు. మొదట కొంచెం అనుకూల పరిస్థితులు లేకున్నా ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారులు, సాధారణ అధికారుల మధ్య సమన్వయం ఉండటంతో బాధితులకు సాయం చేసే అంశంలో టీమ్ వర్కుతో సునాయాసంగా సమస్యనుంచి రెండోరోజుకే తేరుకున్నామని చెప్పారు. అన్నిటికీ మించి ముఖ్యమంత్రి అక్కడ మకాం వేసి వ్యక్తిగత పర్యవేక్షణ చేయడంతో బాధితులకు సాయం సకాలంలో అందుతోంద న్నారు. -
మీకు నేనున్నా!
-
'బాబు పదేపదే టీవీల్లో కనిపించడానికే చూస్తున్నారు'
విశాఖ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం విశాఖలోని ఏకేసీ, ఏఎస్సీసీ కాలనీల్లో హుదూద్ తుపాన్ బాధితుల్ని పరామర్శించిన జగన్.. చంద్రబాబు వైఖరిని తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పదే పదే టీవీల్లో కనిపించడానికే పరిమితం అవుతున్నారని విమర్శించారు. బాధితులకు ఏమీ చేయకుండా ఏదో చేసినట్లు కలర్ పూసి మాయ చేస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు. తమ వద్దకు ఎవరూ రాలేదని తుపాను బాధితులు ఏకరువు పెట్టడంపై జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారపొట్లాలను పంచే క్రమంలో బాధితులంతా లారీ దగ్గరకు వెళితే.. ఆ పొట్లాలను విసిరివేయడాన్ని తప్పుబట్టారు. అసలు బాధితులను ఆదుకోవాలంటే ఎంతైనా చేయొచ్చని జగన్ తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్లతో నడుస్తున్నప్పుడు తుపాను బాధితులపై శ్రద్ద వహించకపోవడం సిగ్గు చేటన్నారు. ఇళ్లు పైకప్పులన్నీ ఎగిరిపోయి నిరాశ్రయులగా ఉన్న తమ వద్దకు ఎవరూ రాలేదని బాధితుల గోడు వెళ్లబోసుకున్నారని జగన్ పేర్కొన్నారు. బాధితులకు నిజంగా చేయాలనే ఉద్దేశం ఎవ్వరికీ కనిపించడం లేదన్నారు.తుపాను ప్రభావంతో నష్టపోయిన వారికి పూర్తి స్థాయి పరిహారం అందజేయాలని.. అప్పటివరకూ తమ పోరాటాన్ని విశ్రమించమని స్పష్టం చేశారు. -
వెయ్యి కాదు....రూ.5వేల కోట్లు ఇవ్వండి
హైదరాబాద్ : హుదూద్ తుఫాను వల్ల నష్టపోయిన ఉత్తరాంధ్ర పునరుద్ధరణకు వెయ్యి కోట్లు సరిపోవని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ తక్షణ సాయంగా రూ.5వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తుఫాను వల్ల రూ.70వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా అని, దీనిపై ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వాలన్నారు. చంద్రబాబు నాయుడు సర్కారు రుణమాఫీ చేయకపోవటంతో రైతులు బీమా అవకాశాన్ని కోల్పోయారని పద్మరాజు అన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి రైతులకు పంట బీమా వర్తించేలా చూడాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇస్తే ఊరటగా ఉంటుందన్నారు. -
ఆ పత్రిక కథనాలతో మా పార్టీకి సంబంధం లేదు
హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్భాటాలు మాని బాధల్లో ఉన్న ప్రజలకు సాయం చేయాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ చంద్రబాబు విలువైన సమయాన్నంతా సమీక్షలు, మీడియా ముందు ఉపన్యాసాలకే కేటాయిస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించాలన్నది తమ ఉద్దేశం కాదని, ప్రధాని మోడీ ఫోన్ చేసేవరకూ చంద్రబాబు విశాఖ ఎందుకు వెళ్లలేదని అంబటి ప్రశ్నించారు. హుదూద్ తుఫాను బాధితుల కోసం వైఎస్ఆర్ ఫౌండేషన్, సాక్షి సంయుక్తంగా ఏర్పాటు చేసిన నిధికి అందరూ విరాళాలు అందించాలని అంబటి కోరారు. వైఎస్ఆర్ సీపీని ఉద్దేశించి ఓ పత్రిక సంబంధం లేని కథనాలు రాస్తోందని ఆయన మండిపడ్డారు. ఆ పత్రిక ప్రజా సమస్యలపై దృష్టి పెడితే మంచిదన్నారు. ఆ పత్రికలో వచ్చిన కథనాలకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అంబటి స్పష్టం చేశారు. -
