katrina
-
పిడుగు పడగ
పిడుగుపాటుతో ఇండియాలో 79 మంది మృతి గత ఏడాది జూన్‌లో మనదేశంలో భీకర తుపానుకు బీహార్ అస్తవ్యస్తం అయింది. మెరుపులు, పిడుగుల దాటికి 57 మంది ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్‌లో పదిమంది, ఉత్తర ప్రదేశ్‌లో ఆరుగురు పిడుగుల బారిన పడ్డారు. వారిలో ఎక్కువ మంది పొలాల్లో పని చేసుకునే వాళ్లు, పశువుల కాపర్లే. వర్షం కురుస్తున్నప్పుడు తల దాచుకోవడానికి ఏ చెట్టు కిందకో పరుగులు తీయడం అసంకల్పితంగా జరిగిపోతుంది. మెరుపులో విడుదలయ్యే విద్యుత్తు ఆ చెట్టునే ఆకర్షిస్తే ఇక అంతే. రెండు రోజుల క్రితం రెండు రాష్ట్రాలలోని చాలా చోట్ల మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆనాడు వర్షం కంటే ఎక్కువగా ఉరుములు, మెరుపులే ప్రజలను భయపెట్టాయి. సాధారణంగా క్యుములోనింబస్ మేఘాలతో వర్షం కురిసినప్పుడు ఇలా మెరుపులు, ఉరుములతో వాతావరణం బీభత్సంగా మారిపోతుంది. ఇలాంటి సమయాల్లోనే పిడుగులు కూడా పడతాయి. ఇలా మెరుపులు, ఉరుములు, పిడుగుపడటం వంటివి ఎలా జరుగుతాయో చూద్దాం. మేఘాలలోని ధూళి కణాలలోని విద్యుదావేశాలు... అంటే ఛార్జ్డ్ పార్టికిల్స్ ఒకచోట పోగుపడతాయి. పాజిటివ్ ఛార్జ్ ఉన్న కణాలన్నీ మేఘం పైవైపునకూ, నెగెటివ్ ఛార్జ్ ఉన్నవి కిందివైపునకు పోగుపడుతుంటాయి. రెండు మేఘాలు దగ్గరగా వచ్చినప్పుడు వాటిలోని భిన్నమైన ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉన్నవి ఆకర్షించుకుంటాయి. దాంతో మేఘంలోనే రెండు విద్యుదావేశాల మధ్యనా, లేదా రెండు మేఘాలలో ఉన్న వేర్వేరు విద్యుదావేశాల మధ్యనా లేదంటే... కొన్నిసార్లు మేఘానికీ, భూమికీ మధ్యన జరిగే ఘర్షణతో చాలా స్వల్ప వ్యవధిలోనే అపరిమితమైన విద్యుచ్ఛక్తి వెలువడుతుంది. ఇదే మెరుపుగా మెరుస్తుంది. ఇంత అపరిమితమైన శక్తి పుట్టడం వల్ల పెద్ద శబ్దమూ వెలువడుతుంది. అదే ఉరుము. అయితే శబ్దవేగం కంటే కాంతి వేగం ఎక్కువ కావడం వల్ల మొదట మెరుపు కనిపించి, ఆ తర్వాత ఉరుము వినిపిస్తుంది. ఒక్కోసారి మేఘాల నుంచి ఆ విద్యుత్ భూమిలోకి కూడా ప్రవహిస్తుందని అనుకున్నాం కదా. అలా పయనించే విద్యుచ్ఛక్తే పిడుగు. ఒక్కోసారి వర్షం ఏదీ లేకుండా కూడా ఇలా మెరుపులు రావచ్చు. దాన్నే ‘డ్రై లైటెనింగ్’ అని కూడా అంటారు. భూమ్మీదికి వచ్చే మెరుపుల వల్ల ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్ భూమిలోకి ప్రవహించడం అన్నది ఒక్కోసారి పొడవాటి చెట్లు, పొడవైన స్తంభాల ద్వారా తేలిగ్గా జరిగిపోతుంది. అందుకే మెరుపులు మెరుస్తూ, ఉరుములు వినబడుతున్నప్పుడు చెట్ల కిందకీ, పెద్ద స్తంభాల దగ్గరికి వెళ్లవద్దని పెద్దలు చెబుతుంటారు. కొన్నిసార్లు మేఘాల నుంచి పాకే ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ నిటారుగా నిలబడి ఉన్న మనుషుల ద్వారానే భూమిలోకి ప్రవేశిస్తే... ఆ వ్యక్తి పిడుగుపాటుకు గురయ్యాడంటారు. కొన్ని సెకన్లలోపే ఆయుర్దాయం మాత్రమే ఉండే ఇలాంటి పిడుగులో దాదాపు 28,000 సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. నీరు 100 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద మరుగుతుందని తెలుసుకదా. దాన్ని బట్టి ఒక పిడుగులో ఎంత ఉష్ణోగ్రత ఉంటుందో ఊహించండి. పిడుగు పడి ఎంపైర్ బిల్డింగ్ ధ్వంసం చెట్లు సరే ఎత్తుగా ఉంటాయి కాబట్టి మెరుపును ఆకర్షించాయంటే అర్థం ఉంది. మరి భవనాల మీద ఎందుకు పడిందంటే... పిడుగులు పడిన ఆ భవనాలన్నీ ఆకాశాన్నంటేవే. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పిడుగుబారిన పడడానికి కారణం దాని ఎత్తే. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ఇది 102 అంతస్థుల భవనం. నార్వే లో పిడుగు పడి 323 ప్రాణాలు బలి నార్వేలో పిడుగు ఏకంగా మూడు వందలకు పైగా ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఈ మెరుపు దాడి అటవీ ప్రాంతం మీద విరుచుకు పడడంతో ఆ మరణాలన్నీ వన్యప్రాణులకే పరిమితమయ్యాయి. అయితే ఇది ఆ దేశ చరిత్రలో అత్యంత పెద్ద ప్రకృతి విలయం. ఈ జంతువులన్నీ మారే వాతావరణానికి అనుగుణంగా ప్రదేశాలు మారుతుంటాయి. ఆ వెళ్లడం సమూహాలుగా కదులుతాయి. దాంతో ఒక్క పిడుగుకు అన్ని జంతువులు బలయ్యాయి. రక్షించుకోండిలా... మనం అద్దం దగ్గర దువ్వుకునే సమయంలో జాగ్రత్తగా గమనిస్తే మన వెంట్రుకలు బాగా పొడిగా ఉన్నప్పుడు... దువ్వెన దగ్గరికి తేగానే దువ్వెన వైపునకు ఆకర్షితమవుతాయి. దీనికి కారణం... వెంట్రుకలు, దువ్వెనల్లోని వేర్వేరు ఎలక్ట్రిక్ ఛార్జే. ఇలాగే ఆరుబయట ఉన్నప్పుడు వెంట్రుకలు నిటారుగా పైకి లేస్తున్న తీరును గమనించి కూడా సర్వైవల్ నిపుణులు కొందరు పిడుగుపాటు ప్రమాదాన్ని పసిగడతారు. మీరూ ఇలాంటి సూచనను గమనిస్తే వెంటనే సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలి. మెరుపులు, ఉరుములు కనిపించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరుబయట ఉన్నవారు లైటెనింగ్ కండక్టర్ వంటివి ఉన్న భవంతిలోకి వెళ్లాలి. అంతేగాని నిటారుగా ఉండే చెట్ల కిందికి, స్తంభాల దగ్గరికి వెళ్లకూడదు. బయట మెరుపులు మెరుస్తూ, ఉరుముల శబ్దం వినపడుతున్నప్పడు ప్లంబింగ్, వైరింగ్ వంటి పనులు చేయడం సరికాదు. నీళ్లు విద్యుత్వాహకం. కాబట్టి పొడి నేల కంటే నీరుండే స్విమ్మింగ్‌పూల్ వంటివి పిడుగును త్వరగా ఆకర్షిస్తాయి. అందుకే నీళ్లున్న ప్రాంతానికి దగ్గర్లో ఉన్నవారిపైనా లేదా ఈదుతున్న వారిపైన పిడుగు పడే ప్రమాదం ఎక్కువ. అందుకే వర్షం సమయంలో ఈత లేదా నీటిలో ఆడటం వంటివి సరికాదు. ఇంటిలోపల (ఇన్‌డోర్స్‌లో) ఉన్నవారు సైతం విద్యుత్ ప్రవహించడానికి అవకాశం ఉన్న వైర్లు కలిగిన ఫోన్ (ల్యాండ్‌లైన్ ఫోన్)లలో మాట్లాడటం, వైర్లతో ఉండే విద్యుత్ ఉపకరణాలతో పనిచేయడం (అంటే కంప్యూటర్లు వాడటం) సరికాదు. ఆ సమయంలో టీవీ లాంటి విద్యుత్ ఉపకరణాలను ఆపివేయడం కూడా మంచిదే. కార్లలో ప్రయాణం చేస్తున్న వారు... తమ దేహం విద్యుత్ ప్రవహించే లోహానికి తాకకుండా జాగ్రత్త తీసుకోవాలి. విద్యుత్ ప్రవహించని సీటు వంటి ఇన్సులేటింగ్ మెటీరియల్‌కు మాత్రమే ఆని వుండేలా జాగ్రత్త పడాలి. అంతేగాని ఒళ్లు లోహానికి తాకకూడదు. మెరుపుని తిప్పికొడదాం ►ఏటా దాదాపుగా 25 మిలియన్ల పిడుగులు పడుతుంటాయి. ►మెరుపు సెకనుకు 90 వేల మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ►ఒక్క మెరుపులో ఒక బిలియన్ వోల్టుల విద్యుత్తు ఉంటుంది. ►వర్షం పడిన చోట మాత్రమే కాకుండా చుట్టూ పదిమైళ్ల విస్తీర్ణంలో కూడా మెరుపులు మెరుస్తుంటాయి, పిడుగులు పడుతుంటాయి. ►మెరుపు పక్కన ఉండే గాలి 28 వేల సెంటీగ్రేడ్ వేడి ఉంటుంది. ఇది సూర్యుడి వేడికంటే ఐదురెట్లు ఎక్కువ. ►కరెంటు ప్లగ్‌తో కనెక్ట్ అయిన వస్తువులను ముట్టుకోవద్దు. ►గోడలను ఆనుకోవద్దు అంట్లు తోమకూడదు ►స్నానం చేయకూడదు ►యంత్రపరికరాలతో పని చేయకూడదు -
ప్రియాంక, కత్రినా, దీపికల స్వయంవరం రేపే
డెహ్రాడూన్: ప్రియాంక, కత్రినా, దీపీకా రేపు పెళ్లి చేసుకోబోతున్నారు. మహా శివరాత్రి సందర్భంగా తమకు కాబోయే వరుడ్ని స్వయంవరంలో ఎంచుకోబోతున్నారు. వీరిని వివాహం చేసుకునేందుకు మొత్తం 15మంది పెళ్లి కుమారుల్లు సిద్థం కాగా వారిలో తమకు నచ్చిన వారిని లైఫ్ పార్టనర్‌గా ఎంపికచేసుకోబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరఖాండ్‌లోని తేరి జిల్లా జౌన్‌పుర్ ప్రాంత పరిధిలోని పంత్వాడి గ్రామం వేదిక కానుంది. అదేమిటీ బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న ఈ ముగ్గురు ఇలా పెళ్లికి సిద్ధమై పోవడం ఏమిటని ఆశ్చర్యపోతూ అవాక్కవుతున్నారా.. వాస్తవానికి పెళ్లి ప్రియాంక, కత్రినా, దీపికాదే కాని.. బాలీవుడ్ నటులైన ప్రియాంక, కత్రినా, దీపికాలది కాదు. ఆ పేర్లు కలిగిన మూడు గొర్రెలది. అవును.. మహాశివరాత్రి సందర్భంగా ఈ పేర్లు గల మూడు గొర్రెలకు స్వయం వరం నిర్వహిస్తున్నారు. ఇలా చేయడం ప్రతిఏడాది ఆ గ్రామంలో ఆనవాయితీ. ఈసారి ఈ మూడు గొర్రెలకు స్వయం వరం చేస్తున్నారు. వీటికోసం 15 మగ గొర్రెలను సిద్ధం చేశారు. ఒక్కో గొర్రెకు ఐదు గొర్రెలను ఓ రింగ్‌లోకి పంపించగా వాటిల్లో నుంచి ఒకదానిని ఆడ గొర్రె ఎంపిక చేసుకుంటుంది. అలా ఎంపిక చేసుకున్న గొర్రెతో దాని వివాహం జరిపిస్తారు. ఈ తంతుకు సాధారణంగా పెళ్లిల్లకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో అలాంటివే వీటి కోసం కూడా సిద్ధం చేస్తారు. ఇలా చేసి మూగజీవాలను గౌరవించడం తమ ప్రాంతంలో ఆనాదిగా వస్తున్న గొప్ప ఆచారంగా అక్కడి ప్రజలు చెప్పుకుంటుంటారు. -
ఏడు నెలలుగా ఎదురుచూపులే!
గత ఏడాది నవంబరు నెలలో సంభవించిన ‘రోవాను’ తుపాను జిల్లా ప్రజలను నిండా ముంచింది. ఆ తుపాను ధాటికి జిల్లా కకావికలం అయింది. రైతులు కుదేలయ్యారు. వందలాదిమంది నిరాశ్రయులయ్యారు. అప్పట్లో వ రద బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, తుపాను సంభవించి ఏడునెలలైనా పరిహారం అందించలేదు. బాధితులకు బియ్యం, పంచదార, పామాయిలు ఇచ్చి చేతులు దులుపుకుంది. చిత్తూరు: రోవాను ధాటికి జిల్లా వ్యాప్తంగా 2,429 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. దీనిలో వేరుశనగ 167 హెక్టార్లు, వరి 1,790, కందులు 153 , ఇతర పంటలు 319 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. వీటికి మొత్తం రూ.27 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. భారీ వర్షాలతో ఉద్యానవన పంటలు 3,164 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. దీనివల్ల 6,185 మంది రైతులు నష్టపోయారు. వీరికి రూ.287.03 కోట్లు చెల్లించాల్సి ఉంది. బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం శూన్యం.చిత్తూరు, మదనపల్లి, తిరుపతి డివిజన్లలో రోవాను ధాటికి 9,738 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటికి తాత్కాలిక ఉపశమనం కింద కంటి తుడుపు నగదు చెల్లించారు. తరువాత వాటిని పట్టించుకోలేదు. పరిశీలనలే తప్ప పైసారాలేదు తెలుగుగంగ కాలువకు తొట్టంబేడు వుండలంలోని పెద్దకనపర్తి, చిన్నకనపర్తి వద్ద వుూడుచోట్ల గండ్లు పడ్డారుు. దాంతో వెరుు్య ఎకరాల పంట నీట వుునిగింది. 300 ఎకరాలకు ఇసుక దిబ్బలు కట్టారుు. అందులో నాకు ఐదు ఎకరాల భూమి ఉంది. మంత్రులతోపాటు స్థానిక నాయుకులు, అధికారులు పదేపదే గతేడాది నవంబర్‌లో పరిశీలన చేశారు. అరుుతే ఇప్పటివరకు వూకు గానీ, వూ గ్రావూనికిగానీ పైసా కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. - ఈశ్వరయ్యు, చిన్నకనపర్తి గ్రావుం,తొట్టంబేడు వుండలం గూడు కూలిపోయింది గత ఏడాది నవంబర్‌లో కురిసిన వర్షాలకు ఉన్న గూడు కూలిపోయింది. అప్పటినుంచి తాత్కలికంగా పట్టలతో ఇల్లు నిర్మించుకుని అందులో ఉంటున్నాను. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అందులో ఉండలేక అవస్థలు పడుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఇళ్లు మంజూరు చేసిందని తెలిసింది. కానీ మాకు మాత్రం ఎలాంటి సమాచారం లేదు. పభుత్వం స్పందించి న్యాయం చేయాలి. -నేతాజీ, బుడిగిపెంట యాదమరి మండలం వర్షానికి ఇల్లుకూలి రోడ్డున పడ్డాం మాది పాకాల మండలం దామలచెరువు పంచాయతీ కుక్కలపల్లి దళితవాడ. గత ఏడాది నవంబర్‌లో కురిసిన వర్షానికి ఇల్లు కూలి రోడ్డున పడ్డాం. ప్రస్తుతం బాడుగ ఇంట్లో తల దాచుకుంటున్నాం. వర్షానికి ఇళ్లు కూలిన వాళ్లకు ప్రభుత్వం సాయం చేస్తామని ప్రకటించింది. అయితే 10 కేజీల బియ్యం, రూ. 5వేల రూపాయల నగదుతో సాయం అయిపోయిందని చేతులు దులిపేసుకుంది. ఇళ్లు పూర్తిగా కూలిపోయి రోడ్డున పడితే రూ.5వేలతో ఏవిధంగా ఇల్లు కట్టుకోవాలి. - జీ.లక్ష్మీపతి, దామలచెరువు -
తరుముకొస్తున్న తుపాను
రెండు రోజులపాటు భారీ వర్షాలు పల్లపు ప్రాంతాలు జలమయం చోడవరంలో గోడకూలి వృద్ధురాలి మృతి విరిగిపడిన చెట్లు.. విద్యుత్‌కు అంతరాయం వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరిక లోతట్టు ప్రాంతాలవారిని తరలించేందుకు సన్నాహాలు కంట్రోల్ రూముల ఏర్పాటు సాయానికి టోల్‌ప్రీ నెంబర్1800-4250-0001 అటు తిరిగి.. ఇటు తిరిగి.. తుపాను గండం ఉత్తర కోస్తా వైపు దూసుకొస్తోంది.. అదీ పెను తుపాను రూపంలో కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. నగరంలో ఉదయం నుంచీ ఎడతెరిపి లేని జల్లులు కురుస్తున్నాయి. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. చోడవరంలో గోడ కూలి వృద్ధురాలు దుర్మరణం చెందింది. గాలుల ప్రభావానికి చెట్లు కూలి విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లపై పడటంతో ఏజెన్సీతో సహా చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ తరుణంలో వాయుగుండం తుపానుగా.. పెను తుపానుగా మారనుందని.. అది ఉత్తర కోస్తా వైపు పయనిస్తోందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర, పల్లపు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రోజంతా వాన విశాఖపట్నం: వాయుగుండం తుపానుగా మారడంతో జిల్లా అంతా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకంగా రెండు నెలల నుంచి నిప్పుల కుంపట్లో ఉన్న ప్రజలకు చల్లదనం పంచింది. బుధవారం వేకువజాము నుంచి దాదాపు రోజంతా వాన కురిసింది. తెరలు తెరలుగా విరామం ఇస్తూ వర్షం పడుతోంది. వాయుగుండం ప్రభావం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి బలమైన ఈదురుగాలులు వీయలేదు. దీంతో వర్షం కురిసినా జనజీవనానికి ఇబ్బంది కలగలేదు. విశాఖ ఏజెన్సీలో తప్ప విద్యుత్ సరఫరాకు, వాహనాల రాకపోకలకు జిల్లాలో పెద్దగా అంతరాయం ఏర్పడలేదు. వాయుగుండం గురువారానికి తుపానుగా మారనుంది. ప్రభావం మరో రెండ్రోజుల పాటు విశాఖ జిల్లాపై చూపనుంది. ఫలితంగా గురు, శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. వాయుగుండం తుపానుగా బలపడితే ఈదురుగాలులు కూడా వీస్తాయి. అందువల్ల జనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. తడిచిపోయిన వరి కుప్పలు చోడవరం, బుచ్యెయ్యపేట తదితర ప్రాంతాల్లో కోసి ఆరబెట్టిన రబీ వరి పనలు వర్షాలకు తడిసి ముద్దయ్యాయి. తగరపువలసలో 99 ఎకరాల్లోని ఉప్పు కుప్పలు వర్షపు నీటికి కరిగిపోయాయి. దీంతో ఉప్పు రైతులకు రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. ఏజెన్సీలో వాగులు పొంగిపొర్లడంతో గిరిజనులు రాకపోకలకు ఇబ్బందిపడ్డారు. విద్యుత్‌కు అంతరాయం.. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు ఒకింత అంతరాయం ఏర్పడింది. కొయ్యూరు మండలంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పాడేరులోనూ పలు దఫాలు సరఫరా జరగలేదు. సన్‌సైడ్ కూలి వృద్ధురాలి మృతి చోడవరం: భారీ వర్షానికి ఇంటి శ్లాబ్ సన్‌సైడ్ కూలిపోవడంతో బుధవారం పట్టణంలోని గునిశెట్టివాని వీధికి చెందిన గేదెల నర్సయ్యమ్మ (78) అనే వృద్ధురాలు మృతిచెందింది. మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో ఇంటిగోడలు పూర్తిగా నానిపోయాయి. అసలే పాత ఇల్లు కావడంతో సన్‌సైడ్ కింద వర్షానికి ఆ వృద్ధురాలు నిలబడి ఉండగా ఒక్కసారిగా శ్లాబ్ సన్‌సైడ్ విరిగిపడింది. దీనితో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానిక 30 పడకల ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. -
అమ్మాయిలు ఏం మాట్లాడుకుంటారు?
పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, అబ్బాయి - ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తుంటారు? నలుగురు అమ్మాయిలు ఒక చోట చేరితే అబ్బాయిల గురించి ఏం మాట్లాడుకుంటారు? అనే కథాంశంతో నిర్మించిన చిత్రం ‘కత్రిన... కరీన... మధ్యలో కమల్‌హాసన్’. శశాంక్ మౌళి, పావని జంటగా నవకళ పారి పతాకంపై రత్న దర్శకత్వంలో శ్రీను విజ్జగిరి, ప్రసాద్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘వైజాగ్ నేపథ్యంలో నడిచే కథ ఇది. పూర్తి వినోదాత్మకంగా తీర్చిదిద్దాం. కామెడీ, ఎమోషన్స్ కూడా ఉంటాయి. అందరూ కొత్తవాళ్లు నటించారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రానికి కథే హీరో. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లుగా ఉండే సినిమా. యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. డైలాగులు ఈ చిత్రానికి బలం’’ అని శశాంక్ మౌళి చెప్పారు. ఈ సినిమాకు సంగీతం: శ్రీకర్, కెమేరా: ప్రసాద్, శ్రావణ్ కుమార్. సహ నిర్మాతలు: ఎస్. మల్లయ్య, బి.జగన్. -
కత్రినాపై సల్మాన్ ప్రశంసల వర్షం
-
అన్నదాతల కలవరం
తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ ప్రకటనలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. నాలుగు రోజులుగా ఆకాశం మేఘావృతమై చలిగాలులు వీస్తుండడం అన్నదాతలో గుబులు రేపుతోంది. కొన్ని ప్రాంతాల్లో వరిపంట కోత, గింజ, చిరుపొట్ట దశలో ఉంది. పల్నాడు ప్రాంతంలో పత్తి పంట పూత, గూడ, పిందె దశలో ఉంది. ఈ సమయంలో వర్షాలు కురిస్తే పంట నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నదాతలు కలవరపాటుకు గురవుతున్నారు. మాచర్లటౌన్/నగరం: ఈశాన్య రుతుపవనాల కారణంగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి రైతులను కలవరానికి గురిచేస్తోంది. తుపాను కారణంగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. జిల్లావ్యాప్తంగా వరి, పత్తి, కంది, కూరగాయలు సాగు చేస్తున్న అన్నదాతలు తుపాను భయంతో అంతర్మథనం చెందుతున్నారు. జిల్లాలో వరి 2,52,645 హెక్టార్లలో సాగవుతోంది. ఇందులో వెద పద్ధతిలో 1,32,075 హెక్టార్లు, సాధారణ పద్ధతిలో 63,069 హెక్టార్లు సాగు చేస్తున్నారు. పత్తి 1,98,809 హెక్టార్లు, కంది 20,242 హెక్టార్లలో సాగు చేశారు. పత్తి పిందెలు రాలే ప్రమాదం..: పత్తి దిగుబడుల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దీపావళి నుంచి మైల పత్తి దిగుబడులు ప్రారంభమయ్యాయి. పత్తి పంట పూత, గూడ, పిందె దశలో ఉంది. ఈ సమయంలో వర్షం పడితే పత్తిలో పూత, గూడ, పిందెలు రాలిపోతాయి. కొద్దిగా పగిలి ఉన్న కాయలు, కోతకు సిద్ధంగా ఉన్న పత్తి రంగు మారి నాణ్యత లేకుండా పోయే అవకాశం ఉంది. ఖరీఫ్‌లో సరైన సమయంలో జిల్లా వ్యాప్తంగా ఒకేసారి వర్షాలు కురవకపోవటంతో కందిపంట వివిధ దశల్లో ఉంది. రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు ఉన్న పంటకు నష్టం లేకున్నా పూతదశలో ఉన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పూత దశలో పచ్చగా ఉన్న పూలపై వాన పడితే వర్షపు నీటి దాటికి పూత రాలుతుంది. ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు.. కూరగాయలు, పూలు సాగు చేసుకుంటున్న రైతులు తుపాను హెచ్చరికలతో అంతర్మథనం చెందుతున్నారు. టమాట, దోస, కాకర వంటి పైర్లపై నీరు చేరితే పంట నష్టం అధికంగా ఉంటుంది. కూరగాయల ధరలు ఆకాశానంటుతున్న తరుణంలో వర్షం కురిసి నష్టం జరిగితే ధరలు ఆకాశన్నంటుతాయి. కష్టాలను అధికమించి దిగుబడుల స్థాయికి వస్తే తుపాను గండంతో రైతుల పరిస్థితి క్షణం భయపడుతున్నారు. నెరవేరని లెవి లక్ష్యం.. వర్షాభావంతో జిల్లాలో కరవు పరిస్థితులు దాపురించాయి. కనీస స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవటంతో ప్రభుత్వం జిల్లాలో 26 కరవు మండలాలను ప్రకటించింది. కరువు ఉందని, లేదని చెబుతున్న మండలాల్లో అనేకచోట్ల రైతులు బోర్ల కింద పంటలను సాగు చేస్తున్నారు. ఆయా పంటలు చీడపీడల దాటిని తట్టుకొని దిగుబడుల దశకు వచ్చాయి. వరిపంట కోత, గింజ, చిరుపొట్ట దశలో ఉంది. భారీగా కాకపోయినా ఓ మోస్తరు వర్షం కురిసినా నోటికాడికి వచ్చిన పంట చేతికందకుండా పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వరి విస్తీర్ణం తక్కువ కావటంతో ధాన్యం లెవి లక్ష్యం నెరవేరే అవకాశం లేకుండా పోయింది. వర్షాలు కురిస్తే లెవి లక్ష్యం ఊహకందకుండా పోయే అవకాశం ఉంది. డెల్టాలో వరి పంట ప్రస్తుం ఓదెల రూపంలో ఉంది. అల్పపీడన ప్రభావంగా ఇటీవల కురిసిన వర్షాలకు చేతికొచ్చిన వరి పంట నేలపాలైంది. తర్వాత వారం రోజులు వాతావరణం ఎండగా ఉండటంతో నేలకొరిగిన వరిపంటను రైతులు కోతలు కోయించారు. ఓదెలు రూపంలో ఉన్న సమయంలో వర్షాలు పడితే ధాన్యం మొలకలు రావడంతో పాటు రంగు మారే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. -
చిగురంత ఆశ..
‘యారాడ గిరుల శిఖను చేరి..కనులు విప్పారి చూస్తే నా విశాఖలో నాకు ఒక్కొక్కరోజు ఒక్కొక్క అందం కనిపిసుంది...’’ అంటూ శ్రీశ్రీ కొనియాడిన పచ్చని విశాఖలో... సరిగ్గా ఏడాది క్రితం... ప్రళయం ప్రత్యక్షమైతే..వాయు విలయం విరుచుకుపడితే..విధ్వంసం వికటాట్టహాసం చేస్తే..ప్రకృతి ‘అల’కల్లోలంతో ప్రకోపిస్తే..భయం ఓ రూపం దిద్దుకుంటే..వినాశనం కట్టెదుటే కరాళ నృత్యం చేస్తే..రాకా‘సీ’ గర్జిస్తే..పెను ఉప్పెన మీదకురికితే..జలఖడ్గం కోలుకోలేని దాడిచేస్తే . .క్షణం క్షణం చివురుటాకులా వణికితే.. చూస్తుండగా ఊరంతా అతలాకుతలమైతే..జనజీవనం అస్తవ్యస్తమైతే....వేలఏళ్ల వృక్షాలు వేళ్లతో సహా నేలకూలితే..చుట్టూ అంధకారం అలుముకుంటే..అడుగు వేయడానికి ఆటంకాలెదురైతే..బిక్కుబిక్కుమంటూప్రాణాలు అరచేతులు పెట్టుకుంటే.. ఎలాగుంటుందో ప్రత్యక్షానుభవమైంది విశాఖకు.. గతేడాది ఇదేరోజున.. ఇవన్నీ చవిచూసింది నగరం. హుద్‌హుద్ సృష్టించిన విధ్వంసానికి విశాఖ విధ్వంసమైంది. అందమైన నగరంగా భాసిల్లిన సిటీ శోకతప్తమైంది. కన్నీటి సంద్రమైంది. బంగాళాఖాతంలో పురుడుపోసుకున్న తుపాను పెనుశాపమై విశాఖను కష్టాల్లోకి ముంచింది. గాఢాంధకారం చుట్టూ అలముకుంది.. మొక్కలు..చెట్లు నేల కూలి పచ్చదనం కనుమరుగైంది.. హుద్‌హుద్ తర్వాత సాధారణ స్థితికి చేరుకోడానికి..కష్టాల నుంచి తేరుకోడానికి చాలా సమయం పట్టింది. నష్టాల లెక్కలేసుకుంటే చిట్టా చేంతాడయింది. పరామర్శలు వెల్లువెత్తాయి. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడి 48గంటల్లోగా రావడం కొంత ఊరటనిచ్చింది. వెయ్యి కోట్లతో తాత్కాలికంగా ఆదుకుంటామంటూ ఆయనిచ్చిన భరోసా కొండంత ధైర్యాన్నిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వారం రోజులపాటు మకాం వేయడం సంతోషాన్నిచ్చింది. శోక విశాఖ కన్నీళ్లు తుడిచి నిధులతో అభివృద్ధికి కొత్త బాటలేస్తామన్న ఈ నేతల హామీలు మాత్రం సాఫల్యం కాలేదు. వీరి మాటలన్నీ తుపానుకు కొట్టుకుపోయాయి. నగర జీవనాడి మహానగర పాలకసంస్థకు రూ.1270 కోట్లు నష్టం జరిగితే ఏడు కోట్లు విదిల్చిన సర్కారు కపట ప్రేమ ప్రజలను బాధిస్తోంది. వివిధ శాఖలకు తగిలిన గాయాలు మాన్పేందుకు అవసరమైన నిధుల చికిత్సకు మందే కరువైంది. గూడు కోల్పోయిన వారి గోడు అరణ్యరోదనయింది. లక్షన్నర మందికి నిలువనీడ లేకుండాపోతే కేవలం రెండు వేల ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పడం.. అవి కూడా నేటికీ పూర్తికాకపోవడం సర్కారు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. చిన్నాపెద్దా కలిపి 1877 పరిశ్రమలు తుపాను నష్టాలు నెత్తికెత్తుకోగా ఏమేరకు ఆదుకున్నారో ఏలికలకే ఎరుక. జీవనాధారమైన బోట్లను కోల్పోయిన మత్స్యకారులింకా కష్టాల కడలిలోనే ఎదురీదుతున్నారు. నేటికీ ఆశించిన చేయూత అందనేలేదు. పెను తుపాను అలజడికి బాధితులంటా ఇప్పటికీ ఆపన్నహస్తం కోసం నిరీక్షణే. చేతికందొచ్చే తరుణంలో ఆరుగాలం శ్రమ ఆవిరైపోయిన అన్నదాతను ఆదుకోడానికి సాంకేతిక సాకులే వెక్కిరిస్తున్నాయి. హుద్‌హుద్ తాకిడి సర్వం అతలాకుతలమైన సంపదకు మూల్యం కడితే తొమ్మిదివేల కోట్ల రూపాయలని అధికార గణాంకాలే చెబుతుండగా పదోవంతు కూడా నిధులు రాకపోవడం బాధాకరం. ఏడాది తర్వాత వెనక్కి తిరిగి చూస్తే.... చిగురంత ఆశ కలిగించే అంశమొక్కటే..కన్నెర్ర చేసిన ప్రకృతే మళ్లీ కరుణించింది. పచ్చదనం కనుమరుగైన నగరవనంలో మొక్కలన్నీ చిగురించాయి. ‘ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు వికసిస్తుంది అన్న ఓ రచయిత పాట మాదిరిగా పచ్చదనం పర్చుకుంది. తరలి రాదా తనే వసంతం.. తన దరికి రాని వనాల కోసం.. అన్నట్లుగా హుద్‌హుద్ ధాటికి గల్లంతయిన పచ్చదనం మళ్లీ ప్రత్యక్షమై నగర వాసికి సంతోషాన్నిస్తోంది.. -సిటీడెస్కు -
కత్రినాను తెగపొగుడుతున్న సైఫ్!
