వెయ్యి కాదు....రూ.5వేల కోట్లు ఇవ్వండి
హైదరాబాద్ : హుదూద్ తుఫాను వల్ల నష్టపోయిన ఉత్తరాంధ్ర పునరుద్ధరణకు వెయ్యి కోట్లు సరిపోవని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ తక్షణ సాయంగా రూ.5వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తుఫాను వల్ల రూ.70వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా అని, దీనిపై ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వాలన్నారు.
చంద్రబాబు నాయుడు సర్కారు రుణమాఫీ చేయకపోవటంతో రైతులు బీమా అవకాశాన్ని కోల్పోయారని పద్మరాజు అన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి రైతులకు పంట బీమా వర్తించేలా చూడాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ ఇస్తే ఊరటగా ఉంటుందన్నారు.