ఆ పత్రిక కథనాలతో మా పార్టీకి సంబంధం లేదు
-
విశాఖ ఎయిర్‌పోర్టు పునరుద్ధరణకు మూడు నెలలు
విశాఖ : పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గురువారం విశాఖ విమానాశ్రయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన హుదూద్ తుఫాను విపత్తులో సమర్థవంతంగా పని చేసిన అధికారులను అభినందించారు. తుఫాను సమయంలో విమానాశ్రయాన్ని కాపాడేందుకు విమానాశ్రయ సిబ్బంది అంకితభావంతో పాటు మంచి నైపుణ్యం చూపారని కొనియాడారు. విపత్తులో కూడా సిబ్బంది విమానాశ్రయంలోనే ఉండి కీలక పరికరాలను ధైర్యంగా కాపాడారన్నారు. విమానాశ్రయంలో ప్రాణ నష్టం జరగలేదని అశోక్ గజపతిరాజు అన్నారు. ఆయన ఈ సందర్భంగా సిబ్బందిని సన్మానించి, జ్ఞాపికలు అందచేశారు. విశాఖ విమానాశ్రయంలో శుక్రవారం నుంచి విమానాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని అశోక్ గజపతిరాజు తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. విమానాశ్రయం పూర్తి పునరుద్ధరణకు మూడు నెలల సమయం పడుతుందన్ని ఆయన తెలిపారు. -
తాటిచెట్లపాలెంలో పర్యటించిన వైఎస్ జగన్
-
తాటిచెట్లపాలెంలో పర్యటించిన వైఎస్ జగన్
విశాఖ : విశాఖలో హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడోరోజూ పర్యటిస్తున్నారు. ఆయన గురువారం ఉదయం తాటిచెట్లపాలెంలో పర్యటించిన బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.అలాగే ధర్మనగర్లో తుఫాను బాధితులను ఆయన పరామర్శించారు. మరోవైపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేయాలని వైఎస్ఆర్ సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. -
అనకాపల్లిలో పాల ప్యాకెట్ల కోసం తొక్కిసలాట
విశాఖ : విశాఖ జిల్లా అనకాపల్లిలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తుఫాను బాధితుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాల ప్యాకెట్ల క్యూలైన్ వద్ద తొక్కిసలాట జరిగింది. పాల ప్యాకెట్ల కోసం బాధితులు ఒక్కసారిగా తోసుకు రావటంతో గందరగోళం నెలకొంది. మరోవైపు పాల ప్యాకెట్ల కోసం జనాలు గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడే పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచే జనాలు పాల ప్యాకెట్ల కోసం రోడ్లపై బారులు తీరారు. కాగా పాల ప్యాకెట్ల పంపిణీలో ప్రణాళిక లేని కారణంగా నిజమైన బాధితులకు పాలు అందలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత నాలుగు రోజులుగా తుఫాను వల్ల జనానాకి ఏమీ దొరకడంలేదు. కూరగాయలు, పాలు అన్నింటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాంతో ప్రభుత్వం సాధారణ ధరలకు పాల ప్యాకెట్లు ఇప్పిస్తోందని తెలిసి భారీ సంఖ్యలో జనం చేరుకున్నారు. కానీ అక్కడ ఏర్పాట్లు తగినంతగా లేకపోవడం, వచ్చిన పాలు అయిపోతాయేమోనన్న ఆందోళన తొక్కిసలాటకు కారణమైంది. -
డబ్బులిచ్చి మరీ సెల్ఫోన్లకు ఛార్జింగ్
విశాఖ : హుదూద్ తుఫాను విలయ తాండవానికి విశాఖ జిల్లాలో చాలా గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. అరుకు, పాడేరు మార్గంలో పరిస్థితి భయానకంగా ఉంది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సహాయక చర్యల నిమిత్తం మంత్రులు, అధికారులు కూడా చేరుకోలేని పరిస్థితి నెలకొంది. విద్యుత్ సరఫరా లేక జనాలు తీవ్ర కష్టాలు పడుతున్నారు. జనరేటర్ల దగ్గరకు వెళ్లి డబ్బులు ఇచ్చి మరీ సెల్ఫోన్లకు ఛార్జింగ్ పెట్టించుకుంటున్నారు. కాగా హుదూద్ తుఫాను ధాటికి సమాచార వ్యవస్థ ఛిన్నాభిన్నం అవటంతో గిరిజనులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. మన్యంలో పలుచోట్ల సెల్ టవర్లు దెబ్బతినటంతో అయిదు రోజులుగా సెల్ఫోన్లు పనిచేయటం లేదు. ఛార్జింగ్ పెట్టుకుందామంటే విద్యుత్ సరఫరా లేదు. తమవారి క్షేమ సమాచారాల కోసం ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ముంచంగిపుట్టులో పలువురు మోటార్ బైకుల ద్వారా సెల్ ఛార్జింగ్ చేసుకుంటున్నారు. -
తాగునీటికి విజయనగరం వాసులు కటకట
విజయనగరం: హుదూద్ తుపానుతో విజయనగరం పట్టణ వాసులు కష్టాలు గురువారం కూడా కొనసాగుతూనే ఉన్నాయి. తాగునీటికి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంకర్లతో మంచినీరు అందిస్తామంటూ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ప్రకటన మాటలకే పరిమితమైంది. ట్యాంకర్లతో మంచినీటి సరఫరా ఎక్కడా కనిపించలేదు. అలాగే మంచి నీటి సరఫరా లేక అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నగరంలోని పలు కాలనీ వాసులు ఇళ్లు ఖాళీ చేసి గ్రామాలకు తరలివెళ్లిపోతున్నారు. ఇన్వెర్టర్ల ఛార్జీంగ్ కోసం కిలోమీటర్ల మేర డీజిల్ ఇంజిన్ల వద్ద భారీ క్యూలు కట్టారు. అపార్ట్మెంట్లలో చేరుకున్న నీటిని తోడేందుకు గంటకు రూ. 2 వేలు నుంచ రూ. 3 వేలు ఇంజిన్ యజమానులు తీసుకుంటున్నారని ఆపార్ట్మెంట్ వాసులు ఆరోపిస్తున్నారు. నగరంలో విద్యుత్ వ్యవస్థ ఇంకా పునరుద్ధరణకు నోచుకోలేదు. దీంతో చాలా కాలనీలు అంధకారంలోనే ఉన్నాయి. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం ఇంకా పునరుద్ధరణ కాలేదు. విజయనగరం నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. అలాగే తుపాను దాటికి పంటలు పాడవడంతో కూరగాయల ధరలు ఆకాశానంటాయి. -
విశాఖలో కొనసాగుతున్న జనం కష్టాలు
విశాఖ : హుదూద్ తుఫానుతో అల్లాడిన విశాఖ వాసుల కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం కూడా తాగునీటి సరఫరా పునరుద్ధరణ కాలేదు. జీవీఎంసీ కేవలం 17వా ర్డుల్లో మాత్రమే నీటిని సరఫరా చేసింది. వాటర్ ట్యాంకర్లు.. అపార్ట్మెంట్లకు చేరకపోవటంతో తాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు రైవాడ జలాశయం పైప్‌లైన్‌కు గండి పడటంతో నీటి సరఫరా పునరుద్ధరణకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈరోజు సాయంత్రానికి కూడా నీటి సరఫరా కష్టమే అని అధికారులు చెబుతున్నారు. హుదూద్ పంజా విసిరి అయిదు రోజులు అవుతున్నా చాలా ప్రాంతాల్లో బాధిత ప్రజలు తిండి కోసం, గుక్కెడు మంచి నీళ్ల కోసం అల్లాడే పరిస్థితి కనిపిస్తున్నది. నగరంతోపాటు అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదు. తుఫాను తాకిడికి భారీగా చెట్లు విరిగి పడటంతో నగరంలోని పలు కాలనీల్లో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అరుకు, పాడేరు మార్గంలో పరిస్థితి భయానకంగా ఉంది. -