-
10 లక్షల మంది తరలింపు
చైనాలో తుపాను బీభత్సం బీజింగ్: చైనా తూర్పు ప్రాంతంలో ‘చాన్-హోమ్’ తుపాను విరుచుకుపడుతోంది. శనివారం ఇది తీరం దాటడంతో జెజియాంగ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. 10 లక్షల మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వందలాది విమాన,, రైలు సర్వీసులను రద్దు చేసి, 30 వేల నౌకలను రేవులకు తిరిగి రప్పించారు. 51 భారీ, మధ్యతరహా రిజర్వాయర్లలో నీటిమట్టం ప్రమాద హెచ్చరికను దాటింది. వంద ఇళ్లు, 82 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ప్రాణనష్టం సంభవించినట్లు వార్తలేవీ రాలేదని, తుపాను ఈశాన్య దిశగా కదుతోందని అధికారులు తెలిపారు. ఈ విపత్తు వల్ల రూ. 2 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. -
షారుఖ్ ఏం చేశాడు క్యాట్?!
గాసిప్ బాలీవుడ్ ప్రపంచంలోకి సునామీలా దూసుకొచ్చి, కన్నుమూసి తెరిచేలోగా టాప్ హీరోయిన్ అయిపోయిన కత్రినా... అంతే వేగంగా వివాదాలలోనూ చిక్కుకుంది. సల్మాన్‌తో చెట్టాపట్టాలు, రణబీర్‌తో రహస్య ప్రేమతో వార్తల్లోకి ఎక్కింది. ఇప్పుడు తాజాగా ఓ స్టార్ హీరోతో చేయడానికి నో చెప్పి మరోసారి న్యూస్‌లో నిలిచింది. నిన్నటివరకూ షారుఖ్ నటిస్తోన్న ఓ చిత్రంలో కత్రినా ఐటెమ్ సాంగ్ చేయబోతోందన్న వార్త హల్చల్ చేసింది. అయితే అలాంటిదేమీ లేదని, అది వట్టి పుకారని, కత్రినా చాలా బిజీగా ఉన్నందున ఐటెమ్ సాంగులు చేయబోదని మేనేజర్ ఇవాళ కుండ బద్దలు కొట్టేశాడు. అయితే బిజీగా ఉండటం వల్ల కాదని, నిజానికి కత్రినా షారుఖ్‌తో చేయడానికి ఇష్టపడలేదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతగా వారిద్దరి మధ్య శత్రుత్వం ఏముందా అని కొందరు కూపీలు లాగే పనిలో కూడా పడ్డారు. -
బిహార్‌లో తుపాను బీభత్సం
42 మంది మృతి, 80 మందికి గాయాలు పట్నా: బిహార్‌లోని 12 ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో మంగళవారం రాత్రి తుపాను బీభత్సం సృష్టించింది. 42 మంది మరణించగా, 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వేలాది గుడిసెలు, భారీ విస్తీర్ణంలో కోతకొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. ఒక్క పూర్ణియా జిల్లాలోనే 30 మంది చనిపోయారు. మాధేపురా, మధుబని, సమస్తిపూర్, దర్భంగా తదితర జిల్లాల్లో గాలివానకు వేలాది చెట్లు కూలిపోయాయి. నేపాల్ నుంచి తుపాను ఈ జిల్లాల మీదుగా విస్తరించిందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 65 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచాయని, ‘కాల్‌బైశాఖీ’గా పిలిచే ఈ తుపానులు ఈ సీజన్లో సాధారణమని పేర్కొంది. ప్రధాని మోదీ.. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ఫోన్ చేసి పరిస్థితి తెలుసుకున్నారు. రాష్ట్రాన్ని అన్ని రకాలా ఆదుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు నితీశ్ రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. -
హర్ట్... నాట్ రిటైర్డ్!
చూస్తుంటే అభిషేక్కపూర్ ‘డ్రీమ్’ ప్రాజెక్ట్ ‘ఫితూర్’ క్యూటీ కత్రినాకు ఓ పీడ‘కల’గా మిగిలిపోయేట్టుంది. గత నెలలో ఈ సినిమా సెట్స్‌పై గాయపడిన ఈ స్వీటీ... తాజాగా మరోసారి ‘హర్ట్’ అయింది. చిత్రానికి కీలకమైన హార్స్ రైడింగ్ సన్నివేశంలో అమ్మడు పట్టు తప్పి పడిపోయింది. మెడ, వెన్ను భాగంలో గాయాలయ్యాయి. ఈ అన్ఎక్స్పెక్టెడ్ సీన్‌తో స్పాట్లో ఉన్నవారంతా షాకయ్యారు. అంతలోనే తేరుకున్న కత్రినా... మళ్లీ గుర్రం ఎక్కి స్వారీ చేసింది. ఓ రోజు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినా.. షూటింగ్‌కు ప్యాకప్ చెప్పకుండా తనలోని ప్రొఫెషనలిజాన్ని మరోసారి చూపింది. ఇదిలావుంటే... షూటింగ్‌లతో బిజీగా గడిపేసిన కత్రినా, ఆమె స్టార్ లవర్ రణబీర్ కపూర్ సమ్మర్ హాలిడేస్‌ను పూర్తిస్థాయిలో ఆస్వాదించేందుకు మాల్దీవ్స్ చెక్కేశారన్నది ఓ ఆంగ్ల పత్రిక కథనం! -
నటనకి కత్రినా పుల్‌స్టాప్ పెట్టబోతుందా?
-
తిరిగిరాని క్షణం... కాంతికన్నా వేగం!
సృష్టిలో, మనకు తెలిసినంత వరకు అత్యంత వేగంతో ప్రయాణించేది ‘కాంతి’. సెకనుకు లక్షా ఎనభై ఆరు వేల మైళ్ల వేగంతో అది ప్రయాణిస్తుంది. అయితే సూర్యునిలో తరచు సంభ విస్తుండే సునామీని మించిన అగ్ని తుపానులు, మహావిస్ఫోటాలు కలిగినప్పుడు ఉద్భవించే అతి సూక్ష్మ ధూళి కణాలైన ‘న్యూట్రినో’లు... వేగంలో కాంతితో పోటీపడి మరీ ఈ విశ్వంలోకి దూసుకెళ్తాయని ఇటీవల ‘నాసా’ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు! అయితే వీటన్నిటినీ మించి వేగంగా ప్రయాణించినట్టనిపించేది మరొకటుందనిపిస్తుంది. అదే ‘గతించిపోయిన కాలం’. సూర్యుడు ఆవిర్భవించి నాలుగు వందల అరవై కోట్ల సంవత్సరాలైందని శాస్త్రజ్ఞుల అంచనా. అంటే ఇప్పటికి క్షణికంలో అన్ని కోట్ల సంవత్సరాలు గతించిపోయాయన్న మాట. నిమిషానికి అరవై సెకన్లు. సెకనును వంద కోట్ల భాగాలుగా విభజించినప్పుడు దానిని ‘నానో సెకను’ అంటారు. మీరు ఈ వాక్యం చదివే లోపు కొన్ని లక్షల నానో సెకన్లు గతించి పోతాయి. వాటిలో ఒక్క సెకనును కూడా వెనక్కు లాగే శక్తి మనకు లేదు. కనుక మానవ జీవితం నూరు సంవత్సరాలైనా, అంతకు మించినా, అది కాలయానంలో అతి సూక్ష్మమైన, అణువు కన్నా సంక్షిప్తమైనదని చెప్పాలి. మనకు ముందు కొన్ని వేల, లక్షల తరాలు గతించి పోయాయి. ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతుంటాయి: ‘మానవుని జీవితం నీటి బుడగ లాంటిది, అది అప్పుడే పూసి, సమసిపోయే గడ్డిపువ్వు లాంటిది’ అని. జీవితకాలం ఇంత సంక్షిప్తమైనప్పుడు, స్వార్థపూరితంగా జీవించి ప్రయోజనం ఏమిటి? బైబిల్లో ఇలా ఉంటుంది: ‘అన్యాయంగా మీరు సంపాదించుకున్న వాటికి మీ పేర్లు, పిల్లల పేర్లు పెట్టుకుంటారు కానీ చివరకు అవి అన్యాక్రాంతం అయిపోతాయి. కాబట్టి దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెదకండి. అప్పుడు మీకు కావలసినవన్నీ నీతియుక్తంగా లభిస్తాయి. అంతకుమించిన నిత్యజీవానికి, పరలోక రాజ్యానికి మీరు వారసులవుతారు’ అని. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి క్షణం మనం ఈ సత్యాన్ని గుర్తుంచుకుని ముందుకు సాగాలి. - యస్.విజయ భాస్కర్ -
70 శాతం ఇళ్లు ఇంకా చీకట్లోనే
జగన్ పర్యటనలో కనిపించిన దృశ్యాలు ప్రభుత్వ వైఫల్యంపై నిలదీసిన విపక్ష నేత విశాఖపట్నం: తుపాను దెబ్బకు కరెంటు పోయి 70 శాతం ఇళ్లు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. అతలాకుతలమైన సమాచార వ్యవస్థింకా గాడినపడలేదు. కూకటివేళ్లతో సహా కూలిపోయిన చెట్లు ఇప్పటికీ అలా రోడ్లమీదే ఉన్నాయి. గూడు చెదిరిన నిరుపేదలు ఆకలిదప్పులు తీరక పడిగాపులు పడుతున్నా రు. సర్కారు సాయం కోసం ఎదురుచూస్తూ... తమ వద్దకు ఇప్పటికీ ఏ ఒక్కరూ రాలేదని శాపనార్థాలు పెడుతున్నారు. గడిచిన తొమ్మిది రోజులుగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించినపుడు ఎదురుపడిన దృశ్యాలివి. బాధితులు నేరుగా ఆయన వద్దకు వచ్చి తమకిప్పటికీ ఒక్క కిలో బియ్యం కూడా అందలేదని, తమను పలకరించినవారే లేకపోయారని వాపోయినపుడు ఆయన చలించిపోయారు. సర్కారు మెడలు వంచి సహాయం అందేలా చేస్తామని వారికి భరోసానిచ్చారు. 10 రూపాయల పులిహోర ప్యాకెట్టు ఇచ్చేసి చేతులు దులుపుకుందంటూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయన ఎండగట్టారు. తినేందుకు వీల్లేని పాచిపదార్థాలు పంచటాన్ని వేలెత్తిచూపారు. రూ.1 కిలోబియ్యం 25 కేజీలు ఇచ్చి... అంటే కేవలం పాతిక రూపాయలు విదిలించి సహాయం చేసేశామని చెప్పుకుంటున్న ప్రభు త్వ పబ్లిసిటీ స్టంట్‌ను ఎండగట్టారు. ప్రతి బాధి త కుటుంబానికి తక్షణ సాయంగా రూ.5వేలు ఇవ్వాలని, పాడైపోయిన ఇళ్ల మరమ్మతులకు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు బదులుగా తుపాన్లను తట్టుకునే సామర్థ్యంతో కొత్త ఇళ్లు కట్టిం చాలని డిమాండ్ చేశారు. తుపాను బాధితులను పరామర్శించేందుకు జగన్ తొమ్మిది రోజుల పర్యటన అలుపెరుగకుండా, విరామంలేకుండా సాగింది. రోజులో దాదాపు 12 గంటలు తుపాను బాధితుల కష్టాలు విని భరోసానివ్వడంలోనే గడిపారు. తుపానుతీరం దాటిన పూడిమడక గ్రామానికి వెళ్లిన తొలినేత జగనే. అధికారులు, అధికార పార్టీ నేతలు సమీక్షలు, మీడియా సమావేశంలోనే కాలం గడపగా జగన్ కాలినడకన పర్యటించి ఇంటింటికీ వెళ్లి బాధితుల కష్టాలు ఆలకిం చారు. పిషింగ్‌హార్బర్, జలారిపేటలలో పర్యటించి మత్స్యకారుల కష్టాలను తెలుసుకున్నారు. తీరప్రాంత కాలనీల్లో కాలినడకన తిరిగి వేలాదిమంది మత్స్యకారులకు ధైర్యం చెప్పారు. ప్రాణాలతో బాబు పబ్లిసిటీ స్టంట్: జగన్ మనిషి ప్రాణాన్ని కూడా చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్‌గా మార్చి బాధితులకు తీరని అన్యాయం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. పబ్లిసిటీ ఉంటుందనుకున్న చోట రూ.5 లక్షలు పరిహారమిచ్చి, లేదనుకున్న చోట రూ.3 లక్షలు మాత్రమే ఇస్తూ కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్పలో బాణసంచా తయారీ కేంద్రం పేలుడులో మృతుల కుటుంబ సభ్యులను బుధవారం ఆయన పరామర్శించారు. - సాక్షి, కాకినాడ -
నేటి నుంచి పాఠశాలలు
32 మండలాల్లో 799 స్కూళ్లు ధ్వంసం రూ.23.5 కోట్ల నష్టం సాక్షి, విశాఖపట్నం : వారం రోజుల తరువాత పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. సోమవారం నుంచి తరగతులు నిర్వహించడానికి విద్యా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో మొత్తం 4174 పాఠశాలలు ఉండగా తుపాను కారణంగా మైదాన ప్రాంతాల్లో 32 మండలాల్లో 799 స్కూళ్లు దెబ్బతిన్నాయి. వీటిలో అయిదు పూర్తిగా పాడయ్యాయి. వీటిని పునర్నిర్మించేందుకు రూ.23.50 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ఏజెన్సీలో కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగు పడకపోవడంతో అక్కడ 11 మండలాల్లో ఎన్ని పాఠశాలలు దెబ్బతిన్నాయన్న విషయంపై స్పష్టత లేదు. ప్రస్తుతం సోమవారం నుంచి తరగతులు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. పూర్తిగా పాడైన 5 పాఠశాలల విద్యార్థులను ఇతర స్కూళ్లలో తరగతులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. తాత్కాలికంగా రేకులు షెడ్డులు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాంబిల్లి మండలం లాలం కోడూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు అక్కడే ఉన్న ఎంపీయూపీ స్కూల్లో తరగతులు నిర్వహిస్తారు. అలాగే యలమంచిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అదే ప్రాంతంలో ఉన్న జెడ్పీ హైస్కూల్లోను, కశింకోట జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎదురుగా ఉన్న ఎంపీయూపీ పాఠశాలలోను, రైల్వే న్యూకాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు డాబాగార్డెన్స్‌లో ఉన్న ఎంజీఎం హైస్కూల్లోను, రాంబిల్లి మండలం ధిమిలి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు అక్కడే ఉన్న ఎంపీయూపీ స్కూల్లో తరగతులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఆయా పాఠశాలల్లో తాగునీరు, మధ్యాహ్నభోజన ఏర్పాట్లు చేసుకోవాలని డీఈఓ కృష్ణారెడ్డి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. తరగతి గదులు సక్రమంగా లేవని అనుమానం వస్తే అవసరమైతే పిల్లలను ఇళ్లకు పంపించాలని ఉపాధ్యాయులు మాత్రం పాఠశాలల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. -
తుపాను నష్టంపై బాలయ్య ఆరా
పాయకరావుపేట: తుపాను వల్ల పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగిన నష్టాలపై హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఆరా తీశారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖపట్నం వెళుతూ బాలకృష్ణ పాయకరావుపేలో ఎమ్మెల్యే కార్యాలయానికి గురువారం సాయంత్రం వచ్చారు. నియోజకవర్గంలో తుపాను వల్ల జరిగిన నష్టాలను ఎమ్మెల్యే వంగలపూడి అనితను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోటనగేష్, పెదిరెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
పిల్ల కుంకవు.. నాకు చెప్పేంత వాడివా..!
విజయనగరం: తీరప్రాంత ప్రజ లందరికీ 250 కిలోమీటర్ల వేగంతో వీచే గాలిని కూడా తట్టుకొనే విధంగా పక్కా ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. తుపాను దెబ్బకు నష్టపోయిన విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని దిబ్బలపాలెం, ముక్కాం గ్రామాల్లో ఆయన బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థాని కులు తమ గోడును తెలియజేశారు. తుపాను సమయంలో తమను ఎవరూ పట్టించుకోలేదని, నష్టం జరిగిన తరువాత కూడా అధికారులెవరూ రాలేదని దిబ్బలపాలెంవాసులు వాపోయారు. అయితే చంద్రబాబు వారిని పెద్దగా పట్టించుకోలేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం వల్లే ప్రాణ నష్టం జరగలేదని, ఆస్తి నష్టాన్ని మాత్రం ఆపలేకపోయామని సీఎం చెప్పారు. రాష్ట్ర విభజనతో కొన్ని ఇబ్బందులన్నా, బాధితులను ఉదారతతో ఆదుకుంటామన్నారు. తుపాను వల్ల జిల్లాలో 8 మంది మృతి చెందారని, వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మరో రూ. 2 లక్షలు ఇస్తామన్నారు. ముక్కాంలో మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందజేశారు. తుపాను వల్ల దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేలతో ఐఏవీ కింద పునర్నిర్మిస్తామని చెప్పారు. నష్టపోయిన కచ్చా ఇళ్లకు రూ.25 వేలు, పూరి ల్లుకు రూ.5 వేలు ఇస్తామన్నారు. పడిపోయిన ఒక్కొక్క కొబ్బరి చెట్టుకు రూ.1,000 పరిహారం చెల్లిస్తామని, ఉపాధి పథకం కింద బాధితులందరికీ పనులు కల్పిస్తామని చెప్పారు. దెబ్బ తిన్న అన్ని పంటలకు పరిహారం అందిస్తామని తెలిపారు. సముద్రంలో కొట్టుకుపోయిన మత్స్యకారుల పడవలకు రూ.10 వేల చొప్పున పరి హారం చెల్లిస్తామని ప్రకటించారు. మత్స్యకారులకు జీవనోపాధి కింద రూ.10 వేలు అందిస్తామని, నిత్యావసరాలు ఇస్తామని తెలి పారు. పిల్ల కుంకవు.. నాకు చెప్పేంత వాడివా..! సీఎం ముక్కాం నుంచి తిరిగి వస్తుండగా ముంజే రు గ్రామం వద్ద ప్రజలు కాన్వాయ్కి అడ్డుపడి, చంద్రబాబు మాట్లాడాలని అడిగారు. దీంతో ఆయన కాన్వాయ్ దిగి మాట్లాడారు. ఇంతలో మహిళలతో సహా గ్రామస్తులంతా ముక్తకంఠంతో నిరసన తెలిపారు. ఇంతవరకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ రాలేదని అన్నారు. దీనికి బాబు స్పందిస్తూ ఎంపీడీఓ ఎక్కడని అధికారులను అడిగారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో వెనుకనున్న ఒక వ్యక్తి ‘‘ఉద్యోగాలు ఇవ్వలేదు నువ్వేం సీఎంవి? మాటల్లో కాదు.. చేతల్లో చూపించాలి’’ అని గట్టిగా అన్నాడు. దీంతో సీఎం ఆవేశానికి లోనయ్యారు. ‘‘ఏం తమాషా చేస్తున్నావు! నీవు పిల్లకుంకవు. నాకు చెప్పేంత వాడివా? దేనికి వచ్చావు? అల్లరి చేయడానికా? ఊరుకో.. గట్టిగా మాట్లాడకు’’అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నష్టం అంచనాకు 2 రోజుల్లో కేంద్ర బృందం విశాఖ రూరల్: హుదూద్ తుపాను వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు రెండు మూడు రోజుల్లో కేంద్ర బృందం వస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. బుధవారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తక్షణ సాయంగా వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తుపాను నష్టాన్ని అధిగమించిన విధానంపై ఒక బ్లూబుక్ రూపొందిస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడ భారీ తుపాన్లు వచ్చినా ఈ బ్లూబుక్ ఉపయోగపడుతుందన్నారు. తుపాను వచ్చిన రోజు ప్రజలెవరూ బయటకు రాలేకపోయారని చెప్పారు. తాను అతి కష్టం మీద తరువాతి రోజు విశాఖకు రాగలిగానన్నారు. ఓ నగరాన్ని ఇంత భారీ తుపాను తాకడం ఇదే తొలిసారన్నారు. 48 గంటల్లో మంచినీరు ఇచ్చామని, పెట్రోల్ సమస్య లేకుండా చేశామని, 6 లక్షల ఆహార పొట్లాలు అందించామని వివరించారు. తుపాను సృష్టించిన నష్టం రూ.60 వేల కోట్లా లేక రూ.70 వేల కోట్లా అనే విషయం అంచనాలకు అందడంలేదని చెప్పారు. పూర్తిస్థాయిలో సర్వే చేసిన తర్వాతే నష్టాన్ని అంచనా వేయగలమని చెప్పారు. పక్కకు ఒరిగిన బాబు ట్రాక్టర్ సీఎం చంద్రబాబు బుధవారం శ్రీకాకుళం జిల్లా కింతలి గ్రామంలో పర్యటిస్తుండగా ఆయన ఎక్కిన ట్రాక్టర్ నీటిలో ఒరిగిపోయింది. సీఎం కాన్వాయ్ కింతలి రహదారి వరకు వచ్చింది.గ్రామంలోని రోడ్డు నీటిలో ముని గిపోవడంతో బాబు, కొందరు ప్రజాప్రతినిధులు ఓ ట్రాక్టర్ ఎక్కారు. వారు గ్రామంలోకి వెళ్తుండగా అది ఒరిగిపోయింది. భద్రతా సిబ్బంది సీఎంను పట్టుకున్నారు. ఇదే గ్రామం వద్ద కాజ్వే వద్ద ట్రాక్టర్ ఆగిపోయింది. దీంతో గ్రామస్తులు కలిసి ట్రాక్టర్నునెట్టి కాజ్‌వేను దాటించారు. -
విమానాశ్రయానికి ‘భద్రత’ ఉందా?
