హుదూద్ తుఫానుతో అల్లాడిన విశాఖ వాసుల కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం కూడా తాగునీటి సరఫరా పునరుద్ధరణ కాలేదు.
విశాఖ : హుదూద్ తుఫానుతో అల్లాడిన విశాఖ వాసుల కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం కూడా తాగునీటి సరఫరా పునరుద్ధరణ కాలేదు. జీవీఎంసీ కేవలం 17వా ర్డుల్లో మాత్రమే నీటిని సరఫరా చేసింది. వాటర్ ట్యాంకర్లు.. అపార్ట్మెంట్లకు చేరకపోవటంతో తాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు రైవాడ జలాశయం పైప్లైన్కు గండి పడటంతో నీటి సరఫరా పునరుద్ధరణకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈరోజు సాయంత్రానికి కూడా నీటి సరఫరా కష్టమే అని అధికారులు చెబుతున్నారు.
హుదూద్ పంజా విసిరి అయిదు రోజులు అవుతున్నా చాలా ప్రాంతాల్లో బాధిత ప్రజలు తిండి కోసం, గుక్కెడు మంచి నీళ్ల కోసం అల్లాడే పరిస్థితి కనిపిస్తున్నది. నగరంతోపాటు అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదు. తుఫాను తాకిడికి భారీగా చెట్లు విరిగి పడటంతో నగరంలోని పలు కాలనీల్లో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అరుకు, పాడేరు మార్గంలో పరిస్థితి భయానకంగా ఉంది.