విశాఖ : హుదూద్ తుఫానుతో సర్వం కోల్పోయిన విశాఖ ప్రజల కష్టాలు ఆరో రోజూ కూడా కొనసాగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇంకా విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ కాలేదు. విద్యుత్ సరఫరా లేక జనం అవస్థలు పడుతున్నారు. మరోవైపు అంతంత మాత్రంగానే తాగునీరు సరఫరా అవుతోంది. దాంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్రంగా నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు.
చాలా కాలనీల్లో కూలిపోయిన భారీ వృక్షాలను ఇంకా తొలగించలేదు. విశాఖ నగరం అంతా చెత్తతో నిండిపోయింది. పారిశుద్ధ్య సిబ్బంది పత్తా లేకపోవటంతో రోడ్లన్ని చెత్తా చెదారంతో నిండిపోయాయి. పెను తుఫాను కారణంగా నగరం వ్యర్థాలతో నిండిపోయినా, చెట్ల శిథిలాలతో రోడ్లన్నీ బీభత్సంగా మారిపోయినా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) చోద్యం చూస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విశాఖలో అంతంత మాత్రంగానే నీటి సరఫరా
Published Fri, Oct 17 2014 9:05 AM | Last Updated on Sat, Sep 29 2018 5:47 PM
Advertisement
Advertisement