పెను తుపాను వస్తే తప్పని ఇబ్బందులు అధునాతన టెర్మినల్ భవనం అవసరం ప్రత్యేక డిజైన్ సిద్ధం చేస్తున్న అధికారులు భూములిచ్చేందుకు ఒప్పుకోని రైతులు సాక్షి, విజయవాడ : హుదూద్ సృష్టించిన పెను విలయానికి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ఆధారంగా నిర్మించిన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం విధ్వంసం కావడంతో... గన్నవరం విమానాశ్రయ పటిష్టతపైనా చర్చలు ఊపందుకున్నాయి. ఈ ఎయిర్‌పోర్టుకు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడే సామర్థ్యం ఉందా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. విశాఖలోని అంతర్జాతీయ విమానాశ్రయమే పెనుగాలుల నుంచి తప్పించుకోలేకపోయిందని, సాధారణ గన్నవరం ఎయిర్‌పోర్టు ఏలా తట్టుకుంటుందనే వాదన వినిపిస్తోంది. అయితే రాజధాని ఎయిర్‌పోర్టు కాబట్టి దీనిని మరింతగా అభివృద్ధి చేయాలనే డిమాండ్ ఉంది. బ్రిటిష్ పరిపాలన సమయం నుంచే గన్నవరం విమానాశ్రయం ఉంది. అయితే 2000 సంవత్సరం వరకు కేవలం రన్వేగానే దీనిని వినియోగించారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి మూడు ఎయిర్‌లైన్స్ నాలుగు నగరాలకు విమాన రాకపోకలు సాగుతున్నాయి. అయితే పూర్తిస్థాయిలో ఐదేళ్ల నుంచే వాడకంలోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనం సాధారణ నిర్మాణం గత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేవలం రన్‌వే వాడకానికి వీలుగా నిర్మించారు. భవనంపై భాగం అంతా రేకులతో నిర్మితమై ఉంది. 574 ఎకరాల్లో ఉన్న ఎయిర్‌పోర్టులో 7,500 అడుగుల రన్‌వే ఉంది. విజయవాడ నుంచి నిత్యం హైదరాబాద్, మధురై, బెంగళూరు, ఢిల్లీ తదితర ప్రాంతాలకు విమాన రాకపోకలు సాగుతున్నాయి. తాజాగా విజయవాడ రాజధానిగా మారిన క్రమంలో విఐపీల రాకపోకలు అధికమయ్యాయి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెం దిన వారే అధికంగా ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి నెలకు సగటున మూడుసార్లు వస్తున్నారు. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయానికి ప్రాధాన్యత సంతరించుకుంది. సదుపాయాల లేమి... మారుతున్న అవసరాలకు అనుగుణంగా విమాన సర్వీసులు పెరిగాయి కాని సౌకర్యాలు మాత్రం అలానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న టెర్మినల్‌లో కేవలం 70 మందికి మాత్రమే సీటింగ్ సౌకర్యం ఉంది. అలాగే 7,500 అడుగులు రన్‌వే ఉంది. అలాగే విమానాల పార్కింగ్ కోసం ప్రత్యేకమైన ఏరియా తక్కువే ఉంది. ఈ క్రమంలో రెండు నెలల కిత్రం ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆలోక్ సిన్హా, ఇతర కేంద్ర ప్రభుత్వ అధికారులు గన్నవరం ఎయిర్‌పోర్టును సందర్శించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో, విజయవాడ రాజధానిగా ప్రకటించనున్న క్రమంలో అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని అభివృద్ధి చేస్తామని అప్పట్లో ప్రకటించారు. అయితే భూసేకరణ అసలు సమస్యగా మారింది. 480 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉండగా వాటిలో 50 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన 430 ఎకరాల భూమిని సుమారు 400 మంది రైతలు నుంచి సేకరించాల్సి ఉంది. ఇది పూర్తి అయితేనే విస్తరణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. అయితే గన్నవరం భూముల ధరలు కోట్లకు చేరిన క్రమంలో రైతులు భూములు ఇవ్వటానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. తుపానుల ముప్పు తక్కువే - రాజ్‌కిషోర్, డెరైక్టర్ విశాఖ విమానాశ్రయం సముద్రానికి అతి దగ్గరగా ఉండటం వల్ల కొంత నష్టం వాటిల్లిందని, అయితే గన్నవరానికి అలాంటి ఇబ్బంది ఉండదని గన్నవరం విమానాశ్రయం డెరైక్టర్ రాజ్‌కిషోర్ సాక్షికి తెలిపారు. సముద్రానికి , నదికి దూరంగా జాతీయ రహదారి సమీపంలో ఉండటంతో ఇబ్బంది ఉండదని చెప్పారు. అయితే ప్లానింగ్ విభాగం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధునాతన టెర్మినల్ డిజైన్‌కు రూపకల్పన చేస్తుందని ఆయన చెప్పారు. -
కనీవినీ ఎరుగని నష్టం
తుపాను వచ్చివెళ్లాక ఉత్తరాంధ్ర ప్రాంతం, మరీ ముఖ్యంగా విశాఖ నగరం యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తున్నాయి. హుదూద్ చేసిన విధ్వంసం విస్తృతి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఈ తుపానువల్ల కోలుకోలేని నష్టం సంభవించింది. విశాఖ పేరు చెబితే గుర్తొచ్చే బీచ్ రోడ్డు, నిత్యం ఎంతో సందడితో కళకళలాడే జగదాంబ జంక్షన్, పూర్ణా మార్కెట్, సీతమ్మధార వంటివన్నీ ఘోరంగా దెబ్బతిన్నాయి. వేలాదిమంది మత్స్యకార కుటుంబాలకు ఆలంబనగా ఉండే ఫిషింగ్ హార్బర్లో పెను విధ్వంసం చోటుచేసుకుంది. ఎటు చూసినా ధ్వంసమైన ఇళ్లు, భవనాలు, కూలిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, కొట్టుకుపోయిన రోడ్లు కనబడుతున్నాయి. ఆర్మీ, నేవీ, జాతీయ విపత్తు ఉపశమన దళం(ఎన్డీఆర్ఎఫ్)వంటివి రంగంలోకి దిగి చాలామంది ప్రాణాలను కాపాడ గలిగాయి. లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. మృతుల సంఖ్య కనిష్ట స్థాయిలో ఉండటం వెనక వీరి కృషి ఉంది. అయితే, నిన్నటి రోజంతా ప్రాణాలు అరచేతబట్టుకుని మంచినీరూ, ఆహారం లేక అలమటించిపోయిన ప్రజలకు సోమవారం రాత్రి వరకూ ఎలాంటి సాయమూ అందలేదని వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తాయి. ఈ వైపరీత్యాన్ని ఎదుర్కొనడానికి విస్తృత చర్యలు తీసుకున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పిన మాటలను వాస్తవం వెక్కిరిస్తున్నది. అలాంటి చర్యలే ఉన్నట్టయితే విశాఖలోని చాలా ప్రాంతాల్లో జనం ఆకలిదప్పులతో అలమటించాల్సిన దుస్థితి ఎదురయ్యేది కాదు. తుపాను వెలిశాక ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అంచనా లేకపోవడం ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యానికి రుజువు. కొందరు వ్యాపారులు అరచేయి ప్రమాణంలేని దోసె రూ. 70, డజను అరటిపళ్లు రూ. 150, ప్యాకెట్ పాలు రూ. 100 వరకూ విక్రయించారంటే... రోజంతా పస్తుండి, ఏదో ఒకటి దొరక్కపోతుందా కడుపాకలి తీరకపోతుందా అని రోడ్లపైకి వచ్చిన సామాన్యులు నిస్సహాయంగా వెనుదిరగాల్సివచ్చిందంటే దోపిడీ ఏ స్థాయిలో ఉన్నదో అంచనావేసుకోవచ్చు. నిన్నంతా కృషిచేసి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచిగానీ, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంనుంచిగానీ తెల్లారేసరికల్లా నిత్యావసరాలను బాధిత ప్రాంతాలకు తరలించివుంటే ఈ పరిస్థితిని నివారించడం సాధ్యమయ్యేది. కనీసం గొంతు తడుపుకోవడానికి మంచినీళ్లను అందించినా ప్రజలు ఆనందించేవారు. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అటు ప్రధాని మోదీతోనూ, కేంద్రంలోని ఇతర ముఖ్యులతోనూ మాట్లాడి అందరినీ కదిలించారు. కానీ, క్షేత్రస్థాయిలో చూస్తే అధికార యంత్రాంగం హుదూద్ తాకిడి సమయంలోనూ, అటు తర్వాతా చేష్టలుడిగి ఉండిపోయిందని అర్ధమవుతుంది. ప్రకృతి వైపరీత్యాల ఆనవాళ్లను ముందుగా పసిగట్టి, అది సృష్టించగల విధ్వంసాన్ని అంచనావేసి ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప దాన్ని నివారించడం ఎవరికీ సాధ్యంకాదు. ఉన్నంతలో మనం చేయగలిగేదల్లా ప్రజలు ఆపదబారిన పడకుండా కాపాడటానికి ప్రయత్నించడమే. అది నిష్ర్కమించాక సహాయ చర్యలను సమర్ధవంతంగా చేపట్టడమే. సాంకేతిక విజ్ఞానం ఎంతగానో అభివృద్ధిచెందిన ప్రస్తుత సమయంలో దాన్ని సంపూర్ణంగా వినియోగించగలిగిన సామర్థ్యం ఉండాలి. సమాచారం అందిన వెంటనే ఎలాంటి అవరోధాలనైనా అధిగమించి ముందుకు దూసుకుపోగలిగిన సుశిక్షితులైన, మెరికల్లాంటి మనుషులుండాలి. వీరందరిమధ్యా సరైన సమన్వయాన్ని సాధించగలిగే వారుండాలి. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు అలాంటి సమన్వయ సాధనలో తలమునకలై ఉండాలి. కానీ, చంద్రబాబు విశాఖ నగరం వెళ్లి సమీక్షించాక ఈ విషయంలో ఎన్ని లోటుపాట్లున్నాయో బయటపడ్డాయి. విశాఖ నగరవాసులే సహాయ చర్యల విషయంలో ఫిర్యాదు చేస్తున్నారంటే ఇక శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల ప్రజలకు ఏపాటి సాయం అందిందో ఊహించడం కష్టమేమీ కాదు. హుదూద్ కారణంగా వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. దీనికితోడు విశాఖ హార్బర్లో నిల్వ చేసిన వేలాది టన్నుల ఎరువులు తడిసి ముద్దవడంతో రబీ అవసరాలను తీర్చడం అసాధ్యం కావొచ్చునని, పర్యవసానంగా తుపాను నష్టం పెద్దగా లేని ఇతర జిల్లాల్లో పంటలకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పుడు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తుపాను ప్రాంతాల పర్యటనకు వచ్చే ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి వ్యవసాయరంగానికి వచ్చిపడిన ఈ ముప్పును ప్రత్యేకించి తెలియజెప్పి తగిన సహాయసహకారాలను పొందాలి. ప్రకృతి వైపరీత్యాలను నివారించే శక్తి మనకు లేకున్నా మనం తీసుకునే కొన్ని ముందు జాగ్రత్తలతో అవి మహోగ్రరూపం దాల్చకుండా చేయవచ్చు. అభివృద్ధి పేరిట సాగుతున్న కార్యకలాపాలు సముద్ర తీరాన్ని కాలుష్యమయం చేసి జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పరిశ్రమల వ్యర్థాలన్నీ సముద్రంలోనే కలుస్తున్నాయి. దాదాపు వేయి కిలోమీటర్ల మేర ఉన్న తీరప్రాంతం దెబ్బతినకుండా చూసేందుకు కోస్టల్ రెగ్యులేటరీ జోన్(సీఆర్‌జడ్) నిబంధనలున్నా వాటి అమలును పట్టించుకుంటున్నవారు లేరు. పర్యావరణ విధ్వంసం ఫలితంగానే తుపానులు, వాయుగుండాలు, భారీ వర్షాలు క్రమేపీ పెరుగుతున్నాయని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ఇప్పుడు సంభవించిన విపత్తునుండి కోలుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటూనే పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న కార్యకలాపాలను అదుపుచేయడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. తమ విధానాల్లోని లోపాలను సవరించుకోవాలి. జనావాసాలను ముంచి లక్షలాదిమంది ప్రాణాలకు ముప్పు తీసుకురావడంతోపాటు ఆహారపంటలను దెబ్బతీస్తున్న ఇలాంటి వైపరీత్యాలను అరికట్టడానికి ఇది తప్పనిసరి. హుదూద్ తుపాను సృష్టించిన విలయంలో అంతర్లీనంగా ఉన్న హెచ్చరిక ఇదే. -
ప్రళయ భీకరం!
అంచనావేసినట్టే పెను తుపాను హుదూద్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరప్రాంతాల వాసులను భయకంపితుల్ని చేసింది. అది తీరం దాటుతుండగా 200 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులతో, దాంతోపాటు వచ్చిన కుండపోత వర్షాలతో ఉత్తరాంధ్ర, మరీ ముఖ్యంగా విశాఖ నగరం చిగురుటాకులా వణికాయి. గోదావరి జిల్లాల తీరప్రాంతాలు కూడా గణనీయంగా దెబ్బతిన్నాయి. ప్రచండమైన గాలులతో కరెంటు స్తంభాలన్నీ కూలిపోగా, అపార్టుమెంట్లు కూడా బీటలువారి అందులో నివాసముంటున్నవారు భయభ్రాంతులయ్యారు. ఏదో ఉన్మాదం ఆవహించినట్టు సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంపొడవునా పలుచోట్ల జనావాస ప్రాంతాలవైపు సముద్ర జలాలు చొచ్చుకొచ్చాయి. ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఆసరాగా నిలవడంతో... జాతీయ విపత్తు ఉపశమన దళం (ఎన్డీఆర్ఎఫ్), ఆర్మీ, నేవీ బలగాలు రంగంలోకి దిగడంతో ప్రాణనష్టం కనిష్ట స్థాయికి పరిమితమైంది. అయితే, ఆస్తి నష్టం మాత్రం అపారంగా ఉన్నట్టు వివిధ ప్రాంతాలనుంచి అందుతున్న సమాచారాన్నిబట్టి తెలుస్తున్నది. హుదూద్ తీరందాటింది గనుక రానున్న 72 గంటలూ అధికార యంత్రాంగానికీ, ప్రజలకూ పరీక్షా సమయం. ఇంతవరకూ వచ్చిన కుండపోత వర్షాలను మించిన వర్షాలు కురుస్తాయంటున్నారు. కనుక అధికార యంత్రాంగం మరింత అప్రమత్తతతో మెలగాల్సి ఉంటుంది. రవాణా సదుపాయాలన్నీ దెబ్బతిన్న ప్రస్తుత తరుణంలో ఇదంతా కత్తి మీది సాము. ఈసారి తుపానుపై కేంద్ర ప్రభుత్వంకూడా చురుగ్గానే కదిలింది. ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించడంతో పాటు యూపీలోని తన సొంత నియోజకవర్గం వారణాసిలో జరపాల్సిన పర్యటనను కూడా వాయిదా వేసుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలించడం బాగానే ఉన్నా ఇతర ప్రాంతాల ప్రజలకు సంబంధించి మరికొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఉదాహరణకు కుండపోత వర్షాలు, పెనుగాలుల కారణంగా ఎవరూ వెలుపలకు రావొద్దని అధికారులు ఇప్పుడు సూచిస్తున్నారుగానీ వారి ఇతర అవసరాల గురించి తీసుకున్న ముందు జాగ్రత్తలేమిటి? బయటికొచ్చే పరిస్థితులు ఉండకపోవచ్చుగనుక కనీసం నాలుగు రోజులకు సరిపడా మంచినీరు, ఇతర నిత్యావసరాలు అందుబాటులో ఉంచుకోవాలని ముందే చెప్పి, చైతన్యపరిస్తే... అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసివుంటే ఉపయోగమయ్యేది. సముద్రం మీదికి వెళ్లొద్దని మత్స్యకారులకు చేసే హెచ్చరికల తరహాలోనే ఇవి కూడా ఉండాలి. ఒకపక్క నిమిషం కూడా తెరిపి ఇవ్వకుండా కురుస్తున్న వర్షాలకు తోడు మనిషిని సైతం విసిరిపారేసేంతగా పెనుగాలులు వీస్తుండటంతో వణుకుతున్న జనం చాలాచోట్ల కనీసం గొంతు తడుపుకోవడానికి నీళ్లులేక, కూరగాయలు అందుబాటులో లేక అవస్థలుపడుతున్నారని ఆ ప్రాంతాలనుంచి సమాచారం అందుతున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటివారు బయటికెళ్లినా లభ్యమయ్యేది ఏమీ ఉండదు. గాలీ, వానా ఉపశమిస్తే తప్ప వారికి సాయం అందజేయడం అధికారులకు సాధ్యమయ్యేలా లేదు. ఇక ముందస్తు వైద్య సదుపాయాల పరిస్థితీ అదే. ఇక ఆ ప్రాంతాల్లోని తమ ఆప్తులు ఎలా ఉన్నారో తెలుసుకుందామని ప్రయత్నించే వారికి ఎమర్జెన్సీ నంబర్లంటూ ఇచ్చినవేమీ అక్కరకు రాలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. పుష్కరకాలం క్రితం ఏడాదికి ఒకసారి మాత్రమే వచ్చే తుపానులు ఇప్పుడు ఏడాది పొడవునా పలకరిస్తున్నాయి. వాయుగుండాలు, అకాల వర్షాలు సరేసరి. ఇలా వైపరీత్యాలు సర్వసాధారణంగా మారినప్పుడు సహాయ కార్యక్రమాలకు సంబంధించి కూడా శాశ్వత ప్రాతిపదికన తగిన యంత్రాంగాన్ని ఏర్పాటుచేయడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సివుంది. ఈ యంత్రాంగం ఏడాది పొడవునా సంభవిస్తున్న తుపానులు... ఆ సందర్భంగా ముందుజాగ్రత్తల్లోగానీ, సహాయ చర్యల్లోగానీ వెల్లడైన లోటుపాట్లను అధ్యయనం చేస్తే మరింత సమర్ధవంతమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఇలాంటి శాశ్వత యంత్రాంగం లేకపోబట్టే ఆంధ్రా యూనివర్సిటీలాంటి చోట కూడా హాస్టల్ విద్యార్థులు పస్తులతో గడపాల్సివచ్చిందని గుర్తుంచుకోవాలి. ప్రతియేటా అక్టోబర్-నవంబర్ నెలల మధ్య వచ్చే తుపానులతో రైతాంగం కుదేలవుతున్నది. అదునుకు వర్షాలు పడక మొన్నటివరకూ రైతులు ఆదుర్దాపడ్డారు. చివరకు ఎంతో కొంత లోటుతో వానాకాలం ముగిసిందని ఊపిరిపీల్చుకునేంతలో హుదూద్ వచ్చిపడింది. ఈ పెనుతుపాను ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లోని వేలాది ఎకరాల వరి, చెరకు, జొన్న, పత్తి పంటలను, కూరగాయల సాగును దెబ్బతీసిందని అంటున్నారు. సెల్ టవర్లు ధ్వంసమై కమ్యూనికేషన్ల వ్యవస్థ కుప్పకూలడంతో, ముఖ్యంగా రాడార్ కేంద్రం సైతం పనిచేయకపోవడంతో జరిగిన నష్టాన్ని అంచనావేయడం అసాధ్యంగా మారిందని అధికార వర్గాలు చెబుతున్న మాట. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో తుపాను కారణంగా వేలాది విద్యుత్ స్తంభాలు కూలడంతో ఆ ప్రాంతమంతా అంధకారం అలముకుంది. తుపాను పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది గనుక ఇప్పుడు జరిగిన నష్టంపై వెనువెంటనే సవివరమైన నివేదిక సమర్పించి తగిన సాయాన్ని పొందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషిచేయాలి. అలాగే, పంట నష్టపోయిన రైతాంగానికి సుదీర్ఘకాలం నిరీక్షిస్తే తప్ప పరిహారం దక్కడంలేదు. పైలిన్, హెలెన్, లెహర్, నీలం తుపానుల్లో కలిగిన నష్టానికి ఎంతో ఆలస్యంగా... అది కూడా అరకొరగా పరిహారం అందజేశారు. కౌలు రైతులదైతే అత్యంత దయనీయమైన స్థితి. పంట నష్టపోయినప్పుడు వారికి దక్కేదేమీ ఉండదు. విపత్తులు సంభవించినప్పుడు తీసుకునే చర్యలే కాదు... అనంతరకాలంలో చేపట్టాల్సిన ఇలాంటి చర్యల విషయంలో కూడా ప్రభుత్వాలు శ్రద్ధవహించాలి. -
అవే కడ‘గండ్లు’
మరమ్మతులకు నోచుకోని గండ్లు పడ్డ నదుల గట్లు ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు, పాలకులు నిలిచిపోయిన నిధులు : పట్టించుకోని కొత్త సర్కారు తుపానుతో ఆందోళన చెందుతున్న పరివాహక ప్రాంత ప్రజలు చోడవరం: గతంలో వచ్చిన తుపానులకు గండ్లు పడిన నదుల గట్లకు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఏర్పడిన హుదూద్ తుపానుకు రైతులు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మూడేళ్లుగా లైలా, జల్, నీలం, పైలీన్ తుపాన్లకు పెద్దేరు, బొడ్డేరు, శారద నదులతోపాటు పలు కొండ గెడ్డలకు గండ్లు పడిన విషయం తెలిసిందే. ఈ గండ్లు నేటికీ పూడ్చకపోవడంతో ఇప్పుడు హుదూద్ తుపాను ఎక్కడ గ్రామాలను, పొలాలను ముంచేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. గత తుపాన్లకు పీఎస్‌పేట, వడ్డాది, జన్నవరం, రామజోగిపాలెం, చాకిపల్లి, భోగాపురం, బోయిలకింతాడ, గవరవరం, విజెపురం, కెజెపురం, జంపెన ప్రాంతాల్లో నదీగట్లు కోతకు గురయ్యాయి. దీంతో చాకిపల్లి, రామజోగిపాలెం, కన్నంపాలెం, జన్నవరం గ్రామాల్లోకి నీరు వచ్చింది. వేలాది ఎకరాల పొలాలు, ఆయా గ్రామాలు కూడా ముంపునకు గురయ్యాయి. నది గట్ల మరమ్మతులకు సుమారు రూ.100 కోట్లు మంజూరు చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఆ నిధుల ఎన్నికలు కారణంగా నిలిచిపోగా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం విడుదల చేయలేదు. దీనితో ఇప్పటి వరకు దెబ్బతిన్న గ్రోయిన్లు, గండ్లు పడ్డ గట్లు పటిష్ట పరిచే పనులు జరగలేదు. ఇప్పుడు తాజాగా ముంచుకొస్తున్న హుదూద్ తుపాను మరింత బలపడితే మళ్లీ గ్రామాలు, పంటపొలాలు మునిగిపోయే ప్రమాదం ఉందని నదీ పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతాలను చోడవరం తహశీల్దార్ శేషశైలజ శనివారం పరిశీలించారు. గండ్లు పడ్డ ప్రదేశాల్లో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆమె సూచించారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అధికారులు, రాజకీయ నాయకులు రావడం సూచనలు ఇవ్వడం వెళ్లిపోవడం తప్ప పూర్తిస్థాయిలో గట్లు పటిష ్టపరిచే పనులు చేపట్టలే దంటూ ప్రజలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులను వెంటనే విడుదల చేసి పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు. -
తీరంలో హైఅలెర్ట్
అచ్యుతాపురం : హుదూద్ తుపాను పట్ల తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ యువరాజ్ సూచించారు. శుక్రవారం పూడిమడకను సంద ర్శించారు. మత్స్యకారులు, గ్రామనాయకులు, అధికారులతో చర్చించారు. శనివారం తీరప్రాంత ప్రజల్ని ఖాళీచేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. హైస్కూల్, తుపాను షెల్టర్‌లో పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేయాలన్నారు. వాటిల్లో తాగునీరు, విద్యుత్, జనరేటర్, భోజన సౌకర్యాలను ఏర్పాటుచేయాలన్నారు. విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 30వేల మంది తీరప్రాంత ప్రజల్ని 40 పునరావాసకేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. తుపాను తీవ్రత జిల్లాకు ఎక్కువగా ఉన్నందున తీరప్రాంతంలో హైఅలెర్ట్‌ను ప్రకటించామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీచేశామన్నారు. పలుమార్లు దండోరావేసి మత్స్యకారులను అప్రమత్తంచేయాలని సూచించారు. గంటకు150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. పూరిగుడెసెలు, శిథిల భవనాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు. ఒక్కరోజులో 24సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. పరిస్థితిని బట్టి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. పడవలు, వేటసామగ్రిని భద్రపరుచుకోవాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో వసంతరాయుడు, తహశీల్దార్ వెంకటిశివ, ఎస్ఐ సన్యాసినాయుడు ఉన్నారు. -
కత్రినా షేక్.. బిపాసా హాట్..
సిటీలో కాఫీలు, ఐస్‌క్రీమ్స్‌కు ఎలా రెగ్యులర్ బడ్డీస్ ఉన్నారో... మిల్క్షేక్లకూ అంతే ఉన్నారు. రెస్టారెంట్స్‌లో మెనూ తీసుకోగానే మిల్క్‌షేక్స్ ఏం ఉన్నాయా అని సెర్చ్ చేసేవారెందరో. అలాంటి మిల్క్‌షేక్ మేనియా ఉన్నవారి కోసం మాదాపూర్, శిల్పారామంలోని ఓరిస్ ఈట్మోర్ రెస్టారెంట్ సరికొత్త మెనూని సిద్ధం చేసింది. కత్రినా మ్యాంగో, హాట్ బడ్జ్ బిపాసా అంటూ బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లతో ఊరిస్తోంది. ‘‘ పేర్లు మాత్రమే కాదు టేస్ట్‌లోనూ మా మిల్క్‌షేక్స్ స్పెషల్’’ అని రెస్టారెంట్ మేనేజర్ హరి చెప్పారు. బ్లూ బియాన్స్, బెల్జియం చాక్లెట్ వంటి దాదాపు 8 రకాల మిల్క్‌షేక్స్‌ను ప్రత్యేకంగా అందిస్తున్నామన్నారు. తమవి కేవలం మిల్క్ షేక్స్ మాత్రమే కావని ఇవి ‘థిక్ షేక్స్’ అని చెబుతున్న ఈ రెస్టారెంట్ ప్రతినిధులు... ఐస్‌క్రీమ్‌ని ఫుల్‌గా దట్టించిన వెరైటీలివని అంటున్నారు. -
బాలీవుడ్లో రీపిట్ కానున్న హిట్‌పెయిర్
-
దుమ్ము రేపిన ధూమ్ సిరీస్
-
కింగ్ ఆఫ్ రొమాన్స్‌కి క్వీన్స్ నీరాజనం
‘దిల్ తో పాగల్ హై’ తీసినప్పుడు యశ్ చోప్రా వయసు 65 ఏళ్లు. కృష్ణా రామా అనుకునే ఆ వయసులో ఓ టీనేజర్లా మారిపోయి అద్భుతంగా ఆ సినిమాలో ప్రణయ రసాన్ని ఆవిష్కరించారు. అసలు బాలీవుడ్లో రొమాన్స్‌ని అంత చక్కగా, చిక్కగా ఇంకెవరూ తీయలేరేమో! అందుకే ఆయన్ని ‘కింగ్ ఆఫ్ రొమాన్స్’గా అభివర్ణిస్తుంటారు. గత ఏడాది అక్టోబర్ 21న ఆయన పరమపదించారు. యశ్ చోప్రా లేని లోటుని ఇప్పటికీ బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. ఏదో ఒక సందర్భంలో ఆయన్ని గుర్తు చేసుకుంటూనే ఉంది. సెప్టెంబర్ 27 ఆయన 81వ పుట్టిన్రోజు. ఈ సందర్భంగా ఆయన జయంతి వేడుకలను ముంబైలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. యశ్ సినిమాల్లో నటించిన పలువురు నటీనటులు, ఇతర తారలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేఖ, శ్రీదేవి, మాధురీ దీక్షిత్, జూహి చావ్లా, రాణి ముఖర్జీ, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అనుష్కశర్మ, పరిణీతి చోప్రా ఇత్యాది బ్యూటీ క్వీన్స్ అంతా ర్యాంప్ వాక్ చేశారు. అలాగే ఈ తొమ్మిది మంది తారలతో షారుక్ ఖాన్ కూడా ర్యాంప్ వాక్ చేశారు. యశ్‌తో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకున్నారు.