'విశాఖతో ప్రత్యేక అనుబంధం ఉంది'
విశాఖతో హైదరాబాద్ : హుదూద్ తుఫాను బాధితుల సహాయార్ధం కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు తన నెలరోజుల జీతాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. ఆయన బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావును కలిసి చెక్కును అందచేశారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ తనకు విశాఖతో ప్రత్యేక అనుబంధం ఉందని, ఈనెల 18న తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. -
సాయంత్రంలోగా స్టీల్ఫ్లాంట్కు విద్యుత్
విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సాయంత్రంలోగా విద్యుత్‌ను పునరుద్ధిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన బుధవారం స్టీల్ఫ్లాంట్ సందర్శించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ స్టీల్ఫ్లాంట్కు రోజుకు రూ.40 కోట్ల మేరకు ఉత్పత్తికి నష్టం వాటిల్లుతున్నట్లు చెప్పారు. విద్యుత్ పునరుద్ధరణ కోసం వేలాదిమంది పనిచేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఈరోజు ఉదయం విశాఖ డెయిరీని సందర్శించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆమె సూచించారు. -
ముందుచూపుతో ప్రాణ నష్టాన్ని తగ్గించాం
విశాఖ : హుదూద్ తుఫానుపై ముందుచూపుతో వ్యవహరించటం వల్లే ప్రాణనష్టాన్ని తగ్గించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తుఫాను దెబ్బకు అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. చంద్రబాబు బుధవారం ఉదయం విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యుత్ పునరుద్ధరణ తమ ప్రధాన కర్తవ్యమన్నారు. తొమ్మిది లక్షల కుటుంబాలకు ఉచితంగా నిత్యావసరాలు అందిస్తున్నట్లు చెప్పారు. నిన్నటి పరిస్థితితో పోల్చుకుంటే ఇవాళ పరిస్థితి మెరుగుపడిందన్నారు. నష్టనివారణపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై బ్లూప్రింట్ తీసి అన్ని రాష్ట్రాలకు పంపుతామని చంద్రబాబు తెలిపారు. మరో రెండు రోజుల్లో రాష్ట్రానికి కేంద్ర బృందం రానున్నట్లు చెప్పారు. విశాఖ ఏజెన్సీ, గ్రామాల్లో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదని, ఇక గ్రామాలపై దృష్టి పెడతామని ఆయన తెలిపారు. -
ముందుచూపుతో ప్రాణ నష్టాన్ని తగ్గించాం
-
సాయంత్రం విశాఖలో పవన్ పర్యటన
హైదరాబాద్ : సినీహీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖ బయల్దేరారు. ఈరోజు సాయంత్రం ఆయన విశాఖలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా పవన్ పర్యటిస్తారు. కాగా హుదూద్ బాధితులకు పవన్ కళ్యాణ్ నిన్న రూ.50 లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం సహాయ నిధికి ఆయన ఈ విరాళాన్ని అందించనున్నారు. మరోవైపు తుఫాను సహాయక చర్యల్లో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ తన అభిమానులకు పిలుపునిచ్చారు. -
హీరో సూర్య ఫ్యామిలీ రూ.50లక్షల సాయం
హైదరాబాద్ : హదూద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు తమిళ నటులు కూడా తమ వంతు సాయం అందిస్తున్నారు. తమిళ హీరో సూర్య కుటుంబం హుదూద్ బాధితులకు రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. సూర్య 25 లక్షలు, కార్తీ 12.5 లక్షలు, జ్ఞాన్వేల్ రాజా 12.5 లక్షల విరాళం అందిస్తున్నారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు మేము సైతం అంటూ బాధితులకు ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. ఆ వివరాలు: అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రూ.20 లక్షలు యువ హీరో నందూ రూ.లక్ష హీరో నితిన్ రూ.10 లక్షలు హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ రూ.30 లక్షలు +ఇరవై టన్నుల బియ్యం, మందులు రామానాయుడు ఫ్యామిలీ రూ.50 లక్షలు హీరోయిన్ రకుల్ ప్రీత్ రూ.లక్ష హీరో విశాల్ రూ.15 లక్షలు బ్రహ్మానందం రూ.3లక్షలు ప్రకాశ్‌రాజ్ రూ.5 లక్షలు యువ హీరో సందీప్ కిషన్ రూ.2.5లక్షలు అల్లరి నరేష్ రూ.5 లక్షలు రవితేజ రూ.10 లక్షలు కాగా తుఫాను బాధితులకు భారీ విరాళమిచ్చిన పవన్‌కళ్యాణ్ ముందు వరుసలో నిలిచారు. ఆయన రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. మహేష్ బాబు రూ.25 లక్షలు, అలాగే సూపర్‌స్టార్ కృష్ణ కూడా 15 లక్షలు, విజయనిర్మల 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. హీరో రామ్ చరణ్ 15 లక్షలు ప్రకటించగా, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ 20 లక్షలు విరాళం ఇచ్చారు. ప్రభాస్ 10 లక్షలు, హృదయ కాలేయం ఫేమ్ సంపూర్ణేశ్ బాబు లక్ష ఆర్థిక సాయం అందించారు. మోహన్‌బాబు కుటుంబం అంతా కలిసి తుఫాన్ ప్రాంతాలను పర్యటించి బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. -
పవన్ కళ్యాణ్ రూ.50 లక్షల విరాళం
హైదరాబాద్ : హుదూద్ తుఫాను బాధితులకు సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రూ.5౦ లక్షల తక్షణ సాయం ప్రకటించారు. విరాళాన్ని చెక్కు రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందచేయనున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు తుఫాను సహాయక చర్యల్లో అభిమానులు పాల్గొనాలని పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు. ఉత్తరాంధ్రలో సాధ్యమైనంత త్వరలో పరిస్థితులు చక్కబడాలని కోరుకుంటుకున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. మరోవైపు రాంచరణ్ కూడా తుఫాను బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. -
సీఎం రిలీఫ్ ఫండ్‌కు రాంచరణ్ విరాళం
-
సీఎం రిలీఫ్ ఫండ్‌కు రాంచరణ్ 10లక్షల విరాళం
హైదరాబాద్ : హుదూద్ తుఫానుపై హీరో రాంచరణ్ స్పందించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ టీవీలో తుఫాను బీభత్సాన్ని చూసిన తనకు నోటీ నుంచి మాటలు కూడా రావటం లేదన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రాంచరణ్ రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. అలాగే విశాఖలోని రామకృష్ణ మిషన్‌కు మరో రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. టెక్నాలజీ, ముందుచూపు, మీడియా విస్తృత ప్రచారంతో ప్రాణ నష్టం తగ్గించగలిగామన్నారు. అలాగే తుఫాను సహాయక చర్యల్లో తమ అభిమానులు పాల్గొంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, కేంద్ర ప్రభుత్వం పనితీరు బాగుందన్నారు. అలాగే బాధితులకు ఆహారంతో పాటు మంచినీరు అందించనున్నట్లు రాంచరణ్ తెలిపారు. తుఫానుపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తత చేసినందుకు ఆయన మీడియాను అభినందించారు.