తుపాను వల్ల పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగిన నష్టాలపై హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఆరా తీశారు.
పాయకరావుపేట: తుపాను వల్ల పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగిన నష్టాలపై హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఆరా తీశారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖపట్నం వెళుతూ బాలకృష్ణ పాయకరావుపేలో ఎమ్మెల్యే కార్యాలయానికి గురువారం సాయంత్రం వచ్చారు. నియోజకవర్గంలో తుపాను వల్ల జరిగిన నష్టాలను ఎమ్మెల్యే వంగలపూడి అనితను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోటనగేష్, పెదిరెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు.