అమ్మాయిలు ఏం మాట్లాడుకుంటారు? | What girls are talk? | Sakshi
Sakshi News home page

అమ్మాయిలు ఏం మాట్లాడుకుంటారు?

Mar 10 2016 10:49 PM | Updated on Sep 3 2017 7:26 PM

అమ్మాయిలు ఏం మాట్లాడుకుంటారు?

అమ్మాయిలు ఏం మాట్లాడుకుంటారు?

పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, అబ్బాయి - ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తుంటారు? నలుగురు అమ్మాయిలు ఒక చోట చేరితే ....

పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, అబ్బాయి - ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తుంటారు? నలుగురు అమ్మాయిలు ఒక చోట చేరితే అబ్బాయిల గురించి ఏం మాట్లాడుకుంటారు? అనే కథాంశంతో నిర్మించిన చిత్రం ‘కత్రిన... కరీన... మధ్యలో కమల్‌హాసన్’. శశాంక్ మౌళి, పావని జంటగా నవకళ పారి పతాకంపై రత్న దర్శకత్వంలో శ్రీను విజ్జగిరి, ప్రసాద్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

దర్శకుడు మాట్లాడుతూ - ‘‘వైజాగ్ నేపథ్యంలో నడిచే కథ ఇది. పూర్తి వినోదాత్మకంగా తీర్చిదిద్దాం. కామెడీ, ఎమోషన్స్ కూడా ఉంటాయి. అందరూ కొత్తవాళ్లు నటించారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రానికి కథే హీరో. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లుగా ఉండే సినిమా. యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. డైలాగులు ఈ చిత్రానికి బలం’’ అని శశాంక్ మౌళి చెప్పారు. ఈ సినిమాకు సంగీతం: శ్రీకర్, కెమేరా: ప్రసాద్, శ్రావణ్ కుమార్. సహ నిర్మాతలు: ఎస్. మల్లయ్య, బి.జగన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement