విశాఖ : విశాఖ కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద వైఎస్ఆర్ సీపీ స్టీల్ఫ్లాంట్ ట్రేడ్ యూనియన్ నేతలు శుక్రవారం ఆందోళనకు దిగారు. హుదూద్ తుఫాను వల్ల స్టీల్ఫ్లాంట్కు భారీగా నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని వారు ఆరోపించారు. తుఫాను వల్ల స్టీల్ఫ్లాంట్కు రూ.1000 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. ఇంతవరకూ యాజమాన్యం స్టీల్ఫ్లాంట్ పునరుద్ధరణ పనులు చేపట్టలేదని వైఎస్ఆర్ సీపీ ట్రేడ్ యూనియన్ నేతలు మస్తానప్ప, పీవీ రమణ వ్యాఖ్యానించారు.
'హెచ్చరికల్ని స్టీల్ఫ్లాంట్ యాజమాన్యం పట్టించుకోలేదు'
Published Fri, Oct 17 2014 12:38 PM | Last Updated on Tue, May 29 2018 3:35 PM
Advertisement
Advertisement