హర్ట్... నాట్ రిటైర్డ్! | Beach Holiday for Katrina Kaif, Ranbir Kapoor in Maldives | Sakshi
Sakshi News home page

హర్ట్... నాట్ రిటైర్డ్!

Published Tue, Apr 21 2015 10:26 PM | Last Updated on Sun, Sep 3 2017 12:38 AM

హర్ట్... నాట్ రిటైర్డ్!

హర్ట్... నాట్ రిటైర్డ్!

చూస్తుంటే అభిషేక్‌కపూర్ ‘డ్రీమ్’ ప్రాజెక్ట్ ‘ఫితూర్’ క్యూటీ కత్రినాకు ఓ పీడ‘కల’గా మిగిలిపోయేట్టుంది. గత నెలలో ఈ సినిమా సెట్స్‌పై గాయపడిన ఈ స్వీటీ... తాజాగా మరోసారి ‘హర్ట్’ అయింది. చిత్రానికి కీలకమైన హార్స్ రైడింగ్ సన్నివేశంలో అమ్మడు పట్టు తప్పి పడిపోయింది. మెడ, వెన్ను భాగంలో గాయాలయ్యాయి. ఈ అన్‌ఎక్స్‌పెక్టెడ్ సీన్‌తో స్పాట్‌లో ఉన్నవారంతా షాకయ్యారు. అంతలోనే తేరుకున్న కత్రినా... మళ్లీ గుర్రం ఎక్కి స్వారీ చేసింది.

ఓ రోజు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినా.. షూటింగ్‌కు ప్యాకప్ చెప్పకుండా తనలోని ప్రొఫెషనలిజాన్ని మరోసారి చూపింది. ఇదిలావుంటే... షూటింగ్‌లతో బిజీగా గడిపేసిన కత్రినా, ఆమె స్టార్ లవర్ రణబీర్ కపూర్ సమ్మర్ హాలిడేస్‌ను పూర్తిస్థాయిలో ఆస్వాదించేందుకు మాల్దీవ్స్ చెక్కేశారన్నది ఓ ఆంగ్ల పత్రిక కథనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement